రైతులకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు సహకరించాలి

Published Sun, Apr 20 2025 12:57 AM | Last Updated on Sun, Apr 20 2025 12:57 AM

రైతులకు సహకరించాలి

రైతులకు సహకరించాలి

మహబూబాబాద్‌ రూరల్‌: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి అన్నారు. మహబూ బాబాద్‌ మండలంలోని పర్వతగిరి గ్రా మంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించి, మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని, టార్పాలిన్లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే పడే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్‌ఓ ప్రేమ్‌ కుమార్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి ణి కృష్ణవేణి, తదితరులు ఉన్నారు.

కేయూ డిగ్రీ సెమిస్టర్ల

పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, అదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీకోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ ఒకేషనల్‌, బీసీఏ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్‌లాగ్‌) ఈనెల 21నుంచి జరగాల్సిండగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ శనివారం తెలిపారు. ఎక్కువశాతం ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల పరీక్షల ఫీజులు యూనివర్సిటీకి చెల్లించలేదు. అదేవిధంగా నామినల్‌ రోల్స్‌ను కూడా పంపలేదు. దీంతో ఆయా పరీక్షలను వాయిదా వేశామని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని, నిర్వహణ రీషెడ్యూ ల్‌ కూడా విడుదల చేస్తామని వెల్లడించారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: 2025–26 విద్యా సంవత్సరానికి ఉత్తమ కళాశాలలను ఎంపిక చేసేందుకు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యుల్ట్‌ కులాల అభివృద్ధి అధికారి నర్సింహరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న కళాశాలల ఫీజు, బుక్స్‌, హాస్టల్‌ వసతి, భోజనం, ఇతర అవసరాలకు ప్రతి విద్యార్థికి రూ.35 వేల చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. పాకెట్‌ మనీకి ప్రతి విద్యార్థికి రూ.3,000 చొప్పున అందిస్తారని తెలిపారు. దీంతోపాటు ఎంసెట్‌ కోచింగ్‌ ఫ్రీగా ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను epass.telangana.gov.in వెబ్‌సైట్‌ లో ఈ నెల 30 వరకు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్‌లోని జిల్లా ఎస్సీ షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

కేసముద్రానికి

ఫైర్‌స్టేషన్‌ మంజూరు

కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రానికి ఫైర్‌స్టేషన్‌ మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైర్‌ స్టేషన్‌లో పనిచేసేందుకు 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. పారిశ్రామిక కేంద్రంగా ఉన్న కేసముద్రంలో ఫైర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని అనేక పర్యాయాలు ఇక్కడి వ్యాపారులు, ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫైర్‌స్టేషన్‌ను మంజూరు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వేట పరికరాల స్వాధీనం

ఏటూరునాగారం: మండలంలోని రాయబంధం, ఐలాపురం, మల్యాల, కొమురంభీం నగర్‌, రేగులగూడెం 1, 2, మల్యాల, షాపెల్లి, చింతలపాడు గొత్తికోయగూడాల్లో అటవీశాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురి వద్ద నుంచి పెద్దఎత్తున ఇనుప తీగలు, ఉచ్చులు, బాణాలు, విల్లంబులు, వేటకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మండలకేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌ రెహమాన్‌ విలేకర్లతో మాట్లాడారు. అడవుల్లో కొంతమంది వేటగాళ్లు అటవీ జంతువులను కృరంగా వేటాడడం మానుకొని అటవీశాఖ కల్పించే ఉపాధిని పొందాలన్నారు. అటవీ జంతువులను వేటాడితే అన్ని రకాల ప్ర భుత్వ ధృవీకరణ పత్రాలు, ఆధారాలను రద్దు చేయిస్తామన్నారు. ఇప్పటికై నా వన్యప్రాణుల వేటను మానుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ ప్రహ్లాద్‌, నారాయణ, దయానంద్‌, రాజేష్‌, జ్యోతి, భూష, సుమలత, అశ్విని, బేస్‌క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement