
హాల్‌మార్క్ సర్టిఫికెట్‌తో పసిడి నాణ్యత..
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ హాల్‌మార్క్ సర్టిఫికేషన్ విధానం ప్రవేశ పెట్టింది. తయారైన ఆభరణం చిన్నదైనా,పెద్దదైనా హాల్‌మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్‌తో పాటు ఆ వస్తువు సర్టిఫై చేసిన హాల్‌మార్క్ సెంటర్ వివరాలు తెలిపే హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ యూనిక్ ఐడీ నంబర్ విధిగా ఉండాలి. ఈ అన్ని వివరాలను కొనుగోలు రశీదులో పొందుపర్చి వినియోగదారుడికి అందించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ఇవేవి చేయకపోగా అన్ని ఆభరణాలు 91.6 అని విక్రయిస్తున్నారు. దీనికి రశీదులు ఇవ్వకుండా.. ఇచ్చినా అందులో వివరాలు తెలుపడం లేదు. దీనిపై వినియోగదారులు చైతన్యవంతులై నిలదీయాలి.