తాగునీటి సమస్య లేకుండా చూడాలి
మహబూబాబాద్: జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకం, తాగునీటి సమస్య, పలు పథకాలపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. లక్ష్యం మేరకు లబ్ధిదారులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా రుణ సదుపా యం కల్పించాలన్నారు. అర్హులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. యువత ఆర్థికాభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నా రు. బ్యాంకర్లు లబ్ధిదారులకు సహకరించాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం అధికారులు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పీహెచ్‌సీలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి,జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరి ప్రసాద్, డీసీఓ వెంకటేశ్వర్లు, సీపీఓ సుబ్బారావు, డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
బ్యాంకర్లు లబ్ధిదారులకు సహకరించాలి
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్


