
నగదు బదిలీ చేస్తేనే మేలు..
ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యతతో కూడిన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ప్రభుత్వం అందించే చేప పిల్లలు చిన్న సైజులో, కొంత నాసిరకంగా ఉండటంతో బరువు పెరగక పోవడంతో దిగుబడి తగ్గుతున్నది. చిన్న పిల్లలను పెద్ద చేపలు తినడంతో మరింత నష్టం తప్పడం లేదు. నగదు బదిలీతో చేపల పంపిణీ కార్యక్రమం నడిపిస్తే.. నాణ్యమైన, కాస్త పెద్ద సైజు పిల్లలను కొనుగోలు చేసుకుంటాం.
– నీల సోమన్న,
మత్స్యసొసైటీ చైర్మన్, స్టేషన్‌ఘన్‌పూర్