
అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్/డోర్నకల్: ఇచ్చిన హామీ లను నెరవేర్చలేని అసమర్థత సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 15నెలలు గడుస్తున్నా పాలనపై పట్టు రావడం లేదన్నారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో జరి గే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, మహిళలు, యువకులు కదలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, నాయకులు గద్దె రవి, అశోక్, రాజు, రంజిత్, కిషన్, వెంకన్న, ఎలేందర్, దాము, మహబూబ్ పాషా పాల్గొన్నారు.
విజయవంతం చేయండి
కొత్తగూడ: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ములుగు మాజీ జెడ్పీ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం బహిరంగ సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాయకులు కొమ్మనబోయిన వేణు, బానోతు నెహ్రూ, దేశిడి శ్రీనివాస్ రెడ్డి, భూపతి తిరుపతి, మోకాళ్ల సంతోషరాణి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్