
రక్త పరీక్షల ఫలితాలు త్వరగా అందించాలి
నెహ్రూసెంటర్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన రక్త నమూనాలను త్వరగా పరీక్షించి ఫలితాలను వెంటనే పంపించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో టీహబ్, పాలియేటివ్ కేర్, టీబీ ప్రోగ్రాం, సీనియర్ ల్యాబ్ సూపర్‌వైజర్స్, ఎయిడ్స్ కార్యక్రమాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులను పరీక్షించి రక్త నమూనాలను సేకరించి ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. క్షయ వ్యాధికి సంబంధించిన సిబి నాట్ టెస్టులు, ట్రూ నాట్ టెస్టులు జరుగుతున్నాయని దీనిపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ నాగేశ్వర్‌రావు, విజయ్‌కుమార్, శ్రవణ్‌కుమార్, జ్యోతిరెడ్డి, మేనేజర్ అనురాధ, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ వైద్యసేవలే లక్ష్యం
గూడూరు: గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ వైద్య సేవలే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవిరాథోడ్ అన్నారు. మండలంలోని అయోధ్యపురం పీహెచ్‌సీతో పాటు భూపతిపేట వ్యాక్సినేషన్ సెంటర్‌లను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిపోర్టులు పరిశీలించి, అన్ని జాతీయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యమున, హెచ్‌ఈఓ లోక్యానాయక్, గణేష్, సర్ధార్‌బాబు, విశాల, స్రవంతి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిరాథోడ్