
మెడికల్ కళాశాలలో సౌకర్యాలు కల్పించాలి
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని సామాజికవేత్త డాక్టర్ వివేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీఎంసీని సోమవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలలో భవనాలు, హాస్టల్ భవనాలు, ఆసుపత్రికి సంబంధించిన పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భవనాలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమానాయక్, విష్ణు, శాంతికుమార్, సాయికుమార్, సూర్యప్రకాశ్, శివవర్మ పాల్గొన్నారు.