మోసం చేయడంలో రేవంత్‌రెడ్డిది మొదటిస్థానం
తొర్రూరు రూరల్: ప్రజలను మోసం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి మొదటి స్థానంలో నిలుస్తారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని శ్రీనివాస గా ర్డెన్‌లో బీఆర్‌ఎస్ పట్టణ, మండల పార్టీ ఆధ్వర్య ంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత హామీలు ఇచ్చి అన్నివర్గాల ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్ నా యకత్వంలో బీఆర్‌ఎస్ పార్టీకి వంద సీట్లు రావడం ఖాయమన్నారు. ప్రభుత్వంపైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసే సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని, దమ్ముంటే ఎన్నికలను నిర్వహించాలని సవాల్ విసిరారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగకు పార్టీ కార్యకర్తలు, అన్నివర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హా జరై విజయవంతం చేయాలని కోరారు. కార్య క్రమంలో బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, మాజీ జెడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్, నాయకులు గాంధీనాయక్, నలమాస ప్రమోద్, కుర్ర శ్రీనివాస్‌గౌడ్, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, శామకూరి ఐలయ్య, ఎస్‌కే అంకూస్, ఎన్నమనేని శ్రీనివాస్‌రావు, కర్నె నాగరాజు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను
విజయవంతం చేయాలి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


