
బాలుడి కాలుపై వాత పెట్టిన ఆయా
మహబూబాబాద్: ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ఆయా స్టౌవ్‌పై కత్తిని వేడి చేసి బాలుడి కాలుపై వాత పెట్టింది. ఈ ఘటన మహబూ బాబాద్ జిల్లాకేంద్రంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు తెలి పిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీకి చెందిన పావని, వంశీ దంపతుల కుమారుడు మనుదీప్ (5 ఏళ్లు)ను స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. నాలుగు రోజుల క్రితం కేంద్రంలో పనిచేస్తున్న ఆయా భద్రమ్మ.. సదరు విద్యార్థి మనుదీప్ కుడి మోకాలు కింద భాగంలో వాత పెట్టింది. కూ రగాయలు కోసే కత్తిని స్టౌవ్‌పై వేడి చేసి వాతపె ట్టడంతో పెద్ద గాయం కావడంతోపాటు జ్వరం వచ్చిందని తల్లి తెలిపింది. దీంతో బుధవారం అంగన్‌వాడీ కేంద్రం ఎదుట బాలుడి తల్లిదండ్రులతోపాటు బంధువులు ఆందోళన చేశారు. అంగన్‌వాడీ టీచర్ సరితతోపాటు ఆయా భద్రమ్మతో వాగ్వాదానికి దిగారు. టీచర్ సరిత, ఆయా భద్రమ్మను వివరణ కోరగా వాత పెట్టలేదని, వారి వ్యక్తిగత గొడవల మూలంగానే ఆందోళన చేశారని తెలిపారు.