అన్నివర్గాల ప్రజలకు హక్కుల కల్పన
మహబూబాబాద్ అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించారని జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి అన్నారు. జిల్లా కేంద్రంలోని పత్తిపాక గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మంచి అలవాట్లను అలవర్చుకొని, క్రమశిక్షణతో ప్రతీరోజు పుస్తక పఠనంపై దృష్టిసారించాలన్నారు. అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులను మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సి ల్ దాసరి నాగేశ్వర్‌రావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వల్లపు యాదగిరి, కానిస్టేబుల్ సంపత్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం వీరులాల్ ఉన్నారు.
జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి


