గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
జిల్లాలో అంగన్‌వాడీల
వివరాలు
ప్రభుత్వ పాఠశాలల్లో
కొనసాగుతున్నవి : 713
పక్కా భవనాలు,
రెంటెండ్ భవనాల్లో
కొనసాగుతున్నవి : 724
మొత్తం : 1,437
అంగన్‌వాడీల్లో ఆంగ్ల విద్య
● ప్రీ ప్రైమరీ బోధనకు సిద్ధం
● ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని కేంద్రాలపై దృష్టి
● విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం
● అంగన్‌వాడీ టీచర్‌తో పాటు
మరొకరిని నియమించే అవకాశం
సాక్షి, మహబూబాబాద్:
పుట్టిన బిడ్డ నుంచి చదువులు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకొని మంచి బోధన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడంతో అటు పౌష్టికాహారం, ఇటు ఉత్తమ బోధనకు పునాది వేసినట్లు అవుతుందని భావిస్తున్నారు.
జూన్ నుంచి విద్యాబోధన..
అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ఒకేసారి మార్చడం ఇబ్బందిగా ఉంటుందనే ఆలోచనతో ముందుగా ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలపై దృష్టి సారించారు. జిల్లాలో డోర్నకల్, గూడూరు, మరిపెడ, మహబూబాబాద్, తొర్రూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,437 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో 724 కేంద్రాలు పక్కా భవనాలు, రెంటెండ్ భవనాల్లో ఉండగా.. మిగిలిన 713 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో ముందుగా 30 కేంద్రాలను ఎంపిక చేసి వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో నిర్వహించే అంగన్‌వాడీ కేంద్రాలు, అంగన్‌వాడీ టీచర్ల విద్యార్హతలు మొదలైన వివరాలను రాష్ట్ర అధికారులు తెప్పించుకున్నారు.
కిడ్స్ స్కూల్స్ తరహాలో..
ప్రభుత్వ నిబంధనల మేరకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ఉంది. అయితే ఐదు సంవత్సరాల వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్నారు. కానీ ఆ తర్వాత పిల్ల లను ప్రభుత్వ పాఠశాలలో ఉంచడం లేదు. ఇందుకోసం పట్టణాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలసిన కిడ్స్, వండర్ వర్డ్స్, కిండర్ గార్డెన్, మాంటీసోరీ, బచ్‌పన్ మొదలైన పేర్లతో లక్షల రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. అక్కడ ఆంగ్ల మాధ్యమం బోధన చేయడంతో పేదలు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి ఆయా స్కూల్స్‌కు పంపుతున్నారు. అదే ఒరవడిలో చదవడం, ప్రైవేట్ పాఠశాలపై మొగ్గు చూపుతున్నారు. అదే అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పిల్లలకు ఆటలు, పాటలు, అహ్లాదకరమైన వాతావరణం కల్పించడం, పిల్ల లను ప్రాథమిక పాఠశాలల్లో చేరేందుకు అర్హులను చేయడం అంటే.. అక్షరాలు, అంకెలు, రైమ్స్ వంటి నేర్పించడం, నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీలు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
న్యూస్‌రీల్
ఉద్యోగుల్లో ఆందోళన
అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ పాఠశాలలుగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో అంగన్‌వాడీ టీచర్లల్లో ఆందోళన మొదలైంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డైట్, బీఈడీ వంటి అర్హతలు ఉన్న వారిని వలంటీర్లుగా నియమిస్తారని ప్రకటనలు వస్తున్నాయి. అయితే సెంటర్‌కు మరొక టీచర్ వస్తే తమ ప్రాభల్యం తగ్గుతుందని కొందరు దశలవారీగా అంగన్‌వాడీ కేంద్రాలు ఎత్తి వేస్తారని మరికొందరు చెప్పడంతో అంగన్‌వాడీ టీచర్లలో భయం పట్టుకుంది. దీనిపై ఇప్పటికే అంగన్‌వాడీ ఉద్యోగుల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ఉన్నతాధికారులకు వినతి పత్రం కూడా అందచేశారు.
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025


