
విద్యార్థుల నమోదు శాతం పెరగాలి
● గిరిజన సంక్షేమ శాఖ
డిప్యూటీ డైరెక్టర్ దేశీరాంనాయక్
మహబూబాబాద్ రూరల్: నూతన విద్యా సంవత్సరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచే విధంగా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశీరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ సాధారణ సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ దేశీరాంనాయక్ మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరంలో విద్యా వ్యవస్థ పనితీరు, వసతి గృహాల విధివిధానాల కార్యాచరణపై పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి విషయంలో ప్రత్యేక చొరవ చూపి నూతన విధివిధానాలకు అనుగుణంగా పనితీరును మెరుగు పరచుకోవాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాలలన్నింటికి రంగులు, మరమ్మతులు పూర్తి చేసి ఆకర్షణీయంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.