
విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
● డీఈఓ రవీందర్‌రెడ్డి
తొర్రూరు రూరల్: విధుల్లో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేయవద్దని డీఈఓ రవీందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని నాంచారిమడూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఏ–2 పరీక్ష జవా బు పత్రాల మూల్యాంకనం వెంటనే పూర్తి చేసి, మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మండలస్థాయి అధికారులను సంప్రదించి పరిష్కరించుకో వాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, హెచ్‌ఎం రాజేందర్, ఉపాధ్యాయులు సునీత, సంపత్‌రావు, సీఆర్‌పీలు వీణ, రమేశ్ పాల్గొన్నారు.
పిల్లలకు కంటి పరీక్షలు
నిర్వహించాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: జిల్లాలోని ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. ఆర్‌బీఎస్‌కే కార్యక్రమాలపై మంగళవారం వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. డైక్ సెంటర్‌లో ఫిజియోథెరఫి, మానసిక సమస్యలు ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వ డం జరుగుతుందన్నారు. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేన్షన్స్ సెంటర్ నుంచి సమస్య ఉన్నవారిని ప్ర భుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్, డీపీఎం నీలోహన, డీడీఎం సౌమిత్, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, హెచ్‌ఈ కేవీ రాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్‌బీఎస్‌కే వాహనాలను తనిఖీ చేశారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి
మహబూబాబాద్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి సంక్రాంతి శ్రీనాఽథ్ అన్నారు. అగ్ని మాపకశాఖ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లలో విన్యాసాలను ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఈనె ల 14నుంచి 21వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, రవీందర్, షపీ, గోపి, వెంకన్న, పూర్ణచందర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కమిటీ చైర్మన్‌గా
శ్రీనివాస్
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని టీఎన్జీ ఓ ఎస్ భవనంలో మంగళవారం తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్క ర్స్, పెన్షనర్స్ సంఘాల సమావేశంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జేఏసీ జిల్లా చైర్మన్‌గా వడ్డెబోయిన శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా మహమ్మద్ రఫీ, అడిషనల్ జనరల్ సెక్రటరీగా సంకా బద్రినారాయణ, కోచైర్మన్లుగా మురళీకృష్ణ, రమేశ్, భగవాన్‌రెడ్డి, సుధాకరచారి, యాకూబ్, భాస్కర్, భిక్షం, మైస నాగయ్యను ఎన్నుకున్నారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా రోహిత్, ప్రసాద్, రవి, వైస్ చైర్మన్‌గా రమేశ్, సెక్రటరీలుగా లక్ష్మికాంత్, ఎ.శ్రీనివాస్, పబ్లిసిటీ సెక్రటరీగా వి.శ్రీనివాస్‌ను ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. ఈసందర్భంగా వడ్డెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి, యాకూబ్, శ్రీశైలం, దేవేందర్‌రాజు, భద్రు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు