
ఉపాధ్యాయుల కృషితోనే పాఠశాలలకు గుర్తింపు
డోర్నకల్: ఉపాధ్యాయుల కృషితోనే పాఠశాలలకు గుర్తింపు వస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీరోలు మండలం మన్నెగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం ‘ది లిటరరీ లాంథర్ ఇన్ ది వండర్ లాండ్’ పేరుతో ముద్రించిన సావనీర్‌ను డీఈఓ ఆవిష్కరించారు. మన్నెగూడెం పాఠశాలలో సంవత్సరంపాటు నిర్వహించిన కార్యక్రమాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల రచనలు, సాధించిన విజయాలు, ఛాయాచిత్రాలతో ముద్రించిన సావనీర్‌ను పరిశీలించిన డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమష్టి కృషితో రూపొందించిన సావనీర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మన్నెగూడెం పాఠశాలలో వసతులు, విద్యాబోధన ఉందన్నారు. హెచ్‌ఎం సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మానాయక్, కాంప్లెక్స్ హెచ్‌ఎం రుక్మాంగధరరావు, ఎస్‌ఎంసీ చైర్మన్ అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: నేటి నుంచి ప్రారంభం కానున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. శనివారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్‌రెడ్డి మాట్లాడారు. ఇంటర్మీడియట్‌కు 708 మంది, టెన్త్ 485 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్షల జరుగుతాయన్నారు. సమావేశంలో ఏసీజీఈ శ్రీరాములు, ఏడీ రాజేశ్వర్‌రావు, సైన్స్ అధికారి అప్పారావు. ఏఎంఓ చంద్రశేఖర్‌ఆజాద్, సంతోష్, పూర్ణచందర్, సతీష్ పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి