
కాటాపూర్‌లో వ్యక్తి ఆత్మహత్య
ఎస్‌ఎస్ తాడ్వాయి: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కాటాపూర్‌లోని బెస్త గుంపులో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కథనం ప్రకారం.. కాటాపూర్ బెస్త గుంపునకు చెందిన కంపెల్లి దేవేందర్ ((40)) నాలుగు సంవత్సరాల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పని చేసుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 15న కాటాపూర్ వచ్చాడు. అదే రోజున గ్రామంలో సర్కస్ నిర్వహిస్తుండగా చూడడానికి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికొచ్చాడు. సుమారు 10 గంటల ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి కన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దేవేందర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై పేర్కొన్నారు. కాగా, తన కుమారుడి ఆత్మహత్యకు రామెల్ల ప్రశాంత్, నర్సయ్య కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నమ్మ కోరింది.
కక్కిరాలపల్లిలో మరో వ్యక్తి..
ఐనవోలు: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని కక్కిరాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కత్తెరశాల చందర్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య శ్వేతతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై మనస్తాపానికి గురైన చందర్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, చందర్‌కు మొదట మమతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు రాజేశ్, రోహిత్ జన్మించారు. చందర్‌తో మొదటి భార్య, కుమారులు వేరుగా ఉండడంతో సుమారు 10 సంవత్సరాల క్రితమే శ్వేతను రెండో వివాహం చేసుకున్నాడు. చందర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.

కాటాపూర్‌లో వ్యక్తి ఆత్మహత్య