
రజతోత్సవానికి ముస్తాబు
భారత రాష్ట్ర సమితి పాతికేళ్ల పండుగకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి – చింతలపల్లి శివారులో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, సభకు హాజరయ్యే జనం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేందుకు బారికేడ్లు అమర్చారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్‌పూర్ శివార్లలో 1,200 ఎకరాలకు పైగా భూసేకరణ చేశారు. ఇందులో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పార్కింగ్ కోసమే కేటాయించారు. వేదికకు ఇరువైపులా కేసీఆర్, కేటీఆర్ నిలువు కటౌట్లతో రజతోత్సవ చిహ్నాలు ఏర్పాటు చేశారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ

రజతోత్సవానికి ముస్తాబు