వడదెబ్బతో కూలీ మృతి
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 1వ వార్డుకు చెందిన వ్యవసాయ కూలీ పలిశెట్టి వెంకటేశ్వర్లు(62) వడదెబ్బతో మృతి చెందినట్లు అతడి భార్య రమణ తెలిపారు. వెంకటేశ్వర్లు రోజూ సమీపంలోని పంట పొలాలు, మిర్చి కల్లాల వద్దకు పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం కూడా వెళ్లాడు. రాత్రి వాంతులు, విరోచనాలు జరిగి ఇంటి వద్దే మృతి చెందినట్లు ఆమె తెలిపారు.
19 నుంచి బునియాడీ కార్యకర్తల సమ్మేళనం
హన్మకొండ: హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగే బునియాడీ కార్యకర్తల సమ్మేళనం విజయవంతం చేయాలని ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ ఆదేశాల మేరకు ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ డెలిగేట్లు పాల్గొంటారని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతీ మండలం నుంచి ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు.
యువకుడిపై
పోక్సో కేసు నమోదు
వరంగల్: మూడేళ్ల చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఇంతేజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ ఎంఎ.షుకూర్ తెలిపారు. బుధవారం రాత్రి గిర్మాజీపేటలో కిరాయికి ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన మూడేళ్ల చిన్నారి తన నానమ్మ వద్ద అన్నం తిని ఇంటి ఆవరణలో అన్నయ్యతో ఆడుకుంటోంది. వీరు ఉంటున్న ఇంట్లోనే పైఅంతస్తులో కిరాయికి ఉంటూ పెయింటింగ్ వర్క్ చేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లల్లు రంజాన్.. ఇద్దరు పిల్లలను బయటకు తీసుకెళ్లి బిస్కెట్‌లు కొనిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి బాలికలను పైఅంతస్తులోని తన గదికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలిక తన నానమ్మతో చెప్పగా కుటుంబ సభ్యులు రంజాన్‌ను నిలదీయగా పరారయ్యాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రంజాన్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ షుకూర్ తెలిపారు.
వడదెబ్బతో కూలీ మృతి
వడదెబ్బతో కూలీ మృతి


