
రెజోనెన్స్ విజయకేతనం
హన్మకొండ : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వరంగల్‌లోని రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. అద్భుత ఫలితాలతో నంబర్–1 కోచింగ్ తమ కళాశాల నిలిచిందని వరంగల్ రెజోనెన్స్ కళాశాలల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. కళాశాలలకు చెందిన 11 మంది విద్యార్థులు 99పైగా పర్సంటైల్ సాధించగా, 64 మంది 95 పైగా, 161 మంది 90కి పైగా పర్సంటైల్ సాధించి అత్యున్నత ఫలితాలు సాధించారని వివరించారు. జాతీయ స్థాయిలో 13, 236, 306, 949, 988 ర్యాంకులు కై వసం చేసుకున్నారని తెలిపారు. ఎ.నంది 100 పర్సంటైల్, ఎం.చరణ్ తేజ 99.89, సీహెచ్. సాయిదత్తు 99.77, బి.శ్రీహర్ష 99.69, బి.వెంకట్ జశ్వంత్ 99.66, జి.అనిరుద్ 99.64, ఎండీ రహమాన్ 99.58, కే.శిత్తిజ్ 99.56, వి.సాయి కౌశిక్ 99.48, వి.వి.ఫణి హర్షిత్ 99,26, వి.రాజశేఖర్ 99.25 పర్సంటైల్ సాధించారని వివరించారు. హనుమకొండలోని రెజోనెన్స్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను అభినందించారు. చైర్మన్ లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అలుపెరగని కృషి, తల్లిదండ్రుల సహకారం, అత్యుత్తమ బోధనతో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీ.ఏ.ఓ లెక్కల రమ్య రెడ్డి, అకడమిక్ డీన్ బీ.ఎస్.గోపాలరావు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.