
ఎల్‌సీ యాప్‌తో ప్రమాదాల నివారణ
హన్మకొండ: ప్రమాదాల నివారణ, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎల్‌సీ యాప్‌ను రూపొంచిందని కంపెనీ వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతం రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ ఆజంజాహి మిల్ సబ్ స్టేషన్‌లో ఎల్‌సీ యాప్‌ను ప్రారంభించి అమలు చేశారు. విద్యుత్ సంబంధ మరమ్మతులు చేస్తున్న క్రమంలో లైన్ క్లియర్ తీసుకుంటామని, ఒక్కోసారి సమాచార లోపంతో ప్రమాదాలు జరిగేవన్నారు. వీటిని అరికట్టేందుకు ఎల్‌సీ యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ఎల్‌సీ తీసుకోవాలంటే సంపూర్ణ సమాచారం పొందుపరుచాల్సి ఉంటుందన్నారు. ఈ సమాచారాన్ని పరిశీలించి ఎల్‌సీ తీసుకుని పనులు చేపట్టడం ద్వారా ప్రమాదాల నివారించొచ్చన్నారు. ఇప్పటి నుంచి వరంగల్ టౌన్ డివిజన్‌లో ఎల్‌సీ యాప్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి యాప్ ద్వారానే ఎల్‌సీ తీసుకోవాలని అధికారులు, ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమంలో డీఈలు ఎ.ఆనందం, ఎస్.మల్లికార్జున్, ఏడీ బి.కిశోర్, ఏఈ సి.హెచ్.సాయి కృష్ణ, సబ్ ఇంజనీర్లు సురేశ్, విజయ్, సిబ్బంది పాల్గొన్నారు.
టీజీఎన్పీడీసీఎల్ వరంగల్
ఎస్‌ఈ కె.గౌతం రెడ్డి