
దక్కన్ క్వీన్ అందాలు జిగేల్..
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ ఎదుట రైల్వే చరిత్ర తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన మొద టి తరం రైల్వే స్టీమ్ లోకోమోటివ్‌ను (కాజీపేట జంక్షన్ ఎదుట ఏర్పాటు చేసినప్పుడు లోకోకు చేసిన నామకరణం హెరిటేజ్ దక్కన్ క్వీన్) రైల్వే అధికారులు గురువారం సుందరీకరించారు. శు క్రవారం ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా డీజిల్‌లోకోషెడ్ సీనియర్ డీఎంఈ ఎన్. వి.వెంకటకుమార్, డీఎంఈ అనికేత్ కాడే పర్యవేక్షణలో 15 మంది రైల్వే సిబ్బంది పెయింటింగ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి స్టీమ్ లోకోను సుందరంగా అలంకరించినట్లు ఏఆర్‌టీ ఎస్ ఎస్ ఈ పి.చంద్రశేఖర్ తెలిపారు. స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రొజెక్టర్ ద్వారా భారతీయ రైల్వే చరిత్ర, స్టీమ్‌లోకోమోటివ్ విశేషాలను ప్రదర్శించగా ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. కాగా, విద్యుత్ కాంతుల మధ్య దక్కన్ క్వీన్ జిగేల్ మంటోంది. దీంతో ప్రయాణికులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. దక్కన్‌క్వీన్ కొత్త అందాలతో కాజీపేట జంక్షన్ శోభాయమానంగా మారింది.
వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ముస్తాబు
పెయింటింగ్, లైటింగ్స్‌తో
కలర్‌పుల్‌గా స్టీమ్‌లోకో..
ప్రొజెక్టర్ ద్వారా రైల్వే చరిత్ర ప్రదర్శన