
మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం ధాన్యం పోటెత్తింది. అలాగే మక్కల రాశులతో మార్కెట్ ప్రాంగణం కళకళలాడుతూ కనిపించింది. మార్కెట్ ఆవరణలోని కవర్ షెడ్డుతో పాటు ఇతర షెడ్లన్నీ ధాన్యం, మక్కలతో నిండిపోయాయి. స్థలం సరిపోకపోవడంతో రైతులు తాము తీసుకువచ్చిన ధాన్యం, మక్కలను వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశాల్లో రాశులుగా పోసుకున్నారు. వ్యాపారులు 2,877 బస్తాల (1,869 క్వింటాళ్లు) ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే 3,668 బస్తాల (2,201 క్వింటాళ్లు) మక్కలను కొన్నారు. కాగా మార్కెట్ షెడ్లన్నీ నిండి ఉన్నాయని, బుధవారం ధాన్యం, పత్తి, మక్కలు, అపరాలను తీసుకురావద్దని, మిర్చి క్రయవిక్రయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు.

మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం