
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు
ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలికి, ఎస్‌ఈఆర్‌టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉపాధ్యాయులు నిర్దేశించిన దరఖాస్తుల ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి సోమవారం కోరారు. ఇతర సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణలు ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్‌లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, గెజిటెడ్ హెడ్మాస్టర్లను రిసోర్స్‌పర్సన్‌లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్‌లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్‌పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్‌పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్దూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్‌నుంచి కూడా రిసోర్స్ పర్సన్‌లను నియమిస్తారు.
జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి..
ప్రతీ జిల్లానుంచి హైస్కూల్‌స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్‌పర్సన్‌లుగా ఎంపిక చేస్తారు. ఉర్దూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులో నుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు.
ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ
ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్స్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందుకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్‌పర్సన్‌లను వినియోగిస్తారు.
రిసోర్స్ పర్సన్ల నియామకానికి
దరఖాస్తుల ఆహ్వానం
డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ
నేటినుంచి ఈనెల 24వరకు గడువు
ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు