యోగా కౌన్సెలర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్యాకేంద్రంలో డిప్లొమా ఇన్ యోగా కోర్సు బోధనకు బుధవారం కౌన్సెలర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. దూర విద్యాకేంద్రం డైరెక్టర్ బి.సురేష్‌లాల్, విద్యావిభాగం డీన్ ఎన్.రాంనాఽథ్‌కిషన్, బీఓఎస్, వరంగల్ నిట్ ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. 9మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరితో ఈ రెండు బ్యాచ్‌లకు యోగా థియరీ ,ప్రాక్టికల్స్ క్లాస్‌లు నిర్వహించాలని యోచిస్తునట్లు డైరెక్టర్ సురేష్‌లాల్ తెలిపారు.


