
తాన్యశ్రీకి గిన్నిస్ బుక్‌లో చోటు
పాలకుర్తి : మండలంలోని ఎల్ల రాయని తొర్రూరుకు చెందిన చిన్నారి తాన్యశ్రీ కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ కనబర్చి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు ఆదివారం నిర్మల్ పట్టణ కేంద్రంలో స్వరూపిణీ నిత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో 2025 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సక్సెట్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 18 నెలల క్రితం కూచిపూడి నాట్యంలో ప్రతిభకనబర్చిన తాన్యశ్రీకి సర్టిఫికెట్లు, మోడల్స్ పంపిణీ చేశారు. దీంతో మాజీ ఎంపీటీసీ మడిపల్లి కౌసల్య, సోమయ్య, మాజీ సర్పంచ్ నాయిని మల్లారెడ్డి, మడిపల్లి దామోదర్, గ్రామస్తులు అభినందించారు.