
రూ. 5.60 లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత
● ముగ్గురి అరెస్ట్, రిమాండ్
● వివరాలు వెల్లడించిన
డీఎస్పీ సంపత్‌రావు
భూపాలపల్లి అర్బన్: గణపురం మండలం రవినగర్ సమీపంలో రూ. 5.60లక్షల విలువైన 11 కేజీల ఎండు గంజాయి పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. భూపాలపల్లి మండలం గుర్రంపేటకు చెందిన ఆరెల్లి అఖిల్, గణపురం మండలం చెల్పూరుకు చెందిన ఆముదాల కార్తీక్, హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్‌కు చెందిన ముస్కే రోహిత్ స్నేహితులు. తాము సంపాదించే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో కొద్ది రోజులుగా ఒడిశాలోని కొండప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి భూపాలపల్లి, గణపురం మండలాల పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న రవినగర్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు అశోక్ తన సిబ్బందితో కలిసి మంగలోనికుంట మత్తడి వద్ద మాటు వేయగా ముగ్గురు వ్యక్తులు సంచులు పట్టుకుని అనుమానాస్పందగా కనిపించారు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించడంతో సరుకు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. కాగా, గంజాయిని పట్టుకోవడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన చిట్యాల సీఐ మల్లేశ్, సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అశోక్, సీసీఎస్ ఎస్సై భాస్కర్‌రావు, సిబ్బందిని అభినందించారు.
వడదెబ్బతో మహిళ మృతి
నర్సంపేట రూరల్ : వడదెబ్బతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘ టన నర్సంపేట మండలంలోని రాజుపేట శివారు గార్లగడ్డతండా లో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఫాల్తియా వసంత (35) మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పజ్జజొన్న చేనులో పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చింది. అదేరోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. మృతురాలికి భర్త భద్రు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రైలునుంచి జారి పడి యువకుడి మృతి
ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేగేట్ వద్ద ఓ యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు తెలిపారు. వరంగల్ శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌కు చెందిన పెరుమాండ్ల అనిల్ (29) మంగళవారం రామగుండంలో కూలి పనికి వెళ్లి తిరిగి రైలులో సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో రైలు వరంగల్ రైల్వే గేట్ సమీపాన చేరుకోగానే అనిల్ అందులోనుంచి జారిపడగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆటోలో ఎంజీఎం తరలించగా.. వై ద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవా రం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు శవపంచనామ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు తెలిపారు.

రూ. 5.60 లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత

రూ. 5.60 లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత