
మహబూబాబాద్ పీసీసీ అబ్జర్వర్లుగా పొట్ల, రవళిరెడ్డి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పీసీసీ అబ్జర్వర్లుగా మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్‌రావు, పీసీసీ స్పోక్స్‌పర్సన్ కూచన రవళిరెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నాటరాజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వారు పని చేయనున్నారు. ప్రధానంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేయడంలో కీలక భూమిక పోషించనున్నారు. వీరిద్దరికి జిల్లాపై మంచి అవగాహన ఉండడం, జిల్లా నాయకులతో సత్సంబంధాలు ఉండడంతో పార్టీ కమిటీలు వేయడం, ఇతర కార్యక్రమాలు విజయవంతం చేయడం సులభం అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అదేవిధంగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు బెల్లయ్యనాయక్ నాగర్ కర్నూల్, ఎమ్మెల్యే మురళీనాయక్ సూర్యాపేట జిల్లాల పరిశీలకులుగా నియమితులయ్యారు.
ఎడ్లబండ్లకు స్వాగతం
పలికిన సత్యవతిరాథోడ్
దంతాలపల్లి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు సూర్యాపేట జిల్లా నుంచి తరలివెళ్తున్న ఎడ్లబండ్లకు బుధవారం మండల కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండ్లతో వెళ్తున్న రైతులకు ఆమె తినుబండారాలు అందజేశారు. సభకు వెళ్తున్న రైతులు మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా ఎస్.ఆత్మకూరు మండలంలోని రామోజీతండా, నసీంపేట గ్రామాలకు చెందిన 18ఎడ్లబండ్లను సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారన్నా రు. తమకు అవసరమైన సరుకులను రెండు వాహనాల్లో తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బండ్ల భిక్షం రెడ్డి, దొర యాకన్న, గుండగాని లింగయ్య, మాద వెంకన్న, గండి సతీష్, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల నాయకులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జిగా అబ్దుల్ రఫీ బాధ్యతల స్వీకరణ
మహబూబాబాద్ రూరల్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహమ్మద్ అబ్దుల్ రఫీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా జడ్జిగా పనిచేస్తున్న మహమ్మద్ అబ్దుల్ రఫీ బదిలీపై వచ్చి మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జిగా విధుల్లో చేరారు.
జడ్జిని కలిసిన ఎస్పీ..
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు సంబంధించిన శాఖాపరమైన పలు అంశాలపై చర్చించారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ సరవయ్య, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, ఎస్సై జీనత్ కుమార్, కోర్టు డ్యూటీ అధికారులు ఉన్నారు.
పిల్లలను ప్రభుత్వ
పాఠశాలల్లో చేర్పించాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి తల్లిదండ్రులను కోరారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని శనిగపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం విద్యా సంవత్సరం ముగింపు తల్లిదండ్రుల సమావేశానికి డీఈఓ హాజరై మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి బలోపేతం చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య, ఉచిత భోజనవసతి, పుస్తకాలు, బుక్కులు, స్కూల్ యూనిఫాంలు పొందాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దాశరథి, ఉపాధ్యాయులు పాఠశాల చైర్మన్ అరుణ, మాజీ కౌన్సిలర్ హరిసింగ్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, మానిటరింగ్ అధికారి ఆజాద్‌చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు వెంకన్న, పర్వతాలు, చైతన్య, ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో పాఠశాల ముగింపు కార్యక్రమానికి జీసీడీఓ విజయ కుమారి హాజరై మాట్లాడారు.

మహబూబాబాద్ పీసీసీ అబ్జర్వర్లుగా పొట్ల, రవళిరెడ్డి

మహబూబాబాద్ పీసీసీ అబ్జర్వర్లుగా పొట్ల, రవళిరెడ్డి