Mahabubabad District News
-
సంస్కృతీ, సంప్రదాయాలను వెలుగులోకి తేవాలి
● పద్మశ్రీ గడ్డం సమ్మయ్య దేవరుప్పుల : తెలంగాణ ప్రాంత సినీ ప్రముఖులు ఇక్కడి జీవన విధానాలతోపాటు సంస్కృతి సంప్రదాయాలను మరింత వెలుగులోకి తీసుకరావాలని పద్మశ్రీ గ్రహిత గడ్డం సమ్మయ్య సూచించారు. బలగం సినిమా దర్శకుడు ఎల్డండి వేణు నిర్మించబోయే ఎల్లమ్మ సినిమా లొకేషన్ కోసం శుక్రవారం పాలకుర్తి ప్రాంతం పరిశీలించిన అనంతరం అప్పిరెడ్డిపల్లెలో సమ్మయ్య స్వగృహనికి వచ్చారు. ఈ సందర్భంగా వేణు చిందు యక్షగాన కళాకారులతో నాటకాలు వేయించి, సెలక్షన్స్ నిర్వహించారు. సమ్మయ్యను సన్మానించి సినిమాలో భాగస్వామ్యులు కావాలని కోరగా..అంగీకరించారు. తిరుపతి బృందం, సుధాకర్, కళాకారులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్ఎల్బీ 5 ఏళ్ల లా కోర్సులో తాత్కాలిక పద్ధతిన వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. సోషియాలజీ (1), పొలిటికల్ సైన్స్(1), లా సబ్జెక్టుల్లో బోధనకు(ఆరు) వేకన్సీలు ఉన్నట్లు తెలిపారు. ఎల్ఎల్ఎం, /ఎంఏ 55శాతం మా ర్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు. నెట్/సెట్ పాస్ లేదా పీహెచ్డీ పూర్తి చేసినవారు అర్హులని తె లిపారు. దరఖాస్తులను హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ లా కాలేజీలో ఈనెల 8వ తేదీ వరకు అందజేయాలని పేర్కొన్నారు. విద్యార్హతల సర్టిఫికెట్లతోపాటు టీచింగ్ అనుభవం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది పార్ట్‌టైం నియామకం కాదని, వన్‌టైం సింగిల్ అరెంజ్మెంటుగా తాత్కాలిక పద్ధతిలో(2024–25)విద్యాసంవత్సరానికే (సెమిస్టర్) నియామకని పేర్కొన్నారు. ఒక సబ్జెక్టులో పేపర్‌వైజ్ ఐదు యూనిట్స్ సిలబస్ బోధిస్తే రెమ్యూనరేషన్ రూ.20వేలు చెల్లిస్తారని సుదర్శన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు ● ఒకరి అరెస్టు, ఇద్దరు పరార్ ● రూ.10,500, సెల్‌ఫోన్ స్వాధీనం గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో ఐపీఎల్ టీ–20 మ్యాచ్‌లపై బెట్టింగ్ చేస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి దాడులు జరిపారు. గీసుకొండకు చెందిన యాదగిరి గిరిధర్, దౌడు నితిన్, వంచనగిరికి చెందిన కావటి రాకేశ్ ఐపీఎల్ మ్యాచ్‌లో జట్ల గెలుపోటములు, బ్యాటింగ్, బౌలింగ్ చేసే వారిపై బెట్టింగ్ పెడుతున్న సమాచారాన్ని విశ్వసనీయంగా తెలుసుకుని వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈక్రమంలో దౌడు నితిన్, కావటి రాకేశ్ పరారు కాగా.. యాదగిరి గిరిధర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.10,500, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును గీసుకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఎస్సై దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకోండి.. విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గురుకుల విద్యాలయ జూనియర్ కళాశాలల్లో 2025–26లో ప్రవేశాలకు టీజీఆర్జేసీ ప్రవేశపరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలని టీజీఆర్జేసీ హసన్‌పర్తి గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ ఇందుమతి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈఏడాది మార్చి–ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 23వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు http:tgrjc. cgg.govt. inలో చూడాలని తెలిపారు. ఇతర వివరాలకు 040–2473 4899, 98665 59727 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు. -
వృద్ధుడికి అరుదైన గుండె శస్త్రచికిత్స
కాజీపేట అర్బన్: హంటర్‌రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రిలో 77 ఏళ్ల వృద్ధుడికి వైద్యులు అరుదైన గుండె శస్త్రచికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్స వివరాలను వైద్యుడు షఫీ వెల్లడించారు. వరంగల్‌కు చెందిన వృద్ధుడు మా మిడిపల్లి ముకుందాచారి ఇటీవల తీవ్రమైన గుండె నొప్పితో ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్, రైట్ కరోనరీ ఆర్టరీ, లెఫ్ట్ సర్మమ్ ఫ్లెక్స్ ఆర్టరీ, యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, స్టెనోసిస్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఈక్రమంలో డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్, డ్రగ్ ఎలుటింగ్ బలూన్ గుండె శస్త్రచికిత్స నిర్వహించినట్లు వివరించారు. శస్త్రచికిత్స అనంతరం వృద్ధుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు షఫీ వెల్లడించారు. -
వృద్ధుడికి అరుదైన గుండె శస్త్రచికిత్స
కాజీపేట అర్బన్: హంటర్‌రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రిలో 77 ఏళ్ల వృద్ధుడికి వైద్యులు అరుదైన గుండె శస్త్రచికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్స వివరాలను వైద్యుడు షఫీ వెల్లడించారు. వరంగల్‌కు చెందిన వృద్ధుడు మా మిడిపల్లి ముకుందాచారి ఇటీవల తీవ్రమైన గుండె నొప్పితో ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్, రైట్ కరోనరీ ఆర్టరీ, లెఫ్ట్ సర్మమ్ ఫ్లెక్స్ ఆర్టరీ, యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, స్టెనోసిస్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఈక్రమంలో డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్, డ్రగ్ ఎలుటింగ్ బలూన్ గుండె శస్త్రచికిత్స నిర్వహించినట్లు వివరించారు. శస్త్రచికిత్స అనంతరం వృద్ధుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు షఫీ వెల్లడించారు. -
కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ విక్రయం
● సీజ్ చేసిన పోలీసులుకమలాపూర్: కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఓ కిరాణా షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఏజెన్సీ గోదాంపై దాడులు జరిపి కాలం చెల్లిన పలు రకాల కూల్‌డ్రింక్స్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. కిరాణా షాపు యజమాని, కొనుగోలుదారులు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌కు చెందిన కెంసారపు తిరుపతి అనే కిరాణా షాపు నిర్వాహకుడికి కమలాపూర్‌లోని కూల్‌డ్రింక్స్ ఏజెన్సీ నిర్వాహకులు మౌటం ఓంప్రకాష్–హేమలత గత నెల 21న కొన్ని 200 ఎంఎల్ మాజా బాటిళ్లు సరఫరా చేశారు. వాటిని తిరుపతి కొందరు కొనుగోలుదారులకు విక్రయించగా డేట్ ఎక్స్పైర్ అయిట్లుగా వారు గుర్తించారు. దీంతో కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ ఎందుకు విక్రయిస్తున్నావని, ఇవి తాగితే తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ తిరుపతిని కొనుగోలుదారులు నిలదీశారు. దీంతో తిరుపతి తాను ఎక్స్పైర్ డేట్‌ను గమనించలేదని చెప్తూనే వెంటనే ఏజెన్సీ నిర్వాహకులకు ఫోన్ చేసి కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ ఎందుకిచ్చారని, వాటిని తీసుకెళ్లి వాటి స్థానంలో వేరే కూల్‌డ్రింక్స్ ఇవ్వాలని కోరాడు. దీంతో వారు తమకేమీ సంబంధం లేదని, కంపెనీ వాళ్లకు వాపస్ ఇచ్చుకోండంటూ దురుసుగా మాట్లాడటమే కాకుండా నానా దుర్భాషలాడారని తిరుపతి ఆరోపించాడు. అంతేకాకుండా కంపెనీ వాళ్లు ఇచ్చిన ఫ్రిజ్ బయట పెడితే తీసుకెళ్తామని ఫోన్లోనే వాగ్వాదానికి దిగారు. కొద్ది రోజులు వేచి చూసిన తిరుపతి గత నెల 31న కమలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 2న పోలీసులు కమలాపూర్‌లోని కూల్‌డ్రింక్స్ ఏజెన్సీ గోదాంపై దాడులు జరిపి గోదాంలో నిల్వ ఉన్న కాలం చెల్లిన పలు రకాల కూల్‌డ్రింక్స్‌తోపాటు వాటర్, సోడా బాటిళ్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. రూ.15,483 విలువైన కూల్‌డ్రింక్స్ సీజ్ చేసి, ఏజెన్సీ నిర్వాహకుడు ఓం ప్రకాశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రారావు తెలిపారు. కాగా, కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, వారి అండదండలతోనే ఈ తతంగమంతా నడుస్తోందని, కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
రైతులకు అండగా ఉంటాం..
గోవిందరావుపేట: అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నా రు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పరిధిలోని అమృతండా, చంద్రు తండా లక్ష్మీపురం, కర్లపల్లి గ్రామాల్లో గురువారం సాయంత్రం కురిసి న అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క పరిశీలించారు. పంట పొలాలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఫోన్ చేసి పంట నష్టాన్ని వివరించి పరిహారం ఇవ్వాలని సీతక్క కోరారు. దీనికి స్పందించిన నాగేశ్వరరావు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సీతక్క తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి కోతకు వచ్చిన వరి ధాన్యం రాలిపోయి నీటి పాలైందని అన్నారు. వెంటనే నష్టతీవ్రతను అంచనా వేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని తెలిపారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, టీపీసీసీ సభ్యుడు మల్లాది రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇస్సార్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. పంట నష్టపోయినవారికి పరిహారం అందిస్తాం.. రాష్ట్ర మంత్రి సీతక్క -
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్‌రూరల్: మహబూబాబాద్ మున్సి పాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామ శివారు బోరింగ్ తండా సమీపంలో దారుణహత్యకు గురైన దంతాలపల్లి ఎంజేపీ గురుకులం హెల్త్ సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ తిరుపతిరా వు తెలిపారు. మహబూబాబాద్ సబ్ డివిజన్ పో లీస్ అధికారి కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పార్థసారథి హత్య జరిగిన రోజున అతడి సోదరి హేమవరలక్ష్మి ఇచ్చిన ఫిర్యా దు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామన్నారు. ఈ క్రమంలో మృతుడు పార్థసారథి భార్య స్వప్న, ఆమె ప్రియుడు వెంకటవిద్యాసాగర్ను గురువారం అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం ఒప్పుకున్నారని తెలిపారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గంగ హుస్సేన్ బస్తీకి చెందిన తెలగరి వినయ్ కుమార్, బోగ శివకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని అరెస్టు చేసి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తామని పేర్కొన్నారు. గతంలో పార్థసారథిని హత్య చేయాలని జరిగిన రెక్కీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రాజాఓమంగి మండలం జెడ్డంగి గ్రామానికి చెందిన కూసం లవరాజు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రూరల్, సీసీఎస్ సీఐలు సర్వయ్య, హత్తిరాం, రూరల్, కేసముద్రం ఎస్సైలు దీపిక, మురళీధర్ రాజు పాల్గొన్నారు. -
రైతు సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
హన్మకొండ: రైతు సమస్యలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణ మాఫీ చేయడంలో విఫలమైందని విమర్శించారు. యాసంగి పంట కాలం పూర్తయి.. వానా కాలం సాగు సమీపిస్తున్నా ఇప్పటికీ యాసంగి కాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి రూ.6 వేలు క్రమం తప్పకుండా ఇస్తోందని చెప్పిన ఆయన.. కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నదని విమర్శించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎంత మందికి రుణ మాఫీ జరిగిందో తెలియజేస్తూ శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు చేయడంతోపాటు రైతు భరోసా రైతులందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారాం నాయక్, వరంగల్, జేఎస్‌భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, నిశిధర్ రెడ్డి, సిరికొండ బలరాం, సౌడా రమేష్, నాయకులు వన్నాల శ్రీరాములు, రావు పద్మ, ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీష్, మల్లాడి తిరుపతిరెడ్డి, రత్నం సతీష్, గోగుల రాణా ప్రతాపరెడ్డి, బైరి నాగరాజు, పుల్యాల రవీందర్ రెడ్డి, ఎం.విష్ణు, డాక్టర్ కాళీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి -
గిరిజనులపై చిన్న చూపు వీడండి
సాక్షి, మహబూబాబాద్ : గిరిజనులు అంటే ఇంకా సమాజంలో చిన్నచూపు ఉంది.. అధికారుల్లో కూడా అటువంటి ధోరణి ఉండటం సమంజసం కాదు.. చిన్న చూపు వీడి వారి అభ్యున్నతికి పాటుపడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ పథకాల అమలు, ఎస్టీలపై కేసులు మొదలైన అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి పెద్ద అధికారుల వరకు సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. భూ సమస్యలు పరిష్కరించకుండా సంవత్సరాల తరబడి గిరిజనులను తిప్పించుకుంటున్నారని అన్నారు. గిరిజన కాలనీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. వాటిని పరిష్కరించడం లేదని పలు సమస్యలను గుర్తు చేసి వినిపించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఐటీడీఏ పీడీ చిత్ర మిశ్రా, ఎస్పీ సుధీర్ రాంనా ధ్ కేకన్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ -
టైక్స్‌టైల్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
పరకాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్‌బాబు అన్నారు. టెక్స్టైల్ పార్కులో మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. పరకాల మున్సిపల్ సమావేశమంది రంలో పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెగా టెక్స్టైల్ పార్క్‌లోని ఇండస్ట్రీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్య త ఇవ్వాలని, అందుకు స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వా రా స్థానికులకు నైపుణ్యం కల్పించి నియమించుకో వాలని సూచించారు. ఆర్అండ్బీ లే అవుట్లో పట్టాలిచ్చిన 863 మంది రైతులకు వారి అభ్యర్థన మేరకు 50 గజాల నుంచి 75 గజాలు అందించేందుకు టీజీఐఐసీ ద్వారా అదనంగా రెండు ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. తిరిగి లేఅవుట్ ప్లాట్లు చేసి రాజీవ్ గాంధీ టౌన్ షిప్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈ జీడీపీ పథకం ద్వారా రూ.10.10 కోట్ల వ్యయంతో చేపట్టిన కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైన్స్, మంచినీటి సరఫరా, సంప్, పరిపాలన భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని, జూలై 2025 నాటికి పూర్తవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. గంజాయి, గుడుంబా నివారణకు చర్యలు టైక్స్‌టైల్ పార్క్‌లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం ఉందని అలాంటి కార్యకలాపాలపై పోలీసులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశంకుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం పరకాల నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో ని నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల ద్వారా 51 బ్యాచ్‌లలో 1,717 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తి చేసుకున్న 82 మంది మహిళలకు మంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ పత్రాలు అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మడికొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా మడికొండ ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన ఆవుల మల్లేశ్(30) రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని మంగళ సీడ్స్‌లో పని చేస్తున్నాడు. ప్రతీ రోజు మాదిరిగానే గురువారం పనికి వెళ్లి ముగించుకొని తన ద్విచక్రవాహనంపై ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ధర్మసాగర్‌కు తిరిగి వస్తుండగా ఎలుకుర్తి క్రాస్ రోడ్డు సమీపంలో వాహనం అదుపుతప్పి పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేశ్ తల, గొంతు, కుడికాలుకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మల్లేశ్ భార్య ఆవుల మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు. పిల్లిని తీసేందుకు వెళ్లి.. ● బావిలో పడి వృద్ధుడి మృతి నెక్కొండ: చేద బావిలో పడిన పిల్లిని తీసేందుకు వెళ్లి వృద్ధుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కక్కెర్ల యాదగిరి (59) తన కుమార్తె కిరాయికి ఉంటున్న ఇంట్లోని చేద బావిలో పిల్లి పడి మృతి చెందింది. ఈ విషయాన్ని తన తండ్రి యాదగిరి చెప్పడంతో పిల్లి కళేబరాన్ని తీసేందుకు బావిలో దిగుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాడు జారీ బావిలో పడిపోయాడు. దీంతో నీట మునిగిన వృద్ధుడు యాదగిరి మృతిచెందాడు. యాదగిరి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాసరలో శాయంపేట యువకుడి మృతి శాయంపేట : మండల కేంద్రానికి చెందిన బండారి మణికంఠ(19) బాసరలోని శ్రీ వేదభారతి పాఠశాలలో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మణికంఠ బాసరలోని శ్రీవేదభారతి పాఠశాలలో రెండు సంవత్సరాలుగా చదువుతున్నాడు. మణికంఠ విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడని శుక్రవారం మధ్యాహ్నం బాసరలోని వేద పాఠశాల సిబ్బంది మణికంఠ తండ్రి బండారి రాజేందర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో రాజేందర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తన కుమారుడు మణికంఠను ఎవరో కావాలని హత్య చేసి విద్యుత్ షాక్‌గా చిత్రీకరిస్తున్నారని తన కుమారుడి మృతిపై అధికారులు దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని రాజేందర్ కోరారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్ఎల్బీ 5 ఏళ్ల లా కోర్సులో తాత్కాలిక పద్ధతిన వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. సోషియాలజీ (1), పొలిటికల్ సైన్స్(1), లా సబ్జెక్టుల్లో బోధనకు(ఆరు) వేకన్సీలు ఉన్నట్లు తెలిపారు. ఎల్ఎల్ఎం, /ఎంఏ 55శాతం మా ర్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు. నెట్/సెట్ పాస్ లేదా పీహెచ్డీ పూర్తి చేసినవారు అర్హులని తె లిపారు. దరఖాస్తులను హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ లా కాలేజీలో ఈనెల 8వ తేదీ వరకు అందజేయాలని పేర్కొన్నారు. విద్యార్హతల సర్టిఫికెట్లతోపాటు టీచింగ్ అనుభవం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది పార్ట్‌టైం నియామకం కాదని, వన్‌టైం సింగిల్ అరెంజ్మెంటుగా తాత్కాలిక పద్ధతిలో(2024–25)విద్యాసంవత్సరానికే (సెమిస్టర్) నియామకని పేర్కొన్నారు. ఒక సబ్జెక్టులో పేపర్‌వైజ్ ఐదు యూనిట్స్ సిలబస్ బోధిస్తే రెమ్యూనరేషన్ రూ.20వేలు చెల్లిస్తారని సుదర్శన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు ● ఒకరి అరెస్టు, ఇద్దరు పరార్ ● రూ.10,500, సెల్‌ఫోన్ స్వాధీనం గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలో ఐపీఎల్ టీ–20 మ్యాచ్‌లపై బెట్టింగ్ చేస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి దాడులు జరిపారు. గీసుకొండకు చెందిన యాదగిరి గిరిధర్, దౌడు నితిన్, వంచనగిరికి చెందిన కావటి రాకేశ్ ఐపీఎల్ మ్యాచ్‌లో జట్ల గెలుపోటములు, బ్యాటింగ్, బౌలింగ్ చేసే వారిపై బెట్టింగ్ పెడుతున్న సమాచారాన్ని విశ్వసనీయంగా తెలుసుకుని వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈక్రమంలో దౌడు నితిన్, కావటి రాకేశ్ పరారు కాగా.. యాదగిరి గిరిధర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.10,500, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును గీసుకొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఎస్సై దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకోండి.. విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గురుకుల విద్యాలయ జూనియర్ కళాశాలల్లో 2025–26లో ప్రవేశాలకు టీజీఆర్జేసీ ప్రవేశపరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలని టీజీఆర్జేసీ హసన్‌పర్తి గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ ఇందుమతి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈఏడాది మార్చి–ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 23వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు http:tgrjc. cgg.govt. inలో చూడాలని తెలిపారు. ఇతర వివరాలకు 040–2473 4899, 98665 59727 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు. -
అకాల వర్షం.. రైతుకు నష్టం
బయ్యారం: అకాలవర్షం, వరద మొక్కజొన్న రైతులను నిలువునా ముంచింది. గురువారం రాత్రి కురిసిన వర్షం రైతులను అతలాకుతలం చేసింది. మండలంలోని వెంకట్రాంపురం పంచాయతీ పరిధిలోని సంగ్యాతండా గ్రామానికి చెందిన రైతులు యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. సుమారు 50ఎకరాల్లో సాగు చేసిన పంటను మిల్లు పట్టించిన తర్వాత జొన్నలను ఆరబెట్టేందుకు రైతులు రోడ్డుపక్కన ఉన్న మడికట్టులో కుప్పలుగా పోశారు. వర్షం వస్తుందని జాగ్రత్త పడ్డప్పటికీ.. వర్షం సూచన ఉండటంతో ముందస్తుగా అప్రమత్తమైన రైతులు తమ మొక్కజొన్న రాశులపై పట్టాలను కప్పి జాగ్రత్తలు పడ్డారు. రెండు విడతలుగా భారీ వర్షం కురవడంతో జొన్నల రాశులు ఉన్న ప్రాంతంలోకి ఎగువ నుంచి భారీ వరద వచ్చి రాశులను ముంచేసింది. అప్పటికే అప్రమత్తమైన రైతులు వరదనీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించినప్పటికీ పూర్తిస్థాయిలో నీరు వెళ్లక మొక్కజొన్న రాశులు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. కాగా సంగ్యాతండాతో పాటు బయ్యారంలో వర్షానికి దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయాధికారి రాంజీ శుక్రవారం పరిశీలించారు. జరిగిన నష్టం వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. నేలమట్టమైన వరిపంట గార్ల: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షంతో వరిపంటలు నేలమట్టమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని అంకన్నగూడెం గ్రామానికి చెందిన రైతు కల్తీ శ్రీను మూడు ఎకరాల వరిపంట నేలమట్టమైంది. వరిపంట దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా నాయకుడు కందునూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగమాగం చిన్నగూడూరు: మండల వ్యాప్తంగా గురువారం రాత్రి అకాల వర్షం కురిసింది. అకాల వర్షంతో రైతన్నలు ఆగమాగమయ్యారు. కల్లాల్లో ఆరబెట్టిన పంటను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిర్చి పంట తడవకుండా టార్పాలిన్లు కప్పారు. నీళ్లలో మునిగిన మొక్కజొన్నలతో రైతులకు తీవ్రనష్టం -
టీకాల పంపిణీకి యాక్షన్ ప్లాన్
● డీఎంహెచ్ఓ రవి నెహ్రూసెంటర్: యాక్షన్‌ప్లాన్ ద్వారా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేయాలని డీఎంహెచ్ఓ రవి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో మైక్రో యాక్షన్ప్లాన్పై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు టీకాలపై వివరించాలన్నారు. ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఈ నెల 7నుంచి పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడీలో ఉన్న పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి లక్ష్మీనారాయణ, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ కుమార్, డెమో ప్రసాద్, ఎస్‌యూఓ శ్రీనివాస్, హెచ్ఈ శారద, గీత, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేయాలి
కురవి: ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం సీరోలు మండలం చింతపల్లి గ్రామంలో జై బాపు..జై భీమ్...జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం అనేక హక్కులను కల్పించిందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. దానిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వస్తుందన్నారు. పేద ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేట్‌శక్తుల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, కాంగ్రెస్ సీరోలు మండల అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్‌రెడ్డి, జెర్రిపోతుల మహేశ్, కాలం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ -
ఉద్యోగ విరమణ సహజం: డీఎంహెచ్ఓ
తొర్రూరు: అంకితభావంతో విధులు నిర్వహిస్తే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ తెలిపారు. జిల్లా వైద్యాధికారిగా పని చేసి పదవీ విరమణ పొందిన గుండాల మురళీధర్‌ను శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ రవిరాథోడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు పదవీ విరమణ సహజమేనని, తదనంతరం సామాజిక సేవా కార్యక్రమాలు ఆరంభించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో జిల్లాలోని పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు మురళీధర్ కృషి చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్‌రాజు, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ నాగేశ్వర్రావు, వైద్యులు జ్వలిత, నందన, మీరాజ్, ప్రియాంక, ప్రసాద్, డీపీఎంఓ వనాకర్‌రెడ్డి, సిబ్బంది పురుషోత్తం, కేవీ రాజు పాల్గొన్నారు. -
సన్నబియ్యం ఘనత కేంద్ర ప్రభుత్వానిదే..
● బీజేపీ జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ శ్రీవర్ధన్‌రెడ్డి మహబూబాబాద్ అర్బన్: సన్న బియ్యం అందిస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని బీజేపీ జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ శ్రీవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తాము రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ప్రతీ ఒక్కరికి 5కిలోల బియ్యం కేంద్రం అందిస్తుందని, రాష్ట్రం కిలో మాత్రమే అందిస్తుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కమీషన్ల కోసం పనిచేస్తూ.. ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు, యువకులు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని కోరారు. ఈ నెల 6న బూత్‌స్థాయిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించి, ప్రతీ కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్‌సుందర్ శర్మ, జిల్లా మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒద్దిరాజు రాంచందర్‌రావు, చీకటి మహేశ్, మాజీ జెడ్పీటీసీ సంగీత, నాయకులు గడ్డం అశోక్, సత్యనారాయణ, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. నేడు బాబుజగ్జీవన్‌రామ్ జయంతి మహబూబాబాద్ అర్బన్: భారతదేశ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్‌రామ్ 118 జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9గంటలకు నిర్వహిస్తున్నుట్ల జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి నర్సింహారావు శుక్రవారం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ కుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, హాజరై విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. సన్న బియ్యం భోజనం పరిశీలన మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఈమేరకు శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సన్నబియ్యంతో వండిన భోజనాన్ని పరిశీలించారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారులు కొప్పుల కలమ్మ–సమ్మయ్య ఇంటికి వెళ్లి వారు ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన అన్నం తిన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారికి గులాబీలతో అర్చన హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎరుపు రంగు గులాబీపూలతో అమ్మవారికి అర్చన చేశారు. ఉదయం అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుష్పుల్ రైలును పునరుద్ధరించండి : ఎంపీ హన్మకొండ చౌరస్తా: వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు పుష్పుల్ రైలు సర్వీసును పునరుద్ధరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను ఎంపీ కావ్య కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఢిల్లీలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, దినసరి కూలీలు వెళ్తుంటారని, వారి అవసరాల దృష్ట్యా పుష్పుల్ రైలు సర్వీసు పునరుద్ధరించడంతోపాటు బోగీల సంఖ్య పెంచాలని కోరారు. -
ఎంజీఎం ఓపీ కౌంటర్లో పనిచేయని ప్రింటర్లు
ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక సమస్య రోగులను ఇబ్బంది పెడుతోంది. శుక్రవారం ఔట్ పేషెంట్ విభాగం అడ్మిట్ కార్డు కౌంటర్లో ప్రింటర్లు పనిచేయలేదు. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి క్యూలో బారులుదీరారు. ఉక్కపోతతో నరకం చూశారు. వారి ఇబ్బందిని చూసి సిబ్బంది గత్యంతరం లేక మాన్యువల్‌గా ఓపీ చిట్టీలు రాసి ఇచ్చారు. దీనిపై ఓ రోగి కుటుంబ సభ్యుడు సిబ్బందిని ప్రశ్నించగా ‘విషయం అధికారులకు చెప్పినా పట్టికోవడం లేదు.. మేం ఏం చేస్తామంటూ’ బదులిచ్చారు. -
అంకితభావంతో పనిచేయాలి
మహబూబాబాద్: అధికారులు అంకితభావంతో పని చేసి పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ అద్వైత్‌కుమార్ అధ్యక్షతన అభివృద్ధి, సంక్షేమపథకాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు మంజూరు చేయాలని, గ్రామాల్లో విద్యుత్, తాగు నీరు తదితర సమస్యలు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీర బ్రహ్మచారి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ నరేశ్, డీఎస్పీ తిరుపతిరావు, మానుకోట, తొర్రూరు ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీఈఓ రవీందర్ రెడ్డి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. అవగాహన కల్పించాలి.. నెహ్రూసెంటర్: సికిల్‌సెల్ ఎనిమియాపై ప్రజలకు అవగాహన కల్పించాలనిజాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో సికిల్‌సెల్ ఎనిమియాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో స్క్రీనింగ్ నిర్వహించి 12 కేసులను గుర్తించారని వారికి సరైన చికిత్స అందించాలన్నారు. కాగా తమకు వేతనాలు పెంచి ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,ఈఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్‌కు ఆశకార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటాలి.. మహబూబాబాద్ రూరల్: ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమాన్ని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లా అటవీశాఖ అధికారి విశాల్‌తో కలిసి హుస్సేన్‌నాయక్ మొక్కలు నాటారు. ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి గూడూరు: అధికారులు మారుమూల ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ అన్నారు. మండలంలోని మట్టెవాడ శివారు నేలవంచ గ్రామాన్ని శుక్రవారం పలు శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ -
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులు పొందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్, ఏఐ పాఠాలు బోధిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలని, మధ్యాహ్న భోజనంలో లోపాలను తొలగించి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు పరిశీలించాలన్నారు. చదువుతో పాటు అన్నిరంగాల్లో ముందుండే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ అప్పారావు, ఏఎం ఆజాద్‌చంద్రశేఖర్, ఆర్పీలు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి -
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులు పొందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్, ఏఐ పాఠాలు బోధిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలని, మధ్యాహ్న భోజనంలో లోపాలను తొలగించి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు పరిశీలించాలన్నారు. చదువుతో పాటు అన్నిరంగాల్లో ముందుండే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ అప్పారావు, ఏఎం ఆజాద్‌చంద్రశేఖర్, ఆర్పీలు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి -
ఉద్యోగ విరమణ సహజం: డీఎంహెచ్ఓ
తొర్రూరు: అంకితభావంతో విధులు నిర్వహిస్తే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ తెలిపారు. జిల్లా వైద్యాధికారిగా పని చేసి పదవీ విరమణ పొందిన గుండాల మురళీధర్‌ను శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ రవిరాథోడ్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు పదవీ విరమణ సహజమేనని, తదనంతరం సామాజిక సేవా కార్యక్రమాలు ఆరంభించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో జిల్లాలోని పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు మురళీధర్ కృషి చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్‌రాజు, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ నాగేశ్వర్రావు, వైద్యులు జ్వలిత, నందన, మీరాజ్, ప్రియాంక, ప్రసాద్, డీపీఎంఓ వనాకర్‌రెడ్డి, సిబ్బంది పురుషోత్తం, కేవీ రాజు పాల్గొన్నారు. -
8వ తేదీ నుంచి 12 రైళ్ల సర్వీస్‌లు రద్దు
కాజీపేట రూరల్ : నార్త్ ఇండియా రాయ్‌పురా వ ద్ద గల కొటార్లియా (కేఆర్ఎల్) రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ రైల్వే వర్క్స్ కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే సికింద్రాబాద్–దర్బాంగా–సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌లను రద్దు చేసినట్లు కాజీపేట రై ల్వే అధికారులు గురువారం తెలిపారు. సికింద్రాబాద్–దర్బాంగా జంక్షన్ (17007) ఎ క్స్‌ప్రెస్ ఏప్రిల్ 8, 12, 15, 19, 22వ తేదీల్లో రద్దు చేసినట్లు, అదేవిధంగా దర్బాంగా జంక్షన్–సికింద్రాబాద్ (17008) ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 11, 15, 18, 22, 25వ తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే ఎంకై ్వరీ కౌంటర్ వద్ద డిస్ప్లే చేశారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో గత నెల 31వ తేదీన అర్ధరాత్రి హత్యకు గురైన పార్ధసారథి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు గురువారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జగదీశ్ కాలనీలో నివాసం ఉండే తాటి పార్ధసారథికి స్వప్నతో వివాహం జరగగా వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటపాక మండలం నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సొర్లాం వెంకట విద్యాసాగర్‌తో పరిచయం ఉంది. స్వప్న తల్లిగారి ఇంటి ప్రాంతంలో వెంకట విద్యాసాగర్ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండగా 2016లో స్వప్నకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పార్ధసారథికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పార్ధసారథి హెచ్చరించినా స్వప్న పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే పార్ధసారథికి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంజేపీలో హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగం రాగా గతేడాది ఫిబ్రవరి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల సమయంలో ఇంటికి వెళ్లి వస్తుండగా అప్పుడప్పుడు స్వప్నకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. అయితే వివాహేతర సంబంధానికి భర్త అడ్డు ఉన్నాడని, అతడిని ఎలాగైనా అంతమొందించాలని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్‌కు చెప్పింది. దీంతో వెంకట విద్యాసాగర్.. కొత్తగూడెం మండలానికి చెందిన తెలుగూరి వినయ్‌కుమార్, శివశంకర్, ఏటపాక మండలానికి చెందిన వంశీతో మాట్లాడి పార్ధసారథిని హత్య చేయించాలని పథకం రచించించారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులకు రూ. 5 లక్షలు సుపారీగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉగాది, రంజాన్ సెలవుల కోసం పార్ధసారథి కొత్తగూడెం వచ్చి మార్చి 31వ తేదీన సాయంత్రం దంతాలపల్లికి వెళ్లే క్రమంలో కొత్తగూడెంలో దంపతులు షాపింగ్ చేశారు. అనంతరం పార్ధసారథి తన బైక్‌పై బయలుదేరాక స్వప్న వెంటనే వెంకట విద్యాసాగర్‌కు ఫోన్ చేసి తన భర్త వెళ్తున్న సమాచారం తెలిపింది. దీంతో సుపారీ గ్యాంగ్ ఓ కారును అద్దెకు తీసుకుని పార్ధసారథిని వెంబడిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలోకి చేరుకోగానే అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పార్ధసారథి భార్య స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్‌ను అరెస్ట్ చేయగా వినయ్‌కుమార్, శివశంకర్, వంశీ పరారీలో ఉన్నారని తెలిపారు. అదే విధంగా ఏడాది క్రితం పార్ధసారథిపై దాడి జరిగిన ఘటనలో రెక్కీ నిర్వహించినట్లు కూసం లవరాజు అనే వ్యక్తిని గుర్తించగా అతడు కూడా పరారీలో ఉన్నారన్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు సర్వయ్య, సూర్యప్రకాశ్, హథీరాం,నరేందర్, రవికుమార్, ఎస్సైలు దీపిక, మురళీధర్, సతీశ్, ఐటీకోర్ పీసీ సుమన్, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందం సభ్యులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య పార్ధసారథి హత్యకు రూ.5లక్షల సుపారీ వివరాలు వెల్లడించిన ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్ -
ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్, బీజేపీ
ధర్మసాగర్: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నాయని, హెచ్‌సీయూ పక్కన ఉన్న భూములపై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ భూములు ప్రభుత్వానివేనని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని, రాష్ట్రానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదని, కేంద్ర మంత్రులు పరిపాలనపై కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సన్నబియ్యం కిలో రూ.40 అయితే రూ.30 కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రూ.10 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, కనీసం అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హెచ్‌సీయూ పక్కనున్న భూములు ప్రభుత్వానివేనని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు అదే నాయకులు ఆ భూములు ప్రభుత్వానివి కావని అనడంలో రాజకీయం తప్ప మరొకటి లేదని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడంతో ఇప్పుడు ఎక్కడికెళ్లినా అప్పు పుట్టే పరిస్థితి లేదని తెలిపారు. ఆ భూములను అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతో పేదల సంక్షేమానికి ఉపయోగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, ఎర్రబెల్లి శరత్,కూనూరు రాజు, రొండి రాజు, పాషా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మరోసారి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు మరోసారి నిర్వహించా లని పరీక్షల విభాగం అధికారులు నిర్ణయించారు. కొన్నినెలల క్రితం ఆయా సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాక మార్చి 4న ఫలితాలు వెల్లడించిన విష యం తెలిసిందే. ఉత్తీర్ణత శాతం తక్కువ వచ్చింది. ఈ క్రమంలో ఆయా సెమిస్టర్ల పరీక్షలు మరోసారి నిర్వహించాలని యూనివర్సిటీ అధికారుల దృష్టికి కొందరు తీసుకెళ్లారు. ఒక విధంగా దీనిని సప్లిమెంటరీ పరీక్షలు భావించవచ్చు. ఈ పరీక్షలను ఈ నెల మూడో వారం నుంచి నిర్వహించబోయే డిగ్రీ కో ర్సుల 2,4, 6 సెమిస్టర్ పరీక్షలతోపాటు జరపాలని నిర్ణయించారు. శుక్రవారం పరీక్ష ఫీజు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెమిస్టర్ విధానం వచ్చాక ఒకసారి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇచ్చాక వెంటనే మళ్లీ అవే పరీక్షలు నిర్వహించడం లేదు. యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారి మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల అవకాశం ఇస్తుండడంతో ఫెయిలైన విద్యార్ధులకు మంచి అవకాశంగా భావించవచ్చు. 21వేలకుపైగా రీవాల్యుయేషన్ దరఖాస్తులు డిగ్రీ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలపై రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు స్వీకరించగా 21వేలకుపైగా వచ్చాయి. ఈ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించేలోపే రీవాల్యుయేషన్ ఫలితాలు ఇస్తే బెనిఫిట్స్ పొందిన విద్యార్థులు మళ్లీ రాయాల్సిన అవసరం ఉండదనే విషయాన్ని గుర్తించి త్వరగా ఆ ప్రక్రియ పూర్తిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు. పీజీ కోర్సుల సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్డ బ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ తదితర పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) రెండో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 26వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సౌజన్య గురువారం తెలిపారు. ఈనెల 26, 28, 30, మే 2, 5, 7 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కేయూ వెబ్సైట్లో ఉందని వారు తెలిపారు. 1,3,5 సెమిస్టర్లలో ఫెయిలైన వారికి సదావకాశం నేడు పరీక్ష ఫీజు నోటిఫికేషన్ -
గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్ట్
వరంగల్ క్రైం : గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 16 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం హనుమకొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్‌లోని బైరాజీకివాడి వడోదరాకు చెందిన గౌతమ్ భరత్ సింధే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి రైళ్లలో సమోసాలు అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలో ముంబాయికి చెందిన అర్జున్.. గంజాయి సరఫరా చేస్తే రూ. 5వేలు ఇస్తానని చెప్పగా గౌతమ్ ఒప్పుకున్నాడు. దీంతో నవంబర్‌లో గౌతమ్ ఒడిశాలోని బాలుగం రైల్వే స్టేషన్ వెళ్లి అక్కడ నెహ్రూబాయ్ అనే వ్యక్తి ఇచ్చిన గంజాయి తీసుకుని ముంబైకి వెళ్లి అర్జున్‌కు అప్పగించగా రూ. 5 వేలు ఇచ్చాడు. నాలుగు రోజు క్రితం కూడా మళ్లీ ఇదే తరహాలో గౌతమ్ ఒడిశా వెళ్లి గంజాయి తీసుకుని కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. ఈ క్రమంలో రైలులో పోలీసులు గంజాయి గుర్తించి తనిఖీ చేస్తున్నారని తెలియడంతో బుధవారం వరంగల్ రైల్వేస్టేషన్లో రైలు దిగాడు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆటోలో హనుమకొండ బస్టాండ్‌కు చేరుకున్నాడు. ఇక్కడ ఎస్సై కిశోర్, సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అదుపులోకి తీసుకునే క్రమంలో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. దీంతో అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. 16 కిలోల సరుకు స్వాధీనం -
కాజీపేట రైల్వే సమస్యలను ప్రస్తావించిన ఎంపీ కావ్య
కాజీపేట రూరల్/హన్మకొండ చౌరస్తా : కాజీపేట లోకోరన్నింగ్ డిపో సిబ్బంది కొరత, పోస్టుల తరలింపుపై పార్లమెంట్లో గురువారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రస్తావించారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుపై అధికారులు పక్షపాత ధోరణి చూపుతున్నారని, లోకోరన్నింగ్ స్టాఫ్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ప్రస్తుతం కాజీపేటలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, దీంతో కాజీపేటలో ఉన్న ఉద్యోగులపై అధిక పనిభారం పడుతుందని ప్రస్తావించారు. రైల్వేమంత్రి సానుకూలంగా పరిశీలించి లోకోరన్నింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అదేవిధంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు వివిధ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై వినతిపత్రం అందజేశారు. భూపాలపల్లి పట్ణణానికి బైపాస్‌రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని నిడిగొండ, రఘునాథపల్లి, ఛాగల్లు, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాల్లో ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర మంత్రి వెంటనే డీపీఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎంపీ కావ్య తెలిపారు. నవోదయ విద్యాలయాలు ఇవ్వండి.. ● ఎంపీ పోరిక బలరాంనాయక్ మహబూబాబాద్ రూరల్ : తమ గిరిజన, ఆదివాసీలకు మూడు నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ కోరారు. పార్లమెంట్లో జీరో అవర్ సందర్భంగా ఎంపీ బలరాంనాయక్ గురువారం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు. తన నియోజకవర్గంలో గిరిజన, ఆదివాసీలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ ఉంటారని, వారు విద్యకు దూరంలో ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన, ఆదివాసీ ప్రజలు అభివృద్ధి చెందాలంటే చదువుకోవడం అవసరమన్నారు. అందుకు అనుగుణంగా మూడు కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసి గిరిజన, ఆదివాసీ, ఏజెన్సీ ప్రజలను చదువుకు దగ్గర చేసి వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. -
దశదినకర్మకు వెళ్తూ మృత్యుఒడికి..
జఫర్‌గఢ్: బంధువు దశదినకర్మకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరిన ఓ వృద్ధురాలు మృత్యుఒడికి చేరింది. రోడ్డుపై ఒక్కసారిగా కుక్కలు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జఫర్‌గఢ్ శివారు నల్లబండ సమీ పాన కల్వర్టు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పుగల్లులో తమ బంధువు గాదెపాక సాయ మ్మ దశదినకర్మకు హాజరయ్యేందుకు వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామానికి చెందిన జోగు ఉప్పలమ్మ (65), తన చెల్లి జోగు ఎల్లమ్మ, కంజర్ల దయాకర్ ద్విచక్రవాహనంపై బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో జఫర్‌గఢ్ శివారు నల్లబండ సమీపాన కల్వర్టు వద్ద కుక్కలు ఒక్కసారిగా అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి వాహనంపై నుంచి ముగ్గురు కిందపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే తీవ్రంగా గాయపడిన ఉప్పలమ్మ మృతి చెందింది. ఎల్లమ్మ, దయాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్‌చరణ్ తెలిపారు. ● రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి ● ఇద్దరికి గాయాలు ● నల్లబండ సమీపంలో ఘటన -
‘సహకార’ బలోపేతానికి కృషి చేయాలి
హన్మకొండ: ప్రాఽథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి అధ్యక్షులు, సీఈఓలు కృషి చేయాలని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. తెలంగాణ సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధారిత వ్యవస్థ, సహకార సంఘాల అభివృద్ధిపై రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు గురువారం ముగి శాయి. ఈ ముగింపు కార్యక్రమంలో మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల బలోపేతానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర సహకార శాఖ శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. సహకార సంఘాలు వ్యాపారాలు విస్తరించుకుని రైతు ఉత్పత్తిదారుల సంస్థల మాదిరి పని చేయాలని, తద్వారా లాభాలు గడించాలన్నారు. వరంగల్ డీసీసీబీ టర్నోవర్ రూ.870 కోట్ల నుంచి రూ. 2,229 కోట్లకు చేరుకుందన్నారు. నిరార్థక ఆస్తులను 7.55 శాతం నుంచి 2.21 శాతానికి తీసుకొచ్చామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 శాఖలు ఉండగా వీటిని 32కు పెంచి సేవలు విస్తరించామన్నారు. నందనం సొసైటీ ద్వారా సూపర్ మార్కెట్‌ను విజయవంతంగా నడుపుతున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ ఎండీ కె.వి.ఎన్.అన్నపూర్ణ, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, ఉమ్మడి జిల్లా సహకార అధికారులు సంజీవరెడ్డి, నీరజ, రాజేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వాల్యానాయక్, వెంకటేశ్వర్లు, సర్దార్ సింగ్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, డైరెక్టర్లు ఎన్నమనేని జగన్ మోహన్ రావు, కాకిరాల హరిప్రసాద్, యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. టీజీ కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
సన్నబియ్యం పంపిణీ షురూ..
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, ఆర్ఐలు, డీసీఎస్ఓ అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించా రు.ఈనెల జిల్లాకు 4,602 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించగా.. షాపులకు 2,913 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. కాగా సన్నబియ్యం తీసుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 558 షాపులు జిల్లా వ్యాప్తంగా 558 రేషన్ షాపులు ఉన్నాయి. కాగా, అన్ని రకాలు కలిపి మొత్తం 2,40,543 రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతీనెల 1నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాలి. ఒకవేళ సాంకేతిక సమస్య తలెత్తితే పంపిణీ గడువు పెంచాల్సి ఉంటుంది. ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు లేదా సాయంత్రం 4నుంచి రాత్రి 8గంటల వరకు పంపిణీ చేయాలని డీసీఎస్ఓ ప్రేమ్‌కుమార్ తెలిపారు. కాని జిల్లాలో మాత్రం డీలర్లు ఉదయం సమయంలో మాత్రమే ఇస్తున్నారు. ఐరీష్, బయో మెట్రిక్ విధానంతో పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు 4,602 మెట్రిక్ టన్నులు.. రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.కాగా జిల్లాలో 558 రేషన్ షాపులు ఉండగా వాటికి 4602.122 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కేటాయించారు. కాగా ఈనెల 1వ తేదీ వరకు 2913.809 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. ఇంకా 1,688.313 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. జిల్లాలో మానుకోట, కేసముద్రం, మరిపెడ, తొర్రూరు, కొత్తగూడ, గార్లలో మండల లెవల్ స్టాకింగ్ (ఎంఎల్ఎస్) గోదాంలు ఉన్నాయి. వాటి ద్వారా షాపులకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 40,000మెట్రిక్ టన్నుల సన్న బియ్యం నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవి సుమారు 9 నెలలు సరిపోతాయని పేర్కొన్నారు. షాపుల వద్ద క్యూ.. ఈనెల 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కాగా నియోజకవర్గాలు, మండలాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈనెల 2నుంచి అన్ని షాపుల్లో పంపిణీ ప్రారంభమైంది. కాగా షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ కడుతున్నారు. లబ్ధిదారులు కొన్ని సంవత్సరాలుగా షాపులకు వచ్చి దొడ్డు బియ్యం తీసుకెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. రేషన్ డీలర్లు ఫోన్ చేసిన కూడా పెద్దగా స్పందించలేదు. అయితే ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీతో షాపులు కళకళలాడుతున్నాయి. షాపుల వద్ద లబ్ధిదారుల క్యూ జిల్లాలో 2,40,543 రేషన్ కార్డులు ఈనెల 4,602 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు -
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuసాక్షి, మహబూబాబాద్: హత్యలు, హత్యాచారాలు, దొంగతనాలు జరిగినప్పుడు హడావుడి చేయడం కంటే.. అసలు నేరాలు జరగకుండా కట్టడి కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. ఈమేరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడితే.. కొత్త నేరస్తులను పట్టుకోవడం సులభతరమని ఆలోచించి ముందుకెళ్తోంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్స్టేషన్ల వారీగా పాత నేరస్తుల జాబితాను తయారు చేసి వారిపై ప్రత్యేక నిఘా పెడుతోంది. నేరాల అదుపునకు మద్దతు కొత్త సంఘటనలు జరిగినప్పుడల్లా పాత నేరస్తులను పిలిచి విచారిస్తారు. అలాగే కొత్త నేరస్తులను గుర్తించడంలో పాత నేరస్తుల సహకారం తీసుకునేందుకు పోలీసులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పాత నేరస్తులు రికార్డులు పరిశీలించడం, వేలి ముద్రలు సేకరించి ఏం జరిగింది అనేది తేల్చుకుంటారు. అయితే ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాత నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిలో మార్పునకు ప్రయత్నిస్తే.. మంచి ఫలితం ఉంటుందని పోలీసులు అంటున్నారు. వారి పరిశీలన వివరాలను రికార్డుగా నమోదు చేస్తే పాత, కొత్త నేరస్తులను గుర్తించడం సులభం అవుతుంది. అదే విధంగా పాత వారి సహకారంతో కొత్తవారిని పట్టుకోవడం, నేరాలు అదుపు చేసేందుకు దోహపడుతుంది. ఇందుకోసం నెలకోసారి పాత నేరస్తులను పిలవడం, అవసరమైతే వారి వద్దకు పోలీసులు వెళ్తున్నారు. పోలీసులు నిర్వహించి కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసి సమాజంలో గౌరవం పెంచేలా ప్రయత్నించాలని ఎస్పీ జిల్లాలోని డీఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మెసేజ్‌లు చేరవేసినట్లు తెలిసింది. మార్పు తెస్తే మంచి ఫలితం నేరం చేసిన వ్యక్తిని ఎప్పటికి నేరస్తుడిగా చూడడం సరికాదు. అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. సమాజంలో గౌరవం పెంచేలా చేస్తే తప్పకుండా మారుతాడు. ఇలా పాత నేరస్తుల్లో మార్పు వస్తే కొత్త నేరస్తులను పట్టుకోవడం సులభం. అందుకోసమే వారి జీవన విధానం ఎలా ఉంది.. మొదలైన వివరాలు సేకరించి అవసరమైతే కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాం. – సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ న్యూస్రీల్నేరాల అదుపునకు వినూత్న విధానం వారి కదలికలపై ప్రతీ నెల నివేదికలు కొత్త కేసులను సునాయాసంగా గుర్తించేందుకు అవకాశంజిల్లాలోని పాత నేరస్తుల వివరాలు సర్కిల్ డెకాయిట్లు కేడీలు అనుమానితులు రౌడీలు మొత్తం మహబూబాద్ టౌన్ 1 0 60 51 112మహబూబాబాద్(రూ) 3 1 186 96 286గూడూరు 0 2 72 36 110బయ్యారం 1 1 66 19 87తొర్రూరు 2 2 135 98 237మరిపెడ 6 0 93 72 171మొత్తం 13 6 612 372 1,003కదలికలపై ఆరా.. జిల్లా పరిధిలోనిమహబూబాబాద్, తొర్రూరు సబ్ డివిజన్లతో పాటు, ఐదు సర్కిళ్లు, 18 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు వివిధ నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేసిన సంఘటనల్లో 1003మంది పాత నేరస్తులను ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఇందుకోసం ప్రత్యేక జాబి తాను తయారు చేయడం, వారి సెల్ నంబర్లు, వారు ప్రస్తుతం చేస్తున్న పని, ఆర్థిక పరిస్థితి మొదలైన వివరాలు సేకరిస్తున్నారు. అన్నింటిని బేరీజు చేసి వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది.. రానిది గుర్తించి మారిన వారిని అభినందించడం, ఇంకా మార్పురాని వారిని పోలీసులు తరచూగా కలవడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. -
దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మహబూబాబాద్: తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, జీవిత చరిత్రను అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రశంసపత్రం అందుకున్న కమిషనర్మహబూబాబాద్: హైదరాబాద్‌లోని దాశరథి ఆడిటోరియం హాల్లో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి అధ్యక్షతన కమిషనర్లతో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అస్తి పన్ను వసూళ్లలో టాప్‌లో ఉన్న కమిషనర్లకు సీడీఎంఏ ప్రశంసపత్రాలు అందజేశారు. కాగా మానుకోట మున్సిపాలిటీలో 75శాతం పైగా ఆస్తి పన్ను వసూలు కాగా.. కమిషనర్ నోముల రవీందర్‌కు సీడీఎంఏ ప్రశంసపత్రం అందజేసి అభినందించారు. విద్యాప్రమాణాలు పాటించాలి● డీఈఓ రవీందర్‌రెడ్డి మహబూబాబాద్ అర్బన్: పదోన్నతులు పొందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యాప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నూతనంగా పదోన్నతులు పొందిన హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, పీడీలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. తరగతి గదిలో విద్యార్థులకు మంచి బోధన చే యాలని, న్యాయకత్వ లక్షణాలు నేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డిజిటల్ విద్య అందిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ఏఐ పాఠాల బోధనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండాలని, పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యార్థులకు చదవడం,రాయడం నేర్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ అ ప్పారావు,ఏఎంఓ చంద్రశేఖర్ ఆజాద్,ఎంఈ లు, శిక్షణ నిర్వాహకులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారికి కనకాంబరాలతో పుష్పార్చన హన్మకొండ కల్చ రల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం కనకాంబరాలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు కనకాంబరాలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి మండువా శేషగిరిరావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. ధర్మస్థాపన కోసమే రామావతారం హన్మకొండ కల్చరల్: ధర్మ స్థాపన కోసమే రామావతారమని వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదోరోజు లక్ష పుష్పార్చన నిర్వహించారు. గురువారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్ రుద్రాభిషేకం నిర్వహించారు. -
లబ్ధిదారులకు సన్నబియ్యం అందించాలి
దంతాలపల్లి: రేషన్ డీలర్లు లబ్ధిదారులకు సన్నబి య్యం అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. గురువారం మండలంలోని బీరిశెట్టిగూడెం గ్రామంలో రేషన్‌దుకాణంలో సన్నబియ్యం పంపిణీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన గ్రా మానికి ఎన్నిటన్నుల బియ్యం రావాలి..పూర్తిస్థాయిలో వచ్చాయా అనే విషయాలపై ఆరా తీశారు. అ నంతరం సంబంధితశాఖ అధికారులతో మాట్లాడు తూ..గ్రామాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన భోజనం అందించాలి.. మండల కేంద్రంలోని గిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ సందర్శించి పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకో వాలని తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రాజీవ్‌యువ వికాసం దరఖాస్తులపై ఆరా తీ శారు. తహసీల్దార్ కాటం చంద్ర రాజేశ్వర్, ఎంపీడీ ఓ వివేక్‌రామ్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఆర్ఐ నజీముద్దీన్, ఎంపీఓ అప్సర్ పాషా తదితరులు ఉన్నారు. పకడ్బందీగా పంపిణీ చేయాలి చిన్నగూడూరు: పకడ్బందీగా సన్నబియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం మండలంలోని జయ్యారం గ్రామంలో రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. బియ్యం నాణ్యతను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు.అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామారావు, తహసీల్దార్ మహబూబ్ అలీ, పౌరసరఫరాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
మహబూబాబాద్: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం సభ విజయవంతంపై మానుకోట నియోజకవర్గస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ.. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే మహాసభకు మానుకోట నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని, జన సమీకరణకు పాటుపడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని, ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ మహాసభతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోవడంతో పాటు ఆ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉందని, ఆ భూములను సీఎంరేవంత్‌రెడ్డి అమ్మడానికి చూడడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మానుకోట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, యాకూబ్‌రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత -
ఉపాధ్యాయులకు మెమోలు
కేసముద్రం: మండలంలోని బిచ్యానాయక్ తండా జీపీ పరిధిలోని రాజీవ్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు గురువారం ఆలస్యంగా వచ్చారు. దీంతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో కూర్చొని నిరీక్షిస్తుండగా గ్రామస్తులు ఎంఈఓ కాలేరు యాదగిరికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంఈఓ పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. కాగా ఉదయం 8గంటలలోపు రావాల్సి న ఉపాధ్యాయులు 8.30గంటల తర్వాత వచ్చినట్లు వెల్లడైందని తెలిపారు. కాగా డీఈఓ రవీందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు ఉపాధ్యాయులు పద్మశ్రీ, రాజుకు ఒకరోజు వేతనాన్ని నిలిపివేస్తూ సంజాయిషీ మెమో ఇచ్చినట్లు తెలిపారు. -
గిరిజనుల పక్షాన ఎల్‌హెచ్‌పీఎస్ పోరాటం
నెహ్రూసెంటర్: గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) పోరాడుతుందని ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ బోడ లక్ష్మణ్‌నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఆంగోత్ చందూలాల్ అధ్యక్షతన గురువారం సంఘ సమావేశం నిర్వహించారు. లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ.. తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని, 6నుంచి 10శాతం రిజర్వేషన్‌తో పాటు బంజారా భాషకు గుర్తింపు లభించిందన్నారు. లంబాడీలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అభివృద్ధి సాఽధించేలా ఎల్‌హెచ్‌పీఎస్ కృషి చేసిందన్నారు. తండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించేలా పోరాటాలు నిర్వహించాలని, ఎల్‌హెచ్‌పీఎస్ గిరిజనుల పక్షాన ఉద్యమాలకు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం బెల్లయ్యనాయక్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమావేశంలో భూక్య రాంమూర్తి, రమేశ్, మూడు రవినాయక్, అజ్మీరా శ్రీను, తేజావత్ మంగీలాల్, కున్సోత్ దేవేందర్, బోడ చందు, వీరన్న, బానోత్ పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్ర బంగారమే!
ఎటు చూసినా..వరంగల్: ఏనుమాములకు ఎర్ర బంగారం పోటెత్తింది. సీజన్ ఊపందుకోవడంతోపాటు వారాంతపు సెలవులు శని, ఆదివారం, ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కెట్ బుధవారం పునఃప్రారంభమైంది. దీంతో సుమారు 95వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. ఫలితంగా మార్కెట్లోని యార్డులతో పాటు బహిరంగ ప్రదేశాలు సైతం మిర్చి బస్తాలతో నిండిపోయాయి. కాగా, ఇంత పెద్ద మొత్తంలో మిర్చి రావడంతోనే ధరలను తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఒకే రోజు బస్తాలు రావడం.. ఎండలు పెరిగిపోవడంతో మార్కెట్లోని దడువాయిలు లాట్ ఐడీలు కొట్టడం, హమాలీ కార్మికులు కాంటాలు పెట్టడంలో జాప్యం జరుగుతోందని రైతులు వాపోతునా ్న రు. అన్ని రకాల మిర్చి రావడంతో ఘాటు పెరిగి కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్ల గొండ జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మిర్చి తరలివస్తోంది. ఎంట్రీలు లేక లెక్కల్లో తేడా.. గతంలో మార్కెట్లోకి వచ్చే ప్రతీ వాహనం, అందులోని బస్తాల వివరాలను గేటు వద్ద ఉన్న ఉద్యోగులు నమోదు చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. గేటు వద్ద ఎంట్రీ చేసే విధానాన్ని ఎత్తివేశారు. దీంతో ఎన్ని బస్తాలు వస్తున్నాయో సిబ్బంది, అధికారులకే తెలియాలి. ఈ విధానం వల్ల వచ్చిన బస్తాల్లో ఎన్ని జీరో అవుతున్నాయో అంతుచిక్కడం లేదు. రోజూ కనీసం 5వేలకు పైగా బస్తాలు జీరో జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వింటాకు రూ.5వేలు తక్కువ.. గతేడాది ధరలతో పోల్చుకుంటే ఈఏడాది తేజ, యూఎస్ 341, డీడీ, వండర్‌హాట్ తదితర రకాల మిర్చికి క్వింటాకు రూ.5వేలకు పైగా ధరలు తగ్గాయని రైతులు ఆరోపిస్తున్నారు. దిగుబడి తగ్గిందని బాధ పడుతుంటే ధరలు సైతం తగ్గడంతో పెట్టుబడులు రాని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి లక్ష బస్తాల రాక..ఎరుపు రంగు పులుముకున్న ఏనుమాముల యార్డులు సరుకు పెరిగింది.. ధర తగ్గింది ఎంట్రీలు లేక బస్తాల లెక్కల్లో తేడా -
రేణుకకు అశ్రునయనాలతో వీడ్కోలు
దేవరుప్పుల : దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు గుమ్ముడవెల్లి రేణుక అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం వద్ద సందర్శనార్థం రేణుక మృతదేహం ఉంచగా పలువురు ఘన నివాళులర్పించారు. ఉదయం 12. 33 నిమిషాలకు ప్రారంభమైన అంతిమయాత్ర సాయంత్రం 4.44 నిమిషాల వరకు కొనసాగింది. ఆట,పాట, డప్పుళ్లతో కడవెండి వీధులు దద్దరిల్లాయి. ఆదివాసీ ఐక్య వేదిక, అమరుల బంధుమిత్రులు తదితర కమిటీలు ‘ఆపరేషన్ కగార్’ సత్వరమే ఆపేయాలని ప్లెక్సీల ప్రదర్శనతో డిమాండ్ చేశాయి. ప్రజాసంఘాల ఘన నివాళి.. రేణుక మృతదేహానికి అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు పద్మ కుమారి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్, శాంతక్క, విరసం నాయకుడు పాణి, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు రవి చందర్, బి రమాదేవి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనురాధ, కళ, మొగిలిచర్ల భారతక్క, గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, ఉస్మానియ యూనివర్సిటీ నాయకులు పృథ్వీ, స్టాలిన్, డీటీఎఫ్ నాయకులు సుదర్శన్, ఇప్ప రాంరెడ్డి, మా భూమి సంధ్య, వేముల పుష్ప, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్వాహకురాలు పల్స నిర్మల, ప్రజాకళామండలి నుంచి రాజ నర్సింహ, జర్నలిస్టు నాయకులు ఎంవీ రమణ, స్నేహలత, వనజ, మలుపు బాల్‌రెడ్డి, గద్దర్ కొడుకు సూర్యం, వరవరరావు కూతుళ్లు అనల, సహజ, పవన, కటకం సతీశ్, సింగరేణి కార్మిక సంఖ్య నాయకుడు హుస్సేన్, తెలంగాణ యూత్ ఫెడరేషన్ నాయకుడు పనికెర మోహన్ రాజు, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, తెలంగాణ ఉద్యమకారులు సీఎల్ యాదగిరి, చెరుకు సుధాకర్, రెడ్‌ఫ్లాగ్ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ కన్నా నివాళులర్పించారు. బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి, పల్లాల నిలదీత.. రేణుక మృతదేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రేణుక సోదరుడు జీవీకె ప్రసాద్ తన చెల్లిని పాలకవర్గాలు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రదర్శనలో కలిసివచ్చే క్రమంలో బూటకపు ఎన్కౌంటర్లు, అణిచివేత మీ పాలనలో అనుభవించామని, ప్రస్తుతం బీజేపీ సర్కారు చేపడుతున్న ‘ఆపరేషన్ కగార్’పై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలని పలువురు నిలదీశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు గమనించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తాము వ్యతిరేకమని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. ఎరుపెక్కిన కడవెండి.. ప్రజాసంఘాలు, పార్టీ నేతల ఘన నివాళి కళాకారుల ఆటాపాటలతో దద్దరిల్లిన వీధులు నాలుగున్నర గంటలపాటు సాగిన అంతిమయాత్రప్రజా ఉద్యమకారులపై రాజ్యహింస కొనసాగింపు.. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కొనసాగుతున్న ప్రజా ఉద్యమకారులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిపక్షాలతో కలిసి రాజ్యహింస కొనసాగిస్తుందని పౌరహక్కుల సంఘం, ఎబీఎంసీ, విరసం రాష్ట్ర ప్రతినిధులు గడ్డం లక్ష్మణ్, పద్మకుమారీ, పాణి, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అన్నారు. రేణుక హత్యపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఆపరేషన్ కగార్’తో పాలకవర్గంచేపట్టే హంతక చర్యలను ప్రతిపక్షాలు నిలువరించే విషయం విస్మరిస్తే ప్రశ్నించే గొంతుకలు కనుమరుగువడమేగాక రాజ్యహింస హెచ్చుమీరుతుందని హెచ్చరించారు. -
ఆయిల్ రూపంలో గంజాయి సరఫరా..
జనగామ: ఏపీ నుంచి ఆయిల్ రూపంలో ఉన్న గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడిన ఘటన బుధవారం జిల్లా కేంద్రం నెహ్రూపార్కు ఏరియాలో చోటు చేసుకుంది. ఎస్సై భరత్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలానికి చెందిన ఏజెంట్లు సురేశ్, నవీన్ మధ్యవర్తుల ద్వారా గంజాయి ఆయిల్‌ను రవాణా చేస్తున్నారు. ఇదే మండలానికి చెందిన గాలి రాహుల్ గాంధీ, సుక్రిల్ లైకాన్ ఆశీష్ పేరుతో ఉన్న ఆయిల్ గంజాయి కవర్లను వెంట తీసుకుని వైజాగ్ నుంచి ఈస్ట్‌కోస్ట్ రైలులో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో రైలులో పోలీసులు తనిఖీ చేస్తున్నట్లు గుర్తించిన ఆ ఇద్దరు జనగామ రైల్వేస్టేషన్లో దిగి.. నెహ్రూపార్కు ఏరియాకు నడుచుకుంటూ బయలుదేరారు. జంక్షన్లో ఎస్సై భరత్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల ను తనిఖీ చేస్తుండగా, వారిని చూసి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వెంటనే పట్టుకున్నారు. తనిఖీ చేయగా, గంజాయితో తయారు చేసిన ఆయిల్ కవర్లను లభించాయి. దీని విలువ రూ.13.42 లక్షలు ఉంటుంది. చింతపల్లికి చెందిన ఏజెంట్లు సురేశ్, నవీన్ ద్వారా ఇద్దరు వ్యక్తులు రాహుల్‌గాంధీ, లైకాన్ రూ.8వేలకు మాట్లాడుకుని హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి ఇచ్చేందుకు వైజాగ్ నుంచి బయలుదేరినట్లు ఎస్సై తెలిపారు. ఈఘట నపై విచారణ జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు. జనగామలో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు రూ.13.42 లక్షల విలువైన సరుకు స్వాధీనం -
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
వరంగల్ క్రైం : సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. పోస్టల్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న ఓ మహిళ, నలుగురు విటులను అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లి గ్రామానికి చెందిన తిమ్మాపురం లలిత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పోస్టల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి రహస్యంగా సంవత్సర కాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు లలితతోపాటు విటులు జనగామకు చెందిన బంతిని అశోక్, బుక్క కరుణాకర్, ఘన్పూర్ మండలం మీదికొండకు చెందిన వడ్లకొండ రమేశ్, కాజీపేట విష్ణుపురికి చెందిన బొల్లి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి బాధిత మహిళలను కాపాడినట్లు తెలిపా రు. వీరి నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.2,450 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితులను సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ తెలిపారు. నిర్వాహకురాలు, విటుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: అటవీ ప్రాంతంలోని గొత్తికోయ గూడేల్లో నివసిస్తున్న గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సమ్మక్క,సారక్క కల్యాణ మండపంలో ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో జిల్లాలోని 84 గొత్తికోయ గిరిజనులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా గూడేలకు నీరు సరఫరా చేయడంతోపాటు త్వరలో బోర్లు వేయిస్తానన్నారు. అడవులను నరకకుండా కాపాడాలన్నారు. గొత్తికోయ గిరిజనుల్లో కొత్త మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం గొత్తికోయ గిరిజనులు మండలాల వారీగా తమ సమస్యలను మంత్రి సీతక్కకు వివరించారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్, పిల్లల ఉన్నత చదువు కోసం కుల ధ్రువీకరణ పత్రాలు, రోడ్లు, తదితర సౌకర్యాలు కల్పించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, సీఐలు రవీందర్, శంకర్, శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల ప్రత్యేకాధికారి రాంపతి, ఎంపీడీఓ సుమనవాణి, ఇన్చార్జ్ తహసీల్దార్ సురేశ్‌బాబు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
జాతర ఘర్షణ కేసులో 8 మంది అరెస్ట్
సంగెం: ఉగాది రోజు సంగెం మండలం గవిచర్లలోని గుండ బ్రహ్మయ్య జాతరలో జరిగిన ఘర్షణ కేసులో 8 మంది గుండేటి సునీల్, గుండేటి మహేందర్, కొమ్మాలు, రాజు, మెట్టుపల్లి భరత్, గుండేటి రాజ్‌కుమార్, మెట్టుపల్లి చిన్న భరత్, వెల్పుల సిద్ధును అరెస్ట్ చేసినట్లు మామునూరు ఏసీపీ బి. తిరుపతి తెలిపారు. మైనర్ నిందితుడు కార్తీక్ పరారీలో ఉన్నాడని ఏసీపీ చెప్పారు. బుధవారం రాత్రి సంగెం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల అరెస్ట్ చూపించి బన్ని మృతి కేసు వివరాలు వెల్లడించారు. గుండబ్రహ్మయ్య జాతరకు మండలంలోని కుంటపల్లికి చెందిన చిర్ర బన్ని(21) వెళ్లాడు. దేవాలయానికి కొద్ది దూరంలో బన్ని సిగరెట్ తాగుతుండగా గవిచర్లకు చెందిన వెల్పుల సిద్ధు కాస్త దూరంగా వెళ్లమనగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సిద్ధు.. సంగెం గ్రామానికి చెందిన తన మేనమామ గుండేటి సునీల్‌కు ఫోన్లో జరిగిన విషయం చెప్పాడు. దీంతో సునీల్‌తో పాటు మహేందర్, కొమ్మాలు, కార్తీక్, రాజు, భరత్, రాజ్‌కుమార్, చిన్న భరత్ హుటాహుటిన జాతర ప్రాంతానికి చేరుకున్నారు. సిద్ధుతో ఎందుకు గొడవ పడ్డావని బన్నిని విచక్షణారహితంగా కొట్టడంతో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు ధని ఫిర్యాదు మేరకు పర్వతగిరి సీఐ రాజగోపాల్ 9 మందిపై కేసు నమోదు చేశారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ వద్ద గల మామిడి తోటలో 8 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి ఆటో, రెండు బైక్‌లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని గురువారం రిమాండ్‌కు తరలిస్తామని ఏసీపీ తిరుపతి తెలిపారు. ఆటో, రెండు బైక్‌లు, 5 సెల్ఫోన్లు సీజ్ వివరాలు వెల్లడించిన మామునూరు ఏసీపీ -
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పరీక్షలు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈనెల 26 నుంచి వచ్చే నెల 3 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని దానికి తగ్గట్లు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దన్నారు. ఈ సమావేశంలో డీఈఓ రవీందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, అధికారులు పాల్గొన్నారు. బిహార్ గవర్నర్‌ను కలిసిన మౌంటైనర్ యశ్వంత్ మరిపెడ రూరల్: మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను బీహార్ రాజ్‌భవన్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యశ్వంత్ తన ఫొటో ఫ్రేమ్‌ను గవర్నర్‌కు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తనవంతు ప్రోత్సాహం, ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని, విజయం వైపు దూసుకెళ్లాలని యశ్వంత్‌కు గవర్నర్ సూచించారు. ప్రపంచ రి కార్డు స్థాయి పర్వతాలను పట్టుదలతో అధిరోహించి భారత దేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటాలని గవర్నర్ కోరారు. బీజేపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలిమహబూబాబాద్ అర్బన్: ఈ నెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ కేంద్ర ప్రభుత్వం ద్వా రానే వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం బూట కపు మాటలు చెబుతుందన్నారు. రాజీవ్ యు వ వికాసంలో ఎమ్మెల్యేల జోక్యం ఎందుకన్నా రు. ప్రతీ ఒక్క నిరుద్యోగికి వెంటనే పథకంలో భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు క్యాచవల్ శ్యామ్‌సుందర్ శర్మ, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటీ మహేష్ గౌడ్, నాయకులు పొద్దిల నరిసింహరెడ్డి, పల్లె సందీప్‌గౌడ్, సందీప్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ ఆదాయం రూ.8.08కోట్లుమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ క్రయవిక్రయాలు ఆదాయం 2024–25 సంవత్సరానికి సంబంధించి రూ.8.08 కోట్లు వచ్చిందని ఏఎంసీ చైర్మన్ సుధాకర్ నాయక్ అన్నారు. బుధవారం ఆయన మార్కెట్ ఆదాయ వివరాలను వెల్ల డించారు. ప్రభుత్వం 2024–25 సంవత్సరాని కి మార్కెట్ ఫీజు లక్ష్యం రూ.7,94,23,000 నిర్ధేశించిందని, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం కంటే ఈ ఏడాది అదనంగా మార్కెట్ ఫీజు రూ.14,02,658 వసూలు అయ్యాయని తెలిపారు. మార్చి 31వ తేదీతో ముగిసిన ఆదాయ రాబడికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిపిన క్రయవిక్రయాలు (గంజ్) ద్వారా రూ.4,72,32,679 వచ్చిందన్నారు. మిల్లుల (డైరెక్ట్) వద్ద జరిగిన క్రయవిక్రయాల నుంచి రూ.49,07,984 ఆదాయం వచ్చిందని, చెక్ పోస్టు ద్వారా రూ.2,21,761 ఆదాయం వచ్చిందని, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలైన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లు, పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏ సెర్ప్, సహకార శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు జరిపిన ధాన్యం కొనుగోళ్ల ద్వారా రూ.2,84,63,246 ఆదాయం వచ్చిందన్నారు. మొత్తంగా రూ.8,08,25,658 ఆదాయం సమకూరిందన్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి వ్యవసాయం మార్కె ట్ ఖాతాకు సంబంధించి ఖజానా (ట్రెజరీ) నిల్వ రూ.12,97,95,527 ఉందన్నారు. -
మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 10,516 బస్తాల మక్కలు బుధవారం అమ్మకానికి వచ్చాయి. దీంతో షెడ్లు మక్కల రాశులతో నిండిపోయాయి. ఈ సీజన్లో అత్యధికంగా మక్కలు అమ్మకానికి రావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. క్వింటాకు గరిష్ట ధర రూ.2,224, కనిష్ట ధర రూ.2,071లు పలికినట్లు తెలిపారు. మానుకోట మార్కెట్‌కు 6,997 బస్తాలు.. మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 6,997 బస్తాల మక్కలు విక్రయం జరుగగా గరిష్ట ధర క్వింటాకు రూ.2,191, కనిష్ట ధర రూ.2,076 పలికిందని ఏ ఎంసీ చైర్మన్ సుధాకర్ బుధవారం తెలిపారు. -
తాగునీటి సమస్య ఉండొద్దు
మహబూబాబాద్: వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా సంబంఽధిత శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో తాగునీటి సరఫరా, రాజీవ్ యువ వికాసం, పెన్షన్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అందరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీర బ్రహ్మచారి, డీఆర్డీఏ పీడీ మధుసూదన్‌రాజు, జెడ్పీ ఈసీఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు దివ్యాంగులకు యూడీఐడీ (యూనిక్ డిసెబిలిటీ ఐడీ) నంబర్‌ను కేటాయించి స్మార్ట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏ ర్పాటు చేసిందన్నారు. వివరాలు ఆ పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలన్నారు. అప్లోడ్ చేసిన అనంతరం సదరం శిబిరం నిర్వహించే కేంద్రాల్లో దగ్గర ఉండేదాన్ని ఎంచుకోవాలన్నారు. డిజిటల్ సంతకంతో స్మార్ట్‌కార్డు పోస్టు ద్వారా ఇంటి చిరునామాకు పంపిస్తారన్నారు.కార్డులో ఐడీ నంబర్,దివ్యాంగుడి పే రు,వైకల్యశాతం,తదితర వివరాలు ఉంటాయన్నా రు. ఆ కార్డుతో రైళ్లు, బస్సు టికెట్లలో రాయితీలు, ఫించన్ తదితర ప్రయోజనాలు ఉంటాయన్నారు. కలెక్టరేట్లో సర్వాయి పాపన్న వర్ధంతి కలెక్టర్లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె వీర బ్రహ్మచారి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నర్సింహస్వామి, నాయకులు వెంకన్న, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ నాణ్యమైన భోజనం అందించాలి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ గార్లలోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీగార్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ వార్డెన్లను ఆదేశించారు. బుధవారం గార్లలోని ఆశ్రమ, కేజీబీ వీ పాఠశాలలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలోని కిచెన్ షెడ్, స్టోర్‌రూంలను పరి శీలించారు. వసతిగృహాల్లో నీటి సమస్య లే కుండా చూసుకోవాలన్నారు. టాయిలెట్లు, వాష్ రూంలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నా రు. అనంతరం కస్తూర్భాగాంధీ పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వార్షిక పరీక్షలు ఎలా రాసారని అడిగి తెలుసుకున్నారు. చదువుకుంటేనే భవిష్యత్‌లో ఉన్నత శిఖ రాలు అధిరోహించవచ్చని తెలిపారు. అయితే పాఠశాలలో గతంలో నిర్మించిన 16 వాష్‌రూమ్స్ శిథిలమయ్యాయని, కేవలం 6 మాత్రమే ఉన్నాయని, క్వార్టర్స్‌లో ఉండే ఉపాధ్యాయునుల జీపీ సిబ్బంది ఇంటి పన్ను కట్టాలని నోటీసులు ఇచ్చారని కేజీబీవీ సి బ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆ విషయాన్ని నేను చూసుకుంటానని కలెక్టర్ భ రోసా ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీ ల్దార్ సంజీవ, ఆర్ఐ స్వప్న, హెచ్ఎంలు జోగ య్య, ఉషారాణి, వార్డెన్ రాధిక పాల్గొన్నారు. -
నిధులు వెనక్కి!
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuసాక్షి, మహబూబాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపౌండ్ పనులకు మంజూరైన నిధులను సకాలంలో వినియోగించలేక పోయారు. గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులు ఖర్చు చేయక నీరస పడ్డారు. దీంతో గతంలో రాష్ట్రంలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న జిల్లా అమాంతం కిందికి పడిపోయింది. రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలోకి వెళ్లింది. ఇందుకు అధికారులే కారణమని చెబుతూ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు సిద్ధమయినట్లు తెలిసింది. పడిపోయిన పనిదినాలు.. ప్రతీసారి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి మించి పనిదినాలు నమోదు చేసే మానుకోట జిల్లా గడిచిన ఆర్థిక సంవత్సరంలో చతికిల పడింది. జిల్లాలో జాబ్‌కార్డులు 2.51 లక్షలు ఉండగా ఇందులో 4.55 లక్షల మంది కూలీల పేర్లు నమోదు చేశారు. అయితే ఇందులో 1.42 లక్షల జాబ్ కార్డుల్లోని 2.6 లక్షల మేరకే యాక్టివ్ కూలీలు ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గడిచిన ఏడాది 47 లక్షల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించింది. కానీ మార్చి 31వ తేదీ నాటికి కేవలం 45 లక్షల పనిదినాలు మాత్రమే చేయించగలిగారు. రూ.18.37కోట్లు వెనక్కి.. పనులు చేయాలి, పల్లెల రూపురేఖలు మార్చాలని అదనపు నిధుల కోసం ప్రయత్నించే జిల్లాలు ఉండగా ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులను కూడా సకాలంలో ఖర్చుచేయని దుస్థితిలో మానుకోట జిల్లా ఉంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే.. ఈ ఏడాది ఈజీఎస్ పనుల లెక్కల ప్రకారం కూలీలకు చెల్లించిన డబ్బులు (వేజ్) 60 శాతం రూ. 85.31 కోట్లు, మెటీరియల్ కాంపౌండ్ నిధులు 40 శాతం రూ. 56.87 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రూ. 36.40 కోట్లతో 726 సీసీరోడ్లు పనులు చేయాల్సి ఉండగా గడువు ముగిసే వరకు కేవలం 525 పనులు మాత్రమే చేశారు. అదేవిధంగా మిగిలిన నిధులతో గ్రామ పంచాయతీ భవనాలు, 16 అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపట్టాలి. కానీ వాటిల్లో సగానికి పైగా పనులు ముందుకు సాగలేదు. వీటితోపాటు మండలాల పరిధిలో చేపట్టే పశువుల పాకలు, కిచెన్ షెడ్లు, గొర్రెల పాకలు, చేపల చెరువులు, పౌల్ట్రీ ఫామ్స్ మొదలైన పనులు ముందుకు సాగలేదు. దీంతో జిల్లాకు మంజూరైన మెటీరియల్ కాంపౌండ్ నిధుల మొత్తం రూ. 56.87కోట్లకు గాను రూ. 38.50 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన రూ. 18.37కోట్లు వెనక్కి వెళ్లాయి. రాష్ట్రంలో సగటున వేజ్ కాంపౌండ్ నిధులు 39.46శాతం ఉండగా లక్ష్యానికి మించి 40.69 శాతంతో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉండగా 31.10 శాతంతో మహబూబాబాద్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆలస్యంగా పనులు మంజూరు.. సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు పదవిలో లేకపోవడంతో పనులు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు రాలేదు. ఆలస్యంగా పనులు మంజూరు కావడంతోపాటు, ఇసుక దొరకక పోవడంతో పనులు వేగంగా చేయలేకపోయాం. దీంతో సకాలంలో నిధులు ఖర్చు కాలేదు. – విద్యాసాగర్, ఈఈ పంచాయతీరాజ్జిల్లాలో జాబ్‌కార్డులు: 2.51 లక్షలు నమోదైన కూలీలు: 4.55 లక్షలు యాక్టివ్ జాబ్‌కార్డులు: 1.42 లక్షలు పనిచేస్తున్న కూలీలు: 2.6 లక్షలు గతఆర్థిక సంవత్సరంలో పనిదినాల లక్ష్యం : 47 లక్షలు పూర్తి చేసిన పనిదినాలు : 45 లక్షలు వేజ్ కాంపౌండ్ నిధులు : రూ. 85.31 కోట్లు మెటీరియల్ కాంపౌండ్ నిధులు : రూ. 56.87 కోట్లు వినియోగించిన మెటీరియల్ కాంపౌండ్ నిధులు : రూ. 38.50 కోట్లు వెనక్కి వెళ్లిన నిధులు : రూ. 18.37 కోట్లు నిధుల వినియోగంలో రాష్ట్రంలో జిల్లా స్థానం : 31న్యూస్రీల్గడువులోపు పూర్తికాని ఈజీఎస్ మెటీరియల్ పనులు గత ఆర్థిక సంవత్సరం నిధులు రూ.18.37 కోట్లు రిటర్న్ పనులు చేయించడంలో అధికారుల నిర్లక్ష్యం రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో మానుకోట ముందుకు రాని కాంట్రాక్టర్లు.. పనులు చేసేందుకు పోటీ పడే కాంట్రాక్టర్లు ఈసారి మాత్రం పనులు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రతీసారి ఇలాగే ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగచేసుకొనే వారు. పనులు చేసే కాంట్రాక్టర్లను పిలిపించి పనులు చేసేలా ఒపించేవారు. త్వరగా బిల్లులు ఇప్పిస్తామని నమ్మకం కుదిరేలా మాట్లాడి పనులు చేయించేవారు. కానీ ఈసారి జిల్లాలోని పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు ఆ దిశగా ప్రయత్నించలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లతోపాటు పనులు చేసేవారు కూడా వేగంగా పనులు చేయలేదు. ఈ పరిస్థితిలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇందుకు కారణమైన అధికారులపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి శాఖాపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. -
ముగిసిన ‘పది’ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్‌రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పది పరీక్షలు జరిగాయని, మొత్తం రెగ్యూలర్ విద్యార్థులు 8,190 మంది కాగా 8,183 మంది విద్యార్థులు హాజరైయ్యారన్నారు. పలు పరీక్ష కేంద్రాలను రాష్ట్ర, జిల్లా పరీక్షల పరిశీలకులు తనిఖీ చేశారన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయని, పరీక్షలకు సహకరించిన కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, సీఎస్ డీఈఓ, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, పోలీస్ అధికారులకు, వైద్యశాఖ, విద్యుత్‌శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పరీక్షల ఫలితాలు వెలువడుతాయని, సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల అధికారులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలన్నారు. -
టార్గెట్.. 2.50 లక్షల మంది
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : వరంగల్ వేదికగా ఈ నెల 27న బీఆర్ఎస్ మరోసారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించేందుకు బుధవారం అంకురార్పణ జరిగింది. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు తదితరులు భూమి పూజ చేశారు. అంతకుముందు మంగళవారం ఎర్రవెల్లిలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత కేసీఆర్.. సభావేదిక, జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. 10లక్షల మందికిపైగా బహిరంగసభ నిర్వహించాలని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి 2.50లక్షలమంది జనాన్ని సమీకరించాలని టార్గెట్ పెట్టారు. జనసమీకరణకు ఇన్‌చార్జ్‌లు.. కేసీఆర్ ఆదేశాలతో 2.50లక్షలమంది జనసమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధినేత.. సభా ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ముఖ్యనేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలకుర్తి, వర్ధన్నపేటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్గా వ్యవహరించనుండగా.. వరంగల్ పశ్చిమను మాజీ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌కు అప్పగించారు. వరంగల్ తూర్పును నన్నపునేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిలకు, భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు పెద్ది సుదర్శన్ రెడ్డిలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అదేవిధంగా జనగామ, స్టేషన్ ఘన్పూర్ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చూడనుండగా, పరకాలను చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్‌ను సత్యవతి రాథోడ్, శంకర్‌నాయక్‌లు, డోర్నకల్‌ను రెడ్యానాయక్, మాలోత్ కవితలకు అప్పగించారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర బాధ్యతలు నిర్వహించే హైదరాబాద్‌కు చెందిన పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు వరంగల్ నగరంలోనే మకాం వేయనున్నారు. నేటినుంచి మరింత వేగంగా పనులు.. సభకు మరో 24 రోజులే గడువు ఉండటంతో గురువారం నుంచి సభా కోసం చేపట్టే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు బహిరంగసభకు సిద్ధం చేసిన 1,213 ఎకరాల స్థలంలో.. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు, మరో మూడు, నాలుగు వందల ఎకరాలు కూడా సమీకరించనున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడిజిల్లానుంచి జనసమీకరణ జన సమీకరణకు ఇన్చార్జులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే కేసీఆర్‌తో భేటీ అయిన ముఖ్య నేతలు -
ప్రమాదవశాత్తు కారు దగ్ధం
మల్హర్ : ప్రమాదవశాత్తు ఓ కారు దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని కొయ్యూరు పీవీనగర్ అడవి సోమన్‌పల్లి మానేరు బ్రిడ్జి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. కొయ్యూరు ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. టీఎస్18సీ 2008 నంబర్ గల కారు భూపాలపల్లి నుంచి మంథని వైపునకు వెళ్తుంది. ఈక్రమంలో కొయ్యూరు పీవీనగర్ సమీపంలోని మానేరు బిడ్జ్రి వద్ద పొగలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు గమనించి కిందికి దిగారు. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వారు వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కాగా, కారులో ప్రయాణిస్తున్న నలుగురు పొగలు రావడం గమనించి కిందకి దిగడంతో పెనుప్రమాదం తప్పంది. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ● తప్పిన పెను ప్రమాదం.. ● మానేరు బ్రిడ్జి వద్ద ఘటన -
నక్సల్స్ ఉద్యమానికి బాట
కడవెండి పడమటి తోట.. దేవరుప్పుల : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విస్నూర్ దేశ్‌ముఖ్‌లను ఎదురించి భూమి.. భుక్తి.. బానిస బంధాల విముక్తి పొందిన కడవెండి ప్రజలు నిలువ నీడ కోసం చేసిన పడమటి తోట ఇళ్ల స్థలాల పోరాటం.. నక్సల్స్ ఉద్యమానికి బాట అయ్యింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో 1980లో వామపక్ష పార్టీల నేతృత్వంలో స్థానిక భూస్వామి అస్నాల రాజయ్యకు చెందిన పడమటి తోటలో బీసీ సామాజికవర్గ పేదలు గుడిసెలు వేశారు. ఈ పోరాటానికి తొలుత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నల్లా నర్సింహులు నేతృత్వం వహించినప్పటీకీ సఫలీకృతం కాలేదు. ఈ తరుణంలో కొత్తగా ఆవిర్భవించిన సీపీఐ(ఎంఎల్) నాయకుడు అంజాజీ నేతృత్వం వహించారు. ఈ తరుణంలోనూ సదరు భూస్వామి ఎస్సీ, ఎస్టీలను పురమాయించి ఈ పోరాటానికి చెక్ పెట్టేందుకు యత్నించారు. దీంతో భూపోరాటం నిర్వీర్యమయ్యే క్రమంలో 1982లో రాడికల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో వేసవిలో పల్లె క్యాంపెయిన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటికే ‘లా’ విద్యనభ్యసిస్తున్న ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డి నివాసిత భూపోరాట విజయం కోసం ఆర్ఎస్యూ పక్షాన పావులు కదిపారు. ఎస్సీ, ఎస్టీలను చైతన్య పరుచడంతో పడమటి తోట పోరాటానికి వారు సంఘీభావం పలికారు. దీంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ విషయంలో అనేక మందిపై కేసులు నమోదైనా పోరాటం తగ్గలేదు. దీంతో భూ యజమాని దిగొచ్చి కేసులు ఉపసంహరించుకున్నా రు. నల్లా నర్సింహులు ఉద్యమ స్ఫూర్తితో అతడి తమ్ముడు నల్ల మల్లయ్య, బావమరిది బిట్ల ముత్తయ్య పడమటి తోట సాఽధించుకునేందుకు దోహదపడ్డారని పురుషోత్తం రెడ్డి పేర్కొనడం గమనార్హం. పీపుల్స్‌వార్ పార్టీ నిర్మాణంలో గ్రామస్తుల కీలక పాత్ర.. ఐక్యంగా నిలువ నీడలేని పేదలకు స్థలాల సాధనతో స్థానిక స్టూడెంట్స్, యువత రాడికల్ సంఘం వైపు ఆకర్షితులై రాష్ట్ర ఉత్తర తెలంగాణ స్థాయి పీపుల్స్‌వార్ పార్టీ నిర్మాణంలో గ్రామస్తులు కీలక పాత్ర పోషించేలా ఎదిగారు. ఈ క్రమంలోనే పీపుల్స్ వార్ నాయకులు తుపాకులు చేతబూని సింగిల్ ఆర్గనైజర్ వ్యవస్థ విస్తరించే క్రమంలో ఇళ్ల స్థలాల పోరాట నేపథ్యంలో జనశక్తి, పీపుల్స్‌వార్ మధ్య వైరుధ్యం పెరిగింది. దీంతో ఆధిపత్యం కోసం పురుషోత్తంరెడ్డి అలియాస్ ఎపీకి బదులు పీపుల్స్ వార్‌కు సహకరిస్తున్నాడనే కారణంతో సీతారాంపురంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఎర్రంరెడ్డి సోమిరెడ్డిని జనశక్తి నక్సల్స్ కాల్చి చంపారు. ఈ ఘటనతో పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైన క్రమంలోనే పురుషోత్తం రెడ్డి వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా, అతడి సోదరుడు ఎర్రంరెడ్డి సంతోశ్‌రెడ్డి ఉస్మానియా విద్యాలయం వేదికగా కొండపల్లి సీతారామయ్య, వరవరరావు ఆధ్వర్యంలో పీపుల్స్‌వార్‌లో పూర్తిస్థాయిలో చేరి పార్టీలో కీలక భూమిక పోషించారు. అప్పట్లో ఇదే గ్రామంలో చారుముజుందార్ వర్ధంతి సభతో నక్సల్స్ ఉద్యమం బలపడింది. ఈ తరుణంలో పీపుల్స్ వార్ పార్టీ, అనుబంధ ప్రజానాట్య మండలి విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనేక మంది పనిచేశారు. ఎట్టకేలకు ఐదు దశాబ్దాల నక్సల్స్ ఉద్యమ నేపఽథ్యంలో ఈ గ్రామం నుంచి సంతోశ్‌రెడ్డి అలియాస్ మహేశ్, పైండ్ల వెంకటరమణ, గుమ్ముడవెల్లి రేణుక, పెద్ది శ్రీను, జనశక్తి నేత పెద్ది యాదగిరి ఇతర ప్రాంతాల్లో ఎన్కౌంటర్ పేరిట హతమవడం కొసమెరుపు. రాడికల్ స్టూడెంట్స్ పల్లె క్యాంపెయిన్లతో చైతన్యం సామాజిక వైరుధ్యాలను అధిగమిస్తూ ఐక్యతారాగం పోరాట ఫలితంగా నక్సల్స్బరి వైపు అడుగులు కడవెండి మదిలో అమరుల పోరాట స్మృతులు -
కడవెండికి చేరిన రేణుక మృతదేహం
దేవరుప్పుల: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ఎన్కౌంటర్లో అసువులు బాసిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు గుమ్ముడవెల్లి రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి మృతదేహం మంగళవారం అర్ధరాత్రి 12.45 గంటలకు ఆమె స్వగ్రామం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చేరింది. బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, దంతెవాడ నుంచి రేణుక మృతదేహాన్ని ఆమె సోదరులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్ స్వగ్రామం తీసుకురాగా గ్రామస్తులు, బంధు, మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మూడు దశాబ్దాల క్రితం ఊరు విడిచి అడవి బాటపట్టిన రేణుక విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు జయమ్మ, సోమయ్య గుండెలవిసేలా రోదించారు. పెద్దనాన్న లక్ష్మీనర్సు ఇంటి వేదికగా దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం వద్ద ప్రజల సందర్శనార్థం రేణుక మృతదేహం ఉంచారు. ఈ సందర్భంగా మాజీ మావోయిస్టులు గాదె ఇన్నయ్య, గాజర్ల అశోక్, తెలంగాణ రెడ్‌ప్లాగ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రాజేష్ ఖన్నా, ఓయూ జేఏసీ నాయకుడు ఇప్ప పృథ్వీరెడ్డి.. రేణుక మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారు వేర్వేరుగా మాట్లాడుతూ అనారోగ్యంతో నిరాయుధంగా పట్టుబడిన రేణుకను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని ఆరోపించారు. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లకు పాలకవర్గాలు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. నేడు అంత్యక్రియలు బంధు, మిత్రులు, మాజీల ఘన నివాళి -
వరి పంట ఎండిందనే మనస్తాపంతో ..
బచ్చన్నపేట : ఒక పక్క కూతురు పెళ్లికి చేసిన అప్పు.. మరో పక్క భూగర్భజలాలు అడుగంటి బోరు నుంచి సరిగా నీరు రాకపోవడంతో ఎండిన ఎకరం వరి పంట.. ఈ కారణాలతో మనోవేదనకు గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎస్కే హమీద్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఒగ్గు మహేశ్ (42) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం అప్పు చేసి కూతురు వివాహం చేశాడు. ఇటీవల తనకున్న ఒక ఎకరం భూమిలో వరి పంట సాగు చేశాడు. అయితే భూగర్భ జలాలు అడుగంటి బోరు సరిగా నీరు పోయకపోవడంతో ఆ పంట ఎండిపోయింది. దీంతో కూతురు పెళ్లికి చేసిన అప్పు ఎలా తీర్చాలని, వరి పంట కూడా ఎండిపోయిందని మనోవేదనకు గురైన మహేశ్ గత నెల 29వ తేదీన తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హమీద్ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ● ఆత్మహత్యకు యత్నించిన రైతు ● చికిత్స పొందుతూ మృతి ● రామచంద్రాపురంలో ఘటన -
డేంజర్ జోన్ సమస్యలు పరిష్కరిస్తాం
మల్హర్: జెన్కో ఓపెన్‌కాస్ట్‌కు 500 మీటర్ల పరిధిలోని డేంజర్ జోన్లో ఉన్న ఇళ్ల సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును మంగళవారం సందర్శించారు. ఓపెన్‌కాస్ట్ మైన్ లోపల పర్యటించి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న పని తీరు, ఓపెన్‌కాస్ట్ వ్యూప్యాంట్ ద్వారా డేంజర్ జోన్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఏఎమ్మార్ క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులతో సమావేశం నిర్వహించారు. 2024–25లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఏఎమ్మార్ అధికారులను అడిగి తెలసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యం 25లక్షల మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేరుకోవడంపై వారిని అభినందించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. జెన్కో పరిధిలోని భూ నిర్వాసితులు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ పరిధిలోని ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామని, నిర్వాసితులు ఆందోళన చెందొద్దని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఎమ్మార్ ఎండీ మహేశ్‌రెడ్డి, సీఈఓ డీఎల్ఆర్కే ప్రసాద్, జెన్కో డైరెక్టర్లు లక్ష్మ య్య, కేటీపీపీ సీఈ శ్రీప్రకాశ్, జెన్కో ఏజెంట్ జీవన్‌కుమార్, జీఎం మోహన్‌రావు, అడిషనల్ కలెక్టర్ అశోకుమార్, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఏఎమ్మాఆర్ వైస్ ప్రెసిడెంట్లు విశ్వనాథ్‌రాజు, శ్రీధర్, ప్రాజెక్టు హెడ్ ప్రభాకర్‌రెడ్డి, జనరల్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా, జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియాకు పెద్ద తాడిచర్ల డేంజర్ జోన్‌లోని ఇళ్ల సమస్య పరిష్కరించాలని కోరుతూ నిర్వాసితులు తాండ్ర మల్లేశ్, ఇందారపు చంద్రయ్య, అశోక్‌రావు, రాజు, మొగిళి తదితరులు వినతిపత్రం అందజేశారు. జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా -
క్షేత్రస్థాయి పరిస్థితులపై విశ్లేషణాత్మకంగా..
1994లో తాను ఎదుర్కొన్న సంఘర్షణను బట్టి ‘మహిళలపై హింస–మండుటెండు గాయాలు’ రచన చేసింది. పత్రికల్లో బీడీ దమయంతి పేరిట సల్వాజుడుం విధ్వంసం తీరుపై ‘పచ్చని బతుకుల్లో కురుస్తున్న నిప్పులు’, ఆదివాసీ భూపోరాటాల విజయపథంలో ‘విముక్తి బాటలో నారాయణఖేడ్’, భూఆక్రమణలు చేపడుతూ వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ఆదివాసీ, దళితుల మధ్య పాలకుల చిచ్చు అంశాలపై మీడియా రూపంలో క్షేత్ర స్థాయిలో విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి మావోయిస్టు అగ్రనేత రామకృష్ణతో పర్యటన చేసింది. సింగన్ మడుగు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట అడవిలో ఆరు ఊర్లను తగులబెట్టిన నేపథ్యంపై ఆమె చేసిన రచనలు తుపాకీ తూటాల కంటే రెట్టింపులో పేలి ప్రజాచైతన్యానికి ఊపిరిలూదినట్లు చెబుతుంటారు. యుక్త వయసులో ఓ ఇంటి ఆవిడగా సంఘర్షణ పడి సమ సమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన ఉద్యమ కెరటం రేణుక ప్రస్థానం దంతెవాడ ఎన్‌కౌంటర్‌తో ముగిసినా మెట్లమీద మిడ్కో(మిణుగురు పువ్వు) పేరిట ఆమె రచనలు, సాహిత్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందని సాహిత్యాభిమానులు అంటున్నారు. -
అర్హులకు రేషన్ కార్డులు అందిస్తాం
మహబూబాబాద్ రూరల్: అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఇది నిరంతరాయంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో మంగళవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. లబ్ధిదారులకు ఆయన స్వయంగా బియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, నిరుపేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఆర్ఐ కృష్ణప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిట్టకంటి రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ భూక్య రామచందర్, మాజీ సర్పంచ్ ఇస్లావత్ బాలాజీ, భూక్య దళ్ సింగ్, గడిసందు అశోక్, రాంపిల్ల నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం -
అగ్గి.. అడవి బుగ్గి
అటవీ దహనాలకు పాల్పడితే చర్యలుఅటవీ దహనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మంటలు విస్తరించకుండా సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పశువుల కాపరులు, మోడెం కొట్టె కూలీలు అటవీ దహనాలకు కారకులుగా భావించి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వన్యప్రాణులు వేటకు గురికాకుండా సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు చేయిస్తున్నాం. – చంద్ర శేఖర్, సబ్ డీఎఫ్ఓ కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాలు అనగానే పచ్చని అడ వి, ఎత్తైన గుట్టలు, వాగులు, వంకలు, అహ్లాదకర వాతావరణం గుర్తుకువస్తుంది. కానీ వేసవిలో మా త్రం ఆ గ్రామాలు వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతాయి. ఎండాకాలంలో అడవి మొత్తం ఆకు రాల్చి మోడులా మారుతుంది. దీంతో ఎక్కడ చిన్న అగ్గి రవ్వ త గిలినా దావానలంలా విస్తరించి అడవినంతా ద హించి వేస్తుంది. ఫలితంగా అడవి అంతా మంట లు వ్యాపించి పొగ కమ్ముకుని కనిపిస్తుంది. అసలే భానుడి వేడికి తోడు కార్చిచు మంటలు అంఅంటుకోవడంతో ఇక్కడ వాతావరణం మిగతా ప్రాంతాలకంటే అధిక వేడిని కలిగి ఉంటుంది. మహబూ బాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూ డూ రు,బయ్యారం, వరంగల్‌జిల్లాలోని ఖానాపురం, ములుగు జిల్లాలోని తాడ్వాయి, ఏటూరునాగారం, మల్లంపల్లి మండలాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. అల్లాడుతున్న వన్యప్రాణులు వేసవి కాలం వచ్చిందంటే చాలు.. వన్య ప్రాణులు, పక్షులకు నీరు లభించడం చాలా కష్టం. దీనికి తోడు అడవులు కాలుతుండడంతో వాటి గూడు చెదిరిపోతుంది. పక్షులు అడవిలో ఉండలేక వేడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. మంటల నుంచి తప్పించుకుని వన్యప్రాణులు జ నావాసాల్లోకి, పంట పొలాల వద్దకు వచ్చి వేటగాళ్ల ఉచ్చుల్లో పడుతున్నాయి. దీంతో పాటు విలువైన ఆయుర్వేద మొక్కలు అంతరించిపోతున్నాయి. మంటలు ఆర్పడం సిబ్బందికి సవాలు అడవుల్లో మంటలు ఆర్పడం అటవీ శాఖ సిబ్బందికి సవాలుగా మారుతోంది. ప్రభుత్వం మంటలార్పేందుకు అధునాతన మిషన్లు, నిధులు సమకూర్చినా క్షేత్ర స్థాయిలో ఇబ్బందులే ఎదురవుతున్నాయి. రాత్రి పూట మంటలు అంటుకున్న సమయంలో ఆర్పడం సిబ్బందికి సాధ్యం కావడం లేదు. తెల్లవారే సరికి తీవ్ర నష్టం జరుగుతోంది. అడవుల్లో మంటలు విస్తరించకుండా వేసవికి ముందే కాలి బాటలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తీరా మంటలు అంటుకున్న తర్వాతే సిబ్బంది స్పందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అడవిలో మంటలకు తునికాకు కాంట్రాక్టర్లలే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తునికాకు మోడెం కొట్టకుండా అడవులకు నిప్పు పెడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.కార్చిచ్చుతో వేసవిలో వేడెక్కుతున్న ఏజెన్సీ గ్రామాలు ఎక్కడ చూసినా కాలుతున్న అడవి కమ్ముకుంటున్న పొగ..అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు, వన్యప్రాణులు -
రజతోత్సవ మహాసభపై సమీక్ష
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు లక్ష్మణ్‌రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి పాల్గొన్నారు. -
మూడు రాష్ట్రాల్లో తూటాలై పేలిన అక్షరాలు
బుధవారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోu● చట్టంపై పట్టుకోసం న్యాయ విద్య.. ● విప్లవ ప్రజాపోరాటాల చరిత్ర అక్షరీకరణ ● పలు విప్లవ పత్రికలకు సంపాదకత్వం దేవరుప్పుల: ప్రజా చైతన్యానికి ఊపిరిలూదిన జనగామ జిల్లా కడవెండిలో పుట్టిన గుమ్ముడవెల్లి రేణుక అదే పోరాట పంథాను ఎంచుకుని అడవిబాట పట్టింది. చిన్నతనంలోనే వివాహం, తదితర ఘటనలు ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. ఈనేపథ్యంలో చట్టంపై అవగాహన కోసం న్యాయ విద్యను అభ్యసించింది. ఆమె సోదరుడు ప్రసాద్ అలియాస్ ఉసెండి దండకారణ్యంలో పనిచేసేవాడు. ఈక్రమంలో పోలీసుల అత్యంత నిర్బంధాలను చవిచూసిన తండ్రి సోమయ్య.. కూతురు రేణుకకు యుక్త వయసు రాగానే ఉన్నత చదువులకు అవకాశం ఇవ్వకుండా ఓ వ్యక్తితో వివాహం చేశారు. దీంతో వారి దాంపత్య జీవితంలో పురుషాధిక్యత వంటి అంశాలతో కలహాలు వచ్చాయి. అనివార్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. యుక్తవయస్సు రాగానే తన ఆలోచనలకు విరుద్ధంగా పితృస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు, అజమాయిషీపై ఆమె తీవ్రంగా ఆ లోచించింది. ఈనేపథ్యంలోనే ఓయూలో దూరవిద్యలో డిగ్రీ చేసి చట్టంపై పట్టు కోసం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ చదివింది. ఎల్ఎల్బీ చదువుతున్న క్రమంలోనే.. రేణుక లా చదువుతున్న సమయంలో అప్పటికే ఉద్యమంలో ఉన్న పద్మక్క, సూర్యం పరిచయ మయ్యారు. దీంతో ఆమె ఆలోచనాత్మక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాసంఘాల్లో భాగస్వామ్యమవుతూ దండకారణ్యం బాట పట్టింది. వరుస ఎన్కౌంటర్లు, నిర్బంధ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ నిర్ణయంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాక్షేత్రంలో చోటుచేసుకున్న అనేక కీలక ఘటనలు, ఘ ట్టాలపై విశ్లేషణాత్మక అధ్యయనాలు చేసి పార్టీకి మా ర్గదర్శకాలు చేసింది. అజ్ఞాత జీవితాన్ని ఎదుర్కొంటూనే విప్లవ ప్రజాపోరాటాల చరిత్రను అక్షరీకరించింది. నక్సల్స్ తరఫున ప్రభాత్, మహిళా మార్గం, అవామి జంగ్, పీపుల్స్ మార్చ్, పోటియారో ఫోల్లో, సంఘర్షణ్, భూమ్కల్ సందేశ్, పితురీ వంటి విప్లవ పత్రికలకు సంపాదకత్వం వహించింది. తొలుత భాషాధార(బీడీ) ప్రాంతంలో పని చేసే క్రమంలో బీడీ దమయంతి పేరుతో రచనలు చేసింది.కడవెండి పడమటి తోట.. నక్సల్స్ ఉద్యమానికి బాట కడవెండికి చేరిన రేణుక మృతదేహం– వివరాలు 8లోu -
బియ్యం పంపిణీ పరిశీలన
కురవి: మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారురాలి వేలిముద్రను పరిశీలించారు. రికార్డులను తని ఖీ చేసి, రేషన్ బియ్యం సక్రమంగా అందించా లని ఆదేశించారు. అర్హులకు అన్యాయం చేయ వద్దని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సునీల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నేటినుంచి 11వరకు రైల్వేగేట్ మూసివేత గార్ల/డోర్నకల్: రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనుల దృష్ట్యా గార్ల–డోర్నకల్ మధ్యలోని రైల్వేగేటును బుధవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు. ఈ రహదారి గుండా ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్లే ఆర్టీసీ బ స్సులు, వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారుల గుండా ప్రయాణం సాగిస్తూ రైల్వేసిబ్బందికి సహకరించాలని వారు కోరారు. వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం మిర్చి బస్తాలతో కళకళలాడుతోంది. మార్చి 29నుంచి ఈ నెల 1వ తేదీ వరకు వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించగా బుధవారం నుంచి క్రయవిక్రయాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తుగా మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. సుమారు 8,500 బస్తాల మిర్చిరాగా 5,500 బస్తాలకు టోకెన్లు జారీ చేశామని, మిగిలిన మిర్చి బస్తాలకు కూడా టోకెన్లు ఇచ్చి కొనుగోళ్లు జరపనున్నట్లు ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. కాళేశ్వరంలో భక్తుల రద్దీ కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శని పూజలకు భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ముందుగా త్రివేణి సంమగ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
గ్రామపంచాయతీలే టాప్..
మహబూబాబాద్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 93శాతం పన్నులు వసూలు కాగా.. మున్సి పాలిటీల్లో 75 శాతం కూడా దాటలేదు. వందశాతం పన్నులు వసూలు చేయాలని సంబంధిత అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మున్సిపాలిటీలు 2023–24 ఆర్థిక సంవత్సరం కంటే 2024–25ఆర్థిక సంవత్సరం వసూళ్లలో వెనుకబడ్డాయి. ఈవిషయంలో ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ కార్యాలయాల పన్నులు పెండింగ్‌లోనే.. జిల్లాలో మానుకోట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. అయితే పాత నాలుగు మున్సిపాలిటీల ప్రభుత్వ కార్యాలయాల పన్నులు చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. డిమాండ్‌లో ప్రభుత్వ కార్యాలయాల పన్నులు కూడా ఉన్నాయని, దీంతో వాటి వల్ల కూడా వసూళ్లశాతం కొంతవరకు తగ్గిందని అంటున్నా రు. కార్యాలయాల పన్నుల చెల్లింపుల విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జీపీల్లో సరాసరి 93 శాతం.. జిల్లాలో ప్రస్తుతం 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పాత జీపీలు 461 ఉండగా ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కాగా ఐదు గ్రామాలను ఆ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో జీపీల సంఖ్య 456కు తగ్గింది. అనంతరం కొత్తగా 26 జీపీలు ఏర్పాటు చేయగా... సంఖ్య 482కు చేరింది. కాగా జిల్లా వ్యాప్తంగా జీపీల్లో సరాసరి 93శాతం పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఆరు మండలాల్లో వంద శాతం.. జిల్లాలో482 జీపీల్లో రూ.4,94,39,568డిమాండ్ ఉండగా.. రూ.4,59,93,854 వసూలు చేశారు. ఇంకా రూ.34,45,714 బ్యాలెన్స్ ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలోని 18 మండలాలకు గానూ చిన్నగూడూరు, డోర్నకల్, మరిపెడ, గంగారం, గార్ల, నర్సింహులపేట మండలాల్లో వందశాతం పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు. బయ్యారం, నెల్లికుదురు మండలాల్లో 98 శాతం, మానుకోట, ఇనుగుర్తి మండలాల్లో 97 శాతం పన్నులు వసూలు చేశారు. గూడూరు మండలంలో 73శాతం వసూలు కాగా.. జిల్లాలో చివరి స్థానంలో ఉంది. మున్సిపాలిటీల్లో పన్నుల వివరాలు మున్సిపాలిటీ డిమాండ్ వసూలైంది శాతం మానుకోట 5.28కోట్లు 3.80 కోట్లు 75 డోర్నకల్ 1.22 కోట్లు 88 లక్షలు 72 తొర్రూరు 3.20కోట్లు 2.38 కోట్లు 75 మరిపెడ 1.69 కోట్లు 1,14 కోట్లు 68 జిల్లాలోని జీపీల్లో 93 శాతం పన్నుల వసూలు మున్సిపాలిటీల్లో 75శాతం దాటని వైనం ముగిసిన గడువు.. ఫలించని అధికారుల ప్రయత్నాలు -
పోలీస్ కస్టడీకి రాజలింగమూర్తి హత్య నిందితులు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఫ్రిబవరి 19న జరిగిన నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య కేసు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ భూపాలపల్లి జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. రేణుకుంట్ల సంజీవ్, పింగిళి సీమంత్, మోరె కుమార్, దాసారపు కృష్ణ, కొత్త హరిబాబును నేటి(బుధవారం) నుంచి ఈ నెల 4వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి కోర్టు అ నుమతి ఇచ్చింది. హత్యకు సంబంధించిన మ రిన్ని వివరాలు, సమాచారం కోసం వీరిని భూ పాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. 32.750 కేజీల గంజాయి పట్టివేత ● ఇద్దరు ఒడిశా వాసుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్యవర్ధన్నపేట: వర్ధన్నపేట బస్టాండ్ సమీపం ఎస్బీఐ వద్ద 32.750 కేజీల గంజాయి పట్టుకుని ఇద్దరు ఒడిశా వాసులను అరెస్ట్ చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంగళవారం ఉదయం వర్ధన్నపేట బస్టాండ్ సమీపం ఎస్బీఐ వద్ద ఇద్దరు అనుమానస్పదంగా ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశాలోని గంజాం జిల్లా జ్యోతినగర్‌కు చెందిన సామ్సంగ్ దళ బెహరా, మరొకరు జ్యోతి నగర్ సురడకు చెందిన మార్తో రహేతోగా తెలిసింది. స్మగ్లర్ నయోని అనే మహిళ ద్వారా సామ్సంగ్ దళ బెహరా, మార్తో రహేతో గంజాయి రవాణా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ఇచ్చిన గంజాయి తీసుకుని ఒడిశాలోని చత్రాపూర్ వద్ద గత నెల 28వ తేదీన రాత్రి పూరి – తిరుపతి రైలు ఎక్కి 29న మధ్యాహ్నం విజయవాడ వద్ద దిగారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ– అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి సూరత్ వెళ్తున్న క్రమంలో వరంగల్ రైల్వే స్టేషన్లో పోలీసులు బోగీలు తనిఖీ చేస్తున్నారు. దీంతో బయపడి రైలు దిగి వరంగల్ బస్టాండ్ సమీపంలో రాత్రి గడిపారు. పోలీసుల భయంతో రెండు రోజులు వరంగల్‌లోనే గడిపిన అనంతరం మంగళవారం వర్ధన్నపేటకు చేరుకున్నారు. తిరిగి వరంగల్ వెళ్లడానికి బస్సు కోసం వర్ధన్నపేట ఎస్బీఐ ఎదుట వేచి చూస్తున్న సమయంలో వారిని అరెస్ట్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నర్సయ్య తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘటనా స్థలిని సందర్శించిన ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్ : ఓ గురుకులంలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ పి.సర్వయ్య కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన తాటి పార్ధసారథి (42) భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో నివాసముంటున్నాడు. 11 ఏళ్ల క్రితం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రేకపల్లే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వారికి పిల్ల లు భార్గవ్‌సాయి, పరమేశ్వరి ఉన్నారు. పార్ధసారథి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏడాది కాలంగా హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య స్వప్న, పిల్లలు భార్గవ్‌సాయి, పరమేశ్వరి భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో ఉంటున్నారు. పార్ధసారథి మాత్రం దంతాపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ సెలవు రోజుల్లో ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భద్రాచలం వెళ్లి సోమవారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరాడు. తాను వస్తున్నానని తన గది యజమానికి ఫోన్ చేసి ఇంటి గేటు వేయొద్దని చెప్పాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున బోరింగ్‌తండా సమీపంలోని మిరప చేనులో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానిక రైతులు గమనించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. దీంతో రూరల్ ఎస్సై వి.దీపిక, సీఐ పి.సర్వయ్య, డీఎస్పీ ఎన్.తిరుపతిరావు ఘటనా స్థలిని పరిశీలించి ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్‌కు సమాచారం ఇవ్వగా ఆయన హుటాహుటిన చేరకున్నారు. డాగ్‌స్క్వా డ్, ఫింగర్‌ప్రింట్స్, క్లూస్‌టీం బృందాలు వివరాలు సేకరించాయి. ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి సోదరి మద్దుల హేమవరలక్ష్మి, బావ శివప్రసాద్ బోరున విలపించారు. హేమవరలక్ష్మి మాట్లాడుతూ.. తన సోదరుడు పార్ధసారథిపై ఏడాది క్రితం దాడి జరిగిందని తెలిపారు. మరదలు స్వప్నకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఈ కారణంగానే తమ సోదరుడి హత్య జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, పోలీస్ స్టేషన్లో పార్ధసారథిని దుండగులు హత్య చేసి చంపారని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ రాజ్‌కుమార్.. పార్ధసారథి హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక, బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి, సీసీఎస్ సీఐ హథీరాం, ఇతర పోలీసుల అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కీలకం కానున్న హెల్మెట్.. పార్ధసారథి హత్య విషయంలో ఘటనా స్థలిలో లభ్యమైన హెల్మెట్ కీలకం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల రాకపోకలు, వాళ్లు వాడిన ద్విచక్రవాహనం ఆచూకీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో నిందితులు హత్య చేయడానికి వచ్చే ముందు ఆ వాహనం నడిపిన వ్యక్తి ధరించిన హెల్మెట్ తెలుపురంగులో ఉండగా, ఘటనా స్థలిలో లభించిన హెల్మెట్ కూడా అదే రంగులో ఉండడం గమనార్హం. పార్ధసారథి హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాచలం నుంచి హత్య జరిగిన ప్రాంతం వరకు రహదారుల వెంట ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. -
భానుడు
భగ్గుమంటున్న ● పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... ఉక్కపోత ● వడదెబ్బకు గురైతే అనారోగ్యమే ● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు నెహ్రూసెంటర్: జిల్లాలో రోజురోజుకూ ఎండల తీ వ్రత పెరుగుతోంది. ఉదయం 10గంటల తర్వా త ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణంలో తేమశాతం తగ్గి ఉక్కపోతగా ఉంటుంది. కాగా ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వేసవికాలంలో ప్రయాణాలు, దూర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. నీళ్లతోపాటు పండ్లరసాలు తీసుకుంటే మేలు.. ప్రజలు అత్యవసర పనుల మీదు బయటకు వెళ్లే ముందు నీరుతాగడంతో పాటు వెంట తీసుకెళ్తే మంచిది. పండ్ల రసాలు, సీజనల్ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని, వేసవికాలంలో కూల్‌డ్రింక్స్, మద్యం తాగొద్దని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. హీట్‌వేవ్‌కు గురైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. కాగా ఎండ తీవ్రతతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరి... వేసవికాలంలో పిల్లలు, వృద్ధులతో పాటు గర్భిణులు పలు జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఎండలో ఆటలు ఆడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. కాగా బయటకు వెళ్లేముందు పిల్లలకు కాటన్ దుస్తులు వేయడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించడం, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు అందించడం ద్వారా ఎండదెబ్బకు గురికాకుండా చూడవచ్చు. అలాగే వృద్ధులు, పిల్లలు తరచూ నీళ్లు తాగాలి. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. గర్భిణులు, బాలింతలు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే ఆస్పత్రులకు వెళ్లాలి. ముందురోజు వైద్యుడి అపాయింట్మెంట్ తీసుకుంటే బెటర్. విశ్రాంతి తీసుకోవడంతో పాటు తాగునీరు, పౌష్టికాహారం తీసుకోవాలి. ఎండదెబ్బకు గురైతే తల్లీబిడ్డకు ఇబ్బందులు ఎదురవుతాయి.రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. వేసవికాలం ప్రతి ఒక్కరూ ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. పండ్ల రసాలు, పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచింది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. – డాక్టర్ నవీన్, ఎండీవడదెబ్బకు గురైతే.. వడదెబ్బ తాకడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అనారోగ్యానికి గురవుతారు. దీనివల్ల అధిక శరీర ఉష్ణోగ్రత, తలనొప్పి, గందరగోళం, వికారం, వాంతులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు తెలుపుతున్నారు. -
పర్యాటకంతోనే అభివృద్ధి
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి, కందికొండ గ్రామంలోని కందగిరి పర్వతంపై ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు, భక్తులు కోరుతున్నారు. ఈమేరకు కురవి పెద్దచెరువును రిజర్వాయర్ చేయాలంటున్నారు. వీరభద్రస్వామి ఆలయం.. తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన వీరభద్రస్వామి ఆ లయం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది. మహా శివరాత్రి నుంచి 16 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పెద్ద చెరువులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. కాగా చెరువును రిజర్వాయర్ చేస్తే అందులో బోటింగ్‌తో పాటు తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం కురవిలో హరిత హోట ల్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. హామీ ఇచ్చి.. కురవి పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధి జరుగుతుంది. 2017లో అప్పటి మంత్రి హరీశ్‌రావు కురవిలో జరిగిన కాటమయ్య ఉత్సవంలో పాల్గొన్న సందర్భంగా చెరువును పరిశీలించి రిజర్వాయర్ చేస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారు. కాగా చెరువును రిజర్వాయర్ చేస్తే బహుళ ప్రయోజనం కలుగుతుంది. తిర్మలాపురం, నల్లెల్ల, బలపాల, చిలుకోడు, వెన్నారం వరకు చెరువు నీటిని సాగుకు ఉపయోగించుకోవచ్చు. అలాగే భూగర్భజలాలు పెరిగి బావుల కింద సాగు చేయవచ్చు. చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తే ఆలయానికి వచ్చే భక్తులు ఆనందంగా గడుపుతారు. ఆదాయం సమకూరుతుంది. కందగిరిపై రోప్‌వేతో లాభాలు.. కందికొండ గుట్టపైన కొలువైన లక్ష్మీనర్సింహస్వామి జాతర ఏటా కార్తీక పౌర్ణమిరోజు జరుగుతుంది. గుట్టపై ఉన్న లక్ష్మీనర్సింహస్వామి, గుట్ట కింద వేంకటేశ్వరస్వామి ఆలయాలు అభివృద్ధి జరగాలంటే గుట్టపైకి రోప్‌వేను నిర్మించాల్సిన అవసరం ఉంది. గుట్టపైకి వెళ్లడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం పైకి వెళ్లాల్సి ఉంటుంది. రోప్‌వే ఏర్పాటు చేస్తే భక్తుల సౌకర్యంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుంది. కాగా రెండు ఆలయాలను మంత్రులు పట్టించుకుని పర్యాటకాభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అసెంబ్లీలో కందికొండ గుట్ట, వీరభద్రస్వామి ఆలయం, పెద్ద చెరువు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు. కురవి ఆలయం, కందికొండ గుట్ట అభివృద్ధికి నిధులు అవసరం పర్యాటకంగా డెవలప్ చేస్తేనే మెరుగైన వసతులు భక్తులు, పర్యాటకుల రాకతో పెరగనున్న ఆదాయం రోప్ వే నిర్మించాలి.. కందగిరి పర్వతంపైకి వెళ్లేందుకు ప్రభుత్వం రోప్‌వే నిర్మించాలి. రోప్‌వే నిర్మాణంతో భక్తులందరూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. గుట్టపైకి వెళ్లేందుకు 45 ఏళ్లు దాటినవారు ఇబ్బంది పడుతున్నారు. రోప్‌వే నిర్మిస్తే ఆలయం అభివృద్ధి చెందుతుంది. –బి.హేమలత, కందికొండమినీ రిజర్వాయర్ చేయాలి కురవి పెద్ద చెరువును మినీ రిజర్వాయర్ చేస్తే పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుంది. రిజర్వాయర్‌తో అనేక లాభాలున్నాయి. రైతుల పంటల సాగుకు, తాగునీటికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం రిజర్వాయర్ చేసి బోటింగ్ ఏర్పాటు చేయాలి. –కరణం రాజన్న, కురవి -
జీజీహెచ్‌లో శిశువు మృతి
నెహ్రూసెంటర్ : మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నవజాత శిశువు మృతి చెందింది. అయితే ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం శనిగపురం శివారు భట్టుతండాకు చెందిన బానోత్ జయశ్రీకి రెండో కాన్పులో పురిటి నొప్పులు రాగా సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తెల్లవారుజామున 4 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేశారు. జయశ్రీ మగశిశువుకు జన్మనివ్వగా ఆ శిశువు మృతి చెందాడు. అయితే తీసుకొచ్చిన వెంటనే చేయకుండా 4 గంటల తర్వాత ఆపరేషన్ చేయడంతోనే శిశువు మృతి చెందాడని, దీనికి వైద్యులు నిర్లక్ష్యం కారణమని మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన.. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని, ఈ ఘటనలో వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గిరిజన సంఘాల నేతలు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. జయశ్రీ నాలుగు గంటల పాటు పురిటి నొప్పులతో బాధపడుతుందని చెప్పినా ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోలేదన్నారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందాడని ఆరోపించారు. టౌన్ సీఐ దేవేందర్ రాస్తారోకో వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన -
ఎల్ఆర్ఎస్.. 22శాతమే
సాక్షి, మహబూబాబాద్: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీ గడువు మార్చి 31తో ముగిసింది. అయితే ఈ వెసులుబాటుతో పెద్ద మొత్తంలో ఇంటి స్థలాల యజమానులు తరలివస్తారని, వారు చెల్లించే ఫీజులతో ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని భావించినా.. లక్ష్యం మాత్రం నెరవేరలేదు. మొత్తం 22 శాతం మందే తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఫీజులు చెల్లించారు. మిగిలిన వారిలో కొందరు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు. 22శాతం చెల్లింపు ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీ కల్పించి నెలరోజుల గడువు ఇచ్చారు. కాగా 2020 డిసెంబర్ 31 వరకు రూ.1,000 చెల్లించి రశీదు తీసుకున్న వారికే ఈ అవకాశం ఉంది. అయితే ఇందులో మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల పరిధిలో 26,001 మంది రూ.1,000 చెల్లించి రశీదు తీసుకున్నారు. కాగా ఇందులో ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 17,550 దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ చెల్లించుకునేందుకు అర్హత ఉందని అధికారులు చెప్పారు. దీంతో పై నాలుగు మున్సిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలోని 942 దరఖాస్తులు కలుపుకొని మొత్తం 18,492 మంది భూ యజమానులకు ఆయా మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు ఫోన్ల ద్వారా, ఫ్లెక్సీలు పెట్టి అవగాహన కల్పించారు. దీంతో ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 4,085 ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించారు. అంటే మొత్తం దరఖాస్తుల్లో 22.09శాతం మంది ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీని సద్వినియోగం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కాగా అధిక సంఖ్యలో ఆసక్తి చూపలేదని దీనిని బట్టి తెలుస్తోంది. ఐదు మున్సిపాలిటీల్లోని ఎల్ఆర్ఎస్ వివరాలు ముగిసిన రాయితీ గడువు మళ్లీ అవకాశం వస్తుందనే నమ్మకం ప్రభుత్వ నిర్ణయమే తరువాయిమళ్లీ అవకాశం కోసం ఎదురుచూపు.. గతంలో రూ.1,000 చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసందరఖాస్తు చేసిన వారితోపాటు.. కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం బఫర్ జోన్, చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలు, హోల్డ్‌లో పెట్టినవి, కోర్టుకేసులో ఉన్న ప్లాట్లతో పాటు కొన్ని సజావుగా ఉన్న వాటికి కూడా అన్లైన్లో చూపించకపోవడం, ఫీజులు తీసుకోకపోవడం, అన్ని చేసినా.. ప్రొసీడింగ్ రాక ఇబ్బందిపడి చివరకు వెనుతిరిగి వెళ్లినవారు కూడా ఉన్నారు. కాగా గడువు ముగియడంతో మరోసారి అవకాశం ఇవ్వాలని, ఎల్ఆర్ఎస్ కొత్త దరఖాస్తులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని.. తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు అంటున్నారు. మున్సిపాలిటీ అర్హత పొందిన ఫీజు మిగిలినవి దరఖాస్తులు చెల్లించినవిమహబూబాబాద్ 9,268 2, 533 6,735 తొర్రూరు 6,181 967 5,214 మరిపెడ 1,228 333 895 డోర్నకల్ 873 185 688 కేసముద్రం 942 67 875 మొత్తం 18,492 4,085 14,407 -
అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి
● వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహబూబాబాద్: రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువ మంది అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాజీవ్ యువవికాసం పథకంపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుందన్నారు. రుణం మాఫీ విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మున్సిపల్ పరిధి అయితే మున్సిపాలిటీ కార్యాలయంలో.. మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ కార్యాలయంలో పత్రాలు అందజేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వైభవంగా శివపార్వతుల కల్యాణం మార్వాడీల ‘ఘన్‌గోర్’ ఊరేగింపు మహబూబాబాద్ రూరల్: మార్వాడీలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఘన్‌గోర్ వేడుకల్లో భాగంగా శివపార్వతుల స్వరూపమైన గోరా, ఈసర్ (ఘన్‌గోర్) కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ మానుకోట పట్టణ వీధుల్లో ఘన్గోర్ల విగ్రహాలను ఊరేగించారు. వాటిని మహేశ్వరీభవన్లోని రాధాకృష్ణుల సన్నిధిలో ఏర్పాటు చేసి మార్వాడీ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతులిచ్చి, నైవేద్యాలు సమర్పించి పూజలు ఆచరించారు. ఈ పూజలతో వివాహం కానివారికి జరుగుతుందని, మహిళలు సుమంగళిగా ఉండేందుకు భగవంతుడు అనుగ్రహిస్తాడని తెలిపారు. భక్తులు ఉపవాసం ఉండి పూజలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సఖీ మండలి సభ్యులు చిన్నారులతో నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సంగీత్ విభావరిలో మహిళలు భక్తి గేయాలు ఆలపించారు. వేయిస్తంభాల ఆలయంలో సీతారాములకు పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీరామనవమి నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం రెండోరోజూ సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం, 121 మంది దంపతులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ప్రారంభం, శివ ప్రీతికరమైన సోమవారం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. కృష్ణయజుర్వేద పండితుడు గుదిమెల్ల విజయకుమారాచార్యులు ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి అనుష్టాన పూజలు, యాగశాలలో మహా సుదర్శనహోమం జరిపారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ అనిల్‌కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు. భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన హన్మకొండ కల్చరల్: వసంత నవరాత్ర ఉత్సవాల్లో భద్రకాళి దేవాలయంలో సోమవారం అమ్మవారికి పుష్పార్చన చేశారు. ఉదయం అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు తెల్లచామంతి పూలకు సంప్రోక్షణ చేసి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. -
‘గోరుబోలి’ భాష గుర్తింపు చరిత్రాత్మకం
మరిపెడ: కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల గోరుబోలి భాషను గుర్తించడం చరిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ఇటీవల అసెంబ్లీలో బంజారాల గోరుబోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం మరిపెడలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల చిత్రపటాలకు రాంచంద్రునాయక్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలు, దేశంలో 15 కోట్ల మంది బంజారాలు ఉన్నారని, గోరుబోలి భాషను గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మానుకోట మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి, నాయకులు వీసారపు శ్రీపాల్‌రెడ్డి, కొంపెల్లి సురేందర్‌రెడ్డి, గండి వీరభద్రం, లక్ష్మీనారాయణ, ఉపేందర్, కొండం దశరథ, బొడ్డు వెంకన్న, రవి, విజయ్, రవికాంత్, సురేశ్ ఉన్నారు. ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్ -
సఖి చెంతకు తల్లీబిడ్డ..
ఖిలా వరంగల్: మతిస్థిమితం కోల్పోయి నర్సంపేటలో రోడ్డుపై తిరుగుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ తల్లీబిడ్డను వరంగల్ సఖీ కేంద్రం అక్కున చేర్చుకుంది. వారిని క్షేమంగా భర్తకు అప్పగించింది. వివరాలిలా ఉన్నాయి. గత నెల 28న నర్సంపేటలో రెండు నెలల పాపతో ఓ మహిళ రోడ్డపై తిరుగుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు తల్లీబిడ్డను వరంగల్ సఖి కేంద్రానికి అప్పగించారు. ఇక్కడ ఆశ్రయం పొందే సమయాన సదరు మహిళ పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే కేంద్ర ఆదరణతో సదరు మహిళ తనది మధ్యప్రదేశ్ అని, తన పేరు గౌరీ అని, తదితర వివరాలు చెప్పింది. ఆ వివరాల ఆధారంగా భర్త సందీప్‌ను పిలిపించి అతడికి తల్లీబిడ్డను అప్పగించి సోమవారం మధ్యప్రదేశ్‌కు పంపించామని సఖి కేంద్రం నిర్వాహకురాలు శ్రీలత తెలిపారు. కాగా, తన భార్య రెండు నెలల చిన్నారిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి పదిరోజులు అవుతుందని సందీప్ తెలిపారు. ఈ సమయంలో పలుచోట్లు వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లీబిడ్డ చనిపోయారని ఆందోళన చెందామని కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తన భార్య, పాపను చేరదీసి అప్పగించిన సఖీ కేంద్రానికి సందీప్ కృతజ్ఞతలు తెలిపారు. అక్కున చేర్చుకుని భర్తకు అప్పగించిన వరంగల్ సఖి కేంద్రం కృతజ్ఞతలు తెలిపిన సందీప్ -
ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
స్టేషన్‌ఘన్‌పూర్: పండుగపూట విషాదం నెలకొంది. ట్రాక్టర్ కొనివ్వలేదనే కారణంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మండలంలోని సముద్రాల గ్రామంలో జరిగింది. సీఐ జి.వేణు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోదాసి బోసుకుమార్, లక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల పెద్ద కుమారుడు సంతోశ్(21) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ కొనిస్తే నడుపుకుంటూ బతుకుతానని తల్లిదండ్రులను అడిగాడు. అందుకు తల్లిదండ్రులు స్పందిస్తూ ప్రస్తుతం డబ్బులు లేవని, కొన్ని రోజుల తర్వాత చూద్దామని చెప్పడంతో వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రెకుడైన సంతోశ్ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోకి వెళ్లిన కొడుకు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే పక్కింటి వారి సహకారంతో తలుపులు తొలగించి లోపలికి వెళ్లి చూడగా సంతోశ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బోసుకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణు తెలిపారు. సముద్రాలలో ఘటన పండుగపూట విషాదం -
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి
న్యూశాయంపేట : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వెంటనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ) కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని మౌలానా అబ్దుల్ అజీజ్ ఈద్గా చింతల్, ఈద్గా ఖిలావరంగల్, ఈద్గా మట్టెవాడ, లష్కర్ సింగారం, హనుమకొండ, ఘనీఅబ్దుల్ అజీజ్ ఎల్బీనగర్ వరంగల్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రంజాన్ ( ఈద్–ఉల్ ఫితర్) నమాజ్ అనంతరం ఎస్ఐఓ కార్యకర్తలు ఫ్ల కార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. సవరణ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లి సమాజ హక్కులు దెబ్బతింటాయన్నారు. కాగా, నిరసనకు రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఐఓ కార్యకర్తల డిమాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన మద్దతు తెలిపిన మంత్రి కొండా సురేఖ -
టోల్గేట్ చార్జీల్లో మార్పులు
కురవి: కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్గేట్ల వద్ద సోమవారం అర్ధరాత్రి నుంచి చార్జీలను మార్పులు చేసింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లి టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించే వివిధ వాహనాల ధరల్లో మార్పులు ఇలా ఉన్నాయి. కారు, జీప్, వ్యాన్, లైట్ మోటర్ వెహికల్ సింగిల్ జర్నీకి రుసుం రూ.45, ఒక రోజు లోపు తిరుగు ప్రయాణానికి రూ. 65 నుంచి రూ.70కి పెరిగింది. నాన్స్టాపింగ్ వెహికల్ పెనాల్టీ వర్తిస్తుంది రూ.90 నుంచి రూ.25, లైట్ కమర్షియల్ వెహికల్ లేదా గుడ్ వెహికల్ లేదా మినీ బస్సు రుసుం రూ.70 ఉండగా కొత్తది రూ.75 పెంచారు. బస్సు, ట్రక్ వాహనాలకు రుసుం రూ.150 ఉంది. ఇందులో పెరుగలేదు. మూడు యాక్సిల్ వాణిజ్య వాహనాలు రుసుం రూ.165 ఉంది. ఇందులో పెరుగలేదు. హెవీ వాహనాలకు రుసుం రూ.240 ఉంది. భారీ వాహనాలకు రుసుం రూ.290 ఉంది. ఇందులో పెరుగలేదు. జవహర్‌నగర్ టోల్గేట్లో.. వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం మండలం జవహర్‌నగర్ టోల్గేట్లో గతంలో కారుకు ఆప్ అండ్ డౌన్ రూ.60 ఉండగా ప్రస్తుతం రూ.70, డీసీఎంకు రూ.130 ఉండగా రూ.145, బస్సుకు రూ.165 ఉండగా రూ.180. లారీకి రూ.310 ఉండగా రూ.330 పెరిగినట్లు టోల్గేట్ సిబ్బంది తెలిపారు. అయితే సిస్టంలో ధరలు అప్లోడ్ కాలేదని, అధికారికంగా ఇంకా ఫైనల్ కాలేదన్నారు. ముత్తోజిపేట టోల్గేట్లో.. నర్సంపేట: ముత్తోజిపేట టోల్గేట్ వద్ద అధికారులు ధరలు స్వల్పంగా పెంచారు. కారు, జీప్, చిన్న మోటారు వాహనాల చార్జీలు యథావిధిగా ఉండగా, భారీ వాహనాలకు మాత్రం రూ. 5 చార్జీ పెంచారు. భారీ వాహనాలకు రూ. 10 పెంచారు. 3 65 హైవేపై 33కిలో మీటర్ల పరిధిలో ఈ చార్జీలు వ సూలు చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం వెల్ల డించిన సర్క్యూలర్‌లో అధికారులు పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి.. -
మావోయిస్టు ప్రస్థానం
వివిధ ఎన్కౌంటర్లలో నేలరాలిన నలుగురు నక్సల్స్ వెంకటరమణ, సంతోశ్‌రెడ్డి, శ్రీను, రేణుకముగిసిన ‘కడవెండి’అరుణతారలో మెరిసిన ‘మిడ్కో’దేవరుప్పుల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ ప్రభావం.. కాలానుగుణంగా ఉద్బవించిన నక్సల్స్ ఉద్యమ ప్రభావం.. వెరసి నివురుగప్పిన నిప్పులా ఉండే మావోయిస్టు కీలక మహిళా నేత గుమ్ముడవెల్లి రేణుక 25ఏళ్ల కిందట మావోయుస్టు అనుబంధ అరుణతార పుస్తకంలో తన రచనలతో మిడ్కోగా మెరిసింది. గోండి భాషలో ‘మిడ్కో’ అంటే ‘మిణుగురు పూవు’. అంతటి అందమైన పేరుతో ఆమె రాసిన విప్లవ కథల్లో ప్రత్యేక శైలి ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు నేలన అనేక ప్రాంతాల్లో మహిళా ఉద్యమ నిర్మాణంలో పనిచేసింది. విప్లవోద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్తూ ఆచరణాత్మకంగా మహిళా ధృక్పథం నుంచి అద్భుతమైన కథలు రాసింది. ఆమె రాసిన ‘మెట్లమీద’ కథ తెలుగు కథా సాహిత్యంలో చర్చనీయాంశమైంది. ఆమె కథల్ని విరసం 2007లో ‘మెట్లమీద’ పేరుతో పుస్తకం ప్రచురించింది. ఇంతటి సాహితీవేత్త ‘మిడ్కో’ ఇవాళ దండకారణ్యంలో పోలీసుల కాల్పుల్లో చనిపోవడం.. సాహితీవ్యవస్థ అంధకారంగా మారిందని సామాజిక వేత్తలు, మేథావులు, కవులు, రచయితలు అభిప్రాయపడ్డారు.● సీపీఐ(ఎంఎల్) నక్సల్స్ విస్తరణకు పునాదులు ఇక్కడే.. ● మూగబోయిన విప్లవోద్యమాల పురిటి కెరటం ● ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో అసువులుబాసిన గుమ్ముడవెల్లి రేణుక ● కడవెండిలోనే రేణుకకు తుది వీడ్కోలుకు సన్నాహాలు ● ఆమె పుట్టిపెరిగిన ఇంటిని పరిశీలించిన పోలీసులుదేవరుప్పుల : భూమి కోసం.. భుక్తి కోసం.. బానిసబంధాల విముక్తి కోసం కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురిటిగడ్డ కడవెండి. ఇక్కడి నుంచే తుపాకీతోనే సమసమాజ స్థాపన అంటూ అడవిబాట పట్టిన అగ్రనేతల ప్రస్థానం తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో అసువులుబాసిన రేణుకతో ముగిసినట్లయ్యింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం వామపక్షభావాజాల పార్టీల సిద్ధాంతాలను విభేదించి సీపీఐ(ఎంఎల్) ఏర్పడిన నేపథ్యంలో అనతికాలంలో జనశక్తి, పీపుల్స్‌వార్ గ్రూపులుగా వీడిన క్రమంలో కడవెండి ఇరువురి పోరాటాల్లో కీలక భూమిక పోషించింది. ఈ తరుణంలో కడవెండి పడమటితోట నివాసిత భూ పంపిణీ పోరాట నేపథ్యంలో పీపుల్స్‌వార్ గ్రూపు విస్తరణ పైచేయిగా మారింది. ఈ పోరాటాన్ని వేదికగా చేసుకుని అన్నదమ్ములు ఎర్రంరెడ్డి పురుషోత్తంరెడ్డి, సంతోశ్‌రెడ్డి ఉన్నతంగా చదివి ఉన్నత ఉద్యోగాలు వచ్చే క్రమంలో సమసమాజ స్థాపన ధ్యేయంగా పీపుల్స్‌వార్ గ్రూప్‌నకు అంకితమయ్యారు. వీరి నాయకత్వాన ఈ ప్రాంతం నక్సల్స్‌కు పెట్టని కోటగా మారే క్రమంలో ఇదే గ్రామానికి చెందిన పైండ్ల వెంకటరమణ 1986లో నర్సంపేట పీపుల్స్‌వార్ ఆర్గనైజర్‌గా పనిచేస్తూ నాచినపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో సీఐ అశోక్‌ను హతం చేసి తాను అసువులు బాశాడు. జీవీకే ప్రసా ద్ అలియాస్ ఉసెండి , ఈయన సోదరి గుమ్ముడవెల్లి రేణుక సైతం పార్టీలో చేరారు. 1999లో కరీంనగర్ కొయ్యూరు ఎన్కౌంటర్ పేరిట అప్పటి ఉమ్మడి రాష్ట్ర పీపుల్స్‌వార్ కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోశ్ రెడ్డి అలియాస్ మహేశ్, ఆ తర్వాత ఇదే గ్రామానికి చెందిన పెద్ది శ్రీను నెక్కొండ ఏరియా దళసభ్యుడి హోదాలో ఎన్కౌంటర్ అయ్యారు. సంతోశ్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌కు ముందే అతడి అన్న పురుషోత్తంరెడ్డి దండకారణ్య స్పెషల్ జోన్ల్ కమిటీ స్థాయిలో పనిచేసే క్రమంలో అనారోగ్య కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. పదేళ్ల క్రితం జీవీకే ప్రసాద్ అనా రోగ్యంతో లొంగిపోయాడు. ఇలాంటి అగ్రనేతలను స్ఫూర్తిగా తీసుకుని అడవి బాట పట్టిన రేణుక తాజా ఎన్కౌంటర్లో చనిపోయారు. మూగబోయిన కడవెండి.. ఇక్కడే రేణుక అంత్యక్రియలకు సన్నాహాలు రజాకార్ల నుంచి అడవి బిడ్డల సమస్యల సాధన కోసం ఉద్భవించిన పోరాటాల్లో కీలక భూమిక పోషించిన నేతలు నేలరాలడంతో నేడు కడవెండి మూగపోయింది. చివరి నక్సల్స్ నేతగా ప్రజాక్షేత్రంలో తిరిగిన రేణుకకు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు ఇక్కడ ఇల్లు లేకున్నా పుట్టిపెరిగిన పెద్దనాన్న(పాత ఇంట్లో) గృహం వద్ద నుంచే అంత్యక్రియలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రేణుక మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులు దంతెవాడకు బయలుదేరారు. ఉద్యమాలకు నిలయమైన కడవెండి వేదికగా రేణుకకు వీడ్కోలు పలికేందుకు తీవ్ర విషాదంలో గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.2004 తరువాత కుటుంబంతో సంబంధాలు లేవుమా సోదరి తిరుపతి, ఆ తరువాత వైజాగ్ ఉండేది. 2004 తరువాత మా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. ఎన్కౌంటర్ వార్త తెలిసేంత వరకు మాకు ఆమెతో సంబంధాలు లేవు. పదేళ్ల క్రితం వరకు ఉత్తరాలు రాసేది. ఆ తర్వాత అవి కూడా బంద్ అయిపోయాయి. ఎన్కౌంటర్ వార్త కూడా సోషల్‌మీడియా ద్వారా మధ్యాహ్నం తెలిసింది. మేము బయలుదేరి దంతెవాడ వెళ్తున్నాం. మంగళవారం కానీ, బుధవారం కానీ కడవెండిలో అంత్యక్రియలు నిర్వహిస్తాం. – రాజశేఖర్, రేణుక సోదరుడు రేణుకను విగత జీవిగా చూడాల్సి వస్తుందనుకోలేదు పద్మశాలి వంశపారంపర్య చేనేత వృత్తి చేసుకునే మా కుటుంబంలో మా తమ్ముడు సోమయ్య ఉపాధ్యాయుడయ్యాడని సంతోషం పడేవారం. మా తమ్ముడు కొడుకు జీవీకే ప్రసాద్ చురుకై న వాడు. కానీ రేణుక నివురుగప్పిన మాదిరి నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లింది. ఈ రోజు విగత జీవిగా వస్తున్న మా కూతురును వృద్ధులమైన మేము చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ప్రభుత్వం ఎన్కౌంటర్లు ఆపాలి. –గుమ్ముడవెల్లి లక్ష్మీనర్సు,చంద్రమ్మ, కడవెండి (రేణుక పెద్దనాన్న, పెద్దమ్మ)●ప్రజాపోరాటాలపై పాలకులు యుద్ధం ఆపాలి దేశంలో జరుగుతున్న ప్రజాపోరాటాలపై పాలకవర్గాల యుద్ధం ఆపాలి. ఆదివాసీ ప్రజల బాగు కోసం ప్రామాణిక రచనలు చేస్తూ ప్రజాసమస్యల సాధన కోసం పాటుపడిన న్యాయవాది, మావోయిస్టు నేత రేణుక నేలరాలడంపై ప్రభుత్వాలు వాస్తవిక దృక్పథంతో అధ్యయనం చేయాలి. మావోయిస్టులతో బేషరతుగా చర్చలు జరిపి శాంతి వాతావరణం నెలకొల్పాలి. –అస్నాల శ్రీనివాస్, దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ప్రతినిధి, కడవెండి రేణుక మావోయిస్టు పార్టీలోకి పోయిందంటే విస్మయం చెందాం మేము ఏడో తరగతి చదువుకున్న రోజుల్లో ఆ తర్వాత అ ప్పుడప్పుడూ కలిసిన క్రమంలో నిమ్మదస్తురాలిగా ఉండే రేణుక మావోయిస్టు పార్టీలోకి పోయిందంటే విస్మయం చెందాం. యాభై ఐదు ఏళ్లలో ఎక్కడో మహిళ నేతగా ప్రజల కోసం చనిపోవడం ఓ వైపు ఆనందంగా ఉంది. మరో వైపు అక్కడి ప్రభుత్వం మహిళ అని చూడకుండా ఎన్కౌంటర్ చేయడం బాధాకరం. –పంతం సుజాత, రేణుక క్లాస్మేట్ కడవెండిరేణుక అంత్యక్రియలపై పోలీసుల ఆరా.. దండకారణ్య స్పెషల్జోన్ల్ కమిటీ సభ్యురాలు రేణుక మృతదేహాన్ని స్వగ్రామం కడవెండికి తీసుకువస్తారన్న సమాచారం మేరకు స్థానిక ఎస్సై సృజన్‌కుమార్ ఆమె పెద్దనాన్న ఇంటికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. -
చిచ్చుపెట్టిన సిగరెట్ పొగ..
సంగెం: జాతరలో సిగరెట్ పొగ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో గవిచర్లలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గవిచర్లలో ఏటా ఉగాది పర్వదినం సందర్భంగా గుండబ్రహ్మయ్య జాతర వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన చిర్ర బన్ని(21), తల్లి పూల, సోదరి పూజిత, అన్న ధని అలియాస్ శివ, స్నేహితుడు గిరిబాబుతో కలిసి వచ్చారు. దర్శనం అనంతరం సోదరుడు ధని, తల్లి పూల, సోదరి పూజిత ఇంటికి వెళ్లిపోయారు. బన్ని, గిరిబాబు జాతరలో ఉన్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో బన్ని స్నేహితుడు గుండేటి చందు.. ధనికి ఫోన్ చేసి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బన్నిని బెదిరిస్తున్నారని సమాచారం ఇచ్చాడు. వెంటనే ధని గవిచర్లకు చేరుకుని విచారించాడు. దేవాలయానికి కొద్ది దూరంలో బన్ని సిగరెట్ తాగుతుండగా గవిచర్లకు చెందిన వెల్పుల సిద్ధు కాస్త దూరంగా వెళ్లి తాగమన్నాడు. ఈ విషయంలో మాటామాటా పెరిగి ఇరువురు ఘర్షణ పడ్డారు. ఈ లోగా సిద్ధు అన్న వినయ్.. బన్నితో మాట్లాడి తన సోదరుడు సిద్ధు తప్పుచేశాడని అంగీకరించి అతడి తరఫున క్షమాపణ చెప్పాడు. తర్వాత జాతరలో కొంత సమయం ఉన్నారు. సిద్ధు జరిగిన వాదన గురించి కక్ష పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా సంగెం మండల కేంద్రానికి చెందిన తన మేనమామ గుండేటి సునీల్‌కు ఫోన్లో జరిగిన విషయం చెప్పడంతో 12.15లకు ఆటోలో సునీల్‌తోపాటు గుండేటి రాజు, కార్తీక్ అలియాస్ కర్రి, మహేందర్ అలియాస్ దోని, మెట్టుపల్లి భరత్, ఎం. భరత్, గుండేటి రాజ్‌కుమార్, గుండేటి కొమ్మాలు హుటాహుటిన జాతర ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికి సద్దుమణిగిన గొడవ సంగెం నుంచి వచ్చిన 8 మందితో మరింత ఎక్కువ అయ్యింది. తన అల్లుడు సిద్ధను ఎందుకు తిట్టారని, ఈ రోజు చంపుతామని బన్నిని కొట్టారు. దీంతో ధని.. బన్ని స్నేహితులతో కలిసి బన్ని రక్షించడానికి యత్నించాడు. ఈలోగా సునీల్ మిగతా వారితో కలిసి బన్నిపై దాడిచేసి పరారయ్యారు. ఈ దాడిలో బన్ని మెడ నరాలకు తీవ్రంగా గాయమై స్పృహ తప్పిపడిపోయాడు. గమనించిన స్థానికులు ముందు ఫిట్స్ అని చేతులు కాళ్లు మర్దన చేశారు. గమనించిన కానిస్టేబుల్ గుండెపోటు అని సీపీఆర్ చేశారు. అనంతరం 108లో ఎంజీఎం తరలించగా వైద్యులు పరీక్షించి బన్ని మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు ధని అలియాస్ శివ ఫిర్యాదు మేరకు నిందితులు 9మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, బన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సోమవారం కుంటపల్లికి తరలించారు. సంగెం, ఐనవోలు ఎస్సైలు నరేశ్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బన్ని అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, బన్ని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటూనే ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బన్ని తండ్రి రాజు పది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. జాతరలో యువకుల ఘర్షణ తీవ్రగాయాలతో యువకుడు బన్ని మృతి కుంటపల్లిలో విషాదం -
గుమ్ముడవెల్లి రేణుక విప్లవోద్యమ ప్రస్థానం..
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలోని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుమ్ముడవెల్లి సోమయ్య, జయమ్మ(విజయ) దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో మొదటి కుమారుడు జీవీకే ప్రసాద్ మావోయిస్టుల్లో చేరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం ఢిల్లీ బీబీసీలో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. మరో కుమారుడు రాజశేఖర్ న్యాయవ్యాది. ఓ సంస్థకు లీగల్ అడ్వయిజర్‌గా వ్యవహరిస్తున్నారు. రెండో సంతానం గుమ్ముడవెల్లి రేణుక ప్రాథమిక విద్య కడవెండిలో చదువుతున్న క్రమంలో అన్న జీవీకే ప్రసాద్ మావోయిస్టు పార్టీలో చేరడంతో పోలీసుల నిర్బంధం పెరిగింది. దీంతో కుటుంబంతోసహా ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా మొత్కూరులో స్థిరపడ్డారు. ఈ క్రమంలో దేవరుప్పలలో పదో తరగతి చదివిన రేణుక.. ఇంటర్ జనగామ, డిగ్రీ ఉస్మానియా దూరవిద్యలో పూర్తి చేసింది. అనంతరం జనగామకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగిన కొద్ది రోజులకే విడాకులు పొందారు. ఈ సంఘర్షణతోనే తిరుపతి పద్మావతి కళాశాలలో ‘లా’ చదివింది. ఈ క్రమంలోనే పీపుల్స్‌వార్ అనుబంధ ప్రజాసంఘాల్లో లీనమైన ఆమె.. తిరుపతి అలిపిరిలో అప్పటి సీఎం చంద్రబాబుపై దాడి ఘటన అనంతరం పార్టీలో కీలకంగా నిమగ్నమైంది. ఇదే క్రమంలో కడవెండికి చెందిన అప్పటి పీపుల్స్‌వార్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోశ్‌రెడ్డి అలియాస్ మహేశ్‌తో పార్టీలో వివాహం జరిగింది. అయితే 1999లో కొయ్యూరు ఎన్కౌంటర్లో మహేశ్ చనిపోవడంతో వయసురీత్యా తిరిగి పీపుల్స్‌వార్ నేత శాఖమూరి అప్పారావుతో సహచరిగా వ్యవహరిస్తూ లీగల్‌గా పార్టీకి కీలకంగా పనిచేసే క్రమంలో ఆయన సైతం ఎన్కౌంటర్లో చనిపోయాడు. దీంతో రేణుక పార్టీలో పనిచేస్తున్న విషయం వెలుగులోకి రావడంతో వీరి తల్లిదండ్రులు హైదరాబాద్‌కు మకాం మార్చారు. శాఖమూరి అప్పారావు మృతి తర్వాత రేణుకను ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి మావోయిస్టు అనుబంధ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా పలు ప్రాంతాల్లో పని చేస్తుంది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ ప్రాంతంలో రేణుక ఎన్కౌంటర్లో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని తీసుకురావడానికి వారు బయలు దేరారు. -
ఏషియన్ పారా త్రోబాల్ పోటీల్లో కృష్ణవేణి ప్రతిభ
స్టేషన్‌ఘన్‌పూర్: ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్ షిప్ పోటీల్లో స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన మాచర్ల కృష్ణవేణి ప్రతిభ చాటింది. ఈనెల 28 నుంచి 30వ తేదీవరకు కాంబోడియా రాజధాని పీనంపెన్లో జరిగిన మొదటి ఏషియన్ పారాత్రోబాల్ పోటీల్లో ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించింది. ఈ పోటీల్లో మొత్తం 8 దేశాలు పాల్గొనగా.. ఇండియా కాంస్య పతకం సాధించింది. భారత జట్టులో కృష్ణవేణి ప్రతిభ చాటింది. కాగా, గత డిసెంబర్ 4,5,6వ తేదీల్లో కాంబోడియాలో జరిగిన సిట్టింగ్ పారాత్రోబాల్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న కృష్ణవేణి అత్యుత్తమ ప్రతిభతో గోల్డ్‌మెడల్ సాధించింది. ప్రస్తుతం జరిగిన మొదటి ఏషియన్ పారాత్రోబాల్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ ప్రతిభ చాటడంతో ఇండియా జట్టు కాంస్య పతకం సాధించింది. ప్రపంచ పారాత్రోబాల్ క్రీడల అధ్యక్షుడు వీయాన్సన్ చేతుల మీదుగా పతకం అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏషియన్ పారాత్రోబాల్ పోటీల్లో ప్రతిభ చూపడం సంతోషంగా ఉందని, సహకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు కృష్ణవేణికి అభినందనలు తెలిపారు. -
కాజీపేట మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా ఏప్రిల్ 6వ తేదీ నుంచి చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ మధ్య 13 రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ ఆదివారం తెలిపారు. వేసవి ప్రత్యేక రైళ్ల సర్వీస్ వివరాలు.. చర్లపల్లి నుంచి ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతీ ఆదివారం చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ (07023) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా హజ్రత్నిజాముద్దీన్లో ఏప్రిల్ 8వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు ప్రతీ మంగళవారం హజ్రత్‌నిజాముద్దీన్–చర్లపల్లి (07024) ఎక్స్‌ప్రెస్ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్‌లతో ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌లకు అప్ అండ్ డౌన్ రూట్లో కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా స్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ మధ్య 13 సర్వీస్‌లు -
రూటు మార్చి.. ఘాటు పెంచి
సాక్షి, మహబూబాబాద్ : యువత జీవితాలను నాశనం చేస్తున్న గంజాయి ఇప్పుడు ఆకు, పువ్వు రూపంలోనే కాదు.. లిక్విడ్ రూపంలోనూ లభిస్తోంది. గంజాయి రవాణాపై పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెంచిన నేపథ్యంలో స్మగ్లర్లు రూటు మార్చి.. ఘాటు పెంచి.. ఎక్కువ మత్తునిచ్చే గంజాయిని తక్కువ మోతాదుకు కుదించి.. రేటు పెంచి.. సునాయసంగా సరఫరా చేస్తున్నారు. పెద్ద బస్తాలు, ప్యాకెట్లు కాకుండా.. వాటర్ బాటిల్ సైజ్‌లో ఎవరికీ అనుమానం రాకుండా గమ్య స్థానాలకు చేరవేస్తున్నారు. ఇటీవల మహబూబాబాద్‌లో గంజాయి ఆశీష్ ఆయిల్ రవాణా చేస్తూ పట్టుబడిన ఘటనతో రూటు మార్చి గంజాయి స్మగ్లింగ్ విషయాలు బయటపడ్డాయి. కిలో గంజాయితో వంద మిల్లీ లీటర్ల ఆయిల్.. కిలోల కొద్ది గంజాయి తరలించడం కన్నా.. కుదించి సరఫరా చేయడం సులభమని భావించిన స్మగ్లర్లు ఎంచుకున్న కొత్త పంథా ఆశీష్ ఆయిల్ తయారీ చేసి అమ్మకాలు చేయడం. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మొదలైన ఈ విధానం ఇతర ప్రాంతాలకు పాకినట్లు తెలుస్తోంది. గంజాయిని ఎక్కువ మోతాదు నీళ్లల్లో గంటల కొద్ది ఉడికించి, అందులో కొన్ని రసాయనాలు కలిపితే ఆశీష్ ఆయిల్ వస్తుంది. కిలో గంజాయికి 100 మిల్లీ లీటర్ల ఆయిల్ తీస్తారు. అంటే పదికిలోలకు ఒక లీటర్, క్వింటా గంజాయిని పది వాటర్ బాటిళ్లు అంటే పది లీటర్ల పరిమాణంలోకి కుదిస్తారు. ఇలా తయారీ చేసిన గంజాయి తైలం లీటర్ రూ.లక్ష నుంచి దూరం వెళ్లే కొద్ది రూ. 2లక్షలు కూడా పలుకుతున్నట్లు సమాచారం. ఏఓబీ(ఆంధ్ర–ఒడిశా బార్డర్) నుంచి భద్రాచలం మీదుగా మహబూబాబాద్, హైదరాబాద్, మహారాష్ట్ర, కొవ్వూరు, సూర్యాపేట నుంచి హైదరాబాద్, కర్ణాటక, నర్సీపట్నం నుంచి వైజాగ్ మొదలైన ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన స్మగ్లర్లు చెబుతున్నారు. తేనె, మిక్స్డ్ డ్రైప్రూట్స్‌ను పోలి ఉండే ఈ ఆశీష్ ఆయిల్‌ను చిన్న మోతాదుల్లో జిందా థిలిస్మాత్, సెంట్ సీసాల సైజ్‌లో ఉన్న బాటిళ్లలో పోసి గుట్టుచప్పుడు కాకుండా ఆర్డర్లపై సప్లయ్ చేస్తుండడం గమనార్హం. మహబూబాబాద్‌లో స్మగ్లర్ నుంచి పట్టుకున్న ఆశీష్ ఆయిల్(ఫైల్)గంజాయి రవాణాలో స్మగ్లర్మ కొత్త పంథా ఏఓబీ నుంచి తెలంగాణ, మహారాష్ట్రకు ఆశీష్ ఆయిల్గా మార్చి విక్రయాలు లీటర్ గంజాయి ఆయిల్ ధర రూ. 2 లక్షలు శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్, చాక్లెట్లలో మిక్సింగ్సులభంగా మిక్సింగ్.. యువత వినియోగించే సిగరెట్లు, తినుబండారాల్లో కలిపేందుకు సాధారణ గంజాయి కన్నా.. ఆశీష్ ఆయిల్ కలపడం సులభంగా ఉంటుంది. ప్రధానంగా కుల్ఫీ, ఐస్‌క్రీమ్, కూల్ డ్రిక్, చాక్కెట్, కేక్, స్వీట్లు మొదలైన తినుబండారాలు, సిగరెట్లు, కట్చీప్స్పై వేసుకొని పీల్చ డం, మొదలైన పద్ధతుల్లో వాడేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే మామూలు గంజాయి కన్నా.. పదిరెట్లు ఈ లిక్విడ్ గంజాయి మ త్తెక్కించే గుణం ఉంటుంది. అందుకో సమే సూక్ష్మ పరిమాణంలో కలిపితే సరిపోతుంది. -
నాడీ వ్యవస్థ త్వరగా చెడిపోతుంది
మత్తుకు బానిస అవుతున్న యువకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణ గంజాయి కన్నా.. ఆశీష్ ఆయిల్ పదిరెట్లు ఎక్కువ శక్తివంతమైనది. దీనికి బానిసైతే.. కోలుకోవడం కష్టం. ముందు నాడీ వ్యవస్థ, తర్వాత లివర్, కిడ్నీ, గుండె, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది. దీనికి బానిసైనవారు రెండు, మూడు సంవత్సరాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. – డాక్టర్ వీరమల్ల మాధవరావు, ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, మహబూబాబాద్ -
ఇసుక అక్రమ రవాణా
● ఆరు ట్రాక్టర్ల సీజ్, కేసు నమోదు నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ ఇసుకాసురులు అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉగాది పండగ రోజున వాగు నుంచి ఇసుక రవాణా అవుతున్నట్లు సమాచారం అందుకున్న తహసీల్దార్ రాజు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీస్, రెవెన్యూ శాఖ ఆధ్వర్యాన సిబ్బందితో రంగంలోకి దిగారు. బ్రాహ్మణకొత్తపల్లి శివారులో ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయడానికి వెళ్లిన అధికారులను చూసి యజమానులు, డ్రైవర్లు వాగులోనే వాహనాలను వదిలి పారిపోయారు. దీంతో తహసీల్దార్ రాజు స్వయంగా డ్రైవర్ అవతారమెత్తారు. సిబ్బందితో కలిసి వాగు నుంచి ఆరు ట్రాక్టర్లను కార్యాలయానికి తరలించి సీజ్‌చేసి కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. -
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
కాటారం: రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతను పెడదోవ పట్టిస్తున్న మాదకద్రవ్యాలు, బెట్టింగ్ యాప్‌ల నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రజలు కూడా తమ వంతు బాధ్యత పోషించాలన్నారు. బెట్టింగ్ యాప్‌లతో అనేక మంది మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్‌లతో బలికావొద్దని పోలీస్, ఇతరాత్రా శాఖల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలోని పోతారంలో ఓ వ్యక్తి బెట్టింగ్ యాప్ బారిన పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరో కుటుంబంలో జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు, బెట్టింగ్‌యాప్‌లను ఉపేక్షించబోమని, వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీ కెమెరాలతో నేరాలు వెంటనే శోధించొచ్చని, మంథనిలో వామన్‌రావు దంపతుల హత్య జరిగినప్పుడు సరైన ఆధారాలు లేకపోవడంతో అనేక మంది నిందితులు తప్పించుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడంపై ఎస్పీ కిరణ్‌ఖరే, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్‌ను అభినందించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఎస్సైలు శ్రీనివాస్, మహేందర్‌కుమార్, నరేశ్, పవన్, తమాషారెడ్డి, రమేశ్, గీతారాథోడ్, తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్ యాప్‌లను ఉపేక్షించబోం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు -
దండెంపై దుస్తులు ఆరేస్తుండగా..
నర్సంపేట: దండెంపై దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామ శివారు మాధవనగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన అర్కాల సాంబయ్య(39) జల్లి గ్రామంలోని రైస్‌మిల్లులో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం స్నానం చేసి దండెంపై దుస్తులు ఆరేస్తుండగా ఆ తీగకు విద్యుత్ సరఫరా అయి షాక్‌కు గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం 108లో నర్సంపేటకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య భవాని, కుమారుడు అభిలాశ్, కూతురు శ్యామల ఉన్నారు. సాంబయ్య మృతితో కుటుంబంతోపాటు కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.● విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి ● మాధవనగర్‌లో ఘటన -
ఫర్నిచర్ షాపుల్లో
భారీ అగ్ని ప్రమాదం వరంగల్: వరంగల్ ములుగురోడ్ సమీపాన భద్రకాళీ ఆలయం వైపు వెళ్లే రహదారిలోని నాలుగు ఫర్నిచర్ షాపుల్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు వరంగల్ ఫైర్ ఆఫీసర్(ఎస్ఎఫ్ఓ) రాజేశ్వర్ తెలిపారు. మంజునాథ ఉడ్ వర్క్స్, సాహస్ర ఉడ్ వర్క్స్ ఫర్నిచర్స్, ఉపేంద్ర కార్పెంటర్ వర్క్స్, ముఖేష్ ఉడ్ ఫర్నిచర్స్, నవీన్ ఉడ్ వర్క్స్‌లకు చెందిన షాపుల్లో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపినట్లు ఎస్ఎఫ్ఓ పేర్కొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగడంతో బాధితుల ఫిర్యాదు మేరకు వెళ్లి ఆర్పినట్లు తెలిపారు. కర్రతో చేసిన సామగ్రి కావడంతో అప్పటికే మొత్తం అగ్నికి ఆహుతైనట్లు బాఽధితులు తెలిపారు. ఈప్రమాదంలో సుమారు రూ.50లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు నాగరాజు, నవీన్ తదితరులు కన్నీరుమున్నీరయ్యాయి. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఎఫ్ఓ తెలిపారు. ఘనంగా జడకొప్పులాట నర్మెట: ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని పోశమ్మగుడి మర్రిచెట్టు వద్ద జడకొప్పుల ఆట ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆటలో కర్రకు చేసిన 22 రంధ్రాల ద్వారా చెట్టుకు వేలాడదీసిన తాళ్లను యువత కోలాటాల నడుమ జడకొప్పుగా అల్లడం, అదేవిధంగా తిరిగి విడదీయడం విశేషం. గోల్కొండ చంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలో డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి, దేవులపల్లి భాగ్యలక్ష్మి, పులి కనకయ్య, గడ్డం మల్లేశ్, గొల్కొండ రవి, కొలెపాక స్వామి, తదితరులు పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య ● జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన వాజేడు: ఫ్లై ఓవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకునన్నాడు. ఈఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. మండల పరిధి లోని సుందరయ్య కాలనీ గ్రామానికి చెందిన అల్లి రాంబాబు, వరలక్ష్మి దంపతుల మూడో కుమారుడు సాయి ప్రసాద్ (20) భద్రాచలంలోని మదర్ థెరిస్సా డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. 20 రోజుల క్రితం చదువుపై ఆసక్తి లేదని హైదరాబాద్ వెళ్లి ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పా డు. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు చెప్పినా పట్టించుకోకుండా హైదరా బాద్ వెళ్లాడు. రాంబాబు.. కొడుకు సాయిప్రసాద్ ఆచూకీ తెలుసుకుని జీడిమెట్ల వెళ్లి మాట్లాడాడు. ఇంటికి రావాలని బతిమిలాడాడు. అయితే ఇంటికి వస్తానని చెప్పిన సాయిప్రసాద్.. ఆ వెంటనే ఫ్లై ఓ వర్ పైనుంచి దూకాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికి త్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. -
చెరువులో మునిగి యువకుడి మృతి
● గణపురం మండల కేంద్రంలో ఘటనగణపురం : ఉగాది పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. మండంలోని చెల్పూర్‌కు చెందిన ఎల్దండి విజయ్ (26) స్నేహితులతో కలిసి మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువులో స్నానానికి వెళ్లాడు. ఈ క్రమంలో విజయ్ చిన్న మత్తడిలో కా లుజారి నీట ముని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రేఖ అశోక్ ఘటనా స్థలికి చే రుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుడు విజయ్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. -
భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రులు ప్రారంభం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో ఆదివారం వసంత నవరాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిర్మాల్యసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వసంత నవరాత్ర ఉత్సవాలు నిర్వహించడానికి అనుజ్ఞాప్రార్థన, పూర్ణాభిషేకం చేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. లక్ష గులాబీ పూలకు సంప్రోక్షణ చేసి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉగాది పర్వదినం కావడంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దర్శించుకున్నారు. సాయంత్రం అయినవోలు రాధాకృష్ణశర్మ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. దేవాలయ ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించిన మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ శేషుభారతి చిత్రపటాన్ని బహూకరించారు. -
యువతకు ఆర్థిక దన్ను !
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ రాజీవ్‌యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకు రుణాలు అందజేయనున్నారు. ఈమేరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్వయం ఉపాధికి రుణాలు అందజేసి యువత ఆర్థిక సాధికారత సాధించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులకు అందజేయాలని.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల శాఖ అధికారులతో ఇప్పటికే కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పథకం నియమ నిబంధనలు తెలిపారు. అర్హులైన యువతకు పథకం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా అర్హత గల యువతకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణం అందజేస్తారు. ఏప్రిల్ 5వరకు.. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా.. అదే నెలలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయితీ రుణ మంజూరు పత్రాలను కలెక్టర్ చేతులమీదుగా అందజేస్తారు. కాగా రూ.లక్షకు 80శాతం, రూ.2లక్షలకు 70 శాతం, రూ.2లక్షలకు పైన రుణాలకు 60 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. రూ.50వేల రుణం తీసుకున్న వారికి 100శాతం సబ్సిడీ ఉంటుంది. పాత దరఖాస్తులకు స్వస్తి.. 2020–21లో సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం లేదు. ఇదిలా ఉండగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తుదారులకు ఊరట లభించింది. బీసీ బంధు, మైనార్టీ బంధులో రూ.లక్ష ఆర్థిక సాయం పొందిన వారిని పక్కనబెట్టింది. ఎస్సీ, ఎస్టీ రుణాల యూనిట్లకు ఎంపికై బ్యాంకు ఖాతాల్లో డబ్బుల జమ కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా నిరాశే మిగిలింది. ఏప్రిల్ 5వరకు అవకాశం అర్హులైన ప్రతి ఎస్సీ యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో ఎస్సీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఈ సంవత్సరంలో జారీ చేసినవి ఉండాలి. సమాచారం కోసం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలి.. – కె. శ్రీనివాస్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి ఐదేళ్ల వరకు అవకాశం ఉండదు ప్రభుత్వ నుంచి ఒక్కసారి రుణం పొంది ఉన్న వారికి ఐదు సంవత్సరాల వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రుణ సహాయం అందదు. బీసీ బంధు పొందిన వారు అనర్హులు. రాజీవ్ యువవికాసం ద్వారా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రుణ సహాయం అందిస్తుంది. అవకాశం ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలి. –బి.నర్సింహారావు, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రాజీవ్ యువ వికాసం పథకంతో ఆర్థిక సాధికారత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు అవకాశం ఏప్రిలో 5వతేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ రూ.4లక్షల వరకు రుణం -
గుప్త నిధుల కోసం తవ్వకాలు...?
డోర్నకల్: మండలంలోని తొడేళ్లగూడెం గ్రామ సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువైన గుట్టపై గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకుని గ్రామస్తులు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకునేందుకు గుట్టపైకి వెళ్లారు. గుట్టపై రెండుచోట్ల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు వారు చెబుతున్నారు. స్వామివారు కొలువైన గుట్టకు ఎంతో చరిత్ర ఉందని, గుట్టపై గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఊరికి బస్సు వేయండి.. నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఆదివారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించినట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ తెలిపారు. మహబూబా బాద్ నుంచి నర్సింహులపేటకు బస్సు సౌకర్యం కల్పించాలని, మహబూబాబాద్ వయా ఇనుగుర్తి మీదుగా వరంగల్‌కు, మహబూ బాబాద్ వయా కేసముద్రం మీదుగా గూడూరుకు అదనపు బస్ సర్వీసులు నడిపించాలని ఫోన్ల ద్వారా ప్రజలు కోరినట్లు డీఎం తెలిపారు. ప్రయాణికులు, ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు డీఎం పేర్కొన్నారు. కాగా ఆర్టీసీ బస్సులు, ఆదనపు ట్రిప్పుల కోసం మా ఊరికి బస్సు వేయండంటూ డయల్ యువర్ కార్యక్రమంలో ప్రజలు తమ వినతులు సమర్పించారు. ఒకే ఈతలో రెండు దూడలు గార్ల: మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన రైతు భూక్య శంకర్‌కు చెందిన ఆవు ఆదివారం ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. ఉగాది పండుగ రోజు రెండు దూడలు పుట్టడంతో రైతు కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. కాగా దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని రైతు పేర్కొన్నారు. ఈ విషయంపై పశువైద్యుడు సురేశ్‌కుమార్‌ను సాక్షి వివరణ కోరగా రెండు అండాలు ఫలధీకరణ చెంది విడిపోవడం వల్ల ఆవు రెండు దూడలకు జన్మనిచ్చిందని, ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని ఆయన చెప్పారు. కొమ్మాల జాతరకు పోటెత్తిన భక్తులు గీసుకొండ: ఉగాది పర్వదినం సందర్భంగా మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రామాచారి, ఫణి, విష్ణు.. ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. విద్యాకళాశాలలో ఆర్థిక అవకతవకలు! కేయూ క్యాంపస్: కేయూ విద్యా కళాశాలలో ఆర్థిక అవకతవకలు, లావాదేవీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ కళాశాల మాజీ పిప్రిన్సిపాల్, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ రణధీర్‌రెడ్డికి ఇప్పటికే రిజిస్ట్రార్ వి.రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రణధీర్‌రెడ్డి కూడా అధికారులకు వివరణ ఇచ్చారు. కళాశాలలో అవకతవకలు ఏమైనా జరిగాయా అని పరిశీలించేందుకు ఇటీవల వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అప్రూవల్ మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్‌గా కేయూ అకడమిక్ ఆడిట్ డీన్ ప్రొఫెసర్ జి.హనుమంతు, ,కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ తోట రాజయ్యను సభ్యులుగా నియమించారు. అకౌంట్స్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె. శ్రీలతను మెంబర్ కన్వీనర్‌గా నియమించారు. ఈ కమిటీ త్వరలో విచారణ పూర్తిచేసి తగిన నివేదికను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuకురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది. క్యూలో నిల్చొని స్వామి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కురవి: వీరభద్రస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్న వేదపండితులు, మహబూబాబాద్‌లో... ఘనంగా ఉగాది.. మహబూబాబాద్ రూరల్ : జిల్లావ్యాప్తంగా ఆదివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రజలు స్నానాలు ఆచరించి, ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, షడ్రుచులతో కూడిన పచ్చడి తయారు చేసుకున్నారు. దేవతలకు నైవేద్యం సమర్పించిన అనంతరం కుటుంబ సమేతంగా సేవించారు. సాయంత్రం పంచాగ శ్రవణం జరిపారు. న్యూస్రీల్వీరన్న సన్నిధిలో -
తాగునీటి సరఫరాపై దృష్టి
మహబూబాబాద్: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా మానుకోట మున్సిపల్ అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. అయితే ఏదైనా సమస్య తలెత్తి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వనరులపై దృష్టి పెట్టారు. మున్నేరు వాగులో రెండు నెలల పాటు సరిపోను నీరు ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. లక్షకు పైగా జనాభా.. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో స్థానికులతో పాటు విద్య, వ్యాపారం, ఉద్యోగ రీత్యా నివాసం ఉండే వారితో లక్ష జనాభా దాటుతుంది. 13,766 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కాగా మిషన్ భగీరథ అర్బన్ సంప్ ద్వారా తాగునీటి పరఫరా చేస్తున్నారు. విలీన గ్రామాలతో కలిపితే మొత్తం 39 వాటర్ ట్యాంక్‌లు ఉన్నాయి. కాగా అర్బన్ సంప్ నుంచి గాయత్రి గుట్టపై ఉన్న వాటర్ ట్యాంకు, బైపాస్‌లోని ట్యాంక్, గాంధీ పార్క్‌లోని ట్యాంకు, సిగ్నల్ కాలనీ ట్యాంకు, కంకరబోడ్‌లోని ట్యాంకు, బీసీ కాలనీ ట్యాంకు, బాబూ నాయక్ తండా రోడ్డులో ఉన్న ట్యాంకులకు నీటి సరఫరా చేస్తున్నారు. ప్రతీరోజు మిషన్ భగీరథ నీరు 11 మిలియన్ లీటర్లు, జిల్లా కేంద్రం శివారు మున్నేరు వాగులో రెండు చెక్ డ్యామ్‌లలో నిల్వ ఉన్న నీటిలో ప్రతీరోజు 2 ఎంఎల్డీ వాటర్ సరఫరా చేస్తున్నారు. మున్నేరు వాగులోని ఫిల్టర్ బెడ్ ద్వారా పాత బజార్‌లోని కేటీఆర్ కాలనీ, అయ్యప్పనగర్తో పాటు పలు కాలనీలకు నీటి సరఫరా చేస్తున్నారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం.. వేసవికాలం కావడంతో తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో 61 బావుల్లో 30అడుగంటగా.. 28 బావులను ఉపయోగంలోకి తెచ్చారు. 340 చేతిపంపులు ఉండగా .. 331 పని చేస్తున్నాయి. 9 చేతి పంపుల్లో నీళ్లు లేవు. పవర్ బోర్లు 69 ఉండగా.. 9బోర్లలో నీళ్లు లేవని గుర్తించారు. డివైడర్లు, పార్కులు, పట్టణ ప్రకృతి వనాల్లో ఉన్న చెట్లకు నీళ్లు అందించడానికి నాలుగు ట్యాంకర్లు కొనుగోలు చేశారు. వాటిని నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ఉపయోగిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం రూ.8 లక్షలు కేటాయించారు. ప్రధానంగా కొన్ని దశాబ్దాలుగా మానుకోటకు మున్నేరు వాగే దిక్కు.. దానిలో రెండు నెలలకు సరిపోను నీరు ఉండడంతో ఫిల్టర్ బెడ్ నుంచి అన్ని ట్యాంకులకు కనెక్షన్ ఇచ్చారు. తద్వారా పట్టణమంతా నీటి సరఫరా జరగనుంది. పలు ప్రాంతాల్లో సమస్య.. బ్యాంక్ కాలనీతో పాటు సిగ్నల్ కాలనీలోని కొంత ప్రాంతం, వెల్పుల సత్యం నగర్కాలనీతో పాటు పలు కాలనీల్లో తాగు నీటి సమస్య తలెత్తింది. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో పైపులైన్ మరమ్మతులు జరుగుతున్నాయి. ఈమేరకు గత కొద్ది రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. కొండపల్లి గోపాల్‌రావు నగర్ కాలనీలో ఉన్న బావి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఆ బావిలో కూడా నీరు అడుగంటింది. మానుకోట మున్సిపాలిటీలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం తాగునీటి పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనులు ప్రత్యామ్నాయ వనరులపై ప్రత్యేక దృష్టి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూ.8 లక్షల కేటాయింపు పలుచోట్ల అడుగంటిన బావులుపూర్తి కాని పైపులైన్‌తో సమస్య.. మిషన్ భగీరథ పథకంలో 127 కిలోమీటర్లు మాత్రమే పైపులైన్ నిర్మాణం చేశారు. 42 కిలోమీటర్ల మేరకు పాత పైపులైన్‌తో నీటి సరఫరా చేస్తున్నారు. 50 కిలోమీటర్ల మేరకు నిర్మాణం చేయాల్సి ఉంది. కాగా పాత పైపులైన్ ఉన్న ప్రాంతాల్లో లీకేజీలు ఇతర సమస్యలు వస్తున్నాయి. పైపులైన్ నిర్మాణం కోసం రూ.20 కోట్లు మంజూరు కాగా టెండర్ పూర్తి అయ్యిందని అధికారులు తెలిపారు. పైపులైన్ టెండర్ పూర్తి 92 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం కోసం రూ. 20కోట్లు మంజూరు కాగా టెండర్ దశలో ఉంది. మిషన్ భగరీథ నీటి సమస్య వచ్చినా.. మున్నేరు వాగు నీరు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. మిషన్ భగీరథ నీరు విషయంలో కూడా సమస్య లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు . –ఉపేందర్, మానుకోట మున్సిపల్ డీఈ నీటి సమస్య లేకుండా చూస్తున్నాం.. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి, తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించాం. పైపులైన్ మరమ్మతులు చేస్తున్నాం. ప్రస్తుతం సమస్య ఉన్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. మున్నేరు వాగులో కూడా రెండు నెలలకు సరిపోన్ నీరు నిల్వ ఉంది. –నోముల రవీందర్, మున్సిపల్ కమిషనర్ -
నేర్చుకుంటేనే విజయం..
పోటీ పరీక్షల్లో విజయంసాధించాలంటే ఎంతో సాధన అవసరం. అందుకు దినపత్రికలు, కొంతమేర సెల్ఫోన్లు ఉపయోగపడుతాయి. ఇటీవల ఉమ్మడి జిల్లానుంచి అనేకమంది గ్రూప్–1, 2లో ఉద్యోగాలు సాధించారు. గ్రూప్–1లో శాయంపేట మండలం తహెరాపూర్కు చెందిన తేజస్వినీరెడ్డి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించింది. మహబూబాబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లికి చెందిన మే కల ఉపేందర్ రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించాడు. ‘ఏకాగ్రతతో చదువుతూ విజయం సాధించాలి.’అని సదరు ర్యాంకర్లు చెబుతున్నారు. సమయాన్ని వృథా చేయకుండా సరైన ఆలోచనలు చేస్తే వ్యాపారాల్లో లాభాలు గడిస్తూ విజయాన్ని సాధించవచ్చు. -
తెలుగుదనం ఉట్టిపడేలా..!
● పంచెకట్టు..లాల్చీతో వెంకట కమలాకర్ గీసుకొండ: తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు, లాల్చీతో సంప్రదాయానికి బ్రాండ్‌గా నిలుస్తున్నారు గీసుకొండ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఆసూరిమరింగంటి వెంకట కమలాకర్. అధికారుల సమీక్షలు ఉన్నా, మండల పరిషత్ కార్యాలయంలో జరిగే సమావేశాల్లోనూ ఆయన డ్రెస్ కోడ్ భిన్నంగా ఉంటుంది. నిలువుబొట్టు, పంచెకట్టు, లాల్చీతోపాటు పిలకజుట్టుతో ప్రత్యేకంగా ఉంటారు. బ్రాహ్మణీయ వైష్ణవ కుటుంబంలో పుట్టిన ఆయన కృష్ణతత్వం వైపు ఆకర్షితులై తన జీవన విధానాన్ని మలుచుకున్నారు. ఎవరితోనైనా ప్రశాంతంగా, సౌమ్యంగా మాట్లాడటం ఆయన తీరు. పాఠశాల, కళాశాలలో చదువుకునేటప్పుడు ప్యాంట్, షర్టు వేసుకున్నా.. 1994లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఆయన డ్రెస్‌కోడ్ పూర్తిగా మారిపోయింది. నేటి ఆధునిక ప్రపంచంలో ఇలా సంప్రదాయ వస్త్రధారణతో కనిపించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. -
రాజయోగమా..అవమానమా!
నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలపై ఆశావహుల దృష్టి సాక్షి, మహబూబాబాద్: తెలుగు ప్రజలు రాబోయే ఏడాది చేసే పనులకు ఉగాదితో అంకుర్పాణ అవుతుంది. వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో తమ భవిత ఎలా ఉంటుందోనని నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం రోజు పంచాంగం చూపించుకొని పనులు మొదలు పెడతారు. ఆదాయం, ఖర్చు.. అవమానం, రాజయోగం మొదలైన అంశాలకు పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న తెలుగు సంవత్సరం ఈ ఏడాది రాజకీయ నాయకుల భవితకు కూడా కీలకంగానే ఉంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవులకోసం ఎదురుచూస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ నాయకులకు ఈ ఏడాదిలో తమ భవితవ్యం తేలనుంది. రాజయోగం (పదవియోగం)పై ఎవరి ధీమా వారికి ఉన్నా.. నూతన తెలుగు సంవత్సరం ‘శ్రీ విశ్వావసు’ నామ సంవత్సరంపై విశ్వాసంతో అడుగు పెడుతున్నారు. నామినేటెడ్ పదవుల ఆశ ప్రతీసారి నామినేటెడ్ పదవుల కేటాయింపులో చర్చకు వచ్చే మహబూబాబాద్ కాంగ్రెస్ నాయకులకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి దూరం అవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీల్లో జిల్లాకు చెందిన సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లు చర్చ జరిగినా.. చివరి నిమిషంలో దూరమైంది. అయితే ఇప్పుడు అసెంబ్లీ తర్వాత కొత్త తెలుగు సంవత్సరంలో నామినేటెడ్ పదవుల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పడంతో జిల్లా నుంచి ఎవరికి అవకాశం వస్తుందోనని చర్చ మొదలైంది. లంబాడ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు ఇవ్వాలనే డిమాండ్ తెరమీదికి రావడంతో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వర్గీయుల్లో ఆశలు కలిగాయి. అయితే మంత్రి పదవి మిస్సైతే.. రాంచంద్రునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి వస్తుందనే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న భరత్ చందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చివరి వరకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. అయితే రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేషన్ వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. లేకపోతే అదే డీసీసీ భరత్ చందర్ రెడ్డికే ఉంటుందనే చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న మరో నాయకుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డికి గతంలో నామినేటెడ్ పదవుల కేటాయింపులోనే వస్తుందని అనుకున్నా.. తీరా చూస్తే ఆయన పేరు లేదు. ఇప్పుడు హైదరాబాద్‌లోనే మకాం వేసి సీఎం సన్నిహితుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రచారం. దీంతో శ్రీకాంత్ రెడ్డికి నామినేటెడ్ లేదా పార్టీలోని కీలక పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ. వీరితోపాటు ఇప్పటికే గిరిజన ఫైనాన్స్ చైర్మన్‌గా ఉన్న బెల్లయ్య నాయక్, డైరెక్టర్‌గా ఉన్న నెహ్రునాయక్లు ఆ పదవితో తృప్తి పడటం లేదని, ఈ సారి అంతకన్న మంచి పదవి వస్తుందని అనుకుంటున్నారు.ఈ ఏడాదిలోనే స్థానిక సమరం.. ఉగాదితో మొదలయ్యే శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకుల గెలుపోటములను తేల్చే ఏడాది. త్వరలో జరిగే వార్డు సభ్యుల ఎంపిక నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీల ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ పట్టణంతోపాటు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల పాలక మండలి ఎన్నికలు కూడా కొత్త సంవత్సరంలోనే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకులు ఈ ఏడాదిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని పార్టీ పెద్దలకు చెబుతూ.. గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. చావు, బతుకులు, పెళ్లిళ్లు, పేరంటాల్లో అనుచరులతో పాల్గొంటున్నారు. ఉగాది రోజు తమ పేరు బలం చూపించుకొని కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అనుచరులతో చెబుతూ సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాది రాజకీయ ఆశావహులకు కీలక నామ సంవత్సరంగా మారనుంది. రాజకీయ భవితం తేల్చే కొత్త సంవత్సరం శ్రీవిశ్వావసు నామ సంవత్సరంపై విశ్వాసం -
పాముల రూపంలో దర్శనమిచ్చే కొండలమ్మ దేవత
గార్ల: ఉగాది సందర్భంగా జరగనున్న కొండలమ్మ జాతర సమయంలోనే గుడి రాళ్ల సొరికెల నుంచి స ర్పాలు బయటకు వచ్చి కనిపిస్తుంటాయి. వాటిని దేవతలుగా భావించి భక్తులు ఆరాధిస్తుంటారు. గా ర్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో కొ ండలమ్మ,బయ్యమ్మ, గారమ్మలు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఆ దేవతామూర్తులకు కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు దేవాలయం నిర్మించారని పూర్వీ కులు చెబుతుంటారు. జాతర సమయంలోనే సొరి కెల నుంచి పాములు బయటకు వచ్చి మళ్లీ తిరిగి లోపలికి వెళ్లిపోతాయి. మిగతా రోజుల్లో అవి కని పించవు. కొండలమ్మ పేరుమీద కొండలమ్మ చెరువు, గారమ్మ పేరుమీద గార్ల చెరువు, బయ్యమ్మ పేరుమీద బయ్యారం చెరువును కాకతీయులు నిర్మించి నామకరణం చేసినట్లు పూర్వీకులు చెప్పుకుంటారు. -
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025
– 9లోuజీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించి సంతోషంగా ముందుకు సాగాలని తెలియజేసేదే ఉగాది పచ్చడి పరమార్థం. షడ్రుచులంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. అలాగే సంతోషం, విచారం, ఐశ్వర్యం, పేదరికం, విజయం, పరాజయం ఆరు రుచుల మిశ్రమమే జీవితం. ఈ ఏడాది షడ్రుచుల సమ్మేళనంతో అందరి జీవితాలు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ శ్రీవిశ్వావసు తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుదాం.. – హన్మకొండ కల్చరల్జీవనయానంలో ఎన్నో ఒడిదొడుకులు.. ● జీవిత పరమార్థం తెలిపే ఆరు రుచులు ● ఉగాదికి కొత్తదారిలో అడుగులేద్దాం.. ● శ్రీవిశ్వావసు తెలుగు సంవత్సరాదికి స్వాగతం ఆనందం..సంతోషం.. ఆనందం, సంతోషం తీపికి గుర్తులు. తల్లిదండ్రులు తమ పిల్లలతో సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించాలి. మాటే మంత్రంగా ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడే తీరును అలవర్చుకోవాలి. పిల్లల కు నేర్పాలి. ప్రేమ, ఆప్యాయతలతో ఉండే పలకరింపుతోనే ఎదుటివారు మన మాటలు వినడానికి ఆసక్తి చూపుతారు. దానికి ఉదాహరణ స్వామి వివేకానందుడి చికాగో ప్రసంగం. పలువురి ప్రజాప్రతి నిధుల ప్రసంగాలు స్ఫూర్తినిస్తాయి. కుటుంబంలో తోడబుట్టిన వారు ఒకరికొకరు కష్టసుఖాలను పాలుపంచుకుంటూ సంతోషంగా గడపాలి. పిల్లలను సెల్‌ఫోన్‌కు దూ రంగా ఉంచుతూ బంధువులు, స్నేహితులతో పండుగ పనులలో భాగస్వాములను చేయడం, సంప్రదాయాలను పాటించేలా ఆధ్యాత్మిక నైతికవిలువలు నేర్పాలి. అది ఈ ఉగాది నుంచే మొదలుపెడదాం.పట్టుదలతో ఐశ్వర్యం చదువుల విషయంలో పిల్లలు అత్యుత్తమ ఫలితాలు పొందేలా విజేతలుగా నిలిచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వారికి భారం తగ్గించేలా పార్ట్‌టైం జాబ్‌లు చేసి డబ్బు సంపాదించడం అలవర్చుకోవాలి. నగరంలో కాకతీయ మెడికల్ కాలేజీ దగ్గర కొందరు బీటెక్ విద్యార్థులు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మొబైల్ టిఫిన్ సెంటర్‌ను నడుపుతూ వారి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. కొత్త కొలువులు సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలి. ఆ కుటుంబం ఆర్థికంగా ఉన్నతంగా నిలుస్తుంది. యువకులు ఈ దిశగా పండుగరోజు తొలిఅడుగు వేయాలని ఆశిద్దాం.విచారానికి విరుగుడు ఇంట్లో, బయట ఉండే సమస్యల కారణంగా ఆరోగ్యంతోపాటు అందం, ఆనందం దూరమవుతాయి. సమస్యలను అధిగమించాలే కానీ విచారంతో జీవనాన్ని కొనసాగించవద్దు. వగరులాంటి విచారానికి విరుగుడుగా వాకింగ్ సంగీతం వినడం, మెడిటేషన్, యోగా వంటివి సాధన చేయాలి. ఇంట్లో బాధపడుతూ కూర్చోకుండా పనుల్లో నిమగ్నమవ్వాలి. ఇదే విషయాన్ని చిన్నప్పటినుంచి పిల్లలకు నేర్పాలి. మానసిక వికాసానికి క్రీడలు, వ్యాయామం ఎంత అవసరమో చెప్పాలి. వారికి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలి. ఇందుకు ఉగాదిపండుగ రోజున నిర్ణయం తీసుకుందాం.అపజయమే విజయానికి మెట్టు.. జీవితంలో అపజయం కలిగినప్పుడు బాధపడకుండా విజ యాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారంలో నష్టం కలిగినా, విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవ్వకపోయినా, పోటీపరీక్షల్లో ఉద్యోగం సాధించకపోయినా మరో ప్రయత్నంలో విజయాన్ని సాధించవచ్చు. ఇప్పుడు గొప్పస్థానాల్లో ఉన్నవారంతా ఏదో ఒక తరగతిలో ఫెయిలై ఉండొచ్చు. అలా అని వారు లక్ష్యసాధనకు వెనుకడుగు వేయలేదు. ఓటమితో రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చుకుని ముందుకు సాగారు. ఇఫ్తార్న్యూస్రీల్ -
మైనార్టీల సంక్షేమానికి కృషి
మహబూబాబాద్ రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి అ న్నారు. రంజాన్ ఉపవాస దీక్షల్లో భాగంగా ప్రభు త్వ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహబూబి యా మసీదు వద్ద శనివారం ఇఫ్తార్ విందు ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవా సం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, మహమ్మద్ సయీద్ అహ్మద్ రిజ్వి, ఖలీల్, రఫీ, ఆసిఫ్, ప్రకాష్ రెడ్డి, రమేశ్ చందర్ రెడ్డి, అసద్ అలీఖాన్, నయిం, సర్వర్, నాసర్, ముస్లింలు పాల్గొన్నారు. ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ -
గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలి
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో గెలిచిన లంబాడ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని, అత్యధికంగా ఉన్న గిరిజన జిల్లా మానుకోటలో ఐటీడీఏను ఏర్పాటు చేసి లంబాడ సామాజిక వర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు దాస్‌రామ్ నాయక్ అన్నారు. ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో గిరిజన హక్కుల సాధనకు శనివారం జిల్లా కేంద్రంలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన చట్టాలను వందశాతం అమలు చేయాలన్నారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే భర్తీ చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్‌నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసునాయక్,, ఉపాధ్యక్షుడు భూక్య బాలాజీనాయక్, మల్సూర్‌నాయక్, భూక్య శ్రీనునాయక్, బాలు, శంకర్‌నాయక్, గుగులోత్ భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు దాస్‌రామ్‌నాయక్ -
మొదటి కంటే రెండో పంటలు బాగా పండుతాయి
● బ్రహ్మశ్రీ తాటిపాముల నర్సింహమూర్తి మహబూబాబాద్ రూరల్: విశ్వావసునామ సంవత్సరంలో సామాన్యమైన వర్షాలు కురుస్తాయి. గోదావరి లాంటి నదులు బాగా ప్రవహిస్తాయి. ఆహార ధాన్యాలు, బంగారానికి విపరీతమైన గిరాకీ ఉండి ధరలు బాగా పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో మొదటి పంటల కంటే రెండో పంటలు బాగా పండుతాయి. రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. ప్రముఖ వ్యక్తులకు అరిష్టం కలుగుతుంది. మిర్చి, కందులు, బొబ్బెర్లు వచ్చే ఏడాది బాగా పండుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయి. ప్రజలు మంచి కలగడం కోసం సుదర్శన, రుద్ర, చండీయాగాలు చేయాలి. పలు రకాల ఆందోళనలు నెలకొననున్నప్పటికీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. -
సెర్ప్ లక్ష్యాలు పూర్తి చేయాలి
మహబూబాబాద్: సెర్ప్ సంస్థ నిర్దేశించిన లక్ష్యాల సాధనకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదిర్శి లోకేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సెర్ప్ కార్యక్రమాలపై గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా సమీక్షించారు. సెర్ప్ సీఈఓ డి.దివ్యతో కలిసి లోకేష్‌కుమార్ మాట్లాడారు. యాసంగి సీజన్లో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను గణనీయంగా పెంచాలని సూచించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమ పరీక్ష యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ఇతర సామగ్రి అందించాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. దివ్యాంగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో సదరం క్యాంపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
దంతాలపల్లి: వేసవికాలంలో ఆయిల్‌పామ్ తోటల రక్షణకు రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మండలంలోని దాట్ల గ్రామంలో గురువారం ఆయన ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించి మాట్లాడారు. వేసవికాలంలో పామాయిల్ లేత మొక్కలు, కొమ్మలకు పురుగు బెడద ఉంటుందన్నారు. మొక్క రక్షణకు పాదుల చుట్టూ రెండు వరుసల్లో జీలుగు వేయాలని సూచించారు. జీలుగు మొక్కలను రక్షించడంతో పాటు పోషకాలు అందిస్తున్నారు. వేసవిలో నీటికొరత లేకుండా చూడాలని, మొక్కలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొక్కలకు చీడ, పీడలు ఆశిస్తే అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు. అనంతరం రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలి తొర్రూరు రూరల్: ఆయిల్‌పామ్ రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం మండలంలోని అరిపిరాల, వెంకటాపురం గ్రామాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించారు. -
ఎట్టకేలకు.. ఉద్యోగాల భర్తీ!
చివరి తేదీ : 29–03–2025ఈద్గాల్లోనే రంజాన్ ప్రార్థనలుIవసంతాలకు అనాది. శుభాలకు పునాది. తెలుగు సంవత్సరాది.. ఉగాది. కోయిలమ్మ కమ్మని స్వరాల నడుమ, షడ్రుచుల మేళవింపులో కోటి ఆశలకు రెక్కలు తొడుగుతూ వచ్చే వేడుక ఇది. తెలుగుదనం ఉట్టిపడేలా.. సంప్రదాయానికి జీవం పోసేలా సాగే పర్వదినమిది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వేళ కవుల భావాలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తోంది. మరింకెందుకాలస్యం.. కలాలు కదిలించండి.. ఉగాదిపై కవితలు రాయండి. నెహ్రూసెంటర్: జిల్లా వైద్యారోగ్యశాఖ ఎన్హెచ్ఎం పరిధిలో ఉద్యోగాల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఎన్హెచ్ఎంలో 37పోస్టులకు నోటిఫికేషన్ జారీకాగా.. 1,661 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా గత ఏడాది నవంబర్‌లో 37 పోస్టులకు మెరిట్ లిస్టు ప్రకటించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ నిర్వహించి 14పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. 23 పోస్టుల భర్తీ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కాగా ఎట్టకేలకు వాయిదా వేసిన ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టును నేడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే గత మెరిట్ లిస్టుకు ప్రస్తుతం ఇవ్వబోతున్న మెరిట్ లిస్టుకు ఏమైనా తేడా ఉంటుందా అని అభ్యర్థులో ఉత్కంఠ నెలకొంది. కాగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు వెలువడగా.. వైద్యారోగ్యశాఖ అధికారుల్లో కదలిక వచ్చింది. భర్తీ కానున్న ఉద్యోగాలు ఇవే... సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్ రోజు వాయిదా వేసిన ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టు నేడు వెబ్సైట్లో పొందుపర్చనుండగా.. అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా మెరిట్ లిస్టు, భర్తీ ప్రక్రియలో నిలిపివేసిన ఎంఎల్‌హెచ్‌పీ–10పోస్టులు, ఎన్సీడీ స్టాఫ్‌నర్సు–10, ఎంహెచ్ఎన్ స్టాఫ్‌నర్సు–2పోస్టులను అధికారులు భర్తీ చేయనున్నారు. నేడు మెరిట్‌లిస్టు విడుదల.. వైద్యారోగ్యశాఖలో ఎన్హెచ్ఎం పథకంలో గతంలో నిలిపివేసిన ఎంఎల్‌హెచ్‌పీ, స్టాఫ్‌నర్సులు, ఎన్సీడీ స్టాఫ్‌నర్సులు, మెకానిక్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను నేడు వెబ్సైట్లో పొందుపర్చనున్నట్లు డీఎంహెచ్ఓ మురళీధర్ గురువారం తెలిపారు. మెరిట్ జాబితాపై ఈ నెల 29నుంచి ఏప్రిల్ 3వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, వివరాలకు మహబూబాబాద్.తెలంగాణ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఎన్హెచ్ఎం పరిధిలో జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనల ప్రకారం మెరిట్ ఉన్నవారికే ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుతం 22 పోస్టులను భర్తీ చేయనున్నాం. దీనికి సంబంధించిన మెరిట్ లిస్టు కార్యాలయంలో, వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నాం. –మురళీధర్, డీఎంహెచ్ఓ వైద్యారోగ్యశాఖలో నియామకాలకు ముహూర్తం 22 పోస్టులకు నేడు మెరిట్ జాబితా విడుదల -
ఎట్టకేలకు నీటి విడుదల
హసన్‌పర్తి/ధర్మసాగర్: దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంపుహౌస్ వద్ద ఏర్పాటు చేసిన మూడు మోటార్లలో ఒక మోటారును ఎట్టకేలకు గురువారం సాయంత్రం మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. 600 క్యూసెక్కుల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి వదిలారు. అరగంటపాటు వెయిటింగ్.. వారం రోజుల క్రితం ధర్మసాగర్ చెరువులోకి నీటిని విడుదల చేయడానికి వచ్చిన మంత్రులు మోటార్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఆన్ కాకపోవడంతో తిరిగి వెళ్లారు. రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో గేట్‌వాల్వ్‌లు పడిపోయాయి. ప్రత్యేక నిపుణులతో వాటికి మరమ్మతులు చేయించారు. రెండోసారి గురువారం సాయంత్రం మోటార్లు ఆన్ చేయడానికి వచ్చినా... మళ్లీ సాంకేతిక సమస్య కారణంగా అరగంట పాటు వెయిట్ చేశారు. టెక్నీషియన్లు సమస్య పరిష్కరించిన తర్వాత మంత్రులు లాంఛనంగా మోటారు ఆన్ చేశారు. పూజలు.. సన్మానాలు మొదట దేవన్నపేటకు చేరుకున్న మంత్రులకు కలెక్టర్ ప్రావీణ్య, నాయకులు పూలబొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. వారు తొలుత శిలాఫలకాన్ని సందర్శించారు. అనంతరం పంపుహౌస్ వద్దకు చేరుకోగా, వారికి ఇంజనీర్లు నీటిపంపింగ్ విధానాన్ని కంప్యూటర్లో చూపించారు. నీరు ఎక్కడినుంచి ఎలా వెళ్తుందో వివరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మూడో దశ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే నీరు రిజర్వాయర్‌లోకి వస్తుండగా పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. నీటిలోకి సారె వదిలారు. ఈ సందర్భంగా మంత్రులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాలువాలు కప్పి సన్మానించారు. అక్కడే మంత్రులు రెండు నిమిషాలు మాట్లాడి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాం నర్సింహారెడ్డి, ఈఎన్సీ అనిల్‌కుమార్, సీఈ అశోక్‌కుమార్, ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాంనాయక్, డీఈఈ రాజు, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.. దేవాదుల మూడో దశ మోటారు ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి 600 క్యూసెక్కులు దేవన్నపేట పంపుహౌస్‌తో 5,22,522 ఎకరాలకు సాగు నీరు వరంగల్, కాజీపేట, హనుమకొండతో పాటు జనగామకు తాగునీరురెండు భాగాలుగా నీటి పంపిణీ : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిదేవాదుల పంపుహౌస్ నుంచి వచ్చే నీటిని రెండు భాగాలుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ కేంద్రంగా ప్రారంభించిన దేవన్నపేట పంపుహౌస్‌తో 5,22,522 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 17,545 ఎకరాలకు ఉత్తర భాగం ప్రధాన కాల్వ ద్వారా, అదేవిధంగా దక్షిణభాగం కాల్వ గుండా స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 1,58,948 ఎకరాలతోపాటు ధర్మసాగర్ తర్వాత బొమ్మకూర్, తపాసుపల్లి, గండిరామారం, అశ్వారావుపల్లి పరిధిలోని 3,46,029 ఎకరాలకు నీరు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడునగరాలతోపాటు జనగామ పట్టణానికి తాగునీరు అందించేందుకు దోహదపడుతుందన్నారు. -
పాఠాలు
మహబూబాబాద్శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025కంప్యూటర్నేడు కమిషనర్లతో ఫోన్ ఇన్జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల వివరాలు ప్రాథమిక పాఠశాలలు 676విద్యార్థులు 22,354ప్రాథమికోన్నత పాఠశాలలు 120● 50మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అవకాశం ● జిల్లాలో 102 స్కూళ్ల గుర్తింపు ● కంప్యూటర్లు సరఫరా చేసేందుకు కసరత్తు ● మంచి పరిణామం అంటున్న విద్యానిపుణులువిద్యార్థులు 8,879సాక్షి, మహబూబాబాద్: మారుతున్న కాలంతోపాటు విద్యార్థుల మానసిక, చదువు సామర్థ్యాలను పెంచాలి. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తయారు చేయాలంటే అందుకు అనుగుణంగా బోధన చేపట్టాలి. ఇందుకోసం మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడే లక్ష్యాలను సాధించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) బోధన మొదలు పెట్టగా.. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను నేర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కనీసం 50 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసి కంప్యూటర్లు సరఫరా చేసేందుకు కసరత్తు చేశారు. 102 ప్రాథమిక పాఠశాలల గుర్తింపు.. కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేపట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం విద్యార్థులకు కంప్యూటర్లను అందుబాటులోకి తెస్తోంది. 50మందికి పైగా విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో మొత్తం 898 ప్రభుత్వ పాఠశాలల్లో 50,060 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 50 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ప్రాథమిక పాఠశాలలు 102 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలల్లో చదివే పది మంది విద్యార్థులను ఒక గ్రూప్‌గా చేసి వారికి ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన కంప్యూటర్ కేటాయిస్తారు. ఇలా పాఠశాలలో ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని కంప్యూటర్లు మంజూరయ్యే అవకాశం ఉంది. కాగా ప్రతీ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కనీసం ఐదు నుంచి పది కంప్యూటర్లు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థిస్థాయికి తగిన బోధన... ప్రస్తుత సమాజంలో సంవత్సరం నిండని పిల్లలు కూడా సెల్‌ఫోన్స్, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈక్రమంలో సాధారణ బోధన కాకుండా విద్యార్థులు ఇష్టంగా చదువుకునేందుకు కంప్యూటర్ బోధన దోహదపడుతుందని విద్యా నిపుణుల అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి వారికి ఇష్టమైన అంశాలను తీసుకొని బోధించేందుకు కంప్యూటర్ శిక్షణ దోహదపడుతుంది. అయితే ఇందుకోసం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలా చేయడం వల్ల చదువులో వెనకబడిన విద్యార్థులు కూడా కనీస సామర్థ్యాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా ఈ వేసవిలో పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరం నుంచే పిల్లలకు కంప్యూటర్ పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.ఉన్నత పాఠశాలలు 102మొత్తం పాఠశాలలు 898మహబూబాబాద్/తొర్రూరు: సాక్షి ఆధ్వర్యంలో నేడు(శుక్రవారం)మానుకోట మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్‌లతో వేర్వేరుగా ‘ఫోన్‌ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఆయా మున్సిపాలిటీల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, కుక్కలు, కోతుల బెడద తదితర సమస్యలపై ఫోన్‌చేసి కమిషనర్లతో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలను ఈ కింద ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలి. -
పనికోసం వచ్చి ప్రాణం కోల్పోయాడు..
డోర్నకల్ : డోర్నకల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వలస కూలీ అస్వస్థతకు గురై ప్రాణం కోల్పోయా డు. ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడెం ప్రాంతానికి చెందిన కొంతమంది కూలీలు వారం క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూడూరుపాడు ప్రాంతంలో మిర్చి ఏరేందుకు వచ్చారు. దుబ్బగూడెం ప్రాంతానికే చెందిన మడై సుపరి (30), బీంబాయి దంపతులు తమ ఏడాదిన్నర పాపతో గూడూరుపాడు సమీపంలో ఉన్న తమ బంధువుల వద్దకు రావడానికి గురువారం ఆదిలాబాద్ నుంచి డోర్నకల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుపరి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో టికెట్ బుకింగ్ కార్యాలయం సమీపంలో కూర్చున్న చోటే ప్రాణం కోల్పోయాడు. మృతదేహం పక్కన అతడి భార్య బీంబాయి తన చంటిపాపతో గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలిచివేసింది. గూడూరుపాడు నుంచి బంధువులతో పాటు రైతులు వచ్చి మృతదేహాన్ని ప్రైవేట్ వాహనంలో సొంత గ్రామానికి తరలించారు.అస్వస్థతతో వలస కూలీ మృతి డోర్నకల్‌లో ఘటన -
రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఖిలా వరంగల్: రైతులు శాస్త్రసాంకేతిక పద్ధతులు వినియోగించి అధిక రాబడి పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ నక్కలపల్లి సమీపంలోని జీఎం కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అధ్యక్షతన మూడురోజులుగా నిర్వహించిన రైతు ఉత్పత్తుల మేళా గురువారం సాయంత్రం ముగిసింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు మంచి విత్తనాలు, తగినంత విద్యుత్ సరఫరా పొందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇలాంటి రైతు ఉత్పత్తుల మేళాలు రైతుల్లో కొత్త అధ్యాయానికి బాటలు వేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో నూతన అధ్యాయాన్ని జోడిస్తాయన్నారు. మండలాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు మేళాలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 40కి పైగా ఎఫ్పీఓలు, వ్యవసాయ అనుబంధ శాఖలు 10కిపైగా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. రైతులు ఈ స్టాళ్లను ఆసక్తిగా తిలకించి అవసరమైన పరికరాలను కొనుగోలు చేశారు. అనంతరం ఎఫ్పీఓలు ఏర్పాటు చేసిన 40 స్టాళ్లలో ప్రతిభ కనబరిచిన స్టాల్ నిర్వాహకులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు అందించి అభినందించారు. అలాగే, కలెక్టర్‌ను వ్యవసాయ అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారి (డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్) రమన్‌సింగ్, అసిస్టెంట్ రిజి స్ట్రార్ జగన్మోహన్రావు, నాబార్డ్ ఏజీఎం రవి, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజన్న, ఇన్చార్జ్ ఏడీఏ యాకయ్య, ఏఓ రవీందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద ముగిసిన రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తుల మేళా -
వాగ్దేవి కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు
హన్మకొండ: వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం కాంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిషన్స్ ప్రొఫెసర్ కె.రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో మొత్తం ఉత్తీర్ణత 56.65 శాతం ఉందన్నారు. కోర్సుల వారీగా ఫలితాలు చూస్తే... బీబీఏలో 63.80 శాతం, బీకాంలో 60.57 శాతం, బీఎస్సీలో 51.87 శాతం, బీసీఏలో 57,27 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, బోధన సిబ్బందికి అభినందనలు తెలిపారు. స్వయంప్రతిపత్తి విద్యా రంగం విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఎంతో సహాయపడుతుందన్నారు. ప్రిన్సిపాల్ డా.ఎ.శేషాచలం మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకుల కృషిని కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకుడు, కార్యదర్శి డాక్టర్ సీహెచ్ దేవేందర్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ వాహినీ దేవి, ప్రొఫెసర్ బెనర్జీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హరిందర్ రెడ్డి, ప్రొఫెసర్ రాజిరెడ్డి, కంట్రోలర్ సి.దత్తాత్రేయులు, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవార్ల బంగారం, వెండి తూకం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మకు భక్తులు మొక్కుగా సమర్పించిన బంగారం, వెండి మిశ్రమాన్ని దేవాదాయశాఖ అధికారులు గురువారం తూకం వేశారు. బుధవారం మినీ జాతర హుండీల కానుకలు లెక్కించిన విషయం తెలిసిందే. 2024లో జరిగిన మహాజాతర తర్వాత భక్తులు సమర్పించిన బంగారం, వెండి మిశ్రమాన్ని అధికారులు సీల్ వేసి హుండీల్లోనే ఉంచారు. మినీ జాతర వరకు వచ్చిన బంగారం, వెండి మిశ్రమాన్ని పూజారుల సమక్షంలో స్వర్ణకారుడితో తూకం వేయించారు. సమ్మక్క హుండీలో బంగారం 42 గ్రాములు, వెండి 3కిలోల 110 గ్రాములు, సారలమ్మ హుండీలో బంగారం 14 గ్రాములు, వెండి 2కిలోల 500 గ్రాములు భక్తులు సమర్పించినట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. ఈకా ర్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పరకాల డివిజన్ ఇన్స్పెక్టర్ కవిత, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, పూజారులు ముణిందర్, కృష్ణయ్య, చందా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. 200 గజాలు.. ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.14.46 కోట్లుజనగామ: సాంకేతిక లోపమా.. అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ.. 200 గజాల స్థలానికి.. ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.14.46 కోట్లు చూపించారు. దీంతో కస్టమర్ ఖంగుతిన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ పట్టణానికి చెందిన కారంపూరి శ్రీనివాస్ తనకున్న 200 గజాల స్థలాన్ని లే అవుట్ రెగ్యులరైజేషన్(ఎల్ఆర్ఎస్) చేసుకునేందుకు 2020 సెప్టెంబర్ 14న రూ.1,000 ఫీజు చెల్లించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ పూర్తి చేసుకునేలా అవకాశం కల్పించింది. ఈనెల 26న ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు వెబ్సైట్ ఓపెన్ చేయగా.. 14 శాతం ఓపెన్ ప్లేస్, రెగ్యులరైజేషన్, ప్లాట్ మార్కెట్ విలువ కలుపుకుని 25 శాతం రాయితీ అమౌంట్ రూ.90,52,950 మినహాయించి.. మిగతా రూ.14.46 కోట్లు చెల్లించాలని చూపించింది. దీంతో ఒక్కసారిగా టెన్షన్‌కు గురైన శ్రీనివాస్ వెంటనే తనకు తెలిసిన అధికారులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని వివరించారు. దీనిపై కలెక్టర్ రిజ్వాన్ బాషాను అడగ్గా రాష్ట్రంలో పలుచోట్ల ఇలాగే వచ్చినట్లు సమాచారం ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కరెక్టు చేసేలా చూస్తామన్నారు. -
బతుకుదెరువు కోసం వెళ్లి బలి..
లింగాలఘణపురం : మండలంలోని మాణిక్యాపురం గ్రామానికి చెందిన వడగం భాస్కర్ (45) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పని చేస్తూ దుర్మరణం చెందాడు. గ్రామంలో ఉపాధి లేక సుమారు పదిహేనేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. జగద్గిరిగుట్టలోని ఓ పైపుల కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రోజువారీగా పనికి వెళ్లిన భాస్కర్.. లిఫ్ట్‌లో ఏర్పడిన లోపంతో ఒక్కసారిగా పైనుంచి కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. భాస్కర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, భాస్కర్ పదో తరగతి స్నేహితులు (1994–1995 బ్యాచ్) ఆ కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మబ్బు మల్లేశం, జహింగాచారి, సురేశ్, రమేశ్, రాజు, శ్రీనివాస్, శ్రీధర్, భాస్కర్, బ్రహ్మం తదితరులు ఉన్నారు.లిఫ్ట్ నుంచి పడి వ్యక్తి దుర్మరణం హైదరాబాద్‌లో మండల వాసి మృతి -
మొక్కజొన్న చేను వద్దకు వెళ్తూ మృత్యుఒడికి..
సంగెం: మొక్కజొన్న చేను చూసి రావడానికి వెళ్తున్న ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. ఓ కంటైనర్ అతివేగం, అజాగ్రత్తగా వస్తూ ఎదురుగా బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గవిచర్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కళావతి, గాలి కుమారస్వామిని 20 ఏళ్లక్రితం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కుమారుడు చందు(18) ఉన్నా డు. 10 ఏళ్ల క్రితం కుమారస్వామి మృతి చెందగా కళావతి అదే గ్రామానికి చెందిన దుడ్డు రవిని రెండో వివాహం చేసుకుంది. అతను కూడా మృతి చెందాడు. అప్పటి నుంచి కళా వతి.. కుమారుడు చందుతో కలిసి జీవిస్తోంది. చందు ఇంట ర్మీడియట్ చదువుతూనే తల్లికి వ్యవసాయంలో చేదోడువా దోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బైక్‌పై మొక్కజొన్న చేను వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఓ కంటైనర్ అతివేగం, అజాగ్రత్తగా వస్తూ ఎదురుగా బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో చందుకు తీవ్ర గాయాలుకావడంతో వెంటనే ఎంజీఎంకు తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతుడి తల్లి కళావతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు. కాగా, చేతికి అందొస్తున్నావు.. ఇక నా కష్టాలు త్వరలోనే తీరుతాయని అనుకుంటే ఇలా అర్ధాంతరంగా చనిపోయావా బిడ్డా అంటూ చందు మృతదేహాన్ని చూసి తల్లి గుండెలవిసేలా రోదించించింది. ఇక తాను ఎవరికోసం బతకాలంటూ బోరున విలపించింది. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న లారీ.. ● యువకుడి దుర్మరణం స్టేషన్‌ఘన్‌పూర్: ఇసుక లారీ అతివేగం, అజాగ్రత్తగా వస్తూ వాటర్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా ఇరు డ్రైవ ర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఛాగల్లు శివారులో జా తీయ రహదారిపై జరిగింది. సీఐ వేణు కథనం ప్రకారం.. మండలంలోని రాఘవాపూర్‌కు చెందిన హరీశ్(28) రోజూ రాఘవాపూర్ నుంచి ఛాగల్లు వరకు వాటర్ ట్యాంకర్‌తో జాతీయ రహదారిపై డివైడర్‌పై ఉన్న మొక్కలను నీరు పోస్తుంటాడు. గురువారం కూడా పోస్తున్నాడు. ఈ క్రమంలో జనగామ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న లారీ.. ట్యాంకర్ వెను క నుంచి నీరు పడుతున్న హరీశ్‌తోపాటు ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హరీశ్ లారీ, ట్యాంకర్ మధ్య ఇరుక్కుని దుర్మరణం చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ బెజ్జం రమేశ్, లారీ డ్రైవర్ సిద్ధగోని స్వామికి గాయాలయ్యాయి. విషయం తె లుసుకున్న డీసీపీ రాజమహేంద్రనాయక్, సీఐ వేణు, ఎస్సై వినయ్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకుని హరీశ్ మృతదేహాన్ని స్థానికుల సహకారంతో బయటకు తీశారు. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, మూడు నెలల వయసున్న కుమార్తె ఉంది. ఏకశిల స్కూల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి .. ఐనవోలు: గుర్తుతెలియని వాహనం ఢీకొ ని ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందా డు. ఈ ఘటన మండలంలోని పున్నేలు క్రాస్ ఏకశిల స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తిని పెద్ద వాహనం ఢీకొన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మృతుడు సిమెంట్ రంగు ప్యాంట్, లేత నీలిరంగు, మెరూన్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్టు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 8712685244, 8712685030 నంబర్లలో(ఐనవోలు పోలీస్ స్టేషన్) సంప్రదించాలని ఎస్సై పేర్కొన్నారు. బైక్‌ను ఢీకొన్న కంటైనర్ యువకుడి మృతి..గవిచర్లలో ఘటన -
ఆదివాసీల కోసం అసువులు బాసిన రాము
కొత్తగూడ: ఆదివాసీ సమాజ అభివృద్ధి కోసం గెరిల్లా పోరాట పంథాను ఎంచుకున్న ఉద్యమ సహచరుడు, తన భర్త కుంజ రాము అసువులు బాసాడని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాము స్వగ్రామం మండలంలోని మోకాళ్లపల్లిలో నిర్వహించిన ఆయన 20వ వర్ధంతి సభలో మంత్రి మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ సమాజం విద్య, వైద్యం, అభివృద్ధికి దూరం అవుతున్నారని, వాటిని గెరిల్లా ఉద్యమాల ద్వారా సాధించుకోవాలనే లక్ష్యంతో ఆదివాసీ లిబరేషన్ టైగర్ స్థాపించి ఆదివాసీలను చైతన్యం చేస్తూ అజ్ఞాత జీవితం గడిపిన రాము స్మరించుకోవడం ప్రతీ ఆదివాసీ బిడ్డ కర్తవ్యమన్నారు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే కలిసి ఉద్యమాలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి తమ వంతుగా ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి వైపునకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. కన్నీరు పెట్టుకున్న మంత్రి.. అజ్ఞాత ఉద్యమంలో సహచరుడు, తన భర్త కుంజ రాము వర్ధంతి సభలో స్మృతులను తలచుకుని మంత్రి సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. సీతక్కను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క ఓదార్చారు. అనంతరం రాము స్మారక స్తూపం వద్ద నివాళులర్పించి, రాము జీవితంపై రచించిన పాటల సీడీలను ఆవిష్కరించారు. ఆదివాసీల అభ్యున్నతికి బాటలు వేద్దాం : కుంజ సూర్య ఆదివాసీల విద్య, ఉద్యోగం కోసం తన సంపాదనలో 20 శాతం కేటాయిస్తానని మంత్రి తనయుడు కుంజ సూర్య ప్రకటించారు. తన తండ్రి ఆశయాలు నెరవేరాలంటే ఉన్నత ఉద్యోగాల్లో ఆదివాసీలు రావాలని అభిప్రాయపడ్డారు. అందుకు కావాల్సిన కోచింగ్‌తో పాటు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రత్యేక సంస్థను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఈసభకు కుంజ శ్రీను అధ్యక్షత వహించగా తుడుందెబ్బ నాయకులు రమణాల లక్ష్మయ్య, వట్టం ఉపేందర్, ఆగబోయిన రవి, పోడెం బాబు, రచయిత యోచన, నాయకులు స్వామి, యాకయ్య, ముంజాల భిక్షపతి, మాజీ దళ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉద్యమ సహచరుడిని గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న మంత్రి మోకాళ్లపల్లిలో రాము వర్ధంతి సభ -
సారయ్యకు కన్నీటి వీడ్కోలు
కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం తరాలపల్లి ఎర్రజెండాలతో ఎరుపెక్కింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన గ్రామానికి చెందిన అంకేశ్వరపు సారయ్యకు కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య అలియాస్ సుధాకర్, సుధీర్, ఎల్లన్న మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు బుధవారం ఛత్తీస్‌గఢ్ వెళ్లి అక్కడి కాంకేర్ ఆస్పత్రి నుంచి సారయ్య మృతదేహం తీసుకుని గురువారం ఉదయం స్వగ్రామం తరాలపల్లికి చేరుకున్నారు. ఇక్కడ అమరుల బంధు మిత్రుల సంఘం, విరసం నేతలు, పౌర హక్కుల సంఘం నాయకుల సందర్శన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. సారయ్య చితికి తన సోదరుడు రవీందర్ నిప్పంటించారు. అన్నా ఎక్కడ ఉన్నా బతికి వస్తావనుకున్నా.. కానీ ఇలా నీకు అంత్యక్రియలు చేయాల్సి వస్తుందని అనుకోలేదన్న అంటూ బోరున విలపించాడు. ఇంటి నుంచి శ్మశానం వరకు గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు విప్లవ గీతాలు ఆలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. పలువురి పరామర్శ.. సారయ్య మృతదేహానికి తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మె ల్యేలు అరూరి రమేశ్, వినయ్‌భాస్కర్, కాంగ్రెస్ నా యకుడు నమిండ్ల శ్రీనివాస్, ఉద్యమ నాయకుడు గాదె ఇన్నయ్య, మావోయిస్టు నేత ఏసోబు కుమారుడు మహేశ్ తదితరులు నివాళులర్పించారు. ఎరుపెక్కిన తరాలపల్లి ముగిసిన ‘అంకేశ్వరపు’ అంత్యక్రియలు పలువురి సంతాపం -
ఈ–స్టోర్.. ఈజీ
ఇ విధానంలో త్వరితగతిన మెటీరియల్ విడుదలఈ–స్టోర్‌తో త్వరితగతిన మెటీరియల్ విడుదలఈ–స్టోర్ విధానంతో త్వరితగతిన మెటీరియల్ విడుదలవుతోంది. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌కు ముందు సెక్షన్ ఏఈ పేపర్‌పై అవసరమైన మెటీరియల్ జాబితా తయారు చేసుకుని ఏడీఈ వద్దకు వెళ్లి అనుమతి తీసుకుని స్టోర్‌లో అందించేవారు. ఇది వ్యయప్రయాసాలతో కూడుకున్న అంశం. ఈ–స్టోర్‌తో అంతా ఆన్లైన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. –పి.మధుసూదన్ రావు, ఎస్ఈ, హనుమకొండ సకాలంలో పనులు పూర్తవుతున్నాయిఈ–స్టోర్ అమలుతో సకాలంలో పనులు పూర్తవుతున్నాయి. కాలయాపన లేదు. పేపర్ ద్వారా జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఈ –స్టోర్ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో విద్యుత్ శాఖ, వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతోంది. –కె.గౌతం రెడ్డి, ఎస్ఈ, వరంగల్హన్మకొండ : విద్యుత్ శాఖలో ఒకప్పుడు పనులు కావాలంటే కాగితాల ద్వారా జరిగేవి. ఈ విధానం వ్యయప్రయాసాలతో కూడుకున్న అంశం. ఎందుకంటే ఒక అధికారి నుంచి మరో అధికారికి, అతడి నుంచి ఉన్నతాధికారికి ఇలా.. రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టేది. ఫలితంగా పనులు ఆలస్యంగా జరిగేవి. దీంతో అధికారులతోపాటు వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ మండలి సాంకేతిక వినియోగానికి పెద్దపీట వేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న టెక్నాలజీని కంపెనీ అందిపుచ్చుకుంటూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఈ–స్టోర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇంతకు ముందు కాగితాల(పేపర్) ద్వారా పనులు జరిగేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఒకే రోజు అది కూడా గంటల్లో పనులు జరిగిపోతాయి. ఈ విధానంలోనే ఎన్పీడీసీఎల్లో మెటీరియల్ విడుదలకు ఈ–స్టోర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. పేపర్ విధానంలో మెటీరియల్ విడుదల తీవ్ర కాలయాపన.. ప్రతీ ఉమ్మడి జిల్లా స్థాయిలో విద్యుత్ మెటీరియల్ స్టోర్ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఏ అభివృద్ధి పనులు జరిగినా ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకెళ్లాలి. అయితే మెటీరియల్ విడుదలకు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సెక్షన్ ఏఈ అవసరమైన ఇండెంట్ పెడుతారు. ఇది ఇక్కడి నుంచి ఏడీఈకి వెళ్తుంది. ఏడీఈ అనుమతితో స్టోర్‌కు చేరుకుంటుంది. అప్పుడు మెటీరియల్ విడుదలవుతుంది. పేపర్ విధానంలో ఇన్ని స్టేజీలు దాటాలంటే ఎంత సమయం పడుతుందో అంచనా వేయొచ్చు. పేపర్ ద్వారా మెటీరియల్ విడుదలలో ఆలస్యం జరుగుతుండడంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ ఈ –స్టోర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ–స్టోర్‌తో సమయానికి మెటీరియల్ చేతికి.. ఈ–స్టోర్ విధానంలో సంబంధిత సెక్షన్ ఏఈ మొదట ఒక పనికి కావాల్సిన మెటీరియల్స్ స్టాక్ ఉందో లేదో సాప్ (ఎస్.ఎ.పి) సాఫ్ట్‌వేర్‌లో ఆన్లైన్లో చూసుకుని రిజర్వ్ చేసుకుంటారు. రిజర్వ్ చేసుకున్న మెటీరియల్స్ తాలూకు సమాచారం ఎస్.ఎ.పి వర్క్ ఫ్లో ద్వారా సంబంధిత ఏడీఈకి, తర్వాత స్టోర్స్‌కి వర్క్ ఫ్లో ద్వారా ఆన్లైన్లో వెళ్తుంది. మెటీరియల్స్ స్వీకరించే అధికారికి, ఏ రోజు మెటీరియల్స్ విడుదల చేస్తారో.. ఆ తేదీని, సమయాని ఎస్ఎంఎస్, ఎస్.ఎ.పి మెయిల్ రూపంలో సమాచారం చేరవేస్తారు. దీంతో నిర్ణీత సమయానికి స్టోర్‌కు చేరుకుని మెటీరియల్ తీసుకెళ్తారు. తద్వారా క్షేత్ర స్థాయి అధికారులు పేపర్ పట్టుకుని ఉన్నతాధికారుల చుట్టూ, స్టోర్ చుట్టూ తిరగాల్సిన అవసరముండదు. సమయం ఆదా అవుతుంది. ఈ సమయాన్ని ఇతర పనులకు వెచ్చించొచ్చు. అదే విధంగా వ్యయప్రయాసాలు తగ్గుతాయి. ఈ –స్టోర్ విధానంలో పేపర్ ప్రస్తావన ఉండదు. మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. సమయానికి మెటీరియల్ చేతికి రావడం ద్వారా పనులు వేగంగా జరుగుతాయి. మెటీరియల్ కోసం ఎదురుచూపులు తగ్గుతాయి. ఆన్లైన్ ద్వారా బుకింగ్.. గంటల్లో పనులు పూర్తి టీజీ ఎన్పీడీసీఎల్లో సాంకేతికతకు పెద్దపీట పేపర్ పట్టుకుని అధికారుల చుట్టు తిరిగే విధానానికి స్వస్తి -
రూ. 12.80 లక్షల విలువైన గుట్కా పట్టివేత
ఖిలా వరంగల్: అక్రమంగా తరలిస్తున్న రూ.12.80 లక్షల విలువైన 50 బస్తాల పాన్ మసాలా (గుట్కా) ప్యాకెట్లు పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసిన ఆటో, కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. వరంగల్ ఉర్సు గుట్ట వద్ద కంటైనర్ నుంచి ఆటోలోకి 25 బస్తాలు విమల్ కంపెనీకి చెందిన పాన్ మసాలా ప్యాకెట్లు ఎగుమతి అవుతున్నాయని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్‌కు సమాచారం అందింది. దీతో ఏసీపీ ఆదేశాల మేరకు గురువారం ఉదయం వరంగల్ ఉర్సు గుట్ట వద్ద టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కంటైనర్తోపాటుఆటోలో తనిఖీ చేయగా.. ఎలాంటి అనుమతులు లేని 50 బస్తాల పాన్ మసాలా ప్యాకెట్లు కనిపించగా పట్టుకున్నారు. కర్ణాటక తుంకూర్లోని శివ ఎంటర్ప్రైజెస్ నుంచి తెలంగాణలోని హుజూర్‌నగర్‌కు చెందిన తవక్కల్ ట్రేడర్స్ పేరుతో బస్తా పాన్ మసాలాకు వేబిల్లు చూపుతూ.. మిగతా 49 బస్తాలకు అనుమతి లేకుండా వరంగల్ ఉర్సు గుట్ట వద్ద ఆటోలోకి 25 బస్తాలు ఎగుమతి చేస్తుండగా పట్టుకున్నారు. అనంతరం కర్ణాటక గుల్బర్గా మొఘచించోలికి చెందిన బీమ్‌రెడ్డి, ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు విద్యానగర్ కాలనీకి చెందిన గోపాల మధు, వరంగల్ కాశిబుగ్గ శాంతినగర్ చెందిన ఎండి. జమీల్ హైమద్ అదుపులోకి తీసుకుని తదిపరి విచారణ నిమిత్తం మిల్స్‌కాలనీ పోలీసులకు కేసును అప్పగించినట్లు టాస్క్ఫోర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, మిల్స్‌కాలనీ పోలీసులు పాల్గొన్నారు. ● ముగ్గురి అరెస్ట్ -
నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు
గార్ల: ప్రభుత్వ నిబంధనలు పాటించని ఎరువులు, పురుగుమందుల దుకాణాల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏఓ విజయనిర్మల హెచ్చరించారు. బుధవారం గార్లలోని పలు ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. దుకాణాల్లో వ్యాపారులు రిజిస్టర్లు, బిల్‌బుక్స్, ఇన్వాయిస్లు, లైసెన్స్, ఓఫారంలను సక్రమంగా నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఎరువులు, పురుగుమందులనే విక్రయించాలని, గడువు దాటిన మందులను అమ్మితే దుకాణాదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డీఏఓ వెంట మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు, ఏఈఓ కిరణ్ తదితరులు ఉన్నారు. -
విద్యుత్ ఏడీఈల సీనియారిటీ రెడీ..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసేందుకు యాజమాన్యం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా విద్యుత్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ల తాత్కాలిక సీనియారిటీ జాబితా ఎట్టకేలకు రూపొందించింది. ఇప్పటికే ఇంజనీర్ల అసోసియేషన్ నాయకులతో విస్తృత సంప్రదింపులు జరిపి, చర్చించి రూపొందించిన జాబితాపై మరోసారి అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. తాత్కాలిక జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లో తెలిపేందుకు అవకాశం కల్పించింది. ఈ తాత్కాలిక జాబితా ఈ నెల 25వ తేదీన రాత్రి విడుదల చేసింది. ఈ లెక్కన ఏప్రిల్ 8వ తేదీలోపు అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. అనంతరం పూర్తి స్థాయిలో తుది జాబితా రూపొందిస్తారు. ఇప్పటికే 10 మంది వరకు ఏఈల రిటైర్డ్.. టీజీ ఎన్పీడీసీఎల్లో పదోన్నతుల కోసం ఏడీఈలు, ఏఈలు కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియ జాప్యమవుతున్న క్రమంలో ఏఈలు ఒక్కొక్కరుగా రిటైర్డ్ అవుతున్నారు. ఇప్పటికే 10 మంది వరకు రిటైర్డ్ అయ్యారని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. ఇంకా ఆలస్యమైతే మరికొంత మందికి అన్యాయం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు ఏడీఈలకు డివిజనల్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పిస్తే ఖాళీలు పెరిగే అవకాశముంది. దీంతో పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న ఆశావహులైన ఏఈలకు ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు లభించే అవకాశముంది. 70 మందితో ఏడీఈల తాత్కాలిక సీనియారిటీ.. ఏడీఈల తాత్కాలిక సీనియారిటీ జాబి తా 70 మందితో రూపొందించారు. ఇందులో ఇప్పటికే ముగ్గురు పదోన్నతి పొందారు. వీరిలో ఇప్పట్లో అందరికి పదోన్నతి లభించే అవకాశం లేదు. సీని యారిటీ ప్రకారం డీఈ పోస్టులు ఖాళీ అవుతున్న కొద్దీ జాబితాలో పేర్కొన్న సీనియారిటీ ప్రకారం క్రమంగా పదోన్నతి లభించనుంది. ఏడీఈల సీనియారిటీ జాబితాతో తమకు కూడా పదోన్నతి కల్పిస్తారని ఏఈలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ నాయకులు పట్టుదలకు పోకుండా పదోన్నతి ప్రక్రియ సజావుగా, త్వరగా ముగిసేలా సహకరించాలని ఆశావహులు కోరుతున్నారు.తాత్కాలిక జాబితాలో 70 మందికి చోటు ఇందులో ఇప్పటికే ముగ్గురికి పదోన్నతి ప్రమోషన్లకు తొలుగుతున్న అడ్డంకులు ఏడీఈలకు డీఈలుగా పదోన్నతులు ఇస్తే.. ఏఈలకు లైన్ క్లియర్ -
సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
● జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఖిలా వరంగల్: రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు పొందాలని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచించారు. వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ వరకు జరిగే రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓ) మేళా బుధవారం రెండు రోజు కొనసాగింది. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని స్టాళ్లను తిలకించారు. మేళాలో సేంద్రియ సాగు, విత్తనాలు, పంట సాగు, యాంత్రీకరణ సాగు, ఉద్యాన పంటలు, తదితర అంశాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. నూతన పనిముట్లను రైతులకు పరిచయం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఏఓ మాట్లాడారు. రైతులు ఆధునిక సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, యంత్రీకరణ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి(డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్) రమన్ సింగ్, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, నాబార్డు ఏజీఎం రవి, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వరంగల్ చీఫ్ మేనేజర్లు గిరిబాబు, శివప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు, కేవీకే శాస్త్రవేత్తలు సాయి కిరణ్, సౌమ్య, జన్యు శాస్త్రవేత్తలు వెంకన్న, సంధ్య కిశోర్, సంగీతలక్ష్మి, ఏడీఏ యాకయ్య, ఏఓ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి అధికారులకు శిక్షపడాలి
హన్మకొండ చౌరస్తా: లంచం తీసుకుంటూ పట్టుబ డిన అధికారులకు శిక్షపడేలా పటిష్ట చట్టాలు అమలు చేయాలని, అప్పుడే అవినీతి తగ్గుతుందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారా యణ అభిప్రాయపడ్డారు. జ్వాలా స్వచ్ఛంద సంస్థ, లోక్‌సత్తా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో లంచం ఆ శించిన అధికారులను ఏసీబీకి పట్టించిన పౌరులను బుధవారం సన్మానించారు. హనుమకొండలోని క ల్యాణి ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజం నుంచి లంచం అనే మహమ్మారిని సమూలంగా నిర్మూలించాలంటే రాజకీయాలు, చ ట్టాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. రూ. వందల కోట్లతో పోటీ చేసే ధోరణి పో వాలని, ఇటీవల హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం కలిచివేసిందన్నారు. ఏసీబీని ఆశ్రయించి అవినీతి అధికారులను పట్టించే యువత మ రింత ముందుకు రావాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెంది విజయ్, శివరాజ్, కమలాపూర్‌కు చెందిన గోపాల్ సన్మానించి ఒక్కొక్కరికి రూ.5వేల నగదు పురస్కారం అందజేశారు. లోక్‌సత్తా సంస్థ సలహాదారుడు కోదండరామారావు, జ్వాలా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్, అంజలీదేవి, పర్యావరణ ప్రేమికుడు ప్రకాశ్, సీకేఎం కళాశాల రిటైర్డ్ అధ్యాపకుడు సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఏసీబీకి పట్టించిన పౌరులకు సన్మానం -
మినీ జాతర ఆదాయం రూ.1.08 కోట్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మినీ జాతరలో భక్తులు అమ్మవార్లకు సమర్పించిన హుండీల కానుకలను బుధవారం లెక్కించారు. మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయ డార్మెటరీ భవనంలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారుల సమక్షంలో ఈఓ రాజేంద్రం పర్యవేక్షణలో కానుకలు లెక్కించారు. ఇందులో సమ్మక్క హుండీ ఆదాయం రూ. 58,66,409, సారలమ్మ ఆదాయం రూ. 45,61,892, పగిడిద్దరాజు ఆదాయం రూ. 1,61,003, గోవిందరాజు హుండీ ఆదాయం రూ. 2,13,863 మొత్తం రూ. 1,08,03,173 ఆదాయం వచ్చినట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. భక్తులు విదేశీ డాలర్లు సమర్పించినట్లు పేర్కొన్నారు. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కానుకల లెక్కింపు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ఇన్స్పెక్టర్ కవిత, తదితరులు పాల్గొన్నారు. హుండీ కానుకల లెక్కింపు చేపట్టిన అధికారులు -
గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడని..
తండ్రిపై కుమారుడు, కోడలు దాడి ● తీవ్రంగా గాయపడిన వృద్ధుడు ● బమ్మెరలో ఘటన పాలకుర్తి టౌన్: భూ వివాదం నేపథ్యంలో స్థా నిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడనే కోపంతో తండ్రిపై కుమారుడు, కోడలు దాడికి పాల్పడిన ఘటన పాలకుర్తి మండలం బమ్మెరలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి చేతిలో చిల్లి గవ్వ లేక కొడుకులకు రాసిచ్చిన భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఈనెల 25న తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో గ్రామానికి చెందిన దుంప సోంమల్లు ఫిర్యాదు చేశాడు. తండ్రి బయటకు వెళ్లిన కొద్ది సేపటికే పెద్ద కుమారుడు వచ్చి తన భూమిని విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికే వృద్ధుడి గోడు విని చలించిన తహసీల్దార్ శ్రీనివాస్.. తండ్రికి ఇస్తాన్నన డబ్బు ఇవ్వలేని పక్షంలో ముగ్గురి కుమారుల పేరిట చేసిన భూ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తానని హెచ్చరించాడు. తండ్రి ఇవ్వాల్సిన డబ్బు రూ.3 లక్షలు ఇచ్చేది లేదని బుధవారం చిన్న కుమారుడు ఐలయ్య, కోడలు ఐలమ్మ.. సోంమల్లుపై దాడికి పాల్పడ్డాడరు. ఈ ఘటనలో సోంమల్లు తల పగిలింది. వెంటనే చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్ప్రతికి తరలించారు. కాగా, సోంమల్లు నెల క్రితం తనకు న్యాయం చేయాలని జిల్లా లీగల్ సర్వీస్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. పర్యావరణ సమతుల్యత పాటించాలి● కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: వనరులను సంరక్షించుకునేందుకు,పర్యావరణ సమతుల్యతను పెంపొందించుకునేందుకు మెటీరియల్ సైన్స్ దోహదపడుతుందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. నగరంలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో ‘ఇంటర్ డిసిప్లినరీ మెటీరియ ల్స్ సైన్స్ ఫర్ సస్టేనబుల్ ఎనర్జీ అండ్ ఎన్వి రాన్మెంట్ (ఎన్‌సీఐఎంఎస్‌ఎస్‌ఈఈ–2025)’ అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సు బుధవారం హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సృజనాత్మక ఆలోచనలతో సుస్తిరాభివృద్ధిలో భాగం కావాలని, వివిధ రకాల నైపుణ్యాల్ని వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ ఎన్ఐటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ డి.హరినాథ్, సదస్సు కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.అరుణ, ఎన్‌వైకే డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్.అన్వేశ్, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, కో–కన్వీనర్ కవిత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేశ్‌బాబు, అకడమిక్ కో–ఆర్డినేటర్ అరుణ, అధ్యాపకులు హెప్సిబా, ప్రవీణ్‌కుమార్, పాల్గొన్నారు. -
మూల్యాంకనంలో నిబంధనలు పాటించాలి
వరంగల్: ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో నిబంధనలు పాటించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, వరంగల్ క్యాంప్ ఆఫీసర్ శ్రీధర్ సుమన్ అన్నారు. బుధవారం వరంగల్‌లోని ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో మూల్యాంకన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టుల మూల్యాంకన సిబ్బందితో మాట్లాడారు. మూల్యాంకనంలో కచ్చితంగా సమయ పాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో అందరూ సకాలంలో హాజరుకావాలన్నారు. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి ఆయా స్పెల్ వారీగా శిక్షణఇచ్చి మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూల్యాంకనాన్ని బోర్డు అధికారులు కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పరిశీలిస్తున్నారని, సకాలంలో స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో సహాయక క్యాంపు అధికారులు మాధవరావు, విజయ నిర్మల, కార్యాలయ సిబ్బంది రఫీ తదితరులు పాల్గొన్నారు. డీఐఈఓ శ్రీధర్ సుమన్ -
ఓరుగల్లు చరిత్రకారులకు నిలయం..
ఓరుగల్లుకు అద్భుత ఖ్యాతి ఉందని, చరిత్రకారులు, సాహితీవేత్తలకు, కళాకారులకు నిలయమని సోల్జర్ షఫీ పేర్కొంటున్నారు. భారత సైన్యంలో సైనికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వరంగల్‌కు చెందిన సోల్జర్ షఫీకి నాటకాలు అంటే ఎనలేని ప్రేమ. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేస్తున్నారు. బ్యాంకు వారు నిర్వహించే కార్యక్రమాల్లో వరంగల్ తరఫున పాల్గొని జాతీయస్థాయిలో ఎన్నో బహుమతులు అందుకున్నారు. ఫ్రీడం ఫైటర్, నీరా ఆర్య, జమీలాబాయ్, మహానటుడు, చల్‌చల్ గుర్రం నాటకాలకు దర్శకత్వం వహించారు.– సోల్జర్ షఫీ -
సమస్యలు పరిష్కరిస్తాం..
కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ ఇన్చార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) సింగని ప్రభాకర్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో స్థానికులు పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, కోతులు, కుక్కలు బెడద, రిజిస్ట్రేషన్‌తోపాటు పలు సమస్యలను విన్నవించుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని ఆర్ఐ తెలిపారు. కాగా ఫోన్ ఇన్ కార్యక్రమం అనంతరం రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని సిబ్బందితో తొలగించారు. ప్రశ్న: వీధుల్లో విద్యుత్‌స్తంభాలు ఉన్నప్పటికీ లైట్లు ఏర్పాటు చేయకపోవడం, విద్యుత్‌స్తంభాలకు లైట్లు ఉన్నా నెలల తరబడి వెలగడం లేదు. (వీఆర్ యాదవ్ కేసముద్రంస్టేషన్, నిమ్మల సంపత్ కేసముద్రంవిలేజ్, సోమారపు శ్రీరాములు అమీనాపురం, ఆరిద్రపు శ్రీనివాస్ అమీనాపురం, కటకం శంకర్ ధన్నసరి) మున్సిపల్ ఆర్ఐ: నిధుల కొరతతో లైట్లను ఏర్పాటు చేయలేకపోతున్నాం. త్వరలో సమస్య ఉన్న చోట వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తాం. ప్రశ్న: మా బజారులో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరుమోటారు 3నెలల క్రితం చెడిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. (బొల్లోజు రామ్మోహనాచారి, కేసముద్రంవిలేజ్, ట్యాంక్బజార్) మున్సిపల్ ఆర్ఐ: బోరు మోటారును బాగు చేయించడం కోసం ప్రయత్నించినా మరమ్మతు పూర్తికాలేదు. దగ్గరలో ఉన్న మిషన్‌భగీరథ వాటర్ ట్యాంకు నుంచి ప్రత్యేకంగా పైపులైన్‌ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తాం. ప్రశ్న: మా బజారులో సైడ్‌కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. దోమల తీవ్రతతో ఎక్కువైంది. రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయింది. (బనిషెట్టి విజయ మార్కెట్ రోడ్డు కేసముద్రం, కె.రాధాకృష్ణ, గూబ సంపత్, కేసముద్రంవిలేజ్, షేక్ ఇమ్రాన్ కేసముద్రంస్టేషన్, బనిషెట్టి సత్యనారాయణ అంబేడ్కర్ సెంటర్ కేసముద్రంస్టేషన్) మున్సిపల్ ఆర్ఐ: మా సిబ్బందిని పంపించి రోడ్లపై ఉన్న చెత్తచెదారాన్ని, సైడ్‌కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తాం. ట్రాక్టర్లు రావడం లేదని చెప్పే కాలనీల్లోకి కూడా చెత్త ట్రాక్టర్లను పంపిస్తాం. ప్రశ్న: ఇళ్లు, పంట చేనుల వద్ద కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుక్కలకు వింత జబ్బులు వస్తున్నాయి. వాటి బెడద ఎక్కువగా ఉంది. (గుండు దామోదర్ కేసముద్రంవిలేజ్ రైతు) మున్సిపల్ ఆర్ఐ: కుక్కల విషయంపై పశువైద్యాధికారి దృష్టికి తీసుకెళ్తాం. కోతుల విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: రోడ్ల విస్తరణ, రైల్వేమూడోలైన్ పనుల్లో భాగంగా భారీవాహనాలు నిత్యం ప్రధాన రహదారులపై తిరుగుతుండడంతో దుమ్ము,ధూళి లేవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. (గుతుప రమేశ్, రామడుగు ధర్మాచారి కేసముద్రంవిలేజ్) మున్సిపల్ ఆర్ఐ: మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్ నుంచి అమీనాపురం వరకు, ఉప్పరపల్లి రోడ్డు వైపు రోడ్లపైన దుమ్ము, ధూళి లేవకుండా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా నీళ్లు చల్లిస్తాం. ప్రశ్న: మున్సిపాలిటీ ఏర్పాటయ్యాక స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు కావడంలేదు. రిజిస్టేషన్లు చేయించుకున్న వారిపేర్లు జీపీ రికార్డులో నమోదు కాలేదు. (శ్యామేల్ కేసముద్రంస్టేషన్, తుమికి శ్రీదేవి లక్ష్మీనగర్ కేసముద్రంస్టేషన్) మున్సిపల్ ఆర్ఐ: మున్సిపల్ డాటా కనిపించకపోవడం వల్ల రిజిస్ట్రేషన్లు కావడం లేదు. హైదరాబాద్‌లోని సీడీఎంఏ ఆఫీస్‌లో డాటా మొత్తం అప్రూవల్ చేశాక,సమస్య పరిష్కారం అవుతుంది. త్వరలోనే రిజిస్టేషన్లు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై దృష్టి సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో కేసముద్రం మున్సిపల్ ఇన్చార్జ్ ఆర్ఐ ప్రభాకర్ -
ఓరుగల్లు కళారత్నాలు..
వరంగల్ రంగస్థలం.. కాకతీయుల కాలంలో ఎన్నో రకాల కళారూపాలు ప్రదర్శించేవారని క్రీడాభిరామం, నృత్యరత్నావళి, బసవపురాణం తదితర గ్రంథాల్లో పేర్కొనబడింది. చిందుల వారు, జక్కులవారు, తెరచీరల వారు, పేరిణి, ప్రేంకిణి వంటి ఎన్నో కళారూపాలు ప్రదర్శించేవారని తెలుస్తోంది. వాటిలో చాలా కళారూపాలు ఇప్పటికీ జానపదాల రూపంలో వ్యాప్తిలో ఉన్నాయి. ఆధునిక కాలంలో పౌరాణిక పద్యనాటకాలు రూపొందడానికి చరిత్ర ఉంది. 1940కి పూర్వమే మడికొండ, మొదలైన చోట్ల పద్యనాటక సమాజాలు ఏర్పడ్డాయి. 1943లో పాములపర్తి సదాశివరావు కాకతీయ కళాసమితి స్థాపించి భక్తరామదాసు నాటకం ప్రదర్శించారు. 1965లో శ్రీరాజరాజేశ్వరీ నాట్య మండలి, హిందూ డ్రమెటిక్ అసోసియేషన్ స్థాపించారు. ఆ తర్వాత ఓరుగల్లులో పద్యనాటకాల స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆజంజాహి మిల్స్ ఆర్ట్స్ అసోసియేషన్, మంజు ఆర్ట్స్ అసోసియేషన్, మారుతి నాట్యమండలి, శ్రీశారదా నాట్యమండలి తదితర అనేక సంస్థలు ప్రారంభమయ్యాయి. ఆజంజాహి మిల్లులో పనిచేసిన జమ్మలమడక కృష్ణమూర్తి శ్రీశారదానాట్య మండలిని ఏర్పాటు చేసి పద్యనాటకాలు ప్రదర్శించారు. వేమూరి శ్రీనివాసమూర్తి హార్మోనియం సహకారం అందించేవారు. మారేడోజు సదానందాచారి పౌరాణిక పాత్రలు పోషించేవారు. పందిళ్ల శేఖర్‌బాబు తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ స్థాపించి వరంగల్ పద్యనాటకానికి రాష్ట్రస్థాయిలో అనేక బహుమతులు వచ్చేలా కృషిచేశారు. మరోవైపు రేకందార్ నాగేశ్వరరావు స్థాపించిన సురభి భానోదయ నాట్యమండలి ఓరుగల్లు పద్యనాటకానికి రంగాలంకరణ సౌరభాలు అందించింది. నాటక రంగంలో ఓరుగల్లు కళాకారులు ప్రతిభ.. భారతీయ సంప్రదాయ నృత్యాలు, నాటక కళలకు ఓరుగల్లు పుట్టిల్లు. ఈ నేపథ్యంలో మన కళాకారులు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలిస్తూ పలువురు ప్రముఖులతో అవార్డులు, మన్ననలు పొందుతున్నారు. నిత్యం సాధన చేస్తూ పోటీల్లో ప్రతిభ చాటుతున్నారు. ఏదో ఒక పనిచేస్తూనే ఖాళీ సమయంలో వేదికలపై తమ నాటకాలు ప్రదర్శిస్తూ కళారత్నాలుగా విశేష గుర్తింపు తెచ్చుకుంటూ ప్రశంసలందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన కళాకారులకు నటక రంగంపై గల ఆసక్తి, సాధించిన విజయాలు, ఇతర వివరాలను తెలుసుకుందాం. నాటక రంగంలో విశేష గుర్తింపు తెచ్చుకుంటున్న కళాకారులుపాత్ర ఏదైనా సులభంగా పోషిస్తున్న మహానటులు నేడు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవంనాటకం.. సమాజంలో జరిగే యథార్థ ఘటనలకు ప్రతిరూపం. అది మంచి కావొచ్చు లేదా చెడు కావొచ్చు. కళాకారులు ఆయా ఘటనలకు సంబంధించిన పాత్రలు ధరించి ప్రజలను ఆలోజింపచేస్తారు. చైతన్య పరుస్తారు. అందుకే భారతీయ సమాజంలో నాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రీ.పూ నాలుగో శతాబ్దంలోనే భరతముని రచించిన నాట్యశాస్త్రం భారతీయ నాటకానికి ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తుంది. ప్రాచీనకాలంలో మహాకవి కాళీదాసు, భవభూతి రచించిన నాటకాలు ప్రసిద్ధి చెందాయి. మార్చి 27 అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ఈ నేపథ్యంలో ఓరుగల్లు కళాకారులకు నాటక రంగంపై గల ఆసక్తి.. వారు సాధించిన విజయాలు.. ఇతర వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సమాజానికి మంచి సందేశం.. నాటక రంగంలో పదేళ్ల అనుభవం ఉన్న నటుడు మాలి విజయరాజ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. మార్గదర్శి, అన్నదాత, ఏ నిమిషానికి ఏమీ జరుగునో, కనువిప్పు, వైద్యో నారాయణో హరీ, పరివర్తన, ఇదెక్కడి న్యాయం, ధనకాంక్ష తదితర నాటకాలు ప్రదర్శించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేది నాటక రంగమని పేర్కొంటున్నారు మాలి విజయరాజ్. – మాలి విజయరాజ్, నటుడు, దర్శకుడు ● -
ఓరుగల్లే ఫైనల్..!
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి: బీఆర్ఎస్ ఉద్యమాలకు సెంటిమెంట్‌గా భావించే ఓరుగల్లులోనే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభను నిర్వహించాలన్న తుది నిర్ణయానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాయకులు స్థల పరిశీలన చేశారు. మొదట గ్రేటర్ వరంగల్ పరిధిలోని హంటర్‌రోడ్డు, లేదా ఉనికిచర్లలో నిర్వహించాలని ఈ నెల 10న మాజీ మంత్రి, సభ ఇన్చార్జ్ టి.హరీశ్‌రావు స్థల పరిశీలన చేశారు. ఆ తర్వాత హసన్‌పర్తి మండలం దేవన్నపేట అయితే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉంటుందని భావించి అక్కడ కూడా పర్యటించారు. ఇదే సమయంలో ఈసారి సభను వరంగల్ కాకుండా హైదరాబాద్ శివారులో పెట్టాలన్న చర్చ పార్టీలో జరిగినట్లు ప్రచారం జరిగింది. వేసవి ఎండలు తీవ్రమయ్యే సమయంలో వరంగల్ కంటే హైదరాబాద్ శివారు ప్రాంతమైతే బాగుంటుందని భావించినట్లు సమాచారం. ఘట్కేసర్లో సభావేదికను ఎంచుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీష్‌కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధి ఎల్కతుర్తిలో స్థల పరిశీలన చేశారు. ఎల్కతుర్తి మండల కేంద్రంతోపాటు గోపాల్పూర్, మడిపల్లి, చింతలపల్లి శివార్లు.. ఎల్కతుర్తి – భీమదేవరపల్లి మధ్యన కుడి, ఎడమల స్థలాలను కూడా పరిశీలించారు. ఈ మేరకు రైతులనుంచి అంగీకారపత్రాలు కూడా తీసుకున్నారు. డ్రోన్ల ద్వారా సభావేదిక మ్యాపింగ్.. ఎల్కతుర్తి మండల కేంద్రంలో అనువైన ప్రదేశాన్ని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు బుధవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ముల్కనూర్ రోడ్డు, చింతలపల్లి రోడ్డు సమీపంలో గల అనువైన ప్రదేశాన్ని చూసి అనువుగా భావించిన వారు.. డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించారు. ఈ భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడగా వారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఎల్క తుర్తికి వచ్చే దారులవెంట కిలోమీటర్ దూరంలో గల ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం చూశారు. వారి వెంట పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, మాజీ వైస్‌ఎంపీపీ తంగెడ నగేష్, మాజీ ఎంపీటీసీ కడారి రాజు, శేషగిరి, రవీందర్, చిట్టిగౌడ్ ఉన్నారు.ఎల్కతుర్తి సభాస్థలిపై కేసీఆర్‌కు నివేదిక.. నేడో, రేపో నిర్ణయం.. సభావేదిక వివరాలను గురువారం పార్టీ అధినేత కేసీఆర్‌కు అందజేయనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. సుమారు 15లక్షల మంది వరకు హాజరయ్యే రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే విషయమై ఎల్కతుర్తి మండలంలో నిర్వహించేందుకు పరిశీలించిన రెండు, మూడు స్థలాల వివరాలు, మ్యాప్‌లను పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. కేసీఆర్‌తో చర్చించి ఆయన నిర్ణయం మేరకు సభావేదికపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రజతోత్సవ సభపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్.. నేడో, రేపో ఉమ్మడి వరంగల్ నేతలతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.ఇక్కడే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ సై తాజాగా ఎల్కతుర్తిలో స్థల పరిశీలన చేసిన నేతలు డ్రోన్ కెమెరాలతో సభాస్థలి, పార్కింగ్ స్థలాల మ్యాపింగ్ కేసీఆర్ దృష్టికి మ్యాప్‌లతో సహా అన్ని వివరాలు వేదిక దేవన్నపేటా? ఎల్కతుర్తా.?.. నేడో, రేపో తేల్చనున్న అధినేత -
అధిక సాంద్రత పత్తిసాగు లాభదాయకం
మహబూబాబాద్ రూరల్: రైతులు పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసి అధిక దిగుబడితో పాటు మంచి లాభాలు పొందాలని వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ జి.వీరన్న, మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎస్.మాలతి అన్నారు. మానుకోట జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం మల్యాల కేవీకే ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తిసాగుపై బుధవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. రైతులు అధిక సాంద్రత పత్తిసాగు చేయాలన్నారు. ఎంపిక చేసుకోవాల్సిన విత్తనాలు, విత్తే పద్ధతి, విత్తే దూరం, ఎరువులు, నీటి వినియోగం, దిగుబడి తర్వాత వేసుకోదగిన పంటల గురించి వివరించారు. జిల్లాలోని పత్తి విస్తీర్ణం, అధిక సాంద్రత పద్దతిలో పత్తి విస్తీర్ణం పెరగడానికి తీసుకుంటున్న చర్యలపై డీఏఓ విజయ నిర్మల వివరించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్ఎఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని, మల్యాల కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ కిశోర్ కుమార్, ఏడీఏలు శ్రీనివాసరావు, విజయ్ చంద్ర, ఏఓ తిరుపతిరెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు
గార్ల: ప్రభుత్వ నిబంధనలు పాటించని ఎరువులు, పురుగుమందుల దుకాణాల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏఓ విజయనిర్మల హెచ్చరించారు. బుధవారం గార్లలోని పలు ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. దుకాణాల్లో వ్యాపారులు రిజిస్టర్లు, బిల్‌బుక్స్, ఇన్వాయిస్లు, లైసెన్స్, ఓఫారంలను సక్రమంగా నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఎరువులు, పురుగుమందులనే విక్రయించాలని, గడువు దాటిన మందులను అమ్మితే దుకాణాదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డీఏఓ వెంట మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు, ఏఈఓ కిరణ్ తదితరులు ఉన్నారు. -
రేపు కమిషనర్లతో ఫోన్ ఇన్
గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను స్థానికులు కమిషనర్ ఉదయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో పలు సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా కోతులు, పందులు, కుక్కల సంచారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తాను స్వయంగా వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పారు. కాగా ఫోన్ ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సమస్య: న్యూ నెహ్రూ స్ట్రీట్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పారిశుద్ధ్య సమస్యలతో పాటు వీధిలోని ఖాళీ స్థలాల్లో చెట్లౖ పె వందలాది కోతులు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నాం. (మహ్మద్ జరీనాబేగం, జయలక్ష్మి, నజీర్, మహేష్‌కుమార్, కృష్ణవేణి, వై.శ్రీనివాసరావు, ఎండీ సమీర్పాషా, నిఖిల్, నజీమా, బాలాజీ, శ్రీనాథ్, గాజుల వేణుగోపాల్) కమిషనర్: న్యూ నెహ్రూ స్ట్రీట్‌లోని తాగునీటి సమస్యను సమ్మర్ యాక్షన్‌ప్లాన్‌లో చేరుస్తున్నాం. రంజాన్ పండుగ వరకు వీధికి ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తాం. పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. కోతులు ఉండే చెట్లను తొలగిస్తాం. సమస్య: సాయినగర్ నాలుగో వీధిలో డ్రెయినేజీ, రోడ్డు లేక దుర్గంధం, దోమలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. (బొమ్మెన అశోక్‌కుమార్, శబరీష్, పుట్టా శ్రీనివాస్) కమిషనర్: నిధులు సమకూరిన తర్వాత డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణ పనులు చేపడుతాం. దోమల నివారణకు ఫాగింగ్ చేస్తాం. సమస్య: సోమ్లాతండాలో పైపులైన్ లీకేజీలు, మురుగు కాల్వల్లో నల్లాలతో తాగునీరు కలుషితమవుతోంది. కుక్కల బెడద తీవ్రంగా ఉంది. (చరణ్, శేఖర్, సేవియా) కమిషనర్: సిబ్బందిని వెంటనే పంపించి మరమ్మతు పనులు చేపడుతాం. కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటాం. సమస్య: కుక్కలు, కోతులు, పందుల బెడద తీవ్రంగా ఉంది. (నలబోలు శ్రీనివాస్, ఉషాబాయి ఎస్సీ బీసీ కాలనీ, దీపిక యాదవనగర్, సాగర్ శాంతినగర్, సత్యనారాయణ లడ్డా మెయిన్ రోడ్డు, సాయి, సంతోష్, మధు బంకట్సింగ్తండా, నాగమణి సుభాష్స్ట్రీట్) కమిషనర్: కుక్కల బెడద నివారణకు మహబూబాబాద్ మున్సిపాలిటీతో అవగాహన ఒప్పందం చేసుకుని ఏబీసీ సెంటర్లో కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయిస్తాం. పందుల సంచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. సమస్య: అంబేడ్కర్‌నగర్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలి. (దేవర వెంకటేశ్వర్లు) కమిషనర్: అంబేడ్కర్‌నగర్‌లో ఎగువ, దిగువ ప్రాంతాల్లోని ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. సమస్య: పిచ్చి మొక్కలు, చెత్త తొలగించాలి. (దాసరి నానీయాదవ్ యాదవనగర్, షేక్ యునూస్పాషా అంబేడ్కర్‌నగర్, మల్లికార్జును బ్యాంక్‌స్ట్రీట్)కమిషనర్: పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించి వెంటనే సమస్య పరిష్కరిస్తాం. సమస్య: విద్యుత్ స్తంభాలకు లైట్లు ఏర్పాటు చేయాలి. (అనురాధ చర్చి కాంపౌండ్, కుందోజు వీరబ్రహ్మచారి కుందోజువారి వీధి) కమిషనర్: లైట్ల ఏర్పాటుకు సిబ్బందిని ఆదేశించాం. సమస్య: ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి.(ద్వారకాలడ్డా–మెయిన్‌రోడ్) కమిషనర్: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. సమస్య: సర్దార్ క్వార్టర్స్ రోడ్డు మరమ్మతులు చేయాలి. (గుండాల శ్రీకాంత్) కమిషనర్: సమస్యను పరిశీలిస్తాం.ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ మహబూబాబాద్/తొర్రూరు: సాక్షి ఆధ్వర్యంలో రేపు(శుక్రవారం)మానుకోట మున్సిప ల్ కమిషనర్ నోముల రవీందర్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్‌లతో వేర్వేరుగా ‘ఫోన్‌ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఆయా మున్సిపాలిటీల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, కుక్కలు, కోతుల బెడద తదితర సమస్యలపై ఫోన్‌చేసి కమిషనర్లతో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలను ఈ కింద ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలి. -
ట్రాఫిక్ సిబ్బంది సేవలు అభినందనీయం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మహబూబాబాద్ రూరల్: ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్లాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అండర్ బ్రిడ్జి మూసివేసిన సమయంలో రైల్వే గేట్ సమీపంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించారని సిబ్బందిని కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, ఎస్బీ సీఐ చంద్రమౌళి, టౌన్ సీఐ దేవేందర్, ఆర్ఐలు అనిల్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. భూసేకరణ సర్వే నిర్వహణడోర్నకల్: డోర్నకల్ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూసేకరణ కోసం రెవెన్యూ సిబ్బంది బుధవారం సర్వే చేపట్టారు. రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో గార్ల గేటు నుంచి యాదవనగర్ మీదుగా సమ్మర్ స్టోరేజీ వద్ద బలపాల రోడ్డు వరకు రూ.6 కోట్ల నిధులతో 1.7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు మంజూరయ్యాయి. 2023 అక్టోబర్ 2న పనులకు శంకుస్థాపన చేశారు. కాగా పను ల జాప్యంపై ఈనెల 17న సాక్షి దినపత్రికలో ‘పనులు చేపట్టేదెప్పుడో?’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన రెవె న్యూ, ఆర్ అండ్ బీ సిబ్బంది భూసర్వే చేపట్టారు. బైపాస్ రోడ్డుకు అవసరమైన 7.29 ఎకరాల భూమిలో సర్వే నిర్వహించి ఆర్డీఓకు నివేదిక అందించనున్నట్లు సర్వేయర్ వెంకన్న తెలిపారు. -
430 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
● మిల్లు యజమానిపై కేసు నెల్లికుదురు: లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 430 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన మండలంలోని ఆలేరులో మంగళవారం జరిగింది. జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రేమ్‌కుమార్ కథనం ప్రకారం.. ఆలేరులోని శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్లులో వివిధ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన చేసిన రేషన్‌బియ్యం నిల్వ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు మిల్లులో తనిఖీ చేసి లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 430 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైస్ మిల్లు యజమాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, రేషన్ బియ్యానికి క్లీనింగ్ పాలిష్ చేసి వరంగల్‌లోని సాయి లక్ష్మి రైస్ మిల్లుకు తరలించి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిందన్నారు. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం కూడా శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 105క్వింటాళ్లబియాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. -
వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.41.35లక్షలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి హుండీ ఆదాయం రూ.41,35,045 వచ్చినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయంలో 17 హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆర్.సమత సమక్షంలో లెక్కించారు. గత ఏడాది డిసెంబర్ 26నుంచి ఈనెల 24వ తేదీ వరకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలు రూ.41,35,045వచ్చినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, శక్రునాయక్, కె.ఉప్పలయ్య, చిన్నం గణేశ్, జనార్దన్‌రెడ్డి, సత్యనారాయణ, సంజీవరెడ్డి, ఆలయ సిబ్బంది, మానుకోటకు చెందిన లక్ష్మీ శ్రీనివాస సేవాట్రస్ట్, మణుగూరుకు చెందిన ఉమాశంకర్‌రావు శ్రీ వారి ట్రస్ట్ భక్తమండ లి సభ్యులు 280 మంది లెక్కింపులో పాల్గొన్నారు. -
నేడు కమిషనర్లతో ఫోన్ ఇన్
డోర్నకల్/కేసముద్రం: సాక్షి ఆధ్వర్యంలో నేడు (బుధ వారం)డోర్నకల్ మున్సిప ల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణిలతో వేర్వేరుగా ‘ఫోన్‌ఇన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, కుక్కలు, కోతుల బెడద తదితర సమస్యలపై ఫోన్‌చేసి కమిషనర్లతో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలను ఈ కింద ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలియజేయాలి. -
పేద విద్యార్థులకు వరం
కురవి: పేద విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి ప్ర మాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు నిధులు కేటాయించింది. సుమారు 20నుంచి 25 ఎకరాల్లో నిర్మించే ఒక్కో సమీకృత గురుకులానికి రూ.200 కోట్లను వెచ్చిస్తోంది. డోర్నకల్ నియోజకవర్గం కుర వి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో గత డిసెంబర్ 8న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులతో గురుకులాన్ని నిర్మించి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ పేద విద్యార్థులందరూ ఒకేచోట కలిసి చదువుకోవడాని కి వీలు కల్పించింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ ప్రాంత విద్యార్థులకు మేలు.. డోర్నకల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకులంతో ఎంతో మేలు జరగనుంది. ఇప్పటికే ఉన్న పాఠశాలలకు తోడుగా సమీకృత గురుకుల పాఠశాలతో అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చేరి చదువుకోవడం ద్వారా అసమానతలు తొలగుతాయి. కాగా మరిపెడ, చిన్నగూడూరు, డోర్నకల్, కురవి, సీరోలు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్‌గా మారనుంది. జాతీయ రహదారికి సమీపంలో పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో రవాణా సౌకర్యం సులభతరం కానుంది. మండలంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల ఏర్పాటు స్థల సేకరణతో పాటు నిధుల కేటాయింపు శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు ప్రారంభమైతే ఈ ప్రాంత విద్యార్థులకు మేలు -
అంతర్జాతీయ సదస్సులో రాణింపు
చిన్నగూడూరు: అమెరికాలో జరిగిన మిసిస్సిప్పి 89వ వార్షిక అంతర్జాతీయ సదస్సులో మండల కేంద్రానికి మాటేటి శ్రీతేజ్ పాల్గొని సత్తాచాటాడు. ఉత్తమ ఓరల్ ప్రజంటేషన్ విభాగంలో అవార్డుతో పాటు నగదు బహుమతిని సాధించాడు. సోలనేషియస్ క్రాప్స్ ఇన్పెక్టింగ్ ప్లైటో ప్లాస్మాస్, సీడ్ ట్రాన్స్మిషన్ ఎపిడెమియోలాజికల్ ఇన్సైట్స్ అనే అంశంపై ప్రసంగించి అవార్డు గెలుచుకున్నాడు. విశ్వవేదికపై మెరవడంతో పాటు అవార్డును సొంత చేసుకోవడంతో వివిధ రంగాల ప్రముఖులు, పలు వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నా యి. కాగా శ్రీతేజ్ కుటుంబం కొన్నేళ్లక్రితమే ఉపాధి కోసం కాగజ్‌నగర్‌కు తరలివెళ్లి స్థిరపడింది. -
‘డిగ్రీ’ ఉత్తీర్ణత అంతంతే..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీలో ఒకప్పుడు వార్షిక ఫలితాల విధానం ఉండేది. సంవత్సరం మొత్తం పాఠాలు చెప్పిన తర్వాత పరీక్షలు నిర్వహించే వారు. అనంతరం ఫలితాలు ప్రకటించేవారు. అయితే ఇందులో విద్యార్థులు తక్కువ ఉత్తీర్ణత సాధించేవారు. దీంతో ఈ విధానాన్ని రద్దు చేసి కొన్ని సంవత్సరాల క్రితం సెమిస్టర్ సిస్టంను తీసుకొచ్చారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్ విధానంలో ఉదాహరణకు ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఇక ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కుల సెమిస్టర్ పరీక్ష ఉంటుంది. అందులో వచ్చిన మార్కులు, ఇంటర్నల్‌లో వచ్చిన మార్కులు కలిపే ఉత్తీర్ణత ప్రకటిస్తారు. అయినా ఈ విధానం వల్ల వివిధ సబ్జెక్టుల్లో పాస్ మార్కులు కూడా రాక వేలాది మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ప్రతీ సెమిస్టర్ పరీక్షల్లోనూ అప్పటివరకు పూర్తయిన పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. కొద్దిపాటిగా చదువుకున్నా ఉత్తీర్ణత సాధించే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మార్కులు రావాలంటే కొంచెం కష్టపడాల్సిందే. కేయూ పరిఽధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలు డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, ‘బి’ ఒకేషనల్, ‘బి’ ఎస్సీ హానర్స్ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలతోపాటు రెండో సంవత్సరం మూడో సెమిస్టర్, ఫైనల్ ఇయర్ ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కొద్దిరోజుల క్రితం అధికారులు ప్రకటించారు.ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం అంతంతమాత్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సెమిస్టర్ సిస్టంలోనూ మెరుగైన ఫలితాలేవి? డిగ్రీ కోర్సుల సెమిస్టర్ సిస్టంలో విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరై కొంచెం కష్టపడినా ఉ త్తీర్ణత సాధించే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడానికి ప లు కారణాలున్నాయని భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా తరగతులకు సరిగా హాజరుకాకపోవ డం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే ని బంధన ఉన్నప్పటికీ ఏ కళాశాలలోనూ అమలు చే యడం లేదు. ప్రభుత్వ కళాశాలలే కాదు ప్రైవేట్ క ళాశాలల్లోనూ నాణ్యమైన విద్యనందించడం లేదనే అంశం ఈఫలితాలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవర్గాలకు చెందిన వారే ఉంటారు. కొందరు కళాశాలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులు బట్టి ప్రైవేట్‌లో ఉపాధి పొందుతున్న పరిస్థితి కూ డాఉందని తెలుస్తోంది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ విద్యార్థులకు నాణ్యమైన విద్య నందించేందు కు యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు. మూడేళ్లుగా ఫీజు రీ యింబర్స్‌మెంట్ రాకపోవడంతో కొన్ని ప్రైవేట్ కళా శాలలు సైన్స్ విద్యార్థులకు సరిగా ప్రాక్టికల్స్ కూడా నిర్వహించడం లేదు. మరోవైపు విద్యార్థులు ఎక్కు వ సమయం సెల్లో ముగినిపోవడం కూడా ఉత్తీర్ణతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అటానమస్ డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత ఇలా.. అటానమస్ కాలేజీల్లో మాత్రం విద్యార్థులు మెరుగై న ఫలితాలు సాధిస్తున్నారు. హనుమకొండ కేడీసీ (అటానమస్) డిగ్రీ మొ దటి సెమిస్టర్ పరీక్షల్లో 56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్ర భుత్వ పింగిళి మహిళా కళాశాల మొదటి సెమిస్టర్లో 61,93 శాతం, మూడో సెమిస్టర్లో 73,27 శా తం, ఐదో సెమిస్టర్లో 82.52శాతం ఉత్తీర్ణత సా ఽధించారు. నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సెమిస్టర్లో 38,64 శాతం, 3వ సెమిస్టర్లో 53.33శాతం ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మొదటి సెమిస్టర్లో 43, 59శాతం, మూడో సె మిస్టర్‌లో 58,69శాతం, 5వ సెమిస్టర్లో 65.04శాతం ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల్లో 21.93 శాతమే ఉత్తీర్ణతకేయూ పరిధిలో ఆయా డిగ్రీ కోర్సుల్లో మొత్తం 70,661 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందులో 15,495మంది (21.93శాతమే) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 36,504మంది పరీలకు హాజరైతే అందులో 5,278మంది (14.46శాతం)ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 34,157మందికిగాను 10,217 మంది 29.91శాతం ఉత్తీర్ణత పొందారు. ఇందులో బాలుర కంటే బాలికలదే పైచేయిగా ఉంది.డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 40.73 శాతం ..ఆయా డిగ్రీకోర్సుల్లో మొత్తం 46,828మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 19,074 మంది ఉత్తీర్ణత (40.73శాతం) సాధించారు.బాలురు 23,402 మందికిగాను 6,808మంది( 29,09శాతం) ఉత్తీర్ణత, బాలికలు 23,426 మందికిగాను 12,266మంది( 52.36శాతం ) ఉత్తీర్ణత సాధించారు. బాలురకంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది.డిగ్రీ మూడో సెమిస్టర్లో 28.97శాతం ఉత్తీర్ణతడిగ్రీ ఆయా కోర్సుల్లో మూడో సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 59,916మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 17,356మంది ఉత్తీర్ణత (2 8.97శాతం)సాధించారు. బాలురు 29,771మందికి గాను 5,924 మంది (19.90శాతం), బాలికలు 3 0,145 మందికి గాను 11,432మంది (37.92శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలుర కంటే బాలికలే ఎక్కవశాతం ఉత్తీర్ణత పొందారు.సెమిస్టర్ సిస్టంలోనూ మెరుగైన ఫలితాలేవి! ఇటీవల ఫలితాలు ప్రకటించిన అధికారులు ఇందులో బాలికలదే హవా.. రీవాల్యుయేషన్‌కు వెల్లువెత్తిన దరఖాస్తులు అటానమస్ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు -
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
ఖిలా వరంగల్: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర శాసన మండలి సభ్యుడు బస్వరాజు సారయ్య సూచించారు. వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే రైతు ఉత్పత్తుల మేళాను మంగళవారం రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనురాధతో కలిసి ఎమ్మెల్సీ సారయ్య.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దని, రైతును బలోపేతం, చైతన్య పర్చడానికే ఎఫ్‌పీఓ మేళా ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ రైతులు ఆర్థిక బలోపేతం, లాభసాటి సాగుకు ఎఫ్పీఓల పాత్ర కీలకమన్నారు. 40 ఉత్పత్తి దారుల సంఘాలు స్టాళ్లు ఏర్పాటు చేయగా .. ఆ ఉత్పత్తుల అమ్మకాలు చేపడుతున్నామన్నారు. ఎఫ్‌పీఓ మేళాకు స్పందన.. ఎఫ్‌పీఓ మేళాకు స్పందన లభించింది. రాష్ట్రం నలు మూలాల నుంచి భారీగా రైతులు, నగర ప్రజలు చేరుకున్నారు. స్టాళ్లను ఆసక్తిగా తిలకించి అవసరమైన పనిముట్లు, గృహోపకరణాలు, విత్తనాలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఏసీ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ రామన్‌సింగ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పీజేటీఏయూ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, అగ్రికల్చర్ జూయింట్ డైరెక్టర్ సుజాత, డీఆర్డీఓ కౌసల్యాదేవి, తహసీల్దార్లు బండి నాగేశ్వర్రావు, ఇక్బాల్, ఉద్యాన శాఖ అధికారి సంగీత లక్ష్మి, ఏడీఏ యాకయ్య, ఏఓ రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్ ఈదుల అరుణ్, రైతులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య జీఎం కన్వెన్షన్ హాల్లో రాష్ట్రస్థాయి (ఎఫ్‌పీఓ) రైతు ఉత్పత్తుల మేళా ప్రారంభం -
బకాయిలు చెల్లించండి..!
లేకపోతే ఇళ్లు ఖాళీ చేయాలని హౌసింగ్ బోర్డు నోటీసులుహన్మకొండ: పెండింగ్ బకాయిలను రాబట్టుకునేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కఠిన చర్యలకు పూనుకుంది. ఈ నెల 31లోపు బకాయిలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని అల్టిమేటం ఇచ్చింది. ఈ మేరకు హౌసింగ్ బోర్టు నోటీసులు జారీ చేసింది. హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు కేటాయించింది. వాయిదాల మేరకు సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా కొంతమంది నిర్లక్ష్యం చేశారు. బకాయిలు తడిసి మోపెడు కావడంతో హౌసింగ్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో లబ్ధిదారులు మొత్తుకుంటున్నారు. అసలుకు వడ్డీలపై వడ్డీలు వేసి అధిక మొత్తం చెల్లించాలని నోటీసులు జారీ చేశారని లబోదిబోమంటున్నారు. వరంగల్ డివిజన్ పరిధిలో 528 మందికి నోటీసులు.. తెలంగాణ హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ పరిధిలోని హనుమకొండ వడ్డేపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, వరంగల్ గొర్రెకుంట కాలనీ, జగిత్యాల, మంచిర్యాల నస్పూర్ కాలనీ, మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ కాలనీ, కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ, జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జనగామలోని హౌసింగ్ బోర్డు కాలనీ, కొత్తగూడెం చుంచుకాలనీకు చెందిన బకాయిలు మొత్తం రూ.44,69,99,904 పేరుకుపోయాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 528 మందికి నోటీసులు జారీ చేశారు. ఒక్కో కాలనీలో రూ.3లక్షల నుంచి రూ.18 లక్షలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.22,49,76,301 బకాయిలు పేరుకుపోయినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు బకాయిలు చెల్లించేందుకు గడువు విధించారు. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక్కో కాలనీలో బకాయిదారులు రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు బకాయిలున్నారు. బకాయిలు సంస్థకు గుదిబండగా తయారయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి బకాయిలు వసూలు చేయాల్సిందేనని సీరియస్‌గా చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు హుటాహుటినా నోటీసులు జారీ చేశారు.కాలనీవారీగా బకాయిలు (రూ.లలో) వరంగల్ గొర్రెకుంట కాలనీ 9,43,58,063 హనుమకొండ వడ్డేపల్లి 3,67,81,668 జనగామ 2,18,90,827 మరిపెడ 7,19,45,743 ఈ నెల 31లోపు చెల్లించాలని అల్టిమేటం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.22,49,76,301 బకాయిలు వడ్డీకి వడ్డీ వేశారంటున్న లబ్ధిదారులునోటీసులు జారీ చేశాం..పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. ఈ నెల 31వ తేదీలోపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరాం. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – అంకం రావు, హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ ఈఈ -
కారును ఢీకొన్న టిప్పర్..
ఎల్కతుర్తి: టిప్పర్.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కఽథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ జ్యోతి నగర్‌కు చెందిన కనుకపుడి కరుణాకర్(58) చర్చ్ ఫాదర్. సోమవారం రాత్రి ఒంటి గంటకు కారులో ఎల్కతుర్తి మీదుగా హుస్నాబాద్ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులోని చాయ్ విహార్ సమీపంలో ముల్కనూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్ ఎదురుగా కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు నడుపుతున్న కరుణాకర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు. ● వ్యక్తి దుర్మరణం ● కొత్తపల్లి శివారులో ఘటన -
రేపు ‘నిధి ఆప్కే నికట్’
హన్మకొండ అర్బన్ : ఈపీఎఫ్ఓ సభ్యులు, య జమానులు, పెన్షనర్ల ఫిర్యాదులు పరిష్కరించడానికి ఈనెల 27న (గురువారం) నిధి ఆప్కే నికట్ 2.0 కార్యక్రమం నిర్వహించనున్నట్లు వరంగల్ రీజియన్ అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ తానయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు సంబంధించి వరంగల్‌లోని వైభవ్ లక్ష్మి షాపింగ్ మాల్, హనుమకొండలోని గ్రీన్వుడ్ హైస్కూల్, తొ ర్రూరులోని సెయింట్ పాల్స్ హైస్కూల్, జనగామలోని శాన్ మారియా హైస్కూల్, భూపాలపల్లిలోని ఎస్ఆర్ డీజీ స్కూల్, ములుగులోని శ్రీ అరవింద ఉన్నత పాఠశాల, ఖమ్మంలోని మమత హాస్పిటల్ రోడ్డులో గల ఎస్బీఐటీ కళాశాల, ఇల్లందులోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణతో పాటు పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పీఎఫ్ సభ్యులు, పెన్షనర్లు సద్వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధి కూలీగా.. జనగామ కలెక్టర్రఘునాథపల్లి: జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఉపాధి కూలీగా మారారు. రఘునాథపల్లి మండలం గోవర్దనగిరి శివారులో ఈజీఎస్ పథకంలో భాగంగా చేపట్టిన ఆర్సీబీ రోడ్డు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. దాదాపు గంటపాటు కూలీలతో గడిపి వారి పనుల్లో చేతి కలిపారు. అలుగుతో తవ్వుతూ కొద్దిసేపు రోడ్డు పనులు చేశారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకొని వేసవి దృష్టా ఉదయం వేళల్లో పనులు చేయాలని వారికి సూచించారు. దాడి కేసులో ఒకరికి ఏడాది జైలు మహబూబాబాద్ రూరల్ : దాడి కేసులో నేరం నిరూపణకాబడిన ఒకరికి మహబూబాబాద్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ యు.తిరుపతి ఏడాది జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2020 సంవత్సరంలో మహబూబాబాద్ మండలం ఆమనగల్ శివారు పెద్దతండాకు చెందిన గుగులోత్ పర్తియా తన చెలక వద్ద పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పాత కక్షల నేపథ్యంలో అదే తండాకు చెందిన ఇస్లావత్ శ్రీకాంత్ ఘర్షణ పడి పర్తియాను కొట్టాడు. ఈ ఘటనపై బాధితుడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై సీహెచ్.రమేశ్ బాబు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించి అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారి గొడిశాల సురేశ్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూష న్ పక్షాన ఏపీపీ జయలత కోర్టులో వాదనలు వి నిపించగా నేరం నిరూపణ కాబడిన శ్రీకాంత్‌కు అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ తిరుపతి ఏడాది జైలు శి క్ష, రూ. వెయ్యి జరిమానా వి ధిస్తూ తీర్పు వె లువరించారు. -
కాలానికి అనువైన పంటలు ఎంచుకోవాలి
వైరా: రైతులు ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని.. తద్వారా నష్టం లేకుండా అధిక దిగుబడులు సాధించొచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఎం.బలరామ్ తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన మధ్య తెలంగాణ మండల (ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్) వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశంలో పాల్గొన్నారు. తొలుత రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం బలరామ్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో డిమాండ్‌ను తెలుసుకుంటూ పంటల సాగులో మెళకువలు పాటిస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. అనంతరం యూనివర్సిటీ విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాదాద్రి, మధ్య తెలంగాణ రీజియన్ సహాయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి, మధిర వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్లు, వివిధ విభాగాల ప్రధాన శాస్త్రవేత్తలు, ఉమ్మడి ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు బలరామ్ -
చేపల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి
మామునూరు : చేప పిల్లల పెంపకంతోపాటు చేప పిల్లల ఉత్పత్తికేంద్రాలు, నర్సరీలు ఏర్పాటు చేసుకుని గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళా రైతులు ఆర్థికంగా ఎదగాలని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న సూచించారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి వి జ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, హైదరాబాద్ సౌజన్యంతో నర్సరీల్లో తెల చేపల పెంపకంపై ఐదు రోజుల శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. ఆయన ముఖ్యఅ తిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళలు, నిరుద్యోగ యువత ముందుకు వచ్చి నర్సరీల్లో చేపల పంపకం చేపడితే లాభాలు అర్జించొచ్చని పేర్కొన్నారు. అనంతరం చేపల పెంపకం, చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. శాస్త్రవేత్తలు జె.సాయి కిరణ్, గణేశ్, రాజు, తదితరులు పాల్గొన్నారు. మూమునూరు కేవీకే కోఆర్డినేటర్ రాజన్న -
రాష్ట్రస్థాయి యూత్ పార్లమెంట్‌కు ఎంపిక
కేయూ క్యాంపస్ : వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయిలో ఈనెల 22, 23 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే అంశంపై ప్రసంగ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి యూత్పార్లమెంట్కు ఎంపిక చేసినట్లు కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో హనుమకొండ, ములుగు, ఏటూరునాగారం, భూ పాలపల్లి జిల్లాల నుంచి వివిధ డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొని తమకు ఇచ్చిన సమ యం ప్రకారం ప్రసంగించారు. ఇందులో పదిమందిని రాష్ట్రస్థాయి యూత్‌పార్లమెంట్ ఎంపిక చేశారు. అందులో బి.సంధ్య బైరెడ్డి, ఎం. శ్రావ్య, శ్రీజయాదవ్, కాలాజ్ఞ (కేయూ బయోటెక్నాలజీ ), మహ్మద్ హాసన్ (యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ, హ నుమకొండ), ఎం. శ్రావ్య, కార్తీక్ (కేయూ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ), ఎ.వినీలా (ప్రభుత్వ పింగిళి మహిళా కాలేజీ హనుమకొండ), అలేఖ్య, సిద్దార్థ (వరంగల్ కిట్స్ కాలేజీ), రచన (ములుగు ప్రభుత్వడిగ్రీ కాలేజీ), శంకర్ (భూపాలపల్లి ప్ర భుత్వ డిగ్రీకాలేజీ) ఉన్నారు. వీరు రాష్ట్ర అసెంబ్లీలో జరగబోయే స్టేట్లెవ్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో పాల్గొనబోతున్నారు. ఈనెల 23న ఎన్ఎస్ఎస్ వలంటీర్లు మాక్ పార్లమెంట్ కూడా నిర్వహించుకున్నారు. ఈ యూత్‌పార్లమెంట్ పోటీల సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ప్రిన్సిపాల్ టి. మనోహర్, నెహ్రూ యువకేంద్రం జి ల్లా డిప్యూటీ ఆఫీసర్ అన్వేశ్, ఈ ప్రోగ్రాం కన్వీనర్ రాధిక, జ్యూరీ మెంబర్, కేయూ జూవాలజీ విభా గం ఆచార్యుడు మామిడాల ఇస్తారి పాల్గొన్నారు. -
మార్కెట్‌కు 16 టన్నుల మామిడి
వరంగల్: వరంగల్ ఏనుమాముల పరిధిలోని ముసలమ్మకుంట సమీపంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌కు 21 వాహనాల్లో 16 టన్నుల మామిడి అమ్మకానికి వచ్చింది. గరిష్ట ధర క్వింటాకు రూ.10వేలు, కనిష్ట ధర రూ.2వేలు (రాలిన కాయలు), మోడల్ ధర రూ.6,700 పలికినట్లు ఉద్యోగులు తెలిపారు. దారి తవ్వకంతో రాకపోకలకు అంతరాయం మామిడి మార్కెట్‌కు వెళ్లే దారిని ఆ స్థల యాజమానులు తవ్వడంతో రైతులు, వ్యాపారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఈవిషయం తెలిసిన మార్కెట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థలానికి సంబంధించిన పత్రాలు తీసుకురావాలని పేర్కొనడంతో స్థల యజమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి యార్డులో వ్యాపారిపై హమాలీ చేయి చేసుకున్నట్లు తెలిసింది. ఈవిషయంపై వ్యాపార వర్గాలను విచారించగా దాట వేశారు. నాట్యాచార్యులు సుధీర్‌రావుకు జాతీయస్థాయి ఫెలోషిప్ హన్మకొండ కల్చరల్ : నగరానికి చెందిన నాట్యాచార్యులు, సద్గురు శివానంద నృత్యమాల వ్యవస్థాపకుడు బొంపల్లి సుధీర్‌రావు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ నుంచి జాతీయస్థాయి సీనియర్ ఫెల్షిప్నకు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా అత్యుత్తమ నాట్యకళాకారులను తీర్చిదిద్దిన సుధీర్‌రావు జిల్లాకు అవార్డులు తేవడం ప్రారంభించారు. ఇద్దరు దొంగల అరెస్ట్వరంగల్ క్రైం: తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వినయ్‌కుమార్, భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపేట మండలం అనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన తంబళ్ల నితిన్ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడుతున్నారు. ఈనెల 19న సంతోశ్‌నగర్ కాలనీలో విజయగిరి రాజు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా, స్థానిక ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకుని సోమవారం అదాలత్ వద్ద నిందితులను గుర్తించి విచారించగా.. నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ.1.70 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ. 90 వేలు స్వాధీ నం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
రైతు ఉత్పత్తుల మేళాకు సర్వం సిద్ధం
ఖిలా వరంగల్: వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పత్తుల మేళా ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల నేతృత్వంలో మంగళవా రం నుంచి 27వ తేదీ వరకు మేళా జరగనుంది. జిల్లాలోని రైతులు ఉత్పత్తి చేసిన గృహ, వంటగది అవసరాలు, ఆరోగ్యకర ఆల్పాహారాలు, అందం, ఆరోగ్య సంరక్షణ.. ఇలామరెన్నో ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు జిల్లాలోని ప్రజలందరినీ మేళాకు ఆహ్వానిస్తున్నారు. సహజ సిద్ధమైన, మేలైన ఉత్పత్తులను ఆసక్తి ఉన్న ప్రజలు కొనుగోలు చేసేందుకు 42 స్టాళ్లు ఏర్పాటు చేశారు. రైతులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను మేళా ద్వారా అధిక రాబడి పొందడానికి స్టాళ్లలో విక్రయించుకునే అవకాశం కల్పించారు. ప్రజలకు ఆయా ఉత్పత్తులపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ అందించే ప్రోత్సాహకాలను అధికారులు వివరించనున్నారు. వ్యవసాయ సాగుకు ఉపయోగపడే అన్ని రకాలు పరికరాలు, పనిముట్లు ప్రదర్శనలో ఉంచనున్నారు. వీటిలో ప్రధానంగా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడం, సాంకేతిక పరిజ్ఞానం పొందడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందులు, పంట రుణాలు పొందేందుకు అవగాహన కల్పించనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రైతు ఉత్పత్తుల మేళా ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఉత్పత్తులపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఏసీపీ తిరుపతి, ఇన్స్పెక్టర్ రమేశ్, ఏఓ రవీందర్‌రెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి.. వరంగల్: వరంగల్ నక్కలపల్లి రోడ్డులోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఈనెల 25నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘తెలంగాణ రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా’ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా వ్యవసాయధికారి కె.అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 40 రైతు ఉత్పత్తిదారు సంఘాల ఉత్పత్తులను స్టాళ్లలో ప్రదర్శించడంతోపాటు అమ్మకాలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహణ వరంగల్ నక్కలపల్లి రోడ్డులోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు 42 స్టాళ్లపై గృహ, వంటగది అవసరాలు, ఆరోగ్యకర అల్పాహారాలు, తదితర ఉత్పత్తుల ప్రదర్శన మేళా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ సత్యశారద -
నీళ్లపాలు..
నిబంధనలుబకాయిలు లేవు డెయిరీ నిబంధనల ప్రకారం డిస్ట్రిబ్యూటర్ నుంచి రెండు రోజులకు సంబంధించిన అమ్మకాల మొత్తం విలువ రూ.12 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రతీ రోజు 240 ప్రభుత్వ సంస్థలు, సివిల్ మార్కెట్ కలుపుకుని 10వేల లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు డిస్ట్రిబ్యూటర్ ఏరోజు చెల్లించాల్సిన డబ్బులను అదే రోజు చెల్లిస్తున్నాడు. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎలాంటి బకాయిలు లేవు. – శ్రవణ్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్, విజయ డెయిరీ, వరంగల్ హన్మకొండ చౌరస్తా : ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నిర్వహణపై రోజురోజుకూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకుని.. పాల అమ్మకాలు పెంచేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఫలితాలు ఇవ్వకపోగా.. నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగా పాల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయ పాలను ప్రజలకు మరింత చేరువచేసి అమ్మకాలు పెంచాలనే ఉద్దేశంతో గతేడాది నవంబర్‌లో డిస్ట్రిబ్యూటర్‌కు అప్పగించారు. నిబంధనల ప్రకారం వరంగల్ యూనిట్ పరిధిలో రోజుకు 10 వేల లీటర్ల పాల అమ్మకాలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్‌కు డెయిరీ అనుమతులు ఇచ్చింది. అయితే రెండు రోజుల అమ్మకాల మొత్తాన్ని ముందే చెల్లించేలా (కాషన్ డిపాజిట్) రూ.15 లక్షలు చెల్లించాలని షరతులు విధించింది. కాగా, రూ. 15 లక్షలు డిపాజిట్ చేసిన సదరు డిస్ట్రిబ్యూటర్.. నిబంధనల ప్రకారం ఏ రోజు అమ్మకాలకు సంబంధించిన మొత్తం (డబ్బు) చెల్లించాల్సి ఉన్నప్పటికీ తన ఇష్టానుసారంగా చెల్లిస్తూ ప్రస్తుతం డెయిరీ రూ.40 లక్షలు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్‌కు అనధికారికంగా సాయం.. డెయిరీకి ఏ రోజు డబ్బులు అదే రోజు చెల్లించాల్సి ఉండగా రోజుల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. రోజు చెల్లిస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్‌కు అనధికారికంగా డెయిరీ అధికారుల్లో కొందరు సాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొంతన లేని లెక్కలు చూపెడుతూ ఉన్నతస్థాయి అధికారులను సైతం పక్కదోవపట్టిస్తున్నారనే ఆరోపణలు డెయిరీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. లాభాలు గడిస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు.. ఒక్కో లీటర్ పై డిస్ట్రిబ్యూటర్‌కు రూ. 8 చెల్లిస్తున్నామని డెయిరీ అధికారులు చెబుతున్నప్పటికీ అధికారికంగా రూ.10.50 పైసలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 10వేల లీటర్ల పాలు విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్ లాభాలను గడిస్తున్నప్పటికీ డెయిరీకి చెల్లించాల్సిన లక్షలాది రూపాయలు పెండింగ్‌లో పెడుతూ సంస్థకు నష్టాలు చవిచూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడం పై పాడి రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ పాల అమ్మకాలపై పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు, అవినీతి బయటపడుతుందని పాడిరైతులు పేర్కొంటున్నారు. -
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని..
● క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు దేవరుప్పుల : మద్యం తాగడానికి డబ్బు అడగగా భార్య నిరాకరించడంతో క్షణికావేశానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేవరుప్పుల మండలం సీతారాంపురంలో చోటుచేసుకుంది. ఎస్సై ఊర సృజన్‌కుమార్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన బత్తుల గోపి (27) కుటుంబంతో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామానికి వలస వచ్చా డు. ఇక్కడ సమీప బంధువైన బత్తుల రామకృష్ణకు చెందిన ఇటుక బట్టీలో నాలుగు నెలల నుంచి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం మద్యం కోసం రూ.200 కావాలని భార్యను అడగగా నిరాకరించింది. దీంతో ఆమెతో గొడవపడ్డారు. క్షణికావేశంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి తల్లి వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
మహంకాళి దేవాలయ భూమిపై వివాదం
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండల కేంద్రంలోని మహంకాళి దేవాలయ భూమిపై వివాదం నెలకొంది. కబ్జాకు గురైన ఆలయ భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు నిర్ధారించాలని స్థానికులు సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తమ భూమిలో నిర్మాణాలు చేపట్టడానికి యత్నిస్తుండగా కొంతమంది అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వల్లాల జగన్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరుపుతామన్నారు. వివరాలు ఉన్నాయి. మండల కేంద్రంలో పురాతన మహంకాళి ఆలయం ఉంది. గతంలో ఈ ఆలయంలో అమ్మవారికి దీపదూప నైవేద్యాలు సమర్పించేవారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆలయం పూజలకు నోచుకోలేదు. ఇదే అవకాశంగా భావించిన ఆలయం పక్క ఉన్న జగన్ సోదరులు ఇక్కడ కట్టెల మండీ ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెప్పారు. ఇది కొన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. అయితే ఆరేళ్ల క్రితం స్థానిక పద్మశాలి సేవా సంఘం మహంకాళి ఆలయం ఉన్నట్లు వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో జగన్‌కు స్థానికుల మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంలో అప్పుడు కార్పొరేటర్‌గా పనిచేసిన నాగమళ్ల ఝాన్సీ భర్త నాగమళ్ల సురేశ్ ఇరువురితో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు. అయితే వారం రోజులుగా మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిట్టల కుమారస్వామి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్ పంచాయితీ చేశారు. అది కొలిక్కి రాలేదు. చివరికి పంచాయితీ వాయిదా పడింది. కాగా, సోమవారం స్థానికులు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేయగా, జగన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కబ్జా చేశారని స్థానికులు కలెక్టర్‌కు.. చేయలేదని మరోవర్గం పీఎస్‌లో ఫిర్యాదు -
మెరుగైన విద్యుత్ సరఫరాకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు
నెహ్రూసెంటర్: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు పట్టణంలో నాలుగు కొత్త ట్రాన్స్ఫార్మ ర్లు ఏర్పాటు చేశామని డీఈ పి.విజయ్ అన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ‘వెక్కిరిస్తున్న ఖాళీలు’ ‘నిరుపయోగంగా ఉన్న సబ్ స్టేషన్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యుత్‌శాఖ అధికారులు జిల్లా కేంద్రంలోని నందినగర్, రాహుల్గనర్, సుందరయ్యనగర్, గుండ్లకుంటలో ఏర్పా టు చేసిన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ... వేసవికాలం దృష్ట్యా అధిక లోడ్, లో ఓల్టేజ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి ముందస్తుగానే కొత్త ట్రాన్స్ఫార్మర్లన్లు ఏ ర్పాటు చేశామన్నారు. విద్యుత్ వినియోగం, పొదు పు, విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాలనీ ప్రజలకు అవగాహ న కల్పించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కో సం టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ సీహెచ్.ప్రశాంత్, ఏఈ సంగీత, సబ్ఇంజనీర్ రామకృష్ణ, విద్యుత్ సిబ్బంది రాంబాబు, స్వామి, శ్రీనివాస్, ప్రజలు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో ‘టూడీ’కి స్వస్తి..
ఎంజీఎం : ఎంజీఎం.. ఉత్తర తెలంగాణకు గుండె. పేదలకు పెద్ది దిక్కు. ఇంతటి ఘన కీర్తి కలిగిన ఈ ఆస్పత్రిలో రోజురోజూకూ సేవలు క్షీణించిపోతున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాలు, కొత్తగా ఏర్పడిన పది జిల్లాలకు చెందిన రోగులు ఆపత్కాళంలో ఎంజీఎంకు వస్తారు. ఇలాంటి ఆస్పత్రిపై దృషి సారించాల్సిన రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రి పాలనపై దృష్టి సారించకపోవడంతో వామ్మో ఎంజీఎం ఆస్పత్రా అనే విధంగా తయారైంది పరిస్థితి. ఆస్పత్రి విభాగాధిపతులు వారాని రెండు రోజులు విధులకు హాజరువుతున్నారు. వచ్చినా రోజు రెండు, మూడు గంటల పాటు మాత్రమే విధులు నిర్వర్తించడంతో ఒక్కొక్క విభాగం మూత పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో అత్యంత కీలకమైన కార్డియాలజీ విభాగం సేవలు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. ఈసీజీ పరికరాల్లో సాంకేతిక లోపాలు, ఏకంగా 24 గంటల పాటు అత్యవసర సేవలు అందించాల్సిన టూడీ ఎకో పరీక్షల పరికరాలను కేఎంసీ తరలించారు. నామామాత్రపు విధులు నిర్వర్తిస్తూ ఎంజీఎంలో టూడీ ఎకో సేవలు బంద్ చేశారు. నిత్యం అందించాల్సిన టూడీ ఎకో సేవలకు స్వస్తి పలికి రెండు, మూడు రోజులకోమారు ఓ ప్రత్యేక అంబులెన్స్‌లో 20 మంది, 30 మందిని తరలిస్తూ నామామాత్రపు సేవలందిస్తూ పేద రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శస్త్రచికిత్సల్లో టూడీ ఎకో సేవలు కీలకం.. ఎంజీఎంలో అన్ని విభాగాల్లో నిర్వహించే శస్త్రచికిత్సల్లో ఈసీజీ, టూడీ ఎకో నివేదికలు కీలకం. ఆస్పత్రిలో రోజూ 10 నుంచి 20 శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంటారు. ఇలాంటి సేవలను నిలిపివేసి కేఎంసీలోని సూపర్ ఆస్పత్రికి పరిమితి చేసి విధులకు ఏగనామం పెట్టి ప్రైవేట్ కేంద్రాలతో కుమ్మక్క అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విభాగాలను పర్యవేక్షించే విభాగాధిపతులు విధులకు ఏగనామం పెడుతున్నారు. వారానికి రెండు రోజులు విధులు నిర్వర్తించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెతుత్తున్నాయి.ఆస్పత్రిలో ఎకో సేవలు నిలిపివేత.. కేఎంసీకి తరలింపు వారానికి రెండు రోజులు మాత్రమే పరీక్షలు ఇక్కడ కూడా మధ్యాహ్నం తరువాత సేవలు నిలిపివేత చేసేదేమిలేక ప్రైవేట్‌కు తరలుతున్న పేద రోగులు ప్రైవేట్ కేంద్రాలతో కుమ్మక్కు.. ఎంజీఎంలో టూడీ ఏకో సేవలు కీలకం. ఈసీజీలో ఏమైనా తేడాలు వస్తే వెంటనే టూడీ ఏకో పరీక్షలకు రెఫర్ చేస్తారు. ఈ సమయంలో ఆస్పత్రిలో టూడీ ఏకో సేవలు లేకపోవడంతో కేఎంసీలోని సూపర్ ఆస్పత్రిలో చేయించుకోవాలని రెఫర్ చేస్తారు. కేఎంసీలో మధ్యాహ్నం 12 గంటలు దాటితే సేవలు నిలిపివేస్తారు. ఈ క్రమంలో ఎంజీఎంలో టూడీ ఏకో సేవలను నిలిపివేయడంతో పేద రోగులు, ఖైదీలను రిమాండ్ పంపించే విషయంలోనూ పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అత్యవసర రోగులు.. పోలీసు సిబ్బంది సైతం ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి టూడీ ఎకో పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.సమస్య పరిష్కారానికి కృషి టూడీ ఎకో సేవలు అవసరం ఉన్న వారిని కేఎంసీలోని సూపర్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నాం. వివిధ విభాగాల్లో ఫోర్టబెలిటీ పరికరంతో సేవలందిస్తున్నాం. రోగులకు ఇబ్బంది కలగకుండా ఎంజీఎంలోనే టూడీ ఏకో సేవలపై ఆయా విభాగాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – కిశోర్, సూపరింటెండెంట్, ఎంజీఎం -
బాధితులకు అండగా పోలీసులు
మహబూబాబాద్ రూరల్: మహిళలపై జరిగే నేరాలను పూర్తిగా అరికట్టేందుకు షీ టీమ్స్, మహిళా పోలీస్‌స్టేషన్ కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. షీ టీమ్స్ కార్యాలయం, మహిళా పోలీస్ స్టేషన్‌ను సోమవారం సందర్శించి, మహిళా భద్రత, హక్కుల పరిరక్షణ, కేసుల ప్రగతి మొదలైన అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. కాలేజీలు, కార్యాలయాలు, బస్టాండ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, వేధింపుల ఆపరేషన్ల గురించి ఆర్ఎస్సై సు నందను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రతకు సంబంధించి హెల్ప్ లైన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నేర నివేదికలు, పెండింగ్ కేసులు, బాధితులకు అందిస్తున్న సహాయం, కౌన్సెలింగ్ సేవలు, స్టేషన్లో మహిళా సిబ్బంది సంఖ్య గురించి తెలుసుకున్నా రు. బాధిత మహిళలతో మాట్లాడి వారికి పోలీసు శాఖ నుంచి అందించాల్సిన సహాయంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. పోక్సో, గృహహింస, వేధింపుల కేసుల్లో బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు వేగంగా చర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ చంద్రమౌళి, రూరల్ సీఐ సరవయ్య, ఎస్సై దీపిక, ఆర్ఎస్సై సునంద, ఎస్సై ఆనందం, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu● ‘పక్కఫొటోలో ఉన్న దంపతులు మరిపెడ మండలం బావోజీగూడెం గ్రామానికి చెందిన దిగజర్ల అంతయ్య–సుమతి. ఉద్యానశాఖ అధికారుల సూచన మేరకు గ్రామంలో తమకు ఉన్న చెలకలో డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు చేశారు. ఇందుకోసం రూ. 3.75లక్షల ప్రోత్సాహాన్ని ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా చెల్లిస్తారు. కాగా అధికారులు చెప్పిన విధంగా ఆ దంపతులు చేనులోనే పనిచేశారు. మస్టర్ వేయమని ఫీల్డ్ అసిస్టెంట్ వద్దకు వెళ్లారు. పని మొత్తం పూర్తయిన తర్వాత వేస్తామని చెప్పారు. ఈక్రమంలో ఏపీఓ, ఎంపీడీఓ వద్దకు వెళ్లినా మస్టర్ వేయలేదు. ఈమేరకు ఈనెల 3వ తేదీన, 10న, 12న, 17న గ్రీవెన్స్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. పనిచేసి పైసలు అడిగితే పట్టించుకునే వారు కరువయ్యారని వారు వాపోయారు.’