Actress Meena Shares Emotional Letter After Husband Vidyasagar Died - Sakshi
Sakshi News home page

Actress Meena Emotional Letter: భర్త మరణాంతరం తొలిసారి స్పందించిన నటి మీనా

Published Fri, Jul 1 2022 7:22 PM | Last Updated on Fri, Jul 1 2022 8:18 PM

Actress Meena Shares Emotional Letter After Husband Vidyasagar Died - Sakshi

భర్త మరణాంతరం మీనా తొలిసారి స్పందించారు. తన భర్త విద్యాసాగర్‌ మరణంపై సోషల్‌ మీడియాలో వస్తున్న ఆసత్య ప్రచారంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. తన భర్త మృతిపై అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆమె భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేశారు. ‘భర్త  దూరమయ్యారనే బాధలో ఉన్నాను. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి.

చదవండి: ‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’

‘విద్యాసాగర్‌ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్‌ రాధాకృష్ణన్‌, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు మీనా. 

చదవండి: వివాదంలో నరేశ్‌ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు..

కాగా  గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్‌ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కళా మాస్టర్‌ రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement