
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేరళలోని వయనాడ్ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం రిలీప్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి.. తాజాగా చెక్‌ను అందజేశారు. త్రివేండ్రం వెళ్లిన మెగాస్టార్ కేరళ సీఎం పినరయి విజయన్‌ను కలిసి చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వయనాడ్ ఘటనపై చిరంజీవి ఆరా తీశారు. బాధితులకు అందిస్తోన్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మరణించారు.
కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో సోషయో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష కనిపించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
#TFNReels: Megastar @KChiruTweets lands in Trivendra, Kerala to handover ₹1 cr cheque to Kerala CM. ❤#Chiranjeevi #RamCharan #WayanadLanslide #TeluguFilmNagar pic.twitter.com/tP0S4TBEOQ
— Telugu FilmNagar (@telugufilmnagar) August 8, 2024