Could Priyanka Chopra Makes Nick Jonas Bollywood Entry - Sakshi
Sakshi News home page

Priyanka Chopra-Nick Jonas: వెడ్డింగ్‌ యానివర్సరి, భర్త విషయంలో ప్రియాంక షాకింగ్‌ నిర్ణయం..

Published Thu, Dec 2 2021 4:16 PM | Last Updated on Thu, Dec 2 2021 4:36 PM

Could Priyanka Chopra Makes Nick Jonas Bollywood Entry - Sakshi

వెడ్డింగ్‌ యానివర్సరి సందర్భంగా ఈ జంటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలీవుడ్‌, హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక తన భర్త నిక్‌ విషయంలో షాకింగ్‌ నిర్ణయం తీసుకుందట.

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన భర్త నుంచి విడిపోనుందా? అంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటికి ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చి రూమార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది ప్రియాంక. దీంతో వారి విడాకులపై వస్తున్న వరుస పుకార్లకు చెక్‌ పడింది. నిన్న (డిసెంబర్‌ 1న) ఈ గ్లోబల్‌ కపుల్‌ తమ మూడవ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక-నిక్‌ జోనస్‌లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

చదవండి: కూకట్‌పల్లి మాల్‌లో సల్మాన్‌ సందడి, వీడియో వైరల్‌

ఇదిలా ఉంటే తమ వెడ్డింగ్‌ యానివర్సరి సందర్భంగా ఈ జంటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలీవుడ్‌, హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక తన భర్త నిక్‌ విషయంలో షాకింగ్‌ నిర్ణయం తీసుకుందట. త్వరలోనే నిక్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. కాగా నిక్‌ సైతం తనకు ఇండియన్‌ సినిమాల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. కాగా నిక్‌ను త్వరలోనే బాలీవుడ్‌ హీరోగా లేదా సింగర్‌గా పరిచయం చేసేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చదవండి: సంప్రదాయ వివాహానికి ముందు..రిజిస్టర్‌ మ్యారేజ్‌

ఇందుకోసం బాలీవుడ్‌ దర్శక-నిర్మాతలతో ప్రియాంక చర్చలు జరుపుతోందని వినికిడి. మరి భర్త విషయంలో ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్న గ్లోబల్‌ స్టార్‌ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. గతంలో నిక్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే తను బాలీవుడ్‌ మ్యూజిక్‌కు బాగా దగ్గరయ్యానని, తరచూ హిందీ పాటలు వింటానని చెప్పాడు. అవి తనకు బాగా నచ్చాయని, ఇండియన్‌ సినిమాలు, సంగీతాన్ని తనకు పరిచయం చేసిన ప్రియాంకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఇక హిందీ చిత్రం పరిశ్రమకు కూడా తాను బాగా దగ్గరయ్యానని, బాలీవుడ్‌లో తనకు మంచి స్నేహితులు ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్‌ బాబు సోదరి ప్రియదర్శిని

అంతేగాక వారి ఇంట్లో ఏ వేడుక జరిగిన హిందీ పాటలు పెడతామని, అవి డ్యాన్స్‌ చేయించేంత జోష్‌ ఆ మ్యూజిక్‌లో ఉంటుందన్నాడు. ఇక తమ వెడ్డింగ్‌లో ఎక్కువగా బాలీవుడ్‌ సంగీతమే ప్లే చేశారని, అప్పుడు వాటికి తాను ఫిదా అయ్యానంటూ నిక్‌ జోనస్‌ చెప్పుకొచ్చాడు. మరొపక్క హాలీవుడ్‌ సినిమాలకు వరుసగా సంతకం చేస్తూ ప్రియాంక ప్రస్తుతం బాలీవుడ్‌ను పక్కన పెట్టింది. ఈ క్రమంలో తాను బాలీవుడ్‌కు దూరంగా కాకుండా తన నిక్‌ను హిందీ సినిమాలకు పరిచయం చేయాలనుకుంటున్నట్లు ప్రియాంక సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ప్రియాంక దంపతులు క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement