Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Key Comments At YSRCP District Presidents Meeting Updates1
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. జిల్లాలో పార్టీ ఓనర్‌షిప్‌ మీదిప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్‌సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్‌సీపీయే. మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలిజూన్‌-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్‌ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్‌ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరుజిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందిప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్‌ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్‌ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్‌ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.మనమంతా రాజకీయ నాయకులంమనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్‌ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారువివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి.

Appointment Of Ysrcp Parliament Constituency Observers2
వైఎస్సార్‌సీపీలో కీలక నియామకాలు

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో పాటు.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాకే శైలజానాథ్‌ను నియమిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు వీరే1.శ్రీకాకుళం-కుంభా రవిబాబు (ఎమ్మెల్సీ)2.విజయనగరం- కిల్లి సత్యనారాయణ3.అరకు- బొడ్డేటి ప్రసాద్‌4.అనకాపల్లి-శోభా హైమావతి (మాజీ ఎమ్మెల్యే)5.విశాఖ-కదిరి బాబూరావు (మాజీ ఎమ్మెల్యే)6.కాకినాడ- సూర్యనారాయణరాజు (మాజీ ఎమ్మెల్సీ)7.అమలాపురం-జక్కంపూడి విజయలక్ష్మి8.ఏలూరు-వంకా రవీంద్రనాథ్‌ (ఎమ్మెల్సీ)9.రాజమండ్రి- తిప్పల గురుమూర్తిరెడ్డి10.మచిలీపట్నం -జెట్టి గురునాథం11.నరసాపురం- ముదునూరి మురళీకృష్ణంరాజు12.విజయవాడ-మోదుగుల వేణుగోపాలరెడ్డి (మాజీ ఎంపీ)13.గుంటూరు-పోతిన మహేష్‌14.నరసరావుపేట​-డా.పూనూరు గౌతంరెడ్డి15.బాపట్ల-తూమటి మాధవరావు (ఎమ్మెల్సీ)16.ఒంగోలు-బత్తుల బ్రహ్మానందరెడ్డి17.నెల్లూరు-జంకె వెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)18.తిరుపతి-మేడా రఘునాథరెడ్డి (ఎంపీ)19.చిత్తూరు-చవ్వా రాజశేఖర్‌రెడ్డి20.రాజంపేట​- కొత్తమద్ది సురేష్‌బాబు (మేయర్‌)21.కడప-కొండూరి అజయ్‌రెడ్డి22.అనంతరం-బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి( మాజీ ఎమ్మెల్సీ)23.హిందూపురం-ఆర్‌.రమేష్‌రెడ్డి24.నంద్యాల- కల్పలతారెడ్డి (ఎమ్మెల్సీ)25.కర్నూలు-గంగుల ప్రభాకర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

Latest Pahalgam Terror Plot Unfolds3
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’

జమ్మూ: జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌ ప్రకారం పాక్‌ టెర్రరిస్టులు.. టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డట్లు తేలింది.జమ్మూకశ్మీర్‌ అనంత్‌ నాగ్‌ జిల్లా పహల్గాంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరీన్‌ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై ఏ విధంగా కాల్పులకు తెగబడింది. ప్రాణాలు తీసింది. టూరిస్టులు తప్పించుకోకుండా టెర్రరిస్టులు ఎలా కాపలా కాసారో ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ రికార్డ్‌ చేశారు. వాటి ఆధారంగా ఎగ్జిట్‌, ఎంట్రన్స్‌ గేటులో ఉగ్రవాదులు కాపలాప్రకృతి అందాల్ని ఆస్వాధిస్తున్న పర్యాటకులు తప్పించుకునేందుకు వీలు లేకుండా బైసరీన్‌ వ్యాలీలో ఎంట్రీ గేటు వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాపలా, ఎగ్జిట్‌ గేటు వద్ద ఒక ఉగ్రవాది కాపలా ఉండగా.. ఆ ఇద్దరికి సమాచారం అందించేందుకు బైసరీన్‌ వ్యాలీ బయట అడవిలో ఉన్నట్లు తేలింది. ముందుగా టెర్రరిస్టులు ఎంట్రీ గేటు దగ్గర పర్యాటకులపై కాల్పులు జరిపారు. కాల్పులు మోతతో ఒక్కసారిగా భయపడ్డ టూరిస్టులు ప్రాణ భయంతో ఎగ్జిట్‌ వైపు పరిగెత్తారు. అయితే, అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకుల్ని అడ్డుకున్నారు. తమవద్ద ఉన్న మెషీన్‌ గన్లతో పర్యాటకుల్ని బెదిరించారు. Grief beyond words. Can’t forget, can’t forgive. Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/GJXjG368i7— Anjana Om Kashyap (@anjanaomkashyap) April 23, 2025 ఉగ్రవాదుల తొలి ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నేఎంట్రీ గేటు వద్ద టూరిస్టులను ఒక చోటకు చేర్చారు. అనంతరం మహిళలు, పురుషులు వేరు కావాలని ఆదేశించారు. అయితే, టూరిస్టులు టెర్రరిస్టుల మాటల్ని పట్టించుకోలేదు.దీంతో కోపంతో ఊగిపోయిన టెర్రరిస్టులు హిందువులు, ముస్లింలు వేర్వేరుగా నిలబడాలని సూచించారు. అయినా టూరిస్టులు పట్టించుకోలేదు.ఆ తరువాత, ఉగ్రవాదులు తాము ఇస్లాం మతం స్వీకరిస్తున్నామని అంగీకరిస్తూ ‘కల్మా’ఉచ్ఛరించమని పర్యాటకులను ఆదేశించారు. పర్యాటకులు కల్మా అనడం పూర్తయిన తర్వాత ఉగ్రవాదులు..అమాయకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సమయంలో ఎంట్రీ గేటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన మొట్టమొదటి వ్యక్తి భారత నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ అని తెలుస్తోంది.ఈ మరణాలు ఎక్కువగా టీ స్టాల్, భేల్‌ పూరి స్టాల్ సమీపంలో సంభవించాయి.ఈ రెండు ప్రాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది.

Pratika Rawal Creates HISTORY, Becomes First Woman In The World4
చ‌రిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

శ్రీలంక వేదిక‌గా జ‌రుగుతున్న ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భారత మహిళా ​‍క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతీక రావల్ దుమ్ములేపుతోంది. మంగ‌ళ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ప్రతీక హాఫ్ సెంచ‌రీతో మెరిసింది. రావల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 78 పరుగులు చేసింది.ఈ క్ర‌మంలో రావ‌ల్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకుంది. మ‌హిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన బ్యాట‌ర్‌గా ప్ర‌తీక రికార్డుల‌కెక్కింది. 24 ఏళ్ల ప్రతీక రావల్ (Pratika Rawal) త‌న వ‌న్డే అరంగేట్రం నుంచి అద‌ర‌గొడుతోంది.ఈ క్ర‌మంలో కేవ‌లం 8 మ్యాచ్‌లలోనే ప్ర‌తీక 500 ప‌రుగుల మార్క్‌ను అందుకుంది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. 9 ఇన్నింగ్స్‌ల‌లో ఆమె ఈ ఫీట్‌ను సాధించింది. తాజా మ్యాచ్‌తో ఎడ్వ‌ర్డ్స్ ఆల్‌టైమ్ రికార్డును రావ‌ల్ బ్రేక్ చేసింది.మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన ప్లేయ‌ర్స్ వీరే..ప్రతికా రావల్ - 8 ఇన్నింగ్స్‌లుషార్లెట్ ఎడ్వర్డ్స్ - 9 ఇన్నింగ్స్‌లునికోల్ బోల్టన్ - 11 ఇన్నింగ్స్‌లుబెలిండా క్లార్క్ - 12 ఇన్నింగ్స్‌లువెండీ వాట్సన్ - 12 ఇన్నింగ్స్‌లుఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 15 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. 277 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవ‌ర్ల‌లో 261 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓ ద‌శ‌లో సునాయాసంగా గెలిచే క‌న్పించిన సౌతాఫ్రికాను భార‌త స్పిన్న‌ర్ స్నేహ్ రాణా దెబ్బ‌తీసింది. రాణా త‌న 10 ఓవ‌ర్ల కోటాలో 43 ప‌రుగులిచ్చి 5 వికెట్లు సాధించింది.చ‌ద‌వండి: సూర్యవంశీకి భారీ న‌జ‌రానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం

PM Modi Chairs Meeting with Defence Minister, NSA, CDS and Chiefs of All Armed Forces5
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్‌.. సైన్యమే స్థలం,టైం చూసి..

ఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వరుస కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన త్రివిధ దళాదిపతులు సమావేశంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేలా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత దళాలపై పూర్తిగా నమ్మకం ఉంది. ఉగ్రవాదాన్ని అంత చేస్తాం. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తాం. సైన్యమే స్థలం,టైం చూసి జవాబు ఇస్తుంది’ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన రక్షణ శాఖ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్‌ అనీల్‌ చౌహాన్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత బుధవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. భద్రతా బలగాల మొహరింపు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రలో పాక్‌ కవ్వింపులు చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పాక్‌ కవ్వింపులకు పాల్పడితే రక్షణ పరంగా ఎలా తిప్పికొట్టాలి. ఓ వైపు రక్షణ పరంగా దెబ్బకొడుతూనే.. దౌత్య పరంగా ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేలా ఎలా దెబ్బకు దెబ్బ తీయాలనే తదితర అంశాలపై ప్రముఖంగా చర్చించారు. PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/fr9y5eVbet— ANI (@ANI) April 29, 2025

Justice Br Gavai Appointed As Chief Justice Of India6
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయి

ఢిల్లీ: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయి నియమితులయ్యారు. సీజేఐగా ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న జస్టిస్‌ గవాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్‌ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 1992లో నాగ్‌పూర్‌ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్‌ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. జస్టిస్ గవాయ్‌ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్‌.

Do You Know The Gold Price in India At 19257
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?

భారతీయులు అలంకార ప్రియులు. కాబట్టి చాలామంది ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాలలో కూడా ఎక్కువగా బంగారమే ఉంటుంది. ఇప్పుడు (2025లో) గోల్డ్ అంటే.. కొనడానికి కూడా కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఒకప్పుడు (1925లో) తులం పసిడి రేటు రూ. 18.75 ఉండేదంటే బహుశా కొందరు నమ్మక పోవచ్చు. నమ్మకపోయినా అదే నిజం. ఈ కథనంలో శతాబ్దానికి ముందు ఇండియాలో గోల్డ్ రేటు ఎలా ఉండేదో తెలుసుకుందాం.▸1925: రూ. 18.75▸1935: రూ. 30.81▸1945: రూ. 62.00▸1955: రూ. 79.00▸1965: రూ. 72.00▸1975: రూ. 540.00▸1985: రూ. 2130.00▸1995: రూ. 4680.00▸2005: రూ. 7000.00▸2015: రూ. 26845.00▸2016: రూ. 29560.00▸2017: రూ. 29920.00▸2018: రూ. 31730.00▸2019: రూ. 36080.00▸2020: రూ. 48480.00▸2021: రూ. 50000.00▸2022: రూ. 53000.00▸2023: రూ. 60000.00▸2024: రూ. 80000.00▸2025: రూ. 97970.001925లో 10 గ్రాముల రూ.18.75 వద్ద ఉండేది. అయితే ఈ రోజు గోల్డ్ రేటు రూ. 97,970 వద్దకు చేరింది. అంటే వందేళ్లలో బంగారం ధర 97951.25 రూపాయలు పెరిగింది.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువవ్వడం, నిల్వలు తక్కువ కావడం. భౌగోళిక, రాజకీయ కారణాలు. బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి పెరగడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి. దీంతో పసిడి ధర సుమారు లక్ష రూపాయలకు చేరింది.ఇదీ చదవండి: భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?

Ias Officer Smita Sabharwal Another Sensational Tweet8
Smita Sabharwal: స్మితా సబర్వాల్‌ మరో సంచలన ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ ట్వీట్లు పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఆమె మరో సంచలన ట్వీట్‌ చేశారు. తనపై వేటు తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ ట్వీట్‌ చేశారు. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన. 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 25-30లో రాష్ట్రానికి పరిచయం చేశాను’’ అని ట్వీట్‌ చేశారు.‘‘నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్‌లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రేమ్‌ని సృష్టించాను. డిపార్ట్‌మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను.. అది నాకు ఆనందం.. గౌరవంగా ఉంది’’అంటూ స్మితా ట్వీట్‌ చేశారు."Karmanye vadhikaraste, ma phaleshu kadachana"#IAS Spent 4 months in Tourism.Did my best!1.Brought in the long pending Tourism Policy 25-30, a first for the State. Will create a solid frame for direction & investment in neglected tourist circuits.2. Revamped the working… pic.twitter.com/2nUlVQO4W3— Smita Sabharwal (@SmitaSabharwal) April 29, 2025 కాగా, కంచ గచ్చిబౌలి భూవివాదంలో స్మితా సబర్మాల్‌.. ఏఐ ఫోటో రిట్వీట్ చేసిందని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె.. రేవంత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. స్మితాపై బదిలీ వేటు వేసింది. ఆమెను ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.

Vijay Antony issued a statement to clarify his Pahalgam Incident Post9
పహల్గామ్‌ దాడి.. నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!

పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్‌పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్‌పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్‌లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది ఇండియన్స్‌ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్‌లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.తాజాగా తన పోస్ట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్‌లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'హిట్లర్‌లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. pic.twitter.com/YbFIloXPQ9— vijayantony (@vijayantony) April 27, 2025 pic.twitter.com/Gne6EdT6yu— vijayantony (@vijayantony) April 28, 2025

Govt Suspends Pakistan Defence Minister X Account After Crackdown10
భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత

ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్‌ జర్నలిస్టుల ఎక్స్‌ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్‌ఐ, పాకిస్థాన్‌ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్‌ ఐఎస్‌ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్‌ ఐఎస్‌ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్‌ స్కూల్‌ ఉద్యోగులమంటూ ఐఎస్‌ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్‌ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్‌ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement