
'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి నటించిన చిత్రం 'షష్టి పూర్తి'.. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నో పాటలకు మ్యూజిక్ అందించడమే కాకుండా రచయితగా కూడా కీరవాణి గుర్తింపు తెచ్చకున్నారు. అయితే, ఈ సినిమాతో తొలిసారి ఇళయరాజా సంగీతంలో ఆయన ఈ సాంగ్‌ను రచించడం విశేషం.

‘షష్టిపూర్తి’ సినిమాలో రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా.. రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించారు. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ‘లేడీస్ టైలర్’ తర్వాత ఈ చిత్రంలో వారిద్దరూ మరోసారి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తికలిగించేలా ఉంది. తాజాగా విడుదలైన సాంగ్ రూపేష్, ఆకాంక్షా సింగ్ మధ్యే ఉంటుంది. మంచి లవ్ ట్రాక్‌తో పాటు చక్కటి మెలోడీనిచ్చేలా పాట ఉంది.