ఏడాదిలో ఎనిమిది! | Kamal Haasan Launches Trailer of Naveen Chandra Eleven | Sakshi
Sakshi News home page

ఏడాదిలో ఎనిమిది!

Published Wed, Apr 30 2025 12:46 AM | Last Updated on Wed, Apr 30 2025 12:46 AM

Kamal Haasan Launches Trailer of Naveen Chandra Eleven

నవీన్‌ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘లెవెన్‌’. లోకేశ్‌ అజ్ల్స్‌ దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ మూవీలో అభిరామి, రవి వర్మ కీలక పాత్రలు చేశారు. ఏఆర్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ బ్యానర్‌పై అజ్మల్‌ ఖాన్, రేయా హరి నిర్మించిన ఈ సినిమా మే 16న విడుదల కానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని నటుడు కమల్‌హాసన్‌ విడుదల చేశారు. ‘వైజాగ్‌లో లాస్ట్‌ వన్‌ ఇయర్‌లో ఎనిమిది హత్యలు జరిగాయి.. సీరియల్‌ కిల్లింగ్స్‌’ అంటూ పోలీస్‌ ఆఫీసర్‌గా నవీన్‌ చంద్ర చెప్పే డైలాగుతో ట్రైలర్‌ ఆరంభమైంది. రుచిర ఎంటర్‌ౖటెన్మెంట్స్‌ అధినేత ఎన్‌. సుధాకర్‌ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమేరా: కార్తీక్‌ అశోకన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement