
మెగా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది వినాయకచవితి మెగా ఫ్యామిలీకి మరింత స్పెషల్. ఎందుకంటే తొలిసారిగా మెగా వారసురాలితో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులకు బేబీ పుట్టింది. అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మినిచ్చింది. మెగా వారసురాలు అడుగుపెట్టిన సందర్భంగా ఫ్యాన్స్‌తో పాటు కుటుంబసభ్యులు సైతం ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు.
(ఇది చదవండి: వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!)
తన మనవరాలి పేరును మెగాస్టార్ దంపతులు రివీల్ చేశారు. కొణిదెల క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా క్లీంకారతో కలిసి ఈ ఏడాది వినాయకచవితిని సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన తమ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన మెగా ఫ్యాన్స్ సైతం తాము అభిమానించే ఫ్యామిలీకి వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023
ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏
ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊
Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd
(ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్)
రామ్ చరణ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.