
టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు చాలా తక్కువ. ఉన్నవాళ్లలో కూడా రెగ్యులర్ సినిమాలు చేసేవాళ్లు ఇంకా తక్కువని చెప్పొచ్చు. రీసెంట్ గా 'మ్యాడ్ స్క్వేర్'లో (Mad Square) లైలా పాత్రలో కనిపించిన అలరించిన ప్రియాంక జవాల్కర్(Priyanka Jawalkar) తెలుగు బ్యూటీనే. అనంతపురంలో పెరిగిన ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ‍్యూలో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో అనుభవాల్ని పంచుకుంది.
'నేను సినిమాల్లో ప్రయత్నిస్తున్నానని మా ఇంట్లో తెలుసు. అలా నాకు విజయ్ దేవరకొండ 'ట్యాక్సీవాలా'చిత్రంతో (Taxiwala Movie) అవకాశమొచ్చింది. అయితే వారం రోజుల షూటింగ్ అయ్యేంత వరకు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో నా మొదటి సినిమా. అసలు ఉంటానో మధ్యలోనే తీసేస్తారో అని భయంగా ఉండేది.'
(ఇదీ చదవండి: తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్)
'అందుకే షూటింగ్ మొదలైన వారం వరకు ఈ సినిమాలో నేనే హీరోయిన్ ఎవరికీ చెప్పలేకపోయా. కాస్త నమ్మకం రాగానే ఇంట్లో చెప్పాను. అప్పుడు వాళ్లు కూడా సంతోషపడ్డారు. తర్వాత అందరికీ చెప్పుకొన్నాను' అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ప్రియాంక.. 2017లో 'కలవరమాయే' మూవీతో హీరోయిన్ అయింది. కానీ ట్యాక్సీవాలా చిత్రంతో గుర్తింపు వచ్చింది. తర్వాత ఎస్ఆర్ కల్యాణ మండపం, తిమ్మరసు, టిల్లు స్క్వేర్ తదితర చిత్రాలు చేసింది. కాకపోతే ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా)