
హీరో విజయ్ దేవరకొండకు హిట్ పడి చాలాకాలమైపోయింది. 'అర్జున్ రెడ్డి' తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. గత రెండు చిత్రాలు లైగర్, ద ఫ్యామిలీ స్టార్ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ప్రస్తుతం 'కింగ్ డమ్' మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో మీడియా కంట కూడా విజయ్ పడలేదు.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
అలాంటిది ఇప్పుడు ఓ బాలీవుడ్ జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్.. విజయ్ దేవరకొండపై తీవ్ర విమర్శలు చేశాడు. ఇతడి పట్ల హిందీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
'లైగర్ మూవీ ట్రైలర్ లాంచ్ చూసి నేను చాలా అప్ సెట్ అయ్యాను. ఎందుకంటే మన మీడియా(బాలీవుడ్) విజయ్ దేవరకొండని సూపర్ స్టార్ లా చూపిస్తోంది. సౌత్ కి వెళ్తే కేవలం టైర్-2 హీరో మాత్రమే. అతడేం సూపర్ స్టార్ కాదు. మన జర్నలిస్ట్ ఒకరు.. మన దగ్గర సల్మాన్ ఉంటే అక్కడ విజయ్ ఉన్నాడని అన్నారు. విజయ్ 12 సినిమాలు తీస్తే అందులో 9 ఫ్లాప్స్. ఓ మూడు హిట్స్ ఉన్నాయంతే'
(ఇదీ చదవండి: నా కళ్లు అందుకే ఎర్రగా ఉన్నాయ్.. రష్మిక వీడియో)
'లైగర్ సినిమా కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు. కానీ ఫుల్ రన్ లో రూ.20 కోట్లు వచ్చాయి. ఇక్కడి పీఆర్స్ విజయ్ దేవరకొండ పెద్ద బ్రాండ్, స్టార్ అన్నట్లు చూపించారు. అలాంటిది ఇతడిని సల్మాన్ ఖాన్ తో పోలుస్తున్నారు. సల్మాన్ ఫ్లాప్ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేసింది' అని సదరు జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చెప్పుకొచ్చాడు.
మరి ఉన్నట్లుండి ఈ బాలీవుడ్ జర్నలిస్ట్ విజయ్ దేవరకొండపై ఎందుకు పడ్డాడనేది అర్థం కాలేదు. విమర్శలు ఘాటుగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని నిజాలు లేకపోలేదు. మరి 'కింగ్ డమ్'తో హిట్ కొట్టి, ఇలాంటోళ్ల నోళ్లు విజయ్ దేవరకొండ మూయిస్తాడా లేదా అనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)
I was shocked when our media hyped #VijayDeverakonda like a demiGod.
He’s a tier 2 hero in the south, not a superstar. #Liger made - 20cr, yet he was compared to #SalmanKhan, whose flops still earn 100cr.
— Pink Villa Himesh Mankad pic.twitter.com/yRG1eSNYKx— Telugu Chitraalu (@TeluguChitraalu) April 13, 2025