
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహించా రు. రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలో ని కావేరి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి వర్గా లు శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
బ్రెయిన్‌కి రక్తాన్ని సరఫరా చేసే ఓ రక్తనాళంలో బ్లాక్స్‌ను గుర్తించామని.. సర్జరీ చేసి వాటిని తొల గించామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియా రజనీకాంత్ అభిమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్ శుక్రవారం ట్వీట్ చేశారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.
చదవండి: (విశ్వాసం అంటే ఇదేరా !)