Worship
-
పరమశివుడి గృహపతి అవతారం
సూత మహర్షి ఒకసారి నైమిశారణ్యంలోని మునులకు పరమశివుడి అవతార గాథలను చెప్పాడు. పశుపతి అయిన పరమశివుడు గృహపతిగా అవతరించిన గాథ ఇది.పూర్వం నర్మదాతీరంలోని నర్మపురంలో విశ్వానరుడు అనే ముని ఉండేవాడు. బ్రహ్మచర్యాశ్రమంలో గురువుల వద్ద వేదశాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. యుక్తవయస్సు రాగానే శుచిష్మతి అనే శ్రోత్రియ కన్యను వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాక విశ్వానరుడు తన సహధర్మచారిణితో కలసి నిత్యాగ్నిహోత్రిగా, పంచయజ్ఞ పరాయణుడిగా, షట్కర్మ నిరతుడై, దేవ, పితృ, అతిథిసేవా తత్పరుడై, నిత్య శివార్చన కొనసాగిస్తూ, ప్రశాంత జీవనం సాగించేవాడు.ఒకనాడు శుచిష్మతి భర్తను సమీపించి, ‘నాథా! పరమశివుడి దయవల్ల ఇప్పటి వరకు మనకు ఏ లోటు లేదు. మనకు లేనిదల్లా సంతానభాగ్యం ఒక్కటే! సాక్షాత్తు శంకరుని వంటి పుత్రుని అనుగ్రహించమని శంకరునే కోరండి’ అని అడిగింది.భార్య కోరిక మేరకు విశ్వానరుడు వారణాసి నగరానికి చేరుకున్నాడు. విశ్వేశ్వర లింగం సహా అక్కడ కొలువై ఉన్న అన్ని శివలింగాలను అర్చించాడు. తొలిగా గణనాథుడికి ప్రణమిల్లి, ఆ తర్వాత విశాలాక్షిని, అన్నపూర్ణను, కాలభైరవుడిని, ఆదికేశవుడిని పూజించి, శాస్త్రోక్తంగా కాశీ నగరాన్ని సేవించాడు. ఎందరో సిద్ధపురుషులు ఆరాధించి, సిద్ధి పొందిన వీరేశలింగం ఎదుట కూర్చుని తపస్సు ప్రారంభించాడు. ఒక నెల ఏకభుక్తాన్ని, రెండోనెల నక్తాన్ని, మూడోనెల అయాచిత ఆహారాన్ని, నాలుగోనెల ఉపవాసాన్ని, ఐదోనెల పాలను, ఆరోనెల పండ్లను, ఏడోనెల నువ్వులను, తొమ్మిదోనెల పంచగవ్యాన్ని, పదోనెల చాంద్రాయణాన్ని, పదకొండోనెల దర్భాగ్ర జలాలను, పన్నెండోనెల వాయుభక్షణంతోను– ఇలా క్రమక్రమంగా తపోదీక్షను కఠినతరం చేస్తూ వచ్చాడు. పదమూడోనెల వేకువ జామునే గంగా స్నానం చేసి, విశ్వేశ్వర దర్శనానికి వెళుతున్న వేళ సుందర వదనారవిందుడు, చితాభస్మాలంకారుడు, దిగంబరుడు అయిన ఎనిమిదేళ్ల బాలుడు వేద సూక్తాలను వల్లె వేస్తూ కనిపించాడు. అతడు బాలశివుడిలా కనిపించాడు. అతడిని చూడగానే విశ్వానరుడు పులకాంకితుడయ్యాడు. చేతులు జోడించి, ఆశువుగా అష్టకాన్ని పలుకుతూ, శివస్తుతి చేశాడు.విశ్వానరుడి స్తోత్రానికి బాలుడి రూపంలో ఉన్న పరమశివుడు పరమానందం చెందాడు. ‘భక్తా! నీ భక్తిశ్రద్ధలకు పూర్తిగా సంతుష్టుడినయ్యాను. ఏదైనా ఉత్తమ వరం కోరుకో, తప్పక తీరుస్తాను’ అన్నాడు.‘పరమేశ్వరా! నువ్వు సర్వజ్ఞుడివి. నీకు తెలియనిదేముంది? నాకు అర్హమైనదానిని నువ్వే అనుగ్రహించు’ అన్నాడు విశ్వానరుడు.విశ్వానరుడి మాటలకు పరమశివుడు మరింతగా సంతోషించాడు.‘విప్రోత్తమా! త్వరలోనే నేను నీకు పుత్రుడినై పుడతాను. గృహపతి నామంతో దేవతలకు సైతం ప్రీతిపాత్రుడనవుతాను. సంతానాభీష్టులైన దంపతులు నువ్వు నన్ను స్తుతిస్తూ పలికిన అభిలాషాష్టకాన్ని పఠించినట్లయితే, తప్పక సంతానవంతులవుతారు’ అని వరమిచ్చాడు.కొన్నాళ్లకు శుచిష్మతికి పండంటి బాలుడు పుట్టాడు. విశ్వానరుడు అతడికి గృహపతి అని నామకరణం చేశాడు. ఏడో ఏట ఉపనయనం చేశాడు. తొమ్మిదేళ్లు నిండేసరికి ఆ బాలుడు చతుర్వేదాలను, షడంగాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఒకనాడు నారద మహర్షి విశ్వానరుడి ఆశ్రమానికి వచ్చాడు. విశ్వానరుడు ఆయనకు తన కొడుకును పరిచయం చేశాడు. బాలుడైన గృహపతి సాముద్రిక లక్షణాలను పరిశీలించిన నారదుడు ‘విశ్వానరా! ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండో ఏట అగ్నిగండం ఉంది. జాగ్రత్తగా కాపాడుకో’ అని చెప్పి వెళ్లిపోయాడు. నారదుడు చెప్పిన మాటలకు విశ్వానరుడు, శుచిష్మతి దంపతులు దుఃఖంలో కూరుకుపోయారు. తల్లిదండ్రుల దుఃఖాన్ని గమనించిన గృహపతి వారిని ఓదార్చాడు. ‘మీరు శోకాన్ని విడిచిపెట్టండి. నా జన్మకు కారణం నాకు తెలుసు. సాక్షాత్తు పరమశివుడిని ఆరాధించి, జనన మరణాలను జయించి తిరిగి వస్తాను. కాశీ నగరానికి వెళ్లేందుకు అనుమతించండి. అక్కడ తపస్సు చేసి, అనుకున్నది సాధిస్తాను’ అని పలికాడు. తల్లిదండ్రులు అనుమతించడంతో గృహపతి వారణాసి చేరుకున్నాడు. ముందుగా మణికర్ణికా ఘట్టంలో స్నానమాచరించి, విశ్వేశ్వరుడిని సేవించుకున్నాడు. తర్వాత అనుకూల ప్రదేశాన్ని చూసుకుని, ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి, దాని ఎదుట కూర్చుని తపస్సు ప్రారంభించాడు. గృహపతి ప్రతిరోజూ మానసపూజ కొనసాగిస్తూ, కఠిన నియమాలతో తపస్సు చేయసాగాడు.కొన్నాళ్లు గడిచాక, ఒకనాడు దేవేంద్రుడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘బాలకా! వరం కోరుకో’ అన్నాడు.‘నేను పరమశివుడి కోసం తపస్సు చేస్తున్నాను. అతడి నుంచి మాత్రమే వరం స్వీకరిస్తాను. నువ్వు తప్పుకో’ అన్నాడు.బాలుడి ధిక్కారానికి కుపితుడైన ఇంద్రుడు అతడి పైకి తన వజ్రాయుధాన్ని దూశాడు. వజ్రఘాతానికి బాలుడు మూర్ఛపోయాడు.వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఛితుడైన బాలుడిని తన చేతులతో స్పృశిస్తూ, ‘నాయనా! గృహపతీ! లే! నీకు శుభాలు కలుగుతాయి’ అన్నాడు. నిద్రలోంచి మేల్కొన్నట్లుగా లేచిన బాలుడిని పరమశివుడు తన ఒడిలోకి తీసుకుని, లాలించాడు. -
ఇంకెన్ని పిటిషన్లు వేస్తారు?.. ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ : ప్రార్థన స్థలాలకు సంబంధించిన అంశంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సోమవారం ప్రార్థనా స్థలాల చట్టం 1991 కింద దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లకు ఒక ముగింపు ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై దాఖలైన కొత్త పిటిషన్లను విచారణ చేపట్టదని స్పష్టం చేశారు.అయితే అదనపు అంశాలను జతచేస్తూ కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం అనుమతించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేసిన కొత్త పిటిషన్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్, మజ్లిస్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్ల తరుఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనల్ని వినిపిస్తున్నారు.ఇక విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతించామని, కానీ ఇలాంటి వ్యాజ్యాలకు ఒక పరిమితి ఉండాలని గుర్తు చేసింది. ప్రార్థన స్థలాలకు సంబంధించిన కొత్త పిటిషన్లు దాఖలు చేస్తే.. అందులో కొత్త అంశాలను జోడించాలని, అలా అయితేనే వాటిని విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. -
దెయ్యం పట్టింది.. వదిలిస్తా..
యాదాద్రి భువనగిరి జిల్లా: అనారోగ్యా నికి గురైన చిన్నారికి.. దెయ్యం పట్టింది.. వదిలిస్తా.. అంటూ ఒక భూతవైద్యు డు చేసిన పూజలతో.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మటంలంక గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన ఒక చిన్నారి అనారోగ్యంగా ఉండడంతో.. ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం ఇల్లెందు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా, వారికి తారసపడిన ఒక భూత వైద్యుడు ఆస్పత్రికి అవసరం లేదని, తాను నయం చేస్తానని నమ్మించాడు. ఓ మేకను బలిచ్చి, భూతాలను కట్టడి చేస్తానని పూజలు చేశాడు. రెండు రోజులు గడుస్తున్నా పాప ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబసభ్యులు భూత వైద్యుడిని నిలదీశారు. అతను చేతులెత్తేయడంతో వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య ఖర్చులు భరించలేక.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని, భూత వైద్యుడి మాటలు నమ్మి సకాలంలో చికిత్స అందక అపస్మారక స్థితికి చేరిందని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై ఎస్ఐ రాజమౌళి స్పందిస్తూ భూత వైద్యం పేరుతో ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కాశీ వెళ్లిన సాయిపల్లవి.. పూజల్లో మునిగి తేలుతూ (ఫొటోలు)
-
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 58,165 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 01 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం.ఇక.. నిన్న(ఆదివారం) 67,284 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా లెక్క తేలింది.ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు...డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసంధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దుడిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురాళ్లు పఠనంజనవరి 15న తిరిగి సుప్రభాతం ప్రారంభం. -
ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏమిటి? సంభల్, జ్ఞానవాపితో లింకేంటి?
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో గల జామా మసీదు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఏఎస్ఐ సర్వేకు అనుమతినిచ్చింది.పెరుగుతున్న ప్రార్థనా స్థలాల వివాదాలుతదనంతరం సంభల్‌లో హింస చెలరేగింది. ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ హింసాకాండలో కొందరు పోలీసులు, స్థానికులు గాయపడ్డారు. అజ్మీర్ షరీఫ్ దర్గాను మహాదేవుని ఆలయంగా అభివర్ణించడంతో చెలరేగిన వివాదం ఇంకా ముగియనే లేదు. ఈ అంశం కూడా కోర్టులో ఉంది. ఇటీవల జరిగిన ఈ వివాదాలు ఉదాహరణ మాత్రమే. దీనికి ముందు, మథురలోని జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదాలు కూడా తరహాలోని హై ప్రొఫైల్ కేసులు. ఈ వివాదాలు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడివున్నాయి.చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆరు పిటిషన్లుప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ప్రార్థనా స్థలాల చట్టం అనేది ఏదో ఒక మతానికి చెందిన ప్రార్థనా స్థలాలను ఇతర మతాల ప్రార్థనా స్థలంగా మార్చకుండా నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు ఈ చట్టాలనికి గల చట్టపరమైన చెల్లుబాటును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. అవి సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి.ప్రార్థనా స్థలాల చట్టం-1991లో ఏముంది?1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం 1947, ఆగస్టు 15కు ముందు అంటే దేశ స్వాతంత్య్రానికి ముందు ఉన్న ఏదైనా మతపరమైన ప్రార్థనా స్థలం యథాతథ స్థితిని కొనసాగించడానికి అధికారాన్ని ఇస్తుంది. అలాగే ఆయా ప్రార్థనా స్థలాలను ఇతర మతాల ప్రార్థనా స్థలాలుగా మార్చడాన్ని కూడా నిరోధిస్తుంది. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ చట్టంలో కొన్ని ముఖ్యమైన సెక్షన్లు చేర్చారు.ప్రార్థనా స్థలం చట్టం సెక్షన్- 21947 ఆగస్టు 15 నాటికి ఏదైనా మతపరమైన స్థలంలో మార్పులకు సంబంధించి కోర్టులో ఏదైనా పిటిషన్ పెండింగ్‌లో ఉంటే, దానిని కొట్టివేస్తారని ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్- 2 చెబుతోంది.ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 3మతపరమైన స్థలాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా మరొక మతంలోకి మార్చడానికి అనుమతి లేదు. 1947 ఆగస్టు 15న ఏ విధంగా ఉన్న మత స్థలాలు యధాతథంగా ఉంటాయి. నాడువున్న మతస్థలం అంతకుముందు ఎప్పుడైనా కూల్చివేసి, మరో మతస్థలం నిర్మించినట్లు రుజువైనా, దాని ప్రస్తుత రూపాన్ని మార్చేందుకు అవకాశం లేదు.ప్రార్ధనా స్థలం చట్టంలోని సెక్షన్- 4(1)సెక్షన్ 4(1) ప్రకారం 1947, ఆగస్టు 15 నాటికి అన్ని మతాల ప్రార్థనా స్థలాల యథాతథ స్థితిని కొనసాగించాలి.ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 4(2)ప్రార్థనా స్థలాల చట్టం సెక్షన్- 4 (2) ప్రకారం, ప్రార్థనా స్థలాల చట్టం అమల్లోకి వచ్చిన తేదీన పెండింగ్‌లో ఉన్న దావాలు, చట్టపరమైన చర్యలను నిలిపివేయడం గురించి ఇది తెలియజేస్తుంది. అంటే 1947 ఆగస్టు 15కు ముందు ఉన్న వివాదంపై తిరిగి విచారణ ఉండదు.ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సెక్షన్- 5ఈ సెక్షన్ కింద రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని పక్కన పెట్టారు. అంటే అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి ఈ ప్రార్థనా స్థలాల చట్టంలోని ఎలాంటి నిబంధనలు వర్తించవు.చట్టం ఎందుకు అవసరమయ్యింది?అయోధ్యలో రామమందిర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఈ చట్టం వచ్చింది. ఈ వివాదం దేశమంతటిపై ప్రభావం చూపింది. దేవాలయాలు, మసీదులకు సంబంధించిన వివాదాలు తెరపైకి రావడం మొదలయ్యింది. మతపరమైన ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి. ఇలాంటి వివాదాలను నియంత్రించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకు వచ్చి, 1947 ఆగస్టు 15కి ముందు మత స్థలాల యథాతథ స్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది.ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది? -
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(శనివారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,602 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టోకెన్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 56,711 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,775 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.64 కోట్లుగా లెక్క తేలింది.నేడు తిరుమలలో గరుడసేవ...కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడవాహనం పై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.రాత్రి 7 గంటలకు గరుడవాహనం పై తిరు వీధుల్లో ఊరేగింపు.ఈ నెల 17 న తిరుమలలో కార్తీక వనభోజనం.18 టిటిడి పాలకమండలి సమావేశం -
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 61,446 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లుగా లెక్క తేలింది.ఉగ్ర శ్రీనివాసమూర్తి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహించాము. శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించిన టీటీడీ. చిరుజల్లుల మద్య ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.– టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(ఆదివారం) 82,233 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా లెక్క తేలింది. -
‘ట్రంప్ కృష్ణ’ : తెలంగాణాలో ట్రంప్ ఆలయంలో పూజలు, సంబరాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయ ఢంకా మోగించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అనేక దేశాధినేతలు ట్రంప్‌కు అభినందనలు తెలియజేశారు. అయితే తెలంగాణాలోని ఒక పల్లె ప్రజలు మాత్రం ఇంకో అడుగు ముందుకేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కొంతమంది ట్రంప్ అభిమానులు ట్రంప్ గుడిలో ఏకంగా పూజలు చేశారు. ట్రంప్‌కు గుడి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. అదే మరి విశేషం. 2020లోనే ట్రంప్ కోసం గుడి కట్టి విగ్రహం నెలకొల్పాడో వీరాభిమాని. ఆయనే కొన్నె గ్రామానికి బుస్స కృష్ణ. రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ. ట్రంప్‌ను మరోసారి అధ్యక్షుడిగా చూడాలని కలలు గనేవాడట. ట్రంప్ కోసం ఏకంగా ఉపవాస దీక్షలు చేసేవాడట. అయితే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ, 2020 అక్టోబరు 11న కన్నుమూశాడు.అంతేకాదు 2019లో కృష్ణ పెట్టిన ట్వీట్‌కు ట్రంప్ స్పందించడం మరో విశేషం.‘‘మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది.. అని కృష్ణ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీంతో కృష్ణ చాలా సంబరపడి పోయాడట. ట్రంప్ టీ షర్టులనే ధరించేవాడట. అలాగే తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించి పెట్టుకునేవాడు. అందుకు కృష్ణ గ్రామస్తుల హృదయాల్లో ‘ట్రంప్ కృష్ణ’గా ముద్ర వేసుకున్నాడు.Villagers in Telangana Celebrate Trump’s Re-Election by Worshipping His Statue in a Temple built for himIn a unique celebration, villagers in Konne, Jangaon district in Telangana, marked Donald Trump’s re-election as U.S. president by honoring Bussa Krishna’s devotion to the… pic.twitter.com/k1sS5bOPAQ— Sudhakar Udumula (@sudhakarudumula) November 7, 2024 తాజా ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడుగా విజయం సాధించడంతో గ్రామస్తులు తమ ‘ట్రంప్ కృష్ణ’ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడు కదా అని భావించారు. ఆయన లేని లోటు తీర్చేందుకా అన్నట్టుగా కృష్ణ మిత్రులు కొంతమంది బుధవారం ట్రంప్ విగ్రహం వద్ద పూలమాల వేసి సంబరాలు నిర్వహించారు. కొబ్బరికాయలు, ధూప దీప నైవేద్యాలు, సమర్పించి వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
ట్రంప్ విజయం కోసం మహామండలేశ్వర స్వామి పూజలు
న్యూఢిల్లీ: అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరు? మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తారా? లేక కమలా హారిస్‌కు అవకాశం దక్కుతుందా? అనేది త్వరలో తేలిపోనుంది. నవంబర్ 5న అమెరికాకు నూతన అధ్యక్షుడు ఎన్నిక కానున్నారు. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక వేత్త, మహామండలేశ్వర స్వామి వేదముతినంద సరస్వతి పూజలు చేసి, హోమాలు నిర్వహించారు.ఈ పూజలకు హాజరైనవారు తమ చేతుల్లో డొనాల్డ్ ట్రంప్ ఫోటోను పట్టుకున్నారు. వేదమంత్రోచ్ఛారణలు, శంఖునాదాల మధ్య పూజలు జరిగాయి. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కన డోనాల్డ్ ట్రంప్ ఉన్న ఫోటోను ఒక పండితుడు పట్టుకున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారతీయ సంతతికి చెందినవారు. ఆమెకు భారత్‌లో మద్దతుదారులు ఉన్నారు. WATCH | Delhi: Spiritual leader Mahamandelshwar Swami Vedmutinand Saraswati performs hawan and rituals for the victory of former US President #DonaldTrump in the US presidential elections.#USElections2024 pic.twitter.com/KwxvXEaSAn— TIMES NOW (@TimesNow) November 4, 2024అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాగే అంతర్జాతీయ వ్యూహాత్మక పొత్తులకు కేంద్ర బిందువుగా ఉంది. ఇప్పుడు అమెరికాలో జరుగున్న ఎన్నికలు పలు అంతర్జాతీయ అంశాలలో వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన ఇద్దరు అభ్యర్థుల మధ్య జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం వ్యవహారాల్లో అమెరికా పాత్ర ముగిసిపోవాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటుండగా, ఈ అంశంలో అమెరికా జోక్యం పెరగాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం -
శివనామస్మరణలతో కేదార్నాథ్ తలుపులు మూసివేత
రుద్రప్రయాగ: శివనామస్మరణల మధ్య చార్ధామ్లలో ఒకటైన కేదార్నాథ్ ధామ్ తలుపులను ఈరోజు (ఆదివారం) మూసివేశారు. శీతాకాలంలో ప్రతీయేటా ఈ తంతు కొనసాగుతుంటుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కేదార్‌నాథ్‌లో మహాశివునికి ఘనంగా పూజలు జరిగాయి. ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులను మూసివేశారు. ఇకపై కేదారనాథుడు ఉఖిమఠ్‌లో ఆరు నెలల పాటు దర్శనం ఇవ్వనున్నారు. భయ్యా దూజ్ సందర్భంగా ఈ రోజున తలుపులు మూసివేశారు. ఈ సందర్భంగా పంచముఖి విగ్రహాన్ని సంచార విగ్రహ డోలీలో కొలువుదీర్చారు. అనంతరం ఈ విగ్రహం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్‌కు ఊరేగింపుగా తరలిస్తారు. ఈ ఏడాది 16 లక్షల మంది యాత్రికులు కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించుకున్నారు. #WATCH | Uttarakhand: The portals of Shri Kedarnath Dham closed for the winter season today at 8:30 am. The portals were closed with Vedic rituals and religious traditions amidst chants of Om Namah Shivay, Jai Baba Kedar and devotional tunes of the Indian Army band.(Source:… pic.twitter.com/vCg2as6aJ7— ANI (@ANI) November 3, 2024కేదార్‌నాథ్‌ను ఇక్కడ చివరిసారిగా దర్శనం చేసుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని 10 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈరోజు కేదార్‌నాథ్‌లోని పంచముఖి విగ్రహాన్ని మొబైల్ విగ్రహం డోలీ ద్వారా ఉఖిమత్‌కు పంపనున్నారు. నిన్ననే(శనివారం) గంగోత్రి ధామ్ తలుపులు మూసివేశారు. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిలో గంగమ్మను పూజిస్తారు. ఇది కూడా చదవండి: త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం -
పుష్పాలతోనే ఎందుకు పూజించాలి?
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత.ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పామూలే వసేద బ్రహ్మ్ర మధ్యేచ కేశవః పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదళే పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివసిస్తుంటారని, పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్ పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడట. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. -
కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న సీఎం
వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శరన్నవరాత్రుల సందర్భంగా మహాశివుణ్ణి ఆరాధించారు. వారణాసికి చేరుకున్న ఆయన ముందుగా భారత సేవాశ్రమ సంఘ్‌లో దుర్గాదేవిని పూజించి, అనంతరం కాశీ విశ్వనాథుణ్ణి, కాలభైరవ ఆలయాన్ని, విశాలాక్షి ఆలయాన్ని సందర్శించారు.నవరాత్రులలో పంచమి రోజున వారణాసికి వచ్చిన సీఎం యోగి ముందుగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఆలయ అభివృద్ధి ప్రణాళికలకు స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆయన పలు ఆలయాలను సందర్శించారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన ఉండవచ్చని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు.ఇది కూడా చదవండి: నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి -
Bangladesh: హిందువుల పూజలపై ఆంక్షలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో అధికారం మారిన తర్వాత, అక్కడి హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువుల పూజల విషయంలో ఆంక్షలు విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.దీని ప్రకారం బంగ్లాదేశ్‌లోని హిందువులు ఇకపై ముస్లింలు నమాజ్ చేసే సమయంలో పూజలు చేయకూడదు. అలాగే ఆ సమయంలో భజనలు చేయడం, వినడం, లౌడ్ స్పీకర్లు వినియోగించడం లాంటి పనులు చేయకూడదు. ఈ ఉత్తర్వులను తాత్కాలిక ప్రభుత్వ హోం వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి జారీ చేశారు.ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా వారిని అరెస్టు చేస్తారని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో అధికారం మారినప్పటి నుంచి ఇప్పటివరకూ 300 హిందూ కుటుంబాలు, వారి ఇళ్లపై దాడులు జరిగాయి. హిందువులపై మూక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. పదికి పైగా హిందూ దేవాలయాల్లో విధ్వంసం, దహనాలు జరిగాయి. ఇదేవిధంగా 49 మంది హిందూ ఉపాధ్యాయుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వుల తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందువులు ప్రశాంతంగా పూజలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా చదవండి: NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన -
విఘ్నేశ్వరుడి పూజలో బాలీవుడ్ స్టార్స్.. ఫోటోలు వైరల్
-
Tirumala: సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 61,142 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో నిండి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 63,936 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 18,697 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.55 కోట్లుగా లెక్క తేలింది. -
జన్మాష్టమి వ్యాపారం రూ. 25 వేల కోట్లు
దేశవ్యాప్తంగా నిన్న(సోమవారం) శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో నేడు కూడా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల నేపధ్యంలో దేశవ్యాప్తంగా భారీగా వివిధ వస్తువుల కొనుగోళ్లు జరిగాయి.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకల సందర్భంగా రూ. 25 వేల కోట్లకు పైగా లావాదేవీలతో కూడిన వ్యాపారం జరిగింది. కృష్ణాష్టమి దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా నిర్వహించే పండుగ కావడంతో ప్రతీయేటా భారీగా కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఈ ఏడాది జన్మాష్టమి సందర్భంగా జరిగిన కొనుగోళ్ల వివరాలను సీఏఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మీడియాకు అందించారు.శ్రీకృష్ణాష్టమి సందర్బంగా పూలు, పండ్లు, స్వీట్లు, వస్త్రాలు, అలంకరణ వస్తువులు, స్వీట్లు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్ మొదలైనవాటిని వినియోగదారులు భారీ ఎత్తున కొనుగోలు చేశారని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. జన్మాష్టమి వంటి పండుగలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంటాయన్నారు. ఈసారి జన్మాష్టమి ప్రత్యేక ఆకర్షణలుగా డిజిటల్ టేబుల్‌లాక్స్, శ్రీకృష్ణునితో సెల్ఫీ పాయింట్ నిలిచాయని అన్నారు. కాగా దేశంలోని వివిధ సామాజిక సంస్థలు కూడా జన్మాష్టమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాయి. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో గోకులాష్టమి వేడుకలు...శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం28న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు04/10/2024 - సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం08/10/2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. -
తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 63,202 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,057 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4437 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో గోకులాష్టమి వేడుకలు..శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం28న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు..04/10/2024 - సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం08/10/2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం.బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, విఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 76,695 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,395 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.96 కోట్లుగా లెక్క తేలింది.19న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదలఆగష్టు 19న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదల.. ఆగష్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక.. ఆగష్టు 22న వర్చువల్ సేవల కోటా విడుదల.మరోవైపు.. ఆగష్టు 23న అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల. 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల చేయనున్నారు. 24న తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల. ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. ఆగష్టు 27న శ్రీవారి సేవ కోటా విడుదల.. https://ttdevasthanams.ap.gov.in సైట్ ద్వారా టికెట్ల బుక్ చేస్కోవాలని టీటీడీ సూచన -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) 72,967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,421 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.26 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(ఆదివారం) 86,604 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,536 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 62,756 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం. నేటితో జ్యేష్ఠాభిషేకం ముగింపు. నేడు ఉత్సవమూర్తులకు బంగారం కవచాలు అలంకరణ చెయ్యనున్న అర్చకులు. -
Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 61,499 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.04 కోట్లుగా లెక్క తేలింది. -
ఈ ఆలయాల్లో దేవుళ్లుగా రాజకీయ నాయకులు..!
భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు పేరుగాంచింది. వేదభూమి, కర్మభూమిగా పేరుగాంచిన ఈ భారతావనిలో రాజకీయనేతలను దేవుళ్లుగా భావించి పూజించిన ప్రజలు కూడా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో తమ అభిమాన నేతకు గుడికట్టించి మరీ భక్తిగా కొలుచుకుంటున్నారు. కొందరూ అనుచరులు, కార్యకర్తల్లో వారి అభిమాన నాయకుడిపై విపరీతమైన అభిమానం ఇలా భక్తిగా మారి దేవాలయాలకు నిర్మించి కొలుచుకునే వరకు వెళ్లిపోయింది. ఆ ఆలయాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అంతటి అభిమానాన్ని పొందిన నాయకులెవరూ తదతరాల గురించి సవివరంగా చూద్దామా..!సోనియా గాంధీ తెలంగాణలోని కరీంనగర్లో భారత జాతీయ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కోసం ఆమె మద్దతుదారులు దేవాలయం నిర్మించి మరీ దేవతగా కొలుచుకుంటున్నారు. వారి ప్రాంతానికి, దేశానికి చేసిన కృషి కారణంగా ఆమెను దేవతలాం చూస్తారు వాళ్లంతా. అంతేగాదు ఈ ఆలయంలో ఆమెకు పూజలు చేసి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ప్రజలు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమె పట్ల కృతజ్ఞతతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆమె నాయకత్వంలో తమ ప్రాంతానికి గణనీయమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. నరేంద్ర మోదీ..ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద సంఖ్యలో అనుచరలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఆయన గౌరవార్థం దేవాలయాలను నిర్మించారు మోదీ అభిమానులు . ఉత్తరప్రదేశ్‌లో మోదీ విధానాలు, నాయకత్వం పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునేలా ఒక మద్దతుదారుడు ఆయన కోసం గుడి కట్టాడు. ఆ ఆలయంలో మోదీ విగ్రహం ఉంటుంది. ఇక్కడ ప్రజలు మోదీ విగ్రహానికి పూజలు చేయడమే గాక ఆయన మార్గదర్శకత్వంలోనే పయనిస్తుంటారు కూడా. ఇక మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా మోదీకి మరో ఆలయం ఉంది. ఇక్కడ ఆయన ప్రధానిగా భాద్యతలు చేపట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయాన్ని ఆయన నాయకత్వంలో జరిగిన అభివృద్ధికి ప్రతీకగా నిర్మించారు. ఆయనను పూజించటం తమ అదృష్టంగా భావిస్తామని, ఆయన తమకు స్ఫూర్తి అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మాయవతి..బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయవతికి బుందేల్‌ఖండ్, నాట్పురా గ్రామాల్లో ఆలయాలు ఉన్నాయి. ఆమె నాయకత్వంలో గణనీయమైన సామజిక మార్పు జరిగిందిని, అణగారిని వర్గాల కోసం ఎంగానో కృషి చేసినందుకుగానూ ఆమె మద్దతుదారులు, దళితలు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మాయవతి సంప్రదాయ దుస్తుల్లో ఉన్న విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఆమె పుట్టిన రోజులు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రజలు. అలాగే నాట్పురా గ్రామంలో మాయవతికి గుడి కట్టించారు. కుల వివకక్షకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు అభిమానులు. అక్కడి ప్రజలకు ఆమెను పూజించడం వల్ల తమకు మానసిక ధైర్యం వస్తుందని, ఇది తమకు సామాజిక సవాళ్లను అధిగమించగల ఉపయోగపడుతుందని చెబుతున్నారు.మహాత్మా గాంధీజాతిపితా మహాత్మాగాంధీని భారతదేశం అంతటా గౌరవిస్తారు. కానీ ఒడిశాలోని సంబల్పూర్లో ఆయనకు ఆలయం నిర్మించి మరీ పూజలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇక్కడ ప్రజలు ఆయనను పూజింటమే గాక, ఆయన చెప్పిన అహింస, సత్యం, స్వావలంబన వంటి వాటిని పాటిస్తారు కూడా. ఈ ప్రాంతం గాంధేయ తత్వాన్ని వ్యాప్తి చేసే కేంద్రంగా పనిచేస్తుంది. సందర్శకులు ఈ ఆలయంలో ఉన్న గాంధీని ఒక సాధువుగా చూస్తారు. ఆయన బోధనలు నేటికి అక్కడ వినిపిస్తుంటాయి. ఆ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది సమాజంలో శాంతి, సామరస్యాన్నిపెంపొందించే సామాజిక, విద్యా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.రాజీవ్ గాంధీ..ఆయన దేశాన్ని ఆధునికరించడానికి చేసిన కృషికి గుర్తుగా బిహార్‌లోని రాజీవ్ మద్దతుదారులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రజలు నివాళులు అర్పించడమే గాక ప్రగతిశీల భారతదేశం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుని, ప్రేరణ పొందుతామని చెన్నారు. భారత్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. బిహార్‌లోని ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించి వారి జ్ఞాపకాలను నెమరువేసుకోవడమే గాక రాజీవ్ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటుంటారు. ఆయన నాయకత్వంలో తీసుకొచ్చిన విధానాలు గ్లోబల్ ఐటీ పవర్‌హౌస్‌గా మార్చడంలో సహాయపడ్డాయని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఎంజీఆర్ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆయన జ్ఞాపకార్థం పలు ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను చూస్తే.. ప్రజలతో ఆయనకు గల అవినాభావ సంబంధం తెలియజేస్తాయి. ముఖ్యంగా చెన్నైలోని ఆలయం మరింత పేరుగాంచింది. ఇక్కడ ఎంజీఆర్ జీవిత పరిణామక్రమానికి సంబంధించిన విషయాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఎంజీఆర్ స్ఫూర్తి.. తమకు మార్గనిర్దేశం చేసి కాపాడుతుందని ఆయన అనుచరుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయాల్లో ఆయన జయంతి, వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అంతేగాదు ప్రజలు తమ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఇక్కడకు తరుచుగా వస్తుంటారు కూడా.(చదవండి: ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?) -
Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,416 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(మంగళవారం) 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 35,726 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(శుక్రవారం) 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 43,199 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేడు ఆగష్టు కోటా టికెట్లుతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల.సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల.మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలమే 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 70,815 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.16 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శనివారం) 76,945 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,844 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.67 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) 60,545 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,527 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.53 కోట్లుగా లెక్క తేలింది. -
May 10 Tirumala: తిరుమలలో నేటి రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,508 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.97 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 26 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,313 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 28,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 80,532 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,438 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా లెక్క తేలింది. -
జ్ఞానవాపిని దర్శించుకున్న సీఎం యోగి!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని జ్ఞానవాపిని సందర్శించుకున్నారు. అక్కడి నేలమాళిగలోని విగ్రహాలను వీక్షించారు. దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని అక్కడ కొలువైన దేవతలను వేడుకున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం వారణాసికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య వారణాసిలో పర్యటించనున్నారు. పూర్వాంచల్ అభివృద్ధికి దోహదపడే అమూల్ ప్లాంట్‌కు ప్రధాని మోదీ గతంలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దీనిని ఫిబ్రవరి 23న ఆయన ప్రారంభించనున్నారు. వారణాసిలోని కార్ఖియాగావ్లో జరిగే భారీ బహిరంగ సభతో ప్రధాని మోదీ ఎన్నికల సైరన్ మోగించనున్నారు. ఈ సభకు లక్ష మందికి పైగా జనం తరలివస్తారని అంచనా. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహాలను పరిశీలించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ వారణాసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విశ్వనాథ ఆలయంలో బాబా భోలేనాథ్‌ను దర్శించుకున్నారు. అలాగే జ్ఞానవాపి నేలమాళిగలో విగ్రహాలను వీక్షించారు. ఈ సమయంలో ఆయన వెంట ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని నేలమాళిగను పూజల కోసం తెరిచారు. అప్పటి నుంచి సామాన్య భక్తుల దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. -
నేడు వసంత పంచమి: దేశంలోని ప్రముఖ సరస్వతి ఆలయాలివే!
ఈరోజు (ఫిబ్రవరి 14).. వసంత పంచమి.. అంటే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా ఈరోజు సరస్వతీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యసాలు కూడా చేయిస్తుంటారు. అయితే దేశంలోని సరస్వతి ఆలయాల విషయానికొస్తే తక్కువగానే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ సరస్వతీ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భీమపుల్ సరస్వతి ఆలయం (ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో భీమపుల్ సరస్వతి ఆలయం ఉంది . ఇక్కడ సరస్వతీ మాత స్వయంగా వెలిశారని చెబుతారు. ఇక్కడ సరస్వతీమాత భీమా నది సమీపంలో ఉద్భవించారు. బాసర సరస్వతి ఆలయం (తెలంగాణ) బాసర గ్రామం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ముధోల్ పరిధిలో ఉంది. ఇక్కడ గోదావరి ఒడ్డున సరస్వతీమాత ఆలయం ఉంది. దీనిని మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో వాల్మీకి సమాధి స్థలం కూడా ఉంది. ఆలయంలో లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఆలయంలో సరస్వతీమాత విగ్రహం పద్మాసన భంగిమలో నాలుగు అడుగుల ఎత్తుతో కూడి ఉంటుంది. ఆలయానికి తూర్పున మహంకాళి ఆలయం కూడా ఉంది. పుష్కర్ సరస్వతి ఆలయం (రాజస్థాన్) రాజస్థాన్‌లోని పుష్కర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం, జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సావిత్రిమాత ఆలయం కూడా ఉంది. సరస్వతీ మాత ఇక్కడ నది రూపంలో కొలువుదీరిందని విశ్వసిస్తారు. శృంగేరి శారదా ఆలయం(కర్నాటక) జగద్గురు శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాలలో కర్నాటకలోని శృంగేరి పీఠం ఒకటి. శృంగేరిలో శారదాంబ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ శారదాంబ ఆలయాన్ని, దక్షిణామ్నాయ పీఠాన్ని ఏడవ శతాబ్దంలో ఆచార్య శ్రీ శంకర్ భగవత్పాదులవారు నిర్మించారు. మూకాంబిక ఆలయం(కేరళ) కేరళలోని ఎర్నాకులం జిల్లాలో మూకాంబిక ఆలయంగా పేరొందిన సరస్వతి మాత ఆలయం ఉంది. చరిత్రలోని వివరాల ప్రకారం ఇక్కడి రాజులు మూకాంబిక దేవిని పూజించేవారు. ప్రతి సంవత్సరం మంగళూరులో ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే భక్తులు అక్కడికి వచ్చేందుకు పలు ఇబ్బందులు పడేవారట. ఒకరోజు అక్కడి రాజుకు కలలో అమ్మవారు కనిపించి, తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరారట. ఇక్కడ కొలువైన సరస్వతీ దేవి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. మైహార్ శారదా ఆలయం (మధ్యప్రదేశ్) మైహార్ శారదా ఆలయం.. మాతా కాళికా ఆలయంగానూ, సరస్వతీ ఆలయంగానూ పేరొందింది. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని సత్నా నగరానికి సమీపంలో త్రికూట కొండపై ఉంది. సరస్వతీమాత.. శారదాదేవి రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంది. భోజశాల (మధ్యప్రదేశ్) మధ్యప్రదేశ్‌లోని ధార్ నగరంలో భోజశాల ఆలయం ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం వసంత పంచమి నాడు సరస్వతీ దేవి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ రోజున సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. భోజరాజు సరస్వతీ దేవి భక్తుడు. ఆయనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. విద్యా సరస్వతీ ఆలయం (తెలంగాణ) విద్యా సరస్వతి ఆలయం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఉంది. కంచి శంకర మఠం ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయం, శనీశ్వరుని ఆలయం, శివాలయం ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. -
జ్ఞానవాపి: 30 ఏళ్ల తర్వాత పూజలు
యూపీలోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో సుమారు 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే పూజలు జరగడం గమనార్హం. వ్యాస్ కా తెహఖానా(వ్యాసుని నేలమాళిగ) సెల్లార్లో ఉదయం 3గం.కే విగ్రహాలకు తొలి పూజ ప్రారంభమైంది. వారం లోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ ప్రకటించినప్పటికీ.. సత్వరమే ఆ ఏర్పాట్లను పూర్తి చేసి పూజలు మొదలుపెట్టింది. కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ మసీదులో వేకువ ఝామున 3 గంటలకే పూజలు ప్రారంభం అయ్యాయి. విశ్వనాథుడి ఆలయ పూజారి మంగళహారుతులు ఇచ్చారు. రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీద్ సమీపంలో మందిర్(ఆలయం) అనే బోర్డును అంటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. #WATCH | Varanasi: After the District Court granting permission for conducting 'Pooja' in the 'Vyas Ka Tehkhana' in Gyanvapi mosque, Chairman of Kashi Vishwanath Trust Nagendra Pandey says, "Court has ordered the opening and subsequent worship at the 'tehkhana' which was closed… pic.twitter.com/KhN0cMTjPC — ANI (@ANI) February 1, 2024 బాబ్రీ విధ్వంసం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి ప్రాంతాన్ని సీజ్ చేయించారు. హిందువులు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఒక్కరికీ ఇక్కడ పూజలు చేసే హక్కు ఉంది అని హిందు పక్షం తరఫున కోర్టులో వాదనలు వినిపించిన విష్ణు శంకర్ జైన్ చెబుతున్నారు. ఇక ఈ తీర్పు ప్రతి హిందువు హృదయంలో సంతోషాన్ని నింపిందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కోర్టు ఈ ఉత్తర్వును స్వాగతించారు. దీనిపై ‘ఎక్స్’లో స్పందిస్తూ 'శివ భక్తులకు న్యాయం జరిగింది. విశ్వనాథుని ఆలయ సముదాయంలోగల వ్యాసుని నేలమాళిగలో పూజలు చేసుకునే హక్కును మంజూరు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని’ అన్నారు. #WATCH | Gyanvapi case | After the court grants permission for puja in the 'Vyas Ka Tekhana', advocate Sohan Lal Arya says, "We are feeling very proud today. The court's decision yesterday was unprecedented...The arrangements have been made but it (Vyas Ka Tekhana) has not been… pic.twitter.com/21R8jzcxQe — ANI (@ANI) February 1, 2024 జ్ఞానవాపి మసీదులోని ‘వ్యాస్ కా తహఖానా’లో పూజలు చేయడానికి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడంపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఏ పక్షానికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. "Arrangements have been made but...": Advocate Sohan Lal Arya over Varanasi Court's order on Gyanvapi Mosque Read @ANI Story |https://t.co/uTQ5eTNesb#GyanvapiMosque #VaranasiCourt #GyanvapiMosque pic.twitter.com/uVIFbRSRNO — ANI Digital (@ani_digital) February 1, 2024 -
ప్రాణప్రతిష్ఠకు ముందు ఇంటిలో సీఎం యోగి పూజలు!
అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన గురువులను స్మరించుకుని, పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియా సైట్లో షేర్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలా రాశారు.. 'అయోధ్యధామ్‌లోని శ్రీరాముడి జన్మస్థలంలో నేడు జరుగుతున్న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శతాబ్ధాల పోరాట ఫలితం. ఈ సందర్భంగా దిగ్విజయ్నాథ్ మహరాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్‌లకు ఉద్వేగభరితమైన నివాళులు అర్పిస్తున్నాను.. జై జై శ్రీ రామ్!’ అని రాశారు. श्री अयोध्या धाम में श्रीराम जन्मभूमि पर आज हो रही प्रभु श्री रामलला के नूतन विग्रह की प्राण-प्रतिष्ठा से पीढ़ियों का संघर्ष एवं सदियों का संकल्प पूर्ण हुआ है। इस अवसर पर युगपुरुष ब्रह्मलीन महंत दिग्विजयनाथ जी महाराज और राष्ट्रसंत ब्रह्मलीन महंत अवेद्यनाथ जी महाराज के प्रति… pic.twitter.com/slW5UjNUoC — Yogi Adityanath (@myogiadityanath) January 22, 2024 సీఎం యోగి మరో ట్వీట్లో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు... ‘ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం.. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యధామ్‌లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. నేడు ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. భక్తి సాగరంలో మునిగిన దేశమంతా రామనామం స్మరిస్తోంది’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు లండన్ సాధ్విల బృందం! -
కాశీ నుంచి అయోధ్యకు 50 క్వింటాళ్ల పూలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి పూలను తెప్పించారు. అయోధ్యను అలంకరించేందుకు కాశీ నుంచి కూడా పూలు తెప్పించారు. పూర్వాంచల్‌లోని అతిపెద్ద పండ్ల మార్కెట్ నుంచి 50 క్వింటాళ్ల పూలను రెండు రోజుల క్రితం అయోధ్యకు తరలించారు. ఈ పూలలో ఆరెంజ్, పసుపు రంగు బంతిపూలు ఉన్నాయి. ఇదేవిధంగా కాశీ నుంచి అయోధ్యకు పెద్ద మొత్తంలో గులాబీలను పంపించామని, పది వేల బంతిపూల దండలను కూడా పంపినట్లు మాల్దాహియా పూల మార్కెట్ హెడ్ విశాల్ దూబే తెలిపారు. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ, కొద్దిమొత్తంలోనే పూలను అయోధ్యకు పంపించామన్నారు. కాగా కాన్పూర్, లక్నో, కోల్‌కతాల నుంచి కూడా అయోధ్యకు పూలను ఆర్డర్ చేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి యూపీలో ప్రస్తుతం పూలకు విపరీతమైన గిరాకీ ఉంది. జనవరి 22న వివిధ ఆలయాల్లో పూజలు, వేడుకలు నిర్వహించనున్న దృష్ట్యా వివిధ రకాల పూలకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. బంతిపూలతో పాటు గులాబీ, మల్లె పూలకు విపరీతమైన ఆర్డర్లు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలరామునికి భారీ వేణువు -
ఉత్సవ విగ్రహమే ఇంత సమ్మోహనంగా ఉందంటే..
అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆలయ ట్రస్టు ఎంతగానో కృషి చేస్తోంది. సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండటంతో రామాలయానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం ప్రతిరోజూ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత ఆకర్షణీయమైన రామ్‌లల్లా విగ్రహానికి సంబంధించిన తొలి ఫొటో వెలుగులోకి వచ్చింది. పల్లకీలో కూర్చున్న రామ్‌లల్లా ఆలయ ప్రాంగణంలో ఊరేగారు. అయితే ఇది గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం కాదు. ఇది ప్రతీకాత్మక విగ్రహం. గర్భగుడిలో ప్రతిష్టించే బాలరాముని విగ్రహాన్ని ఈనెల 18న(ఈరోజు) రామాలయ ప్రాంగణానికి తీసుకురానున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కర్నాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ నూతన రామాలయంలో ప్రతిష్ఠించే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. జనవరి 22న జరిగే పవిత్రోత్సవానికి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆలయ ట్రస్టు తొలుత బాలరాముని విగ్రహాన్నే ఆలయ ప్రాంగణంలో ఊరేగించాలని భావించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి, శ్రీరాముని ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి, భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలిగించారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిద పవిత్ర నదీ జలాలలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేయనున్నారు. అనంతరం గర్భగుడిలో పూజలను నిర్వహించి, బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇది కూడా చదవండి: 22న స్కూళ్లకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే.. -
నేడు ‘జగన్నాథ్’ కారిడార్ ప్రారంభం.. ప్రత్యేకతలివే!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సన్నాహాల నడుమ ఒడిశాలో జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. దీనిని శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ (ఎస్ఎస్పీ) లేదా జగన్నాథ టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును బుధవారం (జనవరి 17) ప్రారంభించనున్నారు. కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా ఒడిశాలోని పూరీ ప్రాంతాన్ని వివిధ రకాలపూలు, రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించారు. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన ‘మహాయాగం’ మంగళవారం రెండో రోజు కూడా కొనసాగగా, బుధవారం మధ్యాహ్నం గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేబ్ నిర్వహించే ‘పూర్ణాహుతి’తో ముగుస్తుంది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు, జగన్నాథుని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని దర్శనం కోసం భక్తులు నేటి ఉదయం నుంచే బారులు తీరారు. హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి 80 ప్లటూన్ల పోలీసు బలగాలను (ఒక ప్లాటూన్‌లో 30 మంది పోలీసులు) మొహరించినట్లు శ్రీ జగన్నాథ ఆలయ హెరిటేజ్ కారిడార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) తెలిపారు. దాదాపు 100 మంది సూపర్వైజరీ అధికారులు, 250 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులు కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కింద రూ. 800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాద్ పచేరి (బయటి గోడ) చుట్టూ భారీ కారిడార్లు నిర్మించారు. ఇది 12వ శతాబ్దపు ఆలయాన్ని ఒక క్రమ పద్ధతిలో సందర్శించడానికి భక్తులకు సహాయపడుతుంది. పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాలయ వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. పూరీలో శ్రీ జగన్నాథ్ పరిక్రమ ప్రాజెక్ట్ ప్రారంభం రోజున అంటే జనవరి 17న ప్రభుత్వ సెలవు దినంగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. కారిడార్ ప్రాజెక్ట్‌లో పార్కింగ్ స్థలం, శ్రీ సేతు, పుణ్యక్షేత్రం, జగన్నాథ ఆలయ యాత్రికుల రాకపోకలకు కొత్త రహదారి, టాయిలెట్లు, క్లాక్ రూమ్‌లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా గల 90 ప్రముఖ ఆలయాల ప్రతినిధులను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం ఆహ్వానించింది. -
ప్రాయశ్చిత్త పూజ ఏమిటి? అయోధ్యలో ఎందుకు చేస్తున్నారు?
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముందుగా నేడు (మంగళవారం)ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నారు. ఇంతకీ ప్రాయశ్చిత్త పూజ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ప్రతీఒక్కరూ తెలిసో, తెలియకో తప్పులు చేస్తుంటారు. చేసిన తప్పులకు ఆ తరువాత పశ్చాత్తాప పడుతుంటారు. హిందూ ధర్మంలో వైదిక సంప్రదాయం ప్రకారం భగవంతుని పూజించడానికి ప్రత్యేక నియమాలు, విధానాలు ఉన్నాయి. ఏదైనా మతపరమైన ఆచారాన్ని నిర్వహించే ముందు వాటిని పాటించడం తప్పనిసరి అని భావిస్తారు. అయితే పూజా విధానంలో పొరపాటున ఏవైనా నియమాలను తప్పితే, తప్పు జరిగిందని బాధపడుతుంటారు. అందుకే దోష పరిహారం కోసం ముందుగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ తరహా పూజలతో భౌతిక, మానసిక, అంతర్గత ప్రాయశ్చిత్తం జరుగుతుందని పండితులు చెబుతారు. ప్రాయశ్చిత్త పూజలో భాగంగా 10సార్లు పుణ్య స్నానాలు చేస్తారు. బూడిదతో సహా వివిధ వస్తువులతో స్నానం చేస్తారు. ఈ పూజలో గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. బంగారం, వెండి, నగలు మొదలైనవి కూడా దానం చేస్తారు. ప్రాయశ్చిత్త పూజలు చేయడం వలన ఎటువంటి దోషాలు అంటుకోవని చెబుతారు. అందుకే దేవాలయాలు నిర్మించినప్పుడు లేదా విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు తప్పనిసరిగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. ఫలితంగా పూజల నిర్వహణలో ఎటువంటి పొరపాటు జరిగినా దోషం తగలదని అంటారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి! -
నేటి నుంచి ‘ప్రాణప్రతిష్ఠ’ ముందస్తు ఆచారాలు ప్రారంభం!
అయోధ్యలో ఈనెల 22న జరగబోయే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆచారాలు, నియమాలు మకర సంక్రాంతి పండుగ నుంచి అంటే నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే 11 మంది దంపతులు నేటినుంచి 45 నియమాలను పాటించనున్నారు. ప్రాయశ్చిత్తం, గోదానం, దశవిధ స్నానం, ప్రాయశ్చిత్త క్షౌర్యం, పంచగవ్యప్రాశన మొదలైన నియమాలను ఈ 11 మంది దంపతులు పాటించనున్నారు. ఈ నియమాలను పాటించడం ద్వారా వీరు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సక్రమరీతిలో నిర్వహించగలుగుతారని పండితులు చెబుతున్నారు. సోమవారం సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఈ దంపతులంతా మొదటి స్నానం చేసి, ఎనిమిది రోజులపాటు ఈ నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే 11 మంది దంపతులకు వారు పాటించాల్సిన నియమనిబంధనలను తెలియజేసింది. ట్రస్ట్ వీరిచేత ఈ నిబంధనల పాలనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించనుంది. ఈ దంపతులు ఉదయం సాయంత్రం ప్రార్థన,పూజాదికాలలో పాల్గొంటూ నిరంతరం రామనామం జపించాలి. అలాగే సాత్విక ఆహారం తీసుకుంటూ, జీవనశైలి సాత్వికంగా ఉండేలా చూసుకోవాలి. జనవరి 22న అభిజిత్ ముహూర్తపు 84 సెకన్ల కాలంలో వైదిక సంప్రదాయాలను అనుసరించి బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో నటి హేమమాలిని నృత్య ప్రదర్శన! -
ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత?
సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులకు ఈ జనవరి చాలా ప్రత్యేకమైనది. ఈ నెల చారిత్రాత్మకం కానుంది. ఈ నెలలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకే ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ‘ప్రాణ్’ అనే పదానికి ప్రాణశక్తి అని, ‘ప్రతిష్ఠ’ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్థం. ప్రాణ ప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతిష్ఠాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు. ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ విగ్రహానికి గంగాజలం లేదా వివిధ పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి, నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం ఆ విగ్రహాన్ని స్వచ్ఛమైన, శుభ్రమైన ప్రదేశంలో ఉంచి గంధంపూస్తారు. తరువాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠగావిస్తారు. ఈ సమయంలో పంచోపచారాలు నిర్వహిస్తూ, పూజలు చేస్తారు. చివరిగా ఆ దేవతా స్వరూపానికి హారతి ఇస్తారు. ఇదే సమయంలో భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇది కూడా చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. -
22న అయోధ్యలో హైసెక్యూరిటీ.. భద్రతా బలగాలివే..
మరికొద్ది రోజుల్లో అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో భద్రతా సిబ్బందిని అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో మోహరించనున్నారు. పోలీసు అధికారి డీజీపీ ప్రశాంత్ కుమార్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జనవరి 22న ఆలయ విధుల్లో పాల్గొనే పోలీసులెవరూ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించకూడదు. అలాగే ఈ వేడుక ముగిసిన నాలుగు రోజుల తర్వాత జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భద్రతా సిబ్బంది స్మార్ట్ మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడని డీజీపీ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రామమందిర సముదాయానికి సంబంధించిన సమగ్ర భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రాంతాన్నంతటినీ రెడ్, ఎల్లో జోన్లుగా విభజించారు. రామజన్మభూమి కాంప్లెక్స్‌ను రెడ్ జోన్లో ఉంచారు. 6 కంపెనీల సీఆర్పీఎఫ్, 3 కంపెనీల పీఏసీ, 9 కంపెనీల ఎస్ఎస్ఎఫ్, 300 మంది పోలీసు సిబ్బంది, 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 38 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 40 మంది రేడియో పోలీసు సిబ్బందికి రామాలయం, దాని ప్రాంగణం భద్రత బాధ్యతలు అప్పగించారు. అయోధ్య భద్రతకు రూ.90 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అయోధ్యలో ఏఐ ఆధారిత వ్యవస్థను కూడా అమలు చేయనున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన రెండు బృందాలు, రెండు విధ్వంసక నిరోధక దళాలు, పీఎసీకి చెందిన ఒక కమాండో యూనిట్, ఎటీఎస్, ఎస్టీఎఫ్లకు చెందిన ఒక్కో యూనిట్, ఎన్ఎస్జీతో సహా సెంట్రల్ ఏజెన్సీలను కూడా ఆలయ భద్రత విధుల్లో మోహరించనున్నారు. ఎల్లో జోన్‌లోని కనక్‌భవన్, హనుమాన్‌గఢి ప్రాంతాల్లో కూడా పటిష్ట భద్రత ఉంటుంది. ఎల్లో జోన్లో 34 మంది సబ్ఇన్స్పెక్టర్లు, 71 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 312 మంది కానిస్టేబుళ్లు భద్రతను పర్యవేక్షించనున్నారు. -
22న అయోధ్యలో వెలగనున్న భారీదీపం
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడి రామ్‌ఘాట్‌లోని తులసిబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాళ్ల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తులసిబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్ధామ్తో పాటు పలు పుణ్యక్షేత్రాలలోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్‌కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి, త్రేతాయుగంనాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాళ్ల పత్తితో ఈ దీపానికి వినియోగించే వత్తిని సిద్ధం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన -
‘రామనంది’ సంప్రదాయం ఏమిటి? అయోధ్యలో పూజారులెవరు?
అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ‘రామనంది’ సంప్రదాయంలో అయోధ్య రామాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగనుంది. ఇంతకీ ‘రామనంది’ శాఖను ఎవరు స్థాపించారు? ఈ సంప్రదాయంలోని నియమాలు ఏమిటి? రామనంది శాఖను జగత్గురు శ్రీ రామానందాచార్య స్థాపించారు. ఈ శాఖ బైరాగిల నాలుగు పురాతన శాఖలలో ఒకటి. దీనిని బైరాగి శాఖ, రామవత్ శాఖ, శ్రీ శాఖ అని కూడా పిలుస్తారు. కాశీలోని పంచగంగా ఘాట్ వద్ద రామనంది శాఖకు చెందిన పురాతన మఠం కూడా ఉంది. ఈ శాఖకు చెందిన వారు ప్రధానంగా శ్రీరాముని పూజిస్తారు. ఈ శాఖలోని వారు జపించే మంత్రం ‘ఓం శ్రీరామాయ నమః’ ఈ శాఖను అనుసరించేవారు శుక్లశ్రీ, బిందుశ్రీ, రక్తశ్రీ మొదలైన తిలకాలను ధరిస్తారు. రామనంది శాఖకు శ్రీరాముడు ప్రధాన దైవం. ఈ వర్గానికి చెందిన వారు బాలునిరూపంలోని శ్రీరాముని పూజిస్తారు. అంటే చిన్నపిల్లలను ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటారో అదేవిధమైన తీరులో భగవంతుని పూజిస్తారు. వీరు పూజా విధానంలో బాలరాముడిని ప్రతిరోజూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రీరాముని చిన్న పిల్లవానిగా భావించి.. ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానం చేయించడం, గోరుముద్దలను తినిపించడం లాంటివి తమ పూజా విధానంలో భాగంగా ఆచరిస్తుంటారు. రామనంది శాఖ కొన్ని వందల ఏళ్లుగా అయోధ్యలోని రామాలయంలో పూజలు నిర్వహిస్తోంది. నూతన రామాలయంలో కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామనంది వర్గానికి చెందిన పూజారులే ఇక్కడ సమస్త పూజలు చేయనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు రాకండి! -
శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు
అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరడానికి ఇక 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2024 జనవరి 22న శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. కాశీకి చెందిన పండితులు లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలో 121 మందికి పైగా వేద పండితుల బృందం జనవరి 16 నుండి 22 వరకు రామాలయంలో పూజలు నిర్వహించనుంది. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు యాగంతో పాటు నాలుగు వేదాల పఠనం.. ఇలా మొత్తం 60 గంటల పాటు వివిధ పూజాది కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీరామునికి 56 రకాల ప్రసాదాలు సమర్పించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీరామునికి ఘనమైన హారతినివ్వనున్నారు. జనవరి 17న ఉదయం ఎనిమిది గంటలకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ప్రారంభమై, మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు వివిధ పూజలు తిరిగి ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకు కొనసాగనున్నాయి. అంటే జనవరి 16 నుండి 22 వరకు ప్రతిరోజూ దాదాపు 10 నుండి 12 గంటల పాటు రామాలయంలో పూజలు జరగనున్నాయి. జనవరి 22న బాల శ్రీరాముడు గర్భగుడిలో కొలువుదీరనున్నాడు. ఈ పూజాదికాల కోసం ఆలయ ప్రాంగణంలో పలు మండపాలు, హోమ గుండాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు చెందిన సాయుధ బృందం అయోధ్యలో త్వరలో ప్రారంభంకానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి భద్రతను అందించనుంది. డిసెంబర్ నెలాఖరులోగా విమానాశ్రయం మొదటి దశ పూర్తవుతుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఇది కూడా చదవండి: రాజస్థాన్ సీఎం ఎంపికకు ఛత్తీస్‌గఢ్ ఫార్ములా? -
భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు
భారత్.. ప్రపంచకప్ గెలవాలని ప్రతి భారతీయుడు అభిలషిస్తున్నాడు. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తమ నమ్మకాలకు అనుగుణంగా పలువురు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ట్రాన్స్జెండర్ల సంఘం సభ్యులు ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు తమ చేతులతో టీమ్ ఇండియా సభ్యుల ఫోటోలను పట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. టీమ్ ఇండియాకు శుభం జరగాలని అభిలషిస్తూ శంఖం ఊదారు. భగవంతునికి హారతులిచ్చారు. డప్పులు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల ప్రార్థనలను భగవంతుడు స్వీకరిస్తాడని, వారి పూజలు ఫలవంతమవుతాయిని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు వరుసగా 10 విజయాలతో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఆస్ట్రేలియా తన మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినా, తరువాత జరిగిన అన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది. ప్రపంచకప్‌లో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చూపాయి. అటువంటి స్థితిలో ఈరోజు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్ చూసే మహత్తర అవకాశం! -
సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్ చూసే మహత్తర అవకాశం!
ఈరోజు(ఆదివారం) ఉత్తరాదిన మహిళలు భర్త క్షేమం కోరుతూ ఛత్ వ్రతం చేస్తున్నారు. దీనిలో భాగంగా నేటి సాయంత్రం వేళ నదిలో నిలుచుని సూర్యునికి అర్ఘ్యమివ్వనున్నారు. మరోవైపు ఈ రోజు క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అటు ఛత్ పూజలో పాల్గొని, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు అదే సమయంలో భారీ స్క్రీన్‌పై క్రికెట్ మ్యాచ్ వీక్షించే అవకాశం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌వాసులకు దక్కింది. టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకోగానే దేశంలోని క్రికెట్ అభిమానులు ఉత్సాహం అంబరాన్ని తాకింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానికులు అటు ఛత్ పూజలో పాల్గొంటూ, అదే సమయంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వివిధ గంగా ఘాట్ల వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం ఒడ్డున సూర్య భగవానుని విగ్రహం దగ్గర భారత జట్టు పోస్టర్లను ఏర్పాటు చేశారు. టీమ్ ఇండియా విజయం కోరుతూ భక్తులు రామాయణ పారాయణం కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఛత్ పూజ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని గంగానది ఒడ్డున ఛత్ పూజా మండపం ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి మండపంలో భారత జట్టు పోస్టర్లను కూడా ఉంచారు. దీంతో ఇక్కడి పూజలు నిర్వహిస్తున్నవారంతా భారత్ విజయం కోసం కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’ -
‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం(ఈరోజు) భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం దేశప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా భారత్ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో భారత జట్టు అభిమానులు ముక్తేశ్వర్ ధామ్‌లోని గంగా ఘాట్ వద్ద భారీగా పూజలు నిర్వహించి ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’ అని వేడుకున్నారు. గంగామాత ఆశీర్వాదాలు భారత టీమ్‌కు ఉంటాయని వారు అంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ ఒకే స్వరంతో ‘ఆల్ ది బెస్ట్ ఇండియా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి సారధ్యం వహించిన జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు చందేశ్వర్ ప్రసాద్ సిన్హా అలియాస్ బోడి సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దేశం విజయం సాధించేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, మన టీమ్ విజయం కోసం ప్రార్థనలు చేశామన్నారు. క్రికెట్ అభిమాని రంజిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ఈసారి ప్రపంచకప్ క్రికెట్లో భారత జట్టు తప్పకుండా మన జెండాను ఎగురవేస్తుందని’ అన్నారు. ప్రపంచకప్ 2023లో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఇరు జట్లకు ఆదివారం చివరి మ్యాచ్ జరగనుంది. ఇది కూడా చదవండి: మ్యాచ్ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో.. -
నేడు అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు!
అయోధ్యలో దీపావళిని మరింత దేదీప్యమానం చేసేందుకు ఈసారి కూడా రామనగరిని అందంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్యలోని 51 ఘాట్లలో నవంబరు 11న(నేడు) 24 లక్షల దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 6 సంవత్సరాలుగా అయోధ్యలో జరుగుతున్న దీపోత్సవం ప్రపంచ రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంప్రదాయం ఈసారి కూడా కొనసాగనుంది. దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున లేజర్ షో ద్వారా శ్రీరాముని జీవిత సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించనున్నారు. మనదేశానికి చెందిన కళాకారులతో పాటు రష్యా, శ్రీలంక, సింగపూర్, నేపాల్‌కు చెందిన కళాకారులు కూడా ఈ దీపోత్సవ్‌లో రామలీలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దీపావళి నాడు అయోధ్యలో త్రేతాయుగం కళ్లకు కట్టినట్లు చూపేందుకు కళాకారులు సన్నద్ధమవుతున్నారు. రామ మందిర నిర్మాణం పూర్తవుతున్న తరుణంలో ఈసారి అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈసారి యూపీతో పాటు పలు రాష్ట్రాల సంస్కృతులను ప్రదర్శనల్లో చూపనున్నారు. ఇప్పటికే అయోధ్యానగరి దీప కాంతులతో మెరిసిపోతోంది. రోడ్లు, ఇళ్లు, వీధులు జనాలతో రద్దీగా మారిపోయాయి. కాగా అయోధ్యలో జనవరి 22న రామాలయంలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది? #WATCH | Ayodhya is all set to hold a grand Deeptosav on the eve of Diwali with over 24 lakh diyas at 51 ghats set to illuminate the city pic.twitter.com/p4cEjJQiCd — ANI (@ANI) November 11, 2023 -
డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఛత్తీస్‌ఘఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఇప్పటికే డోంగర్‌ఘఢ్ చేరుకున్నారు. కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రగిరిలో ఆచార్య విద్యాసాగర్ మహరాజ్‌తో సమావేశమై, పలు అంశాలపై చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ముందుగా బమ్లేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. ఛత్తీస్‌ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డోంగర్‌ఘడ్ స్థానం కీలకంగా మారింది. జైన మతానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ ఇక్కడ పర్యటన చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఆచార్య విద్యాసాగర్ మహరాజ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కుండల తయారీలో కామర్స్ గ్రాడ్యుయేట్.. -
ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అరుణాచల్ ప్రదేశ్: విజయదశమి పర్వదినం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చానని, అప్పుడు జవానులతో కలిసి విజయదశమి జరుపుకోవాలని అనుకున్నానని, దేశ భద్రతకు బాధ్యత వహిస్తున్న సైనికులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. తవాంగ్ చేరుకునే మందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ సందర్శించారు. అక్కడి నాలుగు కార్ప్స్ హెడ్‌క్వార్టర్స్‌సైనికులతో సంభాషించారు. ఇక్కడ అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేయడాన్ని రాజ్‌నాథ్ ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలు, మతాలు, నేపథ్యాల నుండి వచ్చిన సైనికులు ఒకే బ్యారక్స్, యూనిట్లలో కలిసి పని చేయడం భారత సైన్యానికున్న ఐక్యతను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి? विजयादशमी के पावन अवसर पर तवाँग में ‘शस्त्र पूजा’। https://t.co/JIYcBbd1no — Rajnath Singh (@rajnathsingh) October 24, 2023 -
11,888 మంది బాలికలకు కన్య పూజలు
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో కూడా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గొండాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం ‘శక్తి వందనం’ నిర్వహించారు. కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యాభోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఘనంగా ‘శక్తి వందనం’ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు. దేశంలోనే భారీ స్థాయిలో కన్యా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఘనమైన ఏర్పాట్లు చేయగా, 11 వేల 11,888 మందికి పైగా బాలికలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కన్యా పూజ వేడుకలో ‘జీరో వేస్ట్ ఈవెంట్’ కూడా నిర్వహించారు. ఈ భారీ కార్యక్రమంలో మొత్తం 138 కిలోల తడి చెత్త, సుమారు 70 కిలోల పొడి చెత్త ఏర్పడింది. ఈ వ్యర్థాలను అక్కడికక్కడే పూర్తిగా తొలగించేలా ఏర్పాట్లు చేశారు. తడి చెత్తను పారవేసేందుకు వేదిక వద్ద కంపోస్టు పిట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
యూదుల ఆరాధనా విధానం ఏమిటి? ‘కిప్పా’కు ఎందుకంత ప్రాధాన్యత?
ప్రపంచంలోని పురాతన మతాలలో జుడాయిజం ఒకటి. దీనికి సుమారు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం దాదాపు ఒకే సమయంలో ఉద్భవించాయని చెబుతారు. ఈ కారణంగానే ఈ మతాల మధ్య ఎంతో సారూప్యత కనిపిస్తుంది. జుడాయిజాన్ని హిందూ మతంతో పోల్చిచూస్తే కొన్ని అంశాలు మినహా, ఎటువంటి సారూప్యత కనిపించదు. జుడాయిజం ప్రకారం ఈ మతాన్ని నమ్మేవారు రోజుకు మూడు సార్లు ప్రార్థనలు చేస్తారు. యూదులు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ప్రార్థన చేసే సమయంలో జెరూసలేం వైపు చూస్తారు. జుడాయిజం విగ్రహారాధనను విశ్వసించదు. జుడాయిజంను అనుసరిస్తున్నవారు ప్రతిపనికీ దేవునికి కృతజ్ఞతలు చెబుతారు. ఖబద్ హౌస్ యూదులకు చాలా ప్రత్యేకమైనది. ఖబద్ హౌస్‌లు పలు దేశాలలో కనిపిస్తాయి. ఇక్కడ యూదులు ప్రార్థనలు చేస్తారు. భారతదేశంలోని ముంబై, ఢిల్లీలోని పహర్‌గంజ్, అజ్మీర్, హిమాచల్‌లోని ధర్మ్కోట్, రాజస్థాన్‌లోని పుష్కర్‌లలో ఖబద్ హౌస్‌లు ఉన్నాయి. విదేశాల నుంచి భారత్ సందర్శనకు వచ్చే ఇజ్రాయిలీలు ఈ ఖబద్ హౌస్‌లలో ప్రార్థనలు చేస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్, ధర్మశాల, ధర్మ్కోట్లోని ఖబద్ హౌస్‌లను సందర్శించడానికి ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ నుండి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. యూదులు ప్రార్థనా సమయంలో తలపై కిప్పా(టోపీ) తప్పనిసరిగా ధరిస్తారు. కిప్పా అనేది ప్రతి యూదు ప్రత్యేక సందర్భాలలో ధరించే టోపీ. ఇది హిందూ, ఇస్లాంలో కూడా కనిపిస్తుంది. హిందువులు పూజ చేసేటప్పుడు తలపై గుడ్డ పెట్టుకునే ఆచారం కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఇస్లాంలో కూడా నమాజ్ చదివేటప్పుడు తప్పనిసరిగా టోపీ ధరిస్తారు. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి? -
వినాయకుని కోసం మంగళహారతి పాట
శీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘ సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి " జయ ‘‘ పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘ కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘ అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘ పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘ బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు " జయ ‘‘ పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘ -
వినాయకుని వ్రత కల్పం... చేసుకోవలసిన విధి
పూజకు ఏర్పాట్లు ముందుగా పీటమీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపు కుంకుమలతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపారాధన: (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుంది వద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.) శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘ యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ‘‘ దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘ పరిశుద్ధి: (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ కింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి) అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా! యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః పుండరీకాక్ష, పుండరీకాక్ష, çపుండరీకాక్షాయ నమః విఘ్నేశ్వరుని వ్రతకల్పము శ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘ శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః శ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపిః విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ ఆచమనం: ఓం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః (రెండు అక్షతలను వాసన చూసి వెనుకకు వేయవలెను) శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే! (ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.) ప్రాణాయామము: ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘ సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరీ మధ్యప్రదేశే స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వాసగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, సౌమ్యవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్థ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘ (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను) తదంగ కలశపూజాం కరిష్యేః (మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను) కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను) శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా! ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ! నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ‘‘ అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః (పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి) శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను) గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణాస్పత ఆనసృణ్వన్నూతిభిస్సీదసాదనం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను) పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) ముఖే ఆచమనీయం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను) ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను) స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి) గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను) కుంకుమం సమర్పయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను) పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను) స్వామికి పుష్పాలతో పూజ (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను) ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను) ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను) దీపం దర్శయామి (దీపమును చూపవలెను) నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి) ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని తిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడిచేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను). ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి) తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను) ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను) ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి) శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘ శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ çఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి (గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.) శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి) వరసిద్ధి వినాయక పూజా ప్రారంభం స్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగా తావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు ధ్యానం: స్వామివారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ కింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం‘‘ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘ పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ‘‘ ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘ చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితాం ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి. (వినాయకుని ధ్యానించండి...) ప్రాణప్రతిష్ఠ: (స్వామివారికి ప్రాణంపోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః పునఃప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృఢయాన స్వస్తి అమృతం నై ప్రాణాః ‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వ యతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీదః‘‘ ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ కింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆవాహయామి‘‘ ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి). మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి‘‘ పాద్యమ్: స్వామివారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) శ్లో‘‘ సర్వతీర్థ సముద్భూతం‘‘ పాద్యం గంగాది సంయుతం‘‘ విఘ్నరాజ! గృహాణేదం‘‘ భగవన్భక్త వత్సల‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి‘‘ అర్ఘ్యమ్: స్వామివారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర నమస్తేస్తు! శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘ మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామివారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానమ్: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ కింద చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి) పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృషిణ యం‘ భవా వాజన్య సంగధే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘ పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘ నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘ తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షీరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పీతా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘ పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదకమ్: (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి) యాః ఫలినీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘‘ శుద్ధోదకమ్: మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ కింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకం చేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.) వస్త్రమ్: (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ కింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘ యజ్ఞోపవీతమ్: (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని గాని, పుష్పాక్షతలను గాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘ గంధమ్: (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామినే నమః గంధాన్ ధారయామి. అక్షతలు: (అక్షతలను దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘ సింధూరం: శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధిబుద్ధి నమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః సింధూరం సమర్పయామి‘‘ మాల్యం: శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధిబుద్ధి నమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘ పుష్పమ్: (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అధాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు). సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధిబుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘ అధాంగ పూజా: (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట) గణేశాయ నమః పాదౌ పూజయామి‘ ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘ విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘ కామారిసూనవే నమః జంఘే పూజయామి‘ అఖువాహనాయ నమః ఊరుః పూజయామి‘ హేరంబాయ నమః కటిం పూజయామి‘ లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘ గణనాథాయ నమః హృదయం పూజయామి‘ స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘ పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘ గజవక్త్రా్తయ నమః వక్త్రం పూజయామి‘ విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘ శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘ శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజ సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు) ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక) ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు) ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు) ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు) ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు) ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి) ఓం గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి) ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు) ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు) ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణుక్రాంతం) ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ) ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు) ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘(మరువం) ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు) ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు) ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం) ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు) ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు) ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్ది) ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు) ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను) ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ (రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి) గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఆఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి! కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి! బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి! మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి! సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి! ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి! స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి! శ్రీ వరసిద్ధి వినాయకాయస్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామి శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మహోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమధాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాటత్పయే నమః ఓం శ్రీపతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోద్ధితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమార గురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసుర భంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయనే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వక్‌దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. బిల్వం: శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి. ధూపమ్: (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమాసుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ధూపమాఘ్రాపయామి. దీపమ్: (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః దీపం దర్శయామి‘‘. నైవేద్యమ్: (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్ళెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ కింది మంత్రంతో నీళ్ళు చల్లాలి) ఓమ్ భూర్భువస్సువః‘ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి‘ ధియోయనః ప్రచోదయాత్‘‘ (పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి) ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘ సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్ళెంలో విడిచిపెట్టాలి) ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘ (అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడిచేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘ హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘. తాంబూలమ్: (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘ శ్రీ గణేష ప్రార్థన తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్‘ తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా! తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్ శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజో›్ఞపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులున్, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్యగంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దంత రాజన్వయుండ రామాభిదాసుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః నీరాజనమ్: (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీ రాష్ట్రయాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి) మంత్రపుష్పమ్: (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి) గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రా విఘ్ననాశక‘ వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ ఏకదంతైక వదన తథా మూషికవాహన‘ కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘ తన్నోదంతిః ప్రచోదయాత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారమ్: (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు) ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే‘ పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘ అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘ తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రార్థన: (పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి) నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశక‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘ సాష్టాంగ నమస్కారమ్ ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతి సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు. (నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.) అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతేహం అహర్నిశా‘ పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి). (ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షతలు చేతిలో తీసుకొని నీటితో పళ్ళెంలో విడిచిపెట్టాలి) అనేక మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. -
వినాయకుని పూజకు ముఖ్యంగా అవి ఉండాల్సిందే!
ఆదిదంపతుల మానసపుత్రుడు, ఓంకార స్వరూపుడు, విఘ్నాలను శాసించే వాడు, సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వ దేవతా లక్షణసమన్వితుడు, స్వల్పకాలంలో భక్తులకు ముక్తినిచ్చే మోక్షప్రదాత మన గణపయ్య.. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ చేయ్యాల్సిందే.. తలచిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావాల్సిందే! దైవారాధనలో, పూజాదికాలలో, సర్వ శుభకార్యాల ఆరంభంలో ఈ మొత్తం జగత్తులో తొలి పూజలందుకునే స్వామి శ్రీగణేశ్వరుడే అందుకే ఆయన్ని ‘జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం’ అన్నది వేదం. జపహోమాదుల్లోనూ గణపతిపూజే ప్రథమ కర్తవ్యం. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అనేది అందుకే! అమ్మ చేతిలో పసుపుముద్దగా అవతరించి పసుపు గణపతిగా మనందరి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు, విద్యాప్రదాత కూడా! అందుకే కోరిన విద్యలకెల్ల ఒజ్జయైయుండెడి పార్వతీ తనయ, ఓయి! గణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ మనం గణపతిని ప్రార్థిస్తూ ఉంటాము. వినాయకచవితి నాడు ఉదయాన్నే మేల్కొని, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానమాచరించి, శుభ్రమైన దుస్తులు ధరించి, వ్రతమాచరించాలి. ఇంటిని శుభ్రపరచుకొని, స్వస్తిక్ పద్మాన్ని లిఖించి, అరటిబోదెలతో మంటపాన్ని ఏర్పాటు చేసుకొని, పాలవెల్లి కట్టిన పీఠంపై తెల్లటి వస్త్రం పరచి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, ఆహ్వానించి దూర్వా (గరిక) తదితర ఏకవింశతి (21) రకాల పత్రాలతోను, షోడశోపచారాలతో పూజించి, వినాయకోత్పత్తి కథను చదువుకొని, అక్షతలను శిరస్సుపై ధరించాలి. స్వామివారికి వడపప్పు, కొబ్బరి, చెరకు, బెల్లం, ఉండ్రాళ్లు, లడ్డూలు, మోదకాలు, కుడుములు నివేదించాలి. మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజూ ఓ పండుగే! పండుగ వస్తుందంటే పిల్లలకు ఎంతో సంబరం. వినాయకుడు అనే పేరు విన్నా, పలికినా ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహించి ఆనందం కలుగుతుంది. గణపతి తనగోడు వింటాడు, తను తలచిన ఏ కార్యక్రమానికైనా ఎటువంటి ఆటంకం కలుగనీయడు అని ప్రతి భక్తుడు భావిస్తాడు. భక్తుల భావాల్లో ఇంతగా సుప్రతిష్ఠమైన గణపతిని ఆరాధించటంలో అనంతమైన భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. భాద్రపదమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. ఆనాడు ఆదిదేవుడైన వినాయకుడి ఆవిర్భావం జరిగిన రోజు. ఆరోజు గణపతి పూజ విశేష ఫలితాన్నిస్తుంది. ఎన్ని కష్టాలు, అవరోధాలున్నా, వాటన్నిటినీ తొలగించే తొలిదైవం వినాయకుడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయక చవితి పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతియైన ఆ విఘ్నేశ్వరున్ని భక్తితో కొలిస్తే చాలు విఘ్నాలన్నింటినీ తొలగించి స్వామి కోరిన వరాలిస్తాడు. ఈ వ్రత పరమార్థం సమాజంలో ఐకమత్యాన్ని, దైవభక్తిని, జీవనశైలిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందింప జేయటమే కాక, భావసమైక్యతకు సహజజీవన సిద్ధాంతానికి నిదర్శనం. పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు. పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశం మీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠము. నైవేద్యం: ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి. పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి, ఆయా మంత్రాలతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపము కల్గినను భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి. పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామివారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము. పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు తమ ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఏ వృత్తి వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం శుభఫలదాయకం. మట్టి వినాయకుడ్ని పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుకుందాం !! మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టిధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి. (చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు) -
ధనకాంక్షతో "లక్ష్మీ"ని పూజిస్తాం! కానీ ఆ తల్లి ఏమంటుందో తెలుసా!
ఈ సమాజంలో బతకాలంటే "ధనం" కావాల్సిందే. "ధనం మూలం ఇదం జగత్" అని ఊరికే అనలేదు పెద్దలు. ధనం లేనిదే ఒక పూట కూడా గడవదు. అలాంటి ఈ తరుణంలో ప్రజలంతా తమకు తెలయికుండానే ధనకాంక్షతో మంచి చెడు అన్ని మర్చిపోతున్నారు. ధనవంతులు కావాలన్నా ఆరాటంతో తెగ పూజలు, వ్రతాలు చేసేస్తుంటారు. అవన్నీ చూసి లక్ష్మీ దేవి మందహాసంతో ఏమంటుందో వింటే..కంగుతినడం ఖాయం. మన పూజలు కాదనలేక ఆమె వస్తుందంటా..కానీ ఆ మాయలో పడి ఏమవుతున్నామో తెలుసా నన్ను బంధించి బలైపోకండి "ఓయి మానవులారా ! మీరందరూ నన్నెంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. నన్ను మీ ఇంటికి రమ్మని, ధనరాశులతో సిరులపంట పండించమని వేడుకొంటున్నారు, మీ ప్రార్ధన కాదనలేక నేను మీ ఇళ్ళకు వస్తూ మిమ్మల్ని భాగ్యవంతులుగా మారుస్తున్నాను. మీకు బంగళాలు కార్లు, తోటలు, మొదలైన సమస్త సౌకర్యాలు సమకూరుస్తున్నాను. ఆ తరువాత మీరు చేసే పనులే నాకు నచ్చటం లేదు, నన్ను మీ ఇనప్పెట్టెల్లో, బ్యాంకు లాకర్లలో, బంగారం రూపంలో బంధించాలని ప్రయతిస్తున్నారు. ఎల్లప్పుడూ నన్ను మీ బందీగా వుంచుకొని నా ద్వారా స్వర్గసుఖాలు అనుభవించాలని పథకాలు వేస్తున్నారు. నిజానికి మీ స్వరూపం ఏంటో మీకే తెలియదు! మీ అసలు స్వరూపం నాకు తెలుసుగానీ, నా అసలు స్వరూపం మీకు తెలియదు. మీ నిజ స్వరూపం కూడా మీకు తెలియదని నేను భావిస్తున్నాను. మీరు తల్లి గర్భంనుండి వచ్చేటప్పుడు ఒక్క పైసా కూడా తీసుకురారు. తిరిగి భూమిగర్భంలోకివెళ్ళేమరణయాత్రలో కూడా ఒక్క పైసాతీసుకుపోలేరు, రోజు మీ కళ్ళముందు చనిపోయే ఎందరెందరో కోటీశ్వరులను, జమీందారులను చూస్తూ కూడా, రేపు మన దుస్థితి కూడా అంతే కదా, అనే అసలు నిజాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ ఆశలకు, కోరికలకు హద్దు లేకుండా | పోతుంది. ఇది మీరు తెలుసుకోలేని మీ నిజ స్వరూపం. ఇకనాస్వరూపం గురించి చెబుతాను. నేను ఎవరి దగ్గర ఎప్పుడూ నిలకడగా వుండను. ఆ పరమేశ్వరుని లీలా వినోదం.. అది ధనానికి ఉన్న సహజగుణం. ఒకచోటి నుండి మరో చోటికి తరలి పోయే చంచలత్వమే నా ధర్మం. అది మిమ్మల్ని నన్ను సృష్టించిన ఆ పర్వమేశ్వరుని లీలా వినోదం. నన్ను బంధించాలని చూసిన ప్రతి వాణ్ణి, దొంగల ద్వారానో, దాయాదుల ద్వారానో, ఇన్ కంటాక్స్ వారి ద్వారానో కొల్లగొట్టించి నేను బయట పడుతుంటాను, అయితే దేవుడు నాకొక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటంటే నేను కొందరి దగ్గర ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాను. ఎక్కడ స్థిరంగా ఉంటానంటే.. అలా నేను ఎవరి వద్ద స్థిరంగా వుంటానంటే, “ఎవరు నా ధనకటాక్షంతో విర్రవీగకుండ, అహంకారులు కాకుండ, ధనమదంతో సాటి మానవులను హింసించకుండ.. తమ అవసరాలకు మించిన ధనాన్ని పుణ్యకార్యాలకు, దైవకార్యాలకు, ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తూ వుంటారో, వారిని మరింత కుబేరులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి వద్దనే నేను శాశ్వతంగా వుండిపోతాను. వారి కుటుంబాన్ని వెయ్యికళ్ళతో కాపాడుతుంటాను. ఇప్పుడు నా నైజం మీకు అర్థమైంది కాబట్టి నన్ను బంధించి బలైపోకుండా..నన్ను మంచి కార్యాలకు వినియోగించి జీవితాలను చరితార్థం చేసుకోమని సలహాలిస్తున్నాను. వింటే మీతో వుంటా - లేదంటే టాటా చెప్పి మరోచోటికి వెళ్లిపోతా.. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తాం? వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..) -
హారతి పట్టిన చేతితో స్టెతస్కోప్!
ఉత్తరప్రదేశ్‌లోని కాశీలోగల భాగీరథ ఘాట్ వద్ద 2019 నుంచి ప్రతిరోజూ సాయం సమయాన గంగామాతకు హారతి ఇవ్వడంతో పాటు ‘నీట్’కు ప్రిపరేషన్ కొనసాగించిన విభూ ఉపాధ్యాయ మొదటి ప్రయత్నంలోనే నీట్ పరీక్షను క్రాక్ చేశాడు. ఈ సందర్భంగా విభు మీడియాతో మాట్లాడుతూ తాను 2019 నుంచి గంగామాతకు సేవ చేస్తున్నానని అన్నారు. ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు మహాహారతి కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చానని తెలిపారు. ఈరోజు తాను గంగామాత ఆశీర్వాదంతోనే నీట్లో ఉత్తీర్ణత సాధించానని తెలిపారు. ఇన్నాళ్లూ గంగామాతకు ఏ విధంగా భక్తశ్రద్ధలతో హారతి ఇచ్చానో అదే విధంగా ఇకపై సమయం దొరికినప్పుడల్లా గంగా మాతకు సేవ చేస్తాననని అన్నారు. ఇలా చేస్తేనే తన మనసుకు ప్రశాంతత లభిస్తుందని అన్నారు. తాను ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూనే నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతూ వచ్చానన్నారు. తన విజయంలో తన సోదరుడు హర్షిత్ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా విభు తల్లి సునీత శర్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువుసంధ్యలపై దృష్టి పెట్టాలి. అప్పుడే వారు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కేవలం 8 నెలల పాటు సాగించిన కృషితోనే విభు నీట్ పరీక్షలో 622 వ ర్యాంకు సాధించాడన్నారు. విభు తండ్రి హరేంద్ర ఉపాధ్యాయ శ్రీ గంగాహారతి సేవా సమితి భాగీరథ ఘాట్ సభ్యుడు. కుమారుని విజయం గురించి ఆయన మాట్లాడుతూ గంగామాత కృపతోనే తన కుమారుడు నీట్లో ర్యాంకు సాధించాడన్నారు. ఇది కూడా చదవండి: ‘సార్’ కలను సాకారం చదువుల తల్లి -
వరుసగా మృతి చెందుతున్న పులులు... విషయం తెలిసిన గ్రామస్తులు ఏం చేస్తున్నారంటే...
మధ్యప్రదేశ్‌లోని శ్యోపూర్‌లోగల కూనో నేషనల్ పార్క్‌లో గడచిన రెండు నెలలలో మూడు చిరుతలు, వాటి పిల్లలు మూడు మృతిచెందాయి. స్థానికంగా ఇది సంచలనంగా మారింది. దీనికితోడు ఇదే ఈ జూర్కులో ఉన్న 17 చిరుతలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. ఒక చిరుత కూన కూడా వ్యాధులతో బాధపడుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుపడాలని కోరుతూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కర్హల్ తహసీల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో పులల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ, సుందరాకాండ పారాయణ, హనుమాన్ చాలీసా కూడా చేస్తున్నారు. గ్రామస్తులతో పాటు జంతు ప్రేమికులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా 2022 సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ కూనో పార్క్‌కు నమీబియా నుంచి తెచ్చిన 8 చిరుతలను అప్పగించారు. వాటిలో ఐదు మగ చిరుతలు, 3 ఆడ చిరుతలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వాటి సంరక్షణకు చీతా ప్రాజెక్టు ప్రారంభించారు. ఇదేవిధంగా 2023 ఫిబ్రవరి 18 ఇక్కడకు ఆఫ్రికా నుంచి మరో 12 చిరుతలను తీసుకువచ్చారు. వీటిలో 7 ఆడ చిరుతలు, 5 మగ చిరుతలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 26న నమీబియా నుంచి తెచ్చిన ఒక చిరుత అనారోగ్యంతో మృతి చెందింది. అలాగే ఏప్రిల్ 23న సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ఒక చిరుత మృతి చెందింది. మే 9న మరో చిరుత మరణించింది. మే 23న ఒక చిరుత కూన మృతి చెందింది. తరువాత కొన్ని చిరుతలు అనారోగ్యం పాలయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు వాటి ఆరోగ్యం మెరుగుపడాలని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నారు. -
తల్లిపై అమితమైన ప్రేమ.. ఆ కొడుకులు ఏం చేసారంటే!
సేలం: కన్న తల్లిపై ప్రేమతో ఇద్దరు కుమారులు ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని నావల్‌పట్టి కాట్టూర్ గ్రామానికి చెందిన ముత్తుసామి (82), అలమేలు (72)కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు మురుగేశన్ న్యాయవాది, చిన్న కుమారుడు పచ్చముత్తు రైతు. కాగా అలమేలు అనారోగ్యంతో 2019లో మృతి చెందింది. దీంతో వీరి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తమ తల్లిపై అమితమైన ప్రేమ కలిగిన మురుగేశన్, పచ్చముత్తు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తల్లి జ్ఞాపకంగా ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తమ వ్యవసాయ భూమిలో తల్లి నల్లరాళ్లతో ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో రెండున్నర అడుగుల ఎత్తు గల అలమేలు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి రోజూ విగ్రహానికి పాలాభిషేకం, పూజలు చేస్తూ తల్లిపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. -
ఖమ్మంలో హెల్త్ డైరెక్టర్ వింత పూజలు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు
సాక్షి, ఖమ్మం: తాను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాస రావు క్లారిటీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి బురద జల్లే వ్యక్తుల మాటలను ప్రజలు విశ్వసించాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం కొన్ని ఛానెళ్లలో ప్రసారమైన వార్తలను డీహెచ్ ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు, మీడియా ప్రతినిధులు కూడా ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముందని ప్రశ్నించారు. స్థానికుల ఆహ్వానంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. స్వయం ప్రకటిత దేవతతో సంబంధం లేదన్నారు. మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనన్నారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. తన తండ్రి స్పూర్తితో జీఎస్సాఆర్ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు విస్తృతంగా సామజిక సేవలు అందిస్తుంటే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కరోనా నియంత్రణలో రెండున్నర ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన తాను మానసిక ప్రశాంతత కోసం హాలిడేస్‌లో సొంత గ్రామానికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారు. కానీ ఎక్కువ సార్లు వచ్చారంటూ చర్చించుకోవడంలో అర్థం లేదన్నారు. కరోనాకు ముందు కూడా ఎన్నోసార్లు కొత్త గూడెం ప్రాంతానికి వస్తూ ఉండేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్త బయట ఎక్కువగా తిరుగుతున్నానని వివరించారు. కానీ స్వర్ధపూరిత వ్యక్తులు జీర్ణించుకోలేక తనపై బురద జల్లుతున్నారని విమర్శించారు. వాళ్లకు కనువిప్పు కలిగే రోజు వస్తుందని నొక్కి చెప్పారు. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టనఖగా ఉన్న తనకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉన్నదన్నారు. మెగ హెల్త్ క్యాంపు ఏర్పాట్లు భాగంలోనే గత కొంత కాలంలో కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వివరించారు. విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టానన్నారు. ట్రస్ట్ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేపించానన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పేదలకు మేలు జరగడం కోసం తాను చేసే సేవా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. -
రజనీకాంత్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల పూజలు
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహించా రు. రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలో ని కావేరి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆస్పత్రి వర్గా లు శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బ్రెయిన్‌కి రక్తాన్ని సరఫరా చేసే ఓ రక్తనాళంలో బ్లాక్స్‌ను గుర్తించామని.. సర్జరీ చేసి వాటిని తొల గించామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియా రజనీకాంత్ అభిమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్ శుక్రవారం ట్వీట్ చేశారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. చదవండి: (విశ్వాసం అంటే ఇదేరా !) -
మరోసారి వార్తల్లో నటి వనితా విజయ్‌కుమార్.. నెట్టింట్లో వైరల్
తమిళ సినిమా: ఎప్పుడూ ఏదో ఒక చర్యతో వార్తల్లో వుండే నటి వనితా విజయ్‌కుమార్. ఇప్పటికే మూడుసార్లు పెళ్లి చేసుకుని, ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి జీవిస్తున్న వనితా విజయ్‌కుమార్ తన భర్త ఎవరని అడుగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వనితా విజయకుమార్ మరోసారి వార్తల్లో కెక్కారు. ఆమె తన ఇంటిలో కుబేరుడి పూజ నిర్వహించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే వనితా విజయకుమార్, ఆమె కూతురు మెడలో డబ్బు నోట్ల మాలలు ధరించి పూజ నిర్వహించారు. ఆ దృశ్యాలను ఆమె సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
సాక్షి, తిరుమల: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలంగాణ గవర్నర్‌కు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, చిత్రపటం అందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ గవర్నర్ హోదాలో తొలిసారి తిరుమలేశుని ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. -
శ్రీవారి సేవలో రాష్ట్రపతి
తిరుమల: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి, కుటుంబ సభ్యులతో కలసి విశ్రాంతి భవనం నుంచి కోవింద్ ఉదయం 6 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిని దర్శించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం భూ వరాహస్వామివారిని దర్శించుకున్న అనంతరం మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, అర్చకులతో కలసి రాష్ట్రపతికి ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన రాష్ట్రపతి తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించారు. అనంతరం సన్నిధిలో పచ్చ కర్పూరపు వెలుగులో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకున్నారు. స్వామివారి పాదాల వద్ద ఉంచిన పట్టుశేషవస్త్రాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రాష్ట్రపతికి బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రాష్ట్రపతికి ఆశీర్వాదం చేయగా, టీటీడీ చైర్మన్, ఈవో, ప్రత్యేకాధికారి.. శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు ఆయనకు అందజేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకుని, ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్రపతితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్‌జెట్టి ఉన్నారు. -
ఎంపీ కేశినేని ఇచ్చిన హామీ మరిచారు
-
ఓ లింగా... ఆ“.. భక్తా!
‘పిలిస్తే పలుకుతడు.. కోరిక తీర్చమని మొక్కుకుంటే రెండేళ్లలోపే ఆ కోరిక తీరుతది.. ప్రతిఫలంగా మొక్కులు చెల్లించు కొనుడు.. లింగమ్మ, లింగయ్య, లింగేశ్వర్ అని పేర్లు పెట్టుకొనుడు..’ ఇదీ పెద్దగట్టు లింగమంతుల స్వామి మహత్యమని యాదవుల నమ్మకం. యాదవుల ఆరాధ్యదైవం లింగమంతుల స్వామి. అందుకే రెండురాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆయన పేర్లు వేలాదిమందికి ఉంటాయి. రెండేళ్లకోమారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో పెద్దగట్టు (గొల్లగట్టు)పై వెలసిన లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతి పెద్దది లింగమంతుల స్వామి జాతర. యాదవులు, ఇతర కులస్తులతో సూర్యాపేట నుంచి కోదాడ మీదుగా వెళ్లే జాతీయ రహదారి, ఖమ్మం, నల్లగొండ, చౌటుప్పల్ వరకు రహదారుల్లో వేలాది వాహనాలతో జాతర నిండిపోతుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే లింగమంతల స్వామి జాతరకు పెద్దగట్టు ముస్తాబయింది. ఇలా వెలిశాడని.. క్రీ.పూ 500 ఎళ్ల క్రితం చోళ చాళుక్యులు (యాదవరాజులు), కాకతీయులు ఉండ్రుగొండ రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఆ కాలంలో ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనరసింహస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయ దేవాలయాలు కట్టించారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఏటా మాఘమాసంలో లింగమంతులు, చౌడమ్మతల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేవారట. జాతర సమయంలో ఓ నిండు గర్భిణి లింగమంతులస్వామి మొక్కు చెల్లించుకునేందుకు బోనం కుండ, పూజసామాగ్రితో గంపను ఎత్తుకుని పెద్దగట్టు ఎక్కుతుండగా కాలు జారి కిందపడి మృతి చెందిందని.. దీనికి చలించిన లింగమంతులస్వామి భక్తుల సౌకర్యార్థం పార్ల శేరయ్య(గొల్లగట్టు) పై వెలిశాడని అదే గొల్లగట్టు జాతరగా జరుపుతున్నామని యాదవులు పేర్కొంటున్నారు. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కేసారం గ్రామానికి చెందిన యాదవులు, రెడ్లు గొర్రెలు, ఆవులను మేపుకుంటూ పెద్దగట్టు వద్దకు వెళ్తారు. కరువు కాటకాలతో ఉన్న ఈ ప్రాంతంలో నీరు లేక వారు ఇబ్బందులు పడతారు. గొర్రెల కాపరికి చద్దిమూట తెచ్చిన భార్యను ఆవేశించి లింగమంతుల స్వామి జీవాలు, గొర్రెల దాహం తీర్చాలంటే తాను చూపించిన చోట బావి తవ్వాలని చెప్పడంతో ఆమె మాట ప్రకారం బావి తవ్వారట. అందులో లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, శివలింగాలు బయట పడ్డాయని.. వీటినే గొల్లగట్టుపై ప్రతిష్టించి పూజలు చేస్తూ.. కాలక్రమేణా ఇది జాతరగా మారిందని యాదవుల నమ్మకం. ఇలా పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బస్సులు, లారీల్లో భక్తులు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా తరలి వస్తారు. తొలి మూడు రోజులు జాతీయ రహదారి భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తి పారవశ్యంతో ఓ లింగనాదం.. ఓ లింగ.. ఓ లింగ నినాదాలు.. భేరీ చప్పుళ్లు.. కటార్లతో సాము.. తాళాలు, గజ్జల లాగులు, చండ్రకోళలు.. ఎటుచూసినా భక్తజన సంద్రంతో పెద్దగట్టు కనిపిస్తుంటుంది. ఈనెల 10న దేవుడికి దిష్టిపూజతో జాతర పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన జాతర ఈనెల 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతర వస్తుందంటేనే యాదవుల ఇళ్లల్లో పండుగ వాతావరణమే. జాతరకు వెళ్లే యాదవులు ఇంటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. భేరీకి మరమ్మతులు చేయిస్తారు. కటార్లు, తాళాలు, భేరీలను ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. మొక్కులు చెల్లించుకునే భక్తులు జాతరకు ఇళ్లనుంచే ఓ లింగా .. ఓ లింగా అనుకుంటూ బయలుదేరుతారు. పెద్దగట్టు వద్దకు చేరుకున్న తర్వాత లింగమంతుల స్వామికి నైవేద్యబోనం వండుకొని దేవాలయం చుట్టూ మూడుసార్లు తిరుగుతారు. ఇలా ఓ లింగ నినాదాలతో పెద్దగట్టు మార్మోగుతుంది. యాదవులే కాకుండా ఇతర కులస్తులు కూడా జాతరకు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఐదు రోజుల పాటు జరగనున్న జాతరలో భాగంగా మొదటి రోజు గంపల ప్రదక్షిణ, రెండోరోజు చౌడమ్మకు బోనాలసమర్పణ, మూడవ రోజు చంద్రపట్నం, నాలుగవ రోజు నెలవారం, ఐదవరోజు ముగింపు కార్యక్రమం చేపడతారు. – బొల్లం శ్రీనివాస్, సాక్షి, సూర్యాపేట ఫొటోలు: అనమాల యాకయ్య, సాక్షి -
మోక్షం కోసం ఆత్మహత్య చేసుకోండి
మండ్య: మోక్షం లభిస్తుందంటూ నమ్మించి ఓ క్షుద్రపూజల మాంత్రికురాలు దేశరాజధానిలో ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటన తరహాలోనే హిజ్రా మాంత్రికురాలు ఓ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకోవాలంటూ వేధించిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. మండ్య తాలూకాలోని మారగౌడనహళ్లి గ్రామానికి చెందిన అనిత అనే మహిళ కుటుంబానికి కొద్ది రోజుల క్రితం మైసూరు నగరానికి చెందిన క్షుద్రపూజలు చేసే మాంత్రికురాలైన హిజ్రా పరిచయమైంది. తమ కుటుంబంలో ఎదరుయ్యే ప్రతీ సమస్యకు పరిష్కారం కోరుతూ అనితా భర్త తరచూ హిజ్రాను ఆశ్రయించేవారు. దీంతో సదరు కుటుంబ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న హిజ్రా సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసం దేవుడిని తలచకుంటూ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడాలంటూ అనితా భర్తకు సూచించింది. ఇదే విషయాన్ని వ్యక్తి తన కుటుంబ సభ్యులకు కూడా తెలుపగా మొదట భర్త వాఖ్యలను అనిత కుటుంబ సభ్యులు తేలికగా తీసుకున్నారు. అయితే మోక్షం సిద్ధించాలంటే సామూహిక ఆత్మహత్యకు పాల్పడాలంటూ హిజ్రా అనిత కుటుంబ సభ్యులపై రోజురోజుకు ఒత్తిడి తీవ్రతరం చేస్తుండడంతో అనిత మాంత్రికురాలి నుంచి వస్తున్న వేధింపులపై హుణుసూరు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి యత్నించారు. అయితే అనిత ఫిర్యాదు గురించి పట్టించుకోని హుణుసూరు పోలీసులు అనితను బయటకు గెంటివేయడంతో తమ సమస్య గురించి అనిత ప్రసార మాధ్యమాలను ఆశ్రయించారు. దీంతో విషయం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం హిజ్రా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
గోదారమ్మకు వైఎస్ జగన్ పూజలు
-
గోష్పాద క్షేత్రంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
సాక్షి, కొవ్వూరు : జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రం చేరుకొన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య జననేత గోదావరమ్మకు హారతినిచ్చారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. ఆయనతోపాటు పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఘనంగా గుడిమెలిగె..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క గుడిలో గుడిమెలిగె పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తలస్నానాలు ఆచరించిన పూజారులు గుడికి చేరుకున్నారు. పూజారులు గుడిని శుద్ధి చేసిన అనంతరం ఐదుగురు ఆడపడచులు సమ్మక్క గద్దెలపై పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి అందంగా అలకరించారు. ఆరాధ్య దైవమైన సమ్మక్క తల్లికి ధూపదీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి యాటను బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజలు జరిగాయి. పూజలు ఇలా.. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, భోజరావు, నర్సింగరావు, మల్లెల ముత్తయ్య, నాగేశ్వర్రావు, పూర్ణ, దూప వడ్డె దొబె పగడయ్య.. సమ్మక్క గుడికి చేరుకున్నారు. ప్రధాన పూజారి కృష్ణయ్య కొత్త చీపురుతో గుడి లోపల బూజును తొలగించి అమ్మవారి శక్తిపీఠాన్ని కడిగి శుద్ధి చేశారు. అలాగే, పూజ దీపాంతాలు గుడి లోపల, బయట శుభ్రపరిచారు. మరోవైపు పూజారి నాగేశ్వర్రావు అమ్మవారి దీపంతాలను శుద్ధి చేశారు. నాగేశ్వర్రావు, మరో పూజారితో కలిసి విత్ర స్థలంలోని ఎర్ర మట్టిని తీసుకొచ్చారు. కృష్ణయ్యే స్వయంగా సమ్మక్క గద్దెను మట్టితో అలికారు. అనంతరం పూజారులందరూ కలిసి పూజారి మునీందర్ ఇంటికి వెళ్లారు. ( గుడిని శుద్ధి చేస్తున్న పూజారులు ) మునీందర్ ఇంటి నుంచి పసుపు, కుంకుమలు.. పూజారి మునీందర్ ఇంట్లో అమ్మవారికి కావాల్సిన పసుపు, కుంకుమ, పూజ సామగ్రిని తయారు చేశారు. పూజ సామగ్రిని సిద్ధం చేసే వరకు ఇతరులను ఇంట్లోకి అనుమతించలేదు. తర్వాత ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య పసుపు, కుంకుమ, పూజ వస్తువులను పట్టుకోగా, నాగేశ్వర్రావు దీపాలను తీసుకొచ్చారు. మరో పూజారి మల్లెల ముత్తయ్య ఇత్తడి చెంబులో నీళ్లు, ఐదురుగు ఆడపడచుల్లో సిద్ధబోయిన భారతి మరో ఇత్తడి చెంబులో నీళ్లు పట్టుకుని డోలి వాయిద్యాలతో సమ్మక్క గుడికి చేరుకున్నారు. మూడుసార్లు గుడి చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అప్పటికే పూజారులు ఐదు కట్టల కొత్తగడ్డిని తీసుకొచ్చి గుడి వద్ద ఉంచారు. దానిని పూజారి కృష్ణయ్య చేతుల మీదుగా ఈశాన్యంలోని గుడిపై సంప్రదాయబద్ధంగా పేర్చారు. ఆ తర్వాత గుడిలోపలికి ప్రవేశించారు. పూజారులకు సంబంధించిన ఐదుగురు ఆడపడచులు సిద్ధబోయిన భారతి, సునీత, సుగుణ, రాణి, కొక్కెర వినోద కలిసి మట్టితో అలికిన సమ్మక్క గద్దెపై పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి అలంకరించారు. ప్రధాన ప్రవేశ ద్వారం ముందు కూడా ముగ్గులు వేశారు. తల్లులకు నైవేద్యం.. గుడి అలంకరణ పూర్తయ్యాక వడ్డెలు సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన అమ్మవారి శక్తి పీఠాన్ని వడ్డెలు ముగ్గులు వేసిన గద్దెపై ప్రతిష్ఠించారు. ధూపదీపాలు, కల్లుసారా అరగించి తల్లికి రహస్య పూజలు నిర్వహించారు. గుడిమెలిగె పండుగ సందర్భంగా తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాటను జడత పట్టి బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. పూజలు ముగిసే వరకు గుడి తలుపులు మూసివేశారు. గుడిమెలిగె సందర్భంగా కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలోని వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వడ్డెలు రాత్రంతా దేవతల గద్దెల ప్రాంగణంలో జగారాలు చేశారు. -
తాంత్రిక పూజల పేరుతో రూ. 20లక్షల టోకరా
చేబ్రోలు: తాంత్రిక పూజలు నిర్వహించి కుటుంబ సమస్యలు లేకుండా చేస్తానని, అనారోగ్య సమస్యలు తీర్చుతానిని చెప్పి గురుస్వామి రూ.20లక్షల వరకు మోసగించినట్లు బాధితుడు గుంటూరు అర్బన్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు చేబ్రోలు ఎస్ఐ వి.బాబురావు శుక్రవారం చేబ్రోలు మండలం శేకూరు గ్రామానికి చెందిన గురుస్వామి గుంటుపల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన కంకణాల హరిబాబు బెంగుళూరులో హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దైవచింతన, భక్తిభావం కలిగిన హరిబాబు చేబ్రోలు మండలం శేకూరు గ్రామానికి చెందిన గురుస్వామి గుంటుపల్లి శ్రీనివాసరావుకి భక్తుడు. బెంగుళూరులోని హరిబాబు ఇంటి వద్దకు తీసుకువెళ్లి కుటుంబ సమస్యలు, ఆర్థిక చింతలు తొలగించటం కోసం తాంత్రిక పూజలు కొన్ని నెలలుగా నిర్వహించాడు. అయినా అనారోగ్య సమస్యలు తీరకపోవటంతో పాటు, ఆర్థికంగా నష్టపరిచినట్లు గుర్తించాడు. దీంతో రూ.20లక్షల వరకు వివిధ రకాల ఖర్చుల కోసం డబ్బులు తీసుకొని మోసగించినట్లు బాధితుడు హరిబాబు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ వి.బాబురావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా శ్రీకాకుళంలో పూజలు
-
ఒక నిమిషం – ఒక విషయం
ద్వారానికి అంత ప్రాముఖ్యం ఎందుకు ఇస్తారు? ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపం అందుకే దానికి మామిడి తోరణం కడతారు. కింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్త్రపరంగా చెప్పాలంటే గడపకు పసుపు రాయడం వల్ల క్రిమికీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు. పంచామృతం, పంచగవ్యాలు తేడా ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారల మిశ్రమాన్ని పంచామృతం అంటారు. దీనిని పూజలో దేవునికి నివేదిస్తారు. ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంల మిశ్రమమే పంచగవ్యం. దీనిని పంటల రోగనివారణకు వాడతారు. అన్నప్రాశన ఎన్నో నెలలో చేయాలి ? ఆడపిల్లలకు ‘5‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్నప్రాశన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది. కొందరు ఆడపిల్లలకు ఏడవనెల ఏడవరోజున చేయాలని అంటారు. 6వ నెల ఆరవ రోజు లేదా ఏడవనెల ఏడవ రోజు చేసేటప్పుడు ముహూర్తం చూడనక్కరలేదనీ, ఆ రోజున ఏ తిథి అయినా మంచిదేననీ అంటారు. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు? తొలితీర్థం శరీర శుద్ధికి, శుచికి. రెండవ తీర్థం ధర్మ, న్యాయ ప్రవర్తనకు, మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం కొరకు. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది? గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో, దేవతా సన్నిధిలో చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిధిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కూర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఃఖం, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది. -
గోమాతకు సీమంతం
అ అంటే అమ్మ అని.. ఆ అంటే ఆవు అని చిన్నారులకు అక్షరాలు నేర్పుతుంటాం. అమ్మ తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన గోమాతకు పండుగలు, వ్రతాల సమయంలో విశిష్ట పూజలు చేస్తారు. అదేవిధంగా వైఎస్సార్ జిల్లా పాత కడపకు చెందిన పల్లా నరసింహులు పెంచుతున్న గోవుకు నిత్యం పూజలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆ ఆవు చూడిదైంది (గర్భం దాల్చింది). సంప్రదాయం ప్రకారం మహిళలకు ఏ విధంగా అయితే సీమంతం చేస్తారో నరసింహులు తన కూతురులాగా భావించే గోమాతకు శనివారం సాయంత్రం సీమంతం చేశారు. గ్రామంలోని మహిళలందరు వచ్చి గోమాత చుట్టూ తిరుగుతూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ.. ఈ గోమాత చూడిదైన ప్రతిసారి కోడెదూడలే పుడుతున్నా యని తెలిపారు. వాటిని చాలా మంది కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. – కడప అగ్రికల్చర్ -
ఈ ఉత్సవం.. పురుషులకు మాత్రమే..!
చెన్నై: స్త్రీలు మాత్రమే పూజలు జరపడం ఆనవాయితీగా ఉండే తమిళనాడులో ఏటా జరిగే విడ్డూరమిదీ. నామక్కల్ జిల్లా పొంగలాయి ఆలయంలో పూజలకు పురుషులు మాత్రమే అర్హులు. రాశిపురం సమీపంలో మలైయాంపట్టి గ్రామంలో 500 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన పొంగలాయి అమ్మవారి ఆలయం ఉంది. మర్రి చెట్టు కింద స్వయంభువుగా వెలసిన అమ్మవారి ఆలయంలో ఏటా ఆడి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో పురుషులు మాత్రమే పాల్గొని పొంగలి వండి మేకలు బలి ఇచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఉత్సవాలు గత 21వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి అళంగతాయ్ అమ్మన్‌కు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం ఆలయం సమీపంలో గల కరుప్పు స్వామికి ప్రత్యేక పూజలు జరిపి మేకలను బలిచ్చారు. ఆలయ నిర్వాహకుల సమక్షంలో ముందుగా ఆడ మేకను బలి ఇచ్చారు. అనంతరం భక్తుల మొక్కుల ప్రకారం 140 మేకలను బలి ఇచ్చారు. అనంతరం సోమవారం సాయంత్రం సమబంతి విందు జరిపారు. ఇందులో ఐదు వేల మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. పురుషులు మాత్రమే జరిపే ఈ పూజల వలన ప్రజలు ఎటువంటి శారీరక బాధలు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని పంటలు బాగా పండాలని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలగాలని కోరుకున్నారు. -
వరప్రదాత కురవి వీరభద్రుడు
పుణ్య తీర్థం శాంతి స్వరూపులై భక్తులను అనుగ్రహించే దేవతామూర్తులు అనేక మంది భక్తుల గుండె గుడిలో ప్రతిష్ఠితమై ఉన్నారు. దైవకార్యార్థులై దుష్టశిక్షణ చేసి స్వామి కార్యాన్ని నెరవేర్చే ఉగ్ర అవతారులు సైతం దైవంతో సమానంగా పూజలు అందు కుంటున్నారు. అటువంటి ఉగ్రరూపులలో వీరభద్రుడు అగ్రగణ్యుడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా కురవిలో కొలువుదీరాడు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శైవ పుణ్యక్షేత్రం కురవి. ఇందులోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి గిరిజనుల ఆరాధ్యదైవం. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని పునీతులవుతారు. ఆలయ చరిత్ర... మహబూబాబాద్ (మానుకోట) జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో మానుకోట–మరిపెడ రాజమార్గంలో పెద్ద తటాకాన్ని ఆనుకుని(చెరువు) కురవి గ్రామం ఉంది. క్రీ.శ 850 ప్రాంతంలో వేంగి రాజధానిగా పాలించి చాళుక్యులకు సామంత రాజులు∙రాష్ట్రకూటులు. రాష్ట్రకూట రాజుల్లో... భీమరాజు కురవిని (కురవి అంటే గోరింటాకు పండిన వర్ణం, ఎరుపు) రాజధానిగా చేసుకుని పాలించేవాడని, అప్పుడే వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతర కాలంలో కాకతీయ తొలి స్వతంత్రరాజైన ఒకటవ బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రెండవ బేతరాజు కురవి పక్కనే పెద్ద తటాకాన్ని తవ్వించినట్లు చెబుతారు. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతిదీపస్తంభాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ వీరభద్రస్వామి విగ్రహానికి మీసాలుంటాయి. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మొక్కు తీర్చుకోవడంలో భాగంగా వీరభద్రునికి వెండి మీసాలు సమర్పించారు. స్వామివారి ప్రాశస్త్యం... సకల శక్తిమూర్తి వరాల వేలుపు అయిన శ్రీవీరభద్రస్వామి çపశ్చిమాభిముఖుడై ఉంటాడు. పదిచేతులతో, మూడునేత్రాలతో రౌద్రపరాక్రమమూర్తిగా భాసిల్లుతున్నాడు. భక్తుల పాలిట కల్పతరువుగా, పిలిచిన పలికే దైవంగా వెలుగొందుతున్నాడు. సమస్త భూత ప్రేత పిశాచగణాలు స్వామివారి అధీనంలో ఉంటాయి. రుద్రగణాలు ఆయనను సేవిస్తున్నాయి. భక్తులను ఆదుకునే పరమబోళామూర్తిగా దర్శనమిస్తున్నాడు. క్షుద్రగణాలకు వీరభద్రుడంటే భయం. అందుకే ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్యాలు, సిరిసంపదలను ప్రసాదిస్తాడని నమ్మకం. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజాలతో శ్రీ భద్రకాళీ అమ్మవారు ఉన్నారు. ఆలయానికి దక్షిణదిశలో భద్రకాళీ అమ్మవారు స్వయంశక్తిమూర్తిగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తూ పూజలందుకుంటోంది. రెండు ముక్కలైన శిలాశాసనం... కురవి శ్రీవీరభద్రస్వామి ఆలయ చరిత్రను తెలిపేందుకు అప్పటి రాజులు ఏకశిలస్తంభంపై శిలాశాసనాన్ని చెక్కించారు. ఆ శిలాశాసనం ప్రస్తుతం రెండు ముక్కలైంది. దాన్ని ఆలయం పక్కన ఉంది. ప్రాశస్త్యమైన ఆ శాసనస్తంభాన్ని అతికించి భావితరాలకు చరిత్రను తెలిపేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రతి యేడు శివరాత్రి పర్వదినం సందర్భంగా కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆకట్టుకునే రాతిదీపస్తంభం... వీరన్న సన్నిధిలోకి రాజగోపురం కింద నుంచి వెళ్లగానే ఎదురుగా ఏకశిల స్తంభంపై నందీశ్వరుడి విగ్రహం దర్శనమిస్తుంది. దానిపక్కన కాకతీయ సామ్రాజ్యాధినేత్రి రాణి రుద్రమదేవి విజయానికి నిదర్శనంగా నిర్మించిన ఏకశిల దీపస్తంభం కనిపిస్తుంది. ఈ ఏకశిలా స్తంభాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఎలా వెళ్లాలంటే..? కురవి మండల కేంద్రం. కురవికి చేరాలంటే... డోర్నకల్ మీదుగా వెళ్లే రైళ్లు లేదా బస్సులలో మహబూబాబాద్ వెళ్లాలి. అక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో గల కురవి వీరభద్రస్వామి ఆలయానికి ఆర్టీసు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. మహబూబాబాద్‌లో అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. -
సదాచరణలు
రమజాన్ కాంతులు హజ్రత్ అబూహురైరా (ర) కధనం ప్రకారం ముహమ్మద్ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. ‘రమజాన్ వస్తూనే స్వర్గద్వారాలన్నీ తెరవబడతాయి. నరక ద్వారాలన్నీ మూసివేయబడతాయి. షైతానులు బంధించబడతారు’. సత్కార్యాభిలాషులైన దైవదాసులు రమజాన్ మాసంలో ఆరాధనల్లో, దైవవిధేయతలో నిమగ్నమైపోతారు. పగలంతా రోజా పాటిస్తూ, గ్రంధ పారాయణంలో గడుపుతారు. రాత్రిలోని ఒక పెద్దభాగం తరావీహ్, తహజ్జుద్, దుఆ, ఇస్తెగ్ ఫార్లలో వెచ్చిస్తారు. ఈ శుభాల ప్రభావం వల్ల సాధారణ విశ్వాసుల హృదయాలు కూడా ఆరాధనలు, సత్కార్యాలౖ వెపు మొగ్గి చెడులకు దూరంగా ఉంటాయి. ఈ విధంగా ఇస్లామ్, ఈమాన్ల భాగ్యం పొందిన ప్రజలు దైవభీతి, దైవప్రసన్నత,ౖ దెవవిధేయతల మార్గంలో సహజంగానే ముందుకుపోతారు. మానవ హృదయాల్లో ‘మంచి’ ‘సత్కార్యాభిలాష’ అన్నది ఏ కాస్త ఉన్నా అది దైవ ప్రసన్నత కోసం పరితపిస్తుంది. దీంతో ఏ చిన్న సదాచరణ చేసినా ఈ పవిత్రమాసంలో అనేకరెట్లు అధికంగా ప్రసాదించబడుతుంది. ఇతర మాసాలతో పోల్చుకుంటే ఈ మాసం సదాచరణల విలువ అత్యంత అధికం. వీటన్నిటి ఫలితంగా ఇలాంటి వారికోసం స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. నరకద్వారాలు మూసుకుపోతాయి. వీరిని అపమార్గం పట్టించడం షైతానుల వల్లకాని పని. దుష్కార్యాల వైపు ప్రేరేపించలేకపోయినప్పుడు షైతానులు బంధించబడినట్లే గదా! స్వర్గద్వారం తెరుచుకున్నది నరకమార్గం మూసుకున్నది దుర్మార్గుడైన సాతానుకు మనాదిగట్టిగ పట్టుకున్నది! వెనుకముందు చూడకుండ సత్కార్యములనాచరించు కురుస్తున్నది దైవకరుణ అన్నిచెడులను విస్మరించు!! – మదీహా అర్జుమంద్ -
పెళ్లి పూజలేనా?
అదేంటో! అనుష్క ఎప్పుడు గుడికి వెళ్లినా... పెళ్లి కోసం ప్రత్యేకంగా పూజలు చేశారని గాసిప్‌రాయుళ్లు కథలు అల్లేస్తారు. ఇప్పుడు కూడా అంతే. అందులోనూ అనుష్క వెంట ఆమె మదర్ ప్రఫుల్లా రాజ్‌శెట్టి, బ్రదర్ గుణరంజన్ శెట్టి, మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండడంతో కచ్చితంగా పెళ్లికి సంబంధించిన పూజలు ఏవో జరిపించుంటారని కథ అల్లేశారు.‘బాహుబలి’ విడుదల తర్వాత మనసుకు నచ్చిన వ్యక్తితో అనుష్క ఏడడుగులు వేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వినిపించిన నేపథ్యంలో తాజా పూజలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు మేటర్ ఏంటంటే... రెండు రోజుల క్రితం సాయంత్రం కర్ణాటకలోని కొల్లూర్‌లో గల మూకాంబిక గుడికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు అనుష్క. వీఐపీ సౌకర్యాలు ఏవీ కోరకుండా సాధారణ భక్తులతో కలసి క్యూ లైనులో నిలబడ్డారు. గుడిలోకి ఎంటరయ్యాక ఆలయ పూజారులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారట! అనంతరం అనుష్క బెంగళూరులోని ఇంటికి చేరుకున్నారు. ఆ పూజలు ఎందుకనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా... మౌనమే అనుష్క సమాధానమైంది. ఇప్పుడూ మౌనంగానే ఉంటారో? లేక బదులిస్తారో? చూడాలి. ఆమె ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలను కొట్టి పారేసింది. ‘‘అనుష్కకు భక్తి ఎక్కువ. రజనీకాంత్ ‘లింగ’ షూటింగ్ టైమ్‌లోనూ మూకాంబిక గుడికి వెళ్లింది. ఇప్పుడు‘బాహుబలి’ సక్సెస్ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంది’’ అని అనుష్క తండ్రి విఠల్ పేర్కొన్నారు. మంగుళూరులోని బప్పనాడు దుర్గాపరమేశ్వరీ ఆలయాన్ని కూడా అనుష్క సందర్శించారు. -
మహిళలపై కాంగ్రెస్ నేత దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు!
త్రివేండ్రం: మహిళలపై కేరళ కాంగ్రెస్ నేత ఎంఎం హసన్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారని, కాబట్టి వారిని ఆధ్యాత్మిక ప్రదేశాల్లోకి అనుమతించకూడదని పేర్కొన్నారు. 'రుతుస్రావం అనేది మలినమైనది. ఈ సమయంలో మహిళలను ఆలయాల్లోకి రానివ్వకూడదు. ఈ సమయంలో మహిళలకు రాకూడదన్న సూచన వెనుక సైంటిఫిక్ కారణం ఉంది. దీనిని తప్పుగా వ్యాఖ్యానించకూడదు. ఈ సమయంలో మహిళలు ఉపవాసం ఉండకూడదు. నా అభిప్రాయం ప్రకారం మహిళల శరీరం మలినంగా ఉన్నప్పుడు వారు ఆలయాలు, మసీదులు, చర్చిల వంటివాటికి వెళ్లకపోవడమే మంచిది' అని ఆయన పేర్కొన్నారు. కేరళ పీసీసీ చీఫ్‌గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. గతకొంతకాలంగా ఖాళీగా ఉన్న కేరళ కాంగ్రెస్ చీఫ్ పదవిని తనకు సన్నిహితుడైన ఎంఎం హసన్‌కు మాజీ సీఎం ఊమెన్ చాందీ పట్టుబట్టి మరీ ఇప్పించారు. -
కాటమ రాయుడా... కదిరి నరసింహుడా...
పుణ్యతీర్థం మార్చి 7 నుంచి ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు ఆ దేవుడు కాటమరాయుడు. ఆయనే కదిరి నరసింహుడు. భక్తుల చేత వసంత వల్లభుడిగా, ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి దివ్య క్షేత్రం అనంతపురం జిల్లా కదిరిలో ఉంది. నిత్య వైభవంతో కళకళలాడే ఈ క్షేత్రం మార్చి 7 నుంచి వారం రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలతో భక్తులతో కిటకిటలాడనుంది. జై నారసింహ ధ్వానాలతో మార్మోగనుంది. భక్త ప్రహ్లాదుని సహిత నారసింహుని క్షేత్రం భారత దేశంలో మరెక్కడా లేదు. ఒక్క కదిరిలోనే ఉంది. అది తెలుగువారికే సొంతమైన మరో విశేషం. శ్రీ మహావిష్ణువు దానవుడైన హిరణ్య కశిపుని శిక్షణకు భక్తుడైన ప్రహ్లాదుని రక్షణకు నరసింహుని అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూపంలోనే కదిరి సమీపంలోని కొండపై సంచరించసాగాడు. స్వామి అలాగే ఉండటం సరికాదని ఆయనను శాంతింప చేయాలని భావించిన మహర్షులు, దేవతలు ఆ కొండపైకి చేరి నరసింహుణ్ణి స్తోత్రిస్తూ నెమ్మదిగా శాంతింప చేశారు. అలా ఆ కొండకు ‘సోత్రాద్రి’ అని పేరు వచ్చింది. దీనికి గుర్తుగా ఆ కొండపై కదిరికొండ లక్ష్మి నరసింహ దేవస్థానం ఉంది. అదే కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. ‘ఖ’ అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి ఖద్రి లేదా ఖాద్రి అనే పేరు వచ్చిందని అంటారు. ఖాద్రి చెట్ల నుంచి... కదిరి పక్కన ఉన్న కొండపై పూర్వం ఖదిర వృక్షాలు (చండ్ర చెట్లు లేదా మడుగు దామర లేదా ఇండియన్ మల్బరీ) ఎక్కువగా ఉండేవని ఈ చెట్ల దగ్గర ఉన్న పుట్టలో నారసింహ స్వామి స్వయంభువుగా వెలిశాడని కనుక ఈ నారసింహుణ్ణి ఖాద్రి లక్ష్మీ నరసింహుడు అన్నారని మరో కథనం. స్వామి స్వయంభువుగా వెలిశాడనేదానికి గుర్తుగా అభిషేకం చేశాక హృదయ భాగం నుంచి స్వేద బిందువులు కనిపిస్తాయని ఇది స్వామి వారి మహిమ అని భక్తులు భావిస్తారు. పాలెగాడి గోవులు... ఈ ప్రాంతాన్ని పదవ శతాబ్దంలో పాలించిన రంగనాయకులు అనే పాలెగాడి గోవులు రోజూ కదిరి కొండపైకి వెళ్లి అక్కడ ఖాద్రీ వృక్షాల కింద గల పుట్టలో ఉన్న నరసింహస్వామికి పాలు ఇచ్చి వచ్చేవనీ, దీని దరిమిలా రంగనాయకులు తనకు తెలియకుండానే రోజు రోజుకూ శ్రీమంతుడు అయ్యాడని కథనం. చివరకు ఒకరోజు స్వామి రంగనాయకుల కలలో కనిపించి తాను స్వయంభువుగా వెలిశానని, తన విగ్రహాన్ని వెల్లడించి గుడి కట్టించమని కోరాడని తత్ఫలితంగా రంగనాయకులు గుడి కట్టాడని కథనం. అయితే ఆనాటి మూలవిరాట్టు కాలగతిలో అదృశ్యమవగా బుక్కరాయల కాలంలో ఆ తర్వాత హరిహరరాయల కాలంలో చివరిగా శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం పూర్తి చేసుకున్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. భృగు మహర్షి తపోస్థలం... విష్ణువు అనుగ్రహం కోసం భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని, ఈ తపస్సుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిసి ఉన్నానని, తన విగ్రహాలను వెల్లడి చేసి పూజాదికాలు నిర్వహించమని కోరినట్టు కథనం. ఇది జరిగింది వసంత మాసంలో కనుక భృగువు కోనేరు నుంచి నారసింహుని విగ్రహాలను బయటకు వెల్లడి చేసింది వసంత మాసంలోనే కనుక ఈ స్వామిని వసంత వల్లభుడు అని కూడా అంటారు. విగ్రహాలు వెల్లడైన కోనేటిని ‘భృగు తీర్థం’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం భృగు మహర్షి కాలం నాటి ఈ విగ్రహాలను ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగిస్తున్నారు. ఇవి దివ్యతేజస్సుతో ఉండటం భక్తులు గమనిస్తారు. ఇలా ఉత్సవ విగ్రహాలు ఇంత తేజస్సుతో ఉండటం దేశంలోని వేరే ఏ గుడిలోనూ చూడలేమని భక్తులు అంటారు. కంభాల రాయుడు... కాటమ రాయడు... దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు సగంమనిషి, సగం సింహంగా నరసింహావతారంలో భీకర రౌద్ర స్వరూపంతో అవతరించాడు. హిరణ్య కశిపుడి సభామంటపం నందలి çస్తంభం (కంబం) నుంచి స్వామి ఆవిర్భవించాడు కనుక శ్రీవారిని కంబాలరాయుడని భక్తులు పిలుచుకుంటాడు. అలా ఈ స్వామికి కాటమరాయుడు, భేట్రాయస్వామి.. అనే పేర్లు కూడా ఉన్నాయి. అన్నమాచార్యులు సైతం తన కీర్తనల్లో సైతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడా.. అని కీర్తించారు. కాటమరాయుడు అనే పేరు ఎలా వచ్చిందంటే కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహ స్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని ‘కాటం’ అనే కుగ్రామం కూడా ఉండటంతో స్వామిని కాటమరాయుడిగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలేగాళ్లు పాలించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పాలేగాళ్ల వారసులు పాల్గొంటారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఉపవాసంతో గొడ్డువెలగల నుండి నృసింహాలయానికి ఆనవాయితీగా ఇప్పటికీ జ్యోతిని తీసుకొస్తున్నారు. బేట్రాయి స్వామి దేవుడా... కదిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామికి తెలుగు ప్రాంతం కంటే కూడా కర్ణాటక ప్రాంత భక్తులు ఎక్కువ. విశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ‘పారు వేట’ ఒక ముఖ్య కార్యక్రమం. శ్రీదేవి, భూదేవిలతో వసంతవల్లభుడు క్రూరమృగాలను వేటాడటానికి కదిరి కొండకు వస్తాడనడానికి సంకేతంగా అర్చకులు ఈ ‘పారువేట’ను నిర్వహిస్తారు. ఈ పారువేట వల్ల ‘వేట రాయడు’ కాస్త కన్నడభాష వల్ల ‘బేట్రాయుడు’ అయ్యాడు. మృగాల నుంచి ప్రజలను రక్షించడం పాలకుడి ధర్మం. మనసులో సంచరించే దుష్ట ఆలోచనలనే క్రూరమృగాలను స్వామి సంహరిస్తాడన్న దానికి సంకేతంగా కూడా పారు వేటను చెప్పుకోవచ్చు. – చెరువు శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’ కదిరి, అనంతపురం కదిరికి చేరుకోవడం ఎలా?: ఖాద్రీ క్షేత్రాన్ని చేరుకోవడానికి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. అక్కడి నుంచి ఈ క్షేత్రం 90 కి.మీ. పుట్టపర్తి నుంచి కేవలం 40 కి.మీ దూరం. అక్కడి నుండి గోరంట్ల మీదుగా లేదంటే న ల్లమాడ మీదుగా రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. తిరుపతి నుండి మదనపల్లి మీదుగా లేదంటే పీలేరు, రాయచోటి మీదుగా కూడా రావచ్చు. పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలు: కదిరి లక్ష్మీ నారసింహుని దర్శించుకున్న పిమ్మట కదిరి–రాయచోటి రోడ్డు మార్గంలో కేవలం 12 కి.మీ దూరంలో గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన సమాధిని చూడవచ్చు. తర్వాత అదే మార్గంలో మరో 15 కి.మీ దూరంలో ఎన్ పీ కుంట మండలం గూటిబైలు గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ది గాంచిన తిమ్మమ్మ మర్రిమాను సందర్శించ వచ్చు. వీటిని చూసేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సు సౌకర్యం ఉంది. పుట్టపర్తిని కూడా దర్శించుకోవచ్చు. దేశంలోనే 3వ అతి పెద్ద తేరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనారసింహుడు బ్రహ్మరథంపై దర్శనమిస్తాడు. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్రహ్మ రథం చక్రాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడేళ్ల క్రితం మరమ్మతులు కూడా చేయించారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీ నృసింహుని రథం. భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీనారసింహుడు ఒక్క కదిరిలోనే ఉన్నాడు. ఈ దర్శనం ఇంకెక్కడా జరగదు. స్వామికి పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిపేది ఇక్కడే. ప్రతి నెలలో స్వాతినక్షత్రం రోజు మాత్రమే మూలవిరాట్‌కు అభిషేకం చేస్తాం. అది భక్తులు చూసి తీరాల్సిన సేవ. – పార్థసారథి, ఆలయ ప్రధాన అర్చకులు -
విశ్వాసిని అజేయునిగా చేసే ‘లెంట్’
విశ్వాసి... శరీరం– ఆత్మల, సమన్వయ– సమున్నత కలయిక. ఈ రెండూ భిన్న నియమాలతోనే నడిచినా విశ్వాసిలో దేవుని ప్రతినిధిగా ఉన్న ఆత్మే అతనికి దిశానిర్దేశం చేస్తుంది. అందువల్ల రెండింటి మధ్య సమన్వయ సాధనకు ఉపకరించేదే ఈస్టర్ ఆదివారానికి ముందు భస్మ బుధవారంతో ఆరంభమయ్యే 40 రోజుల ఉపవాస ప్రార్థనా దీక్ష. అదే ‘లెంట్’. యేసుప్రభువు కూడా బాప్తిస్మం తీసుకున్న వెంటనే 40 రోజుల ఉపవాస ప్రార్థనా దీక్ష చేపట్టారు. ఆ తర్వాత కూడా తరచు ఏకాంత ఉపవాస ప్రార్థనలు చేసి దేవునితో తన అనుబంధాన్ని చాటుకున్నారు. ఆహారం అనేది మనిషి ఎంతో ప్రియంగా ఆస్వాదించే లోకపరమైన అంశం. అలాంటి ఆహారాన్ని సేవించకుండా ఉపవాసానికి పూనుకోవడం ద్వారా విశ్వాసి దేవునికి తనకూ గల అనుబంధం ఎంత ప్రగాఢమైనదో రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ఉపవాసానికి ప్రార్థన కూడా తోడైతే ఆ ప్రక్రియలో విశ్వాసి ఒక అజేయమైన శక్తిగా రూపొందుతాడని యేసుక్రీస్తే వెల్లడించాడు (మార్కు 9:29, మత్తయి 17:21). ఉపవాస ప్రార్థనా దీక్షతో ఉపవాసానికి, ప్రార్థనకు కూడా ప్రాధాన్యతనివ్వకపోతే ఆ దీక్షకు అర్థం, విలువ ఉండదు. యూదు నియమావళి ప్రకారం సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకొని, సూర్యాస్తమయం తర్వాత మళ్లీ ఆహారం సేవించే వరకు దాదాపుగా 12 గంటలపాటు చేసేదే ఉపవాసదీక్ష! శరీరంలోని ద్రావిక సమతుల్యం కోసం అవసరమైన మేరకు నీళ్లు తాగడంలో తప్పు లేదు. వృద్ధులు, మధుమేహం ఉన్నవారు ఒకటి లేదా రెండుసార్లు ఏదైనా ఫలరసాన్ని సేవించడమూ నిషిద్ధం కాదు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కూడా అవసరానికి మించి భోంచేయడం అనేది ఆ దీక్ష ఉద్దేశ్యాన్నే చెరుపుతుందన్నది గమనించాలి. ఈ నలభై రోజుల దీక్షలోనూ ఆహారాన్ని సేవించడంలోనే కాదు అన్ని విషయాల్లోనూ మితంగా వ్యవహరించడం ద్వారా దేవుని మనం ఘనపర్చుతామన్నది గుర్తుంచుకోవాలి. మాంసాహారం యూదు సంస్కృతి ప్రకారం నిషిద్ధం కాకున్నా, శరీరాన్ని అదుపు చేసుకునే ఒక ప్రక్రియ గనుక ‘శాకాహారం’ ఆ ధ్యేయ సాధనకు ఉపకరిస్తుందన్నది కొందరు పెద్దల అభిప్రాయం. ఎవరితోనైనా విభేదాలున్నా, గొడవలున్నా వాటిని సరిచేసుకొని వారితో సంబంధాలు పునరుద్ధరించుకోవడం దీక్షాపరులు చేయవలసిన పని. ఈ నలభై రోజులే కాదు... ఆ తర్వాత కూడా చేతనైనంతగా ఇతరులకు, నిర్భాగ్యులకు సాయం చేయడం దేవుడు మెచ్చే సత్కార్యం తోటివారితో మనం ఎంత సఖ్యతతో వ్యవహరిస్తున్నామనేదే దేవునితో మన అనుబంధం ఎంత ప్రగాఢంగా ఉందనడానికి గీటురాయి అని మర్చిపోరాదు. మొత్తం నలభై రోజులూ దీక్ష చేయగలిగితే మంచిది. అలా కాకున్నా మన పరిస్థితుల మేరకు కొన్ని రోజులైనా దీక్షను నిబద్ధతతో చేయడం మంచిది. దీక్షలో ఉన్న దినంలో అత్యధిక భాగాన్ని దైవ వాక్యధ్యానంలో, ప్రార్థనలో గడపలేకపోతే అది ఉపవాస ప్రార్థనా దీక్ష కాదు. ఉపవాస ప్రార్థనా దీక్ష... దేవుని శక్తి మన జీవితంలోనికి ప్రవేశించే గవాక్షాలను తెరిచి విశాలం చేస్తుంది. అలా మనలోకి ప్రవేశించే దేవుని శక్తి మనలో, కుటుంబంలో ఎన్నో అద్భుతకార్యాలు జరిగేందుకు కారణమవుతుంది. దీక్ష రోజున ఆఫీసులో లేదా మీ మీ పనుల్లో నిమగ్నమై ఉన్నా, విరామ సమయాన్ని ప్రార్థనలో, వాక్యపఠనంలో గడపండి, పదిమందికీ సాయం చేయండి. ఉత్తమ శ్రేణికి చెందిన విశ్వాసిగా, పరిణతి చెందండి. అదే ఉపవాస ప్రార్థనా దీక్ష ఉద్దేశ్యం. – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
మా రాంబాబు గాడి చింతన్ బైఠక్!
హ్యూమర్ ‘‘ఒరేయ్... రా రా... రా రా... చాలా రోజులకు కనిపిస్తున్నావు. రా కాస్త టిఫెన్ తిని వెళ్తువు గానీ రా ’’ అంటూ ఆహ్వానించాడు మా రాంబాబు గాడు. ఇంత ప్రేమగా పిలుస్తున్నాడు కదా అని వెళ్లా. అదీగాక ఈమధ్య చాలారోజులైంది వాడి స్పీచ్‌లు వినక. ఆ టైమ్‌కు వాడు చింతపండు పులిహోర తింటున్నాడు. నాకూ కాస్త వడ్డించాడు. ‘‘ఏమిటోరా... పులిహోరలో చింతపులుసు కలపడానికి చింతపండును కాసేపు కసాబిసా పిసకాలి. పిసికి చింతపండు రసం తీయాలి. పిప్పి పక్కనే మిగిలిపోయేలా ఒడుపుగా రసం పోయాలి. చింత నుంచి రసం తీయడం అన్నది శ్రమతో కూడిన ఒక ఆర్టు. పాపం... ఈ మధ్య జనానికి సహనం తగ్గిపోయిందిరా. ఇంతగా శ్రమపడలేక... పిండటం పరమవీజీ కాబట్టి పులిహోర చేయాలంటే గబుక్కున నిమ్మకాయ పిసికేస్తున్నారు. పులుపు కలిపి మమ అనేస్తున్నారు’’ అంటూ చాలా బాధపడ్డాడు. ‘‘నువ్వే చూడురా... ఇటు నిమ్మరసం పులిహోరకూ, అటు చింతపండు పులిహోరకూ రుచిలో ఉన్న ఆ మహాద్భుతమైన తేడాను నువ్వే గమనించు’’ అంటూ చింత గొప్పకు వంత పాడాడు వాడు. ‘‘ఈరోజుల్లో అంతా షార్ట్ కట్సే కదరా. పోన్లే... ఏదేమైనా పులిహోర రుచి బాగుంది కదా ఎంజాయ్ చెయ్’’ అన్నాను. ‘‘చింతలో ఏదో వింత ఉంది. అందుకే కాబోలు చింత ఇంత నాణ్యమైనది కాబట్టే పతకం తయారీలో అపరభక్తుడైన శ్రీరామదాసు గారు జాగ్రత్తగా సీతమ్మవారికి చింతాకు పతకం చేయించాడు. చేయించి అక్కడితో ఊరుకున్నాడా... ఆ సంగతి తన కీర్తనలో నమోదు చేశాడు. చేసి గమ్మునున్నాడా.... ‘‘సీతమ్మకు చేయిస్తీ... చింతాకు పతకామూ.... పతకానికీ పట్టే పదివేల వరహాలూ...’’ అంటూ అది పరమ కాస్ట్లీ ఆభరణమంటూ టాం టాం చేశాడు. ఇక్కడో చిన్న మతలబు జరిగిపోయింది. సీతమ్మగారికి చేయించిన గోల్డ్ ఐటమ్ కంటే... దాన్ని ఏ మెటీరియల్‌తో చేశారో దానికి ప్రాధాన్యం వచ్చేసింది. చూశావా? అంటే లోకంలో ఎన్నెన్నో ఆకులు ఉండగా... రామదాసు గారు ఫలానా చింతాకు పతకమే చేయించాడెందుకూ అని ఆలోచించగా చించగా.. నిమ్మ పులిహోర కంటే చింతపులుసు పులిహోరే నాణ్యంగా ఉంటుందని తేలిపోయినట్టే... చింత ఆకులో ఏదో క్వాలిటీ గుణం ఉందని తేలిపోలా’’ అంటూ నన్ను ప్రశ్నించాడు రాంబాబు. ‘‘ఒరేయ్... ఇక్కడ జ్యువెలరీ డిజైన్‌లో చింతాకు ఒక షేప్. అంతకంటే దానికి ప్రాధాన్యమేమీ లేదేమోరా’’.... వాడి లాజిక్కులను నమ్మాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో పడిపోతూనే అన్నాను నేను. ‘‘నో... నో... యువార్ మిస్టేకెన్... చింతలో నాణ్యత ఏదో ఉంది కాబట్టే మిగతా కర్రల కంటే దాన్ని విశేషంగా వాడతార్రా. ఫరెగ్జాంపుల్... నిన్ను చిన్నప్పుడు మీ మాస్టారు... వెదురు కర్రో, పేము బెత్తమో అందుబాటులో ఉన్నా... చింతబరికెనే వాడేవాడు. ఇలా తన్నడాన్ని ‘వీపు చింతపండు’ చేయడం అని అంటారు. అదీ చింతకిచ్చే గౌరవం. అంతేగానీ... అందుబాటులో ఉంది కదా అని... ఏ వేపపుల్లనో, పత్తికట్టెనో వాడి... ‘వీపు వేపపండు చేశారనో, జమపండు అయ్యిందనో అనేవాడు కాదు. పైగా ‘‘చీరి చింతకు కడతా’’ అనే కూడా వాడు. కానీ నీ వీపు చీరేసి మరో చెట్టుకు కట్టాలన్న కోరిక ఆయనకు ఉండేదికాదని అంత కోపంలోనూ నాకు తెలిసిపోయేది. మరోమాట ఆ కోపంలో మన సార్ కళ్లు చింతనిప్పుల్లా ఉండేవని చూసేవాళ్లు అనుకునేవారు, గుర్తులేదా’’ అంటూ రామదాసు గారి భక్తిపూజలతో పాటు నా చిన్ననాటి చింతబరికతో బడితెపూజలూ... సార్‌గారి చింతనిప్పుల కళ్లూ అలా ఎన్నో సంగతులను గుర్తుచేశాడు వాడు. రాంబాబుగాడి ‘చింత’న వల్ల నా చిన్ననాటి సంగతులు బైటపడుతుండటం నాకు అంతగా రుచించలేదు. టాపిక్ మారుద్దామని ‘‘అన్నట్టు... సీఎంగారు ఇచ్చే ‘డబుల్ బెడ్రూం’ ఇళ్లకోసం అప్లికేషన్ పెడతానన్నావు కదా. ఎంతవరకు వచ్చిందా సంగతి?’’ అడిగా. ‘‘ఒరేయ్... డబుల్ బెడ్రూం నివాసాలంటే గుర్తుకొచ్చిందీ... ’మనకంటే ప్రభుత్వం ఒక పథకం పెట్టి వరసగా డబుల్ బెడ్రూములు ఇస్తుంది. పాపం... దెయ్యాలకు చింతచెట్లే డబుల్బెడ్రూమ్ భవనాలు కదా’ అని అడిగాడురా ఎప్పుడూ ఆ హారర్ సినిమాలు చూస్తుండే నీ కొడుకు’’ అంటూ టాపిక్‌ను మళ్లీ చింతచెట్టు దగ్గరికే తీసుకెళ్లాడు. ఏదైనా మంత్రం వేసినట్టుగా వాడి మాటలను కట్టేస్తే బాగుండని నాకు అనిపించింది. కానీ ‘మంత్రాలకు చింతకాయలు రాలవు’ కదా అనే సామెత గుర్తొచ్చి ఆగిపోయాను. అలా వాడి మాటలకు డబుల్ చింతలో మునిగిపోతూ ఉండగా చింతకాయ కొరికినట్టుగా మారిన నా ఫేస్ ఫీలింగ్స్‌ను బట్టి వాడు గ్రహించాడు. ‘చింతపడకు చింతపడకు... చింత లేనివాడు సంతలోనైనా నిశ్చింతగా పడుకుంటాడట. కాబట్టి ముందు ‘చింత’ వదిలెయ్’’ అంటూ మళ్లీ ఓదార్చాడు వాడు. వీడికి ఎంత చెప్పినా ఇంతే... చింత చచ్చిన పులుపు చావదన్న తీరులో వీడి వైఖరి ఎప్పటికీ మారదన్న విషయం గ్రహించి మిక్కిలి చింతాక్రాంతుడనయ్యాను. ‘‘కాస్త బెంగగా ఉన్నట్లున్నావు... రా ఒక రౌండు ఆటాడుకుందాంగానీ రా రా’’ అంటూ సగానికి చీల్చిన చింత గింజలతో చేసిన అష్టా–చెమ్మా కాయలను విసురుతూ ఆహ్వానించాడు వాడు. నోట్లో పులిహోరా... చెవిలో వీడి హోరూ భరించలేక... కాస్త మనశ్శాంతి కోసం ప్రశాంతంగా ఉంటుందని అలా మా ఊరి చింతలతోపు వైపునకు బయల్దేరాను నేను. – యాసీన్ -
చర్చినే కాదు, జీవితాన్నీ సరిగ్గా కట్టుకోవాలి
యూదా రాజైన యోవాషు జీవితం దేవుని అద్భుతాలకు ప్రతిరూపం. అతల్యా అనే దుర్మార్గురాలు యూదా రాజవంశీయులందరినీ చంపి ఆ దేశాన్ని పాలిస్తున్న కాలంలో, యోవాషును దేవుడు పసివాడుగా ఉండగానే కాపాడాడు. ప్రధాన యాజకుడైన యెహోయాదా భార్య ఏడాది కూడా నిండని యోవాషును కాపాడి దేవుని మందిరంలోనే అతన్ని దాచింది. అప్పటికే మందిరం ప్రజల నిరాదరణకు గురై పాడుదిబ్బగా మారడంతో ఎవరూ దానివైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. అందువల్ల యోవాషును ఉంచడానికి అదే సురక్షిత స్థలమయింది. అతల్యా హతమైన తర్వాత యెహోయాదా పర్యవేక్షణలో ఏడేళ్లకే యోవాషు యూదా దేశాన్ని ఏలడం ఆరంభించాడు. ప్రధాన యాజకుడు భక్తిపరుడైన యెహోయాదా సూచనల మేరకు యోవాషు ఎంతో దైవభయంతో జీవించాడు, పాలించాడు. ప్రజల నుండి ద్రవ్యం పోగుచేసి మందిర పునరుద్ధరణ కార్యం ఆరంభించాడు. ఆరాధనలు, దహనబలులు నిరంతరం జరిగే పూర్వవైభవాన్ని మందిరానికి తెచ్చాడు. పునరుద్ధరణ తర్వాత ఇంకా డబ్బు మిగిలితే ఆలయానికే కొత్త బంగారు, వెండి వస్తువులు చేయించాడు. ఈలోగా ప్రధాన యాజకుడైన యెహోయాదా 130 ఏళ్ల వయసులో మరణించాడు. అప్పటినుండి మార్గనిర్దేశం చేసేవారు లేక యూదా రాజ్యప్రజలు, యోవాషు కూడా దారి తప్పి దేవతాస్తంభాలు స్థాపించి విగ్రహారాధనలు ఆరంభించారు. ఆ విధంగా ఆత్మీయంగా పతనమయ్యారు. యూదా రాజ్యాన్ని తలుచుకుంటేనే జడిసిపోయే సిరియా సైన్యం, చిన్న గుంపుతో వచ్చి దాడి చేసి అసంఖ్యాకమైన యూదా సైన్యాన్ని ఓడించింది. నిజమే, ఆత్మీయంగా పతనమైనప్పుడు, చిన్న సవాళ్లు, చిన్నవాళ్లే విశ్వాసులకు పెనుసవాళ్లుగా మారడం చూస్తూంటాం. దుర్మార్గతను వాడమని చెప్పడానికి దేవుడు యెహోయాదా కుమారుడైన జెకర్యానే వారికి ప్రవక్తగా పంపాడు. అతడు వారిని చాలా గట్టిగా హెచ్చరించాడు కూడా! అయితే యెహోయాదా అతని కుటుంబం తనకు చేసిన మేలు మర్చిపోయి, యోవాషు రాజు జెకర్యాను రాళ్లతో కొట్టించి చంపించాడు. అలా దేవునికి రోజు రోజుకూ దూరమై చివరికి 47 ఏళ్ల వయసులోనే తీవ్రమైన రుగ్మతలకు లోనై మరణించాడు. అయితే అతని దుర్మార్గతను బట్టి, రాజుల సమాధులుండే స్థలంలో కాక ప్రజలతన్ని మరోచోట పాతిపెట్టారు (2దిన 23–24). అత్యద్భుతంగా సాగి ఎంతో వైభవంగా ముగియవలసిన యోవాషు జీవితం అలా అర్ధాంతరంగా అధ్వానంగా ముగిసింది. శిథిల మందిరాన్ని తిరిగి కట్టగలిగిన యోవాషు అతి ప్రాముఖ్యమైన తన జీవితాన్ని కట్టుకోవడంలో విఫలమయ్యాడు. మందిరాన్ని నిర్మిస్తే చాలు దేవుడు నాకు వంద మార్కులు వేస్తాడనుకున్నాడు యోవాషు. కాని దేవుడు చూసేది, చూసి ఆనందించాలనుకునేది తన జీవితాన్ని అన్న చిన్న వాస్తవాన్ని మర్చిపోయాడు. చర్చిలైనా మరే ఆరాధనా స్థలాలైనా, అక్కడి పవిత్రతను ప్రాంగణాల్లో కాదు, భక్తుల హృదయాల్లో దేవుడు చూస్తాడు. ఆదివారం నాడు ఆరాధనలో కనిపించే పరిశుద్ధత సోమవారం నుండి శనివారం దాకా విశ్వాసుల జీవితాల్లో లోపిస్తే, ఆ ఆరాధనకు దేవుని దృష్టిలో విలువ లేదు. పాలరాతితో చర్చిని నిర్మించిన వారి గుండెల నిండా పాపాల గుట్టలు పేరుకు పోయివుంటే దేవుడు చర్చిని చూసి మురిసిసోవాలా, భక్తుల్ని చూసి బాధపడాలా? – రెవ.డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
ఏటీఎంకు దండేసి.. దండం!
-
ఏటీఎంకు దండేసి.. దండం!
ఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన నాటి నుంచి ప్రజల నోట్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో సెక్యూరిటీ గార్డు తప్పించి ఎప్పుడూ ఎవరూ కనిపించని ఏటీఎం సెంటర్ల వద్ద కూడా చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలల్లోనే ప్రజల సమయం గడిచిపోతోంది. ఇక చాలా ఏటీఎంలలో క్యాష్ కొరతతో బ్యాంకు సిబ్బంది అసలు డబ్బు నింపడం లేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న తూర్పు ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతం ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో ఎప్పుడూ నో క్యాష్ బోర్డు కనిపిస్తుండటంతో.. ఏటీఎం మెషిన్‌కు పూజలు చేసి.. కాస్త డబ్బుకావాలని వేడుకున్నారు. ఈ పూజా నిరసన కార్యక్రమంలో సుమారు 50 మంది ప్రజలు పాల్గొని ఏటీఎం మెషిన్‌కు హారతి ఇచ్చి దండేసి దండం పెట్టారు. చూడాలి మరి.. ఈ నిరసనతో అయినా బ్యాంకు అధికారులు నో క్యాష్ బోర్డు తొలగిస్తారేమో! -
జగన్నాథుడి ఎదుట కార్తీక వ్రతం
సన్నిధి పవిత్రమైన కార్తిక మాసంలో పూజలు, నోములు, వ్రతాలతో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. తెలుగు నేలపైనే కాదు... ఒరిస్సాలోనూ ఈ మాసంలో జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాలు అనేకం. ఈ నెలలో ఒరిస్సా ప్రాంతంలోని వయోవృద్ధ మహిళలు, వితంతువులు సామూహికంగా నెల రోజులూ కార్తీక దీక్ష నిర్వహిస్తారు. పలు ప్రాంతాల నుంచి ఒరిస్సాలోని పూరిలో నెలకొన్న జగన్నాథస్వామి ఆలయమైన శ్రీక్షేత్రానికి విచ్చేసి, గుంపులు గుంపులుగా కూడి వ్రతం ఆచరిస్తారు. ఇలా ఆచరించే కార్తీక వ్రతాన్ని స్థానికంగా ‘హబిష’గా వ్యవహరిస్తారు. వ్రతం ఆచరించే వారిని ‘హబిషియాలి’గా పేర్కొంటారు. ప్రముఖ శైవ, వైష్ణవ క్షేత్రాలు ఈ హబిషియాలీలతో కళకళలాడతాయి. ఈ నెల పొడవునా మహా విష్ణువు, మహా శివుని తపో దీక్షతో పూజిస్తారు. వ్రతం కొనసాగే వ్యవధిలో ఒంటిపూట ఆహారం, శాకాహారం, పండ్లు ఫలాల్ని మాత్రమే స్వీకరిస్తారు. శ్రీజగన్నాథునికి నివేదించిన అన్నప్రసాదాల్ని (ఒభొడా) అతి పవిత్రంగా స్వీకరిస్తారు. ‘ఒభొడా’ అందుబాటులో లేని సందర్భాల్లో ఆకు కూరలు, కందమూలం లాంటి దుంప జాతి పదార్థాలకు ఎంపిక చేసిన పప్పుల్ని చేర్చి, కూరగా వండుకొని అన్నం స్వీకరించడం కార్తీక వ్రత ఆచరణలో భాగం. సాయంత్ర వేళల్లో సాధారణంగా పండ్లను ఆరగించి గడిపేస్తారు. వ్రత సంకల్పం మొదలు ఇంటి నుంచి దూరంగా దేవస్థానాలు, మఠాలు వగైరా ప్రాంతాల్లో బస చేసి సమష్టిగా వ్రతం జరుపుకోవడం ఆచారం. ఈ సందర్భంగా శ్రీమందిరం సముదాయంలో కొలువు దీరిన మహాలక్ష్మి దేవస్థానం కూడా కళకళలాడుతుంది. దేవస్థానం ఆవరణలో పద్మాల ముగ్గుల్ని వేసి, నిత్య నూతనంగా తీర్చిదిద్దుతారు. మహాలక్ష్మి దేవస్థానంలో ఇలా ముగ్గులు వేసి దేవిని ప్రసన్నం చేసుకోవడంతో సౌభాగ్యం లభిస్తుందని వీరి విశ్వాసం. తులసి కోట ఆవరణలో... కార్తీక వ్రతం ఆచరించేందుకు పలు ప్రాంతాల నుంచి చేరిన దీక్షాధారులు అక్కడక్కడ గుంపులుగా చేరతారు. వీరు తాత్కాలికంగా బస చేసే చోట తులసి కోట ఉండేలా తప్పనిసరిగా చూసుకుంటారు. తులసి కోట ముంగిల్లో వేకువ జాము నుంచి పూజాదులు నిర్వహించి, కార్తీక పురాణం పారాయణం వగైరా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హడావిడిగా ఉంటారు. నెల రోజులూ ఇదే షెడ్యూలు. వ్రతం సమయంలో పశువులు, పక్షులు మొదలైన వాటితో భంగం వాటిల్లకుండా, తులసి మొక్క పై భాగాన సంప్రదాయ డేరా (చందువా) వేస్తారు. ఇలా ఆచరించే కార్తీక వ్రతాన్నే ‘హబిష’గా వ్యవహరిస్తారు. హబిషియాలీలకు ప్రత్యేక దర్శనం: వేలాది మహిళా భక్తులు రాష్ట్రంలో పలు చోట్ల ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీజగన్నాథుని దర్శించుకునేందుకు కార్తీక మాసంలో విశేష సంఖ్యలో యాత్రికులు విచ్చేస్తారు. హబిషియాలీల రాకతో భువనేశ్వర్‌లోని ఏకామ్ర క్షేత్రం కూడా కార్తీక మాసం నెల రోజులు కిటకిటలాడుతుంది. వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తారు. - ఎస్.వి. రమణమూర్తి, భువనేశ్వర్ -
కార్తీక సోమవార పూజలు
-
షష్టి స్ఫూర్తి
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ భగవద్ రామానుజస్వామి... వారిది మిలీనియమ్ మార్చ్! దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు! అతి శక్తిమంతమైన ‘నారాయణ మంత్రం’ దాచుకోకుండా పంచిపెట్టారు! పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్! తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం పోరాడారు... నిరతాగ్నిహోత్రంతో... దేశమంతటా... 108 ‘శ్రీరామక్రతువు’లు చేశారు. భక్తులతో ‘రామ’కోటి రాయించి, సమతా ‘స్తూపాల’ను ప్రతిష్ఠించారు. మహానుభావులు... ‘ధర్మం’ కోసం కృషి చేశారు. చిన్న జీయర్ స్వామి... వీరిది ప్రోగ్రెసివ్ మార్చ్! వేదానికి అధ్యయన జ్యోతి... అంధులకు అక్షర కాంతి... గిరిజనులకు విద్యాక్రాంతి. భగవద్ రామానుజ, పెద్ద జీయర్ స్వాముల పరంపరకు ‘జెండాపై కపిరాజు’. మనకు తెలిసిన స్వామి... మనలో ఒకడైన స్వామి... కళ్ళతో పలకరిస్తారు... చిరునవ్వుతో సాంత్వన కలిగిస్తారు. ఊరి పెరటిలో... తులసి మొక్క... సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి! వీరికి 60 ఏళ్ళు... వీరి పరంపరకు వెయ్యేళ్ళు... వీరి స్ఫూర్తి... పదికాలాలు విరాజిల్లు!! - రామ్, ఎడిటర్, ఫీచర్స్ నమస్కారం స్వామీజీ! మీకు 60 వత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తిరునక్షత్ర మహోత్సవం చేస్తామని భక్తులు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏమనిపించింది? (సాలోచనగా ఆగి... దేహం వంక చూపిస్తూ) 60 ఏళ్ళనేది ఈ శరీరానికి గడిచాయని అంటున్నారు. నిజానికి, సన్న్యాసికి శారీరకమైన జన్మ, వయస్సు ఉండవు. సన్న్యాసం స్వీకరించినప్పటి నుంచి మరుజన్మ కిందే లెక్క. అయితే, భక్తులు ప్రేమగా చేసుకుంటామని అన్నప్పుడు కాదనడానికి మనమెవరం! అయితే ఏదైనా ఘనకార్యం సాధిస్తే, అప్పుడు ఆ ఘనకార్యానికి ఉత్సవం చేసుకోవచ్చు. అలాంటివి ఏం చేశామని! గడచిన 36 ఏళ్ళ పైచిలుకు సన్న్యాసాశ్రమ ప్రస్థానంలో అంధులకు విద్యాలయాలు, వేద పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజన విద్యాలయాల లాంటివెన్నో ఏర్పాటు చేశారు కదా! (చిరు దరహాసంతో...) అవును. కానీ, సమాజానికి చేయాల్సినది ఇంకా ఎంతో ఉంది! విదేశాలకు వెళ్ళి, వేదధర్మాన్ని ప్రచారం చేసిన తొలి జీయర్ కూడా మీరే! విదేశాలకు వెళ్ళడమే తప్పు అనుకొనే సంప్రదాయంలో అంతటి సాహసం ఎలా చేశారు? విదేశాల్లో భారతీయ ధర్మ ప్రచారానికి వెళ్ళడం వెనుక ఒక దైవికమైన ఘటన ఉంది. 1992లో, 1993లో కూడా ధర్మప్రచారానికి నన్ను విదేశాలకు రమ్మని అడిగారు. కానీ, మేము రామని చెప్పాము. 1993లో ఒక సన్నివేశం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏడాది దీపావళి వేడుక తరువాత అర్ధరాత్రి విజయవాడ దగ్గర సీతానగరంలోని మా ఆశ్రమం నుంచి మేము ఆరాధించే కోదండ రామస్వామి విగ్రహాలు చోరీ అయ్యాయి. మూడు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రాహారాలు లేవు. ఆ రాత్రి అక్కడ బీట్‌లో ఉన్న కోటేశ్వరరావు అనే ఎస్.ఐ. ఇదంతా చూసి, ‘దేవుడి విగ్రహాలు దొరికే వరకు కట్టుకున్న దుస్తులు కూడా మార్చను’ అని దీక్ష పట్టారు. నాలుగో రోజున దొంగల్ని పట్టుకున్నారు. విగ్రహాలు సాధించారు. మాకు ఆ సమాచారమిచ్చారు. అయిదో రోజున విగ్రహాలు రావడంతో, వెయ్యి కలశాలతో మా స్వామికి అభిషేకం చేసి, ఆరాధించాం. అప్పటి నుంచి ప్రతి ఏటా దానికి గుర్తుగా మా ఆరాధ్యదైవమైన కోదండరామ స్వామికి ‘సహస్ర కలశాభిషేకం’ చేస్తున్నాం. ఇవాళ్టికీ కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా, ఆ రోజున ఆ కార్యక్రమానికి వస్తారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారి. ఆయన వచ్చాక, ఆయన చేతులకు తాకించి కానీ, ఆ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టం. ఈ విగ్రహాల చోరీ వ్యవహారం జరిగాక, సాక్షాత్తూ స్వామే ఎలాగూ బయటకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, మనమే స్వయంగా తీసుకొని ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది. అది స్వామి ఆదేశంగా భావించి, అప్పటి నుంచి ధర్మప్రచారం కోసం విదేశాలకు వెళ్ళి వస్తున్నాం. సంపన్న అమెరికా నుంచి, వర్ధమాన భారతం దాకా ప్రపంచమంతా తిరిగారు కదా! అన్నిచోట్లా సమస్యలే! అన్నిచోట్లా అశాంతే! కారణం ఏమిటంటారు? ఇవాళ శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు... ఒకటి- ఉగ్రవాదం, రెండు - ఆర్థిక అసమానతలు. రెండూ అశాంతికి దారి తీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తొలగించాలంటే, వ్యక్తుల్లో విద్యను పెంచాలి. దిగువ వర్గాల వారు కూడా ఉన్నత వర్గాల వారితో పోటీపడేలా, వారిలో నైపుణ్యం పెంచాలి. అవకాశాలు కల్పించాలి. ఇక, ఉగ్రవాదాన్ని తగ్గించడానికి శాసనాలు, ప్రేమతత్త్వం రెండే మార్గాలు. చాలాదేశాల్లో కఠిన శాసనాలున్నాయి. కానీ, మన దేశంలో ఉన్న శాసనాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దాలి. మరోపక్క వ్యక్తిలో తోటివారి పట్ల ప్రేమను పెంచాలి. మనమంతా సహోదరులమనే భావన కలిగించాలి. అలాంటి భావన ఇవ్వగలిగింది మన వైదిక వాఙ్మయం. ఇతర మతాల్లో, వారి గ్రంథాల్లో కూడా ఆ భావన ఉంది. కానీ వాటిని బోధించడంలో, ఆచరించడంలో వస్తున్న తప్పులు, తేడాల వల్ల కొన్నిసార్లు ఉపద్రవం సంభవిస్తోంది. కానీ, హిందూ ధర్మంలోనూ రకరకాల శాఖలు, రూపాలు ఉన్నాయిగా!? మన ‘భగవద్గీత’ మొదలైన గ్రంథాలేవీ, ‘దైవాన్ని ఇలానే నమ్మాలి, ఇలానే పూజించాలి’ అని కట్టడి చేయడం లేదు. పరస్పర విద్వేషం చెప్పడం లేదు. భగవద్గీతలోనే పరమాత్మ ‘యాన్తి దేవవ్రతో దేవాన్...’ అని చెప్పాడు. ‘నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలో కనిపిస్తాను’ అన్నాడు. కాబట్టి ఎన్ని రూపాలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నా దేవుడు ఒక్కడే! ఎవడు ఏ విధానంలో ఆరాధన చేసినా, ఫలితం పొంది తీరతాడు. మతమార్పిడి తప్పు. అందుకే, మేము ‘స్వీయ ఆరాధన... సర్వ ఆదరణ’ అని మేము చెబుతాం. వివరంగా చెప్పాలంటే, ‘నీ మతాన్ని నువ్వు ఆరాధించు. నీది కానిదేదో దాన్ని గౌరవించు, ఆదరించు!’ మన భారతదేశానికి ఇదే జీవనాడి. మన రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛనిచ్చింది కదా! మతస్వేచ్ఛ నిచ్చింది. పరస్పరం గౌరవాదరాలతో బతకాలనే చెప్పింది. కానీ, అమలుపరచడం దగ్గరకొచ్చే సరికే సమస్యలు. కొన్ని వేల ఏళ్ళుగా మన పక్కనే ఏ ఆలయం ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి ఉన్నా, గౌరవించి, ఆదరించిన సంస్కృతి మనది. కానీ, ఇప్పుడు కొందరు తమ మతగ్రంథాల సారాన్ని తప్పుగా బోధించడం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించం కానీ, ఈ పౌరసత్వం, ఇక్కడి హక్కులు అన్నీ కావాలంటే ఎలా? మనం ముందు భారతీయులం... ఆ తరువాతే ఏమైనా! ప్రపంచంలోని ఈ సమకాలీన విషయాలు మీకెలా తెలుస్తుంటాయి? ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అవి చూసే భక్తులున్నారు. చెబుతుంటారు. మీరు కూడా టెక్నాలజీనీ, ల్యాప్‌టాప్ లాంటివి బాగా వాడతారట? (నవ్వుతూ... తల పంకించారు...) సైన్సు, మతం పరస్పర భిన్నమైనవనే వాదన గురించి ఏమంటారు? నిరూపణ జరిగిన సిద్ధాంతాలన్నీ సైన్స్ అయితే, నిరూపణ కానివి ఫిలాసఫీ అని అని కదా ప్రసిద్ధి (నవ్వులు...). అయితే, సైన్స్‌కు అందని నిజాలు చాలానే ఉన్నాయి. సైన్స్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటివి మీరు ఒప్పుకోరని విన్నాం! పరిణామం అనేది అనివార్యం. కానీ, (నవ్వుతూ...) వాళ్ళు చెప్పే పద్ధతిలో పరిణామ సిద్ధాంతాన్ని మేము అంగీకరించం. చూడండి. మనం గింజ వేస్తే దాని నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లతో చెట్టు వస్తోంది. అది పరిణామం. కానీ, ఆ గింజలో లేని ఆకు, వేరు, పువ్వు, పండు రావడం లేదు కదా! ఆ గింజలోనే అవన్నీ సూక్ష్మరూపంలో ఉన్నాయి. పరిణామంలో అవి పైకి కనిపించాయి. అంతే! సూక్ష్మరూపంలో లేనిది స్థూలరూపంలోకి రాదు. మీరు ఒకప్పుడు దైవాన్ని కూడా ఒప్పుకొనేవారు కాదట! మరి, అటు నుంచి ఇటు వైపు ప్రయాణం... (నవ్వేస్తూ...) చిన్నప్పుడు అవకాశమున్న పుస్తకమల్లా చదివేవాళ్ళం. ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ లాంటి వాటిల్లో వచ్చే సీరియల్స్ కాగితాలు చించి, కుట్టుకొని, బైండ్ చేయించుకొని సేకరించిపెట్టేవాళ్ళం. అలా చాలా కథలు చదివాం. ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ లాంటి అనువాద సాహిత్యం చాలా చదివాం. అలా చదివిన సాహిత్యంతో లోలోపల అనేక ప్రశ్నలు వస్తుండేవి. వాటికి సమాధానాల కోసం అన్వేషిస్తుండేవాళ్ళం. అవన్నీ మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు వచ్చాక, తీరాయి. తెనాలి దగ్గర నడిగడ్డపాలెంలో గురువులు గోపాలాచార్యుల వద్ద మాకు వేదాంత గ్రంథాల బోధన జరిగింది. గోపాలాచార్యులు, మా పెద్ద స్వామి వారు సహాధ్యాయులు. కలసి వేదాంత ప్రచారం చేశారు. స్వామి వారు ఊరూరా తిరుగుతూ క్రతువులు చేస్తుంటే, గోపాలాచార్యుల వారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో ఉంటూ, అందరికీ వేదాంత శిక్షణనిచ్చేవారు. మేమూ అక్కడ కొన్నాళ్ళు ఉండి, అవి అధ్యయనం చేశాం. అలా పూర్తిగా ఇటువైపు వచ్చాం. స్వామీజీ! ఒకప్పుడు మీలో మార్క్సిస్టు భావాలుండేవనీ, ఆ పుస్తకాలు చదివేవారనీ... (మళ్ళీ నవ్వేస్తూ...) అవన్నీ ఒకప్పటి సంగతులు. ఇప్పటికీ సమాజసేవ, దిగువ వర్గాల అభ్యున్నతి లాంటి విషయాల్లో మీది వామపక్ష భావజాలమేనేమో... (నవ్వులు...) సమాజం మన శరీరం లాంటిది. ఇందులో ఏ అంగం ఎక్కువ, ఏది తక్కువ అంటే ఏం చెబుతాం! సమాజంలో అన్ని వర్గాలూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒకరు, మరొకరిని అణచివేస్తానంటే ఎలా? అదే సమయంలో అందరూ పనిచేయాలి. చేసేవాడు చేస్తూ ఉంటే, తిని కూర్చొనేవాడు కూర్చుంటానంటే కుదరదు. పనిచేయడానికి బద్ధకించేవాణ్ణి పనిచేసేవాడిగా మార్చాలి. అందుకని ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంపొందింపజేయాలి. ఉన్నత వర్గాలతో పోటీ పడేలా దిగువ వర్గాలకీ అవకాశం కల్పించాలి. వారిని తీర్చిదిద్దాలి. దీన్ని కేవలం వామపక్షం, వామభావజాలం అంటే ఎలా? నిజానికి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం అంటాను. అయితే, అదే సమయంలో - నైపుణ్యం లేకపోయినా 20 మార్కులతో పాస్ అయిన వ్యక్తిని విమానానికి పైలట్‌గానో, అల్లోపతి డాక్టర్‌గానో పెడితే... వాట్ హ్యాపెన్స్ టు ది క్వాలిటీ ఆఫ్ దిస్ కంట్రీ? మొత్తం సమాజమే నష్టపోతుంది. అసమర్థుడైన వ్యక్తిని ఆపరేషన్‌కి డాక్టర్‌గా పంపిస్తే ఏమవుతుందో ఊహించుకోండి! అన్నట్లు... మీరు కూడా మంచి వైద్యులట! మంచి మందులిస్తారట! (నవ్వేస్తూ...) హోమియో వైద్యం నేర్చుకుంటున్నా. మందులు ఇస్తుంటా. మీ తాత గారు, తండ్రి గారిలా వైద్యవిద్య వంశపారంపర్యంగా వచ్చినట్లుందే! పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. ఇక మాకు జన్మనిచ్చిన తండ్రి గారు ఆ రోజుల్లోనే చెన్నైలో చదువుకొన్న ఎల్.ఐ.ఎం (లెసైన్స్డ్ ఇండియన్ మెడిసిన్) డాక్టర్. ఇద్దరూ వైద్యంలో దిట్టలే! కానీ, ఇవాళ మనం డాలర్ల జబ్బును రూపాయలిచ్చి కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఖరీదై, అల్లోపతి వైద్యం సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో అది మాత్రమే పద్ధతి కాదు, ఇంకో పద్ధతి ఉందంటూ వచ్చిన హోమియోపతి మంచి ప్రత్యామ్నాయం. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశ పరిస్థితికి శ్రమ, ఖర్చు తక్కువైన ఈ వైద్యవిధానం బాగా సరిపోతుంది. రోగి లక్షణాలు సరిగ్గా తెలుసుకొని ఔషధమిచ్చే మంచి వైద్యుడుంటే మందు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నవారు లేకపోలేదు. అందుకనే, అందరికీ ఈ వైద్యం అందుబాటులోకి రావాలని ‘ఇంటిగ్రేటివ్ సిస్టమ్’లో మా శంషాబాద్ ఆశ్రమంలో ‘జిమ్స్’ హోమియో కాలేజ్, ఆసుపత్రి నడుపుతున్నాం. అంటే, ఇటు ప్రజల శారీరక ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికతతో మానసిక ఆరోగ్యం రెండూ మీరు చూస్తున్నారన్న మాట! (నవ్వుతూ...) అంతే అనుకోవచ్చు! కానీ, సన్న్యాసంలో ఉంటూ సామాజిక సంస్కరణ, సముద్ధరణ చేయడమెలా వచ్చింది? వెయ్యేళ్ళ క్రితం రామానుజాచార్యులూ ఇదే చేశారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక నాయకులే కాదు. ఆ రోజుల్లోనే అందరి మోక్షం కోసం గోపురమెక్కి, ‘తిరుమంత్రం’ ఎలుగెత్తి చాటిన సామాజిక సంస్కర్త. ఆయన స్ఫూర్తితో వచ్చిన మా పెద్ద స్వామి వారైతే స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం పోరాడారు. ఆ రోజుల్లోనే ప్రజల బాగు కోసం గ్రామాలు పట్టుకు తిరిగారు. సొంత భూములు హరిజనులకిచ్చి, వారి ఉద్ధరణకు కృషి చేశారు. స్త్రీలు ఘోషాలో ఉండే ఆ రోజుల్లోనే భార్యకు రాట్నం మీద నూలు వడకడం నేర్పించి, ఆ నూలు దుస్తులు భుజాన వేసుకొని, ఊరూరా పంపిణీ చేసేవారు. దుర్భిక్ష సమయంలో పొలాల్లో తిరిగి, ఎకరానికి ఒక కట్ట చొప్పున గ్రాసం తీసుకొని, పశువులకు మేత పెట్టేవారు. సన్న్యాసాశ్రమం స్వీకరించాక కూడా ఆయన సామాజిక ఉద్ధరణ మార్గంలోనే వెళ్ళారు. మాది కూడా ఆ బాటే! ఇన్నేళ్ళ ఈ బాటలో... ఈ షష్ట్యబ్ది పూర్తివేళ మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులంటే..? (ఆసనంలో ఒక్కసారి వెనక్కి వాలి... దీర్ఘంగా శ్వాస విడుస్తూ...) చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు, మా పెద్ద స్వామి వారు, మేము ఈ స్థితికి చేరడానికి కారణమైన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు, తీర్చిదిద్దిన వ్యక్తులు, కలసి ప్రయాణించిన, ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజమహేంద్రిలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ‘నారాయణా! నువ్వు తెలివిగలవాడివి. నీకు పాతికకి పాతిక మార్కులు వేస్తే, కొమ్ములొస్తాయిరా’ అంటూ, అంతా సరిగ్గా రాసినా లెక్కల్లో కూడా ఇరవై అయిదుకి ఇరవై నాలుగున్నర మార్కులే వేసిన మా మాస్టారిని స్మరించుకోవాలి. ‘ప్రపంచం గురించి చెప్పి, ఇలా ఉండాలి సుమా’ అని చెప్పిన మార్క్సిస్టు మిత్రులున్నారు. చిన్నప్పటి నుంచి మాలో ఒక క్రమశిక్షణ నేర్పిన రామచంద్ర అనే ఆర్.ఎస్.ఎస్. కుర్రాడు ఉన్నాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జీవితమంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన అనుభవాలున్నాయి. ఇలా ఎందరో, ఎన్నెన్నో! ఆ పూర్వాశ్రమ జీవితంలో ఎదురైన అనుభవాల వివరాలు ఏమైనా...! అప్పట్లో మేము సికింద్రాబాద్‌లో క్యారవాన్ దగ్గర ఉండేవాళ్ళం. కోఠీ వైపు వెళ్ళాలి. పురానాపూల్, అఫ్జల్‌గంజ్, ఘోషామహల్ పక్క నుంచి వెళుతుండేవాళ్ళం. పైసా.. పైసాకి కష్టపడుతూ, కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తే! ఒకసారి కష్టపడి ఒక సైకిల్ కొనుక్కున్నాం. కానీ, కొన్న మూడో రోజునే దాన్ని ఎవరో పట్టుకుపోయారు. అదంతా జీవితంలో ఒక దశ. సామాన్య ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూశాం, అనుభవించాం. మరి, ఆధ్యాత్మిక విద్యకు ముందు అప్పట్లో మీరు చదివిన లౌకికమైన చదువులు... ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ చదివాం. ఆ తర్వాత పై చదువుల కోసం ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చేది. పరీక్షలకు హాజరు కాలేకపోయాం. టైప్, షార్ట్‌హ్యాండ్‌ల్లో హయ్యర్ పాసయ్యాం. మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు చేరినప్పుడు ‘ఆలయాల జీర్ణోద్ధరణ కమిటీ’ తరఫున మేము అన్ని రకాల క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళం. లెక్కలు, స్టేట్మెంట్స్ తయారుచేసేవాళ్ళం. స్వామి వారి దగ్గరకు వచ్చాక అంతకు ముందు మాకున్న అనేక సందేహాలు తీరాయి. మళ్ళీ మా మనసు మారకుండా ఉండడం కోసం మా సర్టిఫికెట్లన్నీ మేమే చింపేశాం. మీరు అమెరికన్ యాసలో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. రష్యన్ కూడా నేర్చుకున్నారట! (నవ్వుతూ...) పూర్వాశ్రమంలో హైదరాబాద్‌లోనే ‘సీఫెల్’ (ఇప్పటి ‘ఇఫ్లూ’)లో సరదా కోసం చదివాం. కానీ, ఆశ్రమజీవితంలోకి వచ్చినప్పుడు ఆ కఠోర దీక్ష, క్లిష్టమైన వేదాంత విద్య ఎలా అలవడ్డాయి? ఒక రకంగా నన్ను మా పెద్ద స్వామి వారి పాదాల దగ్గరకు చేర్చింది మా తల్లి గారే! ‘నీకు ఏది మంచిదో వారు నిర్ణయిస్తారు’ అన్న ఆమె మాట! భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి అనుకున్నది ఎలాగైనా పూర్తి చెయ్యాలనే మనస్తత్త్వం, పట్టుదల అలవడ్డాయి. అప్పట్లో ఒకసారి పెద్ద స్వామి వారి క్రతువు కోసం కొన్ని మూర్తులు అవసరమయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి, అందించి వచ్చే పని నాకు అప్పగించారు. తీరా నేను బయల్దేరితే రైలు మిస్సయింది. బస్సు మిస్సయింది. కానీ, ఆయనకు అవి ఇచ్చే రావాలి తప్ప, ఇంటికి వెనక్కి రాకూడదనే పట్టుదల నాది. అప్పటికి ఈ తరం పిల్లల్లాంటి లోకజ్ఞానం కూడా లేని పల్లెటూరి బైతులం మేము. అయినా సరే, సామర్లకోట దాకా బండిలో, తరువాత మరో వాహనంలో, ఆ పైన నడక... ఇలా ఎట్టకేలకు తెల్లవారు జామున పెద్ద స్వామి వద్దకు చేరాం. అనుకున్న ముహూర్తానికి అన్నీ సక్రమంగా అందించగలిగాం. ఆ తరువాత ఈ ఆశ్రమజీవితంలోకి వస్తున్నప్పుడు కూడా వేద, వేదాంత విద్యల అధ్యయనంలోనూ అదే పట్టుదల. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో చుండూరు ఘటన, తిరుమలలో వెయ్యికాళ్ళ మండపం లాంటి కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలపై వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు ఏమనిపించేది? అప్పట్లో చుండూరు ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి చెప్పడానికే మాట్లాడాను. ఇతరులు చాలామంది, చివరకు మీడియా కూడా వెనుకంజ వేస్తుంటే, చుండూరులో జరిగింది కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాదు... అది మతసంబంధమైన ఘర్షణ కూడా అని వాస్తవం చెప్పాం. అప్పట్లో ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ విలేఖరి వచ్చి, నాతో అన్నీ మాట్లాడారు. కానీ, పత్రికలో మాత్రం వాస్తవాన్ని కాస్తంత దాచిపెడుతూనే రాశారు. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ధైర్యం చేయలేదు. కానీ, మేము మాత్రం సత్యమే చెప్పాను. చివరకు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం విషయంలో కూడా! మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. క్రమాన్నీ, ధర్మాన్నీ తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, మనం మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మిగతావాళ్ళకు సాహసం లేదు. మేము విమర్శల్ని పట్టించుకోకుండా, వాస్తవం మాట్లాడాల్సిన కర్తవ్యం నిర్వర్తించాం. అంతే! సమాజోద్ధరణ ధ్యేయమైన మీ లాంటి కొందరిని మినహాయిస్తే, ఇవాళ అసలు ‘గాడ్’ కన్నా‘గాడ్మన్’ల హవా ఎక్కువైందని ఒక విమర్శ! నిజమే. దానికి కారణం - దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన ప్రక్రియ లేకుండా కొందరు ఒక స్థానంలో కూర్చోవడమే! అధ్యయనం లేకుండానే ఒక పీఠంపై కూర్చొన్నప్పుడు, వేలమంది వచ్చి మొక్కుతూ ఉంటే, తెలియని ఉద్ధతి, గర్వం వస్తాయి. మనకు తెలియకుండానే రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు - ఇలా కొమ్ములు మొలుస్తాయి. అందుకే, ఎప్పుడూ అవి లేకుండా, రాకుండా అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట! ఒకసారి ఆ గర్వం వస్తే అందరూ మన మాటే వినాలనుకుంటాం. కాదని ఎవరైనా అంటే, వారి మీద కసి, కోపం పెరుగుతాయి. దాంతో, ఏదో అంటాం. ఇవన్నీ అధ్యయనం, వినయం లేకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు. రోజూ తెల్లవారు జాము నుంచి రాత్రి దాకా మానవ సేవ, మాధవ సేవ, భక్తజనం మధ్య ఉండడంతో, మాకైనా అధ్యయనానికి తీరిక దొరకదు. కానీ, అధ్యయనం చేయాలి. మానకూడదు. వేదకాలం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఇవాళ్టి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? స్త్రీలను గౌరవించడం మనందరి విధి. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే సమాజానికి క్షేమం. అందుకే, ‘ఉమెన్స్ హెల్త్ కేర్’ అనే ప్రాజెక్ట్ పెట్టాం. ఇవాళ స్త్రీలలో ఎక్కువ మందిని బాధిస్తున్నవి - సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. వీటి పట్ల స్త్రీ మూర్తుల్లో చైతన్యం కలిగిస్తూ, వాళ్ళకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాం. ఇప్పటి దాకా తెలుగు నేలపై 5 లక్షల 25 వేల మందికి ఉచితంగా ఈ స్క్రీనింగ్ చేశాం. ఇక, స్త్రీల ప్రవర్తన విషయానికి వస్తే ఆధునిక తరంలో ధర్మం పట్ల లక్ష్యం తక్కువవుతోంది. తమిళనాడు, ఉత్తరాది లాంటి చోట్ల స్త్రీలలో ధర్మం పట్ల జాగృతి కాస్త ఉన్నా, మన తెలుగు నేలపై ధర్మం పట్ల సుముఖత తగ్గుతున్నట్లుంది. వేదాలు, ఆగమాలు చదివిన పురోహితుల్ని పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు, పిల్లనిచ్చేవారు సిద్ధంగా లేరంటే ఏమనాలి? అందరూ సాఫ్ట్వేర్ వరుల వెంటపడుతున్నారు. నిజానికి, స్త్రీలు ఇవాళ విద్యలో, సహనంలో, కృషిలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి, ఇక వారిలో మనది ఈ జాతి, మనది ఈ ధర్మం, మనది ఈ సంప్రదాయం అనే భావన కలిగించాల్సి ఉంది. అందు కోసం కృషి చేస్తున్నాం. మరోపక్క, స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూసే పురుషులూ ఇవాళ ఎక్కువయ్యారేమో? నిజమే. అది కూడా మన విద్యావిధానంలోని లోపమే. వ్యక్తిని వ్యక్తిగా చూడాల్సిన విజ్ఞత నేర్పాల్సింది విద్యే కదా! కానీ, పిల్లలకు మంచి చెడు చెప్పే తీరిక, మన సంస్కృతి, సంప్రదాయం నేర్పే ఓపిక తల్లితండ్రులకు లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయే సరికి, పిల్లలకు అవన్నీ నేర్పే తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో లేరు. ఎంతసేపూ చదువులు, మార్కుల మీదే శ్రద్ధ. విద్య సంస్కారాన్ని కలిగించాల్సింది పోయి, సంస్కారాన్ని తొలగిస్తోంది! ఇప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఒక తరం నష్టపోయింది. దాని ప్రభావమే స్త్రీల పట్ల చులకన భావం. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పిల్లల్లో మన ధర్మం మీద శ్రద్ధ, రుచి కలిగించాలి. వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. మరి, అందుకు ఏం చేయాలంటారు? పెద్దలకూ, పిల్లలకూ మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియాలి. మన దేశ ఘనచరిత్రకు ప్రతిరూపాలైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలెన్నో ఉన్నాయి. కానీ, జీర్ణోద్ధరణ అనో, సుందరీకరణ అనో పేరు పెట్టి, వాటి రూపాన్ని మార్చకూడదు. శంకరాచార్యులు, రామానుజాచార్యుల కాలం నాటి నిర్మాణాలున్నాయి. వేదవ్యాసుడు తిరుగాడిన బదరికాశ్రమం లాంటివి ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, కొన్ని వేల ఏళ్ళ నాటి మన జాతి చరిత్ర తెలిసి, మనకు పెద్ద అండ వచ్చినట్లవుతుంది. మన దేశాన్నీ, శ్రీలంకనూ కలుపుతూ సముద్రంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన ‘నల సేతు’ ఇప్పటికీ ఉందని ‘నాసా’ వారి ఉపగ్రహ ఫోటోలు చూపిస్తున్నాయి. ఇవాళ్టికీ దర్భశయనం దగ్గరకు వెళితే 6 అడుగుల లోపల నీటిలో ఆ సేతువు రూపం కనిపిస్తుంది. మేము చూశాం. రామాయణ కాలం నాటి ఆ వారధిని కాపాడుకొంటే, మనం అక్కడకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి మానసికంగా వెళతాం. మనలో హనుమంతుడి అంత శక్తి వస్తుంది. ఇంత చరిత్ర, వారసత్వం ప్రపంచంలో మన భారత జాతికి తప్ప మరొకరికి లేదు. జనంలో ఈ చైతన్యం తేవాలి. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేళ మీరు చేపట్టిన ‘సమతామూర్తి స్ఫూర్తికేంద్రం’ అలాంటిదేనా? అవును. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసిన భగవద్ రామానుజాచార్యులు 1017లో జన్మించి, 120 ఏళ్ళు కృషి చేశారు. ఆయన కేవలం మతాచార్యులే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఆయన సహస్రాబ్ది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ‘జీయర్ ఇన్టిగ్రేటెడ్ వేదిక్ అకాడెమీ’ (జీవా)కు అనుబంధంగా 45 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తై రామానుజాచార్యుల వారి పంచలోహ మూర్తి నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే 2017లో ఈ పాటి కల్లా దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం. ఇంకా, 108 దివ్యదేశాలు, వైదిక ధర్మ ప్రదర్శనశాలల నిర్మాణం కూడా చేస్తాం. విజయవాడ, సీతానగరం దగ్గర కొండ మీద 108 అడుగుల మరో భారీ విగ్రహం పెట్టాలని కూడా యోచన. అంతా భగవత్ సంకల్పం! ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు తృప్తినిచ్చిన విషయం? ఇవాళ్టికీ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళకు ఏదైనా చెబితే చక్కగా వింటారు. అర్థం చేసుకుంటారు. ఆచరిస్తారు. అలా గ్రామ గ్రామానికీ వెళ్ళి, మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ, సమాజ ఉద్ధరణకు పాల్పడడం బాగుంటుంది. మరి, మీరింకా చేయాలని అనుకుంటున్నవి? మనం చేయగలిగినవి, చేయాల్సినవి, జరగాల్సినవి (చేతులు చాచి చూపిస్తూ...) బోలెడన్ని ఉన్నాయి! ఇప్పటి దాకా చేసింది కేవలం సముద్రంలో నీటిబొట్టే! చివరిగా, ఈ దీపావళి పండుగ వేళ ప్రజలకు మీరిచ్చే సందేశం? ఇవాళ చుట్టుపక్కల నుంచి దేశానికి అభద్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సరైన చర్యలు చేపట్టే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రకంగా ప్రజలకు అదృష్టకాలం వచ్చింది. ప్రజలంతా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి మన సైనిక సంక్షేమ నిధికి ఇచ్చినా, అది కొన్ని వందల కోట్ల నిధిగా మారి, దేశ భద్రతకు పనికొస్తుంది. దేశానికి నిప్పు పెట్టే స్థితి కొంతైనా అడ్డుకుంటాం. ఈ ఉద్యమంలో కుల, మత, జాతి విచక్షణ లేకుండా భారతీయులందరూ పాల్గొనాలి. ఒక భారతీయ హిందువుగా, ఒక భారతీయ ముసల్మానుగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరం మన భారతదేశ భద్రతకు తోడ్పడాలి. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరివి ఏమైనా, భారతదేశమనే ఈ గృహరక్షణ మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. దానికోసం సమాయత్తం కావాల్సిన సమయం ఇదే. అది చేయడమే నిజంగా మనకు దీపావళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
శాంతి, సామరస్యాల కోసం ప్రార్థించాలి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొల్పడానికి అల్లాహ్‌ను ప్రార్థించాలని నగరానికి చెందిన అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం సంస్థ సభ్యులు సూచించారు. మంగళవారం స్థానిక ఆ సంస్థ కార్యాలయంలో నగరం నుంచి హజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలను సత్కరించారు. మక్కాకు వెళ్లి అక్కడి ఆచార, సంప్రదాయాల ప్రకారం నడుచుకుని నగరం సుభిక్షంగా ఉండేలా అల్లాహ్‌ను వేడుకోవాలని ముహాఫిజల్ కోరారు. హజ్ యాత్రలో అనుసరించాల్సిన విధానాలను మతపెద్దలు వివరించారు. ఏలూరు నగరం, పరిసర ప్రాంతాల నుంచి ఈ ఏడాది పది మంది హజ్ యాత్రకు వెళుతున్నారు. అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎం అక్బర్, ఎండీ సాధిక్, ఉపాధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్, జాయింట్ సెక్రటరీలు అబ్దుల్ రహమాన్ ఖురేషీ, ఎండీ బహబూబ్ పాషా, కోశాధికారి ఎండీ సులేమాన్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
పూజల పేరుతో పాములను హింసించొద్దు
ప్రజలకు అటవీ శాఖ, స్వచ్ఛంద సంస్థల పిలుపు హైదరాబాద్: నాగుల పంచమి సందర్భంగా పాములను పూజ పేరుతో హింసించవద్దని అటవీ శాఖతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలను కోరాయి. పాములను హింసించడం నేరమని, చట్టప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బుధవారం అరణ్య భవన్లో అదనపు పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఓఎస్డీ (వైల్డ్ లైఫ్) శంకరన్ పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి విలేకరులతో మాట్లాడారు. నాగుల పంచమి నాడు పాములకు పాలు, గుడ్లు పెట్టాలని ప్రయత్నిస్తూ హింసకు గురిచేస్తున్నారని.. పాములు పాలు తాగవని, గుడ్లు మింగవని గుర్తుంచుకోవాలని కోరారు. బలవంతంగా పాలు తాగించడం వల్ల పాముల ప్రాణాలకు ప్రమాదమని, పసుపు, కుంకుమలతో చేసే పూజల వల్ల వాటి కళ్లు కనిపించకుండా పోతాయని తెలిపారు. ప్రజల సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు బుట్టల్లో పాములను తీసుకుని ఇంటింటికి తిరుగుతారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా పాములను బంధిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు ఫిర్యాదు చేయాలని కోరారు. 270 రకాల పాముల్లో కేవలం నాలుగు మాత్రమే ప్రమాదకరమని, అన్ని పాములను చంపకూడదని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఫ్రెండ్స్ ఆఫ్స్నేక్ సొసైటీ తరఫున అవినాశ్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నుంచి సంయుక్తలతో పాటు బ్లూక్రాస్, పీపుల్ ఫర్ యానిమల్స్, హ్యూమన్ సొసైటీ, టైగర్ కన్సర్వేషన్ సొసైటీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆ ఆలయంలో పురుషులకే అనుమతి
కేకే.నగర్: వాళపాడిలోని ప్రసిద్ధి చెందిన మునియప్పన్ ఆలయంలో పురుషులు మాత్రమే పూజలు చేస్తారు. ఈ సంప్రదాయం దాదాపు 300 సంవత్సరాలుగా కొనసాగుతోంది. సేలం జిల్లా వాళపాడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని సింగిపురం కాలనీ అటవీ ప్రాంతంలో మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన అంజలాన్‌కుట్టై మునియప్పన్ ఆలయం ఉంది. ఇక్కడి మూలవిరాట్‌కు ఉత్తర దిశలో సుడాముని, వాయుముని, సెమ్ముని అనే రాక్షస స్వాముల విగ్రహాలుంటాయి. మనుషులు సంచారం లేని దట్టమైన కీకారణ్యంలో ఈ ఆలయం నెలకొంది. రాత్రి సమయాల్లో జోస్యం చెప్పే బుడబుక్కల వాళ్లు బసచేసి మంత్ర శక్తిని పొందుతారని వారి కోసం ముని అక్కడ తిరుగుతూ ఉంటాడని, అందువల్ల స్త్రీల అనుమతికి పెద్దలు నిషేధం విధించినట్లు చెప్పుకుంటారు. ఈ కారణంగా గత 300ల సంవత్సరాలుగా ఈ ఆలయంలో పురుషులు పొంగళ్లు వండి స్వామికి నైవేద్యం పెడతారు. మొక్కుబడుల్లో భాగంగా కోడి, మేకలను బలి ఇచ్చి వాటిని ఆలయ ప్రాంగణంలోనే వండి స్వామికి నైవేద్యం పెడతారు. ఆ ప్రసాదాన్ని స్త్రీలు తినరాదు. ఆలయంలోని స్వామి విబూదిని కూడా స్త్రీలు పెట్టుకోకూడదు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో వాళప్పాడి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారే కాకుండా సేలం, నామక్కల్ జిల్లాల నుంచి భక్తులు ఈ ఆలయంలో దైవదర్శనం, మొక్కుబడులు తీర్చుకోవడానికి రావడంతో ఆలయం భక్తులతో కళకళలాడుతోంది. -
యువతిని కిడ్నాప్ చేసిన పూజారి అరెస్ట్
పూజల పేరుతో పరిచయం పెదకాకాని : పూజల పేరుతో యువతికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పెదకాకాని శివాలయంలో చదలవాడ కిషన్‌కుమార్ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెను వెంట బెట్టుకుని ఆలయానికి పూజల కోసం వెళుతుండేది. ఈ క్రమంలో పరిచయమైన కిషన్ కుమార్ అలియాస్ కిషోర్ పూజా కార్యక్రమాల పేరుతో మహిళతో పరిచయం పెంచుకుని ఇంటికి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తెకు మాయ మాటలు చెప్పి ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి తీసుకువెళ్ళాడు. అదే రోజు రాత్రి మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్నామంటూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే, పూజారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో మాయమాటలు చెప్పి యువతిని కిడ్నాప్ చేసిన కేసులో కిషన్‌కుమార్‌ను మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచినట్లు సీఐ సీహెచ్ చంద్రమౌళి తెలిపారు. నిందితుడికి 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. -
గోటితో పోలేదు...
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? రాలవు. మరేం రాలతాయి? ప్రాణాలు! మారణాయుధం... టార్గెట్‌ని మాత్రమే కొడుతుంది. మంత్రగాడి మాట ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలీదు. వాళ్లంటాడు... వీళ్లంటాడు... నలుపంటాడు... ఎరుపంటాడు... జడంటాడు... ముడంటాడు... అంజనం వేసి... ‘అదిగో చూడు’ అంటాడు. మూర్ఖుడి చేతిలో రాయీ... మంత్రగాడి నోటి మాటా... రెండూ ఒకటే. ఎవరి ప్రాణాలు రాలిపడతాయో చెప్పలేం. పాపం... ఇక్కడైతే... ఒక కుటుంబం కుటుంబమే రాలిపోయింది! చుక్కలో ఏం కనిపిస్తోంది?’’ - మాంత్రికుడు. ‘‘ఒక ఛాయగా ఉంది. ఏంటో తెలియడం లేదు’’ అయోమయంగా చూస్తోంది సరోజనమ్మ. ‘‘అది మనిషి నీడ కావచ్చేమో బాగా చూసి చెప్పు’’ ‘‘అవును, మనిషే’’ అన్నది సరోజనమ్మ. ‘‘ఆడా?మగా?’’ ‘‘ఆడమనిషి’’ ‘‘ఏం చేస్తోంది?’’ ‘‘ఏదో నూరుతోంది. పచ్చడేమో!’’ ‘‘ఆమె ఎక్కడ ఉంది?’’ ‘‘ఇంటి పెరట్లో’’ ‘‘అదెవరిల్లు?’’ ‘‘ఏమో... మా పెరడులాగానే ఉంది’’ ‘‘ఆమె ఏ రంగు దుస్తులు ధరించింది?’’ ‘‘నల్లచీరకు ఆకుపచ్చ అంచు, ఎర్ర రవికె’’ క్లూ ఏదో దొరికినట్లు తలపంకించాడు మంత్రగాడు. ‘ఎంత ఎత్తు ఉంది?’’ ‘‘నాకంటే ఎత్తుగా... పక్క వీధి రంగమ్మ ఎత్తు’’ ‘‘జుట్టు ముడి వేసుకుని ఉందా, జడ వేసుకుందా?’’ ‘‘ముడి వేసుకుని ఉంది’’ ‘‘రంగమ్మది జడా!, ముడి వేసుకుంటుందా?’’ ‘‘రంగమ్మ ముడేసుకుంటుంది’’ ‘‘బాగా చూడు... ఆమె రంగమ్మలాగానే ఉందా?’’ చెప్పలేకపోతోంది సరోజనమ్మ. సందిగ్దతతో కుడిచేతి బొటన వేలి మీద రాసిన అంజనం వైపే చూస్తోంది. మరికొంత అంజనం తీసుకుని ఆమె గోరు మీద రాశాడు మాంత్రికుడు. చిక్కగా నల్లగా కంటికి పెట్టుకునే కాటుకలా ఉంది అంజనం. అంజనం ఉన్న వేలిని పట్టుకున్నాడు మాంత్రికుడు. ‘‘కన్నార్పకుండా చూడు నీకంతా తెలుస్తోంది. నీ మీద చేతబడి చేసిన వాళ్లను నువ్వే పట్టేస్తున్నావు. మనిషిని గుర్తు పట్టు’’ అంటూ మాటలతో మాయ చేస్తున్నాడు. హిప్నటైజ్ అయినట్లు మగతగా సరోజనమ్మ కళ్లు మూత పడుతున్నాయి. ‘‘ఆమె రంగమ్మేనా చెప్పు’’ ఆమె చెంపల మీద చేత్తో తడుతూ అడుగుతున్నాడు ఆమె భర్త. కావచ్చేమో అనిపిస్తోంది... అవుననడానికి మనసు రావడం లేదు. తల అటూ ఇటుగా ఊపుతూ స్పృహతప్పి పడి పోయింది.మాంత్రికుడు కమండలంలోని నీటిని తీసుకుని మంత్రించి ఆమె మీద చల్లాడు. తన భుజం మీద ఉన్న తుండుతో సరోజనమ్మ ముఖం తుడిచాడు ఆమె భర్త. ఆమెను ఒక పక్కగా చాప మీద పడుకోబెట్టారు. ‘‘చేతబడి జరిగింది’’ నిర్ధారించాడు మాంత్రికుడు. నివ్వెరపోయాడు సరోజనమ్మ భర్త. ‘‘అందుకేనేమో స్వామీ! ఎప్పుడూ పీడకలలే. అర్ధరాత్రి లేచి కూర్చున్నదంటే ఇక నిద్రపోవడానికే భయపడుతుంటుంది. కళ్లు మూసుకుంటే ఎవరో తన చుట్టూ తిరుగుతున్నారని చెబుతోంది’’ అని వాపోయాడు. ‘‘చేతబడి ఎవరు చేశారనేది అమ్మాయి నోటితోనే చెప్పిందిగా’’ లౌక్యంగా పిక్చర్ తెస్తున్నాడు మాంత్రికుడు. ‘‘నా భార్య బతికేదెలా స్వామీ’’ మాంత్రికుని కాళ్లు పట్టుకున్నాడు సరోజనమ్మ భర్త. ‘‘విరుగుడు చేద్దాం’’ సాలోచనగా అన్నట్లుగా మాట జార్చాడు. అంతటితో ఆగక... ‘‘నల్లరంగు దుస్తులు ధరించి మీ ఇంటికి వచ్చిందంటే మీకు కీడు చేయడానికే. అదీ శనివారం రోజున. నీ భార్యకు ఒంట్లో బాగోలేదని, పనిలో సహాయం చేయడం అనే వంకతో వచ్చింది. ఓ మూల చేతబడి చేసిన మిరపకాయలు పెట్టి వెళ్లింది. ఆ మిరపకాయలను శుక్రవారం రోజు మీ ఇంటి నుంచే తీసుకెళ్లింది. మీరెవరూ గమనించలేదు’’ తప్పంతా మీదేనన్నట్లు కలరిచ్చాడు. ‘‘ఇంట్లో మనిషిలాగ తిరిగేది. ఇంత కుట్ర చేసిందా’’ కదిలిపోతున్నాడు సరోజనమ్మ భర్త. ‘‘రంగమ్మ చేతబడి చేసినట్లు నీ భార్యకు చెప్పకు. ఆడవాళ్లు మాట మనసులో దాచుకోలేరు. రేపు రంగమ్మ మీ ఇంటికి రాగానే గొడవపెట్టుకుంటే ఆమె జాగ్రత్తపడుతుంది. చేతబడి సంగతి తెలిసిపోయిందని ఇంకా పెద్ద క్షుద్రపూజ చేయిస్తుంది. అప్పుడు మనం చేసే విరుగుడు పారదు. మనిషిని వారంలో ప్రాణాలు తీసే పూజలున్నాయి. విరుగుడు అయ్యే వరకు రహస్యం’’ ఆదేశిస్తున్నట్లే ఉంది గొంతు. పాలిపోయిన ముఖంతో తలూపాడాయన. సరోజనమ్మ కదలడం కనిపించింది. ఆమెను లేపి నీటిలో విబూది కలిపి తాగించాడు మాంత్రికుడు. మాంత్రికుడి కనుసైగను గమనించిన అనుచరుడు వెంటనే స్పందించాడు. ‘‘గురువు గారు ఆమెకి మంత్రం చెప్తారు. ఎవరూ ఉండకూడదు’’ అంటూ బయటకు దారి తీశాడు. ‘‘తండ్రిలాంటి వాణ్ని. భయపడవద్దు’’ అని ఆమెకి భరోసా ఇచ్చాడు. ఇక విషయంలోకి వచ్చాడు... ‘‘నీకు చేతబడి చేసిందో మహిళ. ఆమె నీ భర్త మీద మనసు పడింది. నిన్ను అడ్డు తొలగించాలని కుట్ర పన్నింది. భర్తను జాగ్రత్త చేసుకో’’ అన్నాడు. మంత్రం వేసినట్లు తలూపింది సరోజనమ్మ. ఇంటికి వచ్చినప్పటి నుంచి సరోజనమ్మ మనసు మనసులో లేదు. భర్త ఎటు వెళ్తున్నా వెయ్యి కళ్లతో కనిపెడుతోంది. ఆమె భర్త మాత్రం చేతబడి విరుగుడు చేయించడానికి వనరులు సమకూర్చుకునే పనిలో ఉన్నాడు. విరుగుడు అంటే చిన్న ఖర్చు కాదు. బియ్యం, నల్ల కోడి కావాలి, మద్యం, డబ్బు... దక్షిణ ఇవ్వాలి. విరుగుడు సామగ్రి కొంటున్నట్లు ఊర్లో ఎవరికీ తెలియకూడదు. తన జాగ్రత్తలో తానున్నాడు. అతడి కదలికలు సరోజనమ్మను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. పుట్టింటి వాళ్లకు కబురు చేసింది. సమాచారం తెలిసిందే తడవుగా నలుగురు అన్నదమ్ములూ, మరిది (చెల్లెలి భర్త) వచ్చి వాలిపోయారు. ఒక రోజు... ఇంకా తెల్లవారనే లేదు. రంగమ్మ ఇంట్లో హాహాకారాలు. దొరికిన వారిని దొరికినట్లు నరికేశారు సరోజనమ్మ సోదరులు, మరిది. రంగమ్మ, ఆమె భర్త, అత్త, మామ, పిల్లలు... అంతా చనిపోయారు. రెండు గంటల్లో మారణహోమం. ఎవరికీ మాట్లాడే అవకాశమే లేదు. మాకు తెలియదు మొర్రో అని మొత్తుకోవాలని ఉన్నా వినే స్థిమితం వచ్చిన ఒక్కరిలోనూ లేదు. అంతా అయిపోయింది. పోలీసులు వచ్చేటప్పటికి హంతకులు పారిపోయారు. ఆ ఇంటికి వచ్చిన చుట్టాలనే చిన్న వివరం తప్ప ఆ ఊర్లో ఎవరికీ హంతకుల ఆనవాళ్లు పెద్దగా తెలియదు. తన బావమరుదులు ఇంతటి దారుణానికి ఒడిగడతారని సరోజనమ్మ భర్తకు కూడా తెలియదు. పోలీసుల విచారణలో విషయాలు బయటకు వచ్చాయి. అయినా మాంత్రికుడిని అరెస్టు చేయడానికి ఆధారం లేదు. మంత్రాలను, క్షుద్రవిద్యలను అరికట్టి తీరాలని జిల్లా కలెక్టరు నుంచి ఆదేశాలు వచ్చాయి. హేతువాద సంఘాల జోక్యంతో అంజనం పేరుతో చేసే మాయ అని తెలిసిన తర్వాత మాంత్రికుడి ఇంటిని సోదా చేశారు. పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా అరెస్టు చేశారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదో రకం ప్రతీకారం ఇలాంటి సంఘటనలు ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్, గంజాం, సుందర్‌గఢ్, రాయగడ ప్రాంతాల్లో ఎక్కువ. సంతాలి, కోహ్లా గిరిజన తెగల్లో విపరీతంగా జరుగుతాయి. ఏడాదికి కనీసం యాభై మంది మహిళలను చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో హతమారుస్తున్నారు. అది కూడా ఒంటరి మహిళల మీద ఈ అరాచకం ఎక్కువ. ఈ కేసులో కూడా రంగమ్మ అనే మహిళను దోషిగా మార్చింది మాంత్రికుడే. అతడి దగ్గర సహాయకురాలిగా పని చేయమని గతంలో అడిగినప్పుడు ఆమె అంగీకరించకపోవడమే ఈ కుట్రకు అసలు కారణం. (ఈ కథనంలో వ్యక్తుల పేర్లు మార్చడమైంది) అంజనంలో రంగమ్మ ఎలా కనిపించింది? ఆముదంతో దీపం వెలిగిస్తారు. దీపం పైన అడ్డు పెట్టి దాని నుంచి వెలువడే నుసి గోడకు అంటేటట్లు చేస్తారు. తర్వాత దానిని గోడ నుంచి గీకి పొడి చేసి మరికొంత ఆముదం కలుపుతారు. దీనిని మాంత్రికులే స్వయంగా తయారుచేసుకుంటారు. ఇది ఆముదం కలిసి ఉండడంతో మెరుస్తూ ఉంటుంది. కుడిచేతి బొటన వేలి గోరు మొత్తానికి రాస్తారు. మనిషిని ప్రశ్నల ద్వారానే హిప్నటైజ్ చేస్తారు. వెనుక అటూ ఇటూ నడిచే మనుషుల నీడ గోరు మీద కదులుతూ ఉంటుంది. ఎవరూ కదలకపోతే మాంత్రికుని అనుచరులే ఆ పని చేస్తారు. నీడగా ఏదో లీలగా కదులుతున్నట్లు కనిపించగానే అంజనం వేయించుకున్న వాళ్లు తమ మస్తిష్కంలో ఉన్న రూపం, భావనలతో స్పందిస్తారు. గోరు కుంభాకార కటకంలాగ పని చేస్తుంది. దూరంగా ఉన్న మనిషి రూపం కూడా చిన్నగా ప్రతిబింబిస్తుంది. వాహనాలకు ఉండే మిర్రర్లాగ అన్నమాట. ఎస్. శంకర శివరావు కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ -
లింగమయ్య పిలిస్తే కష్టం తెలియదయా!
అర్జునుడు తపస్సు చేసిన దీక్షావనం పరమేశ్వరుడు వరాలిచ్చిన పుణ్యస్థలి కృంగదీసే రోగాలకు ఔషధగని పసిపాపల నుంచి పండువృద్ధుల దాకావస్తున్నాం లింగమయ్యా అంటూ నల్లమల అడవుల్లో అద్భుతమైన సాహసయాత్ర .. సలేశ్వరం యాత్ర... ఎత్తయిన కొండగుట్టలు.. పచ్చని చెట్లు..పక్షుల కిలకిలరావాలు.. జాలువారే జలపాతాలు.. ఆరుదైన వన్యప్రాణులతో అలరారే నల్లమలలో వేయి అడుగుల లోతైన లోయులో కొలువైన సలేశ్వరం (లింగమయ్య) దర్శనం ఒక వుహత్తర ఘట్టం. అత్యంత ప్రవూద భరితమైన కొండ చరియుల వూర్గంలో కేవలం పాదం మోపే స్థలంలో ప్రయాణించాలి. ప్రతి ఏటా ఏప్రిల్ వూసంలో వచ్చే చైత్ర పూర్ణివు రోజున భక్తులు లింగమయ్యను భక్తిశ్రద్ధలతో దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. నాటినుంచి ఐదు రోజుల పాటు శ్రీ రావులింగేశ్వర స్వామి నావుస్మరణతో నల్లవుల ప్రాంతం వూరుమోగుతుంది. నల్లమలలో వివిధ రోగాల నివారణకు ఉపయోగపడే మూలికలు లభిస్తాయి. ఇక్కడ వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం కన్నుల పండువ చేస్తుంది. ఈ నీటిజాలు నల్లమల లోపలిభాగం నుంచి వస్తుండడంతో ఈ జలం దీర్ఘకాలిక రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని భక్తుల నవ్ముకం. ఈ ప్రాంతంలోనే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడని ప్రతీతి. వెయ్యి అడుగుల లోతులో.. లింగవుయ్యు దర్శనం కోసం 200 అడుగుల లోతున పదునైన రాళ్లతో కూడిన గుట్టను దిగడంతో సలేశ్వర ప్రయూణం ఆరంభవువుతుంది. గుట్టను దిగిన అనంతరం దాదాపు ఆరు వందల అడుగుల ఎత్తు ఉండే వురో గుట్టను ఎక్కాల్సి ఉంటుంది. సువూరు వేరుు అడుగులకు పైగా లోతున్న లోయువైపు కొండ చరియులను ఆధారంగా చేసుకుని భక్తులు రాత్రివేళ ప్రయూణిస్తారు. పిడికెడు శివలింగం.. కేవలం పిడికెడు ఎత్తు గల శివలింగం.. దానిమీద ఇత్తడితో చేసిన పడగ ఒక్కటే ఇక్కడ పూజలందుకునేది. చెంచులే ఇక్కడ ప్రధాన పూజారులు. ఉత్సవాలు జరిగే 5 రోజుల పాటు లక్షలాది వుందితో నల్లవుల అడవి ఈనినట్లుగా అనిపిస్తుంది. ఈ ఉత్సవాలు అరుున తర్వాత నిర్జనప్రదేశమే! గుండంలో స్నానం చేస్తే సర్వరోగాలు మాయం సలేశ్వర క్షేత్రంలో కొండల నడుమ దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జలపాతంలో పడే నీటిలో స్నానం చేస్తే సర్వరోగాలు మటుమాయం కావడమే గాక, ఆయుష్షు పెరుగుతుందని విశ్వాసం. ఈ లోయ మార్గంలో ఒక్కొక్కరు మాత్రమే నడవడానికి దారి ఉంటుంది. లింగాలలో జరిగే శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాల సమయంలోనే ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీ. ఈమార్గంలో చూడదగిన ప్రదేశాలు... మల్లెల తీర్థం ... ప్రకృతి ప్రియులను ఆకట్టుకోవడంలో ప్రధానమైంది మల్లెలతీర్థం. సూర్యకిరణాలకు చోటివ్వని చల్లని ప్రదేశమైన ఈ తీర్థానికి మతాలతో సంబంధం లేకుండా అందరూ ప్రకృతి ఒడిలో సేదతీర్చుకుంటారు. 500 అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. - బండారు శ్రీనివాస్, అచ్చంపేట సలేశ్వరం ఎలా వెళ్తారంటే... సలేశ్వర క్షేత్రానికి వెళ్లడానికి రెండు వూర్గాలు ఉన్నాయి. అచ్చంపేట - శ్రీశైలం జాతీయ రహదారిలోని ఫరహాబాద్ చౌరస్తా నుంచి రామ్‌పూర్ చెంచుపెంట (అప్పాపూర్ మార్గంలో40 కిలోమీటర్ల వరకు వెళ్తే) చేరుకుంటే అక్కడినుంచి క్షేత్రం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా కాకుండా బల్మూర్, లింగాల -అప్పారుుపల్లి ద్వారా వెళ్లొచ్చు. ఎక్కడినుంచి ఎంత దూరం... హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిలోని మన్ననూర్ అనంతరం ఫర్హాబాద్ చౌరస్తా వస్తుంది. ఇక్కడి నుంచి 31 కి.మీ. దూరంలో దట్టమైన అటవీ మార్గంలో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. దూరం: హైదరాబాద్ నుంచి 186 కి.మీ, మహబూబ్‌నగర్ నుంచి 151కి.మీ, అచ్చంపేట నుంచి 61 కి.మీ, మన్ననూర్ నుంచి 46 కి.మీ. నల్లమల కొండల్లో నివసిస్తుస్న చెంచు జనాభా కేవలం 50 వేల లోపే. వేల సంవత్సరాలుగా స్వయం సమృద్ధితో, స్వయం పాలనలో జీవించిన వీరు తెలుగు రాష్ట్రాల విభజనకు, దాని పర్యవసానాలకు లోనవుతున్నారు. వీరి నివాస ప్రాంతాల్లోనే ప్రస్తుత శ్రీశైలం, అహోబిలం, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, బౌరాపూర్, సలేశ్వరం, లొద్దిమల్లయ్య, కదలీవనం, అక్కమహాదేవి గుహలు, భీముని కొలను, ఇష్టకామేశ్వరి, మల్లెలతీర్థం లాంటి క్షేత్రాలున్నాయి. కేస్తాపూర్ నాగోబాజాతర, సమ్మక్క - సారక్కల మేడారం జాతర జరిగేది ఇక్కడే. చెంచుల ఆడపడుచు ధీరవనిత బౌరమ్మ జ్ఞాపకార్థం మార్చి మొదటివారంలో ‘చెంచుల పండుగ’ (పాలమూరు) జరిగింది. ఏప్రిల్ 19 నుంచి 23 వరకు ఐదురోజులపాటు ఏడాదికి ఒక్కసారి వచ్చే ‘లింగమయ్య ఉత్సవాలు’ సలేశ్వరంలో జరుపుకోబోతున్నాం. ఈ పండుగల సందర్భంగా చెంచులు వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తారు. వాటిని వచ్చే తరాల వారికి అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆదివాసులు ఎంతో నిష్టగా జరుపుతారు. ఈ సందర్భంగా వీళ్లు భూమిని, ఆకాశాన్ని, నీటిని, గాలిని, నిప్పును, చెట్టును, రాళ్లను చివరికి తమ ఇంటికి వచ్చిన పంటను తమదైన పద్ధతిలో పూజిస్తారు. ‘మీరు బాగుండాలి - మేం బాగుండాలి, అందరినీ సమానంగా చూడుస్వామి’ అని చెంచులు చేసే ప్రార్థన అందరికీ కనువిప్పు. - డా.రాంకిషన్, సలేశ్వరం క్షేత్రం ఉన్న అప్పాయపల్లి గ్రామవాస్తవ్యులు -
గ్రహణం విడిచిన వేళ...
అల్లిపురం: నగరంలో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించింది. ఉదయం 6 .13 గంటల నుంచి 6. 48 గంటల వరకు 35 నిమిషాల పాటు గ్రహణం ఉంది. గ్రహణ గమనాన్ని వీక్షించేందుకు నగర వాసులు ఉత్సాహం చూపించారు. కొంతమంది ఔత్సాహికులు నల్లటి కళ్లద్దాలు, ఎక్స్‌రే ఫిల్మ్‌లతో గ్రహణాన్ని ఆసాంతం తిలకించారు. తెల్లవారుజాముకే నగరవాసులతో బీచ్ నిండిపోయింది. గ్రహణం వీడిన తరువాత బీచ్‌లో స్నానాలు ఆచరించారు. సూర్య నమస్కారాలు చేసుకుని, పూజలు చేసి వెనుదిరిగారు. -
చెట్టు.. నీటిబొట్టు!
యల్లమ్మగూడెంలో వింత.. గంగమ్మ దేవత మహిమేనని పూజలు తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని యల్లమ్మగూడెంలో గురువారం ఓ వింత చోటు చేసుకుంది. ఊళ్లోని పురాతన శివాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆలయ ఆవరణలో ఓ ఎండిన చెట్టును కూలీలు రంపంతో కోస్తున్నారు. సగభాగం కోయగానే అందులో నుంచి ఒక్కసారిగా సన్నధారతో నీరు రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం గ్రామమంతా తెలిసి అందరూ అక్కడికి చేరుకున్నారు. అంతలోనే ఓ మహిళకు పూనకం రావడం, ఆ మహిళ ఇది గంగమ్మ దేవత మహిమేనని కొలుపు చెప్పడంతో గ్రామస్తులు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. -
అలుకు చల్లి.. ముగ్గులు వేసి
మేడారంలో ఘనంగా గుడిమెలిగె పండుగ గుళ్లను శుద్ధి చేసిన పూజారులు ధూప, దీప నైవేద్యాలతో తల్లులకు పూజలు మేడారం(తాడ్వాయి): మేడారంలో గుడిమెలిగె పండుగను పూజారులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు మహాజాతర జరగనుంది. జాతరకు సరిగ్గా రెండు వారాల ముందుగా గుడిమెలిగె పండుగ చేస్తారు. సమ్మక్క పూజారులైన కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, సిద్ధబోయిన మునేందర్, భోజరావు, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, బొక్కెనలు ఉదయం 9గంటలకు మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకుని గుడి తలుపులు తెరిచారు. ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య కొత్త చీపురుతో గుడిలోని బూజు దులపగా.. పూజారులే గుడిలోపల పెయింటింగ్ వేశారు. అనంతరం అమ్మవారి శక్తి పీఠం, పూజ సామగ్రిని శుద్ధి చేశారు. అలాగే మధ్యాహ్నం 2గంటల తర్వాత పూజారుల కుటుంబాల మహిళలు గుడిలోని అమ్మవారి గద్దెను పసుపు, కుంకుమలతో అలంకరించి ముగ్గులు వేశారు. అమ్మవారి శక్తి పీఠాన్ని, ధ్వజస్తంభం, ద్వారాన్ని కూడా అలంకరించారు. తర్వాత పూజారులు యాటతో గుడి చూట్టూ ప్రదక్షిణలు చేసి దూప, దీప నైవేద్యంతో రహస్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మ క్క తల్లికి నైవేద్యంగా యాటను జడత పట్టారు. గుడిమెలిగె పండుగతో దేవతల జాతర పూజ కార్యక్రమాల తంతు మొదలైనట్లు పూజారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. సారలమ్మ గుడిలో.. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని శుద్ధి చేశారు. సారలమ్మ పూజ సా మగ్రి, వస్తువులను శుద్ధి చేశారు. మహిళలు గుడి లోపల, ఆవరణలో ముగ్గులు వేశారు. సారలమ్మ వడ్డెరలు కుండలను అలంకరించారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యతోపాటు పూజారులు రహస్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా గుడి మెలిగె పండుగ సందర్భంగా పూజారులు తమ ఇళ్లను కూడా శుద్ధి చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
వదనం మధురం...
ఉడిపి ఉత్సవాలు ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో రోజూ వేకువజామున జరిగే పూజలు నయనానందకరంగా సాగుతాయి. అలాగే స్వామివారికి ఏటా జరిపే శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. మకరసంక్రాంతి, రథసప్తమి, మాధవి నవమి, హనుమజయంతి, నవరాత్రి మహోత్సవాలు, నరకచతుర్దశి, దీపావళి, గీతాజయంతి.. మొదలైన ఉత్సవాలు ఇక్కడ వేడుకగా జరుపుతారు. లోకానికి ఇది మంచి, ఇది చెడు అని హద్దులు గీసి మరీ నిర్ణయించి చూపిన గీతాచార్యుడు ఆయన. మనిషి జన్మ మాయ చుట్టూ పరిభ్రమిస్తుందని విశ్వాన్ని కళ్లకు కట్టిన జగన్మోహనుడు ఆయన. ధర్మసంస్థాపన కోసం ధరించిన అవతారాలలో ఆయనది పరిపూర్ణ అవతారం. ఆయనే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఉడిపి దివ్యక్షే త్రంలో కొలువుదీరి భక్తుల కొంగుబంగారమై అలరారుతున్నాడు కృష్ణభగవానుడు. దేశంలో విరాజిల్లుతున్న అతి సుందర దివ్యమందిరాలలో ఉడిపి కృష్ణ మందిరం ఒకటి. మధుర, బృందావనం, ద్వారక... ఆపైన ఉడిపి ఈ మందిరాలన్నీ అతి సుందరం. బెంగుళూరుకు సుమారు 500 కి.మీ దూరంలో ఉడిపి క్షేత్రం ఉంది. ఎత్తై కొండలు, ఆకాశంతో ఊసులాడుతున్నట్టు ఎత్తై పచ్చని చెట్లు, మెల్లగా, సన్నగా సవ్వడి చేస్తూ నురుగలతో ఎగిసిపడే సముద్రం... ఉడిపికి వెళ్లేదారిలోనే మనసు పులకించిపోతుంది. స్వాగత ద్వారం ఈ పచ్చని సుందర దృశ్యాలను తిలకిస్తూ ఈ దారి గుండా వెళుతుంటే మొదటగా రమణీయమైన స్వాగత ద్వారం ఎదురవుతుంది. ఇక్కడి నుంచి కృష్ణ నామం వినిపిస్తూ మనసంతా ఆనందంతో పరవశించిపోతుంది. పేరు వింటేనే ఇంత ఆనందపరవశులయితే ఇక ఆయన దివ్యమంగళ రూపం చూస్తే.. ఎంత ఆకర్షణకు లోనవుతామో..! అసలు కృష్ణ అంటేనే ఆకర్షణ అని అర్థం. ఆయన రూపానికి తగిన విధంగానే ఆలయమూ మన మనసులను దోచుకుంటుంది. ప్రధాన ద్వారం కంటికింపైన రంగులతో దేవతామూర్తులతో భక్తుల చూపులను కట్టిపడేస్తుంది ప్రధాన ద్వారం. ముందుగా లక్ష్మీదేవి, ఆ పైన ఆదిశేషుడు తలపై కిరీటంలా భాసిల్లుతుండగా కృష్ణపరమాత్ముడు అభయముద్రలో కనిపిస్తాడు. ఇరువైపులా హనుమంతుడు, గరుత్మంతుడు జోతలు అర్పిస్తూ కనిపిస్తారు. ఇది వైష్ణవాలయం అయినప్పటికీ శైవ చిత్రాలూ ఉండి శివకేశవ భేదం లేదనిపిస్తుంది. ఈ రాజద్వారం దాటి లోపలికి వె ళ్లిన భక్తులకు అద్భుతమైన ఆనందపరవశం కలుగుతుంది. ఇదే గర్భమందిరమేమో అనిపిస్తుంది. ఈ ముఖద్వార అద్భుతాలను వీక్షిస్తూ లోపలికి విచ్చేస్తారు భక్తజనం. కిటికీ గుండా దర్శనం ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవద్వారం వస్తుంది. పీఠాధిపతులకు తప్పితే దీని ద్వారా గర్భగుడిలో అన్యులకు ప్రవేశం ఉండదు. చెన్నకేశవస్వామి ద్వారం నుండి ముందుకు వెళితే శ్రీకృష్ణ దర్శనానికి వెండితో తాపడం చేసిన నవరంధ్రాల కిటికీని చేరుకోవచ్చు. నేరుగా కాకుండా కిటికీ గుండానే స్వామిని దర్శించే మహత్తర క్షేత్రం లోకంలో ఉడిపి మాత్రమే. మనిషి శరీరంలోని నవరంధ్రాలకు ఈ కిటికీ ప్రతీక అని చెబుతారు. ఈ కిటికీ గుండా చూపులను లోపలికి సారిస్తే గుండె డోలాయమానం అవుతుంది. బాలకృష్ణుడి దివ్యమంగళరూపం... చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. అలనాటి యశోద ముంగిట ముద్దుగారే ముత్యంలా.. ఒక చేత తాడు, మరో చేత కవ్వము ధరించిన శ్రీకృష్ణ జగన్మోహనాకార రూపం క్షణకాలం ఆనందలోకాలకు తీసుకెళుతుంది. శ్రీకృష్ణుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ తహతహలాడతారు. అందులో వృద్ధులైన తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు ఉంటారు. వారిని వెంట తీసుకెళ్లి, ఆ మంగళస్వరూపుని దర్శనభాగం కల్పిస్తే పెద్దల ఆశీస్సులు తద్వారా ఆ భగవానుని కృప మన వెన్నంటే ఉంటుంది. సందర్శనీయ స్థలాలు ఉడిపిని సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు తగిన సమయం. కృష్ణమందిరం, మణిపాల్, చంద్రమౌళీశ్వర మందిరం, మల్పే బీచ్, దరియా బహదుర్గాద్ కోట, సెయింట్ మేరీస్ ఐల్యాండ్... మొదలైనవి ఈ చుట్టుపక్కల దర్శనీయ స్థలాలు. ఇలా చేరుకోవచ్చు బెంగుళూరు నుంచి ఉడిపి 500 కిలోమీటర్ల దూరం. మంగళూరు నుంచి 80 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి రోడ్డు ద్వారా అయితే సుమారు 913 కి.మీ. దూరం. రైలు ద్వారా అయితే 1500 కి.మీ దూరం. విమానం ద్వారా అయితే మంగళూరుకు చేరుకొని అక్కడ నుంచి ఉడిపికి చేరుకోవచ్చు. బస్సు: హైదరాబాద్ నుంచి ఉడిపికి దాదాపు 13-15 గంటల లోపు చేరుకోవచ్చు. సుమారు రూ.1000 నుంచి 1300 వరకు ప్రైవేట్ బస్సుల టికెట్ల ధరలు ఉన్నాయి. రైలు: హైదరాబాద్ (కాచిగూడ) స్టేషన్ నుంచి మంగళూరు ఎక్స్‌ప్రెస్ ఉంది. విమానాశ్రయం: ‘బాజ్పె ఎయిర్పోర్ట్’ మంగళూర్లో ఉంది. ఇది ఉడిపికి 60 కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నాన్‌స్టాప్ కాకుండా కనెక్టింగ్ ఫ్లయిట్స్ ఉన్నాయి. చెల్లించే డబ్బుని బట్టి ఒన్ స్టాప్ టూ స్టాప్స్ ఫ్లయిట్స్ ఉన్నాయి. - ఎన్.ఆర్ 800 ఏళ్ల క్రితం ప్రతిష్ఠాపన ఈ మందిరంలో సుందరమైన శ్రీకృష్ణభగవానుడి విగ్రహాన్ని సుమారు 800 ఏళ్ల క్రితం ద్వైతమత స్థాపకులు శ్రీ మధ్వాచార్యులు ప్రతిష్టించాడని చరిత్ర చెబుతోంది. మధ్వాచార్యులు ఎనిమిది మంది బ్రహ్మచారి శిష్యులకు సన్యాస దీక్షనందించి, వారి ద్వారా శ్రీకృష్ణుడికి పూజాదికాలు నిర్వహించే ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన మఠాల నుంచి ఎంపికైన వారే రెండేళ్ల కొకసారి దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుడికి అనుగ్రహం... వాదిరాజు పాలనలో కనకదాస అనే భక్తుడు ఉడిపి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని తహతహలాడుతుండేవాడు. కాని, అతను కడజాతి వాడు అని పూజారులు గుడిలోకి అనుమతించలేదు. అప్పుడు అనుగ్రహించిన కృష్ణుడు తన విగ్రహం వెనుకవైపున గోడకు కన్నం ఏర్పాటు చేసి వెనుకకు తిరిగి భక్తుడైన కనకదాసకు దర్శనమిచ్చి కరుణించాడు. అప్పటి నుంచి ఈ కిటికీకి ’కనకనకిండి’ అనే పేరు వచ్చింది. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్లి దక్షిణ మార్గంవైపు వెళితే ఎడమభాగాన మధ్వాచార్యుల మంటపం కనిపిస్తుంది. నలుపురంగు, సాలిగ్రామ శిలతో తయారుచేసిన ఇక్కడి కృష్ణ విగ్రహం నయనమనోహరంగా ఉంటుంది. ఆలయం కుడివైపు భాగంలో దేవస్థానం సత్రాలు బిర్లా, శృంగేరీ, కృష్ణ, గీతాసత్రాలలోని గదుల్లో విడిది చేయవచ్చు. ఉడిపి దేవస్థానంలో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఉడిపిలో అత్యాధునిక వసతిసదుపాయాలు గల హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. కిందటేడాది అక్టోబర్‌లో వృద్ధుల అత్యవసర సాయం కోసం కర్ణాటక ప్రభుత్వం 1090 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. దీని ప్రధాన కేంద్రం బెంగళూరు -
కనకమాలచ్చిమి
సందర్శనీయం తెలుగువారి వెలుగు దివ్వె, భక్తుల పాలిట కల్పవల్లిగా పేరుగాంచిన వేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారు. విశాఖపట్నం బురుజుపేటలో కొలువై ఉన్న ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. మార్గశిర గురువారాలంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరం. ప్రతి గురువారమూ అమ్మవారికి సహస్రనామార్చన, బంగారు గురువారాల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి మూర్తికి స్వర్ణకవచాన్ని, స్వర్ణాభరణాలను అలంకరిస్తారు. సహస్ర ఘటాభిషేకాలు, కుంకుమ పూజలు చేస్తారు. ఇక్కడి విశేషమేమంటే అమ్మవారికి భక్తులు స్వయంగా పూజలు చేసుకోవచ్చు. మార్గశిర మాసంలో అమ్మవారిని సందర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని ప్రతీతి. హైదరాబాద్ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్, లేదా విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం రైల్వేస్టేషన్లో దిగితే అక్కడినుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బస్సులున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రతి ఐదు నిమిషాలకూ బురుజుపేటకు బస్సులున్నాయి. లేదంటే రైల్వేస్టేషన్ నుంచి నేరుగా షుమారు యాభై రూపాయలిచ్చి ఆటోలో వెళ్లిపోవచ్చు. -
ఆరనీకుమా.. కార్తీకదీపం
ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు కిటకిటలాడిన ప్రముఖ శివలయాలు ఆలయాల్లో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు శివాలయాల్లో స్వామివారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు దిల్సుఖ్నగర్: శివశివ శంకర భక్తవ శంకర శంబోహరహర మహదేవా...ఆరనీకుమా ఈదీపం.. కార్తీకదీపం.. చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం..అంటూ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని యువతులు, మహిళలు, భక్తులు బుధవారం మల క్పేట్/మహేశ్వరంజోన్ పరిధిలోని పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాక్షరీ మ ంత్రంతో ఆలయప్రాంతాలు మార్మోగాయి. ఈసందర్భంగా మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేసి కార్తీకమాస దీపారాధనలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నాలుగు గం టల నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు,పిల్లలు,పెద్దలు ఆలయాల వద్దకు చేరి కార్తీక దీపారాధనలు చేసి , అక్కడ ఏర్పాటు చేసిన ఉసిరిచెట్టుకు ప్రదక్షణలు, తులసీ పూజలు నిర్వహించి అనంతరం ఇంటి నుంచి తీసు కువచ్చిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దైవ దర్శనం కోసం ఆలయాల ముందు భక్తులు భారులు తీరారు. జోన్ పరిధిలోని ఆర్కేపురంలో ఉన్న శ్రీఅష్టలక్ష్మీ దేవాలయం,సరూర్‌నగర్‌లోని శివాలయం,ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం, అక్బర్‌బాగ్‌లోని హరిహరక్షేత్రం దిల్సుఖ్నగర్ లోని శివాలయం, శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి దేవాలయం, చైతన్యపురి, కొత్తపేట కర్మన్‌ఘాట్‌లోని శ్రీధ్యానాంజనేయస్వామి ఆలయం, శ్రీహరిహరక్షేత్రం, మల క్పేట్, మాదన్నపేట్, సైదాబాద్, ఐఎస్‌సదన్, చంపాపేట్, సంతోష్‌నగర్, జిల్లెలగూడ, మీర్పేట్, బడంగ్పేట్, బాలాపూర్, నాదర్‌గూల్, జల్పల్లి, మామిడిపల్లి ఆలయాలతో పాటు పలు శివాలయాలు, అమ్మవారి ఆలయాల్లో కార్తీకపౌర్ణమి సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో కార్తీక వనబోజనాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయం, శ్రీహరిహరాక్షేత్రం, మన్సూరాబాద్ శ్రీఅయ్యప్పస్వామి దేవాలయం , సైదాబాద్ విజయదుర్గా ఆలయం, దిల్సుఖ్నగర్ శివాలయాలతోపాటు పలు ఆలయాల్లో భక్తులు అయ్యప్ప మాల ధా రణ చేశారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాలు, పార్కుల్ల్లో కార్తీక వనభోజన నిర్వహించుకోవడంతో కాలనీలలో పండుగవాతావరణం నెలకొంది. ఆలయాలన్నీ కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటి నిర్వాహకులు ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. -
ప్రత్యేక పూజలకూ అనుమతులు కావాలా?
వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు {పభుత్వ తీరుపై ధ్వజమెత్తిన పార్టీ నాయకులు డాబాగార్డెన్స్ : జగన్ ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు కూడా చేయనివ్వకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆరోరోజూ నిరశన దీక్ష కొనసాగిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సోమవారం సంపత్ వినాయగర్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు బయలుదేరిన పార్టీ నేతల్ని పోలీసులు అడుగడుగున అరెస్టులు చేశారు. పోలీసులు నేతల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసులను తప్పించుకుని నేతలు పరుగులు తీశారు. అయినప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, తైనాల విజయ్‌కుమార్, సి.హెచ్.వంశీకృష్ణ, మళ్ల విజయప్రసాద్ పలువురు నాయకుల్ని భీమలి పోలీస్ స్టేషన్‌కు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఎస్సీ సెల్ రాష్ట్ర సభ్యుడు బోను దేవా, సూరాడా తాతారావు, పీతల వాసు, మాసిపోగు రాజు, శ్రీహరిరెడ్డి, సేనాపతి అప్పారావు, రవికుమార్, నీలాపు మురళీ తదితరుల్ని పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్తలు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంటే ప్రత్యేక పూజలు కూడా చేసుకోనివ్వని చేతగాని ప్రభుత్వమని మండిపడ్డారు. ప్రత్యేక హోదాని చంద్రబాబు నరేంద్ర మోదీ వద్ద తాకట్టు పెట్టి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఎంతసేపూ జేబులు నింపుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రి వర్గానికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలన్నారు. సింహగిరిపై వైఎస్సార్ సీపీ నేతల పూజలు సింహాచలం : ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం కోసం ఆ పార్టీ నేతలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం ప్రత్యేకపూజలు చేశారు. తొలుత స్వామి సన్నిధిలో 101 కొబ్బరికాయలు కొట్టారు. పూజలు చేసిన వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, భీమిలి సమన్వయకర్త కర్రి సీతారాం, కొయ్య ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
వైభవంగా ముగిసిన భద్రకాళి బ్రహ్మోత్సవాలు
చివరి రోజు వైభవంగా సుదర్శన ప్రతిష్ట, చక్రస్నానం హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీభద్రకాళి ఆలయంలో కొనసాగుతున్న భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశారుు. చివరిరోజు ఉదయం 5 గంటల నుంచి నిత్యాహ్నికం, చతుస్థానార్చన, గణపతి పూజలు చండీహవనం, చూర్ణోత్సవం నిర్వహించారు. 11గంటలకు అమ్మవారిని యోగలక్ష్మీగా అలంకరించి శరభవాహనంపై ఊరేగిం చారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి, ఒంటి గంటకు బలిహరణ జరిపారు.. ధ్వజారోహణం చేశారు. జిల్లా మేదరి సంఘం, కురుమ సంఘం సౌజన్యంతో ప్రసాదాల వితరణ జరిగింది. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ముఖ్యార్చకులు చెప్పెల వెంకటనాగరాజుశర్మ, అర్చకులు టక్కరసు సత్యం, సుధాకరశర్మ, సంఖ్యా శాస్త్ర నిపుణులు మల్లావజ్జుల రామకృష్ణశర్మ, దత్తసాహిత్శర్మ , వేదవిద్యార్థులు శ్రీభద్రకాళి శరణం మమః అంటూ అస్త్రబేరాన్ని తలపై మోస్తూ భద్రకాళి చెరువులోకి వెళ్లి వైభవంగా సుదర్శన చక్రస్నానం నిర్వహిం చారు. ఆలయంలో జరిగే ఉత్సవాల్లో అవబృధస్నానం నిర్వహిస్తుండడం సాధారణం. మొదటిసారిగా సుదర్శన ప్రతిష్టతోపాటు చక్రస్నానం నిర్వహించడం విశేషం. వైభవంగా పుష్పయాగం.. సాయంత్రం 7గంటలకు అమ్మవారిని మోక్షలక్ష్మీగా అలంకరించి పుష్పరథంపై ఊరేగించారు. పలుప్రాంతాల నుండి తెప్పించిన కిలోల కొద్దీ పసుపు, ఎరుపు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు భద్రకాళి శేషు అధ్వర్యంలో నారింజ రంగు గులాబీలు, కనకాంబరాలు, మల్లెలు, లిల్లీలు, వివిధ రంగుల చామంతులతో శోభాయమానంగా పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ కట్టా అంజనీదేవి, సీనియర్ ఉద్యోగులు కూచన హరినాథ్, అద్దంకి విజయ్, వెంకటయ్య, కృష్ణ, రాము, చింతశ్యాం పర్యవేక్షించారు. పుష్పయాగంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్, రేవతి దంపతులు, బ్రాహ్మణసంఘం రాష్ట్ర అధ్యక్షులు వెన్నంపల్లి జగన్మోహన్శర్మ, జిల్లా అర్బన్ అధ్యక్షులు వల్లూరి పవన్‌కుమార్ , ఆర్యవైశ్యప్రముఖులు అయితాగోపినాధ్ పాల్గొన్నారు. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ జేసీ రఘునాధ్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, నర్సింగరావు దంపతులు పాల్గొన్నారు. -
ఘనంగా రాహుకాల పూజలు
మదనపల్లె : తిరుపతిలోని మదనపల్లెలో రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి. శుక్రవారం స్థానిక గంగమ్మ ఆలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పూజా కార్యక్రమంలో పట్టణానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లె పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురవాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో మహిళలు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగమ్మ ఆలయం ముందు నిమ్మకాయలతో తయారు చేసిన ప్రత్యేక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఉపవాస దీక్షలతో ఈ పూజలను చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి శుక్రవారం ఈ ఆలయం ముందు రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మదనపల్లెతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అమ్మవారిని నూతన పట్టు వస్త్రములు, వివిధ పూలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శింపచేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. -
కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ
అనకాపల్లి టౌన్: సత్యనారాయణపురం పంచాయతీలో గల కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో సుమారు నాలుగు తులాల బంగారం, పది తులాల వెండి ఆభరణాలను అపహరించారు. వివరాలివీ. శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో ఎప్పటి మాదిరిలా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి గుడి ద్వారాలు మూసివేసి వెళ్లిపోయారు. తిరిగి శనివారం ఉదయం 6.00 గంటలకు పూజలు నిర్వహించేందుకు వచ్చిన ఆలయ అర్చకుడు ఆలయానికి పక్కన ఉన్న ద్వారం తెరిచి ఉండడాన్ని గమనించారు. అలాగే అమ్మవారి గర్భగుడి ద్వారం కూడా తెరిచి ఉండడాన్ని గమనించి వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. వారు అమ్మవారి ఆలయాన్ని పరిశీలించగా అమ్మవారి విగ్రహానికి ఉన్న బంగారు కనుబొమ్మలు, నేత్రాలు, ముక్కుపుడక, బొట్టు, మంగళసూత్రాలు తదితర ఆభరణాలను అపహరించినట్టు గుర్తించారు. అలాగే పక్కనే ఉన్న చిన్న విగ్రహాలకు ఉన్న సుమారు పది తులాల వెండి ఆభరణాలను కూడా అపహరించినట్టు ఆలయ అర్చకుడు వేజేటి ధర్మాచార్యులు, ఆలయ వ్యవస్థాపక కార్యదర్శి బోయిన నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ చంద్ర, క్లూస్ టీమ్ వచ్చి ఆలయ పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్ర తెలిపారు. -
ఆలయాలలోనే ప్రశాంతత ఎందుకు లభిస్తుంది?
ఎందుకు? ఇంటిలో మనం ఎంతసేపు పూజ చేసుకున్నా ఆలయానికి వెళ్లి, ఆ మూర్తి ముందు రెండు నిమిషాలు గడిపితే చాలు... ఎనలేని ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకంటే దేవాలయాలలో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడే యంత్రాన్ని కూడా ప్రతిష్ఠాపన చేస్తారు. ఆ యంత్రాల ప్రతిష్ఠాపన కార్యక్రమం యోగులు, స్వామీజీలు, బాబాల చేతుల మీదుగా జరుగుతుంది. వారు జీవించి వున్నంత కాలమే కాదు, తమ భౌతిక దేహం వీడిన తర్వాత కూడా వారి ఆత్మశక్తి, జప ఫలం, తపో మహిమ ఆ యంత్రాలను చేరతాయని ఒక నమ్మకం. ఈ పుణ్యపుడమిలో ఎందరో అవతార పురుషులు జన్మించారు. వారు అవతారం చాలించగానే వారి దివ్యమహిమలన్నీ ఆ పరిసర ప్రాంతాల్లో వుండే ఆలయాల్లోని యంత్రాలలో ప్రతిష్ఠితమవుతాయని. ఆ యంత్రాలలోని బీజాక్షరాలలో వుండే దివ్యశక్తులు స్వరబద్ధమైన మంత్రాల ద్వారా మన చెవులను చేరి మన కోరికలను తీరుస్తాయని అంటారు. ఆ సమ్మోహన శక్తే మనల్ని వందలు, వేల మైళ్ల దూరం ప్రయాణించి ఆయా ఆలయాలలోని దేవతల దర్శనం చేసుకునేలా చేస్తుంది, మనసులకు ప్రశాంతత ప్రసాదిస్తుంది. -
చివరి దశలో చిరుదీపం
ప్రేమగా చూసుకునేవారుంటే ఫర్వాలేదు కానీ... నా అన్నవారు లేక, ఒంటరిగా ఆశ్రమాల్లో పడి మగ్గిపోయేవారికి తెలుస్తుంది... వృద్ధాప్యం ఎంత పెద్ద శాపమో! అయితే లక్ష్మీమీనన్ పుణ్యమాని ఇప్పుడు కేరళలో వయసుడిగిన మహిళలెవరూ వృద్ధాప్యాన్ని శాపంగా భావించడం లేదు. లక్ష్మి చేయూతతో దాన్ని వరంగా మార్చుకుంటున్నారు. ముగిసిపోబోతున్న జీవితాలను మళ్లీ కొత్తగా జీవించడం మొదలుపెడుతున్నారు! ‘‘ఎందుకమ్మమ్మా ఈ వయసులో నీకింత శ్రమ?’’ అంది లక్ష్మీమీనన్ ఇంట్లోకి వస్తూనే. భవానమ్మ నవ్వింది. ‘‘ఇందులో శ్రమేముంది? ఈ వయసులో ఊరికే కూర్చుంటే విసుగు పుడుతోంది. అందుకే ఈ పని చేస్తున్నా’’ అంది చేస్తున్న పని ఆపకుండానే. లక్ష్మి నిట్టూర్చింది. 88 యేళ్ల వయసులో ప్రశాంతంగా ఉండమంటే ఉండకుండా చేతులు నొప్పెట్టేలా వత్తులు చేస్తూ ఉంటుంది అమ్మమ్మ. అది లక్ష్మికి బాధగా ఉంటుంది. కానీ ఎంత చెప్పినా ఆమె వినదు. అందుకే మరేమీ మాట్లాడకుండా ఊరకుండిపోయింది. వారం రోజుల తర్వాత అమ్మమ్మతో పాటు బంధువులింట్లో ఫంక్షన్‌కి వెళ్లింది లక్ష్మి. అక్కడ అమ్మమ్మ తనతో తెచ్చిన ఓ గిఫ్టును ఆ ఇంట్లోవాళ్లకి ఇవ్వడం చూసింది. ‘‘నువ్వు బహుమతిని తెచ్చావా? ఏముంది అందులో’’ అంది కుతూహలంగా. ‘‘నేను చేసిన వత్తులు ప్యాక్ చేసి తీసుకొచ్చాను. వాళ్లకి పూజకి పనికొస్తాయి కదా’’ అంది భవానమ్మ. అప్పటికి లక్ష్మి మౌనంగా ఉండిపోయింది. కానీ అమ్మమ్మ సమాధానం ఆమె మెదడులో రకరకాల ఆలోచనలు రేపింది. ఇంట్లో అందరూ ఎవరి పనుల మీద వాళ్లు వెళ్లిపోతుంటే పాపం అమ్మమ్మని ఒంటరితనం వేధిస్తోంది. అందుకే పొద్దుపోక వత్తులు చేస్తోంది. వాటినేం చేయాలో తెలీక ఇలా అందరికీ పంచి పెడుతోంది. ఈ వాస్తవం బోధపడగానే అమ్మమ్మ మీద చెప్పలేని జాలి కలిగింది లక్ష్మికి. ఇంట్లో, ఇంతమంది మధ్య ఉండే అమ్మమ్మకే ఇలా ఉంటే, వృద్ధాశ్రమాల్లో ఉండేవాళ్ల పరిస్థితి ఏమిటో కదా అనిపించింది. ఈ ఆలోచనలన్నీ కలిసి ఓ లక్ష్యంగా రూపుదిద్దుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అమ్మమ్మలకు అమ్మయ్యింది... అమ్మమ్మకు ఒంటరితనాన్ని దూరం చేయాలన్న ఆలోచన వచ్చిన నాటినుండీ లక్ష్మి ఆలోచనలు పరిపరి విధాల పరుగుతీశాయి. తన అమ్మమ్మలాంటి వాళ్లందరి గురించీ వారాల తరబడి ఆలోచించింది. వాళ్ల ఒంటరితనాన్ని దూరం చేయాలనుకుంది. లక్ష్మి తన అమ్మమ్మ ద్వారా తెలుసుకున్న విషయం మరోటుంది. వయసయిపోయినంత మాత్రాన వారిలోని ఉత్సాహం, ఆసక్తి తగ్గిపోవు. ఒంట్లో ఓపిక ఉండాలేగానీ వాళ్లు ఏదైనా చేయగలరు. అందుకే అమ్మమ్మ ఇంకా పని చేయగలుగుతోంది. ఆ ఆసక్తిని, ఉత్సాహాన్ని ఆమెకే ఉపయోగపడేలా చేస్తే? తన ఆలోచన తనకే అద్భుతంగా అనిపించింది లక్ష్మికి. వెంటనే తన ఉద్దేశాన్ని తల్లి శ్రీదేవి, అమ్మమ్మ భవానమ్మలతో పంచుకుంది. కూతురు చెప్పింది విని చాలా మెచ్చుకున్నారు శ్రీదేవి. తప్పకుండా చేద్దామంటూ ఉత్సాహపడింది భవానమ్మ. ఆ ముగ్గురి కలయికతో 2012లో ‘విక్స్‌డమ్ ప్రాజెక్ట్’ ఊపిరి పోసుకుంది. మొదటగా తమ స్వస్థలమైన తిరువనంతపురంలో ఉన్న వృద్ధాశ్రమాలకు వెళ్లింది లక్ష్మి. అక్కడి స్త్రీలతో మాట్లాడింది. వారిలో చాలామంది తన అమ్మమ్మలాగే ఆలోచించడం గమనించింది. ఖాళీగా ఉండటాన్ని ఇష్టపడనివారు, ఏదో ఒక పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారు చాలామంది ఉన్నారు. దాంతో తన ఆలోచన సరైనదేననే నిశ్చయానికి వచ్చింది లక్ష్మి. ఆశ్రమ మేనేజర్లతో మాట్లాడింది. ఆసక్తి, ఓపిక ఉన్న మహిళలందరినీ రమ్మని ఆహ్వానించింది. అమ్మమ్మ పర్యవేక్షణలో అందరితోనూ వత్తులు చేయించడం మొదలుపెట్టింది. వత్తులు చేయడానికి అవసరమైన పత్తిని అందరికీ ఉచితంగానే పంచుతారు. ఇన్ని చేయాలి, ఇంత సమయంలో చేయాలి అని నియమమేమీ లేదు. ఎవరి ఇష్టాన్ని బట్టి, శక్తిని బట్టి వాళ్లు ఎన్నైనా చేయవచ్చు. ముప్ఫై వత్తుల్ని కలిపి ఓ కట్ట కడతారు. కట్టని ఐదు రూపాయల చొప్పున అమ్ముతారు. వత్తులు చేయడం వరకే వీరి పని. మార్కెటింగ్ వ్యవహారాలు, డబ్బు లెక్కలు అన్నీ లక్ష్మి తల్లి చూసుకుంటారు. విదేశాల్లోనూ... చెప్పుకోవడానికి ఇదో చిన్న పనిలా అనిపిస్తుంది. కానీ ‘విక్స్‌డమ్’ వత్తులు కేరళలో చాలా పెద్ద వ్యాపారమే చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని దేవాలయాలన్నీ విక్స్‌డమ్ ద్వారా తయారైన వత్తుల్నే వాడుతున్నాయి. డీసీ బుక్స్ యజమాని రవి అయితే ఆ మధ్య మూడు లక్షల వత్తులు కొన్నారు. తమ సంస్థ ముద్రించిన పదివేల రామాయణం కాపీలతో పాటు ఈ వత్తుల్ని ఉచితంగా పంచారాయన. అలా పెద్ద మొత్తంలో వత్తుల్ని కొనేవారు చాలామందే ఉండడంతో విక్స్‌డమ్ వ్యాపారం విజయవంతంగా సాగిపోతోంది. దీన్ని మరింత విస్తరించాలనుకుంటున్నారు లక్ష్మి. అందుకే తమ ప్రాజెక్టు గురించి పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాలో తన అన్న వాసుదేవ్ నారాయణన్ నడుపుతున్న ఫౌండేషన్ ద్వారా అమెరికాలో కూడా మార్కెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని విదేశీ వెబ్సైట్లతో మాట్లాడి, విక్స్‌డమ్ గురించి ప్రచారం చేయమని కోరారు. వారు అందుకు సంతోషంగా అంగీకరించారు. విక్స్‌డమ్ గురించి తీస్తోన్న డాక్యుమెంటరీకి ఉచితంగా వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ముందుకొచ్చారు. ఇలా విక్స్‌డమ్ పేరు మెల్లగా అంతటా వ్యాపిస్తోంది. అయితే వీటన్నిటికంటే... వృద్ధ మహిళల కళ్లలో కనిపిస్తోన్న తృప్తి, ముఖాల్లో కనిపించే ఆనందమే తనకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోందంటారు లక్ష్మి. నిజమే. లక్ష్మి వేసిన ఒక్క అడుగు ఎంతోమంది మహిళల వార్థక్యానికి ఓ అర్థం కల్పించింది. ఒకప్పుడు వాళ్లు ప్రతిదానికీ ఆశ్రమంపైనే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు తమకంటూ కొంత డబ్బు వెనకేసుకుంటున్నారు. నచ్చినవి కొనుక్కుంటున్నారు. ఇంతకు ముందులా ఒంటరితనం లేదు. ఒకరి మీద ఆధారపడ్డామన్న బాధలేదు. ఇదంతా లక్ష్మి వల్లనే. తన అమ్మమ్మ ద్వారా మొదలైన ఆలోచనకు ఓ రూపమిచ్చి, ఇంతమంది అమ్మమ్మలకు అమ్మగా మారి, వారికో కొత్త జీవితాన్నిచ్చిన లక్ష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే! - సమీర నేలపూడి స్ఫూర్తిని రగిలిస్తోంది! లక్ష్మిది కేరళలోని తిరువనంతపురం. విక్స్‌డమ్ ప్రాజెక్టును ప్రారంభించేనాటికే ఆమె పర్యావరణ పరిరక్షణకై పాటు పడుతోంది. ప్రస్తుతం విక్స్డమ్తో వృద్ధులకు భరోసా కల్పిస్తూనే యువతలో స్ఫూర్తిని రగిలించేందుకు ప్రయత్నిస్తోంది లక్ష్మి. గత యేడు మేలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్లింది. ఒక మంచి పని చేయాలనుకుంటున్నానని, దానికోసం ఒక్కపూట కేటాయించమని అడిగింది. 130 మంది యువతీ యువకులు ఉత్సాహంగా ముందుకొచ్చారు. వారితో కలిసి వత్తులు తయారు చేసే పని మొదలుపెట్టింది లక్ష్మి. గంటకు పది వేల చొప్పున ఓ పూటంతా వత్తులు చేస్తూనే ఉన్నారు. వాటిని అమ్మి, ఆ సొమ్ముని క్యాన్సర్ పేషెంట్లకు విరాళంగా ఇచ్చేసింది. యేటా ఇలాంటి కొన్ని కార్యక్రమాల్ని నిర్వహించి, సమాజానికి వీలైనంత సేవ చేయాలనుకుంటోంది. యువత ముందుకొస్తేనే ఏదైనా సాధ్యమంటుందామె! -
శివయ్య తిరిగొస్తాడా?!
ఊళ్లో దేవుడున్నన్నాళ్లూ ఒక్కరూ పట్టించుకోలేదు. అసలా గుడివైపునకే వెళ్లలేదు. దేవుడు మాయమయ్యాడని తెలియగానే ఆయనను చూడాలని తపిస్తున్నారు! పూజలు చెయ్యాలని ఆరాటపడుతున్నారు. శివయ్య మళ్లీ తమ ఊళ్లోకి వచ్చేయాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. వెయ్యేళ్లనాటి శివుడి విగ్రహాన్ని కోల్పోయిన ఆ ఊళ్లో ఇప్పుడు అందరూ అనాథలే! అంటే శివనాథుడు లేనివారే!! పళనిసామి కాశి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించి వస్తాడు. దైవపీఠం మీద దేవుడు ఉండడు. అయినా ప్రార్థించి వస్తాడు. అది ప్రార్థనలా ఉండదు. మొరపెట్టుకున్నట్లుగా ఉంటుంది! అతడి ప్రార్థన మొదట దిగంతాలలోని శివుడికి చేరుతుంది. తర్వాత హిందూ మహా సముద్రం మీదుగా ప్రయాణించి ఆస్ట్రేలియా ఖండం చేరుకుంటుంది. అక్కడి నుంచి రాజధాని కాన్బెర్రాలో ఉన్న ‘నేషనల్ ఆర్ట్ గ్యాలరీ’ ద్వారాలను తోసుకుని మరీ లోపలికి వెళుతుంది. శ్రీపురంధ గ్రామ శివాలయంలో మాయమైన నటరాజ కాంస్య విగ్రహం ఆ గ్యాలరీలోనే ఉందని గ్రామస్థుల నమ్మకం మరి. ఒక్క పళనిసామి మాత్రమే కాదు, గ్రామంలోని వారంతా శివయ్య రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శివయ్య తిరిగొస్తే పాప పరిహారం చేసుకుందామని ఊరు ఊరంతా తొందరపడుతోంది. ఇంతకీ వారు చేసిన పాపం? శివయ్యకు ఒక్కనాడైనా పూజ చేయకపోవడం. శిథిలావస్థలో ఉన్న గుడిని తరతరాలుగా నిర్లక్ష్యం చేయడం. విగ్రహం మాయమయ్యాక మాత్రమే వారు శివుడి గురించి, శివాలయం గురించీ పట్టించుకోవడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం వరకు శ్రీపురంధలో ఎవరూ పళనిసామి కుటుంబంతో మాట్లాడేవారు కాదు. పళనిసామి కుటుంబ సభ్యులే ఆ శివాలయంలోని నటరాజును, మరో ఏడు విగ్రహాలను మాయం చేసి ఉంటారని వారందరికీ అనుమానం! గ్రామం ఆ కుటుంబం మీద నింద వేయడానికి కారణం ఉంది. ఆలయం ప్రహరీ పళనిసామి ఇంటి గోడను అనుకునే ఉంటుంది. పళనిసామి, అముదల పెళ్లి కూడా 1994లో ఆ ప్రాంగణానికి సమీపంలోనే జరిగింది. అది ఆ కుటుంబానికి బాగా అలవాటైన ప్రదేశం. అందువల్ల వారికి తెలియకుండా బయటివాళ్లు వచ్చి 900 ఏళ్ల క్రితం నాటి శివుడి విగ్రహాన్ని దొంగిలించడం అసాధ్యమని గ్రామస్థుల నమ్మకం. చెన్నయ్‌కి నైరుతి దిశగా ఐదు గంటలు ప్రయాణిస్తే అరియాళూరు జిల్లాలోని శివారు గ్రామమైన శ్రీపురంధ వస్తుంది. శివాలయమూ వస్తుంది. ఇప్పుడంటే పళనిసామి రోజూ గుడికి వెళ్లి, అక్కడ లేని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నాడు కానీ 2008లో చోరీ జరిగి, ఆ విషయం 2011లో బయటపడే వరకు ఎవరూ గుడి తలుపులే తెరవలేదు. ‘‘గుడిలోపల పెద్ద తేళ్ల గుట్ట ఉండేదట. అవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో భక్తులు, ఆలయ అర్చకులు తేలు కాటుకు గురయ్యి ప్రాణం మీదకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయట. అందుకే ఆలయాన్ని శాశ్వతంగా మూసేశారని మా పెద్దలు అనుకోవడం విన్నాను’’ అని గ్రామ పెద్ద రామాయణ్ ఉలగనాథన్ చెబుతుంటారు. మొత్తానికి 2012లో విగ్రహం దొంగలు పట్టుబడడంతో వారి ద్వారా అశోకన్ అనే తమిళనాడు వ్యాపారి, అతడి ద్వారా అంతర్జాతీయ పురావస్తు అక్రమరవాణాలో పేరుమోసిన స్మగ్లర్ సుభాస్ చంద్ర కపూర్ పోలీసులకు పట్టుపడ్డారు. ప్రస్తుతం కపూర్ రిమాండ్‌లో ఉన్నాడు. ఇటీవలే స్థానిక మేజిస్ట్రేటు అతడి రిమాండును మార్చి 21 వరకు పొడిగించారు. ‘‘ఇప్పుడంటే గ్రామస్తులు శాంతించారు కానీ, గత రెండేళ్లగా మాకెంత నరకం చూపించారో, ఎంతగా అవమానించారో మాటల్లో చెప్పలేను. ఆ శివయ్యే మమ్మల్ని కాపాడాడు. దోషుల్ని బయటపెట్టి, మా నిర్దోషిత్వాన్ని గ్రామస్థులకు రుజువు చేశాడు’’ అని చెబుతూ కన్నీళ్ల పర్యంతం అవుతుంటారు పళనిసామి భార్య అముద. పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఇంత విషం తాగి చనిపోదామనుకున్న రోజులు కూడా ఈ దంపతుల జీవితంలో ఉన్నాయి. శ్రీపురంధలో ఇప్పుడు గ్రామస్థులంతా పళనిసామి కుటుంబాన్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అలా పలకరించడంలో పరిహారం ఏదో చేసుకుంటున్న భావన వారిలో వ్యక్తమవుతుంటుంది. ఊళ్లోకి మళ్లీ శివయ్య వచ్చేరోజు కోసం శ్రీపురంధ ఎదురుచూస్తూ ఉంది. ముఖ్యంగా పళనిసామి, ఆయన భార్య. శివయ్య తిరిగి వస్తాడా? చెప్పలేం. నేషనల్ ఆర్ట్ గ్యాలరీలోని నటరాజ విగ్రహం, శ్రీపురంధ విగ్రహం ఒకటి కాదని గ్యాలరీ డెరైక్టర్ రాన్ రాఫోర్డ్ పేచీ పెడుతున్నారు. ‘‘లక్షల డాలర్లు పోసి ఓపెన్ మార్కెట్లో మేము ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశాం’’ అని ఆయన అంటున్నారు. ఏమైనా, నిజానిజాలు ఎంత త్వరగా తేలితే అంత త్వరగా తమ ఊరికి శివయ్య వస్తాడని శ్రీపురంధ గ్రామస్థులు భావిస్తున్నారు. దైవపీఠంపై శివయ్య లేకపోతే ఊరిలో మనుషులున్నా లేకున్నా ఒకటేనని ఇప్పుడా గ్రామం నమ్ముతోంది. అందుకే శివయ్య కోసం వారి కళ్లు కాయలు కాస్తున్నాయి. -
కమనీయం..అప్పన్న జలవిహారం
సింహాచలం, న్యూస్‌లైన్: సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం గురువారం సాయంత్రం కనుల పండవగా జరిగింది. వేణుగోపాలస్వామి అలంకారంలో స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై కోనేరులో హంస వాహనంపై నౌకా విహారం చేశారు. పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ ఉత్సవంలో అశేష భక్తజనం పాల్గొని స్వామి తెప్పోత్సవాన్ని కనులారా తిలకించి, పులకించారు. స్వామివారిని మధ్యాహ్నం 4 గంటలకు మెట్ల మార్గం ద్వారా కొండదిగువకు తీసుకొచ్చారు. తొలిపావంచా వద్దకు స్వామికి అడవివరం గ్రామస్తులు, దేవస్థానం అధికారులు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి స్వామిని తిరువీధిగా కోనేరు వద్దకు తీసుకెళ్లారు. సాయంత్రం 6 గంటల సమయంలో కోనేరులో హంస వాహనంపై స్వామిని అధిష్టించి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. కోనేరు మధ్యలో ఉన్న మండపం చుట్టూ మూడుసార్లు హంస వాహనాన్ని ప్రదక్షిణగా తిప్పి, మండపంలో స్వామివారికి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి సర్వజన మనోరంజని వాహనంపై అధిష్టించారు. దేవస్థానం ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు, దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ స్వామిని దర్శించుకున్నారు. విద్యుద్దీపాలంకరణ, బాణసంచా వెలుగులు ఈ వేడుకకు శోభను తీసుకువచ్చాయి. -
శుభమణ్యేశ్వరుడు
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం... దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం... కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కుమారస్వామి కారణజన్ముడు. తారకాసురుడనే లోకకంటకుడైన రాక్షసుని సంహరించడం కోసం జన్మించినవాడు. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. మార్గశిర శుద్ధ షష్ఠి తిథి ఆయనను పూజించడానికి సర్వోత్తమమైనది. ఈరోజున ఆ స్వామిని షోడశోపచారాలతో పూజించినవారికి సంతానప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని... ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవ ల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి. ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. తమిళనాడు, పళనిలోని సుబ్రహ్మణ్యాలయం, రాష్ట్రంలోని మోపిదేవి, తిరుపతి, స్కందగిరి తదితర ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నింటిలోనూ స్వామివారికి విశేష పూజలు, ఆరాధనలు జరుగుతాయి. -
వేడుకగా ధ్వజావరోహణం
కాణిపాకం, న్యూస్‌లైన్: వినాయక స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజులపాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. ఇందులో భాగంగా ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు చేసి, మూషిక పటాన్ని కిందికి దించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో యజ్ఞయాగాదులు నిర్వహించి, అంకురార్పణ సమయంలో ధరించిన కంకణాలను తొలగించారు. తర్వాత ధ్వజస్తంభాన్ని పవిత్ర జలంతో అభిషేకించారు. ధ్వజస్తంభం వద్ద చతుర్వేద పారాయణం చేసి మంత్రపుష్ప నివేదన చేశారు. కాగా గురువారం నుంచి 29వ తేదీ వరకు వినాయకస్వామి వారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. వైభవంగా త్రిశూల స్నానం వినాయకుని ధ్వజావరోహణం సందర్భంగా బుధవారం ఉదయం వైభవంగా త్రిశూల స్నానం నిర్వహించారు. మొదట స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం యాగశాలలోని పుట్టమన్నులో వేసిన అంకురాలను మంగళవాయిద్య, మేళతాళ ధ్వనుల మధ్య తీసుకెళ్లి స్వామివారి పుష్కరిణి లో కలిపారు. తదుపరి పుష్కరిణి వద్ద స్వామివారి త్రిశూలానికి సంప్రదాయబద్ధంగా అభిషే కం నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపి పుష్కరిణిలో త్రిశూల స్నానం జరి పించారు. ఉభయదారులు, ఆలయ సిబ్బంది ఆనందంతో వసంతోత్సవాలు జరుపుకున్నారు. పుష్కరిణిలో మునిగి రంగులు చల్లుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.