చెట్టు.. నీటిబొట్టు! | Yallamma Gudem Gangamma god Worship | Sakshi
Sakshi News home page

చెట్టు.. నీటిబొట్టు!

Published Fri, Mar 4 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

చెట్టు.. నీటిబొట్టు!

చెట్టు.. నీటిబొట్టు!

యల్లమ్మగూడెంలో వింత.. గంగమ్మ దేవత మహిమేనని పూజలు
తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని యల్లమ్మగూడెంలో గురువారం ఓ వింత చోటు చేసుకుంది. ఊళ్లోని పురాతన శివాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆలయ ఆవరణలో ఓ ఎండిన చెట్టును కూలీలు రంపంతో కోస్తున్నారు. సగభాగం కోయగానే అందులో నుంచి ఒక్కసారిగా సన్నధారతో నీరు రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం గ్రామమంతా తెలిసి అందరూ అక్కడికి చేరుకున్నారు. అంతలోనే ఓ మహిళకు పూనకం రావడం, ఆ మహిళ ఇది గంగమ్మ దేవత మహిమేనని కొలుపు చెప్పడంతో గ్రామస్తులు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement