
తల్లి విగ్రహానికి పూజలు చేస్తున్న కుమారులు (ఇన్‌సెట్)అలమేలు
సేలం: కన్న తల్లిపై ప్రేమతో ఇద్దరు కుమారులు ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని నావల్‌పట్టి కాట్టూర్ గ్రామానికి చెందిన ముత్తుసామి (82), అలమేలు (72)కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు మురుగేశన్ న్యాయవాది, చిన్న కుమారుడు పచ్చముత్తు రైతు. కాగా అలమేలు అనారోగ్యంతో 2019లో మృతి చెందింది.
దీంతో వీరి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తమ తల్లిపై అమితమైన ప్రేమ కలిగిన మురుగేశన్, పచ్చముత్తు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తల్లి జ్ఞాపకంగా ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తమ వ్యవసాయ భూమిలో తల్లి నల్లరాళ్లతో ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో రెండున్నర అడుగుల ఎత్తు గల అలమేలు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి రోజూ విగ్రహానికి పాలాభిషేకం, పూజలు చేస్తూ తల్లిపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment