
సాక్షి, కొవ్వూరు : జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రం చేరుకొన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య జననేత గోదావరమ్మకు హారతినిచ్చారు. అనంతరం ఆలయాన్ని దర్శించుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. ఆయనతోపాటు పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment