మేడారంలో ఘనంగా గుడిమెలిగె పండుగ
గుళ్లను శుద్ధి చేసిన పూజారులు
ధూప, దీప నైవేద్యాలతో తల్లులకు పూజలు
మేడారం(తాడ్వాయి): మేడారంలో గుడిమెలిగె పండుగను పూజారులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు మహాజాతర జరగనుంది. జాతరకు సరిగ్గా రెండు వారాల ముందుగా గుడిమెలిగె పండుగ చేస్తారు. సమ్మక్క పూజారులైన కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, సిద్ధబోయిన మునేందర్, భోజరావు, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, బొక్కెనలు ఉదయం 9గంటలకు మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకుని గుడి తలుపులు తెరిచారు. ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య కొత్త చీపురుతో గుడిలోని బూజు దులపగా.. పూజారులే గుడిలోపల పెయింటింగ్ వేశారు. అనంతరం అమ్మవారి శక్తి పీఠం, పూజ సామగ్రిని శుద్ధి చేశారు.
అలాగే మధ్యాహ్నం 2గంటల తర్వాత పూజారుల కుటుంబాల మహిళలు గుడిలోని అమ్మవారి గద్దెను పసుపు, కుంకుమలతో అలంకరించి ముగ్గులు వేశారు. అమ్మవారి శక్తి పీఠాన్ని, ధ్వజస్తంభం, ద్వారాన్ని కూడా అలంకరించారు. తర్వాత పూజారులు యాటతో గుడి చూట్టూ ప్రదక్షిణలు చేసి దూప, దీప నైవేద్యంతో రహస్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మ క్క తల్లికి నైవేద్యంగా యాటను జడత పట్టారు. గుడిమెలిగె పండుగతో దేవతల జాతర పూజ కార్యక్రమాల తంతు మొదలైనట్లు పూజారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు.
సారలమ్మ గుడిలో..
సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని శుద్ధి చేశారు. సారలమ్మ పూజ సా మగ్రి, వస్తువులను శుద్ధి చేశారు. మహిళలు గుడి లోపల, ఆవరణలో ముగ్గులు వేశారు. సారలమ్మ వడ్డెరలు కుండలను అలంకరించారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యతోపాటు పూజారులు రహస్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా గుడి మెలిగె పండుగ సందర్భంగా పూజారులు తమ ఇళ్లను కూడా శుద్ధి చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలుకు చల్లి.. ముగ్గులు వేసి
Published Thu, Feb 4 2016 1:32 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement
Advertisement