
పనిచేయని ఫోన్లతో ఇబ్బందులు
ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన బాలసంజీవని యాప్ సక్రమంగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో యాప్ ఇన్‌స్టాల్ అయినా సర్వర్లు మొరాయిస్తుండటంతో వివరాలు నమోదు చేసేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉంది. నెట్ లేకపోతే యాప్‌లు ఓపెన్ కావడం లేదు. – సరస్వతి, అంగన్‌వాడీ కార్యకర్త,
అమడాల, కోవెలకుంట్ల మండలం
ట్యాబ్‌లు పంపిణీ చేయాలి
బాల సంజీవని 2.0 యాప్‌తో అంగన్‌వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇచ్చిన మొబైల్ ఫోన్లలో ఈ యాప్ పనిచేయడం లేదు. పాత ఫోన్లను వెనక్కు తీసుకుని ఆ స్థానంలో ఆధునిక టెక్నాలజీ కలిగిన 5 జీ ట్యాబ్‌లు పంపిణీ చేసి అంగన్‌వాడీలకు యాప్ కష్టాలు తొలగించాలి. యాప్‌ల నిర్వహణతో అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు పడుతున్న అవస్థలు తొలగించాలి.
– వెంకటలక్ష్మి, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పెర్స్ అసోసియేషన్ నాయకురాలు, కోవెలకుంట్ల
అంగన్‌వాడీలపై
పనిభారం తగ్గించాలి
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలపై పనిభారం అధికమైంది. కేంద్రాల్లో విద్యాబోధన, యాప్‌ల నిర్వహణతో సతమతమవుతున్నారు. ఈ పనులే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. అరకొర వేతనం ఇస్తూ అంగన్‌వాడీలతో వెట్టిచాకిరి చేయించడం సరికాదు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు వారిపై పనిభారం తగ్గించకుంటే రాబోయే రోజుల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు చేపడతాం.
– సుధాకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి,
కోవెలకుంట్ల

పనిచేయని ఫోన్లతో ఇబ్బందులు

పనిచేయని ఫోన్లతో ఇబ్బందులు