
మద్యం బాబులకు కిక్కు దిగేలా జరిమానా
కర్నూలు: పోలీసు తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులకు కిక్కు దిగేలా న్యాయస్థానం జరిమానా విధిస్తోంది. మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్లే ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కవయ్యాయని భావించిన పోలీసులు జిల్లా అంతటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృత్తం చేశారు. నిబంధనలు పాటించకుండా మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. గతంలో ఒక్కొక్కరికి రూ.3 వేలు జరిమానా విధించిన న్యాయస్థానం మందుబాబుల్లో మార్పు రావడం లేదని గుర్తించి రూ.10 వేలు జరిమానా విధించారు. మూడవ పట్టణ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో ఐదుగురు మందు బాబులు పట్టుబడ్డారు. బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు జరిమానా విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన 18 మందిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించింది.
ఒక్కొక్కరికి రూ.10 వేలు విధిస్తూ
న్యాయస్థానం తీర్పు