కర్నూలు(అగ్రికల్చర్): రైతుబజార్లు, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వివిధ శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, తూనికలు, కొలతల శాఖ, ఫుడ్ సేప్టీ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. సి.క్యాంపు, అమీన్ అబ్బాస్‌నగర్, కొత్తపేట రైతుబజర్లలో కాటాలను పరిశీలించారు. ఫుడ్ సేప్టీ అధికారులు మామిడి పండ్లలో శ్యాంపుల్స్ సేకరించారు. రైతుబజార్లలోని దుకాణాల్లో కూడా వంట నూనె లు, ఇతర వస్తువుల నాణ్యత ప్రమాణాలను కూడా తనిఖీ చేసి శ్యాంపుల్స్ తీశారు. మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సంబంధించి కాటాలను పరిశీలించారు. కాల్షి యం కార్బైడ్‌తో మాగించిన మామిడి మార్కెట్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఫుడ్ సేప్టీ అధికారులు శ్యాంపుల్స్ సేకరించారు. నగరంలోని వివిద వాటర్‌ప్లాంట్లతో కూడా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో డీఎస్‌వో రాజారఘువీర్, మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.