
పొగాకు బస్తాలకు నిప్పంటించి నిరసన
నందికొట్కూరు: పట్టణ సమీపంలోని మార్కెట్ యార్డు వద్ద కేజీ రోడ్డుపై పొగాకు బస్తాలకు నిప్పంటించి రైతులు బుధవారం నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులను నట్టేట ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా పొగాకును రూ. 15,500 ప్రకారం కొనుగోలు చేస్తామని అలయన్స్ కంపెనీ హామీ ఇవ్వడంతో మిడుతూరు మండలం చౌట్కూరు గ్రామ రైతులు 40 మంది 600 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. పంట చేతికి వచ్చిన తర్వాత నాణ్యత లేదని సాకు చూపుతూ అలయన్స్ కంపెనీ మేనేజర్ రూ, 5,500 నుంచి రూ.6 వేలు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. మద్దతు ధర ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అలయన్స్ కంపెనీ తీరుపై భగ్గుమంటూ నందికొట్కూరు మార్కెట్ యార్డు వద్ద కేజీ రోడ్డుపై పొగాకు బస్తాలపై పెట్రోల్ పోసి తగలపెట్టారు.
మద్దతు ధర కల్పించాలని
రైతుల డిమాండ్