Cyclone Biparjoy Live Updates: 8 States On High Alert - Sakshi
Sakshi News home page

సైక్లోన్‌ బిపర్‌జోయ్‌తో 8 రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ

Published Wed, Jun 14 2023 2:50 PM | Last Updated on Wed, Jun 14 2023 3:39 PM

Biparjoy Heads To Gujarat Updates heavy Rain warn for 8 States - Sakshi

గుజరాత్‌ తీరాన్ని తాకే సమయంలో బిపర్‌జోయ్‌ తన మహోగ్రరూపాన్ని ప్రదర్శించనుంది.. 

సైక్లోన్‌ బిపర్‌జోయ్‌ గురువారం సాయంత్రం గుజరాత్‌ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ.. అప్రమత్తత చేస్తూ వస్తోంది. ముందస్తు జాగ్రత్తగా గుజరాత్‌ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దాదాపు 17 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 12 ఎస్డీఆర్‌ఎఫ్‌ టీంలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఎనిమిది రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. 

బిపర్‌జోయ్‌ ఇవాళ పోర్‌బందర్‌, ద్వారకా వద్ద తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. రేపు సాయంత్రం జఖావూ పోర్ట్‌ వద్ద తీరం దాటోచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే క్రమంలో గురువారం సౌరాష్ట్ర, కచ్‌పై విరుచుకుపడే అవకాశం ఉండడంతో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. దాదాపు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతూ.. 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని హెచ్చరించింది. 

బిపర్‌జోయ్‌ తుపాను కారణంగా.. గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్‌లకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రెండు రోజులపాటు అంటే జూన్‌ 15 నుంచి 17 మధ్య ఈ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే 38 వేల మందిని సముద్ర తీరం నుంచి ఖాళీ చేయించినట్లు ప్రకటించింది. అయితే ఆ సంఖ్య 44వేలదాకా ఉంటుందని క్షేత్రస్థాయిలోని అధికారులు అంటున్నారు. 1965 నుంచి ఇప్పటిదాకా గుజరాత్‌ను తాకిన మూడో తుపానుగా బిపర్‌జోయ్‌ నిలవనుంది. 

ముంబైలో అలర్ట్‌
బిపర్‌జోయ్‌ కారణంగా ఇప్పటికే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. పశ్చిమ రైల్వేలో పలు రైలు రద్దుకాగా, కొన్నింటిని ఆయా మార్గాల్లో కుదించి నడుపుతున్నారు.

ఇదీ చదవండి: బిపర్‌జోయ్‌ డ్యామేజ్‌ ఏ రేంజ్‌లో జరుగుతుందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement