red alert
-
బర్డ్ ఫ్లూతో పులులు, చిరుత మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్‌ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్‌లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్‌ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. -
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రెండు జిల్లాల్లో కుండపోతశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుహెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్‌ఎన్‌పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.తిరుమలలో భారీ వర్షంతిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు. విమాన సర్వీస్‌లు రద్దువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్‌లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్‌లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్‌వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్‌లు రద్దయ్యాయి. భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లుశనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్పోలూర్లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.సముద్రం అల్లకల్లోలంవిశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖలోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.తుపానుపై సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు. కాగా, ఫెంగల్ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. -
Cyclone Alert: తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం..
-
‘ఫెంగల్’ తుఫాన్.. తమిళనాడు,పుదుచ్చేరిలకు రెడ్ అలర్ట్
చెన్నై:తమిళనాడు,పుదుచ్చరిలకు భారత వాతవావరణశాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం తుఫానుగా మారనుందని వెల్లడించింది.ఫెంగల్ తుఫాను ప్రభావంతో బుధ,గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు,పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.ప్రస్తుతం తుపాను తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుపాను దగ్గరగా రానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి,అమరావతి: మరి కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది.ఈ తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయల భారీ వర్షాలు , కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ సంభవించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందిబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని వాతావారణ శాఖ సూచనలు జారీచేసింది. -
వీడియో: జడివాన ఎఫెక్ట్.. ముంబై అతలాకుతలం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నేడు ముంబై, పూణేలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు.బుధవారం రాత్రి నుంచి ముంబై, పూణేలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లకు మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే.. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ విమాన సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్టు ఓ ప్రకటనలో తెలిపాయి. పలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడంతో రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. దీంతో, పలు రద్దు రైళ్లను కూడా రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.#Ghatkopar Metro station right now on your left and LBS marg near #Vikhroli on your right !! non stop rains since past 3 hours #MumabiRains next #FlightsMumbai pic.twitter.com/J5iOqmU86R— sudhakar (@naidusudhakar) September 25, 2024The Kurla-Harbour line in Mumbai was heavily waterlogged last night due to heavy rain in the city. #MumbaiRain #MumbaiWeather pic.twitter.com/xLMF2kMn7w— Vani Mehrotra (@vani_mehrotra) September 26, 2024Heavy rainfall in mumbai It looks like Tsunami🥺ईश्वर सबकी रक्षा करें। सभी मुंबई वासी घरों में सुरक्षित रहे।#MumbaiRain #Mumbai #MumbaiWeather #MumbaiNews #Courreges #FreeCitizens pic.twitter.com/ziM0LeqTKA— Akshay jangid (@jangirakashay67) September 26, 2024ఇక, వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై పరిధిలో ఈదురుగాలు, పిడుగుపాటుల కలయికగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, నందూర్బర్, ధూలే, జల్గావ్, సోలాపూర్, సతారాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బుధవారం రాత్రి వర్షాల కారణంగా మ్యాన్‌హోల్‌లో పడిపోయి ఓ మహిళ మృతిచెందింది. మరోవైపు.. ఈనెల 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ల పరిధిలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. #WATCH | Mumbai, Maharashtra | Water recedes at the Andheri Railway Station after the city witnessed severe waterlogging and traffic followed by heavy rainfall yesterday. pic.twitter.com/8LtU2pgw0Z— ANI (@ANI) September 26, 2024 #WATCH | Thane, Maharashtra | Torrential rains in Mumbai lead to landslide at the Mumbra by-pass road. pic.twitter.com/SZ1kVUHmz7— ANI (@ANI) September 25, 2024#WATCH | Mumbai, Maharashtra | Railway commuters walked on tracks at the Chunabhatti Railway station as Mumbai faced severe waterlogging followed by torrential rains. (25.09) pic.twitter.com/ewA8caiAIO— ANI (@ANI) September 25, 2024 -
తీరం దాటిన వాయుగుండం..
-
అస్నా తుపాను.. కర్ణాటకకు రెడ్ అలెర్ట్
బెంగళూరు: అస్నా తుపాను విస్తరిస్తున్న క్రమంలో భారత వాతావరణ శాఖ (IMD) కర్ణాటకలోని తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) గుజరాత్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది అస్నా తుపాన్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ఏర్పడటం సాధారణం కాదని తెలిపింది. అరేబియా సముద్రం వైపు కదిలి ఈ తుపాను ఒమన్ వైపు వెళుతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. 1976 అరేబియా సముద్రంలో మొదటిసారి విస్తరించిన ఈ తుపాన్‌కు పాకిస్తాన్.. అస్నా తుపానుగా పేరు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 1976, 1944, 1964 సంవత్సరాల్లో తీర ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావం అధికంగా పడినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్‌ను ముంచెత్తాయి. దీంతో సుమారు 18 వేల మందిని సురక్షిత ప్రాంతలకు తరలించారు. 1200 మందినిస సహాయాక బృందాలు రక్షించాయి. గుజరాత్ భారీ వర్షాలకు 26 మంది మృతి చెందారు. అయితే నిన్న శుక్రవారం వర్షం కొంత తెరిపి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మళ్లీ భారీ వర్షాలకు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారలు అప్రమత్తం అవుతున్నారు. -
భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం.. 29 మరణాలు..
అహ్మదాబాద్: గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటివరకు దాదాపు 29 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే..సుమారు 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సుమారు 300 మందిని వరదల నుంచి కాపాడాయి.गुजरात में बाढ़ से पीड़ित परिवारों को सुनिए - दो दिन से बारिश हो रही है। हम बाहर नहीं जा पा रहे हैं। ठीक से खाना भी नहीं खाया है। कोई भी हमें राहत सामग्री देने नहीं आया है।हम सो भी नहीं पा रहे हैं।पूरी रात यहीं बैठकर काट रहे है#GujaratFlood #GujaratRain #Jamnagar #GujaratRains pic.twitter.com/iTJWjPxT1n— Gaurav Singh (@Gaurav2372000) August 28, 2024మరోవైపు.. ఇవాళ( గురువారం) రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో.. కచ్ఛ్, ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, సురేంద్రనగర్, జునాగఢ్, రాజ్‌కోట్, బొటాడ్, గిర్సోమ్నాథ్, అమ్రేలి, భావ్‌నగర్‌లతో కూడిన కచ్ , సౌరాష్ట్ర ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్‌లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.गुजरात के उपर बहोत ही बडा डीप डिप्रेशन बना हुआ है जिसका अंदाजा आप नीचे दी गई इमेज से लगा सकते है।नदिया उफान पर है कई हाइवे पानी की वजह से बंद करने पडे है।अगर जरुरी ना हो तो कृपया घर से बाहर ना निकले#HeavyRain #GujaratRains #Gujarat #Ahmedabad #Vadodara #Kutch #RainAlert pic.twitter.com/oNyRyt9r03— Rakesh Chauhan✨💫🇮🇳(मोदी का परीवार) (@hindu_balak07) August 28, 2024 రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు పెరిగాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.బుధవారం సుమారు 6వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలు తరలించినట్లు అధికారులు తెలిపారు.गुजरात: लगातार भारी बारिश के बाद जामनगर शहर में जगह-जगह भीषण जलभराव हो गया है। बहुत जगह बाढ़ भी आई है। #GujaratFlood #GujaratRain #Jamnagar #GujaratRains pic.twitter.com/l8m15pN71I— Gaurav Singh (@Gaurav2372000) August 28, 2024 గుజరాత్లో ఇప్పటివరకు కురిసిన వర్షం.. సగటు వార్షిక వర్షపాతంలో 105 శాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షంతో అజ్వా, ప్రతాపురా రిజర్వాయర్ల నుంచి నీటిని విశ్వామిత్ర నదిలోకి విడుదల చేశారు. దీంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలను జలమయం చేశాయి. నది తీర ప్రాంతాలైన వడోదర, ఇతర నగరాల్లోకి గ్రామాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 అడుగుల్లో నీరు నిలిచింది.భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసిన పరిస్థితిని ఆరా తీశారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న గుజరాత్‌కు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ పలు అంచనాలను వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో శనివారం (ఆగస్టు 24) ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది.గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, గోవా, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.వాతావరణశాఖ అందించిన డేటా ప్రకారం ఈ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 269.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత దశాబ్దంలోనే అత్యధికం. ఆగస్టు 23 వరకు, ఢిల్లీలో 274 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది ఆగస్టు 2014 లో నమోదైన గరిష్ట వర్షపాతం కంటే అత్యధికం.ఆగస్టు 25న గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. -
పుణె నగరానికి వరద ముప్పు.. ‘ఐఎండీ’ హెచ్చరిక
ముంబయి: మహారాష్ట్రలోని పుణె నగరానికి వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరించింది. భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నందున పుణెకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో రెండు టీమ్‌ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పుణె, చించ్వాడ్,బలివాడిలో సిద్ధంగా ఉంచారు.పుణె, పింప్రి చించ్వాడ్ నగరాల్లోని పౌరులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆయా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కోరారు. రెండు నగరాల్లోని డ్యాముల నుంచి నీటిని కిందకు వదులుతుండటంతో వరదలు పోటెత్తే అవకాశముంది.డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. ముంబైలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ముంబైలో దట్టమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
వీడియో: భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకాధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 112.5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు.. వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.#WATCH | Delhi: Waterlogging witnessed in several parts of the national capital after heavy rainfall; visuals from outside Civic Center near Ramlila Maidan. pic.twitter.com/19UhRO02ag— ANI (@ANI) July 31, 2024ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో నేడు ఢిల్లీలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. ఇక, వర్షాలు కురుస్తున్న వేళ జాగ్రత్తగా ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజలకు సూచించారు. కాగా, ఢిల్లీలో రాబోయే 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ విధించింది. మరోవైపు.. వర్షాల కారణంగా ఢిల్లీలో 13 ఇళ్లు కూలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. #WATCH | Delhi: Traffic flow impacted near ITO as a result of heavy rains and waterlogging pic.twitter.com/clEyUfWurL— ANI (@ANI) July 31, 2024 Current Situation at Old Rajendra Nagar after Rains 🚨Years of Negligence and Corruption have Resulted into this. MCD and Delhi Govt should Wake Up to Such Conditions. Together, they have turned it into a Death Trap. pic.twitter.com/CeJosR4PTJ— Deepanshu Singh (@deepanshuS27) July 31, 2024 Delhi Minister & AAP leader Atishi tweets, "In light of very heavy rainfall today evening and forecast of heavy rainfall tomorrow, all schools - government and private - will remain closed tomorrow." pic.twitter.com/grisV4oFgT— ANI (@ANI) July 31, 2024 -
జలదిగ్బంధంలో ముంబై, పూణే.. స్కూల్స్ బంద్
ముంబై: మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇక, పూణే, థానే, పాల్ఘర్ నగరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, ముంబై, పూణే, సహ పింప్రి, చించ్విడ్ నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల కారణంగా ముంబైకు పలు విమాన సర్వీసులు రద్దు అయినట్టు తెలుస్తోంది. Railway tracks on Vikhroli station. Travel only if there's an emergency. #MumbaiRains#MumbaiRains pic.twitter.com/9ZlnrC3QRW— Shakib (@MohdShakib98513) July 25, 2024 మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. This is the Indrayani river overflowing at Alandi today.Crazy, scary videos being shared from all across Pune by people!Hope the rains mellow down soon. pic.twitter.com/ixv3UYv1WD— Urrmi (@Urrmi_) July 25, 2024 జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలో శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. This is how it looks like in our locality.. #PuneRains #Pune pic.twitter.com/wEpiRj8a1t— 🎼🎵🌝 𝒟𝒾𝓋𝓎𝒶 𝒮 🇮🇳 🌝🎵🎼 (@_MyInspirationz) July 25, 2024 -
‘మహా’వృష్టి
ముంబై: మహారాష్ట్రలోని పలు జిల్లాలపై వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ముంబై మహానగరంసహా థానె, పుణె, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయందాకా ఎడతెగని వానలతో పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భీకరవర్షాలకు ఆయా ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణెలోని దక్కన్ ప్రాంతంలో విద్యుదాఘాతంతో ముగ్గురు, తహమినీ ఘాట్‌లో కొండచరియలు పడి ఒకరు చనిపోయారు. జలదిగ్భంధంలో చిక్కుకున్న వారికి కాపాడేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ముంబైలోనూ వానలు ముంచెత్తాయి. సిటీ లోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జూలైలోనే అత్యధికంగా 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర చరిత్రలో జూలైలో రెండో అత్యంత భారీ వర్షపాతం ఇదే. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎయిర్‌పోర్టులో విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై 300 మీటర్ల దూరం తర్వాత ఏమీ కనిపించట్లేదు. దీంతో 11 విమానాలను రద్దుచేశారు. కొన్నింటిని వేరే నగరాలకు దారి మళ్లించారు. -
Heavy Rains: ‘రెడ్ అలెర్ట్’లో ముంబై.. కరెంట్ షాక్‌తో ముగ్గురి మృతి
మహారాష్ట్రను భారీ వర్షాలు బెంబేలెతిస్తున్నాయ్. రాష్ట్ర రాజధాని ముంబైతోపాటు, పుణె, థానె, కొల్హాపూర్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబై, పుణె వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ జీవితం స్తంభించిపోయింది. స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. పుణె పింప్రి-చించ్వాడ ప్రాంతంలో అనేక అపార్ట్మెంట్లోకి వరద నీరు చేసింది. కాగా డెక్కన్ జింఖానా ప్రాంతంలో నీటితో నిండిన వీధుల్లో వీధిలో నడుస్తుండగా ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అభిషేక్ ఘనేకర్, ఆకాష్ మానే, శివ పరిహార్ వీధి వ్యాపారులు ప్రాణాలు కోల్పోయారు.This city needs prayers today 🙏#MumbaiRains pic.twitter.com/1XRK582CRr— Nikita Dutta (@nikifyinglife) July 25, 2024> ముంబై, థానే వంటి పొరుగు ప్రాంతాలు కూడా భారీ వర్షాల కారణంగా అల్లాడిపోతున్నాయి. అంధేరి, సియోన్, చెంబూర్, కుర్లా, థానేలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబయిలోని అంధేరి సబ్వే వరద నీరు కారణంగా మూతపడింది. నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు సరస్సులలో విహార్ సరస్సు, మోదక్ సాగర్ సరస్సు నేడు తెల్లవారుజామున పొంగిపొర్లుతున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. రంగంలోకి దిగిన జాతీయ విపత్తు ప్రదిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) మూడు బృందాలతో సహాయక చర్యల్లో పాల్గొంది.కుండపోత వర్షాలతోనీటి మట్టం పెగిఠా నదిపై ఉన్న బాబా భిడే వంతెన నీటిలో మునిగిపోయింది. అదే విధంగా ఖడక్వాస్లా డ్యాం పూర్తి స్థాయికి చేరుకుంది. ముఠా నది ఒడ్డున నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొల్లాపూర్‌లో పంచగంగ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నదికి సమీపంలోని ప్రాంతాల ప్రజలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహాయం చేస్తోంది.🌧️ 𝗣𝘂𝗻𝗲 𝗪𝗲𝗮𝘁𝗵𝗲𝗿 𝗔𝗹𝗲𝗿𝘁 🌧️ •Schools, private offices, tourist places shut down, 4 dead in rain-related incidents.•It's been raining continuously in pune for the last 12 hours.🌧️⛈️#PuneRains #MumbaiRains pic.twitter.com/Iw3ZPWFZHd— RAJA👑 (@SWAPNIL_2211) July 25, 2024 ముంబైలో కూడా పరిస్థితి భయంకరంగా మారింది. 150 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది జూలైలో రెండవ అత్యంత ఎక్కవగా రికార్డైంది. శుక్రవారం ఉదయం వరకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వెళ్లకుండా ఉండాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల మధ్య ముంబైకి వెళ్లే కొన్ని విమానాలు ఆలస్యం కానున్నాయని, కొన్నింటిని దారి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు తెలియజేసింది. This is how #MumbaiRains look from a flight! 😻 https://t.co/QrPE5X9lGO pic.twitter.com/FvnIGjjTC0— WabiSabi (@Geeky_Foodie) July 20, 2024రాష్ట్రంలో పరిస్థితిపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సమీక్ష చేపట్టారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేయాలని పుణె కలెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు. మునిగిపోయే ప్రమాదం ఉన్న వంతెనలపై ట్రాఫిక్‌ను నిషేధిస్తామని చెప్పారు. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని కోరారు. -
Telangana: రెండు రోజులు వర్షాలే.. వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం వాయుగుండం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి గురువారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ రెడ్అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ... మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచి్చంది. శుక్రవారం రాష్ట్రంలో సగటున 2.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 25.76 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 31.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో ఒకరి గల్లంతు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం తానిçపర్తికి చెందిన బానారి రాజు (45) గోదావరిలో గల్లంతయ్యాడు. చేపల వేటకని గురువారం వెళ్లిన రాజు శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మహదేవపూర్ మండలం అన్నారం వైపు నుంచి దామెరకుంట వైపుగా ట్రాలీ ఆటో గుండ్రాత్‌పల్లి సమీపంలో గల అలుగువాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తమై ఆటో ఎక్కి అరవడంతో గమనించిన స్థానికులు రక్షించారు. -
TG: పలు జిల్లాలకు భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం(జులై 19) నాలుగు జిల్లాలకు భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక శనివారం(జులై 20) ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపెల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఒక్కసారిగా వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయుగుండం ప్రభావంతో.. బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుండటంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. -
AP: భారీ వర్షాలు.. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదస్థాయిలో న ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రవహిస్తుంది.రాష్ట్రంలో పలుచోట్ల ఆనకట్టలు దెబ్బ తింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు, అధికారులు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోలోనూ మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైంది.తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాజమండ్రితో పాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో డెల్టా కాలువలకు నాలుగు వేల క్యూసెక్కులు సరఫరా చేసి మిగిలిన నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 175 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు బ్యారేజ్ ఇరిగేషన్ అధికారులు.లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
Heavy Rains: రెడ్ అలర్ట్ జారీ.. విద్యాసంస్థలకు సెలవులు
కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్, ఎర్నాకులం, వాయనాడ్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వాతావరణం అనుకూలించే వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని అధికార యంత్రాంగం ఆదేశించింది.ఉత్తర మలప్పురం, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.కొట్టాయం జిల్లాలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలులతో చెట్లు కూలడంతో ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.ఉత్తర కోజికోడ్‌లోని ఓంచియం, కొత్తూర్, పయ్యోలి తదితర గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.మూజియార్ డ్యామ్ షట్టర్లు పెంచినందున దాని పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పాతనంతిట్ట జిల్లా అధికారులు కోరారు. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడం, వాహనాలు సరిగా కనిపించకపోవడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. -
కుమ్మేస్తున్న వర్షాలు.. మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్, గోవాలోని పలు ప్రాంతాల్లో సోమ(నేడు), మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. కర్ణాటక, కేరళలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు దేశంలో చురుకుగా మారే అవకాశం ఉంది.మహారాష్ట్రలోని మరఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది.గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాలు వరదల బారిన పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. -
Mumbai Rains: ముంబైను వీడని వర్షాలు.. రెడ్ అలెర్ట్.. పరీక్షలు వాయిదా
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైను వర్ష భయం వీడటం లేదు. రెండు రోజుల నుంచి నగర వాసులను భారీ వర్షాలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే ఆదివారం ఆర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసన వర్షాలు ముంబై, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో చెరువులను తలపించింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.కాగా ముంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో ముంబైకు 'రెడ్' అలర్ట్ జారీ చేసింది.ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణెతోపాటు రత్నగిరి-సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు . అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.ఇదిలా ఉండగా సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది. లోకల్ రైలు సేవలు, బస్సు సర్వీసులు, విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిన గాయాలతో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు సైతం విడిచింది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు ముగిసిన ఆరు గంటల్లో 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
భారీ వర్షాలు.. ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. వరదల ధాటికి పలు చోట్ల రోడ్డు రవాణా స్తంభిస్తోంది. భారీ వర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) సోమవారం(జులై )1 వెల్లడించింది.వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశమున్న ఏడు రాష్ట్రాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో 4వ తేదీ వరకు రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని తెలిపింది. మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సున్న హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశంలోని వాయవ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. -
ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
దేశ రాజధాని ఢిల్లీలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికిముందు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు ఎండ తీవ్రత మరింత పెరిగిన నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికితోడు మరో రెండు రోజుల వరకు ఢిల్లీలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదని వాతావరణశాఖ పేర్కొంది.ఆదివారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సగటు కంటే 5.7 డిగ్రీలు ఎక్కువ. నగరంలో వరుసగా ఎనిమిదో రోజు వడగాడ్పులు వీచాయి. వరుసగా 35వ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే అధికంగా నమోదైంది. మధ్యాహ్నం సమయంలో ఎండలో బయటకు వెళితే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం పూట ఇంట్లోనే ఉంటూ నీరు తాగుతూ ఉండాలని సూచించింది.జూన్ 11 నుంచి రుతుపవనాలు ముందుకు సాగడం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా, దేశంలోని మధ్య, ఉత్తర ప్రాంతాలలో వేడివాతావరణం కొనసాగుతున్నదని పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 27-30 మధ్య ఢిల్లీకి చేరుకుంటాయి. ఈసారి కూడా రుతుపవనాలు అదే సమయానికి ఢిల్లీకి తరలివచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. -
తమిళనాడుకు రెడ్ అలర్ట్..
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ తమిళనాడులో రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి పర్వత శ్రేణుల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుంది. ఊటీలోనూ కుండ పోత వర్షం కురుస్తుంది. దీంతో జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, కన్యాకుమారి, టెన్‌కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. Meenakshi Amman temple is located in #Madurai, Tamil Nadu.The temple has a fully functional ancient rainwater harvesting system installed when it was built in the year 1190 CE.View of Meenakshi Amman temple during rains. Perfect water management.… pic.twitter.com/RI3mOcexJN— SK Chakraborty (@sanjoychakra) May 17, 2024 ఇక, భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. ఊటీలో కుండపోత కారణంగా పర్యాటకలు గదులకే పరిమితమయ్యారు. మరోవైపు.. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో, అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. Today to Tomorrow: Ghats zone, West, south and central #Tamilnadu, #Kerala, south #Karnataka (image 1) will see heavy to very heavy rains /Thunderstorms.Southern TN,#kumari #Nellai ghats of kerala and TN has high chance for very heavy rains.#Nilgiris #Covai #Tiruppur… pic.twitter.com/s3Xak6qoQY— Rainstorm - வானிலை பதிவுகள் (@RainStorm_TN) May 22, 2024 -
నిప్పుల కొలిమి!
పదేళ్లలో ఇవే అత్యధికంగత పదేళ్ల వేసవి సీజన్ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్నవే అత్యధికమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మే ప్రారంభంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయని అంటున్నారు. ఎప్పుడూ కూడా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అటుఇటుగా నమోదయ్యేవని.. ఇప్పుడు మాత్రం 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా కొనసాగుతున్నాయని వివరిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది.. దంచికొడుతున్న ఎండలతో కుతకుత లాడుతోంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్కుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలు కూడా దాటిపోయాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండ జిల్లా గుడాపూర్‌లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 46.5, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, నల్లగొండ జిల్లా చండూరులో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొనసాగుతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఏకంగా 5 డిగ్రీ లు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నట్టు తెలిపింది.11 జిల్లాలకు రెడ్ అలర్ట్..ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజా మాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యా పేట, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని.. వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మొత్తంగా వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీయవచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తక్షణ సహాయక చర్యలు తీసు కునేలా సమాయత్తం కావాలని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. -
న్యూఇయర్ వేళ ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్!
ఢిల్లీ: దేశ రాజధానిలో న్యూఇయర్ దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలితో ప్రారంభం కానుంది. 2024 న్యూఇయర్ నాడు ఢిల్లీ సహా పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాలపై ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా జనవరి 1న రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. దట్టమైన పొగమంచు, అతి శీతల పరిస్థితులపై వాతావరణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరభారతంలో చలి తీవ్రత 9 డిగ్రీల సెల్సియస్ నుంచి 6 డిగ్రీల వరకు పడిపోయే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. పంజాబ్‌లోని అమృత్సర్, ఫతేఘర్ సాహిబ్, గురుదాస్‌పూర్, హోషియార్పూర్, జలంధర్, కపుర్తలా, లూథియానా, పఠాన్‌కోట్, పాటియాలా, రూప్‌నగర్, తరణ్ జిల్లాల్లో దట్టమైన పొగమంచుతో కూడిన చల్లని వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్ -
ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులపై వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణాలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాలలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు కారణంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 274 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 80కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం
న్యూఢిల్లీ/బాగ్పట్: ఉత్తర భారతదేశం పొగ మంచు గుప్పిట్లో చిక్కుకుంటోంది. దారులన్నీ దట్టమైన పొగ మంచుతో మూసుకుపోతున్నాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచుకుతోడు చలి తీవ్ర నానాటికీ పెరుగుతోంది. నగరంలో నగరంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్నింటిని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చని సూచించింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదైంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ స్థాయి పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్ సున్నాకు పడిపోవడం గమనార్హం. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా క్షీణిస్తోంది. తాజాగా సగటు వాయు నాణ్యత 381గా రికార్డయిం్యంది. ఇది ‘వెరీ పూర్’ కేటగిరీలోకి వస్తుందని అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు వల్ల 8 మంది మృతి విపరీతమైన పొగమంచు వల్ల దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత, బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మరణించారు. మరో 25 మందికిపైగా గాయాలపాలయ్యారు. బరేలీ జిల్లాలోని హఫీజ్‌గంజ్‌లో మోటార్ సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. -
అన్లిమిటెడ్ ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: అన్లిమిటెడ్ స్టోర్స్ ‘రెడ్ అలర్ట్ సేల్ ఆఫర్’ను ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వ్రస్తాలపై 50% ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే రూ.3వేల షాపింగ్‌పై అంతే విలువైన ఉత్పత్తులు ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా 87 స్టోర్లలో జనవరి 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్యాషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కోరింది. -
కోస్తాలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
-
వేగంగా కదులుతున్న మిచాంగ్ తుఫాన్..
-
ఆ రెండు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ!
చెన్నై: తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. వారం పాటు నిర్వరామంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు చేసింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో ఎనిమిది జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కురవగా.. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేళి, తూత్తుకూడి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చెన్నైలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైతుందని వెల్లడించింది. కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్ష సూచనతో విపత్తు నిర్వహణ అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో 400 మందితో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపేషన్ కోసం చెన్నైలో మరో 200 మంది సిబ్బందిని నిలిపి ఉంచారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో జనం పలు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇదీ చదవండి: 80 వేల కిలోల గంటను బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి -
HYD: అత్యవసరమైతేనే బయటకు రావాలి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ సూచనలు, రేపటి వరకు అతిభారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జోనల్ కమిషనర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారామె. లోతట్టు ప్రాంతాల్లో అస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అలాగే.. పోలీస్, జీహెచ్ఎంసీ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రేపటి వరకు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని. దీంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారామె. ► ప్రజలు అత్యవసరం పని ఉంటేనే బయటి రావాలని తెలిపారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలయాలు గేట్లు ఎత్తి వేసిన నేపథ్యంలో మూసి నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జోనల్ కమిషనర్ లను ఆదేశించారు. హెల్ప్ లైన్ కు వచ్చిన పిర్యాదులకు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులకు మేయర్ సూచించారు. ఇప్పటికే నగరం, శివారుల్లోని పలు కాలునీలు నీట మునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు నీరు పోటెత్తడంతో గేట్లు వదిలి.. దిగువనకు విడుదల చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ముందస్తుగానే ఖాళీ చేయాలని కోరుతున్నారు అధికారులు. లోతట్టు ప్రజల్ని అప్రమత్తం చేయండి భారీ వర్షాలకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ సూచించారు. జంట జలాశయాల గేట్లు తెరిచినందున మూసీ పరివాహక ప్రాంతాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారుల్ని కోరారాయన. ప్రజలు కూడా ఏదైనా సమస్య ఎదురైతే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-2111 1111 డయల్ 100 ఈవీడీఎం కంట్రోల్ రూం నెంబర్ 9000113667 ► మరోవైపు మంత్రి తలసాని సైతం హైదరాబాద్ వర్ష పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని, కూలిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని, హుస్సేన్‌సాగర్.. ఉస్మాన్ సాగర్ నీటి స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రత్యేకించి నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపైనా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంను సంప్రదించాలని ప్రజలను కోరారు. ► ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. వీలును బట్టి వర్క్‌ఫ్రమ్ చేసుకోవాలని సూచించారు. అలాగే.. ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. -
హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. తెల్లవారుజాము నుంచి కుందపోత వర్షం
-
Heavy Rains: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్
-
విపత్కర పరిస్థితుల్లో చిల్లర రాజకీయాలొద్దు
సాక్షి, హైదరాబాద్: వర్షాలు కురుస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయడం తగదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వర్షాల్లో 24 గంటలు కష్టపడుతున్న ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతినేలా విమర్శలు చేయవద్దని సూచించారు. రాజకీయాలకు, ఎన్నికలకు ఇంకా సమయముందన్నారు. చేయగలిగితే ప్రజలకు సహాయం చేయాలని, అండగా నిలబడి వారికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. గురువారం హుస్సేన్‌సాగర్ వరద ఉధృతిని, మూసారాంబాగ్ వద్ద మూసీ ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉంది.. ‘రాష్ట్రంలో వరద పరిస్థితుల్ని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ఉండటంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో హైఅలర్ట్‌గా ఉంది. నగరంలోనే కాకుండా రాష్ట్రంలో నూ ఎలాంటి ప్రాణనష్టం జరగరాదనే ప్రధాన ల క్ష్యంతో అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. విద్యాసంస్థలకు సెలవులివ్వడం వల్ల ట్రాఫిక్ తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి భోజనం సహా అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నాం. అన్ని మునిసిపాలిటీల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. వర్షాలు వెలిశాక అంటువ్యాధులు, రోగాలు ప్రబలకుండా, నీరు క లుíÙతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం..’అని కేటీఆర్ తెలిపారు. ఫలితమిచ్చిన ఎస్ఎన్డీపీ పనులు.. ‘రూ.1,000 కోట్లతో చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం) పనుల వల్ల గతంతో పోల్చుకుంటే ముంపు సమస్యలు చాలా తగ్గాయి. గతంలో జల్పల్లి, కొంపల్లి వంటి ప్రాంతాలు వారం పది రోజులు నీటిలోనే మునిగి ఉండేవి. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. నగరంలోని చెరువులు పూర్తిగా నిండకుండా చూస్తున్నాం. నాలాల్లో పూడికతీత జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి వార్డు ఇన్చార్జుల దాకా అందరూ ఫీల్డ్‌లో ఉన్నారు. డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు ప్రజలకు సహాయం చేస్తున్నాయి. హుస్సేన్‌సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) వరకు వచ్చింది. దీంతో లోతట్టు ప్రాంతా లను అలర్ట్ చేశాం. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలిస్తాం. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో 24 గంటలు ప్రజలకు సేవ చేసే పనిలో నిమగ్నమై ఉంది..’అని మంత్రి తెలిపారు. వర్షాల వల్ల వచ్చే కొన్ని తాత్కాలిక స మస్యల్ని కూడా శాశ్వత సమస్యలుగా పేర్కొంటూ ‘జలమయం’వంటి మాటలు వాడి హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీయవద్దని మీడియాను కోరారు. త్వరలో మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు.. ‘లోతట్టు ప్రాంతాలు, నాలాలపై కబ్జాలు మాకు వారసత్వంగా వచ్చిన సమస్యలు. వాటిని ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. పైనుంచి వరద నీరు వస్తుండటం వల్ల తలెత్తుతున్న మూ సారాంబాగ్ సమస్యకు పరిష్కారంగా త్వరలోనే బ్రిడ్జి పనులు చేపడతాం. మూసీపై 14 బ్రిడ్జిలకు టెండర్లు పిలవగా ఐదు టెండర్లు పూర్తయ్యాయి. మూసీని కూడా బాగు చేస్తాం..’అని కేటీఆర్ చెప్పా రు. మంత్రి వెంట ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, మునిసిపల్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్ తదితరులున్నారు. అధికారులు, అదనపు కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ గురువారం మున్సిపల్ ఉన్నతాధికారులు, జిల్లాల అదనపు కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పురపాలక శాఖ అధికారుల సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు. వర్ష ఉధృతిని పరిశీలించడానికి శుక్రవారం వరంగ ల్ వెళ్లనున్నట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా నిలవాలి వర్షం, వరదల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కొన్ని జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందని, దీంతో ప్రభావితమైన ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేయాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ముఖ్యంగా వరంగల్ లాంటి జిల్లాల్లో నీట మునిగిన ప్రాంతాలు, గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందించడం మొదలుకుని తోచిన విధానంలో సాయం చేయాలని, ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. -
Telangana: మరో రెండ్రోజులు కుండపోత
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో విస్తారంగా వానలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రానికి రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలకు తోడు పలుచోట్ల గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది. కరకగూడెంలో 22.7 సెంటీమీటర్ల భారీ వాన బుధవారం రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.26 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బుధవారం రాత్రి 10 గంటల సమయానికి అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 29.2 సెంటీమీటర్ల భారీ వాన పడింది. రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకుపైగా, మరో 35 చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ లెక్కలు చెప్తున్నాయి. నైరుతి సీజన్‌కు సంబంధించి జూలై 26 నాటికి రాష్ట్రంలో 32.2 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. ఈసారి 43.25 సెంటీమీటర్లు కురిసింది. అంటే సాధారణంతో పోలిస్తే.. 34శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 24 జిల్లాల్లో అధిక వర్షపాతం, 4 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలోని కటాక్షపూర్ చెరువు పొంగడంతో మునిగిన జాతీయ రహదారి హైదరాబాద్‌లో భారీ వర్షం.. రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బుధవారం పొద్దున్నుంచి ముసురు వాన కురవగా రాత్రి భారీ వర్షం పడింది. నగరంలోని టోలిచౌకిలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మేర వాన పడింది. దీంతో డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్ పొంగాయి. ప్రధాన రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఎగువ నుంచి వరద పెరగడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ తీర ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరిఖనిలో వరద నీటి ప్రవాహం జిల్లాల్లో దంచికొట్టిన వాన ► కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో మంగళవారం రాత్రి నుంచీ వానలు దంచి కొడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు పరవళ్లు తొక్కుతుంది. సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనరావుపేట మండలం మామిడిపల్లి, వట్టిమల్ల గ్రామాల వద్ద రెండు చోట్ల కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌లోని చాలా కాలనీలు జలమయం అయ్యాయి. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి, కడెం ప్రాజెక్టుల్లో భారీగా వరద చేరుతోంది. పెన్‌గంగ, ప్రాణహిత తీరాల్లోని పొలాలు నీటిలో మునిగాయి. పలుచోట్ల చెరువులు, సాగు నీటి కాలువలకు గండ్లు పడ్డాయి. మంచిర్యాలలో రోడ్లపై మోకాళ్ల లోతుకు చేరింది. జిల్లా ఆస్పత్రిలోని వార్డుల్లోకీ వరద ప్రవేశించింది. ► నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలంలో పంటలు నీట మునిగాయి. దీనితో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న చిన్న ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండి అలుగు పోస్తున్నాయి. ► ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. ఆత్మకూర్ మండలంలోని కటాక్షపూర్ చెరువు మత్తడి దూకుతుండటంతో.. దిగువన ఉన్న 163 నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరకాల చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలోని రామప్ప జలాశయం, లక్నవరం చెరువు నిండిపోయాయి. కొంగాల వాగు, మర్రిమాగు వాగు, బొమ్మనపల్లి, గుండ్ల వాగు, ఇసుక వాగు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్, సంతోషిమాతకాలనీ, భద్రకాళి నగర్, గాయత్రినగర్, సాయినగర్ కాలనీలు నీట మునిగాయి. నర్సంపేటలో ఎనీ్టఆర్ నగర్, సర్వాపురం కాలనీలు నీట మునిగాయి. ► ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం అతి భారీ వర్షాలు కురిశాయి. పాలేరు రిజర్వాయర్ అలుగు పోస్తోంది. వైరా రిజర్వాయర్, లంకాసాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి చెరువు, జాలిముడి ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు నిండిపోయింది. పలుచోట్ల వాగులు, చెరువులు ఉప్పొంగి రోడ్లపైకి రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిధిలోని చాలా ప్రాంతాల్లో బుధవారం మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో మండలంలో సముద్రం చెరువు, వీరుల చెరువు, మోటకొండూర్ చెరువులు అలుగు పోస్తున్నాయి. ఆత్మకూరు మండలంలోని బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు–రుద్రవెల్లి మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. గంధమల్లలో వర్షానికి రెండు ఇళ్లు కూలిపోయాయి. సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు, పాత చిలుకూరు మధ్య బ్రిడ్జిపై వరద ప్రవహిస్తోంది. బేతవోలు రోడ్డులోని పొలాల్లో ఇసుక మేటలు వేసింది. జాజిరెడ్డిగూడెం మండలంలో తిమ్మాపురం– సంగెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
వాతావరణశాఖ హెచ్చరిక..ఏపీలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్
-
హైదరాబాద్‌లో ఈ ఏరియాలకు అలర్ట్
హైదరాబాద్: రెడ్ అలర్ట్‌కు కొనసాగింపుగా తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది ప్రభుత్వం. అలాగే.. ఆఫీసులు, కంపెనీలు సైతం నిర్ణీత సమయాల్లో బంద్ కావడం మంచిదని.. రైతులూ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్‌కు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది Hyderabad Rains వాతావరణ శాఖ. ఈ క్రమంలో జోన్ల వారీగా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది జీహెచ్ఎంసీ. నగరంలో.. చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కూకట్పల్లి జోన్‌కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని, కొన్నిచోట్ల 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని వెల్లడించింది. భారీగా గాలులు వీస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో నాలల కెపాసిటీ 2 నుంచి 3 సెం.మీ. వర్షాన్ని తట్టుకునేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో.. అంచనాకి తగట్లు గనుక వాన పడితే.. రోడ్లపైకి భారీగా వరద చేరుకునే ఛాన్స్ ఉంది. మోస్తరు వాన పడింది.. సోమవారంతో పోలిస్తే.. మంగళవారం వరుణుడు కాస్త శాంతించాడు. నగరంలో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. ఒక చోట మోస్తరు వాన పడగా, మరోచోట భారీగా కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో 43.5 మి.మీ., టోలిచౌకిలో 19.8 మి.మీ. వర్షం పడినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ(టీఎస్‌డీపీఎస్) వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో 10 మి.మీ.లోపే పడింది. ఇలా జరగొచ్చు.. జాగ్రత్త! భారీ నుంచి అతి భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవుతాయి. గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం ఉంది. విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చు. రేపు ఇలా.. ఐదు జోన్ల పరిధిలో అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీటి పరిధిలో గురువారం మోస్తరు నుంచి కొన్నిసార్లు భారీ వర్షం కురియవచ్చు. ఇక.. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండవచ్చని వెల్లడించింది. గంటలో 2 నుంచి 3 లేదా 5 సెం.మీ. దాకా వర్షపాతానికి వీలుందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ వర్షాలపై నగర పౌరులకు ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా అలర్ట్ సందేశాలు అధికారులు పంపుతున్న సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంతో.. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మూడు రోజులపాటు కుండపోత వానలు ఉండడంతో అప్రమత్తం చేసింది. మంగళవారం(నేటి) నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెబుతున్నారు. ► పనులకు వెళ్లేవాళ్లు వర్షం పరిస్థితులు.. ట్రాఫిక్‌ను అంచనా వేసుకుని బయటకు రావాలని సూచిస్తున్నారు. ► పాత భవనాల్లో ఉంటున్నవాళ్లు తక్షణమే ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. ► కరెంట్ పోల్ల విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు. ► రోడ్లపై వెళ్తున్నప్పుడు మ్యాన్ హోల్స్‌ను గమనించాలని సూచిస్తున్నారు. ► సీజనల్ వ్యాధులు చెలరేగే అవకాశం ఉన్నందున.. తాగే నీరు, అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ సైతం సూచిస్తోంది. పలు జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్‌కు కుండపోత ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 దాకా సెలవులు ప్రకటించాలంటూ పలువురు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణలో మరో మూడు రోజులు కుండపోత.. వాన దంచికొట్టే జిల్లాలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న మూడురోజులు (జులై 25,26,27) రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రోజున హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. (చదవండి: విద్యాసంస్థలకు సెలవులు పొడిగించేనా!) జులై 25, మంగళవారం ⇒ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం. ⇒ భారీ నుంచి అతి భారీ వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం. ⇒ భారీ వర్షాలు జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం. ⇒ తెలంగాణ రాష్ట్రంలో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం. ⇒ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, కర్నాటకలనూ భారీ వర్షాలు కురిసే అవకాశం. రాయలసీమ, కర్నాటకలోనూ భారీ వర్షాలకు అవకాశం. (చదవండి: Snake On TVS Bike: ద్విచక్రవాహనం ఎక్కిన పాము..) -
వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం, మరోవైపు అల్పపీడనం కారణంగా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అంచనావేసింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని వెల్లడించింది. రెండు రోజులు (గురువారం, శుక్రవారం) మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. (చదవండి: వాన లోటు తీరినట్టే!) కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్ బంద్) -
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..
సాక్షి, హైదరాబాద్: ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో తెలంగాణలో బుధ, గురువారా ల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. మరో వైపు గత 24 గంటల్లో ములు గు జిల్లా వెంకటాపూర్, తా డ్వాయి, ఏటూరు నాగారం, గోవిందరావుపేట, వెంకటాపు రంలలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా పేరూరు, హనుమకొండ జిల్లా పరకాలలో 8 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. రేగొండ, ఎల్లారెడ్డిపేట, భీంగల్, ఆత్మకూరు, గంగాధర, చొప్పదండి, చందుర్తి, ములుగు, హుజూరాబాద్, చిట్యాల, శాయంపేటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. మంగళవారం ఉదయం నుంచి అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం భారీ నుంచి అతిభారీ వర్షాలు సిద్దిపేట, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి. భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి మోస్తరు నుంచి భారీ వర్షాలు.. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. -
దంచికొడుతున్న వానలు.. ప్రమాద స్థాయిలో బొగత జలపాతం, రెడ్ అలర్ట్!
సాక్షి, వరంగల్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల ముసురులా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షాకాలం ఆరంభం తర్వాత తొలిసారిగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద క్రమంగా వరద పెరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత వరద పోటెత్తడంతో 35 గేట్లు ఎత్తి 165,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ కి గోదావరితో పాటు ఇంద్రావతినది వరద భారీగా వచ్చి చేరుతుండడంతో 33 గేట్లు ఎత్తి లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 8.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగ, కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాజేడు మండలం బొగత జలపాతంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాద స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది జలపాతం వద్దకు పర్యటకుల సందర్శనను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. (కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!) ఉప్పొంగిన వాగులు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాల ప్రజలు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుమ్రంబీమ్ జిల్లా లో పెన్ గంగా, ప్రాణహిత పరివాహక ప్రాంతాలలో కలెక్టర్ హెమంత్ బోర్కడే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా, ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. (ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి) -
ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నేపథ్యంతో.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో నేడు అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మంగళవారం సుమారు 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
హిమాచల్ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్..
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరఖండ్ సహా పలు రాష్ట్రాల్లో కుంభవృష్టి సంభవిస్తోంది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్‌లోనూ గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది ప్రభుత్వం. వర్షాలకు కొండ చరియలు, మంచు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. నిత్యం పర్యటకులతో కిటకిటలాడే హిమాచల్ ప్రదేశ్‌లో ట్రెక్కింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పలు పర్యాటక ప్రాంతాల్లో ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. అటు.. భారీ వర్షాలతో దేశ రాజధాని అతలాకుతలం అవుతోంది. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో 153 సెంటీమీటర్ల వర్షం సంభవించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. #Pandohdam #HimachalPradesh pic.twitter.com/Ox5Pts1Va1 — rajni singh (@imrajni_singh) July 9, 2023 शिमला डींगू माता मंदिर के पास भयंकर भूस्खलन, देखते ही देखते टूट गई सड़क#sanjauli #shimla #HimachalPradesh pic.twitter.com/5CCQbvZjOq — Ankush Dobhal🇮🇳 (@DobhalAnkush) July 8, 2023 ఇదీ చదవండి: ఢిల్లీని కుదిపేస్తున్న కుంభవృష్టి.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి.. -
50% డిస్కౌంట్: అన్లిమిటెడ్ స్టోర్స్‌లో ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: వివిధ ఉత్పత్తులపై అత్యుత్తమ రాయితీలు, ఆఫర్లతో ‘రెడ్ అలర్ట్ సేల్’ ప్రారంభించినట్లు అన్లిమిటెడ్ స్టోర్స్ ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వస్త్రాలపై 50% ఫ్లాట్ ఆఫర్ అందిస్తుంది. అలాగే రూ. 3 వేల షాపింగ్‌పై అంతే విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఈ ఆఫర్ జూలై రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
బలహీనపడిన బిపర్జోయ్.. గుజరాత్ నుంచి రాజస్తాన్ వైపు పయనం
జైపూర్/అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ తీర ప్రాంతాన్ని వణికించిన బిపర్జోయ్ తుపాను బలహీనపడింది. ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ పొరుగు రాష్ట్రమైన రాజస్తాన్ వైపు మళ్లిందని అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావం వల్ల రాజస్తాన్‌లోని జలోర్, బార్మర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గురువారం సాయంత్రం దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది. జలోర్‌లో శుక్రవారం ఉదయానికల్లా 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలియజేసింది. రెండు జిల్లాల్లో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జోథ్‌పూర్, జైసల్మేర్, పాలీ, సిరోహీ వైపు తుపాను పయనిస్తోందని, అక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. శుక్రవారం, శనివారం రాజ్‌సమంద్, దుంగార్పూర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందుజాగ్రత్త చర్యగా రాజస్తాన్ ప్రభుత్వం జైపూర్, కోట, భరత్పూర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, జోద్పూర్, బికనేర్ తదితర ప్రాంతాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. అజ్మీర్ జిల్లాలోని కిషన్గఢ్కు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. చదవండి: తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో.. గుజరాత్లో ప్రాణ నష్టం సున్నా గుజరాత్లో బిపర్జోయ్ తుఫాను వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ శుక్రవారం చెప్పారు. వివిధ ప్రాంతాల్లో 23 మంది గాయపడ్డారని, దాదాపు 1,000 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను ఇంకా పునరుద్ధరించలేదని ప్రకటించారు. గుజరాత్లో తుపాను కంటే ముందే ఇద్దరు చనిపోయారని వెల్లడించారు. తుపాను హెచ్చరికలపై ప్రభుత్వ యంత్రాంగం వేగంగా స్పందించి, చేపట్టిన చర్యల వల్లే ప్రాణనష్టం సంభవించలేదని అన్నారు. కచ్ ప్రాంతంలో 40 శాతం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. 500 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పక్కా ఇళ్లకు పెద్దగా నష్టం వాటిల్లలేదన్నారు. 800 చెట్లు కూలిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ఇందుకోసం గుజరాత్ ఎస్డీఆర్ఎఫ్తో కలిసి పని చేస్తున్నామని వివరించారు. రహదారుల వ్యవస్థకు నష్టం జరగలేదన్నారు. సెల్‌ఫోన్ నెట్వర్క్ యథాతథంగా పని చేస్తోందన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు గుజరాత్లో 8 జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు 1,000కి పైగా బృందాలను రంగంలోకి దించినట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, జునాగఢ్, గిర్ సోమనాథ్, రాజ్‌కోట్, పోర్బందర్ తదితర జిల్లాల్లో తుపాను వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందస్తు చర్యలు చేపట్టడం, లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చెప్పారు. తుపాను సహాయక చర్యల్లో సహకారం అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 707 మంది శిశువుల జననం గుజరాత్లో మంగళవారం సాయంత్రం నుంచి తుపాను కల్లోలం మొదలైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతంలోని 8 జిల్లాల్లో 1,171 మంది గర్భిణులు ఉండగా, వీరిలో 1,152 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. గత నాలుగు రోజుల్లో వీరిలో 707 మంది గర్భిణులకు వివిధ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితంగా ప్రసవం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. 707 మంది శిశువులు జన్మించారని పేర్కొంది. ► బిపర్జోయ్ అత్యంత తీవ్ర నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడింది. రాజస్తాన్‌లోకి ప్రవేశించింది. ► తుపాను ధాటికి గుజరాత్‌లోని కచ్–సౌరాష్ట్ర ప్రాంతంలో గురువారం సాయంత్రం నాటికి 5,120 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 4,600 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటిదాకా 3,580 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించారు. మరో 1,000కిపైగా గ్రామాలకు పునరుద్ధరించాల్సి ఉంది. ► దాదాపు 800 చెట్లు నేలమట్టమయ్యాయి. ఫలితంగా పలు రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ► గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ► ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు ప్రాణనష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని గుజరాత్ ప్రభుత్వం అభినందించింది. ► ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అటవీ జంతువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ► ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు స్వచ్ఛంద సంస్థలు, మీడి యా సంస్థలు కూడా సహకారం అందించాయి. ► మరో 3 రోజులపాటు 23 రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ► సీఎం భూపేంద్ర పటేల్ తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ► పాకిస్తాన్‌లోనూ తీర ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. దక్షిణ సింధూ ప్రావిన్స్ నుంచి 82,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
సైక్లోన్ బిపర్‌జోయ్‌తో 8 రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు
సైక్లోన్ బిపర్జోయ్ గురువారం సాయంత్రం గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ.. అప్రమత్తత చేస్తూ వస్తోంది. ముందస్తు జాగ్రత్తగా గుజరాత్ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దాదాపు 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఎనిమిది రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. బిపర్జోయ్ ఇవాళ పోర్బందర్, ద్వారకా వద్ద తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. రేపు సాయంత్రం జఖావూ పోర్ట్ వద్ద తీరం దాటోచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే క్రమంలో గురువారం సౌరాష్ట్ర, కచ్‌పై విరుచుకుపడే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దాదాపు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతూ.. 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని హెచ్చరించింది. బిపర్జోయ్ తుపాను కారణంగా.. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్‌లకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రెండు రోజులపాటు అంటే జూన్ 15 నుంచి 17 మధ్య ఈ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే 38 వేల మందిని సముద్ర తీరం నుంచి ఖాళీ చేయించినట్లు ప్రకటించింది. అయితే ఆ సంఖ్య 44వేలదాకా ఉంటుందని క్షేత్రస్థాయిలోని అధికారులు అంటున్నారు. 1965 నుంచి ఇప్పటిదాకా గుజరాత్‌ను తాకిన మూడో తుపానుగా బిపర్జోయ్ నిలవనుంది. ముంబైలో అలర్ట్ బిపర్జోయ్ కారణంగా ఇప్పటికే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. పశ్చిమ రైల్వేలో పలు రైలు రద్దుకాగా, కొన్నింటిని ఆయా మార్గాల్లో కుదించి నడుపుతున్నారు. #WATCH | Visuals from Jakhau Port in Bhuj, where a large number of boats have been parked as fishing has been suspended in the wake of #CycloneBiparjoy. Cyclone 'Biparjoy' is expected to cross near Gujarat's Jakhau Port by the evening of 15th June pic.twitter.com/KA7OKJE68O — ANI (@ANI) June 14, 2023 #WATCH | High tide waves hit Mumbai as cyclone 'Biporjoy' intensifies (Visuals from Gateway of India) pic.twitter.com/C1vhrHiWZS — ANI (@ANI) June 14, 2023 Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 0530IST of today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E, about 280km WSW of Jakhau Port (Gujarat), 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15June as VSCS. pic.twitter.com/DQPh75eXwY — India Meteorological Department (@Indiametdept) June 14, 2023 #WATCH | High tide waves hit Gujarat as cyclone #Biparjoy intensified into a severe cyclonic storm (Visuals from Dwarka) pic.twitter.com/4c8roLFre1 — ANI (@ANI) June 14, 2023 ఇదీ చదవండి: బిపర్జోయ్ డ్యామేజ్ ఏ రేంజ్లో జరుగుతుందంటే.. -
ఏపీలో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాల్సిందే..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బుధవారం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రధానంగా 4 మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతోపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలిపారు. 126 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటతాయని, వడగాలుల ప్రభావం ఉంటుందన్నారు. కాగా, మంగళవారం అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, అనకాపల్లి మండల కేంద్రం, కోటవురట్లలో 42.4 డిగ్రీలు, మాకవరపాలెంలో 42.5, కాకినాడ జిల్లా తొండంగిలో 41.8, తునిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ -
చెన్నైలో భారీ వర్షాలు.. హైదారాబాద్, కర్నూల్ సహా 8 విమానాలు రద్దు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మదురై, హైదరాబాద్, కర్నూలు సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 8 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు.. చెన్నై డొమెస్టిక్ టెర్మినల్ నుంచి వెళ్లాల్సిన పలు సర్వీసులు నిలిపివేశారు. చెన్నై నుంచి ఫ్రాంక్ఫర్ట్, శ్రీలంక, పారిస్, దోహా, షార్జా, దుబాయ్, అండమాన్లకు వెళ్లే విమానాలు కూడా ఒక గంట ఆలస్యంగా నడిచాయి. వర్షం కారణంగా విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయడంతో ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆలస్యంగా సమాచారం అందించామని వెల్లడించారు. ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
తెలంగాణ: భారీ వర్షాలతో ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్
-
తెలంగాణలో పలుజిల్లాలకు రెడ్ అలెర్ట్
-
గాజులరామారం బాలాజీ లేఅవుట్లో ముంచెత్తిన వరద (ఫొటోలు)
-
TS: రానున్న 2 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: వదలని వాన వణికిస్తోంది. రాష్ట్రంలో రెండ్రోజులుగా నమోదవుతున్న వర్షాలతో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమవుతుండగా.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పది జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.16 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక విభాగం వెల్లడించింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 16.76 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో శనివా రం వరకు రాష్ట్రంలో 30.46 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, రెట్టింపునకు పైగా 63.66 సెంటీమీ టర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలి పింది. సాధారణ వర్షపాతం కంటే 109% అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కొనసాగుతున్న ఉపరితలద్రోణి రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసా గుతోంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసా గుతోంది. ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరి తల అవర్తనం ఈ రోజు ఇంటీరియర్ ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లలో కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రబావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నిరంతరం అప్రమత్తం: సీఎస్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శనివా రం ఆయన విపత్తుల నిర్వహణ శాఖ కార్య దర్శి రాహుల్ బొజ్జతో కలసి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరసగా వస్తున్న రెండురోజుల సెలవులను ఉపయో గించుకోకుండా పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎస్ ఆదేశించారు. రెడ్ అలర్ట్ జిల్లాలు: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు: నల్లగొండ, జనగామ, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ చదవండి: భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక -
భారీ వర్షాల ఎఫెక్ట్.. ఐదు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలు బంద్
దేశవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మంగళవారం అనేక జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఐదు రహదారులను అధికారులు మూసివేశారు. ఇక, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు అప్రమతమయ్యారు. బాగేశ్వర్, తెహ్రీ, పౌరి, పితోరాఘర్, నైనిటాల్ జిల్లాల్లో 1-12వ తరగతి వరకు పాఠశాలలు, అన్ని అంగన్వాడీ కేంద్రాలు బుధవారం మూసివేసినట్టు తెలిపారు. ఇక, డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ జిల్లాలకు జూలై 20న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. #WATCH उत्तराखंड: बारिश की वजह से टनकपुर में एक स्कूल बस पानी के तेज़ बहाव में बह गई। pic.twitter.com/BQYlA7dqVb — ANI_HindiNews (@AHindinews) July 19, 2022 ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం జోషిమత్‌లోని పుర్సరి వద్ద జాతీయ రహదారి ఎన్‌హెచ్-58 కుంగిపోయింది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటిచింది. Only driver was present in the bus at the time of the incident on Tuesday morning. #Champawat #UttarakhandRains pic.twitter.com/wQ4GYwiuag — TOI Cities (@TOICitiesNews) July 19, 2022 -
ఉరిమిన వరుణుడు.. 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్
►కొమురం భీం జిల్లా జైనూర్‌లో 39.10 సెం.మీ. వాన కురిసింది. మొత్తంగా ఐదు చోట్ల 30 సెంటీమీటర్లకుపైగా, 28కిపైగా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకన్నా అధికంగా భారీ వర్షం నమోదైంది. ►ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. గోదావరి వెంట ఏజెన్సీలు నీటి ముంపుతో తల్లడిల్లుతున్నాయి. వేలమందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. ►వర్షాలతో స్తంభాలు కూలిపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలో పెద్ద సంఖ్యలో గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ►రాష్ట్రంలో సాధారణంగా జూన్ 13 నాటికి 21.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 48.54 సెంటీమీటర్ల వాన పడింది. బుధవారం ఒక్కరోజే 6.48సెం.మీ. వర్షం పడింది. ►మరో రెండు రోజులూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ►వర్షాలకు ఇళ్లు కూలడంతో ఇద్దరు, కాల్వలో కొట్టుకుపోయి ఒక యువకుడు మృతి చెందారు. ►కొమురం భీం జిల్లా బీబ్రాలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు వెళ్లిన సింగరేణి రెస్క్యూ టీంలో ఇద్దరు పెద్దవాగు బ్యాక్ వాటర్‌లో గల్లంతయ్యారు. సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని జడి వాన ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటు 6.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమురం భీం జిల్లా జైనూర్‌లో ఏకంగా 39.10 సెంటీమీటర్ల కుంభ వృష్టి కురిసింది. చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా భారీ వాన పడింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించడంతో.. వాగులు, వంకలు పోటెత్తాయి. చిన్న ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. పలుచోట్ల ప్రమాదకర స్థాయికి చేరాయి. వాగులు, ఉప నదుల నీటి చేరికతో గోదావరి ఉగ్ర రూపాన్ని సంతరించుకుంది. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండింతలకుపైగా.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే రెండింతలకుపైగా వానలు కురిసినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో సాధారణంగా జూన్ 13 (బుధవారం) నాటికి 21.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 48.54 సెంటీమీటర్ల వాన పడింది. ఇందులో బుధవారం ఒక్కరోజే 6.48 సెంటీమీటర్ల వర్షం పడటం గమనార్హం. ప్రస్తుత సీజన్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు అతి ఎక్కువ వర్షం కురిసినట్టుగా రికార్డు నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ ఆగమాగం భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పది కాలనీలు నీట మునిగాయి. ముంపు బాధితులను పునరావాస శిబిరాలకు తరలించారు. ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో స్తంభాలు కూలిపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోదావరి ఉప్పొంగడంతో మంచిర్యాల పట్టణంలోని రామ్‌నగర్, ఎన్టీఆర్ కాలనీలు జలమయం అయ్యాయి. జన్నారం, దండేపల్లి, చెన్నూరు మండలాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. పోలీసు, సింగరేణి రెస్క్యూ, మున్సిపల్ అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మన్నమడుగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చేరడంతో కేస్లాగూడ గ్రామస్తులు ఊరు ఖాళీ చేసి వెళ్లిపోయారు. నిర్మల్–మంచిర్యాల మార్గంలో 61 జాతీయ రహదారిపై అప్రోచ్ రోడ్లు తెగిపోయాయి. పలుచోట్ల చెట్లు పడిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. నిర్మల్, భైంసా పట్టణాల్లో పలు ప్రాంతాలు నీటిలో చిక్కు కున్నాయి. బాధితులను తెప్పలపై సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. బాసర, లోకేశ్వరం, నర్సాపూర్ (జి), దిలావర్పూర్, సోన్ మండలాల్లోని పలు గ్రామాల్లోకి ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ చొచ్చుకొచ్చింది. ఏజెన్సీ గ్రామాలు జలమయం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడ నుంచి ముంపు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక్కడి కొండాయి బ్రిడ్జి కుంగిపోయింది. గోగుపల్లి, కొండాయి, చెల్పాక తదితర పది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కడెం వరద, భారీ వర్షానికి పలిమెల మండల కేంద్రంతోపాటు 8గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడ వరద ముంపు పరిశీలించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు లెంకలగడ్డనే ముంపులో చిక్కుకున్నారు. జగిత్యాల జిల్లాలో గోదావరి నది పరీవాహక ప్రాంతాల నుంచి సుమారు 2,300 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 12 జిల్లాలు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
Telangana: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: గత అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు మరో షాక్ తగిలినట్లైంది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావారణ విభాగం తెలిపింది. దాంతోపాటు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే రానున్న మూడు రోజులు కూడా భారీ వర్షాలు పడనున్న క్రమంలో తెలంగాణలో విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. నది పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతున్నాయి. మరికొన్ని కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, 25 కాల్వలకు సైతం గండ్లు పడ్డాయి. చదవండి: Photo Feature: దంచికొట్టిన వానలు.. స్తంభించిన రాకపోకలు -
ఉత్తర తెలంగాణకు రెడ్ అలెర్ట్
-
తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చెరువులు, కుంటలు అలుగెత్తి ప్రవహిస్తుండగా... మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలోని సముద్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. భూపాలపల్లి జిల్లా పెద్దంపేట వాగుపై కోతకు గురైన వంతెన రోడ్డు 28 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం..: శుక్రవారం నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 6.01 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 14.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలోని ముత్తారం మహదేవ్‌పూర్‌లో 31.03 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో జంపన్నవాగు బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తున్న వరద నైరుతి రుతుపవనాల సీజన్లో జూలై 10వ తేదీ సాయంత్రానికి 19.79 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..ఏకంగా 36.59 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ పేర్కొంది. ఈ సీజన్లో ఇప్పటివరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 85 శాతం అధికంగా వర్షాలు కురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 5 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది. -
TS: ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. జాగ్రత్తలు తప్పనిసరి!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వాగులు వంకలు పొర్లిపొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లోని అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలకు అండగా నిలిచి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. సహాయక చర్యల్లో ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు.మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేశారు. pic.twitter.com/KqCXB7O44U — IMD_Metcentrehyd (@metcentrehyd) July 9, 2022 ఇదిలా ఉండగా.. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉందని స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ప్రజలు.. అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. EXTREME RAIN ALERT - JULY 9 2022 ⚠️ Today there will be VERY HEAVY DOWNPOURS in North Telangana districts and East Telangana will get HEAVY RAINS. South Telangana will get MODERATE RAINS Hyderabad will also get MODERATE RAINS pic.twitter.com/k9e9bUwHhG — Telangana Weatherman (@balaji25_t) July 9, 2022 -
చెన్నై మళ్లీ జలమయం
సాక్షి, చెన్నై: చెన్నైపై మరోసారి వరుణుడు విరుచుకుపడ్డాడు. అనేక ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. రోడ్లలో వర్షపు నీరు పోటెత్తడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అక్టోబరు, నవంబర్‌లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. చెన్నై నగరం , శివారులు రెండు సార్లు నీట మునగక తప్పలేదు. ఇప్పుడిప్పుడే లోతట్టు ప్రాంతాల్లోనివారు కోలుకుంటున్న నేపథ్యంలో గురువారం హఠాత్తుగా కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షం పడింది. మధ్యాహ్నం ఒంటి గంట అనంతరం హఠాత్తుగా వరుణుడు పలకరించాడు. తొలుత చిరు జల్లులు పడ్డా క్రమంగా భారీగానే వర్షం పడింది. నగరంలోని గింది, సైదా పేట, వడపళని, నుంగంబాక్కం, ఎంఆర్సీ నగర్, కేకేనగర్, అరుంబాక్కం తదితర మార్గాలు, ఉత్తర చెన్నై పరిధిలో అనేక మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. కొత్వాల్ చావడి పరిసరాల్లో మోకాలి లోతుకు నీరు చేరడంతో వ్యాపారులకు ఇక్కట్లు తప్పలేదు. అత్యధికంగా ఎంఆర్సీ నగర్లో 18 సె.మీ, నుంగంబాక్కంలో 15 సె.మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం చెన్నైకు సమీపంలో కేంద్రీకతమై ఉందని, ఈ ప్రభావంతోనే వర్షాలు పడుతున్నట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ భువియరసన్ తెలిపారు. చెన్నైలో వరదలకు శాశ్వత పరిష్కారం లభించేనా..? వర్షాల సీజన్లో చెన్నై నీట మునగడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. గతం పునరావతం కాకుండా, వరదల కట్టడికి శాశ్వత పరిష్కారంపై దష్టి పెట్టారు. ఇందుకోసం చేపట్టాల్సిన పనులు, ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో చేపట్టిన పనులు, తదితర అంశాల్ని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తిరుపుగల్ నేతత్వంలోని నిపుణుల బందం పరిశీలించింది. శాశ్వత పరిష్కారం కోసం తమ సిఫారసులతో నివేదికను సిద్ధం చేసింది. శుక్రవారం ఈ నివేదికను సీఎం స్టాలిన్‌కు సమర్పించనుంది. -
తమిళనాడులో రెడ్ అలర్ట్!! 2 వందల యేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 29 నాటికి దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ముమ్మరంగా సహాయక చర్యలు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తూత్తుకూడి, చెంగల్పట్టు, నాగపట్టణంలోని అనేక ప్రాంతాలు నీటి ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో వందకు పైగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ముంపు తీవ్రత అధికంగా ఉన్న కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో జాతీయ విపత్తు స్పందన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. పలు కాలనీల్లో చేరుకున్న వరద నీటిని నీటి ఇంజన్లతో తోడుతున్నారు. కాగా చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తమిళనాడులో నవంబరు మాసంలో వంద సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని స్టాలిన్ తెలిపారు. గత రెండువందల సంవత్సరాలలో ఇంత వర్షపాతం నమోదు కావడం ఇది నాలుగోసారి అని మీడియకు తెలిపారు. మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. డిసెంబరు 2వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చదవండి: ఆ దేశంలో విదేశీయుల రాకపై 14 రోజుల పాటు ఆంక్షలు..! -
చెన్నైలో మళ్లీ వరద విలయం
సాక్షి, చెన్నై: తమిళనాడును వర్షాలు వీడటం లేదు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నై, శివారు లోతట్టు ప్రాంతాలు మళ్లీ నీట మునిగాయి. వర్షాలతో ఇప్పటికే రెండుసార్లు చెన్నై, శివారులోని లోతట్టు ప్రాంతాలు నీట మునగడం తెల్సిందే. శుక్రవారం రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై, ఉత్తర చెన్నై పరిధిలోని సుమారు 500 వీధుల్లో మోకాలిలోతు నీరు చేరింది. శనివారం చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు. అనంతరం ఆయన ట్విట్టర్లో..‘కేవలం ఒక్క నెల వ్యవధిలో 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం చెన్నై నగర 200 ఏళ్ల చరిత్రలో ఇది నాలుగోసారి’అని పేర్కొన్నారు. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ప్రకటించారు. పూందమల్లి, ఆవడి, అంబత్తూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల పరిధిలో అనేక చెరువులు తెగడంతో వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలో శనివారం వర్షాల సంబంధిత ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది. కాంచీపురం నుంచి జాతీయ రహదారిని కలిపే మార్గం పాలారు నది వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఈశాన్య రుతుపవనాలతో ఏటా అక్టోబర్–డిసెంబర్ నెలల్లో తమిళనాట ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది ఇదే సమయంలో సాధారణ వర్షపాతం కంటే 75 శాతం అధికంగా వానలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా 24 గంటల్లో ఆవడిలో 20 సెంటీమీటర్లు, చెంగల్పట్టులో 18 సె.మీ వర్షం కురిసినట్లు ప్రకటించింది. రానున్న మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. -
భారీ వర్షాలు: 15 జిల్లాలకు రెడ్ అలెర్ట్..
చెన్నై(తమిళనాడు): తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే.. అల్పపీడనం ప్రభావంతో చెన్నై లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రాష్ట్రప్రభుత్వం.. చెన్నై తో పాటు 15 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ను ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుకోట్టై, తిరువారురు,తేన్ కాశీ, తిరు నల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాధపురం, శివ గంగై జిల్లాలో వర్షం ముప్పు పొంచిఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దీంతో.. చెన్నై నగరంలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అదే విధంగా.. కన్యాకుమారి, చెన్నై ప్రాంతాలలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాలకు కావేరి నది, వైగై, థెన్- పెన్నై, భవానీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. -
వర్ష బీభత్సంతో ఐదుగురు మృతి.. ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్
తిరువనంతపురం: అరేబియా సముద్రంతో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజా జీవనం స్తంభించిపోయింది. నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆర్మీ, వాయుసేన బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. (చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వాన.. చెరువులైన లోతట్టు ప్రాంతాలు) భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పట్నంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో ఆరు జిల్లాలైన తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, మలప్పురం, కోజికోడ్, వయనాడ్‌లో ఆరెంజ్ అలర్ట్, మరో రెండు జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో వరదల ఉధృతికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, కడపటి వార్తలు అందేసరికి కేరళను వణికిస్తున్న వర్షాలు, వరదలతో కనీసం ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. కొట్టాయం జిల్లాలో 12 మంది వరకు గల్లంతయ్యారు. (చదవండి: IPL 2021: ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. ఫ్యామిలీలోకి మరొకరు?) కొట్టాయంలో వరదలో కొట్టుకుపోతున్న కారును ఒడ్డుకు తెస్తున్న దృశ్యాలు Heavy rainfall alert in #Kerala. IMD issues red alert in 5 districts - Pathanamthitta, Kottayam, Ernakulam, Idukki and Thrissur. Orange alert in 7 districts - Thiruvananthapuram, Kollam, Alappuzha, Palakkad, Malappuram, Kozhikode and Wayanad. Shots of flooding in Rural Kottayam. pic.twitter.com/1b04Tkec2a — NDTV (@ndtv) October 16, 2021 కొట్టాయంలోని పూజ్నగర్లో ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీబస్సు వరదల్లో చిక్కుకుంది. అధికారులు హుటాహుటిన స్పందించి ప్రయాణికులందరినీ ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది. Dramatic visuals of people being evacuated from a KSRTC bus in Poonjar, rural #Kottayam. No loss of life reported, confirm officials. IMD issues red alert for the district. pic.twitter.com/YtOMKHWIc5 — NDTV (@ndtv) October 16, 2021 #WATCH Waterlogged street in Kanjirappally, Kottayam district as the area continues to receive heavy rainfall IMD has issued a Red alert in Pathanamthitta, Kottayam, Ernakulam, Idukki and Thrissur districts of Kerala pic.twitter.com/LocqwW3CfL — ANI (@ANI) October 16, 2021 -
తెలంగాణలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్
-
హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. సుమారు మధ్యాహ్నం 2 గంటల నుంచి మోస్తరు వర్షం, సాయంత్రం 4 గంటల నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉన్న కారణంగా జీహెచ్ఎంసి, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. మరో 12 గంటల పాటు గులాబ్ తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. గత అనుభవాల దృష్ట్యా తెలంగాణ విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. కరెంట్ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ అంతా భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాల్లోని రోడ్లపైకి, కాలనీల్లోకి వరద నీరు చేరింది. మరో అయిదారు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో చీకటి అలుముకుంది. పట్టపగలే కారు చీకటి అలముకుంది. కుండపోతగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హైదరాబాద్ హై అలర్ట్ హైదరాబాదీలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ నేడు, రేపు హై అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తుఫాన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అవసరమైతే 040-23202813 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. చదవండి: Gulab Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు తెలంగాణలో 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హన్మకొండ, ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. Got to love #HyderabadRain! Yes, it's that dark at 4.15 pm!@Hyderabadrains#HyderabadRains @HiHyderabad @WeAreHyderabad @Rajani_Weather @balaji25_t @HYDmeterologist @Hyderabadiiiiii #HyderabadRains #hyderabad pic.twitter.com/IruTDl8fqp — Aveek Bhowmik (@Aveekishere) September 27, 2021 -
తెలంగాణకు రెడ్ అలెర్ట్
-
రెండు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలో రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వరుసగా రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా అదిలాబాద్, మంచిర్యాల, కుమ్రుంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా రెండురోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని జోనల్ కమిషనర్లందరికీ సూచించింది. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి సమీక్షించాలి రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎస్.. ఆదివారం అక్కడినుంచే కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గులాబ్ తుపాను ప్రభావం మరో రెండురోజుల పాటు మొత్తం రాష్ట్రంపై ఉండనుందని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. పోలీస్, ఇతర సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకూడదు లోతట్టు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కోరారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలను పొందాలని చెప్పారు. వాగులు, వంకల్లో వరద నీరు ప్రవహించే సమయంలో ప్రజలు దాటకుండా ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచాలని అన్నారు. ప్రతి మండలంలో ప్రత్యేకంగా అధికారులను నియమించి ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని, స్థానికుల సహాయంతో వరద నష్టం నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు 94.4 సెం.మీ. వర్షపాతం నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 94.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్1 నుంచి ఆదివారం నాటికి 70.4 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 34 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డిలో 9.38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 8.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. -
భారీ వర్షాలు: తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: మూడు రోజులుగా భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. చదవండి: జైలు మరుగుదొడ్డిలో సొరంగం.. ‘జులాయి’ సినిమాలో మాదిరి ఇప్పటికే భారీ వర్షాలతో వాంగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులతో పాటు ప్రాజెక్టులు కూడా మత్తడి దూకుతున్నాయి. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచే వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు పంపాలని ఆదేశించారు. చదవండి: రెచ్చిపోయిన నిరసనకారులు: ప్రధానిపై రాళ్ల దాడి తడిసిముద్దయిన తెలంగాణ.. ఫొటోలు, వీడియోలు -
తెలంగాణలో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్
-
తెలంగాణ: 16 జిల్లాలకు రెడ్ అలెర్ట్
-
Heavy Rains: తెలంగాణలోని జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రుతుపవనాల ద్రోణి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతోపాటు ఉత్తర, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఐదురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఏపీలోనూ రాబోవు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడు, రేపు భారీ వర్షాలు... రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. సోమవారం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. మంగళవారం కూడా ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. నాగిరెడ్డిపేటలో 17 సెంటీమీటర్ల వర్షం... రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 17 సెం.మీ. వర్షం కురవగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 15.4 సెం.మీ. వర్షం కురిసింది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 61.58 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఆదివారం నాటికి 78.86 సెం.మీ. వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. -
ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ ఎప్పుడు జారీ చేస్తారో తెలుసా?!
దేశంలో వర్ష సూచన, వాతావరణ హెచ్చరికలకు సంబంధించి ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లను జారీ చేస్తారు. వచ్చే 24 గంటల్లో పడే భారీ వర్షాలు, తుఫానులు, ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితిని.. వర్షపాతం నమోదయ్యే అవకాశాన్ని బట్టి ఈ హెచ్చరికలు ఉంటాయి. ఇందులో గ్రీన్ అలర్ట్ అంటే ఎలాంటి ప్రమాదం లేదని అర్థం. మరి.. ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ ఎలాంటి పరిస్థితుల్లో జారీ చేస్తారో తెలుసా?! ఎల్లో అలర్ట్ ఆరు నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం, 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తారు. ఆరెంజ్ అలర్ట్ పది నుంచి 20 సెంమీటర్ల వర్షపాతం, 40–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని.. ఇబ్బందులేమైనా వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్ సూచిస్తుంది. కాగా హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం నుంచే వానలు పడుతున్న నేపథ్యంలో.. అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి.. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రెడ్ అలర్ట్ ఒక రకంగా చెప్పాలంటే కుండపోత వానలు, తుఫాను వంటి ప్రకృతి విపత్తును సూచించడానికి రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. అంటే 20 సెంటీమీటర్లకు మించి వాన పడే అవకాశం ఉందని అర్థం. రెడ్ అలర్ట్ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. చదవండి: Telangana: జడివాన..మరో 3 రోజులు కుండపోతే..! -
తెలంగాణలోని మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్
-
Telangana: 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్
-
భారీ వర్షాలు: తెలంగాణలో 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: గత మూడు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లల్లో వరద బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి జన జీవనం స్థంభించింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రత్తమయ్యింది. 9 జిల్లల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో రెడ్ అలర్ట్ పక్రటించింది. ఇప్పటికే వరదల వల్ల ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పెద్దవాగులో 9 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏమైనా జరగొచ్చు! అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లతో సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ సహా.. 16 వరద ప్రభావిత జిల్లాలపై సమీక్షించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, పోలీసు అధికారులతో మాట్లాడారు. వర్సాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో వరదలపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండొద్దని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. -
భారీ ముప్పు.. రెండు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతున్నాయి. వానలతో భారత నేలంతా తడిసి ముద్దవుతోంది. ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లో జలకళ సంతరించుకోగా రైతుల్లో ఆనందం వెల్లివెరుస్తోంది. అయితే కొన్ని చోట్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నారు. మహారాష్ట్రలో వానాకాలం చాలా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా ముంబైలో పరిస్థితులు భయానకంగా తయారయ్యాయి. ఇప్పుడు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వానలు భారీగా పడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెండు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్సాలు భారీగా పడుతున్నాయి. కొండకోనవాగువంకలు నీటితో కళకళలాడుతున్నాయి. వరద పోటెత్తుతోంది. హిమనీనదాలకు భారీగా వరద వస్తుండడంతో పర్వత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు వస్తోంది. ఈ వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లో ఆదివారం కుండపోత వర్సం పడింది. అక్కడ జనజీవనం స్తంభించింది. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృత్యువాత పడగా మరో నలుగురు గల్లంతయ్యారు. తుఫాను ప్రభావంతో మరో రెండు రోజులు వర్సాలు భారీగా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో విపత్తు నిర్వహణ దళం అప్రమత్తమైంది. ప్రత్యేకంగా 28 దళాలను సిద్ధం చేసినట్లు దళం చీఫ్ నవ్‌నీత్ సింగ్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి ఉంది. సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. షిమ్లా జలమయమైంది. ఆ రాష్ట్రంలోని కంగ్డా, బిలాస్పూర్, మండీ, సిర్మౌర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సహాయ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్, అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాలను కూడా భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో కూడా వర్సాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి. జాతీయ భద్రతా దళాలతో పాటు ఆయా రాష్ట్రాల బృందాలు కలిసి సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. -
ముంబైని ముంచెత్తిన వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతిచెందారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెంబూరులోని భరత్‌నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడటంతో గోడ కూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకుని 17 మంది దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల చిక్కుకున్నవారిలో ఇప్పటివరకు 13 మందిని నుంచి రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడినవారికి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ముంబైను దంచికోడుతున్న భారీ వర్షాలు దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ పైన కూడా నీరు చేరడంతో, లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంబైలోని బందర్లో అత్యధికంగా 141 మి.మీ. వర్షపాతం నమోదైంది. ముంబై నగరంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా పుణె, రాయ్‌గఢ్, రత్నగిరి, కోల్హాపూర్, సతారా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో ముంబైలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
Yaas Cyclone: తుపానుపై ఒడిశా అలర్ట్
భువనేశ్వర్: భారత వాతావరణ విభాగం జారీ చేస్తున్న సమాచారం మేరకు యాస్ తుపానుతో బాలాసోర్ జిల్లా ప్రధానంగా ప్రభావితమవుతుంది. పొరుగు జిల్లా భద్రక్‌పై కూడా తుపాను ప్రభావం పడవచ్చు. తుపాను ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని, తుపానుకు ముందు, తర్వాత కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటుందని అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) యశ్వంత్ జెఠ్వా ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన బాలాసోర్ జిల్లాను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. బాలాసోర్ జిల్లాలో 40 లోతట్టు గ్రామాల్ని గుర్తించి కచ్చా ఇళ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించేందుకు 1,200 శాశ్వత, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం బాలాసోర్ జిల్లాకు అత్యధికంగా 12 యూనిట్ల ఒడిశా విపత్తు స్పందన దళం (ఒడ్రాఫ్) జవాన్లను పంపారు. వారితో పాటు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), అగ్ని మాపక దళం జవాన్లు కూడా చేరుకుంటారు. కోవిడ్-19 నిబంధనలతో వారంతా తుపాను అనంతర పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈ ఏర్పాట్లపై బాలాసోర్ జిల్లా ఐజీ, ఎస్పీ ఇతర సీనియర్ అధికారులతో శాంతిభద్రతల అదనపు డీజీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఆధునిక యంత్రాలతో పునరుద్ధరణ తుపాను తదనంతర పునరుద్ధరణ కార్యకలాపాలు చేపట్టేందుకు రోడ్లు–భవనాల శాఖ 165, గ్రామీణ అభివృద్ధి విభాగం 313 ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాల్ని రంగంలోకి దింపాయి. వారంతా అత్యాధునిక సహాయక, పునరుద్ధరణ యంత్ర పరికరాలతో సహాయక, పునరుద్ధరణ పనులు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 20 కోట్లు విలువ చేసిన యంత్రపరికరాల్ని కొనుగోలు చేసింది. వాటిలో టవ ర్ లైట్లు, సెర్చ్ లైట్లు, జనరేటర్లు, జేసీబీలు, హైడ్రా క్రేనులు, ఇన్ఫ్లేటబుల్ పడవలు, హై హ్యాండ్ హైడ్రాలిక్ చెట్టు కోత యంత్రాలు, గ్యాసు కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, సాట్ ఫోన్లు, వాకీటాకీలు ఉన్నాయి. ఈ ఆధునిక సామగ్రితో యాస్ తుపాను కార్యకలాపాలు చేపడతారని శాంతిభద్రతల అదనపు డైరెక్టరు జనరల్ యశ్వంత్ జెఠ్వా మీడియాకు తెలిపారు. -
కాలవైశాఖి బీభత్సం.. వణుకుతున్న ఒడిశా
భువనేశ్వర్: రాష్ట్రంలో పలుచోట్ల కాలవైశాఖి మంగళవారం బీభత్సం సృష్టించింది. మరో 24 గంటల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని స్థానిక వాతావరణ కేంద్రం సమాచారం జారీ చేసింది. ఈ వ్యవధిలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పిడుగులు పడే సంకేతాలు జారీ చేసింది.ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలో కాల వైశాఖి తాండవించనున్న సంకేతాలు ఉన్నాయి. బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడ, కటక్, జగత్సింగ్పూర్, పూరీ, ఖుర్దా, నయాగడ్, గంజాం, గజపతి, కొందమాల్, బౌధ్, ఢెంకనాల్, మయూర్భంజ్ జిల్లాలకు ఆరంజ్ వార్నింగ్, సుదరగడ్, ఝార్సుగుడ, బర్గడ్, సంబల్పూర్, దేవ్గడ్, అనుగుల్, కెంజొహార్, సువర్ణపూర్, నువాపడ, బలంగీరు, కలహండి, నవరంగపూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు సమాచారం. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. పిడుగులు పడి ముగ్గురి మృతి 3 జిల్లాల్లో పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఒక మహిళ ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొంతోంది. బలంగీరు జిల్లాలో ఇద్దరు మహిళలు స్నానం చేసేందుకు చెరువుకి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. వారిలో పాణిబుడి మేష్వా (65) ఘటనా స్థలంలోనే మరణించింది. భూమిసుత మేష్వా అనే మహిళ పిడుగుపడి కాలిపోవడంతో ప్రాణాపాయ పరిస్థితిలో స్థానిక భీమభోయి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కెంజొహార్ జిల్లాలోని కాశీపూర్ గ్రామంలో సాగు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా రాయిదాస్ ముండా అనే రైతు పిడుగు పడి మరణించాడు. అనుగుల్ జిల్లా అఠొమల్లిక్ ప్రాంతంలో ఇద్దరు పిడుగుపాటుకు గురికాగా ఓ యువకుడు ఘటనా స్థలంలోనే మరణించాడు. మరో వృద్ధుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలవైశాఖి ప్రభావంతో 20 మిల్లీవీుటర్లు పైబడిన వర్షపాతం రాష్ట్రంలో 9 చోట్ల నమోదైంది. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి -
రెడ్ అలర్ట్: రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం
సాక్షి, చెన్నై: నివర్ తరువాత రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం పట్టుకుంది. బుధవారం సాయంత్రం లేదా రాత్రి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో తీరందాటే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో తుపాన్ సహాయక చర్యలను సమీక్షించారు. దక్షిణ బంగాళాఖాతంలో గత నెల 28 నుంచి కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారి 24 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. మంగళవారం సాయంత్రానికి వాయుగుండం 11 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతూ నేడు సాయంత్రం లేదా రాత్రి త్రికోణకొండల సమీపంలో తీరందాటగలదని అంచనావేశారు. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకూడి, తెన్‌కాశీ జిల్లాల్లో 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యలపై సీఎం ఎడపాడి సమీక్ష నిర్వహించారు. చదవండి: (అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్) బురేవిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని, భయపడాల్సిన పని లేదని రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ మీడియాకు మంగళవారం తెలిపారు. అరక్కోణం నుంచి 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నాగర్‌కోవిల్‌కు పంపామన్నారు. కుమరి నుంచి 161 మరపడవల్లో ఇటీవల సముద్రంలోకి చేపలవేటకు వెళ్లిన రెండువేల మంది మత్స్యకారులు తీరం చేరకపోవడంతో ఆందోళన నెలకొంది. బురేవి హెచ్చరికల సమాచారాన్ని చేరవేసేందుకు చర్యలు చేపట్టారు. -
అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్
సాక్షి, చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఒకటో తేదీ నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు కురవనున్నాయి. రెండో తేదీ అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉండడంతో ముందుగానే రెడ్ అలర్ట్ ప్రకటించేశారు. నివర్ నష్టం తీవ్ర తను పరిశీలించేందుకు కేంద్ర బృందం సోమవారం చెన్నైకు రానుంది. నివర్ తుపాన్ తీరం దాటి నాలుగు రోజులు అవుతున్నా, చెన్నై శివార్లలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు ఇంకా తొలగలేదు. ఈ సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఆదివారం మరింతగా బలపడింది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఒకటో తేదీ మరింతగా బలపడనున్న దృష్ట్యా, ఈ ప్రభావం రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడుపై పడనుంది. తొలుత సముద్ర తీర జిల్లాలో మోస్తరు వర్షం, రెండో తేదీ అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండో తేదీన బురేవి తుపాన్‌గా మారి అతి భారీ వర్షాలు పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో అధికార వర్గాలు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టే పనిలోపడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..) నేడు కేంద్ర బృందం రాక.. నివర్ రూపంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, రాష్ట్రంలోని కడలూరు, విల్లుపురంలలో ప్రభా వం ఎక్కువే. మిగిలిన జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగానే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో నివర్ రూపంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేసి, కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు సోమవారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడు గురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాత్రి చెన్నైకు వచ్చే ఈ బృందం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో భేటీ అవుతుంది. ఆ తర్వాత నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. చివరగా చెన్నైలో సీఎం పళనిస్వామితో ఈ బృందం భేటీ అవుతుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక మేరకు కేంద్రం సాయం ప్రకటించనుంది. ఈ తుపాన్ కారణంగా పెను నష్టం జరగనట్టు అధికారుల పరిశీలనలో తేలింది. కొంత మేరకు నష్టం ఉండడంతో ఆ వివరాలతో నివేదికను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. ఆ మేరకు నలుగురు మరణించినట్టు, ఐదుగురు గాయపడ్డట్టు తేల్చారు. 14 ఎకరాల అరటి పంట పూర్తిగా దెబ్బతింది. పది వేల హెక్టార్లలోని పంటల్లో వరద నీళ్లు చొచ్చుకెళ్లాయి. 108 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 2,927 స్తంభాలు ఒరిగాయి. 199 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 1,439 గుడిసెలు పాక్షికంగా దెబ్బ తినగా, 302 గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 245 పశువులు మరణించాయి. 2,064 చెట్లు నేలకొరిగాయి. 4,139 శిబి రాల్లో 2.32 లక్షల మంది సురక్షితంగా ఉన్నట్టు తాజా నివేదికలో పేర్కొన్నారు. చదవండి: (మరో వాయు‘గండం’) సెంబరంబాక్కం గేట్లతో.. ఈనెల 26న సెంబరంబాక్కం గేట్లను తెరిచిన విషయం తెలిసిందే. తొలిరోజు 9 వేల గణపుటడుగుల మేరకు నీళ్లు వదిలారు. ఆ తర్వాత వర్షాలు ఆగడం, నీటి రాక తగ్గడం వెరసి గేట్లను మళ్లీ మూయడానికి అధికారులు సిద్ధమయ్యారు. తెరిచిన గేట్ల వద్ద చెట్ల కొమ్మలు, వేర్లు చుట్టుకుని ఉండడంతో మూత కష్టతరంగా మారింది. దీంతో ఆదివారం ఉదయాన్నే భారీ క్రేన్లను రప్పించి, గేట్లకు చుట్టుకెళ్లి ఉన్న వేర్లను, కొమ్మలను తొలగించే పనిలో పడ్డారు. దీంతో జలాశయం నుంచి వృథాగా 350 గణపుటడుగుల మేరకు నీళ్లు బయటకు వెళ్తున్నాయి. చెన్నైకు నీళ్లు అందించే సెంబరంబాక్కంలో 22 అడుగులు, పూండిలో 34 అడుగులు, తేర్వాయి కండ్రిలో 22 అడుగులు, చోళవరంలో పది అడుగులు, పుళల్‌లో 19 అడుగులు, వీరానంలో 8 అడుగుల మేరకు నీళ్లు తాజా వర్షాలకు వచ్చి చేరాయి. అన్ని చెరువులు నిండే స్థాయిలోనే ఉండడంతో ఈ వేసవిలో చెన్నైకు తాగు నీటికి ఢోకా లేదు. కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ పరిసరాల్లోని నీటి పరివాహక ప్రాంతాలు, చెరువుల్లోకి తాజా వరదల రూపంలో మొసళ్లు వచ్చి చేరి ఉండడంతో ఆ పరిసర వాసుల్లో ఆందోళన తప్పడం లేదు. ఉత్తర చెన్నైలో భారీ వర్షాల సమయంలో కొట్టుకెళ్లిన కొళత్తూరుకు చెందిన మహబూబ్ భాష మృతదేహం ఆదివారం మాధవరం సమీపంలోని కాలువలో బయటపడింది. -
చిగురుటాకులా వణుకుతున్న భాగ్యనగరం
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ వారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడ తెరపిలేకుండా కురిసిన వానతో రాష్ట్రం తడిసి ముద్దయింది. రాష్ట్రంలో మెజార్టీ ప్రాంతాల్లో నిరంతరాయంగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. జలాశయాలు, చెరువులు నిండుకుం డల్లా మారాయి. వాగులు, వంకలు పొంగి రాకపోక లకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌లో రోజంతా భారీ వర్షం కురవడంతో అతలా కుతలమైంది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొ ద్దని పోలీసులు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తాజా వర్షాలతో రాష్ట్రంలో 15 జిల్లాల్లో అత్యధిక, 12 జిల్లాల్లో అధిక, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటింది. మరోవైపు రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వచ్చే 48 గంటలపాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు ఈదురు గాలులు సైతం వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా, బుధవారం అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. చెరువులైన రోడ్లు వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురిసిన వానతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఆగమాగమైంది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు మంగళ వారం తెల్లవారుజామున మొదలైన వర్షం.. అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. పట్టుమని పది నిమిషాలు కూడా తెరపినివ్వకపోవడంతో దాదాపుగా నగరం మొత్తం జల దిగ్బంధనంలో చిక్కుకుంది. 20 ఏళ్ల తర్వాత కురిసిన రికార్డు స్థాయి వర్షానికి సిటీజనులు చిగురుటాకుల్లా వణికి పోయారు. హైదరాబాద్‌లో 44 కిలోమీటర్ల పరిధిలో ప్రవహిస్తున్న మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో దాదాపు 1,500 వందల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన నాలాలు ఉప్పొంగాయి. వరద, మురుగునీరు పోటెత్తడంతో సుమారు 7 వేల కిలోమీటర్ల పరిధిలోని డ్రైనేజీపై ఉన్న ఉన్న పైప్లైన్ల మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. హుస్సేన్ సాగర్‌తోపాటు జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు హిమాయత్‌సాగర్ రెండు గేట్లు ఎత్తి 1,300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. వందలాది బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై నడుము లోతున నీరు పోటెత్తింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు బస్తీవాసులు నానా అవస్థలు పడ్డారు. చెరువులు, కుంటలను ఆనుకుని ఉన్న బస్తీల్లో వరద ఉధృతి అధికంగా ఉండటంతో బస్తీల వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 17 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సింగపూ ర్ టౌన్షిప్లో 29.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఇక వర్ష బీభత్సం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి అంధకారం అలుముకుంది. వర్షవిలయం కారణంగా గ్రేటర్లో హై అలర్ట్ ప్రకటించారు. అంతా జలమయం.. హైదరాబాద్‌లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయమైంది. దీంతో మూసీ తీరప్రాంత ప్రజలను, నాలాలకు ఆనుకుని ఉన్న బస్తీవాసులను రెవెన్యూ, పోలీసు, బల్దియా యంత్రాంగం అప్రమత్తం చేసింది. పలు కాలనీలు, బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు మోటార్లు, జెట్టింగ్ యంత్రాల సాయంతో తొలగిస్తున్నాయి. వర్ష బీభత్సానికి పాతనగరం సహా పలు ప్రాంతాల్లో శిథిల భవనాలు, చెట్లు నేలకూలాయి. రాగల 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవచ్చని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 6 గంటల వరకు సరాసరిన 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరంలో వచ్చే 24 గంటల్లో 10–15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండడంతో జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీసు, రెవెన్యూ విభాగాల సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జీహెచ్ఎంసీ సిబ్బంది.. శిథిల భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. -
సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బోర్డర్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు మావోయిస్టుల సంచారం, మరోవైపు పోలీసు, గ్రేహౌండ్స్ బలగాల తనిఖీలు, కూంబింగ్.. అటవీ పల్లెల్లో అలజడి రేపుతోంది. గోదావరి పరిరీవాహక ప్రాంతాతల అడవుల్లో మావోయిస్టులు తలదాచుకుని ఉంటారని భావిస్తూ ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచా రంతో గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాలపై మూడు నెలలుగా దృష్టి సారించిన పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాలను ఇప్పటికే రెండు పర్యాయాలు సందర్శించిన పోలీసు బాస్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మరోమారు బుధవారం నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఈ సంద ర్భంగా మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారుల బదిలీలు కూడా జరిగాయి. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయడంలో అనుభవం, ఆసక్తి ఉన్న వారికి పోస్టింగ్ ఇచ్చారు. దేవార్లగూడెం ఎన్‌కౌంటర్‌తో రెడ్అలర్ట్ ఓ వైపు పోలీసుబాస్ పర్యటన, మరోవైపు దేవార్లగూడెం ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవార్లగూడెం – దుబ్బగూడెం గ్రామాల మధ్య గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు యాక్షన్ టీం నాయకుడు దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతి చెందా డు. దీనిపై స్పందించిన మావోయిస్టులు ఈనెల 6న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, పెద్దపల్లి, తూర్పు గోదావరి జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నల్లకుంట ఏరియా అర్లపల్లికి చెందిన శంకర్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా పట్టుకున్న పోలీసులు చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆ ప్రకటనలో ఆరోపించారు. ఈ మేరకు బంద్‌కు పిలుపునివ్వగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే, గుండాల ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తమైన పోలీసులు నక్సల్స్ కోసం వేట మొదలుపెట్టారు. మణుగూరు నుంచి ములుగు జిల్లా మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహదేవపూర్, మహముత్తారం అడవుల్లోకి మావోయిస్టులు వచ్చినట్లు నిఘా వర్గాల సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతీకారంగా మావోయిస్టులు ఏదైనా ఘటనకు పాల్పడుతారేమోననే అనుమానంతో పోలీసులు తనిఖీలు విస్తృతం చేయడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని టీఆర్ఎస్, బీజేపీ నేతలను పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ పల్లెలు ఉలిక్కి పడుతున్నాయి. బడే చొక్కారావు, వెంకటేశ్ లక్ష్యంగా కూంబింగ్ మావోయిస్టు నేతలు బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ లక్ష్యంగా పోలీసుల కూంబింగ్ సాగుతోంది. “ఆపరేషన్ ప్రహార్’ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టు దళాలు వీరి నాయకత్వంలోనే గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న రాష్ట్ర యాక్షన్ టీం కార్యదర్శి దామోదర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి(జేఎండబ్ల్యూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్‌ను టార్గెట్ చేసుకొని పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు నేతలు భూపాలపల్లి, ములుగు అడవుల్లో మకాం వేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. అయితే కేకేడబ్ల్యూ కార్యదర్శిగా పని చేసిన దామోదర్‌కు పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అడవులపై పట్టు ఉండడంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు భావిస్తున్నారు. -
అత్యంత భారీ వర్షాలు.. ముంబైకు రెడ్ అలర్ట్
ముంబై : భారీ వర్షాలు కురుస్తుండటంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ఇళ్లల్లోంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రైలు, రోడ్డు మార్గాలన్నీ స్తంభించాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారత వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. (బీరూట్ భారీ పేలుళ్లు, 70మంది మృతి ) ఈ రోజు ముంబైలో అత్యవసర, నిత్యవసరాలు మినహా మిగతా షాపులు తీయవద్దని బీఎంసీ అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండగా ఇలాంటి సమయంలో భారీ వర్షాలు పెను సమస్యగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. దీనికి తోడు ఉత్తరప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
ముంబైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పటికే వర్షంలో తడిసి ముద్దవుతున్న వేళ భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ముంబైతో పాటు థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో రానున్న 18 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం నాటి ఆరెంజ్ అలెర్ట్‌ను రెడ్ అలెర్డ్‌గా మారుస్తూ బుధవారం ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గురువారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కాగా మంగళవారం రాత్రి నుంచి ముంబైలో కుండపోతగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్, మంచినీటి సరఫరా, రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, లోతట్లు, తీర ప్రాంతాలకు వెళ్లొదని బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. -
బెంగాల్, సిక్కింకు రెడ్ అలర్ట్ జారీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్, సిక్కిం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. జూలై 12 నుంచి 16 మధ్య భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కోల్‌కతాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది. హిమాలయాల పర్వత ప్రాంతాల మధ్య రుతుపవనాల పతనం, బెంగాల్ బే నుంచి బలమైన తేమ చొరబాటు కారణంగా వాతావరణ పరిస్థితిలో మార్పులు తలెత్తినట్లు పేర్కొంది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, నీటి మట్టాలు పెరగవచ్చని బులెటిన్‌లో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బెంగాల్, సిక్కిం సహా వర్షాల ప్రభావం ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు చేసింది. చదవండి: 15 రోజుల్లో కేసులు రెట్టింపు కావొచ్చు -
భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ!
ముంబై : భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ముంబై, థానే, రత్నగిరి జిల్లాలకు రెడ్ అలెర్టు జారీ చేసింది. ముంబైలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. తాజాగా ముంబై పరిసర ప్రాంతాల్లో శనివారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పాల్గఢ్, ముంబై, రత్నగిరి, రాయ్‌గఢ్, థానేలలో నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. (ముంబైకి భారీ వర్ష సూచన) అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. కనీసం రెండు రోజులు ట్రాఫిక్, విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కాగా శుక్రవారం కురిసిన వర్షాలకే ముంబై మహా నగరం అతలాకుతలం అయింది. ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కుండపోత వాన పడటంతో 161.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతేగాక కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. (పిడుగుల బీభత్సం.. 31 మంది మృతి) -
రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు
న్యూఢిల్లీ: గడిచిన వారం రోజులుగా ఒక్కసారిగా దేశంలో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైన నమోదవుతుండగా.. రాబోయే రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్, రాజస్థాన్, చంఢీఘర్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదివారం 'రెడ్ అలర్ట్' ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా వడగాలు వీస్తాయని ఐఎండీ 'ఆరెంజ్ వార్నింగ్' జారీ చేసింది. చదవండి: గాడ్సే దేశాన్ని రక్షించారంటూ ఎఫ్బీలో పోస్ట్ ఈ విషయంపై ఐఎండీ రీజినల్ మెటీరియాలజీ సెంటర్ హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరణ ఇస్తూ.. రాబోయే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటి నమోదవుతాయి. ఈ సంవత్సరం వేసవిలో అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఉత్తర, మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఇప్పటి వరకూ సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఏప్రిల్, మే మధ్య వరకు వర్షాలు కురవడంతో ఎండలు తీవ్రత అంతగాలేదని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకూ కొనసాగుతాయనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండనున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీలుగా నమోదైంది. దీనికి తోడు వేడిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్ వార్నింగ్ జారీచేసిన ప్రాంతాల్లోని ప్రజలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని ఐఎండీ సూచించింది. చదవండి: కరోనా : టాటా గ్రూపు సీఈవోల కీలక నిర్ణయం -
ఉత్తర భారతంలో రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు మించిపోవడంతో భారత వాతావరణ శాఖ(ఐఎండీ)ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హరియాణా, చండీగఢ్, రాజస్తాన్‌లకు మరో రెండు రోజుల పాటు ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది. వడగాడ్పులు వీచే ప్రమాదమున్నందున తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్లు ఐఎండీ పేర్కొంది. వచ్చే 2, 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు కావచ్చని హెచ్చరించింది. ఈ వేసవిలో రెడ్ అలర్ట్ జారీ చేయడం ఇదే మొదటిసారని తెలిపింది. ఉత్తర, మధ్య భారత్‌లో ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు వానలు కురియడంతో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యాయి. రాజస్తాన్‌లోని పిలానీలో శనివారం అత్యధికంగా 46.7 డిగ్రీలు నమోదైంది. పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, విదర్భల్లో వచ్చే అయిదు రోజుల్లో తీవ్ర వడగాడ్పులు వీచేందుకు అవకాశ ముందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, యానాం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3, 4 రోజుల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీస్తాయంది. వాతావరణ పరిస్థితుల్లో తీవ్రతను బట్టి గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ అని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే రోజులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించడమే రెడ్ అలర్ట్ ఉద్దేశం. ఈనెల 28వ తేదీ తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త నరేశ్ కుమార్ అన్నారు. -
పోలీసు వలయంలో ఆ ప్రాంతాలు
సాక్షి, ఒంగోలు: కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. తాజాగా రెడ్ జోన్ల చుట్టూ పటిష్ట పోలీసు వలయాన్ని ఏర్పాటు చేసి ప్రధాన రహదారి వద్ద భారీ బోర్డులను ఏర్పాటు చేసింది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతం చుట్టూ 300 మీటర్ల వరకు రెడ్‌జోన్‌గా పేర్కొంటూ మ్యాప్ రూపొందించారు. ఆ ప్రాంతంలోని అన్ని రహదారులను మూసేసి.. అన్నింటిని కలిపే ఒకే ఒక్క రహదారిని తెరిచి ఉంచుతున్నారు. అక్కడ నిత్యం పోలీసులు, ఏఎన్ఎం, ఉపాధ్యాయ వర్గం నుంచి ఒక్కొక్కరు పికెట్‌లో ఉండేలా చర్యలు చేపట్టారు. ఆ మార్గం నుంచి వెళ్లే ప్రతి వాహనం నంబర్, మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకుని బయటకు వెళ్లేందుకు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని 11 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. చదవండి: పోలీస్: ‘దండం పెడుతా.. బయటకు రాకండి’ పీర్లమాన్యం వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న ట్రైనీ ఎస్పీ జగదీష్ ఒంగోలు నగరంలో ఈ పహారా మరింత పటిష్టంగా మారింది. ఇస్లాంపేటలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతం, పీర్లమాన్యంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అక్కడ పనిచేసే అధికారులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. ఏ అధికారి ఎన్ని గంటలకు విజిట్ చేశారు.. అప్పటివరకు ఎన్ని వాహనాలు బయటకు వెళ్లాయి.. ఎవరెవరు బయటకు వస్తున్నారనే వివరాలు సిబ్బంది రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ రికార్డులను అధికారులు పరిశీలించి సంతకం కూడా చేయాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశించారు. కొంతమంది వ్యక్తులు అవసరం ఉన్నా లేకున్నా బయటకు వస్తున్న విషయం ఈ విధానం ద్వారా బహిర్గతమవుతుందని, తద్వారా సంబంధిత వ్యక్తులపై నిబంధనలు ధిక్కరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని పలు రెడ్ జోన్ ప్రాంతాలను విజిట్ చేసిన తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్ శుక్రవారం తెలిపారు. చదవండి: భార్యతో సైకిల్‌పై 120 కిలోమీటర్లు.. లాక్డౌన్లో సిబ్బంది విధులను పరిశీలించిన ఎస్పీ లాక్డౌన్ సందర్భంగా నగరంలో సిబ్బంది విధులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ శుక్రవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి మోటార్‌బైక్‌పై బయటకు వచ్చిన ఆయన అంజయ్య రోడ్డు, లాయర్ పేట, సాయిబాబా ఆలయం, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, కోర్టు సెంటర్, గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్డు, ఇస్లాంపేట, బండ్లమిట్ట, కర్నూల్‌రోడ్డులోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత ప్రాంతాల్లోని సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇస్లాంపేట, బండ్లమిట్ట ప్రాంతాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. -
రెడ్ జోన్లుగా 133 క్లస్టర్లు
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్ వ్యక్తులను గుర్తించిన 133 క్లస్టర్లలో ప్రభుత్వం శుక్రవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రతి క్లస్టర్లోనూ వైరస్ నివారణ, ప్రజారోగ్య చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్వారంటైన్, భౌతిక దూరం వంటి అంశాలను వివరించడంతోపాటు.. మెరుగైన నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద కేసులన్నింటినీ పరీక్షిస్తారు. పాజిటివ్ వ్యక్తులు ఎవరెవరిని కలిశారో (కాంటాక్ట్స్) గుర్తించి అందర్నీ ఐసోలేషన్‌లో ఉంచి కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది. కంటైన్మెంట్ క్లస్టర్లుగా.. ► పాజిటివ్ కేసులు బయటపడిన ప్రాంతం నుంచి 3 కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలన్నిటినీ కంటైన్మెంట్ క్లస్టర్‌గా గుర్తించి వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు. ► కేసుల వ్యాప్తికి అవకాశం ఉన్న 5 కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా బఫర్ జోన్‌గా గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బఫర్ జోన్లను 7 కిలోమీటర్ల వరకు విస్తరిస్తున్నారు. ► అత్యవసర సేవలు (వైద్య అత్యవసర పరిస్థితులు సహా), ప్రభుత్వ సేవలు మినహా కంటైన్మెంట్ జోన్ నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు. ► అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి.. వైరస్‌పై అవగాహన కల్పిస్తారు. అన్ని వాహనాల కదలిక, ప్రజా రవాణా నిషేధం. ► కంటైన్మెంట్ జోన్‌ను అనుసంధానించే గ్రామీణ రహదారుల సహా అన్ని రహదారులూ పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయి. ► పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్స్ అన్నీ 12 గంటల్లోపు జాబితా తయారు చేసి, వాటిని ట్రాక్ చేస్తారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల నిఘా అనుక్షణం ఉంటుంది. ► క్లస్టర్లలో పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. క్లస్టర్లలో పోలీస్ ఆంక్షలు కరోనా క్లస్టర్ పరిధిలోని రెడ్ జోన్లు, హాట్ స్పాట్లను పోలీస్ వలయంలో ఉంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా, బయటి వారు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా గస్తీ ఏర్పాటు చేశారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కేసుల నమోదుకూ వెనుకాడటం లేదు. క్లస్టర్ చుట్టూ ఉన్న మార్గాలను మూసేసి 28 రోజులపాటు ఆంక్షల్ని కొనసాగిస్తున్నారు. ప్రతి జోన్లో ఎస్ఐ ఇన్చార్జిగా ఆ ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి 10 నుంచి 20 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.ఆ ప్రాంతాల్లో ఆహార పదార్థాలను పంపిణీ చేసేవారు ముందస్తు అనుమతి తీసుకోవాలి. -
కరోనా వైరస్: ‘పాజిటివ్’ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి: జిల్లాలో ‘ఢిల్లీ’ కలకలం కొనసాగుతోంది. రెండు రోజుల వ్యవధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 23కు చేరడం.. అది కూడా ఢిల్లీ వెళ్లొచ్చిన వారికే నిర్ధారణ కావడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. మరోవైపు ఇటీవల చనిపోయిన విజయవాడకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ అని వెల్లడి కావడంతో ఆందోళన తారస్థాయికి చేరింది. దీంతో ఢిల్లీకి వెళ్లిన వారంతా గత నెల 17, 18 తేదీల్లో జిల్లాకు రావడంతో అప్పటి నుంచి వీరు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారనే విషయాన్ని పోలీసులు, అధికార యంత్రాంగం రాబడుతోంది. వీరు సంచరించిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తులు ఇప్పటికే దాదాపు 135 మందిని అనుమానితులుగా గుర్తించి వీరందరినీ విజయవాడలోని రైల్వే ఇన్స్టిట్యూట్, ఆర్టీసీ ఆస్పత్రి, సెంటినీ, వైవీ రావు, లిబర్టీ, గన్నవరం వెటర్నీ కళాశాల, గంగూరులోని క్వారంటైన్ సెంటర్లకు పంపించారు. హాట్స్పాట్లుగా బాధితులున్న ప్రాంతాలు.. కరోనా పాజిటివ్ బాధితులు నివాసముంటున్న పరిసర ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. విజయవాడ నగరంలోని ఓల్డ్ రాజరాజేశ్వరీపేటతోపాటు, కుమ్మరిపాలెం, జగ్గయ్యపేట పట్టణం, నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం ముప్పాల గ్రామాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. అక్కడివారు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకుండా.. అక్కడే ఉండేలా ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. తొలిదశలో బాధితుల కుటుంబ సభ్యులు, వారి సన్నిహిత బంధువులను క్వారంటైన్‌కు తరలించిన అనంతరం ఆ వర్గానికి చెందిన మత పెద్దలు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులతో అధికారులు, పోలీసులు సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. విజయవాడ నగరంలో హాట్స్పాట్లుగా గుర్తించిన ఓల్డ్ రాజరాజేశ్వరీపేటతోపాటు, కుమ్మరిపాలెం ప్రాంతాలలో తాజాగా మరికొన్ని కేసులు పాజిటివ్‌గా తేలడంతో ఈ ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టిని పెడుతున్నారు. ఇక నరగంలోనూ గతం కన్నా భిన్నంగా మరిన్ని ఆంక్షలు అన్ని చోట్ల కనిపించే వీలుంది. కంటైన్మెంట్ జోన్లు ఇవే.. జిల్లా వ్యాప్తంగా విదేశాల నుంచి, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లాలో కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. విజయవాడలో కృష్ణలంక, భవానీపురం, శాంతినగర్(నున్న), కేదారేశ్వరీపేట, మొగల్రాజపురం, సనత్ నగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వాసుల కలవరం.. ఢిల్లో మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన వారిలో ఎక్కువ మందిలో ఈ వ్యాధి ఉన్నట్లు వెల్లడవడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. జిల్లా నుంచి మొత్తంగా 52 మంది ఢిల్లీకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఇటీవల హుటాహుటిన వారిని గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. గుర్తించిన అనుమానితుల నమూనాలను ల్యాబ్‌కు పంపించగా 10 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు వారి స్వస్థలాల్లో సంచరించడం.. అదే సమ యంలో వారితో దగ్గరగా ఉన్న వారికి, సంబం«దీకులకు కూడా కరోనా పాజిటివ్ లక్షనాలున్నట్లు తేలడంతో ఒక్క సారిగా జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. బెజవాడలో స్వచ్ఛందంగా 67 మంది క్వారంటైన్‌కు.. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారు, వారి సంబంధీకులను గత నాలుగు రోజులుగా 213 మందిని గుర్తించిన పోలీసులు విజయవాడ, సమీప ప్రాంతాల్లో ఉన్న క్వారంటైన్ కేంద్రాలకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఖ్య మరింత ఉండొచ్చని భావించిన నగర సీపీ ద్వారకా తిరుమలరావు, ముస్లిం మత పెద్దలతో మాట్లాడి.. స్వచ్ఛందంగా క్వారంటైన్ రావలని పిలుపునివ్వడంతో గురువారం ఒక్కరోజే 67 మంది క్వారంటైన్‌కు వచ్చారు. విద్యాధరపురం గుప్తా సెంటర్‌కు చెందిన వీరిని రెండు ఆర్టీసీ బస్సులలో కంకిపాడులోని శ్రీచైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు తరలించినట్లు భవానీపురం పీఎస్ సీఐ డీకేఎన్ మోహన్‌రెడ్డి తెలిపారు. ముందుకు రండి.. కరోనా పాజిటివ్ వ్యక్తులను కలిసిన వారు, సన్నిహితులు, సంబం«దీకులు క్వారంటైన్‌కు స్వచ్ఛందంగా రావాలి. తప్పించుకుని తిరుగుతున్న వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగానే భావిస్తున్నాం. కాబట్టి వారు క్వారంటైన్ రావడం వల్ల.. వారితోపాటు వారుంటున్న ప్రాంత ప్రజల్ని రక్షించించుకున్నట్లే. – ద్వారకా తిరుమలరావు, సీపీ, విజయవాడ -
కృష్ణలంకలో రెడ్ అలెర్ట్
-
ఏవోబీలో రెడ్ అలెర్ట్
పాడేరు,సీలేరు: మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏవోబీలో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అవుట్ పోస్టుల ప్రాంతాల్లో అప్రమత్తమయ్యారు. సోమవారం నుంచి పీఎల్జీఏ వారోత్సవాల నిర్వహణకు మావోయిస్టులు ఏర్పాట్లు చేస్తున్నారు.జీకే వీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో రెండు నెలల కిందట జరిగిన ఎన్కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తదనంతరం వారోత్సవాలు జరుగుతుండడంతో మావోయిస్టులు ప్రతీకార దాడులు జరిపే అవకాశం ఉందని సమాచారం. దీంతో మారుమూ ల గ్రామాల ప్రజలు బితుకుబితుకుమంటూ ఉన్నారు. అయితే పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. విశాఖ రూరల్ ఎస్పీ అట్టాడ బాబూజీ, ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు కూంబింగ్‌లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు ఆంధ్రా,ఒడిశా పోలీ సు అధికారులు పకడగ్బందీగా వ్యూహం రచించినట్టు సమాచారం. ఒడిశా పోలీసు బలగాలతో పాటు,విశాఖ జిల్లాకు చెందిన పోలీసు పార్టీలు ఉమ్మడిగా ఏవోబీలో కూంబింగ్ చర్యలు చేపట్టాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కొయ్యూరు,సీలేరు, జీ,కే.వీధి,చింతపల్లి,అన్నవరం,జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. అరకు,డుంబ్రిగుడ,హుకుంపేట,అనంతగిరి పోలీసుస్టేషన్ల అధికారులు,ప్రత్యేక పార్టీల పోలీసులు అప్రమత్తమయ్యారు. రాళ్లగెడ్డ,కోరుకొండ,నుర్మతి, రూడకోట అవుట్ పోస్టులలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాలతో ఏవోబీ అంతా పోలీసు నిఘా అధికమైంది.అన్ని మండల కేంద్రాలు,ప్రధాన రోడ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణుకుల లగేజీ బ్యాగ్‌లను సోదా చేస్తున్నారు.కల్వర్టులు,రోడ్డు ఇరువైపులా బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు జరుపుతున్నారు. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. సీలేరు మీదుగా అంతర్రాష్ట్రాలకు వెళ్లే రాత్రి సర్వీసులను నిలిపివేయనున్నారు. సీలేరు ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులకు సంబంధించిన వాహనాలను పోలీసు స్టేషన్ల వద్దకు తరలించారు. -
కర్ణాటకకు 'కైర్' తుఫాను ముప్పు
బెంగుళూరు : అరేబియన్ సముద్రంలో ఏర్పడిన 'కైర్' తుఫాను ప్రభావంతో కర్ణాటక తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం రాత్రి వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణశాఖ అధికారి జీ.ఎస్. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ముంబై పశ్చిమానికి నైరుతి దిశలో 540 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన 'కైర్' తుఫాను క్రమంగా బలపడుతూ 'సూపర్ సైక్లోనిక్ తుఫానుగా' రూపాంతరం చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా కర్ణాటక రీజియన్‌లోనూ ఆదివారం రాత్రి నుంచి రెండు రోజులు వర్షాలు కురిసి అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. కైర్ తుఫాను ప్రభావంతో గోవా, కర్నాటక ప్రాంతాంల్లో రెడ్ అలర్ట్ ప్రకటించామని, శనివారం నుంచే ఈ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తీర ప్రాంతంలో జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో 'కైర్' తుఫాను ఒమన్ తీరానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. -
దంచికొడుతున్న వానలు.. ముంబైలో రెడ్ అలర్ట్
ముంబై :మహారాష్ట్రలో వానలు దంచి కొడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబై నగరంలో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే స్కూళ్లకి సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలతో ట్రైన్లు, విమానాల రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలతో ముంబైలోని సియోన్ ఏరియాలో ప్రధాన మార్గాలు నీటితో నిండిపోయాయి. దీంతో వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు సియోన్ రైల్వే స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరింది. ఐఎండీ ఇప్పటికే ముంబై, థానే, పల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయే అవకాశాలున్నాయిని ఐఎండీ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ హోసలికర తెలిపారు. భారీ వర్షాలతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముంబైను సురక్షితంగా ఉంచేందుకు ఏదైనా సహాయం కావాలంటే 1916కు కాల్ చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తమిళనాడులో ‘లష్కరే’ జాడ
సాక్షి, చెన్నై: తమిళనాడులోకి సముద్రమార్గం గుండా లష్కరే తోయిబా ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావటంతో పోలీసులు శుక్రవారం గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఒక పాకిస్తానీతో పాటు శ్రీలంకకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు కోయంబత్తూరులో తిష్ట వేసినట్టు తెలియడంతో వారి కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో చెన్నై, మధురై, కోయంబత్తూరు ఉన్నట్టుగా కేంద్ర నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశాయి. ఇటీవల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో సాగిన వరుసబాంబు పేలుళ్ల అనంతరం ఎన్ఐఏ తమిళనాడుపై దృష్టి పెట్టింది. ఐసిస్ మద్దతుదారులకు విదేశాల్లో శిక్షణనిచ్చి ఇక్కడ చొప్పించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుల్ని ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేసి విచారణ కూడా జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డీజీపీ త్రిపాఠి, అదనపు డీజీపీ జయంతి మురళి పర్యవేక్షణలో ఐజీలు, డీఐజీలు, ఎస్పీల స్థాయి నుంచి కింది స్థాయి పోలీసు వరకు రంగంలోకి దిగారు. నుదుట తిలకం పెట్టుకుని... కోయంబత్తూరులో చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదులు నుదుట తిలకం పెట్టుకుని ఉన్నారని, బాంబు పేలుళ్లే లక్ష్యంగా హిందూ సంఘాలు, బీజేపీ నేతల్ని సైతం గురిపెట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సాయుధ బలగాలనూ రంగంలోకి దింపారు. చెన్నైలో ఐదువేల మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు సాగుతున్నాయి. శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న రామేశ్వరం, పాంబన్, వేదారణ్యం, ముత్తుపేట, నాగపట్నం తీర ప్రాంతాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. -
భారీ వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు దేశ వ్యవసాయ రంగానికి ఆయువు పట్టు అనే సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 70 శాతం వర్షపాతం, వ్యవసాయం నైరుతి రుతుపవనాల మీద ఆధారపడింది. అయితే ఈ వర్షాల వల్ల ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున సంభవిస్తుంది. ఏకధాటిగా కురుస్తున్న వానలతో దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర కూడా విలవిల్లాడుతుంది. భారీ వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా 95మంది చనిపోగా.. కేరళలో వరదలతో గత మూడు రోజుల్లో 42 మంది చనిపోయారు. ఇప్పటికే సుమారు లక్ష మందిని కేరళ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. మలప్పురం, వయనాడ్ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో సుమారు 80మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో బనసురసాగర్ ఆనకట్ట గేట్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పత్రికా సమావేశంలో తెలిపారు. వరదల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వరదల కారణంగా కొచ్చి విమానాశ్రయాన్ని ఆదివారం వరకూ మూసి వేస్తున్న ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భారీ వర్ష సూచన.. రెడ్అలర్ట్ ప్రకటన
తిరువనంతపురం: భారీ వర్ష సూచన నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో రెడ్అలర్ట్ ప్రకటించారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కేరళకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమయిన అధికారులు ముందుస్తు జాగ్రత్తగా హైఅలర్ట్ ప్రకటించారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించిన వరద బీభత్సం.. ఎంతో మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులంతా ముందుస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. అలాగే ఇడుక్కి, వయనాడ్, కానూర్, ఎర్నాకులం, త్రిసూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారుల సమాచారం. కాగా వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది కేరళను వరదలు ముంచెత్తిన విషయం విదితమే. -
భయపెడుతున్న భారీ వర్షాలు : రెడ్ అలర్ట్
సాక్షి, ముంబై :వాణిజ్య రాజధాని ముంబైని మరోసారి వానలు ముంచెత్తాయి. సోమవారం రోజు కేవలం రెండు గంటలపాటు కురిసిన అతిభారీ వర్షంతోనగర వీధుల్లో వరద పోటెత్తింది. ఉదయం ఎనిమిదిన్నర గంటలనుంచి 11.30 నిమిషాల వరకు 789 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైందని స్కైమెట్ అంచనా వేసింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైతో పాటు, పుణే, తీరప్రాంత కొంకణ్ ప్రాంతాల్లో భారీగా వర్షం నమెదవుతోంది. తాజా వర్షాల కారణంగా అంధేరీ ఈస్ట్‌లో గోడ కూలిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రానున్న 24 గంటల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా రాయఘడ్, థానే, పాలఘర్ ప్రాంతాల్లో రేపు (మంగళవారం) భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ అలల తాకిడి ఉంటుందని ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు అరేబియా సముద్రంలోకి అడుగు పెట్టవద్దని మత్స్యకారులను వాతావరణశాఖ హెచ్చరించింది. మరోవైపు వాతావరణ అననుకూల పరిస్థితులతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలను కొద్దిసేపు నిలిపివేశారు. దృశ్యమానత లోపించడంతో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. తమ విమానాల రాకపోకల వివరాలను తప్పకుండా చెక్ చేసుకోవాలని ఆయా విమాన సంస్థలు ప్రయాణకులకు విజ్ఞప్తి చేశాయి. Streets in Mumbai flooded due to heavy rainfall, visuals from Dahisar area. IMD has predicted that heavy to very heavy rainfall is likely to occur at a few places with extremely falls at isolated places in Raigad & Palghar dist & at a few places in Mumbai & Thane dist, today. pic.twitter.com/yttuuRecZF — ANI (@ANI) July 8, 2019 Mumbai: One person injured after wall of Paper Box Industrial Estate, MIDC Andheri collapsed earlier today. #Maharashtra — ANI (@ANI) July 8, 2019 -
‘రెడ్ అలర్ట్’నియోజకవర్గాలు
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో కొన్నింటిని రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా పరిగణిస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనయినా పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకు మించి అభ్యర్థులపై ›క్రిమినల్ కేసులు ఉంటే ఆ నియోజకవర్గాన్ని రెడ్ అలర్ట్ నియోజకవర్గంగా గుర్తిస్తారు.పోలింగు సమయంలో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు.ఆరో దశ కింద మే 12న పోలింగు జరిగే 59 నియోజకవర్గాల్లో 34 నియోజకవర్గాలు రెడ్ అలర్డ్ నియోజకవర్గాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) పేర్కొంది. కాగా, ఆరో దశలో పోటీ చేస్తున్న మొత్తం 967 మందిలో 20శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం బీజేపీ అభ్యర్ధుల్లో 48శాతం, కాంగ్రెస్ అభ్యర్ధుల్లో 44శాతం నేర చరితులున్నారు. ఆరో దశలో బీజేపీ తరఫున మొత్తం 54 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో 26 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అలాగే, కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తున్న 46 మందిలో 20 మందిపై కేసులున్నాయి.బీఎస్పీ అభ్యర్థులు 49 మందిలో 19 మంది,307 ఇండిపెండెంట్లలో 34 మందిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి. మొత్తం 967 మందిలో 146 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో నలుగురిని కోర్టు దోషులుగా ప్రకటించింది. ఆరుగురిపై హత్య కేసులున్నాయి.25 మందిపై హత్యాయత్నం కేసులు పెండింగులో ఉన్నాయి.21 మందిపై మహిళలపై అకృత్యాల కేసులున్నాయి. -
శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడిన టిట్లీ తుఫాన్
-
ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు
న్యూఢిల్లీ/చండీగఢ్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ప్రభావంతో వరద పోటెత్తి కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హరియాణా రాష్ట్రాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల దెబ్బకు వాగులు, వంకలన్నీ ఏకమై ప్రవహిస్తూ ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. అలాగే జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో వర్షాల తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బద్రినాథ్, కేదర్నాథ్, యమునోత్రికి వెళ్లే రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో చార్ధామ్ యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో రోడ్లన్నీ జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వానహదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదికి భారీగా వరద పోటెత్తడంతో చాలా ఇళ్లతో పాటు మనాలీలోని ఓ పర్యాటకుల బస్సు కొట్టుకుపోయిందని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గోవింద్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. కాంగ్రా, కులూ, ఛంబా జిల్లాలో ఐదుగురు చనిపోయారన్నారు. ఇక జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవసమాధి అయ్యారు. బియాస్ నదికి భారీగా వరద పోటెత్తుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అధికారుల్ని ఆదేశించారు. -
ఫిలిప్పీన్స్‌లో భారీ టైఫూన్
హాంకాంగ్/బీజింగ్ /న్యూబెర్న్: శక్తిమంతమైన టైఫూన్ మంగ్‌ఖుట్ ఫిలిప్పీన్స్‌లో పెను విధ్వంసం సృష్టించింది. మంగ్‌ఖుట్ ప్రభావంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో 64 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం ఈ టైఫూన్ క్రమంగా చైనా, హాంకాంగ్‌లపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో చైనాలోని గ్వాంగ్డాంగ్, గ్వాంగ్షీ, హైనన్, గ్వెజో ప్రావిన్సులతో పాటు హాంకాంగ్‌లో గంటకు 162 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు కుంభవృష్టి కురుస్తోంది. ఈ టైఫూన్ కారణంగా చైనాలో ఇప్పటివరకూ ఇద్దరు చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. దీంతో చైనా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్సుపై ఈ టైఫూన్ తీవ్ర ప్రభావం చూపొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 24.5 లక్షల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేటకు వెళ్లిన 48,000 పడవలను వెనక్కు రప్పించారు. హైనన్ ప్రావిన్సులో 632 పర్యాటక ప్రాంతాలను, తీరప్రాంత రెస్టారెంట్లను మూసివేసిన అధికారులు, రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన 400 సర్వీసులను రద్దుచేశారు. సూపర్మార్కెట్లకు పోటెత్తిన ప్రజలు.. మంగ్‌ఖుట్ టైఫూన్ విధ్వంసం మరిన్ని రోజులు కొనసాగుతుందన్న భయంతో ప్రజలు సూపర్మార్కెట్ల నుంచి భారీగా ఆహారపదార్థాలను కొనుగోలు చేశారు. దీంతో షాపుల ముందు భారీ క్యూలు దర్శనమిచ్చాయి. చైనాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మకావూలో 20,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికాలో 13కు చేరుకున్న మృతులు.. ఫ్లోరెన్స్ హరికేన్‌తో అతలాకుతలం అవుతున్న అమెరికాలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. ప్రస్తుతం దీని తీవ్రత ‘ఉష్ణ మండల తుపాను’ స్థాయికి తగ్గినప్పటికీ వర్షాలు పడుతూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర కరోలినాలో కుంభవృష్టి కొనసాగుతోందనీ, కొన్ని ప్రాంతాల్లో 90 సెం.మీ మేర వర్షం కురిసిందని వెల్లడించారు. అమెరికా ఉత్తర కరోలినా రాష్ట్రంలోని ఎంగిల్హార్డ్ పట్టణాన్ని ముంచెత్తిన హరికేన్ ఫ్లోరెన్స్ వరద నీరు -
దైవభూమిలో ఇంకా అల్లకల్లోలమే
తిరువనంతపురం: వరదబీభత్సానికి కేరళ చివురుటాకులా వణికిపోతోంది. వర్షాలు ఆగకపోవడంతో నదులు, కాలువలకు వరదపోటు తగ్గట్లేదు. పరిస్థితి రోజురోజుకూ హృదయవిదారకంగా మారుతోంది. శనివారం ఒక్కరోజే 22 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటిదాకా (ఆగస్టు 9న భారీ వర్షాలు మొదలైనప్పటినుంచి) మొత్తం మృతుల సంఖ్య 357కు చేరింది. 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. వరద పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఏరియల్ సర్వే జరిపిన అనంతరం కేరళకు తక్షణ సాయంగా రూ.500కోట్ల సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తుండటంతో ఎర్నాకులం, త్రిసూర్, ఇడుక్కి, పత్తనంతిట్ట, చెంగనూర్ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తిరువనంతపురం, కొల్లాం, కాసార్గోడ్ జిల్లాల్లో వరద ఉధృతి తగ్గడంతో సహాయకకార్యక్రమాలను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కేరళలో మరో 24 గంటలపాటు భారీవర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలువా, చలకుడి, చెంగనూర్, అలప్పుజ, పత్తనంతిట్ట ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టం తీవ్రస్థాయిలో ఉంది. చాలాచోట్ల సహాయక కార్యక్రమాల్లో ఆలస్యంపై బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీస వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రజలు మండిపడుతున్నారు. చాలాచోట్ల రోడ్డు, రవాణా వ్యవస్థతోపాటు ప్రభుత్వ కార్యకాలాపాలు కూడా స్తంభించాయి. మోదీ, విజయన్ ఏరియల్ సర్వే వరద బాధితులు, కేరళ ప్రజలు అధైర్యపడవద్దని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి రూ. 500కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించడంతోపాటు ఆహారధాన్యాలు, ఔషధాలు, ఇతర సహాయాన్ని కేంద్రం నుంచే అందిస్తామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేల ఆర్థిక సాయం కేంద్రం తరపున అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన తీవ్రంగా వరద బారిన పడిన అలువా, త్రిసూర్ ప్రాంతాల్లో ఎరియల్ సర్వే చేశారు. మోదీతోపాటు కేరళ గవర్నర్ పి. సదాశివం, సీఎం విజయన్, కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్, ఇతర అధికారులు కూడా హెలికాప్టర్లో ఉన్నారు. ప్రాణ, ఆస్తినష్టం దురదృష్టకరమని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రధానంగా దృష్టిసారించాలని కేరళ ప్రభుత్వానికి, ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు ప్రధాని సూచించారు. ఏరియల్ సర్వే అనంతరం కొచ్చిలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం మొత్తం 357 మంది చనిపోయినట్లు నివేదిక ఇచ్చింది. 3.53 లక్షల మందిని 2వేలకు పైగా పునారావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొంది. కాగా, ఆగస్టు 12న కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రకటించిన రూ.100కోట్ల సాయానికి అదనంగా మరో రూ. 500 కోట్ల సాయాన్ని అందించనున్నట్లు సమీక్ష అనంతరం ప్రధాని మోదీ వెల్లడించారు. పరిస్థితి గంభీరంగానే: విజయన్ సీఎం విజయన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. అయితే సకాలంలో స్పందించి తీసుకున్న చర్యల కారణంగా పరిస్థితి కొంతైనా నియంత్రణలో ఉంది. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెల్లమెల్లగా కుదురుకుంటున్నాయి’ అని అన్నారు. ‘ఇప్పటివరకున్న లెక్కల ప్రకారం.. రాష్ట్రానికి రూ.19,512 కోట్ల నష్టం జరిగింది. కేంద్రం నుంచి రూ.2వేల కోట్ల సాయం కావాలని ప్రధానిని అడిగాం. రూ.500కోట్ల తక్షణసాయాన్ని మోదీ ప్రకటించారు’ అని విజయన్ ట్వీట్ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో కమ్యూనిస్టు ప్రభుత్వం విఫలమైందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సహాయక కార్యక్రమాలు సరిగ్గా కొనసాగడం లేదని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల విమర్శించారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైనందున.. ఈ బాధ్యతను పూర్తిగా ఆర్మీకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అతిపెద్ద ఆపరేషన్ రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ 58 బృందాలు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్‌ను కేరళ వరద ప్రభావ ప్రాంతాల్లో జరుపుతోంది. ఇప్పటివరకు దాదాపు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మొత్తం 55 బృందాలు రాష్ట్రంలోని వివిధ తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. మరో మూడు బృందాలు కూడా వీలైనంత త్వరగా వీరితో జతకలవనున్నాయని ఎన్డీఆర్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 2006లో ఎన్డీఆర్ఎఫ్ స్థాపించిన తర్వాత ఒక రాష్ట్రంలో ఇన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగటం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు. ఒక్కో బృందంలో 35–40 మంది సభ్యులుంటారు. ఆగస్టు 8 నుంచి కొనసాగుతున్న సహాయ కార్యక్రమాల్లో మొత్తం 194 మందిని, 12 పశువులను ఈ బృందాలు రక్షించాయన్నారు. మొత్తం 10, 647 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. త్రిసూర్‌లో 15, పత్తనంతిట్టలో 13, అలప్పుజలో 11, ఎర్నాకులంలో 5, ఇడుక్కి 4, మల్లపురంలో 3, వయాంద్, కోజికోడ్‌లలో రెండు చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కొచ్చిలోని కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడ ఈ కార్యక్రమాలను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఠి 234.4 సెం.మీ వర్షం కొచ్చి: వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో జూన్ 1 నుంచి ఈ నెల 18 వరకు 234.4 సె.మీ వర్షపాతం(సాధారణం కన్నా 42 శాతం అధికం) నమోదైనట్లు తిరువనంతపురంలోని వాతావారణ విభాగం(ఐఎండీ) విభాగం వెల్లడించింది. ఢిల్లీ వార్షిక సగటు వర్షపాతానికి ఇది ఐదు రెట్లు. ఇడుక్కి జిల్లాలో సాధారణం కన్నా 70 శాతం అధికంగా వర్షం కురిసినట్లు ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఈ ఏడాది లోటువర్షపాతం నమోదుకాకపోవడం గమనార్హం. ప్లీజ్..మోదీకి చెప్పండి కేరళలో వరదల దెబ్బకు సామాన్యులే కాదు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ స్థిమితంగా ఉండే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదు. సాక్షాత్తు శాసనసభా సభ్యుడే తన రాష్ట్రంలోని దుస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘వరదల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సరిపడ సంఖ్యలో పడవలు లేకపోవడంతో పేద మత్స్యకారుల పడవలను వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని హెలికాప్టర్లు పంపి మమ్మల్ని కాపాడాలని దయచేసి ప్రధాని మోదీకి చెప్పండి’ అని చెంగన్నూర్ ఎమ్మెల్యే సాజి చెరియాన్ ఓ టీవీ చానెల్లో అభ్యర్థించారు. కేరళ పోరాటస్ఫూర్తికి సెల్యూట్: మోదీ ఆహారధాన్యాలు, ఔషధాలు, ఇతర సహాయక వస్తువులను కేంద్రం తరపున అందజేస్తామని మోదీ భరోసా ఇచ్చారు. రోడ్డు రవాణా వ్యవస్థను త్వరగా పునర్వ్యవస్థీకరించాలన్నారు. సామాజిక భద్రత, ఫసల్ బీమా యోజనల్లో రిజిస్టర్ చేసుకున్న వారందరికీ న్యాయం జరిగేలా బీమా కంపెనీలు క్యాంపులు ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశించింది. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్‌లో భాగంగా ఇళ్లు ఇవ్వడంలో ప్రాధాన్యత కల్పించనున్నారు. ఇతర ప్రభుత్వ పథకాల కింద కేరళకు సాయం ఎక్కువ అందిస్తామని సీఎం విజయన్‌కు మోదీ హామీనిచ్చారు. ‘ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉన్న కేరళ ప్రజల పోరాట స్ఫూర్తికి సెల్యూట్. భారతజాతి మొత్తం కేరళ వెంటే ఉంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. కేరళ త్వరగా సాధారణ స్థితికి రావాలని అభిలషిస్తున్నాను. కేరళకు కేంద్రం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుంది’ అని ప్రధాని ట్వీటర్లో పేర్కొన్నారు. శనివారం కేరళలోని వరద ప్రాంతం అలువాలో విలపిస్తున్న మహిళ సమీక్షాసమావేశంలో మోదీ, విజయన్ -
కేరళలో మూడు రోజులు రెడ్ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా కేరళను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దాంతో వాతావరణ శాఖ కేరళలోని ఐదు జిల్లాల్లో పదవ తేదీ నుంచి 13వ తేదీ వరకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా పది నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడొచ్చని అంచనా వేస్తున్న తొలి 24 గంటలపాటు మరీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా వందలాది పట్టణాలు, గ్రామాలు నీట మునగడం, వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో దాదాపు 30 మంది మరణించడం తెల్సిందే. రాష్ట్రంలోని అత్యంత పెద్దదైన ఇదుక్కి రిజర్వాయర్ (2,403 అడుగుల ఎత్తు) సహా 22 రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం, నౌకా, సైనిక దళాలకు చెందిన సిబ్బంది రంగప్రవేశం చేసి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అత్యంత భయానక పరిస్థితి నెలకొని ఉందని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్వయంగా వ్యాఖ్యానించారంటే అది ఎంతటి తీవ్ర పరిస్థితో అర్థం చేసుకోవచ్చు. జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ మధ్య సాధారణ వర్షపాతం 1,508.2 మిల్లీ మీటర్లు కాగా, 1,739.4 మిల్లీ మీటర్ల వర్షపాతం అంటే, 15 శాతం అధికంగా పడిందని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. కాసర్గాడ్, త్రిస్సూర్ మినహా మిగతా 12 జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కొండ చెరియలు విరిగి పడడం వల్లనే ఎక్కువ పాణ హాని జరిగింది, కొండ రాళ్ల కారణంగా ఇళ్లు కూలిపోవడంతో దాదాపు 20 మంది మరణించారని తెల్సింది. అభివృద్ధి పేరిట ఇష్టమున్నట్లు ఎల్తైన భవంతల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం, క్వారీల్లో బాంబులు పెట్టి పేల్చడం తదితర కారణాల వల్లనే నేడు కొండ చెరియలు ఎక్కువగా విరిగి పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేరళలో పెద్దవి, చిన్నవి, ఓ మోస్తాదివి కలుపుకొని మొత్తంగా 5,924 క్యారీలు ఉన్నాయని కేరళ అటవీ శాఖ తర ఫున ఇటీవల అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు టీజీ సజవ్, సీజె అలెక్స్ వెల్లడించారు. అలప్పూడ్ జిల్లా కుట్టానాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి జూలై నెలలోనే 1.70 లక్షల మంది వరద బాధతులు చేరుకున్నారు. మౌలిక సౌకర్యాల పేరిట వరద కాల్వలకు చోటు లేకుండా అడ్డదిడ్డంగా రోడ్లు నిర్మించడం వల్ల కేరళకు ఎప్పుడూ వరద ముప్పు పొంచి ఉంటదని ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇదివరకే ఓ నివేదికలో హెచ్చరించారు. కేరళలో పలు చోట్ల బీచ్‌లు కూడా మునిగిపోవడానికి మానవ నిర్మాణాలే కారణమని కూడా ఆయన చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం ఇంతకన్నా ఎక్కువ వర్షాలు కురిసినా ఎలాంటి ప్రమాదాలు సంభవించలేదని, ఇప్పుడు ఓ మోస్తారు వర్షాలకే వరద ముప్పు పొంచి ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. -
ఉగ్రమూకల టార్గెట్ పంద్రాగస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచిఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్గర్ మాజీ బాడీ గార్డ్ మహ్మద్ ఇబ్రహీం దాడిని చేపట్టేందుకు ఢిల్లీలో ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. ఇబ్రహీంతో పాటు జైషే కేడర్ గురించి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక సమాచారం చేరవేశాయి. మే తొలివారంలో తొలుత జమ్మూ కశ్మీర్లో ప్రవేశించిన ఇబ్రహీం ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుని ఆ ప్రాంతంలోని జైషే శ్రేణులతో దాడులతో విరుచుకుపడేందుకు ధ్వంసరచనకు పూనుకున్నాడని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైషే సీనియర్ సభ్యుడు ఉమర్ సైతం 72వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను సమకూర్చుతున్నట్టు నిఘా వర్గాలు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో మొత్తం ఆపరేషన్‌ను మసూద్ అజర్ డిప్యూటీ, భారత వ్యతిరేక కార్యకలాపల ఆపరేషనల్ కమాండర్ అస్గర్ పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు భారత భూభాగంలోకి 600 మంది ఉగ్రవాదులను పంపేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని ఓ నివేదిక వెల్లడైన క్రమంలో నిఘా వర్గాల తాజా హెచ్చరికతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. -
జికాతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెడ్ అలర్ట్
హైదరాబాద్: భారత్‌లోనూ జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్‌పోర్టులో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో బాపూనగర్‌కు చెందిన ముగ్గురికి జికా వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ధృవీకరించిన విషయం విదితమే. బాధితుల్లో ఇద్దరు గర్భిణులు ఇటీవలే ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిచ్చారని గుజరాత్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. -
బెంగళూరులో కాల్పులు.. రెడ్ అలర్ట్
-
బెంగళూరులో కాల్పులు.. రెడ్ అలర్ట్
బెంగళూరు: బెంగళూరులో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. నగర శివార్లలో ఓ కారును లక్ష్యంగా చేసుకొని మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. నగరంలోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) ప్రెసిడెంట్ కే శ్రీనివాస ప్రయాణిస్తున్న కారు.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. శ్రీనివాసతో పాటు తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌పై హత్యానేరంతో పాటు ఇతర కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో ఓ కేసులో అరెస్టయిన ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. కాల్పుల ఘటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి సోదాలు నిర్వహిస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుల విజ్ఞప్తి
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుల విజ్ఞప్తి
శంషాబాద్: విమాన ప్రయాణికులు నిర్ధా రిత సమయానికి 2 గంటలు ముందుగానే చేరుకోవాలని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా ఎయిర్‌పోర్టులో రెడ్ అలర్ట్ ప్రకటించారన్నారు. ప్రయాణికులు 2 గంటలు ముందుగా చేరుకుని చెక్ఇన్ చేయించుకోవాలన్నారు. ఎయిర్‌పోర్టులో రద్దీ దృష్ట్యా ర్యాంపు పనులను కూడా విస్తరిస్తున్నామని తెలిపారు. -
రెడ్ అలర్ట్ ప్రకటించిన చైనా
బీజింగ్: చైనాను దట్టమైన పొగమంచు ఊపిరాడకుండా చేస్తుంది. అక్కడి గాలి కాలుష్య రీడింగ్‌లు ఈ ఏడాదిలో అత్యధికంగా నమోదవుతూ.. ఆరోగ్యానికి తీవ్ర అపాయం కలిగించే స్థాయిని సూచిస్తూన్నాయి. ఉత్తర చైనాలో పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోని 20కి పైగా నగరాల్లో రెడ్ అలర్ట్‌ను ప్రకటించగా.. 50 నగరాల్లో రెండో ప్రమాద తీవ్రత స్థాయిని తెలిపే ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు. ముఖ్యంగా హెబీ, హినాన్ ప్రావిన్స్‌లలో కాలుష్య తీవ్రత క్యూబిక్ మీటర్‌కు 500 మైక్రోగ్రామ్‌లకు చేరుకుంది. షిజియాజుయాంగ్లోని ఓ వాతావరణ కేంద్రం వద్ద 1000 మైక్రోగ్రామ్‌లు దాటిందని అధికారులు వెల్లడించారు. బీజింగ్‌లో సైతం విజిబిలిటీ 500 మీటర్ల లోపు నమోదైంది. దట్టమైన పొగమంచు మూలంగా టియాంజిన్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 131 విమానాలను అధికారులు రద్దు చేశారు. -
ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించరా?
న్యూఢిల్లీ: దీపావళి పండుగ తర్వాత ఢిల్లీ నగరంలో కాలుష్యం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గాలిలో ప్రామాణికంగా ఉండాల్సిన పీఎం–2.5 స్థాయి ఢిల్లీలో ఏకంగా బుధవారం నాడు 17 రెట్లు పెరిగిపోయింది. విమానాశ్రయంలో విజిబిలిటీ 300 నుంచి 500 వరకే పరిమితమైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఢిల్లీలో కాలుష్యం స్థాయి 494కు చేరుకుంది. చైనాలోని బీజింగ్ నగరంలో ఇటీవల ఎయిర్ కాలుష్యం 300కు చేరుకున్నందుకే నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించి రెండు వారాలపాటు పాఠశాలలను మూసివేశారు. ఫ్యాక్టరీలను మూసేయించారు. రోడ్డపైకి కార్లను అనుమతించలేదు. చాలా మంది పౌరులు ఇళ్లకే పరిమితమయ్యారు. బీజింగ్ కన్నా కాలుష్యం ఎక్కువైనా ఢిల్లీ నగరంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పాఠశాలలు, ఫ్యాక్టరీలు యథావిధిగా పనిచేశాయి. కార్లు, ఇతర వాహనాలు తిరిగాయి. కాలి నడకన వెళ్లేవారు వెళ్లారు. వచ్చేవారు వచ్చారు. డెసెంబర్, జనవరి నెలలో తెల్లవారుజామున మంచు కురుస్తుంటే ఎలా మబ్బుగా ఉంటుందో బుధవారం రోజంతా నగరం అలాగే కనిపించింది. దీంతో దీపావళి తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల వాతావరణం పరిస్థితి ఇదంటూ పలువురు ఫొటోలు తీసి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకున్నారు. ముంబై, పుణె నగరాల్లో పరిస్థితి ఇలాగే ఉందని వాతావరణ నిపుణులు తెలియజేశారు. వాతావరణ కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆరు లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారని యూనిసెఫ్ ఇటీవలనే వెల్లడించింది. కాలుష్యం వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. అస్తమా ఉన్నవాళ్లకు మరీ కష్టం. పీఎం 2.5 అంటే పార్టికల్ మ్యాటర్ వ్యాసం 2.5 అని అర్థం. మరో రకంగా చెప్పాలంటే 2.5 వ్యాసం మించని చిన్న కాలుష్య రేణువులు. మన వెంట్రుకలో మూడోవంత సన్నగా ఉంటాయి. ఇవి రోజుకు ఒక్క క్యూబిక్ మీటర్ గాలిలో 35 మైక్రోగ్రాములు మించరాదన్నది ప్రామాణికం. -
ప్రోత్సాహంతో పాటు టాలెంట్ అవసరం
వర్థమాన నటుడు ధీరేంద్ర విశాఖపట్నం : సినిమా రంగంలో ప్రోత్సాహంతో పాటు టాలెంట్ అవసరమని వర్థమాన నటుడు ధీరేంద్ర అన్నారు. చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టమని, పాఠశాల, కళాశాలలో చదివే సమయంలో 50 వరకు స్టేజ్ ప్రోగ్రామ్‌లు చేశానని చెప్పారు. ఈ క్రమంలో ‘రెడ్ అలర్ట్’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చిందని తెలిపారు. మంగళవారం షీలానగర్‌లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో తన అనుభవాల్ని పంచుకున్నారు. ప్రశ్న: మీ స్వస్థలం ఎక్కడ, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది.? జవాబు: మాది తిరుపతి, సినీ నటుడు మోహన్‌బాబు గారి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో బీటెక్, ఎంబీఏ పూర్తి చేశాను. మా నాన్న గారి ఉద్యోగి రీత్యా విశాఖలోని సిరిపురంలో మూడేళ్లగా ఉంటున్నాం. ప్రశ్న: సినిమా రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? జ: చిన్నప్పటి నుంచి నటన అంటే అమితమైన ఇష్టం. చిత్ర పరిశ్రమలో ప్రవేశించి హీరోగా ఎదగాలని ఉండేది. పాఠశాల, కళాశాలల్లో చదివే సమయంలో చాలా నటకాలు వేశాను. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను. మోహన్‌బాబు గారి చేతులమీదుగా బహుమతులు అందుకున్నాను. ప్రశ్న: సినిమా రంగంలోకి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? జ: మోహన్‌బాబు గారు. ఆయన డైలాగ్ డెలివరి బాగుంటుంది. ప్రశ్న: ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు? ఏయే భాషల్లో నటిస్తున్నారు ? జ: తెలుగులో మూడు సినిమాలు చేశాను. రెడ్ అలర్డ్ రిలీజ్ అయ్యింది. కలి సినిమా పూర్తి కావచ్చింది. మరో సినిమా షూటింగ్ జరుగుతోంది. తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను. ప్రశ్న: ఎవరి వద్దయినా శిక్షణ తీసుకున్నారా? జ: మొదట్లో అనుపమ కేర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాను. విశాఖ వచ్చిన తరువాత స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద చేరాను. ఆ సమయంలోనే సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రశ్న: విశాఖ నగరంతో అనుబంధం? జ: విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. నగరాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అన్ని ప్రదేశాలను చుట్టేశాను. విశాఖలో చిత్ర పరిశ్రమకు కావల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. -
ఎండ తగలనివ్వం!
♦ ఎండ తీవ్రతనుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్రం సన్నద్ధం ♦ అహ్మదాబాద్ ప్లాన్ అమలుకు రాష్ట్ర విపత్తు శాఖ ఏర్పాట్లు ♦ మార్చి నుంచి అమలయ్యేలా ప్రణాళిక ♦ ఈసారి మరింత తీవ్రం కానున్న ఎండలు హెచ్చరికలు రెడ్ అలర్ట్ : అత్యంత తీవ్రమైన ఎండలతో కూడిన వడగాలులు ఉన్నప్పుడు చేసే హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్ : తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు.. ఎల్లో అలర్ట్ : సాధారణంగా ఎండాకాలంలో వేడిగా ఉంటే వైట్ అలర్ట్ : సాధారణం కంటే తక్కువ ఎండలు ఉన్నప్పుడు చేసే హెచ్చరిక. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఎండలు మరింత మండనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు చలికాలం ఉంటుంది. కానీ అప్పుడే సాధారణం కంటే ఐదారు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్రమైన ఎల్‌నినో కారణంగా వాతావరణంలో భారీ మార్పులు సంభవించి అదనపు ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయని, వచ్చే వేసవిలో పరిస్థితి మరింత తీవ్రం కానుందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వచ్చే వేసవిలో గత ఏడాది కంటే రెండు మూడు డిగ్రీల అదనంగా నమోదవుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అహ్మదాబాద్ కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని నిర్ణయించింది. అహ్మదాబాద్ బాటలో... గత వేసవిలో ఖమ్మంలో అత్యధికంగా 47.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకాగా, అనేక చోట్ల 45 డిగ్రీలకు మించింది. ఈసారి 49 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వై.కె.రెడ్డి చెబుతున్నారు. గతంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు 10 రోజుల వరకు మాత్రమే ఉంటే... వచ్చే వేసవిలో ఏకంగా నెల రోజులపాటు సుదీర్ఘ కాలం వడగాలులు ఉంటాయన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 500 మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు. ఈ పరిస్థితిని నివారించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రణాళికే దేశంలో ఆదర్శంగా ఉన్నందున దాని ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని విపత్తు నిర్వహణశాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ చెప్పారు. మార్చి నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే ముసాయిదా తయారుచేశారు. అహ్మదాబాద్ ప్రణాళిక ఇదీ... ♦ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం. ♦ టీచర్లకు శిక్షణ ఇచ్చి విద్యార్థులకు వడదెబ్బ నుంచి రక్షణ తీసుకునేలా చేయడం. ♦ పాఠశాలల వేళలను మార్పు చేయడం. ♦ ఎఫ్ఎం రేడియోతో అప్రమత్తం చేయడం. ♦ ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను, 108 సర్వీసును అందుబాటులో ఉంచడం. ♦ ఆరోగ్య కేంద్రాల వేళలను పెంచడం. ♦ ఆరు బయట శ్రమ చేసేవారికి నీడ కల్పిం చడం. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఐదింటి వరకు పని లేకుండా చూడటం. ఫ్యాక్టరీల్లో ఏసీ ఏర్పాటు చేయడం. ♦ ట్వీటర్, ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం. మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపడం. ♦ అత్యంత ఎండ తీవ్రతలున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం. ♦ అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి తాగునీరు, వైద్య వసతి, నీడ కల్పించడం. ♦ వడదెబ్బకు గురైన వారికోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను నెలకొల్పడం. -
చైనాలో 'రెడ్ అలర్ట్'
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో కాలుష్య మేఘాలు దట్టంగా కమ్ముకొని ప్రజలను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో అధికారులు మంగళవారం నగరంలో 'రెడ్ అలర్ట్' ప్రకటించారు. పాఠశాలలకు సెలవులిచ్చారు. భవన నిర్మాణాలను నిలిపివేశారు. రోడ్డు పక్కన తినుబండారాలను తయారుచేసే షాపులను మూసివేశారు. ప్రజలు వీధుల్లోకి వస్తే తప్పనిసరి మాస్కులు ధరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని విదేశీ, కొన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దుచేశారు. రోడ్లపై సగానికి సగం కార్ల రాకపోకలను నియంత్రించారు. భారీ వాహనాలను, చెత్తను తీసుకెళ్లే మున్సిపల్ వాహనాలను కొన్ని రోజులపాటు పూర్తిగా నిలిపివేశారు. చలికాచుకునేందుకు ఏర్పాటు చేసుకొనే కుంపట్లలో బొగ్గు వినియోగాన్ని తగ్గించాల్సిందిగా ప్రజలకు సూచనలిచ్చారు. ఆకాశాన్ని కమ్ముకున్న కాలుష్య మేఘాల నుంచి కాలుష్య కణాలను భూ ఉపరితలానికి తీసుకొచ్చేందుకు భారీ వాటర్ క్యానన్ల ద్వారా ఆకాశంలోకి నీటి తుంపరులను ఎగజిమ్ముతున్నారు. కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్న ప్రపంచ నగరాల్లో బీజింగ్ నగరమే మొదటి స్థానంలో ఉంది. పరిశ్రమల కాలుష్యంతోపాటు విద్యుత్ ప్లాంటుల నుంచి వెలువడుతున్న కార్బన్ ఉద్గారాలు, ఇళ్లలో బొగ్గు వినియోగం పెరగడం తదితర కారణాల వల్ల ఈదారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని చైనా కాలుష్య నిరోధక విభాగం వెల్లడించింది. ప్రపంచ కాలుష్య ఇండెక్స్ ప్రకారం మంగళవారం ఉదయం గాలిలో కాలుష్యం 250 ఉందని, ఇది అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణం కన్నా పది ఇంతలు ఎక్కువని బీజింగ్‌లోని అమెరికా ఎంబసీ వర్గాలు తెలిపాయి. 2030 నాటకి ఈ కాలుష్యాన్ని సగానికి సగం తగ్గించాలన్నది చైనాకు అంతర్జాతీయ సమాజం నిర్దేశించిన లక్ష్యమని ఆ వర్గాలు చెప్పాయి. వాటర్ క్యానన్ల వినియోగం వల్ల రెండు, మూడు రోజుల్లోనే పరిస్థితి కచ్చితంగా మెరగుపడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు తెలియజేస్తున్నారు. -
బాలికలు అప్రమత్తంగా ఉండాలి
రెడ్ అలెర్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన మహబూబాబాద్ రూరల్ : బాలికలు తమ నిత్య జీవితంలో అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలెర్ట్ హెడ్ ఆఫ్‌ది డిపార్ట్మెంట్, దక్షిణాఫ్రికాకు చెందిన మ్యాథ్యూస్, ముంబాయికి చెందిన సిస్టర్ సోహాలి అన్నారు. ఆపరేషన్ రెడ్ అలెర్ట్ ఆన్ ఇనిటియాటివ్ ఆఫ్ మై ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని జమాండ్లపల్లి హైస్కూల్లో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం బాల్యవివాహాలు, చైన్ స్నాచింగ్, తనకుతాను రక్షించుకోవటం, ఎదుటి బాలికలను సంరక్షించటం, ప్రలోభాలకు లోనుకాకుండా ఉండటం ఇలాంటి అంశాలపై వివరించారు. సాయంత్రం సినిమా ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం బి.అంజయ్య, సంస్థ నేషనల్ కో-ఆర్డినేటర్ వీవీఎన్, తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ హానోక్, హోప్ ఏరియా కోఆర్డినేటర్లు కిషోర్, మహేశ్, ఉపాధ్యాయ బృందం శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, సరస్వతి, ఎస్ఎస్వీఆర్ఎస్ శర్మ, వెంకటేశ్వర్లు, ముత్తయ్య, మురళీధర్, కరుణశ్రీ, విజయరాణి, బ్రహ్మచారి, విజయలక్ష్మి, అంబరీష, సీఆర్పీ బోడ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. -
డిఫరెంట్ అలర్ట్
కొత్త సినిమా గురూ! మామూలుగా ఉగ్రవాద నేపథ్యంలో సినిమాలంటే చాలా సీరియస్‌గా ఉంటాయి. ఫన్‌కి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఆ ఫార్ములాను బ్రేక్ చేస్తూ రూపొందిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చంద్రమహేశ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి నిర్మాత పీవీ శ్రీరామ్‌రెడ్డి. ఆయన తనయుడు హెచ్.హెచ్.మహదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ ఏంటంటే... హైదరాబాద్‌లో ఘనంగా జరిగే గణేశ్ నిమజ్జనం చూడటానికి పల్లెటూరి నుంచి మహదేవ్, శివ, రామకృష్ణ, శీను సిటీకి వస్తారు. సిటీలో ఓ చాన ల్లో క్రైం రిపోర్టర్‌గా పనిచేస్తున్న బెస్ట్ ఫ్రెండ్ శ్రీరామ్ పిలవడంతో ఈ నలుగురూ భాగ్యనగరంలోకి అడుగుపెడతారు. గణేశ్ నిమజ్జనం జోరుగా జరుగుతున్న సమయంలో నగరాన్ని అల్లకల్లోలం చేయాలని ఓ నలుగురు తీవ్రవాదులు ప్లాన్ చేస్తుంటారు. ఇది తెలుసుకుని నగరంలో పోలీస్ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది. తీవ్రవాదులను ఏరిపారేయడానికి హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ భువనేశ్వరి చార్జ్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో నగరం చూడ్డానికి వచ్చిన నలుగురు కుర్రాళ్లకూ పూనా వెళుతున్నానంటూ శ్రీరామ్ నుంచి మెసేజ్ అందుతుంది. దాంతో ఓ హోటల్లో దిగుతారు. వాళ్లకు ఓ చోట డబ్బుల మూట దొరుకుతుంది. లైఫ్ టర్న్ అయిందని సంబర పడిపోయి ఆ మూటను హోటల్ గదికి తీసుకువస్తారు. పూర్తిగా తెరిచి చూస్తే, అందులో తల లేని మొండం దొరుకుతుంది. కట్ చేస్తే వీళ్లు ప్రయాణం చేసిన క్యాబ్ డ్రైవర్‌కు ఓ తల దొరుకుతుంది. ఇంతకూ ఆ శవం ఎవరిది? ఎవరు చంపారు? శ్రీరామ్ ఏమైపోయాడు? అనేది మిగతా కథ. హీరోయిన్ లేకుండానే.... ‘ప్రేయసి రావె’ వంటి విజయవంతమైన చిత్రంతో దర్శకునిగా పరిచయమై, శ్రీహరితో ‘అయోధ్య రామయ్య’, ‘హనుమంతు’ చిత్రాలతో తనలో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించుకున్నారు. ఈసారి టెర్రిరిజమ్ నేపథ్యంలో కథను అల్లుకుని ఈ సినిమా తీశారు. సుమన్, పోసాని కృష్ణమురళి, జోగీ బ్రదర్స్‌ను మినహాయిస్తే ఈ చిత్రంలో నటీనటులందరూ కొత్తవాళ్లే. అనుకున్న కథను ఎక్కడా డైవర్ట్ కాకుండా పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. అలీ, పోసాని కృష్ణమురళిల కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఓ శవం తాలూకు తల, మొండం ఒకసారి పోసానికి, మరోసారి అలీకి, ఇంకోసారి హీరో ఫ్రెండ్స్ బ్యాచ్‌కు దొరికే సన్నివేశాలు కాస్త ఉత్కంఠ కలిగిస్తూ, ప్రథమార్ధం అంతా ఓ థ్రిల్లర్‌లా సాగిపోతుంది. మొండాన్ని వదిలించేసుకోవాలని ఇంకో సూట్‌కేసులోకి మారుస్తున్నప్పుడు స్పష్టంగా వేలాడుతున్న ఐడీ కార్డ్‌ను హీరో బ్యాచ్ చూడకపోవడం, అలాగే వెస్ట్ జోన్ డీసీపీ స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఓ క్రిమినల్‌ను పట్టుకోవడానికి బార్లో ఐటెమ్ గాళ్ అవతారం ఎత్తడం ఇవన్నీ లాజిక్కు అందని అంశాలుగా చెప్పొచ్చు. కొత్తవాళ్లతో బ్రహ్మాండాలు తీసే అవకాశం ఉండదు కాబట్టి, చంద్రమహేశ్ సేఫ్ జోన్లో వెళ్లారని పిస్తుంది. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టు కున్నారు. ముఖ్యంగా హీరోగా నటించిన మహదేవ్‌కు ఇది మొదటి సినిమా అయినా బాగానే చేశారు. హైలైట్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన తొలి చిత్రమిదే ‘జై జై గణేశా...’ అంటూ ఓ సంస్కృత గీతాన్ని శంకర్మహదేవన్తో పాడించారు. ఆ పాట సినిమా క్లైమాక్స్‌లో వస్తుంది. -
ఆ నలుగురి కథ!.
కర్ఫ్యూ నీడలో అల్ల కల్లోలంగా ఉన్న సిటీలోకి నలుగురు కుర్రాళ్లు అడుగుపెడతారు. అప్పుడు వాళ్లు అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటారు. దాన్నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. హెచ్.హెచ్.మహదేవ్, అంజనా మీనన్ జంటగా చంద్రమహేశ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పీవీ శ్రీరాంరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇప్పటికే కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘చంద్రమహేశ్ ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. మా నాన్నగారి అకాల మరణం కారణంగా ఈ చిత్రం విడుదల ఆలస్యమైంది’’ అని మహదేవ్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రవివర్మ, ఛాయాగ్రహణం: కల్యాణ్ సమి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జైపాల్ రెడ్డి. -
నగరంలో ఏం జరిగింది?
హైదరాబాద్‌లో జరిగే వినాయకుడి నిమజ్జనాన్ని కళ్లారా చూడాలని నలుగురు యువకులు తమ గ్రామం నుంచి నగరానికి వస్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఆ సంఘటనలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపుకి కారణం అయ్యాయి? అనే కథాంశంతో చంద్రమహేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. హెచ్.హెచ్. మహదేవ్, అంజనా మీనన్ జంటగా పీవీ శ్రీరామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన తొలి సినిమాగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ని సాధించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ‘‘కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చంద్రమహేశ్ తెలిపారు. రవి, అమర్, తేజ, సుమన్, కె. భాగ్యరాజా, అలీ, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ చౌదరి, సంగీతం: రవివర్మ, కెమెరా: కల్యాణ్ సమి, సమర్పణ: యస్. త్రిలోక్‌రెడ్డి, సహనిర్మాత: శ్రీమతి పిన్నింటి శ్రీరామ్ సత్యరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. జైపాల్‌రెడ్డి. -
రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
న్యూఢిల్లీ : ఉష్ణోగ్రతలు అసాధారణ స్థ నేపధ్యంలో భారత వాతావరణ శాఖ శనివారం దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భానుడి భగభగలతో మండిపోతున్నాయి. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు 427మంది మృత్యువాత పడ్డారు. కాగా రాగల రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో విదర్భ, తెలంగాణ, రాయలసీమల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికం కావటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక హైదరాబాద్‌లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గత అయిదేళ్లలో ఇదే అత్యధికం. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 67మంది, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో 64మంది వడదెబ్బకు మృతి చెందారు. ఏపీలో 204 , తెలంగాణలో 223 వడదెబ్బ మరణాలు నమోదు అయ్యాయి. ఇక వడదెబ్బకు మృతి చెందినవారు కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు వెల్లడించారు. -
మంచి నిర్మాతను కోల్పోయాం : దర్శకుడు చంద్రమహేశ్
‘‘ఏక కాలంలో నాలుగు భాషల్లో నిర్మితమైన తొలిచిత్రం ‘రెడ్ అలర్ట్’. ఈ చిత్ర నిర్మాత పి.వి. శ్రీరాంరెడ్డి సినిమా రంగం గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంత మంచి నిర్మాతను కోల్పోవడం తెలుగు సినిమా దురదృష్టం’’ అని చంద్రమహేశ్ పేర్కొన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్, రవి, అమర్, తేజ హీరోలుగా చంద్రమహేశ్ దర్శకత్వంలో సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో పీవీ శ్రీరాంరె డ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా థియేటర్ ట్రైలర్‌ను నటుడు పోసాని కృష్ణమురళి ఆవిష్కరించారు. ఇటీవలే మృతిచెందిన నిర్మాత శ్రీరాం రెడ్డికి యూనిట్ సభ్యులు నివాళులు అర్పించారు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్ మాట్లాడుతూ- ‘‘ నాన్న చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ రోజు నాలుగు భాషల్లో సినిమా విడుదల చేయాలని నాన్న అనుకున్నారు. త్వరలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నటుడు ‘గుండు’ సుదర్శన్ మాట్లాడుతూ- ‘‘శ్రీరాంరెడ్డి గారు బంగారం లాంటి మనిషి. కొత్త దర్శకులను ప్రోత్సహించాలని ఎన్నో ప్రణాళికలు రచించారు. ఆయన లోటు ఎన్నటికీ తీరనిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అమర్, తేజ, రచయిత వెనిగళ్ల రాంబాబు, శ్రీరాం చౌదరి, ఛాయాగ్రాహకుడు కల్యాణ్ సమి, నృత్య దర్శకులు ప్రకాశ్, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘రెడ్ అలర్ట్’ మూవీ స్టిల్స్
-
‘రెడ్’ అలర్ట్
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు తమిళనాడు సరిహద్దుల్లోనూ నిఘా ప్రత్యేక బలగాల ద్వారా కూంబింగ్ బస్సులు.. రైల్వేస్టేషన్లనో సోదాలు చిత్తూరు (అర్బన్): ఆపరేషన్ శేషాచలంలో భాగంగా జిల్లాలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శేషాచలం అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతిలోని పోలీసు అధికారులు, టాస్క్ఫోర్సు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎర్రచందనం నరకడానికి వచ్చిన కూలీలు, వారి వెనుక ఉన్న మేస్త్రీలు, స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జిల్లాలోని అంతరాష్ట్ర సరిహద్దులు, అంతర్ జిల్లాల చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని రొంపిచెర్ల, భాకరాపేట, ఎర్రావారిపాలెం, కేవీ.పల్లె, వెదురుకుప్పం, కార్వేటినగరం, పాలసముద్రం, నగరి, సత్యవేడు, నాగలాపురం, వి.కోట, కుప్పం సమీప ప్రాంతాల్లోని సరిహద్దుల్లో టాస్క్ఫోర్సు, ఎస్టీఎఫ్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అప్రమత్తమైన అటవీ శాఖ పోలీసులతో పాటు జిల్లాలోని తూర్పు, పశ్చిమ డివిజన్ల అటవీ శాఖ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. శేషాచల అడవుల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో 20 మంది కూలీలు మృతి చెందడంపైప్రభుత్వ చీఫ్ కన్జర్వేటర్ నుంచి అటవీ శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. జిల్లాలోని తూర్పు అటవీ ప్రాంతంలో డీఎఫ్‌వోలు, రేంజర్లు అప్రమత్తంగా ఉండాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు ఒక్కొక్కరుగా కాకుండా గ్రూపులుగా చేయాలని ఆదేశించారు. అటవీ శాఖకు సంబంధించిన ఆస్తులను భద్రపరచాలని, తమిళనాడు సరిహద్దుల్లో జాగ్రత్తగా ఉండాలని సిబ్బందిని ఆదేశించినట్లు చిత్తూరు తూర్పు డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బస్సుల్లో.. మరోవైపు తమిళనాడు, కర్ణాటకు వెళ్లే బస్సుల్లో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. చిత్తూరు, గుడిపాల ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో సైతం బుధవారం పోలీసులు తనిఖీలు చేశారు. అనుమానితులు, గొడ్డళ్లు, కత్తులతో సంచరించే కూలీలు ఎవరైనా ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు పోలీసులు సూచనలిచ్చారు. -
అస్సాం అంతా రెడ్ అలర్ట్..!
-
నాలుగు భాషల్లో...
‘‘ఈ కథ వినగానే, ముందు రెండు భాషల్లో చేద్దామని నిర్మాత అన్నారు. ఆ తర్వాత మూడు భాషల్లో చేస్తే బాగుంటుందన్నారు. చివరికి నాలుగు భాషల్లో చేసేద్దామన్నారు. కథ ఆయనకు అంత బాగా నచ్చింది. ఈ చిత్రం ద్వారా మిగతా మూడు దక్షిణాది భాషలకు పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు చంద్రమహేశ్ అన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్, అంజనా మీనన్ జంటగా చంద్రమహేశ్ దర్శకత్వంలో పీవీ శ్రీరామ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘నాలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించిన చిత్రం ఇది. మొత్తం 5 రాష్ట్రాల్లో షూటింగ్ చేశాం’’ అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన చిత్రానికి పాటలు స్వరపరచడం ఆనందంగా ఉందని రవివర్మ తెలిపారు. రచయిత శ్రీరామ్ చౌదరి, హీరో మహదేవ్, ఎడిటర్ గౌతంరాజు తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. జైపాల్‌రెడ్డి, సమర్పణ: పి.ఎస్. త్రిలోక్‌రెడ్డి. -
నాలుగు భాషల్లో రెడ్ అలర్ట్
‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలక్షణమైన ఇతివృత్తంతో ఈ సినిమా చేస్తున్నాం. సినీ నిలయ క్రియేషన్స్ సంస్థ ద్వారా ప్రతిభావంతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని నిర్మాత పీవీ శ్రీరాంరెడ్డి చెప్పారు. చంద్రమహేశ్ దర్శకత్వంలో హెచ్.హెచ్. మహాదేవ్, అంజనామీనన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘రెడ్ అలర్ట్’. ఇప్పటికి 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చంద్రమహేశ్ మాట్లాడుతూ -‘‘హీరో, హీరోయిన్, కాశీ విశ్వనాథ్ మినహా ఏ భాషకు చెందిన నటీనటులతో ఆ భాషలో చిత్రీకరణ జరిపాం. యాక్షన్ థ్రిల్లర్ విత్ కామెడీ ఇది. నిర్మాత సహకారంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం’’ అని తెలిపారు. మహాదేవ్ మాట్లాడుతూ -‘‘కథ విని ఉద్వేగానికి గురయ్యాను. నవంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు కాశీ విశ్వనాథ్, కాదంబరి కిరణ్, శుభోదయం వరప్రసాద్, సాయినరేశ్, తేజ, అమర్, రచయిత శ్రీరామ్ చౌదరి, సంగీత దర్శకుడు రవివర్మ, ఛాయాగ్రాహకుడు కల్యాణ్ సమి, సమర్పకుడు త్రిలోక్ రెడ్డి తదితరులు మాట్లాడారు. -
‘రెడ్ ఎలర్ట్’ మూవీ స్టిల్స్
-
శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్
శంషాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంపై రెండు రోజులుగా జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్అలర్ట్ ప్రకటించారు. కేంద్రం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కూడా అంతర్గత భద్రతను పెంచినట్లు విమానాశ్రయ భద్రతా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
రెడ్ అలర్ట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈనెల ఒకటో తేదీన జంట పేలుళ్లు చోటుచేసుకోవడం, అదే సమయంలో రాష్ట్రంలో పలువురు తీవ్రవాదులు పట్టుబడటం అధికారులను ఆందోళనలో పడేశాయి. పేలుళ్ల నిందితులను పట్టుకోవడంలో పోలీసులు తలమునకలై ఉండగా విమానాశ్రయాలు, సెంట్రల్ స్టేషన్లోనూ, రాణీపేట పారిశ్రామికవాడలోనూ బాంబుల ప్రచారం కలకలం రేపింది. దక్షిణాది రాష్ట్రాల్లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, మంగళూరు, తిరువనంతపురం తదితర అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కారుబాంబు ద్వారా పేలుళ్లకు పాల్పడనున్నట్లు సమాచారం వచ్చినందున అప్రమత్తంగా ఉండాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ దక్షిణ మండల సహాయ కమిషనర్ శరత్ శ్రీనివాస్ హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు ఆయన అధికారిక ఆదేశాలతో ఉత్తరాలు రాశారు. ఈ ఆదేశాలతో చెన్నై విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాశ్రయాల్లో వేళ్లేందుకు ఉన్న రెండు మార్గాలను ఒకటిగా చేశారు. లోనికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. పార్కింగ్లోని వాహనాలను సైతం తనిఖీ చేసి ప్రత్యేక దృష్టి సారించారు. విమానాశ్రయం నాలుగు మూలలా ఎత్తై ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని బైనాక్యులర్స్ ద్వారా 24 గంటల పర్యవేక్షణ సాగిస్తున్నారు. సివిల్ పోలీసులను నియమించి ఐదంచల బందోబస్తును ఏర్పాటు చేశారు. సెంట్రల్ రైల్వే గవర్నమెంట్ పోలీసు కంట్రోల్ రూముకు ఉదయం 9.30 గంటలకు ఒక ఆగంతకుడు ఫోన్ చేశాడు. ప్లాట్‌ఫాం టిక్కెట్ బుకింగ్ కౌంటర్ సమీపంలోని టాయిలెట్ల వద్ద బాంబులు అమర్చామని, వాటిని పేల్చివేసేందుకు ఇద్దరు తీవ్రవాదులు రైల్వే స్టేషన్లోనే ఉన్నారని చెప్పి ఫోన్ కట్‌చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఉరుకుల పరుగులతో అక్కడికి చేరుకున్నారు. ఈలోగా బాంబు డిటెక్షన్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. సుమారు మూడు గంటల పాటు సెంట్రల్ అంతా వెతికారు. ప్రయాణికులను తీవ్రంగా తనిఖీ చేసి ఏమీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆగంతకుల ఫోన్లన్నీ తాంబరం నుండి రావడంతో ఆ ప్రాంతాల్లో అనుమానితులను వెతుకుతున్నారు. వేలూరు జిల్లా రాణిపేట సిప్కాట్ పారిశ్రామిక వాడ బాంబు భయంతో వణికిపోయింది. సెల్‌ఫోన్ బాంబుగా అమర్చిన ఒక వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని నిర్వీర్యం చేసి పరిశోధనకు పంపారు. -
విజయవాడలో రెడ్ అలర్ట్
పోలీసుల విస్తృత తనిఖీలు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చెక్‌పోస్టుల్లో భద్రతా బలగాల మోహరింపు విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం ఆగి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాం తాల్లో సోదాలు నిర్వహించడంతో పాటు నగరవ్యాప్తంగా వి స్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సహా పలువురు ఏఐసీసీ అగ్రనేతలు శుక్రవారం నగరానికి రానున్నారు. దీం తో నగర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం బెంగళూరు-గౌహతి వయా గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో బాంబులు పేల డంతో గుంటూరుకు చెందిన యువతి మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేస్తూ రాష్ట్ర నిఘా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరులో వినియోగించేందుకు ర వాణా చేసే క్రమంలో చెన్నైలో బాంబులు పేలి ఉండొచ్చని నిఘా వర్గాలు భావించాయి. దీంతో ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు నగర పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో 10 నాటుబాంబులు దొరికాయి. అడవి జంతువులను చంపడానికి వీటిని ఉపయోగిస్తుంటారని గుర్తించారు. ఈ ఘటనలతో నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు. ప్ర యాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్‌ల్లో తనిఖీలు ముమ్మరం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయాచోట్ల నగర పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. కనకదుర్గ ఆల యంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో పాటు సాయుధ పోలీసుల గస్తీని పెంచారు. గతంలో కోయంబత్తూరు బాం బు పేలుళ్ల కేసు నిందితులు ఇక్కడ ఆశ్రయం పొందడం, ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని చర్చిల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన దీన్దార్ అంజుమన్ సభ్యులు నగరంలో మకాం చేసిన ఘటనలను పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో తనిఖీలను విస్తృతం చేశారు. ఆయా ప్రాంతాలతో పాటు అనుమానిత వ్యక్తులు ఆశ్రయం పొందేందుకు అవకాశం ఉందని భావిస్తున్న నగర శివారు ప్రాంతాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆయా ప్రాం తాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లాడ్జీల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తు న్నారు. మరో ఐదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుం డటం.. ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలకు చెందిన అ గ్రనేతలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది తనిఖీలను ముమ్మరం చేయాలని నగర పోలీసు కమిషనర్ ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అ న్ని భద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికల కోసం జిల్లా స రిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో భద్రతా బ లగాలను పెంచారు. జిల్లాకు రాకపోకలు సాగించే అన్ని వా హనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలేస్తున్నారు. ఇక్కడ చేపట్టిన భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం ఇస్తున్నట్టు ఓ సీని యర్ పోలీసు అధికారి తెలిపారు. -
ఏవోబీలో రెడ్అలెర్ట్
సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పి గంగవరంలో ఎన్నికల పోస్టర్లు చించివేత..? ఒడిశాలో సెల్‌టవర్, జీపు కాల్చివేత సమాచారంతో పోలీసుల అప్రమత్తం కొయ్యూరు/సీలేరు, న్యూస్‌లైన్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)ల్లో మావోయిస్టులు చెలరేగిపోయారు. కొద్ది రోజులుగా ప్రశాం తంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. ఎన్నికల వేళ తమ ఉనికిని చాటుకునేందుకు భారీ ప్రయత్నం చేశారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాం గం రెడ్అలెర్ట్ ప్రకటించింది. ప్రశాంతంగా పోలింగ్ కోసం పోలీసులు నడుంబిగిస్తున్న సమయంలో విధ్వంసం సృష్టించడం యం త్రాంగానికి సవాలుగా మారింది. సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లా పలిమిల పోలీసు స్టేషన్ పరిధి మచిలి పంచాయతీ నోపడా గ్రామం వద్ద ఎన్నికల సిబ్బందిని సాయుధ మావోయిస్టులు అడ్డగించి జీపును కాల్చి ధ్వంసం చేశారు. అందులోని ఈవీఎంలను వెంట తీసుకుపోయారు. అదే సమయంలో భద్రాచలం ప్రాంతంలోని కూనవరం గ్రామంలో ఎయిర్టెల్ సెల్‌టవర్‌ను పేల్చివేశారు. దీంతో మావోయిస్టుల కంచుకోటగా పేరొందిన జీకేవీధి మండలం సీలేరు, దుప్పులవాడ, దారకొండ, గుమ్మరేవుల్లో పోలింగ్ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గ్రేహాండ్స్, స్పెషల్‌పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలతో అడవులను జల్లెడ పడుతున్నారు. గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తుల గురించి ఆరాతీస్తున్నారు. ఎన్నికల వేళ ఏమి జరుగుతుందోనని గిరిజనులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కాగా తూర్పు- విశాఖ సరిహద్దుల్లోనూ చాలా కాలం తరువాత దళసభ్యుల కదలికలు ప్రారంభమయ్యాయి. మంప పంచాయతీ రాళ్లగెడ్డ దొడ్డవరం, పి గంగవరం,టీటోరాళ్ల, తదితర గ్రామాలు తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలాన్ని ఆనుకుని ఉన్నాయి. బుధవారం సుమారు 50 మంది మావోయిస్టులు పి. గంగవరం వచ్చి రాజకీయ పార్టీల వారు అంటించిన కరపత్రాలు,బ్యానర్లను పీకేసినట్టుగా తెలిసింది. పోలింగ్‌లో పాల్గొనరాదని అక్కడివారిని హెచ్చరించినట్టు భోగట్టా. ఆ గ్రామానికి చెందిన కొందరిని తమ వెంట తీసుకెళ్లారు. ఇది తెలిసిన రెండు జిల్లాల పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఆర్.దొడ్డవరం నుంచి గొడుగులమ్మబంద మీదుగా కొండపైనుంచి నేరుగా మంప రావచ్చు. మావోయిస్టులు మంప పోలింగ్ కేంద్రంపై దాడులకు తెగబడే ప్రమాదముందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అప్రమత్తం పాడేరు : స్థానిక ఎన్నికలతో మన్యంలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా పోలీసులు భారీగా మోహరించారు. ఏజెన్సీ అంతటా భద్రతా బలగాల బూటు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో తిరుగుతూనే పోలింగ్‌కేంద్రాలకు అనుకుని ఉన్న కొండ ప్రాంతాల్లో పోలీసులు మాటు వేశారు. అనుక్షణం డేగకన్నుతో పర్యవేక్షిస్తున్నారు. జి.మాడుగుల, పెదబయలు మండలాల సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసులు ఉన్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. గాలికొండ, జర్రెల, ఇంజరి, కిల్లంకోట, బొయితిలి, బొంగరం, జామిగుడ, కుడుమసారి, బూసిపుట్టు, కుమడ, రంగబయలు తదితర సెగ్మెంట్ల పరిధిలోని మారుమూల గ్రామాల గిరిజనులంతా స్థానిక ఎన్నికలతో బిక్కుబిక్కమంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇటు మావోయిస్టుల హెచ్చరికలు, మరోవైపు పోలీసులు గాలింపు చర్యలతో మారుమూల గిరిజనులు భయపడుతున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు లేఖ
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపు లేఖతో శుక్రవారం విమానాశ్రయ అధికారులు అప్రమత్తం అయ్యారు. దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి వచ్చే విమానాన్ని పేల్చివేస్తామంటూ సెక్యూరిటీ అధికారికి లేఖ రావటంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు బెదిరింపు లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీఐఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తమై రెడ్ అలర్ట్ ప్రకటించారు. బెదిరింపు లేఖ వచ్చిన విషయాన్ని సీఐఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ ఓపీ సింగ్ కూడా ధ్రువీకరించారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన మర్నాడే ఇలాంటి లేఖ రావడంతో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. విమానాశ్రయానికి వచ్చి, వెళ్లే ప్రయాణికులతో పాటు సందర్శకులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. -
రెడ్ అలర్ట్
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో జిల్లాలో పోలీసు శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కర్నూలు, డోన్, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని పట్టణాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఆవేశంతో అదుపు తప్పితే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికతో సబ్ డివిజన్ల వారీగా పోలీసు అధికారులు ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యార్థి జేఏసీలతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఎస్పీ రఘురామిరెడ్డి అన్ని సబ్ డివిజన్ల పోలీసు అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. అవసరమైతే లాఠీచార్జి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు జాతీయ నేతల విగ్రహాల ధ్వంసానికి పాల్పడితే కేసులు నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం రెండు సీఆర్పీఎఫ్, ఒక బీఎస్ఎఫ్, ఒక ఏపీఎస్పీ కంపెనీ బలగాలు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నాయి. ఉద్యమాలకు మళ్లీ సిద్ధమవుతున్న రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీ కదలికలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, ఆస్తుల పరిరక్షణకు ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ బలగాలను కేటాయించారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇంటి వద్ద ఆయన లేకపోయినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రాష్ట్ర చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన హోటల్, ఇళ్లు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భద్రతను మరింత పెంచారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ నేతల విగ్రహాల వద్ద పికెట్లను ఏర్పాటు చేశారు. ప్రతి పికెట్ వద్ద ఒక సెక్షన్ పారా మిలిటరీ సిబ్బందితో స్పెషల్ పార్టీ పోలీసులు, స్థానిక పోలీసులను బందోబస్తు విధులకు నియమించారు. కర్నూలులో డీఎస్పీ మనోహర్‌రావు పర్యవేక్షణలో నగర ప్రధాన రహదారుల్లో పోలీసుల బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీ, కలెక్టరేట్, మౌర్య ఇన్, రాజ్‌విహార్ సెంటర్, కాంగ్రెస్ కార్యాలయం, కృష్ణదేవరాయల సర్కిల్, నంద్యాల చెక్‌పోస్టు, రాజీవ్‌గాంధీ సర్కిల్, టీడీపీ కార్యాలయం, చెన్నమ్మ సర్కిల్ తదితర ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి బందోబస్తును కట్టుదిట్టం చేశారు. నగర నడిబొడ్డు రాజ్‌విహార్ సెంటర్లో డీఎస్పీ మనోహర్‌రావు తిష్ట వేసి అన్ని ప్రాంతాల్లోని పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ బందోబస్తును కట్టుదిట్టం చేశారు. హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు: ఎస్పీ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమాల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను, జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేస్తే సంబంధిత వ్యక్తులపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్-2 పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రఘురామిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు తమ నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా జరుపుకోవాలి తప్పా హింసాత్మక సంఘటనలకు పాల్పడరాదని సూచించారు. ఆందోళన కార్యక్రమంలో విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనే విద్యార్థులపై కేసులు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్ పోర్టు వంటివి రావడం కష్టమని ఎస్పీ హెచ్చరించారు. ఆందోళనలు, ర్యాలీలను వీడియో ద్వారా చిత్రీకరిస్తామన్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్
టి-బిల్లు అమోదంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ప్రజాప్రతినిధుల ఇళ్లు, క్యాంపు కార్యాలయాల వద్ద పోలీసు బలగాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం తెలపడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. అదనపు బలగాలను తెప్పించి జిల్లా మొత్తంగా నిఘాపెట్టింది. జిల్లాలో మంత్రుల ఇళ్ల వద్ద, క్యాంపు కార్యాలయాల వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయం వద్ద, టెక్కలిలో ఉన్న ఆమె ఇంటి వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఏ నిమిషంలోనైనా సమైక్యవాదులు మంత్రి ఇంటిని ముట్టడించవచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాజాంలో కోండ్రు మురళీ మోహన్ క్యాంపు కార్యాలయం వద్ద కూడా పోలీసు బలగాలు మోహరించా యి. అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పా టు చేశారు. జిల్లాలోని ప్రధాన కూడ ళ్లలో నిఘా పెంచారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాల వద్ద కూడా బలగాలను నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ నవీన్‌గులాఠీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
సరిహద్దుల్లో రెడ్ అలెర్ట్
=గిరిజనుల్లో తీవ్ర భయాందోళనలు =రంగంలోకి ప్రత్యేక బలగాలు సీలేరు, న్యూస్‌లైన్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మూడు రోజులుగా ఏవోబీలో ఊచకోతకు మావోయిస్టులు తెగబడటంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సరిహద్దు అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మారుమూల గూడేల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దళసభ్యులు పది రోజులుగా హత్యలు, విధ్వంసాలకు పాల్పడటంతో ఆంధ్ర, ఒడిశా, తూర్పుగోదావరి సరిహద్దుల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం మళ్లీ మరికొన్ని ప్రత్యేక బలగాలు రంగంలోకి దింపి అడవులను జల్లెడ పడుతున్నట్టు తాజా సమాచారం. ఒక్కరోజే ముగ్గురు పోలీసు ఇన్ఫార్మర్లను మావోయిస్టులు కాల్చి చంపడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో కలకలం చోటుచేసుకుంది. కాగా మావోయిస్టులు కూడా గ్రామ సమీపాల్లో పాగా వేసి పోలీస్ ఇన్ఫార్మర్లు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈనేపథ్యంలో కొందరు మైదాన ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. -
వాయుగుండంగా మారనున్న పై-లీన్ తుఫాను
-
పై-లిన్ పై అలర్ట్
-
పై-లిన్‌పై భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భువనేశ్వర్ : బంగాళాఖాతంలో క్రమంగా బలోపేతం అవుతూ తూర్పు తీరం వైపు వేగంగా కదులుతున్న పై-లీన్ తుపానుపై భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 54 అడుగులకు పైగా ఎత్తులో అలలు ఎగిసిపడి తీరంపై విరుచుకుపడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. కాగా పై-లిన్ తుపాన్ ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని జాతీయ విపత్తు నివారణ సంస్థ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సాయంత్రం తుఫాన్ తీరం దాటే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి విశాఖ చేరుకున్నారు. తుపాను ప్రభావ నేపథ్యంలో సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477