లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం తెలపడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది.
టి-బిల్లు అమోదంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
ప్రజాప్రతినిధుల ఇళ్లు, క్యాంపు కార్యాలయాల వద్ద పోలీసు బలగాలు
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం తెలపడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. అదనపు బలగాలను తెప్పించి జిల్లా మొత్తంగా నిఘాపెట్టింది. జిల్లాలో మంత్రుల ఇళ్ల వద్ద, క్యాంపు కార్యాలయాల వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయం వద్ద, టెక్కలిలో ఉన్న ఆమె ఇంటి వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఏ నిమిషంలోనైనా సమైక్యవాదులు మంత్రి ఇంటిని ముట్టడించవచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాజాంలో కోండ్రు మురళీ మోహన్ క్యాంపు కార్యాలయం వద్ద కూడా పోలీసు బలగాలు మోహరించా యి. అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పా టు చేశారు. జిల్లాలోని ప్రధాన కూడ ళ్లలో నిఘా పెంచారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాల వద్ద కూడా బలగాలను నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ నవీన్‌గులాఠీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.