
న్యూఢిల్లీ : బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. కాగా మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. (ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం)
అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ )